అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి: ఎంపీ సురేష్ కుమార్..

అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి: ఎంపీ సురేష్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో, స్థానిక ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మరియు గౌరవ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా, జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కమీషనర్ జైత్ రాం, ఎంఆర్ఎ దశరథ్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో ఏక్స్ ఆఫీ షియో…

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో ఏక్స్ ఆఫీ షియో హోదా లో ఒకే మున్సిపాలిటీ ని ఎంపిక చేసుకోవాలి
వనపర్తి నేటిధాత్రి .

 

 

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులు ఎక్స్ అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకొని ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణీ కుముది సూచించారు సెక్షన్ 5, 20 ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీలు తాము ఎన్నికైన 30 రోజుల్లోపు ఏదో ఒక మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించేందుకు ఆప్షన్ ఇచ్చుకొని ఉండాలని, అలా కాకుండా ఇంతవరకు ఆప్షన్ ఇవ్వని పక్షంలో నిబంధన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు అయిన 30 రోజుల్లో ఆప్షన్ ను సంబంధిత మున్సిపల్ కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ జారి చేసి ప్రజాప్రతినిధుల నుండి ఆప్షన్ తీసుకోవాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ లు జారీ చేసి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈవీ డియో
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్యడిఆర్డీఒ పి.డి. ఉమాదేవి, సి.పి. ఒ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు

నిజాంపేటలో..ఘనంగా గణతంత్ర వేడుకలు…

నిజాంపేటలో..ఘనంగా గణతంత్ర వేడుకలు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్, ఎంపీడీవో కార్యాలయంలో రాజీరెడ్డి, రైతు వేదికలో వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, పశువైద్య కార్యాలయం లో మణికుమార్, విద్యుత్ కార్యాలయంలో ఎఈ గణేష్, వివిధ గ్రామాల్లో సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం…

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సరిత

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సరిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులు ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు
అనంతరం సర్పంచ్ సరిత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సొంత ఖర్చులతో బహుమతులు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మరికొంత మంది నాయకులతో కలిసి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యానికి రాజ్యాంగ నిర్మాణానికి తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, రాష్ట్రం దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చల్లూరు మధు అప్పన్ కిషన్ గాజర్ల అశోక్ తిరుపతి విజయ్ తదితరులు పాల్గొన్నారు

హెల్మెట్ అవగాహన ర్యాలీతో రోడ్డు భద్రత

హెల్మెట్ రోడ్డు భద్రత గురించి అవగాహన.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పోలీస్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11గం.లకు అంబేద్కర్ చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు భద్రతపై హెల్మెట్ గురించి అవగాహన కల్పించడానికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగింది. అందరూ బైక్ తోపాటు హెల్మెట్ పెట్టుకొని పాఠశాల విద్యార్థులచే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డి.ఎస్.పి. మాట్లాడుతూ.. హెల్మెట్ ద్వారా ప్రాణాలను రక్షించుకోవాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని ప్రమాదాల నుంచి రక్షించుకోవాలని పోలీస్ వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో డి.ఎస్.పి , ఆర్డిఓ , ఎమ్మార్వో , ఎంవీఐ, సిఐ , ఎస్ఐ లు పత్రిక విలేకరులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, యువత, వివిధ ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎండబెట్లలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బాలసదన్ భవనం శంకుస్థాపన

నాగర్ కర్నూల్ జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ ఎండబెట్ల గ్రామంలో కోటి 30 లక్షల మంజూరైన బాల సదన్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాలసదన్ భవన నిర్మాణం ద్వారా అనాధ మరియు ఆశ్రయంలేని పిల్లలు కు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు
అభివృద్ధి పనుల్లో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ పట్టణ కౌన్సిలర్లు ఎండబెట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ కి సన్మానం..

