గత బీఆర్‌ఎస్ పాలన గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడింది..

గత బీఆర్‌ఎస్ పాలన గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడింది

వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

వర్ధన్నపేట,(నేటిధాత్రి):
వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు &వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబిడి రాజ్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ లు విలేఖర్లతో మాట్లాడుతూ.
గత బి.ఆర్.ఎస్ పాలనలో హరిజన – గిరిజనులపై దాడులు జరిగినవి ఎస్టీ సంక్షేమ అభివృద్ధి కోసం పది సంవత్సరాల కాలములో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలే,ఎస్సీ -ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి హరిజన ,గిరిజన కాలనీ, గూడలా లో అభివృద్ధి చేస్తే గత బి.ఆర్.ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసి ఎస్సీ, ఎస్టీ కాలాని, గూడ లలో ఒక్క పైసా పనికూడా చేయలేదు తండాలు గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు అయితే బి.ఆర్. ఎస్ పాలనలో పంచాయతీ కార్యాలయా లు కట్టించ లే,అక్కడ ఏలిన సర్పంచ్ లకు నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వక పోయే సరికి ఆత్మహత్య లు చేసుకోవడం జరిగింది.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గిరిజనుల సంక్షేమ ము కోసం 17,169 కోట్లు కేటాయించి మూత వేయబడ్డ కార్పొరేషన్ ,తెరిపించి ,గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది,గత బి.ఆర్.ఎస్ పాలనలో సమగ్ర సర్వే చేసి బయట పెట్టకుండా దాస్తే,కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుల గణన విషయంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నది. కులగణన ద్వారా భవిష్యత్ లో ఎస్టీ,ఎస్సీ,బిసి, మైనార్టీ వర్గాల ప్రజలకు ఉపయోగ కారంగా ఉంటుంది.కనీసం గిరిజన యునివర్సిటీ కట్టని చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీ ది.
బిసి లుగా కోన సాగిన గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది,1975 లో గిరిజనులకు వ్యవసాయ భూములు ఇచ్చి,ఇండ్ల ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కట్టించింది, వ్యవసాయం చేసుకోవడం కోసం బ్యాంకులను జాతీయం చేసి పెట్టుబడులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ,పోడు భూముల కోసం 1/70 యాక్ట్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది,గిరిజనుల కోసం కాంగ్రెస్ పాటుపడింది,మరి గిరిజనుల కోసం బి.ఆర్.ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందో గమనించాలని గిరిజన సోదరులను కోరుచున్నాం.

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ సభ్యులు రఘునాథరెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17 వ వార్డ్ విద్యానగర్ ఏరియాలో 4.75 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో 92 మీటర్ల సిసి రోడ్డు పనులకు గురువారం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి లు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. 17వ వార్డు అభివృద్ధి కోసం 25 లక్షల నిధులతో డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను చేయించడం జరుగుతుందని తెలిపారు.బడ్జెట్ లేని కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. ఇకనుండి అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయించారని త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, రవీందర్, వెంకటేష్ కిష్టయ్య, రాజయ్య, కళ్యాణ్, కనకరాజు, వేణు, రమేష్, విజయ, పుష్ప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం.

అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం

దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్

ఎమ్మార్వో,ఎంపిడిఓ కలిసిన కాంగ్రెస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా దొంతి మాధవరెడ్డి పనిచేస్తున్నారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో తహశీల్దార్ రాజేశ్వర్ రావు,ఎంపిడిఓ అరుంధతి,ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులకు బుదవారం మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.

