ఖర్గే సభకు తరలిన వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు.

ఖర్గే సభకు తరలిన వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రం నుండి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం హైదరా బాద్ లో ఏర్పాటుచేసిన కాంగ్రె స్ సభకు మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి ఆధ్వర్యంలో మండల, గ్రామ ముఖ్య నాయ కులు తరలివెళ్లారు. ఈ మేరకు బుచ్చిరెడ్డి పార్టీ జెండా ఊపి వాహనాలను ప్రారంభిం చారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు నఖర్గే పాల్గొని, ప్రభుత్వ సంక్షే మ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం దిశా నిర్దేశం ఉంటుందని తెలిపారు. సభకు తరలిన వారిలో చిదంరవి, వై నాల కుమారస్వామి, నిమ్మల రమేష్, హింగేభాస్కర్, శానం కుమారస్వామి, లడే రాజ్ కుమార్, మిట్టపల్లి సతీష్, మారపల్లి వరదరాజు, మసికే కుమార్, మామిడిపల్లి సాం బయ్య, మాడిశెట్టి చిరంజీవి, సుధాకర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

ఓదెల లో లారీ బైక్ డీ ఒకరు మృతి..

ఓదెల లో లారీ బైక్ డీ ఒకరు మృతి..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల కేంద్రం లోని మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద ఓదెల నుండి పెగడపల్లి కి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని సిమెంట్ లారీ బైక్ వెనక భాగం లో బలంగా ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పోత్క పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెలితే బాధితులు,పోలీసుల కథనం మేరకు ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు యాదవ్ సుమారు 38 సం. కావేరి సీడ్స్ అగ్రి ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు.ఉద్యోగ రీత్య ఓదెల నుండి పెగడపల్లి కి వెళ్లే క్రమంలో ఉదయం 10:30 సుమారు లో ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ సమీపంలో బైక్ పై వెళ్తుండగా సిమెంట్ లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. దీంతో తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు రిషి కుమార్,లడ్డు ఉన్నారు. పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వహాస్పత్రి కి తరలించారు.

రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు..

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

దొడ్డి కొమురయ్య గారి ఆశయాల సాధన కోసం నేటి ప్రజానీకం నడుం బిగించాలి

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి.వై నగర్ లో ఈరోజు దొడ్డి కొమరయ్య గారి 79 వ. వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగినది.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు , పోరాట స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్.. దొడ్డి కొమరయ్య 79 వ. వర్ధంతి సందర్భంగా ఈ రోజు బి.వై. నగర్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు , విప్లవ జోహార్లు అర్పించడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ భూమికోసం , భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కామ్రేడ్.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలపై నేటి ప్రజానీకం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ , జిల్లా కమిటీ సభ్యులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , శ్రీరాముల రమేష్ చంద్ర నాయకులు నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , గడ్డం రాజశేఖర్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

మోడీ విధానాలపై సమర శంఖం పూరించాలి.

జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి శివారపు శ్రీధర్, సిఐటియు, మండల కార్యదర్శి జల్లె జయరాజు, ఏఐసిటియు, జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి లు మాట్లాడుతూ మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించాలని శుక్రవారం స్థానిక కేసముద్రం మార్కెట్ యార్డులో

 

 

 

ఐ ఎఫ్ టి యు కేసముద్రం పట్టణ అధ్యక్షులు మిట్టగడుపుల వెంకన్న అధ్యక్షతన కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.వక్తలు మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులు పోరాడి సాధించుకుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలు పని చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు.

 

 

 

 

 

కార్మికులకు కనీస అవసరాలని కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన నేటికీ అనేకమంది కి విద్య, వైద్యం అందకపోవడం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు.

