ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి నేటి దాత్రి

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య బోధన తోపాటు కార్పొరేట్ సాయికి దీటుగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన అందిస్తున్నామన్నారు. IFP (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ) బోర్డు ఉపయోగిస్తూ విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ ప్రతి అంశాన్ని కల్లకు కట్టినట్లుగా బోధిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి తగ్గ అంశాలలో తర్ఫీదును అందిస్తున్నామన్నారు. బాలికలకు ఆత్మరక్షణకై కరాటే శిక్షణ, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్ ఎం ఎం ఎస్ స్కాలర్షిప్ పొందుటకు ప్రత్యేక తరగతులను, పదవ తరగతి విద్యార్థులకు ఉత్తమ మార్కులు సాధించుటకు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుటకు ఎన్సిసి శిక్షణ ఇస్తున్నట్లు డిఈవో తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్ అధికారి సామల రమేష్, బీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్ రెడ్డి, స్థానిక సర్పంచి చాట్ల విజయ, ఉపాధ్యాయులు ప్రవీణ్, కుమారస్వామి, CRP లు రాజయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

పేపర్ లీకేజీపై చర్యలు తీసుకోవాలి

పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

రైకోడ్ మండల యూసు పూర్ సర్పంచ్ సంగారెడ్డి

జహీరాబాద్ నేటిధాత్రి ;

పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైకోడ్ మండల యూసు పూర్ సర్పంచ్ సంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆరో పించారు. యూసుపూర్ సర్పంచ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పగలు రాత్రి కష్టపడి చదివిన సుమారు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటo మాడు తోందని మండిపడ్డారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జాతీయ అర్హత పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించలేని స్థితిలో కేంద్రం ఉంది ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. పరీక్షకు ముందు రోజే వందకు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయంటే, విద్యా వ్యవస్థలో లోపాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2024లో జరిగిన నీట్ లీకేజీ ఉదంతం నుండి కేంద్రం ఎలాంటి గుణ పాఠం నేర్చుకోలేదని, ఆ నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృత మైందని గుర్తు చేశారు. వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థులకు శాపంగా మారిందని, కేంద్ర సర్కారు తీరువల్ల అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గుర వుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడం లో విఫల మైన ఎన్డీయే ప్రభుత్వం ఈ బాధ్యతను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి

పాఠశాలలు బలోపేతానికి సర్పంచులు కృషి చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు.
బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రత్యేక విద్యా వారోత్సవాల రోజు వారి కార్యాచరణ కార్యక్రమాలపై మండల విద్యాశాఖ అధికారులు, సర్పంచ్ లతో వర్క్ షాప్ నిర్వహించారు.
ముందుగా సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే దేవాలయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద పటిష్టమైన ఆలోచనతో ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరగాలన్న లక్ష్యంతో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపిక చేసి సెమి రెసిడెన్షియల్ పాఠశాలలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో 200 కోట్లతో యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి వసతి గృహల్లోని విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు, 40 శాతం డైట్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. సర్పంచులు తమ తమ పరిధిలో గల పాఠశాలలను తనిఖీ చేసి విద్యాబోధన, మెనూ అమలును పరిశీలించాలని ఆయన సూచించారు. భవిష్యత్ తరాలను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపైందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ వ్యవస్థ చాలా పటిష్టమైనదని, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన తెలిపారు. పాఠశాలల్లో క్రీడా స్థలాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో లైబ్రరీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠనాశక్తిని పెంపొందించడమే కాకుండా ఉద్యోగాలు సాధనకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. విద్యా వ్యవస్థను బలిపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ క్రమంలో ఎక్కడైనా తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల మీద నుండి విద్యుత్ లైన్లు వెళ్తుంటే అట్టి జాబితాను అందజేయాలని వాటిని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థుల కొరకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి అన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించినట్లు తెలిపారు. విద్య మీద సర్పంచులు ఫోకస్ పెట్టి విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన పనులు చేపట్టి పాఠశాలలను సుందరీకరణ చేసినట్లు తెలిపారు. జిల్లాలో యంగ్ ఇండియా మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతి, ఇంటర్ లో మంచి ఫలితాలు సాధించామని, విద్యార్థులను, ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థులు బాగా చదివి మన జిల్లాకు, రాష్ట్రానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. విద్యా వైద్యంపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు ఆయన సూచించారు.
ప్రతి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్ఓ వసంతకుమారి, గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్ని మండలాల ఎంఈఓలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభం

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన విద్యాధికారి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండపల్లి లోని మోడల్ స్కూల్ లో ఉచిత క్యాంపునుమండల విద్యాధికారి. భూక్య రాజు ప్రారంభించారు. సమ్మర్ క్యాంపు మే 11.వ తేదీ నుండి 25.వ తేదీ వరకు అనగా. 15 రోజుల క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా (ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు). ఈ క్యాంపులో పాల్గొనవచ్చునని. ఇట్టి క్యాంపు కార్యక్రమంలో పిల్లలకు మ్యూజిక్. డ్యాన్స్. డ్రాయింగ్. స్టోరీ. టెల్లింగ్. ఇండోర్ గేమ్స్. అవుట్ డోర్ గేమ్స్. నేర్పించబడునని. ఇట్టి క్యాంపు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మానసిక మరియు శారీరక అభివృద్ధి పెంపొందించుకోవచ్చునని. అలాగే. ఇట్టి సమ్మర్ క్యాంపులో పాల్గొని విద్యార్థులకు స్నాక్స్ ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయని. ఇందులో భాగంగా విద్యార్థులు అందరూ సద్వినియోగం చేయించుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో విద్యాధికారి బూక్యా. రాజు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్. మామిళ్ళ విట్టల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కథలాపూర్ మండల కేంద్రంలో ని బొమ్మేన గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది

కథలాపూర్ మండల కేంద్రంలో ని బొమ్మేన గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 

 

 

ఈ కార్యక్రమం మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ మరియు ఎంపీపీ ఎస్ బొమ్మేన పాఠశాలల సంయుక్త బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఇందులో భాగంగా ఉచిత పాఠ్య పుస్తకాలు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనము ఉచిత పాఠశాల దుస్తులు 24 వస్తువులతో కూడిన కిట్టును పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు జడ్పిహెచ్ఎస్ బొమ్మేన లో అడ్మిషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఎన్ఈవో శ్రీనివాస్ సార్ మరియు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

బంజారుపల్లిలో విద్యార్థులతో సహవంక్తి భోజనం చేసిన సర్పంచ్

బంజారుపల్లిలో విద్యార్థులతో సహవంక్తి భోజనం చేసిన సర్పంచ్
# నెక్కొండ, నేటి ధాత్రి:

బంజారుపల్లి గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలను సర్పంచ్ రమేష్ రాథోడ్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి సహవంక్తి భోజనంలో పాల్గొన్నారు.

సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, పోషకాహారంతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

హాలో మేడి కో పేరెంట్ – చలో వరంగల్…

హాలో మేడి కో పేరెంట్ – చలో వరంగల్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం తెలంగాణా లోని మేడికల్ కాలేజీల్లో
సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వున్నా, మేడిఠల్ పేరెంట్స్ కలిసి ఏప్రిల్ 17 శుక్రవారము రోజు తలపెట్టిన కే ఎన్ ఆర్ యూహెచ్ ఎస్ లోని నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యాలో హజరుకావాలిని భూపాలపల్లి జిల్లా మేడికో పేరెంట్స్ సమవేశము లో పిలుపు ఇచ్చారు ఇందులో భాగంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ (భూపాలపల్లి జిల్లా ఇంచార్జి) జెల్లా నాగేందర్ మాట్లాడుతూ ఒకే సంవత్సరంలో 209 కోట్ల అధిక పేజూలు వసులు చేస్తూ కనీస సౌకర్యాలు కలిపించకుండ ఆడపిల్లల భద్రత మరియు ర్యాగింగ్ పైన ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లోని పెరెంట్స్ అందరు పాల్గోని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
భూపాలపల్లి జిల్లా నుండి వచ్చేవారు తమని సంప్రదించాలని సెల్ నెంబర్: 7997 888 777 కో తెలిపారు. ఈ కార్యక్రమములో పెరుగు రవింద పోలు రమేష్ , కటకం జనార్థన్ , అల్ల సుధాల ఖరీల్ సతీష్నరు శ్రీథివాస్ పాల్గోన్నారు .

