నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు అవసరం: మానవ హక్కుల కమిషన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్, రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బి. సుమిత్ర, నవీన్ కుమార్, రాధిక, నర్సింహులు, ప్రవీణ కుమారి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, నేరాల నియంత్రణకు చట్టాల కఠిన అమలు మార్గమని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల భద్రత మెరుగుపడుతుందని, ప్రజలు పోలీసులతో సమన్వయంగా ఉండడం ద్వారా సమాజంలో శాంతి, న్యాయం స్థిరపడుతుందని అభిప్రాయపడ్డారు.
