రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు పరిశీలన…

రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు పరిశీలన…

పుర కమిషనర్ గద్దె రాజు, సిఐ శశిధర్ రెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లను సందర్శించి సదుపాయాలను పరిశీలించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డిలు అన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22 వార్డులు 45 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ కేంద్రానికి 700 నుండి 800 మంది ఓటర్లు ఉన్నారని పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం జరిగిందని తెలిపారు.

ఎక్కడైతే సౌకర్యాలు సరిగా లేవో ఆ పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. ఓటర్లంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తామని సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ లు స్పష్టం చేశారు.

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు…

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు

◆-: ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు డాక్టర్ ప్రణయ్ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం సిద్దిపేట మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ గత ఏడాది నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరని సాకుతో ప్రణయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పోలీసులు పేర్కొన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారి తీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి..

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 33 వ వార్డు లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ బాలుర పాఠశాల లో పోలింగ్ బూతు ను మార్చ లని మాజీ మున్సిపల్ తిరుమల్ ఒక ప్రకటనలో తెలిపారు.
33 వ వార్డులో వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఓటర్లకు ఇబ్బందు లకు గురి అవుతూన్నారని అయన తెలిపారు 2014 లోమున్సిపల్ ఎన్నికల్లో గౌతమ్ మాడల్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ ఉన్నదనిబ్ ఎన్నికల అధికారులు పరిశీలించి వృద్ధులకు వికలాంగులకు ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చామని తిరుమల్ తెలిపారు వినతిపత్రం ఇచ్చిన వారిలో దండు యాదగిరి పాల్గొన్నారని తెలిపారు

పొరపాటుల్లేని తుది ఓటరు జాబితా జిల్లా కలెక్టర్..

పొరపాటుల్లేని తుది ఓటరు జాబితా జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

పొరపాటుల్లేని తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా స్వచ్ఛత ఖచ్చితత్వం ప్రజాస్వామ్యానికి కీలకమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా, అర్హత లేని పేర్లు తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించాలని, ఫీల్డ్ స్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, టీపీఓ సునీల్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లాలో 88.11శాతం ఓటింగ్ నమోదు..

వరంగల్ జిల్లాలో 88.11శాతం ఓటింగ్ నమోదు

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికలు దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం,గీసుకొండ మండలాల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.11శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
దుగ్గొండి మండలం 89.88 శాతం అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా గీసుకొండ మండలం 85.83 శాతం ఓట్లతో జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ అయ్యింది.సంగెం మండలంలో 89.44 శాతం ఓట్లు పోలింగ్ కాగా నల్లబెల్లి మండలంలో 86.36 శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

 

ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా పరిధిలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జిల్లాలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దుగ్గొండి, నల్లబెల్లి,సంగెం,గీసుకొండ మండలాల పరిదిలో 66467 పురుషులు,69722 మహిళలు ఇతరులు ఇద్దరు కాగా మొత్తం 136191ఓటర్లు ఉండగా అందులో
58688 మంది పురుషులు 61311 మహిళలు ఇతరులు ఇద్దరు మొత్తం 120001మంది ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

పోలింగ్ కేంద్రాల జనరల్ అబ్జార్వర్ పరిశీలన..

పోలింగ్ కేంద్రాల జనరల్ అబ్జార్వర్ పరిశీలన

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:

 

రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల పరిశీలకులు బాల మాయాదేవి వరంగల్ జిల్లాలోని సంగెం,గీసుగొండ, దుగ్గొండి,నల్లబెల్లి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా గీసుగొండ, సంగెం, నందిగామ, దేశాయిపల్లె, నల్లబెల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు

చేశారు.నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు వారివెంట ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు జిల్లెల్ల..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T161734.878.wav?_=1