Congress ranks meet MRO, MPDO

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చుక్క రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు తీసుకెళ్తూన్నా ప్రజా నాయకుడు దొంతి మాధవ రెడ్డి అని అన్నారు. పేదోళ్ళ సొంతింటి కల నెరవేర్చేందుకుగాను ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నియోజకవర్గంలో రేషన్ కార్డ్ ఇవ్వలేదని,నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇంచ్చిందన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా ఉచిత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూన్నా ఘనత రాష్ట్ర ప్రభుత్వందే అని పేర్కొన్నారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజ్మీరా రవీందర్, ఉపాధ్యక్షులు నల్ల వెంకటయ్య, కామ శోభన్ బాబు,కోశాధికారి జంగిలీ రవి,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మ లక్ష్మయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఎంపిటిసి సభ్యులు బొల్లపెల్లి రాము,నియోజకవర్గ యూత్ నాయకులు డ్యాగం శివాజీ,గిన్నె స్వామి, విరాట్, రాజేశ్వర్ రావు,తదితర మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*అమరావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌..

*ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్ ప్రారంభోత్స‌వంలో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T133904.551.wav?_=1

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 30:

ఆనాడైనా ఈనాడైనా క్రీడ‌ల అభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న నేతృత్వంలో క్రీడ‌ల బ‌లోపేతానికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు అన్నారు. తిరుప‌తిలోని శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ నిర్వ‌హిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌-2025(సీనియ‌ర్ మెన్ అండ్ ఉమెన్‌) పోటీల‌ను మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మతో
ఆయ‌న కలిసి ప్రారంభించారుతొలుత ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేసుకుని వారితో బ్యాడ్మింట‌న్ ఆడి పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్రారంభోత్స‌వ స‌భ‌లో క్రీడాకారుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. సీఎం చంద్ర‌బాబునాయుడు మొద‌టి నుంచి క్రీడ‌ల‌కు అధిక ప్రాధాన్యత‌ క‌ల్పిస్తున్నార‌న్నారు. త్వ‌ర‌లోనే అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేస్తార‌ని వివ‌రించారు. టీటీడీ, శాప్ నిధుల‌తో ఆనాడే శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సును ఆయ‌న నిర్మించార‌న్నారు. ఏపీ నుంచి అంత‌ర్జాతీయస్థాయి క్రీడాకారుల‌ను త‌యారుచేయాల‌నే సంక‌ల్పంతో అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌కు స్థ‌లాలనిచ్చి అకాడ‌మీల స్థాప‌న‌ల‌కు కృషి చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడని కొనియాడారు. గత ముప్పై ఏళ్లుగా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్, ఫెడ‌రేష‌న్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తూ బ్యాడ్మింట‌న్ క్రీడ‌ను ముందుకు తీసుకెళ్ల‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు సీఎం కృషి చేస్తున్నార‌న్నారు. అత్యుత్త‌మ క్రీడా విధానాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నార‌న్నారు. అనంత‌రం తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మ మాట్లాడుతూ ఏపీలో క్రీడాభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌లు అపార‌మైన కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న క్రీడాస‌దుపాయాలు, క్రీడా ప్రోత్సాహ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకుని క్రీడాకారులు భ‌విష్య‌త్తులో మ‌రింత మెరుగ్గా రాణించాల‌ని సూచించారు. సీఎం చంద్ర‌బాబు ఆశ‌యాల‌కు అనుగుణంగా క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీఓ శ‌శి, బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల..

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో సంకల్ప్ ల్యాబ్ ను ప్రారంభించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
విద్యార్థులు వారి విద్య విధానాలను అలవర్చుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
శుక్రవారం మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో పీఎం శ్రీ నిధి ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి ( సంకల్ప్) ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు.

Collector Dr. Satya Sarada

విద్యాలయానికి ముఖ్య అతిథిగా చేరుకున్న కలెక్టర్ డాక్టర్ సత్య శారదను ప్రిన్సిపల్ పూర్ణిమ,ఎన్సిసి స్కౌట్ గైడ్ విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు ప్రత్యేకమైన ప్రయోగశాలను పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాబ్ లో విద్యార్థులు రోబోటిక్స్ ఐ ఓ టి, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువల్ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని అన్నారు.కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా సంభాషించి ఇష్టపూర్వకంగా చదివి భావిభారత పౌరులు కావాలని కోరారు.విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ భయాన్ని సంకోచతత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ లో భాగంగా విద్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు సురేష్ రామలింగయ్య ఉపాధ్యాయులు,విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి యూత్ కాంగ్రెస్‌ మద్దతు..