 

 

 

మోడీ ప్రభుత్వం పేద ప్రజల కడుపులో కొట్టి కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమీకరణ కావాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని కార్మిక రంగాన్ని తోపాటు అన్ని రంగాలను నష్టపరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పజెప్పడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 

 

 

 

జూలై 9న స్థానిక జ్యోతిరావు పూలే సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక , రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొబ్బల యాకూబ్ రెడ్డి, నీరుటి జలంధర్, ఏ ఐ సి టి యు జిల్లా నాయకులు జాటోత్ బిచ్చ నాయక్, ఐఎఫ్టియు కేసముద్రం ఏరియా కమిటీ నాయకులు బండి రాజు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం మొక్కు”బడి” పథకాలు…

 

ప్రభుత్వం మొక్కు”బడి” పథకాలు…

విశ్వ జంపాల,న్యాయవాది,మరియు విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంత వ్యత్యాసాలు చూపకుండా, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక బేధాలు పాటించకుండా, రాజు, పేద తేడా లేకుండా అందరికి ఒకే రకమైన, నాణ్యమైన విద్యా-వైద్యాన్ని అందించాల్సిన భాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం.ప్రజలు తమ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు.ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.నేటి బాలలే రేపటి పౌరులు” అన్న నినాదాన్ని నిజం చేయాలన్న ఆలోచన ఏ మాత్రం పాలకులకు ఉన్నా, పుట్టిన ప్రతి బిడ్డను 5 ఏళ్ళ వయస్సులో దత్తత తీసుకోవాలి. విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసి సమాజానికి అందించాలి. ఆ భాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. నిజానికి ఇది ప్రభుత్వం మీద ఉన్న చట్ట బద్ధమైన బాధ్యత కూడా.అన్ని ఉచితం అని ఊదర గొట్టే ప్రభుత్వాలు విద్యా-వైద్యం కోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్గిన సంస్థలను ఏర్పాటు చేయాలి. బోధన రుసుములు, ఉపకార వేతనాలు, పరీక్ష ఫీజులు, భోజన సౌకర్యం, దుస్తులు, పుస్తకాల పంపిణీ, బస్సు-రైలు పాసులు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వాహణ మొదలైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రజలను ప్రలోభ పెట్టే సాధనాలుగా సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతున్నాయి. మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు గాని సామాన్య ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. విద్యా-వైద్య సమస్యలు ప్రజలను నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు పథకాలెన్ని ఉన్న ఫలితం శూన్యం. నల్లబల్ల పథకం (ఓ బి బి) 1987, ఏపీ ప్రాథమిక విద్యా పథకం (అప్పీప్) 1984, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డీపీఈ పి) 1996, సర్వశిక్ష అభియాన్ (ఎస్ ఎస్ ఏ) 2002, (దీన్ని 2007లో రాజీవ్ విద్యా మిషన్ (ఆర్ వి ఎమ్) గా మార్చారు. ఏపీ పాఠశాలల ఆరోగ్య పథకం (ఏపీ ఎస్ హెచ్ పి) 1992, విద్యా విషయక దూరదర్శన్ కార్యక్రమం (ఈటీవీపీ) 1986, పాఠశాల సంసిద్ధాంత కార్యక్రమాలు (ఎస్ ఆర్ పి), ఆవాస పాఠశాలలు (ఆర్ ఎస్), దూరదర్శన్ పాఠాలు (టీవీ లెసన్స్), రేడియో పాఠాలు, టెలికాన్ఫరెన్సింగ్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం (స్పాట్) 1993, సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం (సీసీఆర్ టీ), జాతీయస్థాయి సంస్థలు :- కేంద్రీయ విద్యా సలహా సంఘం (సి ఏ ఈ బి) 1921, కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘం (సి ఏ ఎస్ ఈ) 1929, సార్జంట్ విద్యా కమీషన్, సెకండరీ విద్యా కమీషన్, యూనివర్సీటి గ్రాంట్ కమీషన్ (యూజీసీ) 1948, జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణా మండలి (ఎన్ సి ఈ ఆర్ టీ) 1961, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టీ ఈ) 1973, ప్రాంతీయ విద్యా సంస్థ (ఎన్ ఐ ఈ పి ఏ) 1979, కేంద్రీయ ఆంగ్ల మరియు విదేశీ భాషల సంస్థ (సి ఐ ఈ ఎఫ్ ఎల్) (ఇఫ్లూ) 1958. రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు :-రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి (ఎస్ సి ఈ ఆర్ టీ) 1967, పాఠ్య పుస్తకాల రచయితల కమిటి, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (ఎస్ ఐ ఈ టీ) 1985, రాష్ట్ర విద్యా నిర్వహణ మరియు శిక్షణ సంస్థ (ఎస్ ఐ ఈ ఎమ్ ఏ టీ) 1979, రాష్ట్ర వనరుల కేంద్రం (ఎస్ ఆర్ సి) 1978, జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ (డైట్) 1989, మండల వనరుల కేంద్రం (ఎమ్ ఆర్ సి), స్కూల్ కాంప్లెక్స్ (ఎస్ సి), మొదలియర్ విద్యా కమీషన్, కొఠారీ విద్యా కమీషన్, ఛటోపాధ్యాయ విద్యా కమీషన్ 1983, జాతీయ విద్యా విధానం 1986, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి, బడిబాట, రాష్ట్ర