14వ డివిజన్‌ ప్రెసిడెంట్ పోటికి 33 అప్లికేషన్లు..

14వ డివిజన్‌ ప్రెసిడెంట్ పోటికి 33 అప్లికేషన్లు..

పాత కాంగ్రెస్ కార్యకర్తలకే ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్

అభ్యర్థుల వెల్లువ – ఒక్క అధ్యక్ష పదవికి 33 దరఖాస్తులు?

పాత కార్యకర్తల ఆవేదన – “మా కష్టం విలువ ఎక్కడ?”

ఇతర పార్టీల నుంచి వచ్చినవారిపై వ్యతిరేకత

నాయకత్వానికి పరీక్ష – ఈసారి ఎవరికీ న్యాయం?

ఏనుమాముల, నేటిధాత్రి.

వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఈసారి అనూహ్యంగా భారీ పోటీ నెలకొంది. ఏకంగా 33 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కొద్దిమందికే పరిమితమయ్యే ఈ పదవికి ఇంతమంది పోటీ పడటం వెనుక పార్టీ లోపలి అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.

ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని పక్కనపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. “మేము అంతకాలం పార్టీ కోసం పనిచేసింది ఎందుకు?” అన్న ప్రశ్నలు కార్యకర్తల నోళ్లలో వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారిపై కూడా స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో వ్యతిరేకత ఉందని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి పదవి చేపట్టిన ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని, ఈసారి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.

పిసిసి స్థాయి నుంచి పాత కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు ఉన్నప్పటికీ, అమలు స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని కార్యకర్తలు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి 14వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి అయినా పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుని నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తుందా? లేక మళ్లీ కొత్తవారికే అవకాశాలు ఇస్తుందా? అన్నది ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

ప్రజ గుండెలో ఉండే నాయకుడు బొగ్గుల జగదీశ్వర్..

ప్రజ గుండెలో ఉండే నాయకుడు బొగ్గుల జగదీశ్వర్..

◆-: ప్రజాసేవకుడు ప్రజల కష్టం పంచుకునే నిస్వార్థ సేవకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ ఝరాసంగం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీలో బలపరచడానికి ముఖ్య నాయకులుగా ఎదిగిన జగదీశ్వర్ ఎందుకంటే గ్రామంలో 60 సంవత్సరాలు పరిపాలించిన పేరు పొందిన నాయకులకు అడ్డుగోడగా నిలిచి ఝరాసంగం గ్రామంలో మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి సర్పంచ్ గా ఎదిగిన ఏ కేక నాయకుడు బొగ్గుల జగదీశ్వర్ రెండోసారి తన అభ్యర్థి వినోద బాలరాజును నిలబెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి రెండోసారి వినోద బాలరాజును గెలిపించడం జరిగింది గ్రామంలో సత్త ఢీకొనే నాయకుడు అంటే ఒకటే అని గ్రామస్తులు అనుకుంటున్నారు గ్రామ ప్రజలందరూ జడ్పిటిసి గా పోటీ చేసి ప్రజల మధ్యలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్న ఏకైక నాయకులు బొగ్గుల జగదీశ్వర్ అని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఢీకొనే సత్తా ఒక్కడేనని అనుకుంటున్నారు, గ్రామంలో 5 సంవత్సరాలు సర్పంచిగా పనిచేసి ప్రజల గుండెలో చోటు సంపాదించుకున్న ఇలాంటి నాయకుడు మన మధ్యలో మండల స్థాయి పదవిలో ఉండి మన అందరిని కంటికి రెప్పలాగా కాపాడే నాయకుడిని గెలిపించుకుందాం అంటున్న గ్రామ ప్రజలు

32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన.

32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవ రజిత.

