హై కమాండ్‌..రేవంత్‌కు ఫ్రీ హాండ్‌!

`అందరినీ దారిలో పెట్టే బాధ్యత!

`అన్ని విధాలుగా పూర్తి అధికారం

`పని చేయని వారిని పక్కన పెట్టండి

`పార్టీ ప్రతిష్టకు భంగవాటిల్లితే ఉపేక్షించొద్దు

`ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించొద్దు

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికలలో గెలిచి తీరాలి

`ఏ విషయంలోనైనా అంతిమ నిర్ణయం సిఎం. రేవంత్‌కే

`రాష్ట్ర వ్యవహారాలలో రేవంత్‌ నిర్ణయం అందరూ ఆమోదించాల్సిందే

`మెతక వైఖరి అవసరం లేదని రేవంత్‌ కు సూచించిన హై కమాండ్‌

`అధిష్టానం పిలిస్తే తప్ప మంత్రులెవరూ డిల్లీకి రావొద్దు

`పార్టీ పరంగా ఎవరు హద్దు దాటినా వేటు వేయండి

`ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పార్టీ నాయకులు మాట్లాడినా సహించకండి

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హైకమాండ్‌ పూర్త స్ధాయి ఫ్రీ హాండ్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై పాలన అంటే ఎలా వుంటుందో, రేవంత్‌ రెడ్డి పవర్‌ ఎలా వుంటుందో తెలిసే సమయం వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఇంత కాలం ఆయనకు పూర్తి స్దాయిలో వెసులుబాటు లేదన్నది కొంత వరకు సత్యం. కాని ఇటీవల ఆయనపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో హైకమాండ్‌ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే పూర్తి స్దాయిలో సిఎం.రేవంత్‌ రెడ్డికి ఫ్రీ హాండ్‌ ఇస్తే తప్ప వివాదాలు సమసిపోవు అనే ఆలోచనకు వచ్చింది. అందుకే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇకపై తన మార్కు పాలనను చూపిస్తానని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం సిఎం. రేవంత్‌ రెడ్డి మంత్రుల్లో ఎవరు తనపై అసత్య ప్రచారాలు సాగేలా వ్యవహరిస్తున్నారన్న దానిపై చాల సేపు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిరది రేవంత్‌ రెడ్డి. పార్టీని అదికారంలోకి తీసుకురావడంలో అందరికన్నా కీలకభూమిక పోషించింది రేవంత్‌ రెడ్డి. అధిష్టానం ఆషామాషీగా రేవంత్‌రెడ్డిని సిఎం. చేయలేదు. అదిష్టానానికి అన్నీ తెలుసు. రేవంత్‌ రెడ్డి రాజకీయ వ్యూహాలు తెలుసు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడల్లో కేసిఆర్‌ ఎలా చిక్కుకున్నారో తెలుసు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సిఎం. చేసింది. ఈ మాత్రం అవగాహన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరికీ తెలుసు. అయినా తాము ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష మేరకు కొ ంత మంది మంత్రులు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా సిఎం. దృష్టికి వచ్చింది. పైగా వ్యక్తిగతంగా సిఎం. రేవంత్‌రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నది గుర్తించారు. అందుకే మంత్రి వర్గ సమావేశంలో మంత్రులందిరి పనితీరుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. పైగా ఆయా మంత్రుల తీరుపై కూడా అదిష్టానానికి సమగ్రమైన నివేధిక కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వున్న క్యాబినేట్‌లో చాలా మంది మంత్రులు సిఎం.కు ఇబ్బందికరమైన పరిస్ధితులు తెచ్చిపెట్టాలనే చూస్తున్నారు అనేది వెల్లడౌతోంది. పైగా తమ ఇష్టాను సారం కూడా కొంత మంది మంత్రులు పనిచేస్తున్నారు. అందుకే ఇలాంటి ఇబ్బ ందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే తాము పదువుల్లో వున్నామన్న విషయాన్ని చాలా మంది మంత్రులు మర్చిపోతున్నట్లున్నారు. తమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా కొంత మంది అనుకుంటున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ప్రోద్భలం వల్లనే కొంత మంది ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్‌ పెట్టేందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫరావా లేదన్నట్లు అధిష్టానం కూడా తేల్చిచెప్పినట్లు కూడా సమాచారం అందుతోంది. రాజకీయంగా సిఎం. రేవంత్‌రెడ్డి వ్యూహాలు ఇప్పుడున్న మంత్రులకు ఎవరికీ తెలియవు. అర్ధం కావు. అందుకే రేవంత్‌ రెడ్డి పిపిసి అధ్యక్షుడు అయిన నుంచి ఆయనను తప్పు పడుతూనే వున్నారు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడలు ఎలా వున్నాయో ఒక్కసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. గత ఎన్నికల ముందు నుంచి కూడా సిఎం.రేవంత్‌రెడ్డి వేసిన ప్రతి స్కెచ్‌లోనూ కేసిఆర్‌ చిక్కుకుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం కూడా కేసిఆర్‌ చెప్పలేకపోయాడు. ఇక్కడ ఒక్క విషయం సూటిగా చెప్పుకోవాలి. గత ఎన్నికలు ముందు రెండేళ్లుగా కేసిఆర్‌ అంటేనే జనం చీ కొట్టేలా చేయడంలో రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. రైతులు కూడా కేసిఆర్‌కు వ్యతిరేంగా మారడంలో కీలక భూమిక పోషించారు. రైతుల ఓట్లు బిఆర్‌ఎస్‌కు పడకుండా నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని కేసిఆర్‌ను దెబ్బకొట్టిన ఘనత రేవంత్‌ రెడ్డిది. పల్లె సీమలను భాగ్య సీమలు చేశానని గొప్పలు చెప్పుకున్న కేసిఆర్‌కు ఆ పల్లెలే చుక్కలు చూపించేలా చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది. ఇలా ఏ పల్లె జనాన్ని తనకు ఎదురులేదు. తిరుగులేదు. అనుకొని ప్రజలు కూడా కలవకుండా పాలన సాగించిన కేసిఆర్‌ను ఫామ్‌ హౌజ్‌కు పరిమితం చేసి, కోలుకోలేని దెబ్బలు కొడుతున్న నాయకుడు, పాలకుడు రేవంత్‌ రెడ్డి. ఒకప్పుడు కేసిఆర్‌ వ్యూహాం ముందు అప్పటి నాయకులు చతికిలపడేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేక కేసిఆర్‌ గింగిరాలు తిరుగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు కేసిఆర్‌ను స్ధానం లేకుండా చేశారు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ను రేవంత్‌ రెడ్డి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నుంచి తన మార్కు రాజకీయ దెబ్బ చూపిస్తూ వస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కాంగ్రెస్‌కు వీక్‌ అభ్యర్ధిని నిలబెట్టి బిఆర్‌ఎస్‌ను ఓడిరచారు. అప్పుడు రేవంత్‌రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కాని రేవంత్‌ తన వ్యూహాంలో విజయం సాధించారు. ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్‌ అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే అంతిమంగా బిఆర్‌ఎస్‌ గెలుస్తుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి,ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కేసిఆర్‌ను దెబ్బకొట్టారు. కేసిఆర్‌కు మొదటిసారి ఓటమి రుచి చూపించారు. తర్వాత దుబ్బాకలో ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు. అక్కడా బిఆర్‌ఎస్‌ పతనాన్ని రచించారు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమిని రేవంత్‌ రెడ్డి రచించారు. విజయం సాదించారు. సిఎం. అయ్యారు. అందుకు ముందుగా అమలు చేసిన స్కెచ్‌నే ఇప్పటికీ రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. కాని కేసిఆర్‌ అదే ఉచ్చులో పదే పదే చిక్కుకుంటున్నారు. దమ్ముంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ ఇచ్చి గెలిపించుకో అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన సవాలును స్వీకరించి గత ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసినా అదే ఎమ్మెల్యేలకు కేసిఆర్‌ టిక్కెట్లు ఇచ్చి ఓటమిని తానే కొని తెచ్చుకునేలా చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలను మార్చకపోతే పార్టీ ఓడిపోతుందని ఎంతో మంది సీనియర్లు కేసిఆర్‌కు చెప్పినా వినలేదు. రేవంత్‌ రెడ్డి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్టీని ఓటమికి కేసిఆరే కారకులయ్యారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసినా కేసిఆర్‌ పసిగట్టలేకపోతున్నారు. రేవంత్‌రెడ్డి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడని తెలిసినా కేసిఆర్‌ చేతులెత్తేసే రాజకీయమే చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా రేవంత్‌రెడ్డి అనుసరించినా ఇప్పటికీ కేసిఆర్‌ పసిగట్టలేపోయారా? లేక తెలిసే వదిలేస్తున్నారా? ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఎన్నికలలో కేసిఆర్‌ ప్రచారానికి రాకుండా కట్టడి చేయడంలో రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలే నిదర్శనమని చెప్పకతప్పదు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్‌లో కేసిఆర్‌ ప్రచారానికి రావడానికి ఇష్టపడం లేదు. జూబ్లీహిల్స్‌ ఓడిపోయే సీటుకు ప్రచారం చేసి మరింత పరువు తీసుకోవడం కన్నా, ప్రచారానికి దూరంగా వుండడమే మేలనే పరిస్ధితికి కేసిఆర్‌ను నెట్టి వేయడంతో కూడా రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. దానికి తోడు తాజాగా రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ ఓట్లను గుండు గుత్తగా కాంగ్రెస్‌కు పడేలా చేసుకోవడం కోసం మరో ఎత్తుగడ వేస్తున్నారు. ఇండియన్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఇప్పటి వరకు మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు లేదు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ఓట్లను బిఆర్‌ఎస్‌ వైపు మళ్లకుండా చేసేఎత్తుగడ వేశారు. ఇప్పటికే ఎంఐఎంను ఒప్పించి అభ్యర్దిని నిలబెట్టకుండా చూసుకున్నారు. ఎంఐఎం సూచనల మేరకు నవీన్‌ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఇలా రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు కేసిఆర్‌కు మింగుడు పడడం లేదు. వ్యక్తిగతంగానే నవీన్‌ యాదవ్‌కు వేలాది ఓట్లు వున్నాయి. ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేస్తేనే 20వేల ఓట్లకు పైగా సాదించారు. ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో రెండో స్ధానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎంఐఎంల సపోర్టుతో కలుపుకుంటే నవీన్‌యాదవ్‌కు భారీ మెజార్టీ ఖాయంగానే కనిపిస్తోంది.. మరో వైపు సినీ ఇండ్రస్ట్రీనీ ఆకట్టుకోవడం కోసం రేవంత్‌ రెడ్డి రంగంలోకిదిగారు. ఇలాంటి వ్యూహాలు ఏనాడు సీనియర్లైన నాయకులు ఎవరూ అమలు చేయలేదు. గుడ్డిగా కేసిఆర్‌ వేసిన ఎత్తుల్లో చిక్కుకున్నారు. కాని రేవంత్‌రెడ్డి వేసే ఎత్తులు అర్ధం కాక బిఆర్‌ఎస్‌ కూడా చతికిలపడిపోతోంది. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దించే కుట్రలకు ఎంత మంది తెరతీసినా వాటిని పటా పంచెలు చేయగల రాజకీయ యుక్తి, శక్తి రేవంత్‌రెడ్డికి వుంది. పార్టీ కోసం ఆయన పడిన శ్రమ, అదికారంలోకి తెచ్చేందుకు ఆయన పడిన కష్టం సున్నితంగా వదిలేసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. ఇకపై సీనియర్‌ మంత్రులైనా, ఇతర నాయకులైనా సరే ఉపేక్షించేందుకు సిఎం. సిద్దంగా లేరు. ఏ మాత్రం మంత్రులు సరిగ్గా పని చేయకపోయినా తప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం వచ్చి రెండేళ్ల కావొస్తోంది. మంత్రి వర్గ కూర్పు, మార్పు కూడా తప్పదని తెలుస్తోంది. అదంతా పార్టీ అధిష్టానం పూర్తిగా సిఎం. రేవంత్‌ రెడ్డి చేతుల్లోనే పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇకపై సిఎం. రేవంత్‌ వ్యవహార శైలిని సరికొత్తగా చూడొచ్చని అనుకుంటున్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ చైర్మన్…

