జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు
జిల్లా ఎస్పీ శ్రీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ యాక్ట్ – 1861 నిబంధనలు 1 నుండి 30 వరకు) అమలులో ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ తెలియజేశారు.
పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు.
నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించరాదు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టరాదు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న నేపథ్యంలో, ప్రజలు పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
