రోడ్డు భద్రతపై అవగాహన
జహీరాబాద్ నేటి ధాత్రి:
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని జహీరాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సైదా నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా, ‘అరైవ్, అలైవ్’ నినాదంతో జహీరాబాద్ పోలీసులు స్థానిక మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారంలో కార్మికులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం బాధ్యతగా భావించాలని, అది ప్రాణాలను కాపాడే ముఖ్యమైన సాధనమని సూచించారు.