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ చైర్మన్

◆:- తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో హోతి బి గ్రామపంచాయతీ సెక్రెటరీ నరేష్ గారి సోదరుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు వారితోపాటు ఈ కార్యక్రమంలో పర్వేస్ బిజీ సందీప్ అమన్ నవీద్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు,

కట్టు దాటక ముందే కట్టడి చేయండి!?

`కప్పదాటు మంత్రులను పీకేయండి?

`కఠిన నిర్ణయాలు తప్పవు..ఉపేక్షిస్తూ పోతే ఆగవు.

`తెలంగాణలో కాంగ్రెస్‌ కు రక్ష రేవంత్‌ రెడ్డి మాత్రమే.

`మొండిగా లేకుంటే నాయకులు మొదటికే మోసం తెచ్చేలా వున్నారు?

`అధికారంలో వున్నా కొందరు కోవర్టు గుణం మానుకోవడం లేదు!

`తాబేదార్ల పని వదులుకోవడం లేదు.

రేవంత్‌ కష్టపడి తెచ్చిన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు.

`ప్రతిపక్షాలకు అస్త్రాలౌతున్నారు?

`అతి స్చేచ్ఛ ఎప్పటికీ హస్తవ్యస్తమే!

`కూర్చున్న కొమ్మనే నరుక్కుకుంటున్నారు.

`సీఎం. రేవంత్‌ రెడ్డి మంచి తనం అలుసుగా తీసుకుంటున్నారు.

`అందరిలో ఒకడిగా మెలుగుతుంటే మెతకవైఖరి అనుకుంటున్నారు?

`సీఎం. ను లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు?

`పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కొందరు మంత్రులే దుర్వినియోగం చేస్తున్నారు?

’’సీఎం కుర్చీ మీద కన్నేసి’’ ప్రభుత్వాన్నే అస్థిర పరచాలని చూస్తున్నారు!

సీఎం. రేవంత్‌ రెడ్డి’’ ఉదాసీనత మితి మీరిన స్చేచ్ఛకు కారణం

`మంత్రులకు పూర్తి స్చేచ్ఛ కూడా కొంప ముంచుతుంది

`సీనియర్లు అనే గౌరవాన్ని చాలా మంది మంత్రులు నిలుపుకోవడం లేదు.

`‘‘సీఎం’’. రేవంత్‌ ను ఫెయిల్యూర్‌ ‘‘సిఎం’’గా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారా?

’’సీఎం’’. పై పదే పదే అధిష్టానం ముందు అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తున్నారా!

`గల్లీ లొల్లి..డిల్లీ పంచాయతి!

`కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అంత!

`ఎప్పుడూ మారనిదే ఇదంతా!

`ప్రతి చిన్న విషయానికి సిఎం.ను డిల్లీకి పిలవడం పార్టీకే నష్టం!

`జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా హై కమాండ్‌ జోక్యం చేసుకోవాలా?

`ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు వడపోసి పోయారు!

`ఇప్పుడు మళ్ళీ సీఎం, మంత్రులతో డిల్లీలో మంతనాలు!

`అధిష్టానం ‘‘సీఎం’’ను గౌరవిస్తే మంత్రులు భయంతో వుంటారు.