విద్యా చైతన్య ఉత్సవాలు, కస్తూర్భా బాలికా విద్యాలయాలు, సక్సెస్ పాఠశాలలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 2009, సాక్షర భారత్ (2009), మధ్యాహ్న భోజన పథకం 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం (ఎన్ సి ఎఫ్) 2005, ప్రొఫెసర్ యశ్ పాల్ నివేదిక 1993, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2000. విద్యా ప్రైవేటీకరణ కోసం పున్నయ్య కమిటి (1992), స్వామినాదన్ కమిటి (1992), బిర్లా-అంబాని కమిటి (2000), విద్యా హక్కు చట్టం 2009, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ఫీజు రియంబర్స్మెంట్ తదితర కమిటీలు కమిషన్లు పథకాలు ప్రవేశపెట్టాయి. వికలాంగుల కోసం, స్త్రీ విద్యకోసం, బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుంది. వీటితో పాటు ఒక్కొక్క స్కూలు మొత్తం 57 రకాల రికార్డులను మరియు రిజిష్టర్లను నిర్వహిస్తుంది. వీటన్నింటినీ ప్రభుత్వాలు మొక్కు “బడి” పథకాలుగా మార్చడం విశేషం. ఆయా పథకాలను ఎట్లా ప్రవేశ పెట్టాలో, ఎట్లా నీరు కార్చాలో మన దేశ పాలకులకు తెలిసినంతగా ప్రపంచంలో మరే దేశ పాలకులకు తెలియదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాషాయ విష గరళంగా మార్చిన సంగతి విధితమే. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని విద్యావేత్తలు సామాజికవేత్తలు విద్యార్థి సంఘాలు మేధావులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన తిరోగమన విధానాన్ని భారతీయ సమాజంపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి తన గొయ్యి తానే తీసుకోవడం తప్ప మరొకటి కాదనేది నిజం. కాషాయం కషాయంగా మారి విషంగా మారితే ప్రజలు సహించరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి పెద్దలు గ్రహించాలి. విద్యా కాషాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యా కాషాయంతో బహుజన దేశంగా ఉన్న భారతదేశాన్ని బ్రాహ్మణ దేశంగా మార్చాలని ప్రయత్నిస్తూన్న బిజెపి అంతర్గత కుట్రపూరిత ఎజెండాను ప్రజల అర్థం చేసుకొని తిప్పి కొట్టడానికి ఎంతో కాలం పట్టదు.ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నప్పటికీ విద్యా-వైద్యం సామాన్యుడి దరి చేరడం లేదు. కారణమేదైన పాపం ప్రభుత్వాలదే. అక్కరకు రాని చుక్కలు ఎన్ని ఉంటేనేమి? సూర్యుడు ఒక్కడుంటే చాలు! అన్నట్లు వందల కొలది సంక్షేమ పథకాలు పెట్టడం కన్నా, అన్ని రకాల మౌళిక వసతులతో కూడిన సమీకృత/ఏకీకృత విద్యా-వైద్య సంస్థలను మండల కేంద్రం యూనిట్ గా స్థాపించడం మేలు. ఆరంభ సూరత్వం ఆ పైన అలసత్వం అనేది ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత 74.04 శాతంగా ఉంది. అక్షరాస్యత శాతం పెరిగిన దానికన్నా రెట్టింపు స్థాయిలో నాణ్యత ప్రమాణాలు, విలువలు దిగజారి పోయాయి. దేశంలో ఉపాధ్యాయులు, డాక్టర్ల కొరత 40 శాతానికి మించే ఉంటుంది. 5వ, తరగతికి వచ్చే సరికి 78%, 10వ, తరగతికి వచ్చే సరికి 62 శాతం, ఉన్నత విద్యకు వచ్చేసరికి 7 శాతానికి విద్యార్థుల సంఖ్య మించడం లేదు. 7 శాతంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల అవసరాలను, మౌళిక వసతులను కూడా ప్రభుత్వం తీర్చక పోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనం.విద్యార్ధులు చదువు మానివేయడం వెనుక ప్రధాన కారణం పేదరికం. పేదరికానికి ప్రధానకారణం నిరుద్యోగం, మన దేశంలో నిరుద్యోగం 31 శాతం ఉంది. మిగతా 69 శాతం మందిని ఉద్యోగులుగా ప్రభుత్వం ప్రకటిస్తున్నటికీ, చాలా మంది అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేని వారిగా, నిర్దిష్ట ఆదాయం లేని వారిగా, అరకొర పనులతో చాలిచాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం మన దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలు. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి విద్యను ఒక సాధనంగా ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. పేదరికంతోనే ప్రజలు విద్యకు, వైద్యానికి దూరమవుతున్నారు. జాతీయ ఆరోగ్య ముసాయిదా ప్రకారం 6.3 కోట్ల మంది ప్రజలు ప్రతీ యేటా వైద్య ఖర్చుల కారణంగా దారిద్య్రంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రభుత్వం పేదరిక-నిరుద్యోగ నిర్మూలనకై కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు అందడం లేదు. రోగమొకటైతే, మందొకటి పెడితే రోగమెట్లపోవును అన్నట్లుంది ప్రభుత్వ పని విధానం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, విద్యను ఆయుధంగా మలచుకోగలిగితే నిరుద్యోగం, పేదరికం నిర్మూలించవచ్చు. ప్రపంచంలో అత్యంత విలువైనవి, అవసరమైనవి మానవ వనరులు. మానవ వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులను సమాజ అవసరాలకు, దేశ అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దాల్చిన సామాజిక, చట్ట బద్ధమైన భాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.