బెల్లంపల్లి, నేటిధాత్రి:

 

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మున్సిపాలిటీ 32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవ రజిత కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఈ కార్యక్రమంలో అభ్యర్థి దేవ రజిత, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

20వార్డు పద్మ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం…

20వార్డు పద్మ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ రాజు నాయక్- పద్మ పార్టీ కౌన్సిలర్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి టీపీపీసి సభ్యులు చల్లూర్ మధు,పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని తెలియజేయడం జరిగింది ఉచిత కరెంటు 200 యూనిట్లు, 500 రూపాయలకు వంట గ్యాస్, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం, రైతు భరోసా, ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ప్రతినియోగ వర్గంలో ఇంటిగ్రేడ్ హై స్కూల్, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు సంక్షేపతకలతో ముందుకు వెళుతుందని తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు మాట్టేవాడ సురేష్, శనిగరపు తిరుపతి, మంతెన సాంబయ్య, నోముల నారాయణ, ఇస్తారి, యూత్ కాంగ్రెస్ నాయకులు అప్పాల శీను, రాజశేఖర్ జన్ను, కోయిల క్రాంతి, రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి…

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

స్థానిక మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గ్యాదoగి
తిరుపతిని గెలిపించాలి అలాగే 18 వార్డు లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను కాలనీలో సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు తాగునీరు సమస్యలు తలెత్తకుండా పరిష్కరిస్తానని వారు ప్రజలకు హామీ ఇచ్చారు కావున 18వ వార్డు ప్రజలు అందరూ గ్యాదoగి తిరుపతి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అభివృద్ధి చేస్తా అవకాశం కల్పించండి…

అభివృద్ధి చేస్తా అవకాశం కల్పించండి : 8వ వాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంఠం శ్వేత కృష్ణారెడ్డి

* అలియాబాద్ లో గడపగడప ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని అలియాబాద్ మున్సిపల్ 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శ్వేతా కృష్ణారెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అలియాబాద్ ఎనిమిదో వార్డులో గురువారం గడపగడప ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా మున్సిపల్ అభివృద్ధికి తనవంతుకు చేస్తానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మంజుల, నాయకులు సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ అభ్యర్థి కొక్కిరాల దీప్తి ప్రచారం…

బిఆర్ఎస్ అభ్యర్థి కొక్కిరాల దీప్తి ప్రచారం

 

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి కొక్కిరాల దీప్తి రాకేష్ రావు ప్రచారం జోరుగా కొనసాగుతోంది.మంగళవారం గండ్రవాడ, బ్రాహ్మణవాడ ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆమె ఓటర్లను కలిసిన సందర్బంగా తనకు అవకాశం ఇస్తే కాలనీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరిస్తానని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే బ్రాహ్మణవాడలో పర్యటించిన సమయంలో బిడ్డా..మా ఓటు నీకే”అంటూ ఆశీర్వదించడంతో ప్రచారానికి మరింత ఉత్సాహం లభించింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ఎండీ జాకీర్ అలీ (ఎంపీపీ) నాయకులు పాడి నవతా భగవాన్ రెడ్డి,బండి వెంకటేష్,ఎండీ మాక్స్ ద్ అలీ,ఎండీ బియా బాని,జాలా రవీందర్ రెడ్డి,బొమ్మకంటి నాగరాజు,మంజూరు,ఖలీమ్,మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ అభ్యర్థులు రెండో విడత జాబితా విడుదల..

బిఆర్ఎస్ అభ్యర్థులు రెండో విడత జాబితా విడుదల

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రెండో విడతగా 8 వార్డులకు సంబంధించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.వార్డుల వారీగా 8 మంది బిఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.2వ వార్డు – బొచ్చు శ్యామల బాబురావు,8వ వార్డు ఆడప రాము,14వ వార్డు పడిదెల దీప్తి రాకేష్ రావు,15వ వార్డు కందుకూరి వేణుగోపాలమూర్తి,16వ వార్డు బండి సారంగపాణి,18వ వార్డు రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి,19వ వార్డు ఏకు బాబు (బొబ్బిలి)20వ వార్డు పాలకుర్తి గోపి ల జాబితా విడుదలయింది.