`అధిష్టానం మంత్రులకు ప్రాధాన్యతనిస్తే ‘‘మొదటికే మోసం’’ తెస్తారు

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

పాలనలో సామరస్యముండాలి. పరిపాలనలో మొండి తనముండాలి. ప్రజల విషయంలో ఆలోచనా దృక్పధం వుండాలి. పాలనా బాగస్వాములు పట్ల ముఖ్యమైన పాలకుడు కఠినంగానే వుండాలి. ఇది సిఎంలకు వుండాల్సిన అతి ముఖ్య లక్షణం. మెతక తనం కూడా కొన్ని సార్లు చేత కాని తనమౌతుందని అనుకునే పరిస్ధితి వుంటుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తర్వాతనైనా సరే ముఖ్యమైన పాకులు కఠినంగా వుండాల్సిన అవసరం వుంది. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులలో ప్రస్తుత సిఎం. రేవంత్‌ రెడ్డి లాంటి మంచి తనం నిండిన పాలకులు లేరు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఏ ఇతర శాఖల్లోనూ వేలు పెట్టడం లేదు. ఏ మంత్రిపట్ల ఇప్పటి వరకు సీరియస్‌గా వ్యవహరించలేదు. శాఖల నిర్వహణలో మంత్రులు అలసత్వం వహిస్తున్నా పెద్దగా మందలించిన దాఖలాలు లేవు. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనం. కాని అది సిఎం. రేవంత్‌ రెడ్డి చేతగాని తనంగా కొందరు మంత్రులు భావిస్తున్నట్లున్నారు. పైగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వున్న వాళ్లు కూడా కొంత మంది వున్నారు. ఎప్పుడు తమకు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారు కూడా వున్నారు. ఈ విషయం సిఎం. రేవంత్‌రెడ్డికి తెలియంది కాదు. అయినా అలాంటి మంత్రుల విషయంలో కూడా రేవంత్‌ రెడ్డి ఎంతో ఉదాసీనతతో వ్యవహిస్తున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రాదాన్యత కంటే ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కడా తాను ముఖ్యమంత్రి అనే దర్పం చూపించడం లేదు. ప్రతి విషయంలోనూ, సందర్భంలోనూ ఆయన మంత్రులను సమాన భాగస్వాములుగానే చూస్తున్నారు. వారికి మితిమీరిన మర్యాద కల్పిస్తున్నారు. ఇదంతా రేవంత్‌రెడ్డి గొప్పదనం. రాజకీయాల్లో అందరూ సమానమనుకునే మనస్తత్వం. ఇలాంటి ముఖ్యమంత్రులే సమస్యలు ఎదుర్కొంటారని అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి ఇంతగా మంత్రులకు స్వేచ్ఛ నిచ్చిన సందర్భాలులేవు. ప్రాంతీయపార్టీలలో సహజంగా సిఎంలు ఒకింత నియంతలుగా వుంటారన్న భావన వుంది. నిజం కూడా. ఆయా మంత్రులైనా, నాయకులైనా సరే ప్రతి విషయాన్ని తమకు తెలియకుండా ఏ ఒక్క ఫైలు ముందుకు కదలొద్దు అని హుకూం జారీ చేసేవారు. గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కేసిఆర్‌ పాలనలో కూడా అదే అనుసరించారు. గతంలో చంద్రబాబు పాలన కూడా అలాగే సాగింది. ఎన్టీఆర్‌ కాలంలోనూ సిఎం.కు తెలియకుండా చీమ చిటుక్కుమనలేదు. కాంగ్రెస్‌లో కూడా అదే జరిగింది. ఈ విషయాలను సిఎం. రేవంత్‌ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అయినా పాలన అంటే సమిష్టి బాద్యత అనే ఉదారస్వభావంతో సిఎం. రేవంత్‌ రెడ్డి వున్నారు. రేవంత్‌ అతి మంచితనం కూడా చెడుగా మారుతోంది. మంత్రులకు ఇచ్చిన అతి స్వేచ్చ దుర్వినియోగమౌతోంది. అంతిమంగా అది రేవంత్‌రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. దాంతో సిఎం. రేవంత్‌ రెడ్డి ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని మళ్లీ అదికారంలోకి తీసుకురావాలి. ప్రజా పాలన సాగించాలని సిఎం. రేవంత్‌ రెడ్డి అనుకుంటున్నారు. కాని చాల మంది మంత్రుల్లో ఈ అభిప్రాయం వున్నట్లు కనిపించడం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తామో? లేదో? అనే అభద్రాతా భావంలోనే కొంత మంది మంత్రులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పదువుల్లో వున్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవడం, అవకాశంవస్తే సిఎం. కావాలన్న ఆశతో చాలా మంది వున్నారు. వారి వల్ల ఏమీ కాదన్న సంగతి ప్రజలకు తెలుసు. వారి వల్ల ఈ మాత్రం పాలన కూడా నడవదని తెలుసు. అయినా వారికి సిఎం కావాలన్న కోరిక రోజు రోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌రెడ్డి పదవిలో వుంటే తప్ప కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు. సిఎం. రేవంత్‌కు ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా కాంగ్రెస్‌ను రక్షించే నాధుడే వుండరు. గత పదేళ్ల కాలంలో కనీసం పంచాయితీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేని నాయకులు, రాష్ట్రానికి అధికారం తెస్తారని అనుకోవడం లేదు. అసలు వారికి పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో తెలుసు. సిఎం. రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఎంత శ్రమించాడో తెలుసు. పార్టీని నడిపేందుకు ఎంత ప్రయాసపడ్డాడో అందరికీ తెలుసు. పార్టీకి ఒక్కొ ఇటుక ఏలా పేర్చాడో తెలుసు. ప్రజల మనసు ఎలా చూరగొన్నాడో తెలుసు. పార్టీని నడపడమే చేతగాని కాడి పడేసిన వాళ్లు కూడా ఇప్పుడు పాలిస్తాం..ముఖ్యమంత్రి అవుతామని అని కలులు గంటున్నారు. ఈ విషయాలు అదిష్టానానికి తెలియక కాదు. కాని సిఎం.రేవంత్‌రెడ్డిని స్ట్రాంగ్‌ చేస్తే వైఎస్‌. రాజశేఖరెడ్డిలాగా మారుతాడేమో? అనే భయం అధిష్టానంలో కూడా వుంది. వారి మదిలో లేకపోయినా, నేర్పించే నాయకులు పార్టీలో చాల మంది వున్నారు. సిఎం. కవాలన్న ఆశ వున్నవాళ్లంతా ఇదే చేస్తున్నారు. వైఎస్‌కు అధిష్టానం పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనే పార్టీకి తీరని నష్టం జరిగిందన్న అభిప్రాయం చాలా మందిలో వుంది. ఏపిలో పార్టీ నామ రూపాలు లేకుండాపోవడానికి కారణం అదే అని అధిష్టానానికి చెప్పిన వాళ్లున్నారు. అయితే వైఎస్‌ తర్వాత పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా సిఎం. రేవంత్‌లాగా ఉదాసీనతంగా వ్యవహరించలేదు. సిఎం. అంటే సిఎంలాగానే వ్యవహరించారు. ప్రభుత్వమంటే అందరూ సమానమే అయినా, సిఎం. ఎక్కువ సమానం అన్నట్లుగానే పాలన సాగించారు. రోశయ్య లాంటి వారు కూడా మంత్రుల మీద అజమాయిషీ చేశారు. అందర్నీ కట్టడి చేశారు. అసలు ఏ అనుభవం లేని కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా సిఎం. కాగానే తనేంటో చూపించారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి? అనేంత ధైర్యంగా పాలన సాగించారు. అలా సిఎం. స్ట్రాంగ్‌గా వుంటే ఏ మంత్రులు నోరు మెదపరు. ఇప్పుడు సిఎం. రేవంత్‌రెడ్డి కూడా అలా వుంటే తప్ప మంత్రులు భయపడరు. వున్న ఈ మాత్రం పదవి కూడా సిఎం. కనికరంతోనే వుందన్న భయం మంత్రుల్లో ఖచ్చితంగా వుండాలి. తమకు పదవి రేవంత్‌ రెడ్డి ఇవ్వలేదు. అధిష్టానం ఇచ్చింది అనే ఆలోచన వున్న కొందరు మంత్రులు సిఎం.ను లెక్క చేయడం లేదన్నది సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఆలోచన మంత్రుల్లో మారాలి. సిఎం. దృక్పధంలో కూడా మార్పు రావాలి. తాను మిగతా వారికన్నా ఎక్కువ సమానం అనుకుంటే తప్ప పరిస్ధితులు చక్కబడవు. తెలంగాణలో గతంలో వున్నట్లు పది జిల్లాలు కాదు. ఇప్పుడు 33 జిల్లాలు. అంటే వాటి పరిధి చాలా చిన్నది. గతంలో రెవిన్యూ డివిజన్‌ అంత కూడా ఇప్పుడు జిల్లాలు లేవు. అలాంటి జిల్లాల అధ్యక్షుల ఎంపిక కూడా అధిష్టానం నుంచి జరగాలంటే, ఇక్కడ సిఎంకు ప్రాధాన్యత ఎలా వుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సిఎంలు సూచించిన వారికి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పదవులు ఇచ్చిన సందర్బాలున్నాయి. అప్పుడంటే ఉమ్మడి జిల్లాలు కావడంతో పార్లీ పరంగా కొంత పలుకుబడి వుండేది. ఇప్పుడు పార్టీ పదవుల వల్ల వచ్చేది లేదు. ఆ నాయకులు ఒరిగేది లేదు. అయినా ఆ పదవులకు అంత ప్రాదాన్యత కల్పిస్తూ, సిఎంను పదే పదే డిల్లీకి పిలిచి సంప్రదింపులు జరపాల్సిన పనిలేదు. ఇక్కడే సిఎం. వారి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. మంత్రుల అభిప్రాయాలు, వారి ప్రాదాన్యతలు తీసుకొని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఇప్పటికే డిల్లీ నుంచి ప్రతినిధులు, పరిశీలలకు వచ్చారు. వడపోత పోశారు. కొంత మంది పేర్లు వాళ్లే ఫైనల్‌ చేశారు. ఇక ప్రకటనే తరువాయి. కాని దానిపై కూడా సిఎం.కు స్వేచ్చ నివ్వకుండా మళ్లీ అధిష్టానం వద్ద వడపోతలు చేయడం అంటే రాష్ట్ర నాయకత్వాన్ని అవమానించడమే అవుతుంది. సిఎం. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని తక్కువ చేయడమే అవుతుంది. పదేళ్ల తర్వాత, తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ఏ నాయకుడు అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అందరూ సమిష్టిగా పనిచేయలేకపోయారు. కాని సిఎం. రేవంత్‌ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పడిన శ్రమలో చాల మంది నాయకులు పది శాతం కూడా పడలేదు. అలాంటి నాయకులు కూడా మంత్రులయ్యారు. ఇప్పుడు పాలనకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఒక్ససారి సిఎం. రేవంత్‌రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తే, ఇప్పుడున్న అసమ్మతి మంత్రులంతా ఎందుకు దారిలోకి రారో చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో మంచి సంకేతాలు ఎందుకు వెళ్లవో గమనించండి. ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్న మంత్రులను పీకి పారేయండి. అంతే!!! దేవుడంటే భక్తి ఒక్కటే వుంటే సరిపోదు. భయం కూడా వుండాలి. సిఎం. అంటే మంత్రులకు భక్తి లేకపోయినా ఫరవాలేదు. భయం మాత్రం ఖచ్చితంగా వుండాలి. అప్పుడే పాలన గాడిలో సక్కగా నడిచేది.

పాపం చిన్నారులు..కుక్కల దాడికి బలౌతున్నారు!

`ఎంతో మంది తల్లిదండ్రులు కడుపుకోతను అనుభవిస్తున్నారు.

`కుక్కల మీద కనికరం.. పిల్లల మీద లేదా!?

`ఇంత దిక్కుమాలిన వ్యవస్థలో బతుకుతున్నామా?

`నిత్యం ఎక్కడో ఒకచోట కుక్క కరిచి అనే వార్తలు చూస్తూనే వున్నాం.

`రేబిస్‌ బారిన పడి చనిపోతున్నారని వింటూనే వున్నాం.

`కుక్కల దాడిలో చిన్న పిల్లలు చనిపోతున్నా పాపకులకు పట్టదా!

`జంతు ప్రేమికులారా జర ఆలోచించండి.

`కుక్కల మీద వున్న ప్రేమ పిల్లల మీద లేదా!

`పిల్లల ప్రాణాలకన్నా కుక్కల ప్రాణమే ఎక్కువైపోయిందా!

`జంతు ప్రేమికుల ముసుగులో జనం ప్రాణాలతో చెలగాటమా!