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి…

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, నేటి ధాత్రి :

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మండలం సీతారాంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, మూత్రశాలలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, మెనూ ప్రకారం సకాలంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. పాఠశాలలో ఏమైనా మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వేసవి అయినందున ఆరోగ్యం దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత…

రాష్ట్రంలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం జంగేడు గ్రామంలోని కస్తూరి బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం మౌలిక వసతుల కల్పన కోసం రూ.38 లక్షల వ్యయంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని జంగేడు, ఘనపూర్, రేగొండ, టేకుమట్ల మండలాలలో ఉన్న కస్తూరిబా గాంధీ గురుకులాల అభివృద్ధికి రూ.2 కోట్ల 38 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ నిధులతో గురుకులాల్లో ప్రహరీ గోడల నిర్మాణం, లైటింగ్ సదుపాయాల ఏర్పాటు, గ్రౌండ్ లెవలింగ్, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, మరమ్మతులు తదితర పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ పనులన్నీ వేసవి సెలవుల్లో పూర్తిచేసి పున ప్రారంభం నాటికి పాఠశాలలు మరింత సదుపాయాలతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ 12 నాటికి విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్, పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. 14–15 సంవత్సరాల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ టీకాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో
స్థానిక అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ శ్వేత ప్రభాకర్ కస్తూరిబా పాఠశాల ప్రత్యేక అధికారి ఈశ్వరి కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్…

ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలో జరిగిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కార్యక్రమం ఒక సాధారణ సేవా కార్యక్రమం కాదు… ఇది ఒక నాయకుడి దూరదృష్టి, పట్టుదల, గ్రామం పట్ల నిబద్ధతకు ప్రతీక.ఈ మహత్తర కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి –ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ గ్రామాభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు…కార్పొరేట్ సంస్థలను సంప్రదించి, ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిని వివరించి, అవసరాలను వివరంగా తెలియజేసి, ప్రతీ అంశాన్ని స్వయంగా పర్యవేక్షించి – ఈ భారీ సహాయాన్ని ఝరాసంగానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.295 బంక్ బెడ్‌లు.590 పరుపులు 4 మొబైల్ టాయిలెట్లు 130 ట్రంక్ బాక్స్‌లు 42 ఇనుప రాక్లు.కంప్యూటర్లు, ప్రింటర్లు, లైబ్రరీ సామగ్రి దోమతెరలు, ఫ్యాన్లు, బీరువాలు తదితర వసతి సామగ్రి ఇది సాధారణ సహాయం కాదు –ఇది వందలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే మహత్తర మార్పు..హాస్టల్ విద్యార్థులు ఇకపై నేలపై నిద్రపోవాల్సిన అవసరం లేదు పరిశుభ్రత మెరుగుపడుతుంది డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి
గ్రంథాలయ అభివృద్ధితో చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఇది అన్నీ సాధ్యమైంది ఎందుకంటే –
జగదీశ్వర్ గ్రామాన్ని తన కుటుంబంలా భావిస్తారు.
పదవి లేకున్నా సేవ ఆగలేదు…అధికారంలో లేకున్నా అభివృద్ధి ఆగలేదు గ్రామం కోసం ఆయన పోరాటం, పట్టుదల ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఝరాసంగం ప్రజల గర్వకారణం
సమాజ సేవకు మారుపేరు యువతకు ఆదర్శం
విద్యార్థుల భవిష్యత్తుకు ఆశాకిరణం –
జగదీశ్వర్ ఇలాగే ఝరాసంగం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్..

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు అందరికీ దాదాపు ఎనభై ఆరు మందికి పైగా విద్యార్థులందరికీ వచ్చే నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల దృష్ట్యా యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం డైరెక్టర్, పదవ వార్డు సభ్యులు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రామడుగు మండల కోఆర్డినేటర్ బాసరవేని అజయ్, రామడుగు పద్నాలుగవ వార్డు సభ్యులు సిరికొండ సాయితేజ, రామడుగు యువకులు ఎడవెల్లి శ్రీనివాస్, వెంకటేష్, రాంప్రసాద్, భరత్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అనుపురం పరశురాం గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు. రాబోవు పదవ తరగతి పరీక్షలు విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని పరీక్షలు మంచిగా వ్రాసి మంచి ర్యాంక్ లు సాధించి మీతల్లితండ్రులకు, పాఠశాలకి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని, విద్యార్థులు మంచి భవిష్యత్తును సాధించాలని కోరారు. మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఏటువంటి ఇబ్బందులు ఉన్న అన్నివిధాల నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు.

సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులకు కఠిన చర్యలు

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంక్రాంతి సెలవుల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి, నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ ఆదేశాలు విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జారీ చేయబడ్డాయి.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూస్ పంపిణీ..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూస్ పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల దేవరంపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గ్రామానికి చెందిన చాకలి శేఖర్ విద్యార్థులందరికీ స్పోర్ట్స్ డ్రెస్ మరియు బూట్లు పంపిణీ చేశారు అదేవిధంగా పాఠశాల నోపాయం విద్యార్థులకు బెల్టు ఐడి కార్డులు కచ్చితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నూతన సర్పంచ్ రవికుమార్ మండల విద్యాధికారి శ్రీనివాస్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఆంజనేయులు సిఆర్పి రాజు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు,

బిసి హాస్టల్ ను అప్ గ్రేట్ చేయాలని బీసీ వెల్ఫేర్ అధికారిని కలిసిన తౌటం నవీన్..

బిసి హాస్టల్ ను అప్ గ్రేట్ చేయాలని బీసీ వెల్ఫేర్ అధికారిని కలిసిన తౌటం నవీన్.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికుమార్ కిరణ్ ని శుక్రవారం రోజున తౌటం నవీన్ మర్యాద పూర్వక ముగా కలిశారు ఈ సందర్బంగా గ్రామం లో ఉన్న హాస్టల్ సమస్యల పైన చర్చించారు. చిట్యాల మండల కేంద్రం లో ఉన్న బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ని ప్రీ మెట్రిక్ నుండి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గా అప్‌గ్రేడ్ చేసినట్లు అయితే హాస్టల్ లో ఇంటర్, డిగ్రీ చదువుకొనే పిల్లలు కూడా బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉండడం జరుగుతుంది*. దీని ద్వారా ఇంటర్ మరియు డిగ్రీ పిల్లలకు కూడా హాస్టల్లో అవకాశం కలిపిస్తే వారు కూడా చదువుకోని గొప్ప ప్రయోజకులు అవుతారు కాబట్టి తప్పకుండ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గా అప్ గ్రేడ్ చేయాలి అని వారికీ కోరడం జరిగింది అని నవీన్ తెలిపారు.బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికుమార్ కుమార్ గారు ఈ సందర్బంగా సంబంధిత పై అధికారులతో మాట్లాడి తప్పకుండ అప్ గ్రేడ్ చేసేలా కృషి చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది అని వారు పేర్కొన్నారు. రాబోయే ఇంటర్, డిగ్రీ వరకు హాస్టల్ అప్ గ్రేడ్ ని తప్పకుండ చేస్తాం అని పిల్లల భవిష్యత్తు కి చిట్యాల గ్రామ పంచాయతీ కృషి చేస్తుంది అని నవీన్ పేర్కొన్నారు.

పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ..

పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ.

#ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘం పిఆర్డియు టి ఎస్.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్న ఏకైక సంఘం పిఆర్టియు టీఎస్ అని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బుధవారం నందిగామ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మండలంలో విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్ టి యు సంఘం ముందు వరుసలో ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య భాస్కర్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్ రెడ్డి, ఎంఈఓ అనురాధ, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్, అంతర్జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర, పిఆర్ టి యు ప్రధాన కార్యదర్శులు ఉడుత రాజేందర్, బానోతు కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చంద్రశేఖర్, రామస్వామి, వెంకటేశ్వర్లు, కృష్ణ, జాకీర్ హుస్సేన్, వెంకటయ్య, సంధ్యారాణి, సుచరిత, వెంకటకృష్ణ, సదా చారి తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి…

ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల పాఠశాల వసతి గృహాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు.ఈ సందర్భంగా వారు పాఠశాలలలోని తరగతి గదులు, వసతి గృహాల గదులు, వంటశాల, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ ఆఫీసు లోని ఐ.డి.ఓ. సి లో జరిగిన వరంగల్ , హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఎస్సీ,ఎస్టీ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థినులు నిర్భయంగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వసతి గృహాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పాఠశాలలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థినుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

పాఠశాలను సందర్శించిన సర్పంచ్ మోరనిర్మల….