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు జిల్లెల్ల
చెక్ పోస్టులో వాహనాల తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల చెక్. పోస్టులో. ఎన్నికలు ముగిసే వరకు వాహనాల తనిఖీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామపంచాయతీ ఎన్నికలు. దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రిటర్న్ అధికారుల ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దునజిల్లెల్ల చెక్పోస్ట్ వద్దవాహనాలు తనిఖీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తూ ఎన్నికల సమయంలో ఎవరైనా ఓటర్లనుమభ్యపెట్టడానికి డబ్బులు పంచడానికి వాహనాల్లో డబ్బులు తరలిస్తారనిఅయితేఅలాగే వాహనాలను ఎన్నికల అధికారులు వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేసే అధికారం ఉంటుందని వాహనంలో ఎటువంటి డబ్బు తరలించవద్దని.ఏదైనా అత్యవసరం ఆరోగ్య సమస్యలు ఉన్నచోఉంటే సంబంధిత పత్రాలు చూపించాలని ఖర్చు పెట్టే వివరాలు సంబంధిత అధికారులకు వెల్లడించాలని అవసరమున్నచో.వాటికి సంబంధించిన పత్రాలు చూపించిసరైనవా.కావా ధ్రువీకరించి పంపిస్తారనివచ్చిపోయే వాహనాలను తనిఖీ చేసే అధికారం ఎన్నికల సమయంలో తనిఖీ చేసే అధికారం వారికి ఉంటుందని అలాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని. లేనియెడల తనిఖీ.చేయువారికి.ఏదైనా అనుమానంవచ్చినవాహనాదారులు సహకరించ.కున్నా రిటర్న్.రీ.అధికారులకు. సమాచారం.ఇస్తూచెక్పోస్టులో చెక్ చేయు సందర్భంగా ఏమైనా అనుమానాలు ఉన్నచో సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి తనిఖీల కార్యక్రమంలో. S.S.T. టీం జిల్లెల్ల చెక్పోస్ట్. తంగళ్ళపల్లి మండలం అధికారులు. V. ప్రశాంత్. AEE.MB.Grid. సిరిసిల్ల. పోచయ్య తంగళ్ళపల్లి హెడ్ కానిస్టేబుల్. చంద్రశేఖర్ కానిస్టేబుల్. శ్రీను. RA. సిరిసిల్ల. చందు ఫోటోగ్రాఫర్. తదితరులు వాహనాలు తనిఖీలలోపాల్గొన్నారు

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌పై ప్రజలకు అవగాహన సదస్సు

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌పై ప్రజలకు అవగాహన సదస్సు*

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలలో పటిష్ట బందోబస్తు : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

ముత్తారం :- నేటి ధాత్రి

 

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ముందస్తు భద్రత చర్యలలో భాగంగా ముత్తారం పోలీస్ ఆధ్వర్యంలో ఖమ్మం పల్లి, ఓడేడు, అడవి శ్రీరాంపూర్, కేసనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) పై అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ముత్తారం ఎస్ ఐ రవి కుమార్, సిబ్బంది తో కలిసి గ్రామాల వారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలు, అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులకు యువత కు ప్రత్యేకంగా ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలు వివరించి అవగాహన కల్పించారు

ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ…. ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, గొడవలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరగాలని దానికి అందరూ పోలీస్ వారికీ సహకరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, ప్రచారాలు సమయంలో, పోలింగ్ ను ముందురోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. పెద్దపల్లి జోన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల వాటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పటిష్టమైన బందోబస్తులు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, నిషేధిత చర్యలు, డబ్బు/మద్యం పంపిణీ, బెదిరింపులు, పోలింగ్ బూత్ ల వద్ద ప్రభావం చూపే చర్యలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఎలాంటి అక్రమ చట్ట వ్యతిరేకమైన, ఎన్నికల ఉల్లాంఘాన చర్యలు జరిగిన వెంటనే డయాల్ 100, స్థానిక పోలీస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ఎవ్వరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు గొడవలకు పాల్పడడం చేయకూడదు అన్నారు. అభ్యర్థులు, మద్దతుదారులు శాంతి భద్రతలను కాపాడుతూ ఎన్నికల చట్టాలను గౌరవించాలి అని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, హింసాత్మక చర్యలు, ప్రతిష్టాభంగ ప్రచారాలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, సోషల్ మీడియా ద్వారా హానికరమైన ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు షేర్ చేసిన కూడా బాధ్యులపై చర్యలు తప్పమన్నారు. రాత్రి వేళలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని.. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో
గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంథని సీఐ బి. రాజు, ముత్తారం ఎస్ ఐ రవి కుమార్, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

“పంచాయతీ ఎన్నికలకు రెడీ ఏర్పాట్లు”

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు

నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి ):

 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టి-పోల్ వెబ్ సైట్ , యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని సూచించారు.

ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .

నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు.

జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు.

ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.

ఇంచార్ట్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

 బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T152333.182.wav?_=2

 

బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి

 

నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.

 నవంబర్ 14వ తేదీ తర్వాత బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆర్జేడీ (RJD) నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తెలిపారు. బిహార్‌ను అట్టడుగు స్థాయిలోకి ఎన్డీయే నెట్టేసిందని, పోలింగ్‌కు ముందు ఎన్నికల అధికారులను కేంద్ర మంత్రులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ మరికొద్ది గంటల్లోనే జరుగనుండటంతో సోమవారంనాడు మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.
నవంబర్ 14 తర్వాత బిహార్‌ను దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్తాం. ఆహార ఆధారిత యూనిట్లు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఇరిగేషన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్ సిటీలు, ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్క బిహారీ కూడా ఇతర సిటీలకు వెళ్లాల్సిన పని లేదు’ అని తేజస్వి తెలిపారు. ఈసారి చాలా స్పష్టంగా బిహార్‌లో మార్పు కనిపిస్తోందని, ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు బలంగా తీర్మానించుకున్నారని, ప్రజలు చరిత్ర సృష్టించనున్నారని చెప్పారు.

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T145837.753.wav?_=3

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

 జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎన్నికల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈరోజు (సోమవారం) హరీష్ రావు ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌ను (సీఈవో) బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పోలీసులు, అధికారులు తొత్తులుగా మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ పంపిణీ చేస్తోన్న చీరలు, మద్యం పంపిణీ వీడియోలను ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఇచ్చినట్లు తెలిపారు. యూసుఫ్‌గూడాలో పోలింగ్ కేంద్రం పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయన్నారు. రెండేళ్ళుగా ఆరు గ్యారెంటీల అమలుపై రివ్యూ చేయని సీఎం.. ఈరోజే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ ఓటమిని అంగీకరించారు… అందుకే ఆరు గ్యారెంటీలపై రివ్యూ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఓటర్లను మభ్యపెడ్తున్నారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

 

జూబ్లీహిల్స్ నియోజవర్గానికి రేపు ఎన్నిక జరుగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలనుు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలింపు ప్రక్రియ మొదలైంది. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు.
3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగనుంది. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సమస్యత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

కాగా.. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో‌ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైన ఉప ఎన్నికలో గెలవాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి మరి.

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్…

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకోసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు! 25 లక్షల ఫేక్ ఓట్లంటూ..

 

రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.

ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు (Rahul Gandhi Vote Chori Allegations). కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచనని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-01T123601.913.wav?_=4

 

మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు సంగారెడ్డి జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ వసీమ్ మాట్లాడుతూ మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు దేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌ అలాంటి వ్యక్తికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ,బీఆర్ఎస్ కలిసి అడ్డుకోవాలని చూస్తున్నాయి ఈ కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ కు బీజేపీ ఫిర్యాదు బీఆర్ఎస్ కు లాభం చేకూర్చడమే బీజేపీ లక్ష్యం మైనార్టీ అనే ద్వేషంతోనే అజార్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునే కుట్ర పన్నుతున్నారన్నారు,

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు..

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు

టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు.

 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ మధుర నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పిర్యాదు మేరకు 336(4), 353(1)(C) BNS సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి కేటుగాళ్లు ప్రచారం చేశారు. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. ఈ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరణించిన ఓటర్లను విచారణ జరిపి తొలగించాలి…

మరణించిన ఓటర్లను విచారణ జరిపి తొలగించాలి
వనపర్తి నేటిదాత్రి .