హైదరాబాద్‌, నేటిధాత్రి:
సమాజమే మానవత్వమనే పదానికి అర్దాన్ని మార్చేస్తుంది. మానవత్వమనే పదానికే రంగులు మార్చుతుంది. అవును. ఇది ముమ్మాటికీ నిజం. ఒకప్పుడు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు. అనేవారు. మనిషే కుక్కను కరిస్తే వార్త అవుతుందని చెప్పుకునే వారు. ఎందుకంటే ఒకప్పుడు కుక్క కరిస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. పల్లెల్లో ఏదో మంత్రం వేసే వాళ్లు. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే బొడ్డుచుట్టూ ఇంజక్షన్లు ఇచ్చేవారు. తర్వాత మరింత అలాంటి అవసరం లేని ఖరీదైన వైద్యం కూడ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు కుక్క కాటు అనే వార్త ఎప్పుడో వింటుండేది. ఎవరైనా ఇంట్లో పెంచుకుంటున్నారన్న విషయం తెలియక ఇంట్లోకి వెళ్తే కుక్క కరిచింది అని చెప్పడం విన్నాం. లేకపోతే పిచ్చి కుక్క కరిచింది అనే వార్తలు విన్నాం. కాని నిత్యం కుక్క కరిచిన వార్తలను కోకొల్లలుగా వినడం మాత్రం ఇటీవల బాగా పెరిగింది. ప్రతి ఏటా మన దేశంలో కుక్క కాటుకు గురై మరణిస్తున్న వారి సంఖ్య పది లక్షలు వుంటుందనే వార్త వింటుంటే గుండె గుబేల్‌మనక మానదు. ఇంతలా కుక్కల దాడిలో మనుషులు మరణిస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారు. వ్యవస్ధలు ఏం చేస్తున్నాయి. గ్రామాలలో పంచాయితీలు ఏం చేస్తున్నాయి. మున్సిపల్‌ శాఖ ఏం చేస్తుందనే ప్రశ్న అందరికీ టక్కున తెలుత్తుంది. ఈ వ్యవస్ధలన్నీ పనిచేయాలనే అనుకుంటున్నాయి. కాని ఇటీవల మూగజీవాల మీద ప్రేమ కురిపించే వాళ్లు చాలా పెరిగిపోయారు. వాళ్లంతా ఎక్కడో వుండరు. సెల్‌ ఫోన్లో వుంటారు. కుక్కలను పట్టుకొని వెళ్తుంటే వాళ్లు తట్టుకోలేరు. కుక్కలకు ఏదైనా హాని జరిగితే వారి మనసు విలవిలలాడపోతుంది. అది కూడా కేవలం సెల్‌పోన్లో మాత్రమే…అవే వీధి కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తుంటే మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. అయ్యో అని కూడా అనరు. కుక్క కనిపించినప్పుడు జాగ్రత్తగా వుండాలి కదా? అని నీతులు చెబుతారు. వీధుల్లో కుక్కలున్నాయని తెలిసినప్పుడు పిల్లలను బైటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కదా! హితవులు పలుకుతున్నారు. అంతే కాని వీధుల్లో గుంంపులు గుంపులుగా పెరిగిపోతున్నా కుక్కలను నిర్మూలించండి అని మాత్రం అడిగే వాళ్లు లేకుండాపోయారు. ఎవరు ఎలా పోతే మాకేమిటి? అనే ఓ పిరికి బ్యాచ్‌ వుంటుంది. వారి వరకు వస్తే గాని అయ్యో అన్యాయమైపోయామే! అంటుంటారు. ఇక మరికొందరు జంతు ప్రేమికులు. వాళ్లకు మనుషులకన్నా జంతువులే ఎక్కువ. వారిలో మనుషులపై కనిపించని జాలి, దయ , కరుణ అన్నీ జంతువులపై మాత్రమే కురిపిస్తారు. ఇంట్లో పెంచుకునే కుక్కలను మాత్రం సొంత పిల్లలుగా చూసుకుంటారు. ఆ కుక్కలకు ఏమైనా అయితే మాత్రం విలవిలలాడిపోతున్నట్లు వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కన్న పిల్లలకన్నా కుక్కల మీద ప్రేమ కురిపిస్తూ వీడియోలు చేస్తుంటారు. అయితే ఇంట్లో పెంచుకునే హైబ్రీడ్‌ కుక్కపిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్‌లు వేయిస్తారు. వాటికి స్నానం చేయిస్తారు. కొంత శుభ్రత తీసుకుంటారు. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనం వేసుకునే చెప్పులు, కుక్కలు ఇంటి ముందే వుండాలన్నారు. కాని అదేంటో ఇప్పుడు చెప్పులు కూడా ఇంట్లో వాడుతున్నారు. బైట వుండాల్సిన కుక్కలను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి వాళ్లకు వీధి కుక్కలంటే ప్రేమ ఏమీ వుండదు. కాని కుక్క అనగానే వారిలో ప్రేమ పొంగిపోయినట్లు నటిస్తుంటారు. డిల్లీ నుంచి గల్లీ వరకు నిత్యం ఎంతో మంది చిన్నారులు కుక్కల దాడిలో చనిపోతున్నారు. గాయాల పాలౌతున్నారు. రేబిస్‌ వ్యాధి బారిన పడి భయంకరమైన చావును చూస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లలు కూడా ఇలాంటి పరిస్దితులను ఎదుర్కొని నరకం చూస్తూ చనిపోతుంటే కూడా కొంత మందికి పాపం అనిపించడం లేదు. వాళ్లే జంతు ప్రేమికులు. వారి మానవత్వం మనుషుల మీద కాన్న కుక్కల మీద ఎక్కువౌతోంది. ఇది మానవత్వం మంట కలవడం కాదా? మనుషుల మీద మనుషులే విషం నింపుకోవడం కాదా? ఒక కాకిని కొడితే వంద కాకులొస్తాయి. గాయి గాయి చేస్తాయి. కొట్టిన వ్యక్తిని వెంటాడుతాయి. వేదిస్తాయి. ఇంట్లో నుంచి బైటకు రాకుండా చిత్ర వధ చేస్తాయి. ఒక కోతిని కొడితే నాలుగు కోతులు మీదకు వస్తాయి. కాని ఒక వ్యక్తిని ఎవరైనా కొడుతుంటే చూస్తూ వుండిపోతారు. గతంలో ఇలా చూస్తూపోయేవారు. కాని ఇప్పుడు సెల్‌పోన్లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా పిల్లలు కుక్కల దాడికి గురైన సందర్భంలో సిసి టివీలలో రికార్డు అయ్యే వీడియోలు కొన్ని అయితే, వాటిని షూట్‌ చేసి పోస్టు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. ఇటీవల కర్నూల్‌లో బస్సు తగలబడి పోతుంటే, బస్సు అద్దాలు పగలగొట్టాల్సిన వాళ్లు వీడియోలు తీశారని కూడా అంటున్నారు. ఇలాంటివి చూస్తుంటే, వింటుంటే మనం మనుషులమేనా అనిపించకమానదు. నిజం చెప్పాలంటే అసలు మనం మనుషులమే కాదు. అభం శుభం తెలియని పసిపిల్లలను కుక్కలు మీద పడి కరుస్తూ, పీక్కు తింటున్నాయి. అవి మూగ జీవాలు కాదు. కోరలున్న జంతువులు. కొరికి కొరికి చంపుకుతినే జంతువులు. సాదు స్వభావంలో వున్న రాక్షస జాతి జంతువు. దాని మీద జాలి చూపిస్తూ పోతే జనం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకోవాల్సి బతకాల్సి వచ్చే ప్రమాదం లేకపోలేదు. కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వాళ్లు కూడా జంతు ప్రేమికులౌతుంటారు. కన్నతల్లికి అన్నం పెట్టని వాళ్లు కూడా కుక్కల కోసం తల్లడిల్లిపోతున్నట్లు నటిస్తున్నారు. ఇలాంటి వాళ్లు దేశానికి ఎంతో ప్రమాదకరం. ఆఖరుకు సుప్రింకోర్టు తీర్పును కూడా తప్పు పట్టే స్ధాయికి చేరుకున్నారు. అలాంటి పిచ్చి ప్రేమికుల గురించి ఆలోచించకుండా పాలకలు కఠినంగా వ్యవహరించాలి. వీది కుక్కల నిర్మూలన చేపట్టాలి. గతంలో ఇలా కుక్కలు పెరిగిన సందర్భాలలో గ్రామ పంచాయితీ నుంచి మొదలు మున్సిపాలిటీల వరకు కుక్కలను పట్టుకెళ్లి చంపి, పూడ్చిపెట్టేవారు. అలా కుక్కల బెడత తీర్చేవాళ్లు. ఇప్పుడు ఆ పనిని వదిలేస్తున్నారు. జంతు ప్రేమికులకు భయపడి ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నా ప్రభుత్వాలు చోద్యం చూడడం కూడా సరైంది కాదు.

బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం!

`ప్రచారానికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులకే ప్రజల భరోసా.

`ఎక్కడికక్కడ ప్రజలు కారు పార్టీ నాయకులకు స్వాగతం

`200 వున్న పింఛన్‌ రెండు వేలు చేసింది కేసీఆర్‌.

`హైదరాబాద్‌ అభివృద్ధి చేసింది కేసీఆర్‌

`మంచినీటి కరువు లేకుండా చేసింది కేసీఆర్‌

`వరదలొస్తే 10 వేలు ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్

 

`కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది బీఆర్‌ఎస్‌ నాయకులు

`పెద్ద ఎత్తున ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇచ్చింది బిఆర్‌ఎస్‌

`ప్రభుత్వం తరుపున నిత్యావసర వస్తువులతో పాటు 500 ఇచ్చింది బీఆర్‌ఎస్‌

`ప్రాణాలకు తెగించి ప్రజల కోసం నిలబడ్డది బీఆర్‌ఎస్‌

`కరోనా సమయంలో బిఆర్‌ఎస్‌ తప్ప ఏ పార్టీ సాయం చేయలేదు

`బస్తీ దవఖానాలు పెట్టి పేదలకు వైద్యం అందించింది కేసీఆర్‌

`గర్భిణీ మహిళలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించింది కేసీఆర్‌

`ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయి ప్రసవాలు చేశారు

`కేసీఆర్‌ కిట్‌ ఇచ్చి పసి పిల్లలను సంరక్షించారు

`ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటి దగ్గర చేర్చింది కేసిఆర్‌

`కేసీఆర్‌ కిట్‌ తో పాటు రూ. 13 వేలు ఇచ్చింది కేసీఆర్‌

`పేదలను ఆదుకున్నది కేసీఆర్‌

`పేదలకు ఉచిత విద్య, వైద్యం పెద్ద ఎత్తున అందించింది కేసీఆర్‌

`గురుకులాలు పెట్టి బస్తీ పిల్లలకు చదువు చెప్పించినది కేసీఆర్‌

`ఈ విషయాలు బీఆర్‌ఎస్‌ నాయకులకు చెబుతున్నదే ప్రజలు

`జూబ్లీ హిల్స్‌ లో సునీతను గెలిపించుకుంటామంటున్నారు

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:

కష్టమెక్కడుంటుందో చైతన్యం కూడా అక్కడే వుంటుంది. జూబ్లిహిల్స్‌ లాంటి నియోజక వర్గంలో వున్న అనేక బస్తీలలో వుండే ప్రజలకు అన్నీ తెలుసు. కష్టం తెలుసు. సుఖం తెలుసు. బాధలు తెలుసు. గోసలు తెలుసు. వేధింపులు తెలుసు. బెదిరింపులు తెలుసు. అన్నీ చవిచూసిన వాళ్లే. గతంలో వారి జీవితాలు ఎలా వుండేవో తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా మారిపోయాయో తెలుసు. కేసిఆర్‌ వారిని ఎలా కళ్లల్లో పెట్టుకొని చూసుకున్నారో తెలుసు. తెలంగాణ రాకముందు జూబ్లీహిల్స్‌లో వుండే కొన్ని ప్రాంతాలు ఎలా వుండేవో ఇప్పుడు ఎలా వున్నాయో చూస్తూనే వున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత సత్వర అభివృద్ది జరిగిన నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్‌ ఒకటి. ప్రత్యేకంగా యూసఫ్‌గూడ, వెంగల్‌రావు నగర్‌, బోరబండ, రహమత్‌ నగర్‌, లాంటి ప్రాంతాల పరిసి ్ధతి ఎలా వుండేదో ఇప్పుడు ఎలా వుందో చూస్తున్నదే. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. సాక్ష్యాత్తు జూబ్లీహిల్స్‌ నియోకవర్గంలో వున్న పేదల బస్తీల ప్రజలు. ఒకప్పుడు పేదల బస్తీలలో వుండే వారికి సరైన సౌకర్యాలు వుండేవి కాదు. కాని అనేక మౌళిక సదుపాయాలు కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపిన పాలకుడు కేసిఆర్‌. ఆయా ప్రాంతాలలో కనీస విద్యా సౌకర్యాలు వుండేవి కాదు. వైద్య సదుపాయాలు పేదలకు అందేవి కాదు. అక్కడ ప్రాంతాల ప్రజలకు వైద్య సదుపాయల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం కూడ వైద్య సదుపాయం అందేది కాదు. దాంతో ప్రజలు అనేక అవస్ధలు ఎదుర్కొనేవారు. అలాంటి ప్రాంతాలలో బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్‌ది. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ హైదరాబాద్‌ మొత్తంగా సుమారు 350 బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, బస్తీలలో వీటిని అడుగడుగునా ఏర్పాటు చేశారు. దాంతోపేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందడం మొదలయ్యాయి. ఒకప్పుడు వారికి ప్రభుత్వ వైద్యం అంటే అటు ఈఎస్‌ఐ, లేకుంటే నిమ్స్‌, సికింద్రాబాద్‌ వెళ్తే గాంధీ, కోఠి దవఖాన, ఉస్మానియాలు మాత్రమే వుండేవి. ఇక ప్రైవేటు ఆసుపత్రులు ఎన్ని వున్నా, పేదలకు ఆ ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే ఆ ఖర్చు భరించే పరిస్ధితి వుండేది కాదు. ప్రైవేటు చిన్న చిన్న ఆసుపత్రులున్నా వాటిలో కూడా వైద్యం ఖరీదుగానే వుండేది. దాంతో పేద ప్రజలకు కోసం నిపుణులైన వైద్యులతో బస్తీ దవఖానాల నిర్వహణతో పేదలకు ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో బస్తీ దవఖానల వల్ల ఎంతో మేలు జరిగింది. ఇక ఇదిలా వుంటే పేద మహిళల గర్బీణీల అవస్ధలు అన్నీ ఇన్నీ కావు. వారు నెల నెల చెకప్‌ల కోసం కూడ ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది. లేకుంటే వేలాది రూపాయలు ఖర్చు చేసి, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఒక మహిళ గర్భం దాల్చిన నుంచి డెలవరీ వరకు ఎంతో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వుండేది. ఆఖరుకు డెలివరీ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు ఆపరేషన్‌ చేయాల్సిందే అంటే ఆ కుటుంబం విలవిలాడిపోయేది. వేలల్లో ఖర్చుకు భయపడిపోయేవారు. దాంతో ఆసుపత్రులకు వెళ్లలేక ఇంట్లోనే ఇబ్బందులు పడి, ప్రాణాలు కోల్పోయిన మహిళలు కూడా వున్నారు. అలాంటి పరిస్ధితులను తప్పించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని పరిస్దితి ఎదురయ్యేది. ప్రైవేటు ఆసుపత్రులు అంటే కచ్చితంగా ఆపరేషన్‌ అనేవారు. దాంతో వేలాది రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చేది. ఒక వేళ ఆ స్ధోమత లేని వాళ్లు గాందీ లాంటి ఆసుపత్రులకు వెళ్లినా, సమయం దాటిపోయిందనో, ప్రాణాపాయ పరిస్ధితులున్నాయనో ఆక్కడ కూడా చేతులేత్తేస్తే మరింత ఖర్చులు భరించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన వాళ్లున్నారు. గాందీ ఆసుపత్రులలో వైద్యులు పట్టించుకోక ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా వున్నారు. హైదరాబద్‌లో వుండే పేద ప్రజలకు ఇలాంటి పరిస్ధితి రాకుండా వుండేందుకు బస్తీ దవఖానాలే కాకుండా ప్రభుత్వమే ఆ గర్భినీ మహిళలను డెలివరికీ ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. గర్భిణీ మహిళలకు డెలివరీ సమయం వచ్చిందంటే 108కు కాల్‌ చేస్తే వెంటనే ఆసుపత్రి వర్గాలు వచ్చి ఆ మహిళలను ఆసుపత్రికి తీసుకెళ్లి డెలివరీ చేసేవి. అది కూడా నార్మర్‌ డెలివరీ చేసి, తల్లీ పిల్లలను కాపాడుతున్నాయి. డెలవరీ అయిన తర్వాత డిచ్చార్జి రోజున ఆడ పిల్ల పుట్టిన తల్లిదండ్రులకు రూ.13వేలు, మగ పిల్లాడు పుట్టిన తల్లిదండ్రులకు రూ.12 వేల నగదు కూడా కేసిఆర్‌ ప్రభుత్వం ఇచ్చేది. దానికితోడు ఒక ఏడాది కాలం పుట్టిన పిల్లలకు అవసరమయ్యే సబ్బులు, పౌడర్లు, డైపర్లు, మందులతో కూడిన కేసిఆర్‌ కిట్‌ను కూడా అందజేశారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కిందని జూబ్లీహిల్స్‌ ప్రజలే చెబుతున్నారు. ఇక బస్తీలలో వుండే పేద ప్రజల పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుకునేందుకు వేలల్లో ఖర్చవుతుంది. దాంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు కాకుండా పనులకు పంపిస్తూ వుండేవారు. అలాంటి పిల్లలకు ఖచ్చితంగా ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతో కేసిఆర్‌ కేజీటు పీజి అనే పథకాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1900 గురుకులాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పెద్దఎత్తున హైదరాబాద్‌ కూడా ఏర్పాటు చేశారు. హస్టల్‌ వసతితోపాటు, ఉచిత విద్యను అందించారు. అంతే కాకుండా మామూలు ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్నాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరుకు ఎంతో మంది విద్యార్ధులు గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడే సన్నబియ్యంతో భోజనం, మెరుగైన నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఒకప్పుడు బస్తీలంటే నిరక్షరాస్యులు ఎక్కువగా వుండేవారు. కాని ఇప్పుడు ప్రతి ఇంటిలోని పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. గురుకులాలలో చదువుకుంటున్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క పాఠశాల ఏర్పాటుకు అప్పటిపాలకులు సహకరించపోయేవారు. కాని కేసిఆర్‌ బస్తీ బస్తీకి స్కూల్‌ ఏర్పాటు చేశారు. గురుకులాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో విద్యా కుసుమాలు విరబూసేలా చేస్తున్నారు. అలాంటి జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రజలంత ముక్తకంఠంతో కేసిఆర్‌ పాలనకు జై కొడుతున్నారు. మాగంటి సునీతను గెలిపించుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్‌, బిజేపిలు ఎన్ని విన్యాసాలు చేసినా, ప్రజల మధ్య లేనిపోని అపోహలు సృష్టించినా సరే కేసిఆర్‌ వస్తేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు అంటున్నారు. మాగంటి సునీతను గెలిపించి మా రుణం తీర్చుకుంటామంటున్నారు. కారు గుర్తుకు ఓటేస్తామంటున్నారు. కారే కావాలి, సారే రావాలంటూ ప్రజలే పాడుకుంటున్నారు. ప్రచారానికి వెళ్తున్న బిఆర్‌ఎస్‌ శ్రేణులను ప్రజలే స్వచ్చందగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. బస్తీలలోని ఇతరపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో పెద్దఎత్తున చేరుతున్నారు. బిఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నారు. కేసిఆర్‌కు జై కొడుతున్నారు.

కారుకే ఓటేస్తం..సునీతనే గెలిపిస్తం!

`జూజ్లిహిల్స్‌లో జనమంతా అంటున్న మాట.

`ఎక్కడ విన్నా కేసీఆర్‌ ముచ్చటే.

`ఎక్కడ విన్నా సారే రావాలంటూ కోరుకుంటున్న పాట.

`కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ ఆగమే!

`అధికారంలోకి కాంగ్రెసోళ్లు గోసపెడుతున్రు.

`ఆరు గ్యారెంటీలు అంతా ఉత్తమాట.

`ఇంక నమ్ముతమా కాంగ్రెస్‌నంటున్న ఆడపడుచులు.

`ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నరు.

`ఇదీ జూబ్లీ హిల్స్‌ జనం మాట.

`బీఆర్‌ఎస్‌ నాయకులకు విక్టరీ సింబల్‌ చూపిస్తున్న మహిళలు.

`మా ఓటు కారుకే అంటున్న బస్తీల వాసులు.

`కేసీఆర్‌ వున్నప్పుడే మంచిగుండె అని ప్రజలే చెప్తున్నరు.

`కాంగ్రెస్‌ గెలిస్తే రౌడీ రాజ్యమే అని బాహటంగానే అంటున్న మహిళలు.

`బీఆర్‌ఎస్‌ నాయకులకు జనం నుంచి అడుగడుగునా నీరాజనాలు.

`కాంగ్రెస్‌ను నమ్మితే కాటగలిసినట్లే.

`బస్తీ మహిళలు కాంగ్రెస్‌ నాయకుల ముఖం మీదే చెబుతున్న మాట.

`మారు మాట్లాడకుండా జారుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు.

`పదేళ్లు మంచి నీళ్ల కరువు లేదు.

`సారున్నప్పుకు నీళ్లకు ఇబ్బంది పడలేదు.

`ఇప్పుడు మంచినీళ్లు సక్కగొస్తలేవు.

`కేసీఆర్‌ సారున్నప్పుడు కరంటు పోలేదు.

`ఇప్పుడు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతందో తెలుస్తలేదు.

`మోరీలు సక్కగ సాఫ్‌ చేస్తలేరు.

`కాంగ్రెస్‌ అంటే కూలగొట్టుడే..పేదోళ్ల బతుకు బజారే.

`అడుగడుగునా కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్న మహిళలు.