కల్లు గీత కార్మికుడి కుటుంబానికి గోపా డివిజన్.

కల్లు గీత కార్మికుడి కుటుంబానికి గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మి గౌడ్ పరామర్శ

అనంతరం వారి కుటుంబానికి 1క్వింటా బియ్యం అందజేత

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం అర్పణ పల్లి గ్రామానికి చెందిన బబ్బురు రవి భార్య యాక లక్ష్మి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇటీవల మరణించగా మృతురాలి కుమారుడు కార్తీక్త్, కుమార్తె సుష్మలను శుక్రవారం
వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలు యాక లక్ష్మి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఘన నివాళులర్పించారు గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్. అనంతరం వారి కుటుంబానికి 1 క్వింటా బియ్యం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కే జి కే ఎస్ మండల అధ్యక్షులు బబ్బురు ఉప్పలయ్య, మాజీ సర్పంచ్ గంధసిరి సోమయ్య, మోడం రాజు,ఈర యాదమ్మ,సింగని మల్లేష్,షేక్ జానీ, గంగపురపు వెంకన్న, గంధం సంతోష్,షేక్ సైదులు,,వెంకన్న, విజేందర్,కృష్ణ, సాంబయ్య,,యాకన్న, సతీష్,రవి,హరీష్,రఫీ, ఆశూ,హర్షిత్,విజేందర్, రవి,కిషన్,అరవింద్, విజేందర్,సోమయ్య, ప్రణయ్,రంగయ్య, సద్దాం,మొగిలి,సత్యం, సుధాకర్,రాము,రమ, జ్యోతి,శ్రావణి, జయమ్మ,శోభ, ఫాతిమా,కొమురమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య జయంతి సందర్భంగా..17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ M.I. సురేష్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సదర్భంగా కమాండేంట్ మాట్లాడుతూ రోశయ్య 1933 జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1978 నుండి 2009 వరకు పలుసార్లు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భాగమయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనపాటిగా పేరు పొందినారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించారు. ఆ తరువాత తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్ర గవర్నరు గా పనిచేశారు.