 

తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంలతో కలిసి హాజరయ్యారు. సీఈఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అదేవిధంగా మరణించిన ఓటర్ల జాబితాను విచారణ చేసి తొలగిం చాలని కోరారు ఎపిక్ కార్డ్స్, బీఎల్ వో ఐడి కార్డ్స్ పంపిణీ చేయాలని ఆదేశించారు.
వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి ఓట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓటు చోరు – గద్ది చోడ్….

ఓటు చోరు – గద్ది చోడ్….

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న బిజెపి సహకరిస్తున్న ఎలక్షన్ కమిషన్…

దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది…

ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత…

ఓటును చోరీ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమానికి నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు , ఎంపీ కావ్య .

వర్దన్నపేట( నేటిధాత్రి):

Vaibhavalaxmi Shopping Mall

 

ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం,బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమం వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.అనంతరం ఓటు చోరీకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ సంతకాల ద్వారా నిరసన వ్యక్తం చేశారు.ఓటు చోరీ పై బూత్ స్థాయి, మండల,డివిజన్, గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు.

Congress

 

 

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ఓటు హక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ “ప్రజలు క్షేత్రస్థాయి నుంచి దేశస్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలి” అని పిలుపునిచ్చారు అన్నారు.భారత రాజ్యాంగంలో కీలకమైన ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత. ఈ విషయాన్ని గ్రామం నుంచి దేశ స్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు..ఈసందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి పవిత్ర హక్కు అని, ఆ హక్కును చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. బీజేపీ ఓటు దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేస్తాం అని ఎంపీ తెలిపారు.
కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ గ్రామ స్థాయి స్థానిక కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, మహిళా కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్

జడ్పీటీసీ అభ్యర్థి ఖర్చు లిమిట్ రూ.2.50 లక్షలు, ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు

సర్పంచ్‌కు జనాభాను బట్టి రూ.2.50 లక్షలు, రూ.1.50 లక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall

స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్​అయింది. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండినోళ్లు అర్హులు.

 

పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులు.

 

మతసంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు. సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి..

 

శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా (గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు.

అభ్యర్థుల ఎన్నికల ఖర్చెంతంటే?

 

అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎస్‌ఈసీ నిర్ధారించింది. జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.

 

అలాగే 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి.

 

ఖర్చుల నివేదికను సమర్పించాలి. అంతేకాకుండా, అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏదీ లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

డిపాజిట్ తప్పనిసరి..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి బ్యాంకు డిపాజిట్‌ చేయాలి. జడ్పీటీసీ పదవికి పోటీచేసే అభ్యర్థి (జనరల్​) రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు రూ. 2,500 డిపాజిట్​చేయాలి. ఎంపీటీసీగా చేసేవారు రూ.2,500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.1,250, సర్పంచ్​అభ్యర్థి రూ.2 వేలు (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.వెయ్యి, వార్డు సభ్యుడికి రూ.500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250. పోటీచేసే అభ్యర్థులు పంచాయతీల పన్ను బకాయిలు, కరెంట్​ బిల్లులు కూడా క్లియర్​ చేసి ఆ రసీదులు తీసుకోవాలి. అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం బంద్..

 

ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనున్నది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. పోలింగ్‌ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు. సమావేశాలు, ర్యాలీలు, ఇతర ప్రదేశాల్లో మీటింగ్‌ కు అనుమతి తప్పనిసరి. అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలపాలి. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపై ఆంక్షలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం.. దొంగ ఓట్లను ప్రోత్సహించడం నేరం. అలాగే అభ్యర్థి డిపాజిట్ తిరిగి పొందాలంటే తనకు పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు సాధించాలి. లేదంటే డిపాజిట్ రాదు.

లిస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ సింబల్స్..

రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీల జాబితా, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ఎలాంటి కేటాయింపులు లేని ‘లిస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ సింబల్స్​’ జాబితాను తెలంగాణ గెజిట్‌లో ఎస్‌ఈసీ ప్రచురిస్తుంది. తమ వద్ద రిజస్టర్‌ అయ్యి ఎలాంటి గుర్తు కేటాయించని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు ‘ఫ్రీ’ గుర్తులను కేటాయించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

 

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి,ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version