విద్యాభివృద్ధికి యూత్ కాంగ్రెస్‌ మద్దతు — విద్యార్థులకు పుస్తకాల పంపిణి

*వర్దన్నపేట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కెఅర్ నాగారాజు మరియు *వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె.అర్ దిలీప్ రాజ్ ఆదేశాలమేరకు

వర్దన్నపేట (నేటిధాత్రి):

ఉప్పరపల్లి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలను పర్యావెక్షించిన *వర్ధన్నపేట మండల్ యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్
ఇటీవల వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో అంగన్వాడీ,హై స్కూల్ లో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోని అనేక వస్తువులు ధ్వంసం చెయ్యడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్న వర్దన్నపేట యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్ ఉప్పరపల్లి హై స్కూల్ కి వెళ్లి స్టాప్ తో మాట్లాడి ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది అలాగే విద్యార్థులకు పుస్తకాల పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి, దామెర ప్రశాంత్, ఎండీ మాక్సూద్, దాడి రాజు, రసీద్ ,గ్రామ మరియు యూత్ నాయకులు పాల్గొనడం జరిగింది…….

గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం..

గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా మీడియాతో మురుగన్

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 23:

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంట ఊరు తిరుపతి గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి ప్రాయంలో నడిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు గంటా వూరు బీసీ కాలనీ వాసులు ఇదే క్రమంలో భాగంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈరోజు మీడియా సమావేశంలో తెలిపారు వివరాల్లోకి వెళ్తే గడిచిన 20 సంవత్సరాలకు ముందు గంటా వూరు బీసీ కాలనీలో చిన్న ఆలయం ఉండేది అభివృద్ధి చేస్తే ప్రసిద్ధి చెందిన ఆలయంగా అప్పుడే వెలుగులోకి వచ్చేది కానీ ఎవరు అభివృద్ధి చేయకపోవడంతో అలాగే ఉండిపోయింది,ఈ ఆలయాన్ని తమిళనాడు రాష్ట్రానికి
చెందిన మురుగన్ అభివృద్ధి ప్రయాయంలో నడిపిస్తున్నారు,
పలమనేరులో ఉన్న గంగమ్మ గుడి కి దీటుగా తీసుకెళుతున్నారు, ఈ సందర్భంగా ఆయన
మీడియా సమావేశంలో
మాట్లాడుతూ
ఎన్నో కష్టాలు పడుతున్న తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ గుడి ప్రాంగణంలో తన ఆర్థిక పరిస్థితుల గురించి ఆవేదన చెందుతున్న తరుణంలో సాక్షాత్తు అమ్మవారు తనకు ఎంతో సహకరించి తన ఆర్థిక ఇబ్బందులను పోగొట్టుందని అప్పటినుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే దేయంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు, అదే క్రమంలో తన ముందు సహకారం అభివృద్ధి కోసం ముందుకు వచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలుపుతూ ఈ గుడికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచే అభివృద్ధి చేసి చూపుతున్నట్లు ఆయన తెలిపారు, ఇప్పటికే దాదాపు ఆలయ అభివృద్ధి చేశామని ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సహకరిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేసి అమ్మవారి ఆలయాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తామని తెలిపారు, ఇందుకు సహకారంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు, ఈ కార్యక్రమానికి గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీ మెంబర్స్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు..

జమ్మికుంటలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య

 

జమ్మికుంటలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం

జమ్మికుంట (నేటిధాత్రి)