`కాంగ్రెస్‌ నాయకులతోనే మీకెయ్యం..కారుకే ఏస్తమంటున్న జనం.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
కారు గుర్తుకే ఓటేస్తాం. సునీతనే గెలిపించుకుంటాం. మాగంటి గోపీనాధ్‌ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్నారు. బస్తీలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కాంగ్రెస్‌ వచ్చి కష్టాలు తెచ్చింది. జనాన్ని గోస పెడుతోంది. ఇంకా కాంగ్రెస్‌ను నమ్ముతామా? బరాబర్‌ సునీతనే గెలిపించుకుంటం..సునీతను బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తం. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. జూబ్లీహిల్స్‌ ప్రజలు. గల్లీలు, బస్తీలు, కాలనీల ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్న మాటలు. కాంగ్రెస్‌ విచ్చనంక పడుతున్న గోసలు అన్నీ ఇన్నీ కావు. నీళ్లు రావు. కరంటు సక్కగ రాదు. తెలంగాణ రాకముందు వారం పది రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేటివి. ఎండాకాలమొస్తే బోరు నీళ్లు తప్ప మంచినీళ్లు గతి వుండేవి కాదు. మున్సిపల్‌ నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం పోయి, క్యాన్లలో తెచ్చుకునేటోల్లం. గంటలు గంటలు క్యూలో నిలబడి ఒక్క క్యాన్‌ నీళ్ల కోసం రోజంతా క్యూలో నిల్చున్న రోజులున్నయి. కాని తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ రోజూ నీళ్లిచ్చిండు. ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చిండు. రోజూ ఇరవై వేల లీటర్ల నీళ్లు ఉచితంగా ఇచ్చిండు. ఒక్కనాడు కూడా నీళ్ల గోసలేకుండా చూసుకున్నడు. ఎండాకాలమైనా, వానా కాలమైనా సరే నీళ్లకోసం ఎదురుచూసింది లేదు. మళ్ల కాంగ్రెస్‌ వచ్చింది. రెండేళ్లుగా ఎండా కాలంలో పడుతున్న గోస అంతా ఇంతా కాదు. మున్సిపల్‌ నీళ్లు మూడు రోజులకోసారి కూడా సక్కగ వస్తలేవు. ఎండాకాలంలో వారం రోజులకు ఓసారి వచ్చినయ్‌. తెలంగాణ రాకముందు కరంటు కష్టాలు చూసినం. అప్పుడు సక్కగ కరంటే వుండేది కాదు. తెలంగాణ వచ్చినంక కేసిఆర్‌ ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చిండు. కరంటు ఎప్పుడూ పోయేది కాదు. బస్తీలలో దోమలుంటాయి. కరంటు లేకపోతే రాత్రి పూట నరకం చూస్తాం. కాంగ్రెస్‌ వచ్చింది.. కరంటు కష్టమొచ్చింది. కేసిఆర్‌ వున్నప్పుడు ఎంత వాన పడుతున్నా కరంటు పోయేది కాదు. ఇప్పుడు చినుకు పడితే ఖతం కరంటు పోతది. ఎప్పుడొస్తదో తెల్వది. కరంటు కోతలు. దోమలుతో జరాలు వస్తున్నయి. కాంగ్రెస్‌ సక్కదనానికి ఉచిత కంరటు అన్నది. ఎవలికి వస్తలేదు. ఉచిత ఆరు గ్యారెంటీలు చెప్పిండ్రు. ప్రజలను మోసం చేసింన్రు. కల్యాణ లక్ష్మి లక్షరూపాయలతోపాటు, తులం బంగారం ఇస్తామన్నారు. ఏది ఒక్కలికి కూడా ఇయ్యలే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు కూడా సక్కగ వస్తలేవు. ఆడపిల్లలకు స్కూటీలిస్తన్నరు. మహిళలందరికీ రూ.2500 ఇస్తమన్నరు. ఒక్కలికన్నా ఇచ్చిండ్రా.. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ అన్నరు. ఇచ్చింది లేదు. సచ్చింది లేదు. ఇదీ జూబ్లీహిల్స్‌లో వున్న పేద ప్రజలు కాంగ్రెస్‌ నాయకులు ముఖం పట్టుకొని అంటున్న మాట. ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులతో ఈ మాటలు అంటుంటే వాళ్లు సమాధానం చెప్పలేక, అక్కడి నుంచి జారుకుంటున్నారు. పైగా కాంగ్రెస్‌ పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను తిడుతుంటే నవ్వుకుంటున్నరు. ఇంకా తిట్టకు అనుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇదీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పరిస్తితి. ఇదిలా వుంటే పెద్దఎత్తున బిఆర్‌ఎస్‌ పార్టీలోకి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. బిఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తామని శపధం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు డిపాజిట్‌కూడా రానివ్వమని బిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు అంటున్నారు. ఇక బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం సాగిస్తుంటే ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఇటీవల ఓ బస్తీలో ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డిని చూసిన ఓ మహిళ విక్టరీ సింబల్‌ చూపించి ఆహ్వానించింది. జగదీశ్వరెడ్డి ప్రచారంలో బాగంగా ఓటు గురించి చెబుతుంటే కారే..కారే మాది అంటూ చెప్పడంతో బిఆర్‌ఎస్‌ నాయకుల మోములో నవ్వులు మెరిశాయి. నా పెద్ద కొడుకు కేసిఆర్‌ అంటూ ఓ ముసలవ్వ చెబుతూ, జై కేసిఆర్‌ అంటూ నినదించింది. ఇక సర్వేలు చేస్తున్న వారికి కూడా ప్రజలు స్పష్టమైన సమాధానం చెబుతున్నారు. సహజంగా సర్వేలకు వెళ్లిన వారికి గాని, ప్రచారానికి వెళ్లిన వారికి గాని తమ మనోగతాన్ని చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయరు. కాని ఎక్కడికెళ్లినా కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు చెప్పడం అంటే వారిలో ఎంత చైతన్యం వుందో అర్దం చేసుకోవచ్చు. ఏ మాత్రం భయపడుకుండా మహిళలు సునీతనే గెలిపిస్తామని చెబుతుంటే కాంగ్రెస్‌ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎక్కడ విన్నా కేసిఆర్‌ పాటే. సారే రావాలంటున్నది అంటూసాగే పాటనే గల్లీ గల్లీలో వినిపిస్తున్నది. గులాబీల జెండలమ్మా అంటూ సాగే పాట అడుగడునా వినిపిస్తున్నది. ఆరు గ్యారెంటీలు ఉత్త మాట. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చేది లేదు. సచ్చేది లేదంటూ మహిళలు కాంగ్రెస్‌ నాయకుల ముఖం మీద చెబుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ముస్లిం, మైనార్టీ ప్రజలు కూడా కారు గుర్తుకే ఓటు అంటూ చెబుతున్నారు. బిజేపి, కాంగ్రెస్‌ నాయకులకు జనమే చుక్కలు చూపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున సెక్యూటితో తిరుగుతున్నారు. జనాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. అయినా జనం జంకడం లేదు. ఓటేస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తమని రాసిస్తరా? అంటూ మంత్రులను కూడా జనం నిలదీస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచారంలో ప్రజల కన్నా, సెక్యూరిటీలే ఎక్కువ వుంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారనికి వెళ్లలేక, జనంతో చీవాట్లు పడలేక సతమతమౌతున్నారు. కాంగ్రెస్‌ ఎంచుకున్న అభ్యర్ధి కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారింది. బస్తీలలో నవీన్‌ యాదవ్‌, ఆయన అనుచరుల మూలంగా పడుతున్న ఇబ్బందులను గురించి కూడా జనం చెప్పుకుంటున్నారు. నవీన్‌ అనుచరులు రాత్రి సమయాల్లో చేసే హంగామాలను గురించి కధలు, కథలుగా జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడే నవీన్‌ యాదవ్‌, ఆయన అనుచరులతో పడరాని పాట్లు పడుతున్నామని, పొరపాటున గెలిపిస్తే నిత్యం నరకం చూడాల్సిందే అని మహిళలు అంటున్నారు. దాంతో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక అవస్ధలు ఎదుర్కొంటున్నారు. ఇక చిరు వ్యాపారులు కాంగ్రెస్‌ అభ్యర్ధి మీద చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. మామూళ్ల వసూళ్లతో తమ జీవితాలను ఆగం చేస్తున్నారంటూ చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అందుకే తాము బిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామంటున్నారు. కేసిఆర్‌ వున్నప్పుడు గల్లీలల్ల సప్పుడు వుండేది కాదు. లొల్లి లేకుండా బస్తీలు ప్రశాంతంగా వుంటేటివి. ఇప్పుడు రోజుకో లొల్లితో నిద్రలు కూడా వుంటలేవని జనం అంటున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఈ చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోలేమంటూ చిరు వ్యాపారులు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రౌడీల రాజ్యమౌతుందని జనం భయపడుతున్నారు. సునీతను గెలిపించుకొని ప్రశాతంగా వుంటామంటున్నారు. సునీత గెలుసుడు పెద్ద కష్టం కాదని ప్రజలే అంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బిజేపిలకు డిపాజిట్‌ కూడా దక్కదని బిఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ వస్తే జూబ్లీహిల్స్‌లో పేదల బస్తీలుండవు. పేదలను బస్తీలలో వుండనివ్వరు. హైడ్రా పేరుతో కూల్చివేతలు మొదలు పెడతారని జనం భయపడుతున్నారు. కాంగ్రెస్‌ను ఓడిస్తేనే తాము ప్రశాంతంగా వుంటామని ప్రజలు చర్చించుకుంటున్నారు.

‘‘కౌలు’’, ‘‘పట్టాల’’ మధ్య కయ్యం!

`‘‘సీఎం’’. రేవంత్‌ రెడ్డి కి నాయకులు తెచ్చి పెడుతున్న తలనొప్పులు.

`ముదురుతున్న లొల్లులు…పార్టీలో లుకలుకలు!

`కాంగ్రెస్‌ పార్టీ లో ఈ రెండు వర్గాలున్నాయా!

`అధిష్టానానికి తెలియకుండానే రాజకీయాలు సాగుతున్నాయా?

`అసంతృప్తులు కాంగ్రెస్‌ లో పెరిగిపోతున్నారు.

`అసలైన కాంగ్రెస్‌ లో అసమ్మతి వాదులు పెరుగుతున్నారా?

`జీవన్‌ రెడ్డి రాజేస్తున్న మంటకు లేదు అంతం.

`జగిత్యాలలో రోజు రోజుకూ ముదురుతున్న విభేదం.

`అసలు పట్టాదారులం మేమంటూ జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

`కౌలు దారుల పెత్తనం పెరిగిపోయిందని ఆరోపణలు.