4వ వార్డు అభివృద్ధే లక్ష్యం: కాంగ్రెస్ అభ్యర్థి సవిత్రమ్మ

వార్డును సమూలంగా అభివృద్ధి చేస్తాం : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సవిత్రమ్మ

◆-: 4 వ వార్డు రాంజోల్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్: 4 వ వార్డును సమూలంగా అభివృద్ధి చేసి, పట్టణంలోనే ఆదర్శ వార్డుగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అందరూ సైనికుల్లా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెట్టాలని మాజి ఎంపిటిసి అల్గోల్ సవిత్రమ్మ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సవిత్రమ్మ పట్టణంలోని 4 వ వార్డు నుంచి తన నామినేషన్ ఫారం ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రవి కుమార్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటలను అమలు చేస్తూ ఇప్పటివరకు ఒక్క హామీని విస్మరించలేదని, మంత్రి దామోదర్ రాజనర్సింహ, స్థానిక ఎంపీ సురేశ్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ల కృషితో 4 వ వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామాని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మవుర్ మల్లన్న, అల్గోల్ మల్లన్న, చౌల సంజీవ్ రెడ్డి, పిట్టల రవీందర్, మునిపల్లి రచన్న, మవుర్ వెంకట్, శ్రీశైలం, నర్సింలు, ఉమాకాంత్, సిద్దు, చంద్రకళ, భాగ్యమ్మ, శ్రావణి, అనుషమ్మ, రాధిక, హరిణి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఒకటవ వార్డు సేవకు సిద్ధం: కృష్ణారెడ్డి

ఒకటవ నంబర్ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే ప్రజలను సేవలు అందిస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తానని విద్యావేత్త కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సబ్ వెడ్డింగ్ 24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారు తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్ముతూ నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. వార్డు అభివృద్ధి, విద్యా సౌకర్యాల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదల లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో పాటు పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే బాధ్యతాయుతంగా సేవ చేసి వార్డును ఆదర్శంగా నిలుపుతానని కృష్ణారెడ్డి అన్నారు.

కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఖాయం

*కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం*

*మేయర్ పీఠం కాంగ్రెస్ దే- వెలిచాల రాజేందర్ రావు*

కరీంనగర్, నేటిధాత్రి:

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపిలకు ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమని, ఘోరంగా ఓడించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. గల్లి గల్లి లో పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ బిజెపి పార్టీ ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని మండిపడ్డారు. గురువారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో 28వ డివిజన్ చెందిన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ నాయక్ నేతృత్వంలో ఆడివిజన్ కు చెందిన వంద మంది యువకులు ప్రజలు వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా రాజేందర్ రావ్ వారందరికీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని ప్రజలంతా కాంగ్రెస్ ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బిజెపిలను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలంతా కంకణం కట్టుకున్నారని కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అవినీతి అక్రమాల్లో మాత్రం మించిపోయారని ఆరోపించారు. ఎన్నికల రాగానే ప్రజలపై ప్రేమను వలకబోస్తున్నారని వారి మాటలను నమ్మవద్దని రాజేందర్రావు కోరారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రెండుసార్లు ఎంపీగా గెలిచినా కరీంనగర్ అభివృద్ధిని మాత్రం మర్చిపోయారని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని రాజేందరో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో 28 డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ నాయక్, పులి రమేష్, పులి అనిల్, బోయిని దేవరాజు గుండేటి అనిల్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

9 వ వార్డ్ మెంబెర్ కత్తి సంధ్య రాజు కు సన్మానం…

9 వ వార్డ్ మెంబెర్ కత్తి సంధ్య రాజు కు సన్మానం

నేటిధాత్రి మొగుళ్ళపల్లి:

 