ఈరోజు జమ్మికుంట లో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అనే నిదానంతో వికాస తరంగిణి ఆరోగ్య వికాస్ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ ఎం మౌనిక పద్మ సారిక గారి ఆధ్వర్యంలో 108 మందికి గర్భాశయ ముఖ ద్వారం మరియు మహిళల ఛాతి పరీక్షలు 108 మందికి ఉచిత పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు. బచ్చు వీర లింగం. పుల్లూరి ప్రభాకర్. హరికృష్ణమాచార్యులు. కొల్లూరు శ్రీనివాస్.అంతం రాజిరెడ్డి.ఎదులాపురం వెంకటేష్. శీలం శ్రీనివాస్.ఎలివేణి సమ్మయ్య. మహిళా వికాస అధ్యక్షులు కర్ర రజిత దేవి. వికాస తరంగిణి జమ్మికుంట శాఖ సభ్యులు మహిళా సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఎన్నారై దాత ఒక లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయం అధ్యక్షుడు సైపా సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం సేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం కూతురు అల్లుడు ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు దేవాలయ పున నిర్మాణంలో భాగంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 దేవాలయ కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దాత ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు,ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం లను అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రెడ్డి,కోశాధికారి రవీందర్,దొడ్డ వేణు,బండారి చంచారావు,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా,దాత కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

అభివృద్ధి పనులపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా..

#పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

#చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై దుష్ప్రచారం.

#మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినారని వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని గ్రామల అభివృద్ధిని మేమే చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదని బిఆర్ఎస్ మండల నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ అన్నారు. శనివారం మండలంలోని నారక్కపేట గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి సుమన్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని గాలికి వదిలేసి వారు మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఇల్లు లేని పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, దళితులకు దళిత బంధు ఇస్తామని, రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని ఏ ఒక్కటి ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పిన కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నామని భ్రమలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ తో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో చేతి గుర్తుపై గెలిచి ఎంపీపీగా గద్దెనెక్కి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి అర్హత భానోత్ సారంగపాణి కు లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేస్తూ పేదల పక్షాన ప్రభుత్వం అండగా ఉంటుందని దానికి నిదర్శనమే రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్ ప్రయాణం, ఉచిత కరెంటు, మహిళలకు వడ్డీలేని రుణాలు, కుల సంఘాలకు భవనాలు, మహిళా సంఘాలకు భవనాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజన వసతి, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పేదవాడికి సన్న బియ్యం లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ నాయకులు పబ్బంగడుపుతున్నారని. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఇవేమీ ప్రతిపక్ష నాయకులకు కనబడటం లేదని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో మేము చేపట్టిన అభివృద్ధి పనులను నిరూపించడానికి మేము బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా దమ్ముంటే రండి ఇప్పటికైనా ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధ ప్రచారాలను మానుకోండి లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు .ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు అడపరాజు, ప్రధాన కార్యదర్శి వక్కల యోగేశ్వర్, మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, మాజీ ఎంపీటీసీ గుండాల రాజ కొమురయ్య నాయకులు కోడూరు రాయ సాబ్, పాక కుమారస్వామి, అడిగిచెర్ల శ్రీనివాస్ ,కుంచాల రాజు, చిందం కుమారస్వామి, మెరుగు మల్లయ్య, వైనాల మొగిలి ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే జిఎస్ఆర్.

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే జిఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-25.wav?_=2

భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి రూరల్ మండలం ఆజంనగర్, గొల్లబుద్దారం గ్రామాలల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆజంనగర్ గ్రామంలో రూ.10 లక్షలతో శ్రీ శివ కేశవస్వామి దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లబుద్దారం రూ.50 లక్షలతో శ్రీ రామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రామాలయంలో ఎమ్మెల్యే మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండలం అధ్యక్షుడు సుంకర రామచంద్రయ్య తాసిల్దార్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక.

*గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక..

*సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 17:

అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ మిషన్ కి వికాసిత్ భారత్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాత్ర 2047 లో భాగంగా గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ప్రత్యేకంగా గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో రాజన్న ఫౌండేషన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీ లోని లిమిరోడియన్ హోటల్ నందు ప్రముఖ సి ఎస్ ఆర్ మార్కెటింగ్ మరియు బ్రాండ్ హానాక్ సంస్థ వారిచే గ్లోబల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డుని రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్
కేంద్ర ఉపరితల మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ముఖ్యంగా రాజన్న ఫౌండేషన్ ద్వారా నిర్మించిన వాటర్ చెక్ డాన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఉచిత వైద్య సేవలు,తాగునీటి సౌకర్యాలు మరియు పశుసంవర్ధక ఆసుపత్రి ఇతర సేవలు అందించడం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడంలో రాజన్న ఫౌండేషన్ యొక్క చొరవలకి గానూ ఈ అవార్డును అందించి గౌరవించినది.
ఈ అవార్డు అందుకోవడం పట్ల రాజన్న ఫౌండేషన్ ఫౌండర్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో మా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకోవడం మాకు సంతోషంగా ఉంది మా కార్యక్రమాలు ద్వారా గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయని మా సంస్థ ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని తద్వారా మా వంతు కృషి చేస్తున్నాము ముందు కూడా చేస్తుంటాము మరియు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల అమర రాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం ద్వారా మా అమర రాజా రాజన్న ఫౌండేషన్ సంస్థ ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించేందుకు రాజన్న ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం మరియు అదేవిధంగా రాబోవు కాలంలో రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తామని అని అన్నారు..

ఇందిర సౌర గిరిజన వికాసం స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం.

ఇందిర సౌర గిరిజన వికాసం స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-1-1.wav?_=3

ఇందిరా సౌర గిరిజన వికాసం స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోడు భూములు ఉన్న గిరిజనలు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. పట్టా పాసు పుస్తకం, కులం సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలని పేర్కొన్నారు.

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన.

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో పర్యటించారు. రూ.52 లక్షలతో వివిధ గ్రామాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ధర్మారావుపేట గ్రామంలో ఎమ్మెల్యే యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలోని శివాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బసవరాజుపల్లి గ్రామంలో యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, రూ.12 లక్షలతో నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. గొల్లపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో పంచాయతీరాజ్ రోడ్డు నుండి పోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్దే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి, రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, ఎంపీడీవో ఎల్ భాస్కర్ మండల అధ్యక్షుడు జిల్లా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఎంపీటీసీ భవిత సుధాకర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్ల మల్లయ్య భాస్కరరావు చింతకుంట్ల శ్రీను పైసా మొగిలి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గా ప్రసాద్

నేటి ధాత్రి చర్ల

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలను తీసుకుని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రగతికి ఆయన కృషి ఎంతో అభినందనీయమని తెలియజేశారు

శ్రీసిటీని సందర్శించిన కేంద్ర గృహనిర్మాణ శాఖ

*శ్రీసిటీని సందర్శించిన కేంద్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం..

*కార్మికుల గృహ నిర్మాణాలు..

*సుస్థిర పట్టణాభివృద్ధికి హామీ..

తిరుపతి నేటి ధాత్రి

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ కటికితల, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి (అమృత్ పథకం)ఇషా కాలియా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎన్.మౌర్య, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్ తో కలసి బుధవారం శ్రీసిటీని సందర్శించారుశ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ఆయనకు సాదర స్వాగతం పలికి,శ్రీసిటీ ప్రణాళిక, ప్రస్థానం, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు.

 

 

 

చర్చల సందర్భంగా, శ్రీసిటీలో అభివృద్ధి చెందుతున్న సామాజిక వసతులపై ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. గృహ సముదాయాలు, విద్యా వసతులు, షాపింగ్ కేంద్రాలు, ఇతర కీలక సౌకర్యాల గురించి హైలైట్ చేశారు.
అలాగే ఇక్కడ అమలు చేస్తున్న సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ, మురుగునీటి రీసైక్లింగ్,ఘన వ్యర్థాల నిర్వహణ, హరితహిత చర్యలు,ఇతర సుస్థిరత కార్యక్రమాలను వివరించారు. టౌన్‌షిప్ ల అభివృద్ధి ద్వారా “వాక్ టు వర్క్” ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, ఇందుకోసం అవసరమైన సహకారం అందించాలని కార్యదర్శికి విన్నవించారు.