పాఠశాలను సందర్శించిన సర్పంచ్ మోరనిర్మల….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామ సర్పంచ్ స్థానిక .కేజీబీవీ. పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సంబంధించిన పలు విషయాలపై చర్చించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈరోజు కేజీబీవీ పాఠశాలను సందర్శించడం జరిగిందని అందులో చదువుతున్న పిల్లల బాగోబాగులు ఎలా ఉన్నాయని పిల్లలకి.టిఫిన్లతో భోజనాలు సదుపాయాలు సరిగ్గా మెనూ ప్రకారం టైముకి అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకుని పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడంతో పాటు పాఠశాల సిబ్బందితో వంటశాల. పిల్లలు చదువుతున్న క్లాస్.రూములు పడక గదులు స్నానపు గదులుబాత్రూములుపాఠశాల ఆవరణమునులుపరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నచో మా దృష్టికి తీసుకురావాలని వాటిపై పై అధికారులతో చర్చించి పిల్లల అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలందరూ ఆటపాటలతో చదువులో మెరుగ్గా రాణించాలని మిమ్మల్ని కన్నా తల్లితండ్రుల పేరు ప్రతిష్టలు నిలిపాలనిఅలాగే మీరు చదువుతున్న పాఠశాల పేరు ప్రఖ్యాతలు పెంపొంచేదిశగా చదువులో రాణిస్తూ అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల.పద్మనగర్.గ్రామ సర్పంచ్ మోర నిర్మల. పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

గ్రామాల రక్షణకు సీసీ కెమెరాలు: ఎస్సై సుజిత్..

గ్రామాల రక్షణకు సీసీ కెమెరాలు: ఎస్సై సుజిత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హద్నూర్ ఎస్సై డి. సుజిత్, న్యాల్కల్ మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, గ్రామాల రక్షణ కోసం ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తమ గ్రామాల్లో త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సర్పంచులు తెలిపారు.

ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు…

ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు…

తంగళ్ళపల్లి నేటీ ధాత్రి…..

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇమ్మానుయేల్.చర్చిలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోరలక్ష్మీరాజoహాజరైనారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం స్థానిక చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని క్రిస్మస్ వేడుకల్లో గ్రామంలోని సోదరీ సోదరీమణులు చుట్టుపక్కల గ్రామాల వారు హాజరై క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం.తోపాటు ఆ ఏసుప్రభుఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ముందుగా వేదికను రంగురంగులఅలంకరణకుతొ తీర్చిదిద్ది ప్రార్థనలకు కీర్తనలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేస్తూ పిల్లలకు మిఠాయిలు పంచుతూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం ప్రజలందరూ ప్రేమ సౌహార్ద్రంపరస్పర సహకారం మరింతగా బలపడాలని నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ప్రజల సమక్షంలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో చర్చి పాస్టర్ జేమ్స్ రెడ్డి. తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోరలక్ష్మిరాజం. వార్డు మెంబర్లు ఆర్డిఓమైనారిటీ ఆఫీసర్ ప్రభుత్వ అధికారులు ఇతర పాస్టర్లు గ్రామస్తులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని క్రిస్మస్.వేడుకలను ఘనంగా నిర్వహించారు

ఐటిఐ కళాశాలలో నీటి సౌకర్యం కల్పించిన మండే పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం…

ఐటిఐ కళాశాలలో నీటి సౌకర్యం కల్పించిన మండే పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో స్థానిక ఐటిఐ కళాశాలు.విద్యార్థులకు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుంటే కొత్తగా ఎన్నికైన నూతన మండేపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి పై అధికారులతో నాయకులతో. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పార్టీ నాయకులతో మాట్లాడి అధికారులకుతొవిద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించాలనినీటిసౌకర్యం పై చర్చించి ప్రభుత్వ నిధుల నుండి బోరు మంజూరు చేయించి ఈరోజు బోరు వేయించడం జరిగింది. దీనిపై మండపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చొరవ తీసుకొని ఐటిఐ కళాశాల విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించి బోరు మంజూరు చేయించడంతో విద్యార్థులు పాలకవర్గానికి.ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ. మాకు కొన్ని రోజులుగా నీటి కష్టాలు ఉండడంతో ఈరోజు పరిష్కారం లభించడంతో.కళాశాల విద్యార్థులు అందరూ సంతోషంగా వ్యక్తం చేశారు. ఇట్టి నీటి బోరురావడానికి కృషిచేసిన మండపల్లి సర్పంచ్ గాధగోనిసాగర్. ఉప సర్పంచ్ వ్యాస సందీప్. వార్డు మే o బర్లు కోమ్మటమల్లేశం. తిమ్మానగరందేవదాస్. సింగం శశి కుమార్. మధు. గ్రామపంచాయతీ పాలకవర్గానికిప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version