మండలంలోని రంగాపురం గ్రామ తొమ్మిదవ వార్డ్ సభ్యులు కత్తి సంధ్య రాజు డిసెంబర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వార్డ్ మెంబెర్ గా విజయం సాధించాగా రాష్ట్ర రాజధాని లో స్థిరపడ్డ తన చిన్ననాటి మిత్రులు సంక్రాతి పండుగకు వారి స్వంత గ్రామానికి వచ్చిన మిత్రులు కత్తి సంధ్య రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. కత్తి సంధ్య రాజు బిఆర్ఎస్ పార్టీ రంగాపురం గ్రామ శాఖ అధ్యక్షులుగా 10 సంవత్సరాలనుండి క్రియాశీలక పాత్ర పోషిస్తూ బిఆర్ఎస్ పార్టీలో తనదైన శైలిలో ముద్ర వేసి గ్రామ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించడమే కాకుండా భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి వీరాభిమానిగానే కాకుండా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుల దృష్టిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కత్తి సంధ్య రాజు గ్రామ అభివృద్ధిలో వార్డ్ మెంబెర్ గా నిత్యం ప్రజలతో మమేకమై అభివృద్ధిలో విజయం సాధించాలని స్నేహితులు కత్తి సంధ్య రాజును ప్రశంశించారు. స్నేహితులు, కత్తి అశోక్ నామాని శ్రీనివాస్, కత్తి రమేష్,ఉన్నారు.

పార్టీలో యువతకు అవకాశం ఇవ్వండి…

పార్టీలో యువతకు అవకాశం ఇవ్వండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టి పి సి సి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తన నివసరంలో కలిసి శాలువాతో సన్మానం చేసిన డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త బీసీ ఉద్యమ నేత . మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో మా ప్రాంతం నుండి బీసీ యువకుడినైన నాకు జడ్పిటిసిగా అవకాశం కల్పిస్తే అంతఃకరణ శుద్ధితో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ హక్కుల కొరకు కృషి చేస్తానని ఝరాసంగం మండల కొల్లూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధన్ రాజ్ గౌడ్ అన్నారు మాలాంటి యువతను రాజకీయంగా ప్రోత్సహించాలని మహేష్ కుమార్ గౌడ్ గారిని వారు అభ్యర్థించారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమానత్వం ఉంటుంది యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వడం జరిగిందని డా: ధన్ రాజ్ గౌడ్ అన్నారు అనంతరం మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ధన్ రాజ్ గౌడ్,

కట్ర్యాల గ్రామం నుంచి వంద పడకల ఆసుపత్రిని తరలిస్తే ఊరుకునేదే లేదు..

కట్ర్యాల గ్రామం నుంచి వంద పడకల ఆసుపత్రిని తరలిస్తే ఊరుకునేదే లేదు

భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట.(నేటిధాత్రి):