 

 

 

ప్రస్తుత పారిశ్రామిక కార్యకలాపాలు,భవిష్యత్తు విస్తరణ వ్యూహాలు, మౌళిక సదుపాయాలు,నివాస గృహాల డిమాండ్ ముఖ్యంగా డార్మిటరీలు మరియు తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన అద్దె గృహాలపై శ్రీనివాస్ లోతైన చర్చల్లో పాల్గొన్నారు. ఇతర పారిశ్రామిక ప్రాంతాలలో విజయవంతమైన గృహ ప్రణాళికల నమూనాలను అధ్యయనం చేయాలని, కేంద్ర గృహ నిర్మాణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన శ్రీసిటీ బృందానికి సూచించారు. అనంతరం, పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల్లో పాల్గొన్న ఆయన, ప్రధానంగా మహిళా ఉద్యోగులకు చౌకధర అద్దె గృహాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ సహకారం, ఇతర అంశాలపై చర్చించారు. సమగ్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణాల విషయంలో మంత్రిత్వ శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

 

 

 

కేంద్ర గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు శ్రీసిటీ పర్యటనకు రావడం తాము గౌరప్రదంగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. వారి విలువైన సూచనలు శ్రీసిటీ అభివృద్ధికి మరింత దోహదపడతాయని, ముఖ్యంగా సామాజిక మౌళిక సదుపాయాలుగృహ వసతులను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల ద్వారా మౌళిక సదుపాయాలు మరియు కార్మిక నివాసాలకు సంబంధించి వారు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం దక్కిందన్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్ శ్రీసిటీ పరిసరాలతో పాటు ఆల్‌స్టోమ్‌ పరిశ్రమలో తయారు అవుతున్న మెట్రో కోచ్ ల తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడ పరిశ్రమ పనితీరు, ఇతర పారిశ్రామిక మౌళిక వసతులను పరిశీలించారు. అద్భుత ప్రణాళిక, కార్యాచరణతో రూపుదిద్దుకున్న శ్రీసిటీ పారిశ్రామిక మరియు ఆర్థిక కేంద్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందంటూ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.ఇక్కడి ప్రజలు,ఈ ప్రాంతం,దేశ శ్రేయస్సుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. శ్రీసిటీ మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలను తమ మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శితో పాటు ఇతర సీనియర్ అధికారులు, సూళ్లూరుపేట
ఆర్ డి ఓ,
కిరణ్మయి పాల్గొన్నారు.

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని హద్నుర్ .

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని హద్నుర్ – రాంతీర్థ్ రోడ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్: మండల పరిధిలోని హద్నుర్ గ్రామం నుండి రాంతీర్థ్ వెళ్ళే రోడ్ కొన్ని దశాబ్దాలుగా మరమత్తులు లేఖ, కొత్త రోడ్ వేయాలేఖ నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద పెద్ద కాంక్రీట్ రాళ్లు వాహనాలకు తగిలి పంచర్ కావడం, ద్విచక్ర వాహనాలు మరియు పెద్ద వాహనాలు వెళ్లుటకు రోడ్ కి ఇరు వైపుల ఉన్న చెట్లు, ముళ్ళ పొదలు రోడ్ పైకి వాలి ఉండడం వల్ల ఎలాంటి వాహనాలు వెళ్ళాక పోవడంతో రాంతీర్థ, గుంజోట్టి, వడ్డి, మరియు శేంశలుపూర్ గ్రామాలకు వెళ్ళే గ్రామస్థులకు పలు ఇబ్బందులు కలుగుతున్నాయి.

 

దశాబ్దాలుగా పలు పార్టీల ప్రభుత్వాలు మారిన ఎలాంటి మార్పులు లేవు, పలు మార్లు ఎంపిడిఓ, కలెక్టర్ గార్లకు, అధికారులకు విన్నవించుకున్న లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పలు హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వంలో కూడా ఏమీ ఫలితం లేదని ఈ యొక్క నాలుగు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి అభివృద్ధికి టాటా గ్రూప్‌తో కీలక ప్రతిపాదనలు..

తిరుపతి అభివృద్ధికి టాటా గ్రూప్‌తో కీలక ప్రతిపాదనలు..