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ కి సన్మానం

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ పాగాల దేవరాజు ను శాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలలో అధ్యక్షులు మెట్టు రాజేందర్ , ఉపాధ్యక్షులు పోతున్న రాజు , క్యాషర్ గోశిక సతీష్, మురళి, శ్రీనివాస్, పాండురంగం, గణేష్ శంకరయ్య, బాలనర్సు , మెట్టు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు

ఘనంగా సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం..

ఘనంగా సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి అని, బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకపాత్ర పోషిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం సింగరేణి కాలరీస్ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జీఎం కార్యాలయ ప్రాంగాణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, జీఎం పూల వేసి నివాళులర్పించి, జెండావిష్కరణ చేశారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన కేకు కోసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నెముకలా నిలుస్తుందని, కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ ఆధునికీకరణ, సాంకేతిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సింగరేణి మరింత ప్రగతి సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ఎమ్మెల్యే శాలువాలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు

తాటికాయల సత్తెమ్మ గారి పార్థివ దేహానికి పూలమాల నివాళులు..

తాటికాయల సత్తెమ్మ గారి పార్థివ దేహానికి పూలమాల నివాళులు

అర్పించిన…కట్రియాల ఉప సర్పంచ్ నాంపెల్లి రవీందర్ & టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య & మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్ & ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని, కట్రీయాల గ్రామములో ఇందిరమ్మ కమిటీ సభ్యులు తాటికాయాల కుమారస్వామి గారి మాతృమూర్తి తాటికాయల సత్తెమ్మ గారు మరణించడం జరిగింది .కనుక ఇట్టి విషయం వర్ధన్నపేట శాసన సభ్యులు కే. ఆర్.నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. భౌతిక దేహాన్ని సందర్శించండి అని ఆదేశించడంతో , కుమారస్వామి గారి నివాసం వద్దకు గ్రామ ఉప సర్పంచ్ నాంపెల్లి రవీందర్,వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి అక్బర్ లు చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుమారస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమములో 7 వ వార్డు సభ్యులు ఎలికట్టే చిన్న రాజు, కాంగ్రెస్ యువ నాయకులు కొండ్రతి సంతోష్,ఇరుకు బాబు తదితరులు పాల్గొన్నారు.

ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సిద్ధాపుర్ తండా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు నూతనంగా గెలుపొందిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.వారికి ఎమ్మెల్యే మాణిక్ రావు పూల మాల వేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

వాలిమ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T133541.529.wav?_=1

 

 

వాలిమ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ నాయకులు జమిల్ ఖురేషి గారి అన్న కుమారుని వలిమ వేడుక లో
మరియు జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మొగుడంపల్లి కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్ కుమారుని వివాహా వేడుకలో పాల్గొని నూతన వరునికి వివాహ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ వైస్ ఎంపీపీ శాకిర్ అలీ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, ఏ.యం.సి.డైరెక్టర్లు శేఖర్,వంశీ రాజ్ కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,ఖాజా భాయ్,జె జె జవీద్,నాయీమ్,గౌసోద్దీన్,జై రాజ్ తదితరులు పాల్గొన్నారు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T165945.600.wav?_=2

 

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ గ్రామ మాజి సర్పంచ్ సత్యనారాయణ గారి సోదరుడి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి సర్పంచ్ లు శివ శంకరయ్య స్వామి, రవి కుమార్ సంజీవ్ మాజి ఎంపీటీసీ వెంకట్ మాజి ఉప సర్పంచ్ ఖాదర్ శివ స్వామి నాగ్ శెట్టి,ప్రభు తదితరులు పాల్గొన్నారు,

కార్యాలయం ప్రారంబానికి ప్రజా ప్రతినిధులను మరిచిన డి ఎల్ పిఓ..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T133643.438.wav?_=3

 

జిల్లా కలెక్టర్ చోరువతో ఎట్టకేలకు జహీరాబాద్లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు!!!