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామం ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించ తలపెట్టిన వంద పడకల ఆసుపత్రిని వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రానికి తరలిస్తే ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని హెచ్చరించారు. మూడు మండలాల ప్రజలకు అందుబాటులో విధంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని నియోజకవర్గ కేంద్రం వర్ధన్నపేటకు తరలించడం ద్వారా మూడు మండలాలకు చెందిన గ్రామాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని దానిని గుర్తుంచుకొని ఎక్కడైతే వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు అక్కడే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తగిలిందని ఇప్పటికైనా ఆ పార్టీ బుద్ధి తెచ్చుకొని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య విద్య అందించడం కోసం ప్రజలకు అనువైన సౌకర్యాలను కల్పించడం కోసం పని చేస్తే బాగా ఉంటుందని మహేందర్ రెడ్డి అన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం లోని గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఖాళీ శంకుస్థాపనలతో కాలయాపన చేస్తూ కాంగ్రెస్ నేతల జేబులు నింపుకోవడం కోసం కొన్ని మాఫియాలను పెంచుకుంటూ పోతూ వారి స్వలాభం కోసం వారి కుటుంబ స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నారని అది గమనించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరియు ఎమ్మెల్యేకి గట్టిగా బుద్ధి చెప్పారనేది వర్ధన్నపేట నియోజకవర్గంలో నిరూపణ జరిగిందని అని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీలు అయిన పంతిని .కట్ర్యాల. గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా పార్టీ జెండా ఎగరవేసిందని అలాగే కక్కిరాలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఉపసర్పంచ్ చేజిక్కించుకోవడం జరిగిందని ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయడం కడారి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని దీన్ని ఆలోచించి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుద్ధి తెచ్చుకోవాలని గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప్పరపల్లి అయినవోలు పున్నేలు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా ప్రతిపక్షాలు పనిచేశాయని అదేవిధంగా పర్వతగిరి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరవేసిందని తెలియజేశారు ఈ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు అధికార పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని కావున ప్రజలకు అవసరమైన పనులను అతి త్వరలో చేపట్టి వారికి అవసరమైన అన్ని విధాల విద్య వైద్య నీటి సౌకర్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి రావలసిన దేవాదుల కాలువ ద్వారా నీరు నీరు ఇప్పటికీ తేకపోవడం ఎంత విడ్డూరంగా ఉంది అంటే ఇచ్చిన హామీలను మరిచిపోయి నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ప్రజలకు న్యాయం చేయకపోతే నిత్యం ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ప్రజల సహకారంతో ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించ తలపెట్టిన 100 పడకల ఆసుపత్రిని తరలిస్తే పెద్ద ఉద్యమాన్నిగా నిర్మించి గట్టిగా బుద్ధి చెప్తామని వచ్చే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తామని మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాయ్ తాగుతున్న కేకే మహేందర్ రెడ్డి…

కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాయ్ తాగుతున్న కేకే మహేందర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక తాడూరు చౌరస్తాలో గల భాస్కర్ చాయ హోటల్లో చాయ్ తాగుతూ పార్టీ నాయకుల కార్యకర్తల తో. తంగళ్ళపల్లి మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించుకోవడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తగా నాయకులు కార్యకర్తలతో మమేకమై టీ స్టాల్ వద్ద వారితో మాట్లాడుతూ సామాన్య వ్యక్తి లాగా నాయకుల కార్యకర్తలు అందరితో మమేకమై కలిసి తిరుగుతూ తాను కూడా సామాన్య కార్యకర్త ననిచెప్పగానే చెప్పినాడు. ఇలాంటి సామాన్యమైన వ్యక్తి మనకు ఏ ఆపాదవచ్చిన అందుబాటులో ఉండి మనల్ని సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా ఆయనను నాయకులు కార్యకర్తలు కొనియాడారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ తో కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి టీ తాగి అందరూ అందుబాటులో ఉండి మన అనుకున్న దానికంటే మెజార్టీ ఎక్కువ స్థానాలు సాధించే దిశగా కష్టపడాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేశారు

గ్రామ స్వరాజ్యం కల నెరవేరాలంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-12T155803.285.wav?_=1

 

గ్రామ స్వరాజ్యం కల నెరవేరాలంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలంలోని పిచారాగడి మరియు మాచిరెడ్డిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జాహిరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా ఆయా గ్రామాల అభ్యర్థుల కొరకు ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.గ్రామాలు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో గెలిపించాలని అభ్యర్తించారు. అభ్యర్తులకు కేటాయించిన గుర్తులను గుర్తుంచుకొని తప్పకుండా అభ్యర్థులను ఆశర్వాదించాలని, మహిళలు చాలా కీలకమని, మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీఠం వేస్తుందని అన్నారు.ఈ కారిక్రమంలో మాచిరెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి అర్షద్ అలీ మరియు పిచారాగడి సర్పంచ్ అభ్యర్థి అమృత వీరా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.4వేలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-12T131501.918.wav?_=2

 

సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.4వేలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్లో రొండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది.దీంతో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ, ఒక్కో ఓటుకు రూ.1000 నుండి రూ.4000 వరకు పంచుతున్నట్లు సమాచారం.
గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చి, ఓటు వేయాలని కోరుతున్నారు. మద్యం క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీ కూడా జోరుగా సాగుతోంది..