ఎంపీ మద్దిల గురుమూర్తి..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 04:

ముంబయిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను తిరుపతి పార్లమెంటు సభ్యులు డా. మద్దిల గురుమూర్తి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి అభివృద్ధికి సహాయపడే ముఖ్య అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు.

*తిరుపతిలో టాటా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, బిపిఓ ఏర్పాటుకు విజ్ఞప్తి..

తిరుపతి జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా, ఐజర్, ఐఐటి, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీలతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఈ ప్రాంత యువతకు అత్యాధునిక రంగాలు అయినటువంటి డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, సేవా రంగాలలో శిక్షణ కల్పించే టాటా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అవసరమని తెలిపారు.అదే విధంగా బిపిఓ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.

*కలంకారి ప్రాచీన కళకు టాటా ఫ్యాషన్ ద్వారా ప్రోత్సాహం ఇవ్వండి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రాచీన కళ అయిన కలంకారీ నేటి ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తగిన గుర్తింపు పొందడం లేదని ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన కళను పునరుజ్జీవింపజేసేందుకు టాటా క్లిక్, వెస్ట్సైడ్ వంటి టాటా ఫ్యాషన్ సంస్థల ద్వారా కలంకారీ ఉత్పత్తులను ఆధునిక డిజైన్‌లతో తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కలంకారీ కళాకారులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయని, అలాగే భారతీయ సాంస్కృతిక సంపదను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేసే అవకాశం ఉంటుందన్నారు.

తిరుపతి నుండి కువైట్, గల్ఫ్ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించండి..

రాయలసీమకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, అయినా తిరుపతి నుండి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవని ఎంపీ గుర్తు చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా తిరుపతి నుండి కువైట్, కతార్, సౌదీ అరేబియా, యూఏఈలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు.ఇది స్థానికుల ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా, భక్తుల రాకపోకలు, వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ మూడు ప్రతిపాదనలు తిరుపతి ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ఎంపీ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ కి వివరించగా సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు.

షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన..

మహదేవపూర్

జూలై 3 నేటి ధాత్రి

 

 

 

 

షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన భూమి కబ్జా పై ఎంపీడీవోకు ఫిర్యాదు

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ

మహాదేవపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ మరియు షెడ్యూల్ కులాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిని కబ్జా చేయడం సరికాదని మహనీయులు మనకు హక్కులు కల్పిస్తే వారి పేరున ప్రభుత్వాలు స్థలాలు ఇస్తే మహనీయుల స్థలాలను కబ్జా చేయడం సరికాదని షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కబ్జా చేయడం చాలా దుర్మార్గమని గతంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు పోయిన ఇప్పటివరకు స్పందించకపోవడం అధికారుల యెుక్క పనితీరు ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన స్థలాలు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యువసేన మండల అధ్యక్షులు మంథని రవితేజ ఎడపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చేకూర్తి శ్రీనివాస్ సీనియర్ నాయకులు నల్లబుగా ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు

కేజిబివి విద్యాలయాల్లో అభివృద్ధి .

కేజిబివి విద్యాలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.

ఎంజీఎంలో మౌలిక సదుపాయాల మరమ్మత్తుల పనులను ప్రారంభించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 10 కేజీబీవీలలో అవసరమగు డార్మటరి,యూరినల్స్ , బాత్రూమ్స్, ఆరో ప్లాంట్స్ పనులు చేపట్టాలని,ఖానాపూర్,దుగ్గొండి, నల్లబెల్లి కేజీబీవీలలో
కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. రాయపర్తి కేజీబీవీలో డార్మిటరీ విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.మిగిలిన కేజీబీవీ లలో కూడా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొన్న విధంగా సీలింగ్ మరమ్మత్తులు, అంతర్గత మరమ్మత్తులు తదితరులు పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి, ఎంజీఎం పర్యవేక్షకులు కిషోర్, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి ఫ్లోరెన్స్,ఇరిగేషన్ అధికారి సునీత, ఆర్ఎంఓ మాగంటి అశ్వినితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version