`మంత్రుల వల్ల నలిగిపోతున్నామంటూ విమర్శలు.

`బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సంజయ్‌ వల్ల పార్టీకి నష్టమంటూ ఆవేదనలు.

`పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల మధ్య సమస్యలు.

`నాయకుల మధ్య పొడసూపుతున్న విభేదాలు.

`మంత్రుల మధ్య పెరుగుతున్న అంతరాలు.

`ఆధిపత్యాలలో తవ్వుకుంటున్న అగాధాలు.

`పార్టీకి నలుసులుగా మారుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు.

`ఏదో ఒక వివాదం రగిలిస్తూ పార్టీ పరువు తీస్తున్నారు.

`ఆ మధ్య ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామెల్‌ మధ్య మాటల యుద్ధం.

`‘‘ఎంపి’’ కి కాదు సమస్యలు నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వివాదం.

`ఎప్పుడూ ఏదొ ఒక చిటపట రాజేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో వరుస వివాదాలతో కాంగ్రెస్‌నాయకులు, ప్రభుత్వంలో కీలకంగా వున్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ఏదో ఒక కాక రేపుతూనే వున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే వున్నారు. తెలంగాణ రాజకీయాలలో వేడిని పెంచుతున్నారు. ప్రతిపక్షాలు ఆ రాజకీయంలో చలి కాచుకునేలా చేస్తున్నారు. పార్టీ పరువును, ఓ స్ధాయిలో వున్న నాయకులు కూడా బజారు కీడుస్తున్నారు. ఓ వైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఎలా గెవాలన్నదానిపై ఎరికీ శ్రద్దలేదు. కాని వివాదాలు మాత్రం రాజేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మంత్రి అడ్లూరి లక్షణ్‌ ముందు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజానికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయం లేదు. ఆయన గౌరవానికి భంగం వాటిల్లింది లేదు. ఆయనకు వరసగా అవకాశాలిస్తూనే వున్నారు. కాని ఆయన ఓడిపోతున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అయినా తనదే పెత్తనం కావాలని ఆరాటపడుతున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్‌రెడ్డి, మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ కోసం నానా యాగీ చేశారు. ఇప్పుడు తనకు ప్రాదాన్యత దక్కడం లేదని గొగ్గోలు పెడుతున్నారు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీని నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తాము పట్టాదారులమంటూ లెక్కలు చెబుతున్నాడు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కౌలుదారులంటున్నాడు. కౌలు దారులు పట్టాదారుల మీద పెత్తనం చేస్తున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తన వాదన అరణ్య రోధన అని తెలిసినా జీవన్‌ రెడ్డి ఊరుకోడం లేదు. తన వితండ వాదం సరైంది కాదని తెలిసినా వివాదాలు సృష్టించకుండా వుండడం లేదు. కాంగ్రెస్‌పార్టీకి ప్రతిపక్షం అవసరం లేదని అంటారు. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలో వున్నప్పుడు ఆ పార్టీలోనే పాలకపక్షం, ప్రతిపక్షం కూడా కలిసే వుంటాయంటారు. కాంగ్రెస్‌ పార్టీలో సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏ నాయకుడు ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోవడం అనేది వుండదు. నాయకుల తీరు మరీ మితిమీరితే తప్ప చర్యలుండవు. పార్టీలో నాయకులు చేసే పనిని, చేసే ప్రతి వ్యాఖ్యను పట్టించుకోవడం అనేది సహజంగానే వుండదు. అందువల్ల ఆ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్చగా చెప్పుకునే అవకాశం వుంటుంది. అదే కాంగ్రెస్‌ పార్టీ కొంప ముంచుతుంది. నాయకుల మధ్య వున్న విభేదాలు ఎప్పటికప్పుడు బైట పడుతూనే వుంటాయి. కాంగ్రెస్‌పార్టీలో ఏ నాయకుడికి అన్యాయం జరిగినా బహిరంగంగానే చెప్పుకునే వెసులుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ధైర్యం వున్న నాయకులు కొంత మంది తమ గళాన్ని సవరిస్తూనే వుంటారు. తమ అభిప్రాయాలు చెప్పేస్తుంటారు. అలా చెప్పగలిగే నాయకులలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎవరికీ భయపడరు. మొహమాటం అసలే చూపించరు. తాను మనసులో ఏమనుకున్నా సరే దానికి బైట పెడతారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతూనే వుంటారు. 2023 ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ కల తీరలేదు. దాంతో ఆయన సొంత ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు తన అసమ్మతిని చూపిస్తూనే వుంటారు. తాజాగా ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టైనా సరే రైతులకు న్యాయం చేద్దామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. పైగా ఇటీవల వైన్స్‌ టెండర్ల విషయంలోనూ తన ఇలాఖాలో రూల్‌ వేరుగా వుంటుందని ప్రకటించారు. తన నియోజకవర్గంలో బెల్టు షాపులు వుండకూడదని హుకూం జారీ చేశారు. అంతే కాకుండా వైన్స్‌ నిర్వహణ సమయాన్ని కూడా ప్రకటించారు. ఇలా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కాళ్లలో కట్టెలు పెట్టే పని ఆయన చేస్తూనే వున్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదంటూనే విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. అయితే ఇటీవల ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించునేవారు లేకుండాపోయారు. ఇక మరో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి. నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికలైన ఆయన మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయనకు ఆ పదవి దక్కలేదు. దొంతి మాధవరెడ్డి తీరు కూడా సిఎం. రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇక మహాబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఓ దినపత్రికలో రాసిన వ్యాసం సంచలనాన్ని సృష్టించింది. పంచాయితీలకు, నగర పంచాయితీలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని ఆయన రాసుకొచ్చారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్‌ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కుంపటి రగిలిస్తూనే వున్నారు. ఆ మధ్య కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కూడా అసమ్మతి వాదిగానే ముద్ర వేసుకున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యే ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారయ్యారని అంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోలేరు. వారి వ్యాఖ్యలను ఎవరూ ఖండిరచలేరు. అదంతే కాంగ్రెస్‌ పార్టీ..అసమ్మతి లేకపోతే సాగదు. ఇక ఓ వారం రోజులుగా కరీంనగర్‌కు చెందిన ముగ్గురుమంత్రుల మధ్య అగాధం కనిపించింది. జూబ్లీహిల్స్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ రాక ఆలస్యం కావడం వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌ నోరు జారిన సంగతి తెలిసిందే. తాను మంత్రిని ఉద్దేశించి చేయలేదని మంత్రి పొన్నం చెప్పిన మాట విన్నదే. మంత్రి పొన్నం చేసిన ఆలస్యానికి కొంత రాజకీయ రగడ జరిగిందే. నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మంత్రి పొన్నం మాటలు బైటకు రాగానే, క్షమాపణ చెబితే పోయేది. కాని బేషజానికి వెళ్లడం వల్ల ఆలస్యం అమృతం విషమైంది. మంత్రి పొన్నం ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. అయినా అప్పటికే జరగాల్సినంత రచ్చ జరిగిపోయింది. దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. మంత్రి పొన్నం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మంద కృష్ణ మాదిగ, మోత్కుపల్లి నర్సింహులు లాంటి వారు మీడియా ముందుకు వచ్చారు. మంత్రి అడ్లూరికి అండగా నిలిచారు. దాంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కూడా మంత్రి పొన్నం క్షమాపణ చెపాల్సిందే అని డిమాండ్‌ చేయక తప్పలేదు. ఈ వివాదం ముగిసింది అనే లోపు మరో మంత్రి వివేక్‌ వెంకటస్వామి కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. తనపై సామాజిక మాధ్యమాలలో టార్గెట్‌ చేసి కులం ఆధారంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల బాద్యతలో వున్న తాను, అక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే తనకు పేరు వస్తుందన్న అక్కసుతో తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని వివేక్‌ అన్నారు. అంతే కాకుండా మంత్రి లక్ష్మణ్‌ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్దం కావడం లేదని కూడా చెప్పుకొచ్చారు. లక్ష్మణ్‌కు రాజకీయ ప్రోత్సాహాన్ని కల్పించిందే తన తండ్రి వెంకటస్వామి అని గుర్తు చేశారు. తనకు పదవి మీద వ్యామోహం లేదని అన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని వివేక్‌ అన్నారు. కొంత మంది పనిగట్టుకొని తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని అంటూనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు రాజకీయం నేర్పిందే మేము అన్నారు. తన తండ్రి వెంకటస్వామి ఆశీస్సులతోనే మంత్రి అడ్లూరి రాజకీయంగా ఎదిగారని అన్నారు. అయితే మంత్రి పొన్నం ఎపిసోడ్‌లో పక్కనే మంత్రి వివేక్‌ కూడా వున్నారు. దాంతో ఆ సమయంలోనే మంత్రి అడ్లూరి కొన్నికీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వివేక్‌ తనను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. తనపై రాజకీయ కక్ష పెంచుకున్నారని చెప్పారు. తాను మంత్రి వివేక్‌ పక్కన కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదని మంత్రి అడ్లూరి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ముగ్గురు మొదటి సారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన మొదటిసారేమంత్రులయ్యారు. కాకపోతే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకస్వామిలు గతంలో ఎంపిలుగా గెలిచారు. తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇద్దరూ గెలవలేదు. తొలిసారి ఈ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రులయ్యారు. అదే దారిలో అడ్లూరి కూడా మొదటిసారి గెలిచి మంత్రి అయ్యారు. అడ్లూరి మాత్రం ఈ మధ్యనే మంత్రి అయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాని ఈ ముగ్గురి మధ్య మాత్రం సయోధ్య ఎంత కుదిరిందో ఎవరికీ తెలియదు. నల్లగొండ జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ చేసే వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బం ది కరమైన పరిస్ధితులే సృష్టిస్తున్నాయి. ఆ మధ్య డైరీ ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీద తుంగతుర్తి ఎమ్మల్యే మందులు సామెల్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే ఎమ్మెల్యే ఒక దశలో ప్రజలు గాని, పార్టీ నాయకులు ఏ సమస్యలున్నా ముందు తన వద్దకే రావాలంటూ హుకూం జారీ చేశారు. ముందు ఎంపి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి వద్దకు వెళ్లొద్దని ఆయన ముందే తేల్చి చెప్పారు. ఇవి చిన్న చిన్న సమస్యలు కాదు. పార్టీని ముంచడానికి ఈ చిన్న సమస్యలే పెద్దవై పార్టీని ఆగం చేస్తాయి.