Assistant Commandant Jagadeeshwar Rao, officers

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జగదీశ్వరరావు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

 

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణ అమరుడు, సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ ప్రజల పోరాడయోధుడని, పేద తరగతిలో పుట్టి తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజల గుండె చప్పుడుల అన్ని వైపులా చాటి అమరుడైన దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు
గూడూరు ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, కల్లూరి రాజు, గుండ్లపల్లి పూర్ణ చందర్, కుంభాల మల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

సమగ్ర కుటుంబ సర్వే డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వగలరు

 

సమగ్ర కుటుంబ సర్వే డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వగలరు

రాయికల్ నేటి ధాత్రి :

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS )రాయికల్ మండల శాఖ పక్షాన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న రాయికల్ మండల ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్స్ అందజేయుట గురించి రాయికల్ మండల పరిషత్ కార్యాలయం లో ఎపిఓ కండ్లె సుష్మ సూపరింటెండెంట్ యస్.ప్రవీణ్ గార్లకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా బాధ్యులు చెరుకు మహేశ్వర శర్మ, వేముల మధు, మండల శాఖ అధ్యక్షులు కొండూరి రజనీకాంత్ సభ్యులు పి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయ సమర భేరికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు

 

సామాజిక న్యాయ సమర భేరికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు

 రాయికల్. జూలై (4) నేటి ధాత్రి :

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శుక్రవారం హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,క్రియాశీల కార్యకర్తలతో తలపెట్టిన భారీ బహిరంగ సమర భేరికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తరలిన రాయికల్ పట్టణ,మండల కాంగ్రెస్ శ్రేణులు.బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు పార్టీ నిర్మాణంపై దిశ నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.గ్రామ,మండల,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,క్రియాశీల కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్తున్న బస్సులను రాయికల్ లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,అల్లిపూర్ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజరెడ్డి జెండా ఊపి కార్యకర్తల బస్సును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్, అత్తినేని గంగారెడ్డి,కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,దాసరి గంగాధర్, వాసం దిలీప్,షాకీర్,శ్రీకాంత్,రవి,కోడిపెల్లి ఆంజనేయులు,కడకుంట్ల నరేష్,అశోక్,మండ రమేష్,రాకేష్ నాయక్,తలారి రాజేష్,భూమా గౌడ్,సింగని రమేష్,కొత్తపెళ్లి గోపాల్,బత్తిని నాగరాజు,శివ,రాంకీ,సంతోష్, రాజేష్,రాజారెడ్డి,పల్లికొండ రమేష్,కాటి పెల్లి రాంరెడ్డి,కట్ల నర్సయ్య,సుధాకర్,ఏంబారి వెంకటేష్ గౌడ్, రాజశేఖర్,పరాచ శంకర్,ప్రసాద్, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు,వార్డు ఇన్చార్జీలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి::

జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…
కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాధించాలని అ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఇటుకాల మొండయ్య,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు..

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, కలెక్టరేట్ ఏ.ఓ విశ్వ ప్రసాద్, ఇతర అధికారులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

పెంచిన రైల్వే చార్జీలను తగ్గించాలి…

పెంచిన రైల్వే చార్జీలను తగ్గించాలి…

నేటి ధాత్రి -గార్ల:-

కేంద్ర ప్రభుత్వం పెంచిన రైల్వే ఛార్జిలను తక్షణమే తగ్గించి, సామాన్యులకు రైల్వే ప్రయాణం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట పెంచిన రైల్వే చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మధ్యతరగతి, పేద ప్రజలపై రైల్వే చార్జీల పెంపుదల భారం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ప్రయాణించే రైల్వే ఛార్జిలను పెంచి, ప్రయాణికులను ఆర్థికంగా దెబ్బతీస్తుందన్నారు.పెంచిన రైల్వే ఛార్జిలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వి.పి.వెంకటేశ్వర్లు,యం.నాగమణి,మండల కమిటి సభ్యులు సిహెచ్ ఎల్లయ్య, ఎ.రామకృష్ణ,జి.వీరభధ్రం,ఎస్.నాగరాజు,బి.నరేష్,బి.ఝాన్సీ, ప్రవీణ్,కోటయ్య,రమేష్,సంపత్,నరేష్,ప్రసాద్,రైల్వే ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు..