సేవ చేస్తా ఆశీర్వదించండి..

సేవ చేస్తా ఆశీర్వదించండి

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రంలోని రెండవ వార్డ్ అభ్యర్థిగా పోటీలో నిలబడి వార్డు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నానని రెండో వార్డ్ అభ్యర్థిగా తాళ్ళ అశోక్ ముదిరాజ్ తెలిపారు. వారు మాట్లాడుతూ మీ ఇంటి బిడ్డగా వస్తున్న మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటా,వార్డు ప్రజలకు సేవ చేస్తా,వార్డ్ అభివృద్ధే నా లక్ష్యమని ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరిస్తా వార్డును ఆదర్శ తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కష్టపడతా మీ అందరి సహాయ సహకారాలతో సమష్టిగా ముందుకెళ్దా ఆని అన్నారు.

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు…

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు

• గెలుపే లక్ష్యంగా ప్రచారం
* అన్ని వర్గాల పూర్తి మద్దతు నాకే ఉంది
* విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం
* పదవి లేకున్నా గ్రామానికి అనేక సేవలు

చేవెళ్ల, నేటిధాత్రి :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఏ గ్రామాల్లో చూసిన ఎన్నికల హడావిడి వాతావరణమే దర్శనమిస్తుంది. షాబాద్ మండలం పోతుగల్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటిగా గడపగడపకు ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోతుగల్ పంచాయతీలో పంచాయతీ అనుబంధ గ్రామం చిన్న, పెద్ద తండాలు కలుపుకొని సుమారు 12వందల ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పామేనా నర్సిములు ముందంజలో కనిపిస్తున్నారు. బొట్టుపెట్టి ఓటు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సర్పంచిగా అవకాశం ఇచ్చి అభివృద్ధికి ఓటువేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సర్పంచిగా గెలిచినా వెంటనే గ్రామంలో అండర్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు చేపడతానని తెలిపారు.బీటీ రోడ్లు వేయిస్తానని అన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్లు రాని పరిస్థిలో నీటి సమస్య ఏర్పడుతుంది ఈ సమస్యను అదిగమించడానికి పోతుగల్ గ్రామంలోని ప్రతి వార్డు లో బోరు వేసి, మిని ట్యాంక్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. హామీ ఇచ్చారు.గ్రామానికి గ్రంధాలయం ఏర్పాటు చేస్థానని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తొడ్పాటు అందిస్తానని తెలిపారు. గ్రామంలో ఫిల్టర్ వాటర్ సెంటర్ ను ఏర్పాటు చేసి గ్రామప్రజలకు ఉచితంగా ఫిల్టర్ నీళ్లను అందిస్తానని తెలిపారు. గ్రామంలో మృతిచెందిన కుటుంబానికి 5 వేల రూ. ఆర్థిక సహాయం అందజేస్తానని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందేలా, గ్రామ అభివృద్ధికి అన్నివిదాల కృషి చేస్తానని తెలిపారు. గ్రామప్రజలకు ఓటర్లకు కత్తెర గుర్తుకు ఓటువేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-11T120952.778.wav?_=3

 

ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.

#కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

నల్లబెల్లి గ్రామ ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామంలో నెలకొన్న సైడ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా కష్టపడి పనిచేస్తానని. అదేవిధంగా గ్రామంలో గత పాలకుల సమయంలో చేయని పనులు ఎన్నో తిష్ట వేశారని వాటిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామంలో నెలకొన్న సిసి రోడ్, డ్రైనేజీ, సెంటర్ లైటింగ్ పనులు, అర్హులైన వారికి పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ ఓటర్లు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్ మహాశయులను ఆమె అభ్యర్థించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version