ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్…

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

నర్సంపేట పట్టణంలో మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ టీఎం అవినాష్, ఓఎం టీమ్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్ సైట్ మాకు డ్రిల్ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ
మెగా గ్యాస్ వినియోగం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశ్రమల్లో కర్మాగారంలో పల లేదా గృహ నివాసంలో గ్యాస్ లీకేజీ లాంటి ప్రమాదం లేదా భారీ అగ్నిమాపక ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సమస్యను ఎదుర్కొని ఎలా సురక్షితంగా బయటపడాల్లో ఒక అవగాహన వస్తుందని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎంతో ఉపయోగపడతాయని అని అన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, వైద్య బృందాలు, మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్,టౌన్ ఎస్సై గూడ అరుణ్ , మున్సిపల్ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, మాదాసి రవి , పొన్నాల మనీషా-ప్రకాష్ , ములుకల వినోద-సాంబయ్య , కొంపల్లి వీణ-విజేందర్ రెడ్డి, వేల్పుల శ్రీలత,ఇస్లావత్ రామ-గోపి నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా…

వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా

నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

కౌన్సిలర్ లతో వార్డుల్లో పర్యటించిన చైర్ పర్సన్ పెండెం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 17, 9వ వార్డుల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 17వ వార్డు కౌన్సిలర్ సలావుద్దీన్ అయూబ్ ఖాన్,సంబంధిత అధికారులతో కలిసి తో కలిసి చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లు పర్యటించారు. 17వ వార్డు మరియు 9వ వార్డుల్లో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.అర్హులందరికీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందించే పథకాలు అందిస్తామని తెలిపారు.వార్డుల్లో ఎక్కడ సమస్య ఉన్న వెంటనే స్పందించి తమదృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు కాట శ్రీనివాస్, జూలూరి కావ్య, వాటర్ సప్లై కొల్లూరి రంజిత్, వార్డు జవాన్ మాదాసి భరత్, మాజీ కౌన్సిలరు మేర్గు సాంబయ్య, మాజీ ఎంపీటీసీ పేరం బాబు రావు, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్ భాయ్, 9వ వార్డు అధ్యక్షులు గిరగాని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల వీరస్వామి, మేరుగు కిరణ్, ఆకుల శ్రీను, దండు నవీన్, బండారు శివ, నామాసు వెంకటేశ్వర్లు, సల్మాన్, సాయి, మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్…

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, 30వ వార్డు, 6వ వార్డుల కౌన్సిలర్లు బాణాల ప్రసన్న-శ్రీనివాస్, మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ గురువారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 22వ వార్డు, 30వ వార్డు తోపాటు 6వ వార్డులో పర్యటించి వార్డుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఎండాకాలంలో నీటి కొరత రాకుండా అవసరమైన దగ్గర బోర్లు వేయించడం జరుగుతుందని, అసంపూర్తిగా ఉన్న మురుగునీటి కాలువలను నిర్మించి వార్డులలో ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.సీసీ రోడ్ల నిర్మాణాలు చేసి పారిశుధ్య సమస్య లేకుండా నిరంతరం వార్డులలో మున్సిపల్ కార్మిక సిబ్బందితో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన స్థలంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతోటి మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం త్వరలో చేయబట్టబోతున్నామని, అదేవిధంగా వార్డులకు అవసరమైన పనులను ముందుండి చేయించి వార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, వార్డు ఆఫీసర్స్ చకిలం నాగరాజు, గుగులోతు శ్రీకాంత్, వేమా సూర్యనారాయణ, మున్సిపల్ జవాన్ డేగల కుమార్, బోడ మొగిలి, ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ గంట రామిరెడ్డి, వాటెన్ సెక్షన్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్, వాటర్ లైన్మెన్ రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపెల్లి శ్రీనివాస్, కోల చరణ్, కోల వెంకటేశ్వర్లు, మైబు పాషా, కొప్పు అశోక్, పోతిరెడ్డి నరసింహారెడ్డి, గడ్డం శ్రీనివాస్, ధోని చేరాలు, కుచన రాజు, కొప్పు రాజు, పోగుల ప్రభుదాస్, బాణాల రమేష్, తాండ్ర అశోక్, మడికొండ రంజిత్, బోడ సునీల్, అనపర్తి సతీష్, గడ్డం ప్రవీణ్, అగరపు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరికో….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరికో….?

కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గానికే పీఠమా..?

మున్సిపల్ పీఠానికి సీపీఐ కీలకం కాబోతుందా..?

రిజర్వేషన్ అనుకూలిస్తే బడా నేతలు బరిలోకి…!

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.బీఆర్ఎస్, సిపిఐ, బిజెపి పార్టీల నుంచి కూడా పలువురు టికెట్ల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు పార్టీ ముఖ్య నాయకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గమే మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే..క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త నేతలకు పాత నేతలకు మధ్య సయోధ్య కుదరకపోవడమే ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకరికి మించి ఒకరు టికెట్ల కోసం స్థానిక మంత్రి వద్ద అపాయింట్మెంటు లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే టికెట్ దక్కేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్టు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుండే కొత్త నేతలు అంతా కలిసి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారిన నేతలు మళ్లీ పాత పార్టీకే వెళదామా లేదా ఇదే పార్టీలో కొనసాగుదామా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం పార్టీ నుండి వెళ్లిన వారిని తమ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు అన్నట్లు సంకేతాలు పంపిస్తున్నప్పటికీ, బలమైన నేతలు మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు బిఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్లు రాజకీయ వర్గాలుచెబుతున్నాయి. మున్సిపాలిటీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మంత్రి ఇలాఖాలో మున్సిపాలిటీ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో అని రాష్ట్ర ప్రజానీకం,పుర ప్రజలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ పీఠానికి సిపిఐ పార్టీ కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్లపై చర్చ….

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అన్ని పార్టీల నాయకుల్లో రిజర్వేషన్ పై చర్చ జరుగుతుంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్ ఉంటుందని సంకేతాలు వస్తున్నా సరే రొటేషన్ లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగానే ఉంది.మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ స్టేట్ ప్రాతిపాదికన జరిగే అవకాశం ఉన్నందున ఆ జాబితాను పరిశీలించిన తర్వాతే కొందరు కీలక నాయకులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సంక్రాంతి తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version