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అలాగే జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్.ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి,డిబిసిడిఓ పుష్పలత, అధికారులు,సంఘ నాయకులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు వేదికలో ఉద్యాన శాఖ,కొహీర్ మండల్ ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో, రైతులకు అల్లం పంట సాగు పై అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటల మీద ,ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ,అవగాహన కలిపించడం జరిగింది.
మామిడి, జామ, బొప్పాయ, అరటి, అల్లం, వెదురు, తదితర పంటల మీద ఉద్యాన శాఖ సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని , ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ,కోహిర్ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సునీత అన్నారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు మొక్కలను 90 శాతం రాయితీ, డ్రీప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు. పంటను కంపెనీయే కొంటుందని, దీని కోసం కోహిర్ మండల్ లోనే ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ సైంటిస్టులు మాట్లాడుతూ , కోహిర్ ప్రాంతం ముఖ్యంగా అల్లం మరియు ఆలుగడ్డ జామ సాగులో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.అల్లం సాగులో ఎక్కువగా వచ్చే వ్యాధులకు సంబంధించిన నివారణను మరియు ఆ తెగుళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు చాలా చక్కగా రైతులకు వివరించడం జరిగిందని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సవిత, సంగారెడ్డి డిహెచ్ఎస్ఓ సోమేశ్వరరావు, డిడిఎస్, కెవికె సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్, శైలజ, నేటాఫిన్ సౌత్ ఇండియా హెడ్ సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, మండల వ్యవసాయ అధికారి వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి సవిత, ఆయిల్ ఫామ్ ఆఫీసర్ రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ అమృత వీరారెడ్డి, అనంతరం, చంద్రశేఖర్, గ్రామ మైనార్టీ చైర్మన్ జహీరుద్దీన్, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ కాంట్రాక్టర్ జవీద్ గారి మాతృమూర్తి కుటుంబ సభ్యులను.

ప్రముఖ కాంట్రాక్టర్ జవీద్ గారి మాతృమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

మరియు రాయల్ ట్రాన్స్పోర్ట్ ఇస్సాం సెట్ ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు .ఎమ్మెల్యే గారితో పాటు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజీం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,యువ నాయకులు ముర్తుజా తదితరులు ఉన్నారు.

ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్‌ స్టిక్స్, వీల్‌ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జులై 5 వరకు దరఖాస్తు గడువు ను ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. అర్హులైనవారు టీజీఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ..

అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ*

మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీలో గల 2వార్డు పరిధిలోని మార్కండేయ కాలనీ వాసులు వర్షం పడితే చాలు బురద గుంటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్ తెలిపారు.ఈ సందర్భంగా పెండెం శివానంద్ మాట్లాడుతూ 200 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్న మార్కండేయ కాలనీలో డ్రైనేజీ ,రోడ్ల వ్యవస్థ లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో కాలనీ గురించి అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని ఆరోపించారు.వర్షాకాలం వస్తే చాలు గుంతలలో నీరుచేరి డెంగ్యూ, మలేరియా లాంటి రోగాల బారిన పడుతున్నారు. వాహనదారులు కాలనీలో వాహనాలు నడపాలంటే తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అన్నారు.

Pendem Sivanand.

గతంలో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మరమ్మతులు చేస్తామంటూ దాటవేస్తున్నారని అన్నారు. ఇకనైనా మున్సిపాలిటీ కమిషనర్ ర్,సిబ్బంది పట్టించుకోని కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని మార్కండేయ కాలనీ వాసుల తరఫున కోరుతున్నట్లు శివానంద్ తెలిపారు.

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి.

 

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు.