◆:- కార్యాలయం ప్రారంబానికి ప్రజా ప్రతినిధులను మరిచిన డి ఎల్ పిఓ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

దశాబ్ది కాలం తర్వాత ఎట్టకేలకు జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు జరిగిన వెంటనే ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలనే దృఢ సంకల్పంతో అప్పటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కన్నా కలలు సహకారం కావడం జరిగింది. కానీ జహీరాబాద్ లో మాత్రం అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పడ్డప్పటికి డివిజన్ పంచాయతీ కార్యాలయం నేటికీ ఏర్పడకపోవడం, గ్రామాలలో నెలకొన్న సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్లేవారు, ఇట్టి విషయాన్ని గ్రహించిన పెన్ గన్ న్యూస్ పలు సందర్భలలో జహీరాబాద్ లో డివిజన్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలిని సూచించడం జరిగింది. అంతేకాకా జహీరాబాద్ నియోజకవర్గం
నుండి అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మరియు సంగారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం ప్రధాన కార్యదర్శి అయిన తుంకుంట మోహన్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి లో పలుమార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. జహీరాబాద్. నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ కు తమలేఖ ద్వారా తెల్పడం జరిగింది, అంతేకాకుండ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. సరోత్తమ్ ప్రెస్ మిట్ల ద్వారా హెచ్చరిక చేయడం జరిగింది. నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారికి చెప్పడం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలో డివిజనల్ పంచాయతీ కార్యాలయానికి మోక్షం కలిగిందని నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరు డివిజనల్ అధికారుల లాగే డివిజనల్ పంచాయతీ అధికారి కూడా ఏళ్ళ వేళలా ప్రజలకు తమ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో
పర్యటించి, గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి వహించి పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎప్పటికప్పుడు పనులను చేపిస్తూ, నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. డివిజనల్ పంచాయతీ కార్యాలయం ప్రారంబానికి ప్రజా ప్రతినిధులకు పిలువకపోవడం పై నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేయడం జరిగింది.

పాఠశాల ప్రాంగణంలో..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T131045.997.wav?_=4

 

పాఠశాల ప్రాంగణంలో..
ప్రమదకరంగా సంపు
పట్టించుకోని అధికారులు, ప్రతినిధులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ సంపు ప్రమదకరంగా తయారైంది. నిజాంపేట మండలం నస్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మన ఊరు మనబడి పథకం కింద పాఠశాల అభివృద్ధి కోసం పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు. ఆ పనుల్లో భాగంగా పాఠశాల ఆవరణలో తీసిన సంపు ప్రమాదకరంగా తయారైంది. సంపుపై ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కాంట్రాక్టర్కు పలుమార్లు చెప్పిన ఏమి ఫలితం లేదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రక్షణ ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2కే రన్ విజయవంతం….

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2కే రన్ విజయవంతం

వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండలకేంద్రంలో పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎక్తా దివాస్ ను పురస్కరించుకొని పోలీసు విభాగం ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ,ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన తాసిల్దార్ అనుపమ రావు పచ్చ జెండా ఊపి వీణవంక నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు 2కే రన్ ప్రారంభించారు

దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించే విధంగా స్ఫూర్తితో మన దేశం అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,విద్యార్థులు, మండల నాయకులు, పత్రికా మిత్రులు పోలీస్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.

ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T182020.003.wav?_=5

 

ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

*పిజిఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మకు
సీఎం ఘన నివాళులు*

పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బుధవారం పరామర్శించారు. దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పిజిఆర్ గార్డెన్ లో బుధవారం మాతృయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,

ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, ప్రజా ప్రతినిధులు ఇతర ప్రముఖులు హాజరు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తదితరులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు. దొంతి మాధవ రెడ్డి ని పరమార్శించేందుకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్.

నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి రోడ్డు మార్గం లో పీజీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి దొంతి కాంతమ్మ మాతృయజ్ఞం కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు దొంతి కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ట్స్ కళాశాల మైదానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు చేరుకున్నారు.

తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం

వరంగల్ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి బయలుదేరారు. హెలిపాడ్ వద్ద మంత్రులు అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్. నాగరాజు,యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, ఎన్పీడీసీఎల్ వరుణ్ రెడ్డి, తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు

 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మరణించిన నేపద్యంలో బుధవారం హన్మకొండ లోని పిజీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొననుటకు గాను హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T144546.723.wav?_=6

 

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రభుత్వ చేసిన అనేక అభివృద్ధి పనులకు గాను.ప్రభుత్వ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఏడాది 100 కోట్లు ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తానన్న గత సీఎం కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రజా ప్రభుత్వంలో వేముల వాడ. ఆలయం అభివృద్ధి. అవుతుంటే బిజెపి నేతలు ఓర్వలేదు అని. ఆలయం అభివృద్ధి అవుతుంటే బీజేపీ బీ ఆర్ఎస్ లీడర్లు కండ్లు మండుతున్నాయని. గత పది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం ఆయాంలోఅభివృద్ధికి నోచుకోని రాజన్న ఆలయం అని. ప్రతి సంవత్సరం ఆలయం డెవలప్మెంట్ గురించి 100 కోట్లు ఖర్చు చేస్తానన్న. నాటి సీఎం కేసీఆర్ మాట తప్పాడని. ఆగమ. శాస్త్రం. ప్రకారమే ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవరిస్తూ ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమని. రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను బిజెపి దహనం చేయడంపై దురుష్టకరమని. దహనంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న ఆలయం పై రాజకీయం చేయొద్దని. రాజన్న ఆలయ అభివృద్ధి అడ్డుకోవద్దని అడ్డుకుంటే చరిత్రలో మిగిలిపోతారని బిజెపి నాయకులకు కాంగ్రెస్ నాయకులకు. ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చవద్దని. అలాగే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు బిజెపి నాయకులు తట్టుకుంటలేరని. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు దర్శనం ఎలా సాధ్యమవుతుందని ఎవరు అడ్డుపడిన ఆలయ అభివృద్ధి మాత్రం నిలిపే ప్రసక్తే లేదని. హిందూ ధర్మం అనే గొప్పగా చెప్పుకునే వారు హిందూ దేవాలయాల అభివృద్ధి చెందితే వారికి బాధ అయింది అని. ఒక బీసీ నాయకుడు రాజన్న ఆలయమును అభివృద్ధి చేస్తే మీకు నచ్చడం లేదా. పదిహేళ్లుగా బిజెపి బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు రాజన్న గుడి ని. ఎందుకు అభివృద్ధి చేయలేదని. అలాంటిది. మా ప్రభుత్వ ఆయాంలో వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ . ఓరవడం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ. ఉపాధ్యక్షులు నేరెళ్ల డైరెక్టర్స్ మండల కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ సీనియర్.పార్టీ నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అనుపర్తి యాకయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

అనుపర్తి యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్దన్నపేట (నేటిధాత్రి)

Vaibhavalaxmi Shopping Mall

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ లోని 1వ వార్డు కు చెందిన అనుపర్తి యాకయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే వెంట ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుల్లా రవి, మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ నాయకులు బెజ్జం పాపరావు, సిలువేరు శ్రీధర్, పులి శ్రీను, వెంకట్, ఎండి అన్వర్, చిటూరి రాజు, పాక సుజాత తో పాటు తదితరులు పాల్గొన్నారు..

రేగొండలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..

రేగొండలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.370 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బస్టాండు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… రేగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యార్థం నూతన బస్టాండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రేగొండ మండల కేంద్రం పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందన్నారు. రేగొండ నుండి వివిధ ప్రాంతాలకు నిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారన్నారు. అదేవిధంగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ఇప్పటివరకు రూ.186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆర్టీసీకి రూ.6,210 కోట్లు చెల్లించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఎన్ఎస్ఆర్ సంపత్ రావు ఇప్ప కాయల నరసయ్య పున్నం రవి ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version