నర్సంపేట,నేటిధాత్రి:

భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి
విముక్తి కోసం సంఘం కట్టి బడిసెలు పట్టి బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అన్న చేతులతో బందుకులు ఎక్కుపెట్టి మట్టి మనుషులు చేసిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన
స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య 59వ వర్ధంతిని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకుంది.భూస్వాముల ఆగడాల్నీ కాల్చి బూడిద చేసింది. దొడ్డి కొమురయ్య అక్షరాస్యడు కాదు. మార్క్స్ ను చదవలేదు, మావోను అధ్యయనం చేయలేదు. కానీ వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అగ్గి రాజేశాడని వర్ణించారు. అప్పటికే జాగీర్దార్ల, జమీందార్ల, దేశముఖ్ ల ఆగడాలతో విసిగి వేసారిన తెలంగాణ పల్లెలు ఆవేదన, ఆగ్రహంతో లావాలా కుతకుత ఉడికి పోతున్నాయి. ముఖ్యంగా విస్నూర్ దేశముఖ్, రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు బాబు దొర అరాచకాలు పల్లెలను నిద్ర లేకుండా చేసాయి.దొరల అణిచివేతకు,అరాచకాలకు వ్యతిరేకంగా,కౌలు,లెవీ రద్దు చేయాలని,కూలిరేట్లు పెంచాలని, పేదలకు భూములు పంచాలని, వెట్టిచాకిరి నిర్మూలించాలని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా పోరాటాలు పెరిగాయని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలు, సభలు, వినతులు వంటి ప్రజాస్వామిక పద్ధతులలో పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రజా నిరసన ప్రదర్శన 1946, జూలై 4న విస్నూర్ దేశముఖ్ ఇలాకాలోని కడవెండి గ్రామంలో ప్రారంభిమైంది. విస్నూర్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ గడి ముందుకు ప్రదర్శన చేరగానే, ఆయన గూండాలు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ప్రదర్శనలో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్య తుపాకీ గుళ్ళకు బలయ్యాడని బాబు తెలిపారు.ఈ వార్త దావానలంలా తెలంగాణ పల్లెలన్నీ ఆవహించింది.ప్రజల్లో అప్పటికే రగులుకొంటున్న అసంతృప్తి ఒక్క ఉదుటున పెల్లుబికింది. ఆగ్రహంతో కుతకుత ఉడుకుతున్న అగ్ని పర్వతం కడవెండిలో బద్దలైందన్నారు.ఈ నేపథ్యంలో కొమురయ్య బలిదానం తెలంగాణను కొలిమోలే రాజేసింది.ఊరూరా ప్రతిఘటన పోరాటాలు ఉవ్వెత్తునలేచాయి. భూస్వాముల గూండాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు గొడ్డలి, పార, పలుగు, గుతుపకర్ర, వడిశెల వంటి వ్యవసాయ పనిముట్లను ఆత్మరక్షణ ఆయుధాలుగా మలుచుకున్న క్రమంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటరూపం తీసుకున్నదని పేర్కొన్నారు.కాగా ఈ పోరాటంలో భూస్వాముల గడీలు నేలమట్టమయ్యాయి. దొరలు పల్లెలిడిచి పట్నంకు పరుగు తీసిండ్లు. వేలాది గ్రామాలు భూస్వాముల పాలన నుండి విముక్తి చెందాయన్నారు.ఆ పోరాటం ముందుకుతెచ్చిన ఎంజెడా ఇంకా మిగిలే ఉందన్నారు. మరోవైపు దేశంలో కార్పొరేట్ శక్తుల, మతోన్మాదుల కూటమి దేశాన్ని పట్టిపీడిస్తున్నదని,ప్రజా వనరులన్నిటిని దోచి బడా పెట్టుబడిదారుల ఖజానా నింపుతున్నదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, పరికి మధుకర్ పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మండల, పట్టణ నాయకులు బుర్రి ఆంజనేయులు, పుచ్చాకాయల నర్సింహా రెడ్డి, నాయకులు లక్క రాజు, తోటకూరి రాజేష్, కందికొండ సంతోష్, వీరన్న, ప్రశాంత్, నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version