’’నెంబర్‌’’ 2 ‘‘శీనన్నే’’!

’’పొంగులేటి’’ ముందు ఎవరి కుప్పిగంతులు చెల్లవులే!

అధిష్టానం ముందు ‘‘పితూరీలు’’ చెప్పే వారి పాచికలు పారవులే!

అధిష్టానానికి అన్నీ తెలుసు.

పార్టీని అధికారంలోకి తీసుకురావడం

‘‘పాన్‌ నమిలినంత’’ సులువు కాదు.

`గెలిచిన తర్వాత ఫోజులు కొట్టినంత మాత్రాన సరిపోదు.

పదేళ్ళ తర్వాత పార్టీని అధికారంలోకి తేవడానికి ‘‘శీనన్న’’ పడిన కష్టం అధిష్టానానికి తెలుసు.

`జిల్లాలకు జిల్లాలు గెలిపించిన నాయకుడు ‘‘శీనన్న’’.

ఖమ్మంలో కారు తిరగకుండా చేసిన నాయకుడు ‘‘శీనన్న’’.

`తన సీటు గెలవడానికే ఆపసోపాలు పడ్డ వాళ్లు కూడా మాట్లాడుతున్నారు.

’’సిఎం. రేవంత్‌ రెడ్డి’’ తో కలిసి పార్టీ గెలుపుకు అహర్నిశలు కృషి చేసింది ‘‘శీనన్న’’.

ఖమ్మం సభతో కాంగ్రెస్‌ ను కదం తొక్కేలా చేసింది ‘‘శీనన్న’.

`తెలంగాణ లో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవడానికి తొలి ‘‘గర్జన ఖమ్మం సభ’’.

కాంగ్రెస్‌ కు వేవ్‌ తెప్పించడంలో రేవంత్‌ రెడ్డి’’ తర్వాత కష్టం ‘‘శీనన్న’’దే.

`అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడతారు.

పదేళ్లలో ఓడిపోయిన వాళ్లు కూడా గొప్పలకు పోతున్నారు.

`’’శీనన్న’’ రాజకీయం పలుచన చేయాలని చూస్తున్నారు.

`పార్టీని అధికారంలోకి తేవడంలో ‘‘శీనన్న’’ కష్టం పార్టీ పెద్దలందరికీ తెలుసు.

పార్టీకి పది పైసలు సాయం చేయలేని వాళ్లు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

`ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీని నిలబెట్టే శక్తి వున్న నాయకులెవరో పెద్దలకు బాగా తెలుసు.

`పదవులకు న్యాయం చేయలేని వాళ్లు కూడా పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు.

’’పొంగులేటి’’ ప్రభ తగ్గించాలని కలలు గంటున్నారు.

`పదవులొచ్చేలా దారి వేసిన ‘‘శీనన్న’’ నడవకుండా ముల్లకంప వేయాలని చూస్తున్నారు.

`వారి గోతులు వాళ్లే తవ్వుకుంటున్నారు.

`చెరపకురా చెడేవు అని తెలిసినా చాలా మంది మారరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఏటికి ఎదురీదేవాళ్లు మాటలు చెప్పరు. చెప్పినా వాటిని నిజం చేస్తారు. విజయాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తారు. అలాంటి వారిలో రాష్ట్ర్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. ఏమీ చేయలేని వారు ఏతులెక్కువ చెబుతారు. కూర్చున్న చోటంతా నాదే అంటారు. గుర్రాలు మలుతున్నామని గొప్పలు చెప్పుకుంటారు. పదేళ్లుగా పార్టీకి ఇటుక కూడా పేర్చని వాళ్లు ఇదంతా మాదే అంటారు. ఇదంతా మా వల్లే అని గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీద పడి ఏడుస్తుంటారు. పార్టీలో పొంగులేటికి లభించే ప్రాధాన్యత చూసి ఓర్వలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం వద్ద మంత్రి పొంగులేటికి వున్న పలుకుబడిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆయన ప్రాభవం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నాయకత్వాన్ని భరించలేకపోతున్నారు. వారి పెత్తనం సాగడం లేదని కుళ్లుకుంటున్నారు. ఇదంతా పొంగులేటి మూలంగానే తమకు గుర్తింపు లేదన్న అక్కసుతో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు. అసలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చేసిన కృషి ఏమిటో తెలియని వాళ్లు కాదు. కాంగ్రెస్‌ పార్టీ కోసం మంత్రి పొంగులేటి ఎంత కష్టపడ్డారో తెలియని వాళ్లు కాదు. అయినా అదంతా గతం అనుకునే బాపతు కాంగ్రెస్‌లో పెరిగిపోయారు. ఓడదాటే దాకా ఓడ మల్లన్న అని పొంగులేటిని పొగిడిన వాళ్లే, ఇప్పుడు గెలిచి పదవులు రాగానే పొంగులేటిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి వల్లనే కాంగ్రెస్‌ పార్టీ ఈ స్ధితికి వచ్చింది. అయినా వారు మారరు. ఇలా మంత్రి పొంగులేటి మీద పడి ఏడ్చే వారి వల్ల ఊదు కాలేదు లేదు. పీరు లేచేది లేదు. అయినా సరే పొంగులేటిని విమర్శిస్తే తప్ప మీడియాలో కూడా కనిపించలేని స్ధాయికి దిగజారుతున్నారు. పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వారు..పార్టీని కష్ట కాలంలో వదిలేసి వచ్చిన వారు కూడా పొంగులేటిని విమర్శిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఆఖరుకు కాంగ్రెస్‌ పార్టీకి తీరని ద్రోహం చేసిన వాళ్లు కూడా పార్టీ అదికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించిన పొంగులేటిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకన్నా విడ్డూరం మరొకటి వుండదు. పార్టీ పెంచి పెద్ద చేసినా, ఆ కృతజ్ఞత లేకుండా, అవకాశ వాద రాజకీయాల కోసం కండువాలు మార్చినవారున్నారు. పార్టీ అన్ని పదవులు ఇచ్చినా స్వార్ధం కోసం పార్టీని వీడిన వాళ్లున్నారు. ఎక్కడా దిక్కూ దివానం లేక మళ్లీ పార్టీ గూటికి చేరి పదవులు పొందిన వాళ్లు కూడా నిత్యం పొంగులేటిని ఆడిపోసుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయం అలాంటిది కాదు. ఆయన రాజకీయంగా తొలి అడుగుతోనే తెలంగాణ రాష్ట్రానికి వైసిపికి తొలి అధ్యక్షుడయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత వైసిపి నుంచి ఎంపిగా గెలిచారు. ఖమ్మం జిల్లాలో తన పట్టు ఏమిటో చూపించారు. తనతోపాటు ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తన నాయకత్వ పటిమ మొదటి ఎన్నికల్లోనూ చూపించారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని విమర్శిస్తున్న వారిలో ఏ ఒక్కరికీ ఇలాంటి బలమైన రాజకీయ చరిత్ర లేదు. పార్టీ పేరు చెప్పుకుంటే తప్ప గెలవలేరు. పార్టీలు బిఫామ్‌లు ఇస్తే తప్ప పోటీ చేయలేరు. పార్టీకి అడుగడుగునా మోసం చేసిన వాళ్లు పొంగులేటిపై నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదీ తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని చెప్పుకోవాలి. తమ స్ధానాలలో తాము గెలవలేని వాళ్లు కూడా పదవులు అందుకొని నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మొహంమీదే పడుతుంది. అది తెలిసినా పదే పదే అలాంటి పొరపాట్లు చేస్తూనే పోతుంటారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ఒడిదొడుకులు ఎదుర్కొన్న కాలంలో పార్టీ పక్కన నిలబడిన వారు కాదు. పార్టీకి అండగా వున్న వాళ్లు కాదు. పార్టీని నిలబట్టే ప్రయత్నం ఏనాడు చేసిన వాళ్లు కాదు. అవకాశ వాద రాజకీయాల కోసం ఇతరపార్టీలకు వెళ్లి అక్కడి నుంచి కాంగ్రెస్‌ను తిట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. మంత్రి పొంగులేటి పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పొంగులేని ప్రభుత్వంలో నెంబర్‌ టూగా కొనసాగుతుండడాన్ని ఓర్వలేకపోతున్నారు. సరిగ్గా ఆరు ఎన్నికలకు ఆరు నెలల క్రితం వరకు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరక ముందు ఆ పార్టీ పరిస్ధితి ఏ స్దితిలో వుంది? అనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిసిసి పగ్గాలు అందుకున్నారో అప్పటి నుంచి పార్టీని గాడిలో పెట్టారు. పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. పార్టీ క్యాడర్‌లో నమ్మకాన్ని నింపుతూ వచ్చారు. పార్టీ క్యాడర్‌కు భరోసా కల్పించారు. అడుగడుగునా అప్పటి ప్రభుత్వం మీద సిఎం. రేవంత్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. అనేక సార్లు జైలు పాలయ్యారు. అనేక ఉద్యమాలు చేపట్టారు. పోరాటాలు చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసిఆర్‌ను ఊపిరి సలపనివ్వకుండా రాజకీయం చేశారు. బిఆర్‌ఎస్‌ను చీల్చి చెండాడారు. కేసిఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. కేసిఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ వచ్చారు. కేసిఆర్‌ పాలనలో జరిగిన భూముల ఆక్రమణపై ప్రజల్లో చైతన్యం కల్గించారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీని ప్రజల ముందుంచారు. ఇలా రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం సాగించారు. ఆఖరుకు పాదయాత్ర చేపట్టారు. పార్టీని గ్రామ గ్రామం నుంచి బలోపేతం చేసేందుకు అనేక రకాలుగా కృషి చేశారు. కాని పార్టీకి ఇంకా బలం కావాలి. బిఆర్‌ఎస్‌ను కొట్టడానికి మరో బలం తోడు కావాలి అనుకున్నప్పుడు పార్టీకి కనిపించిన వెపన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆ సమయంలో పిపిసి. అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి వెళ్లి , పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యత తీసుకున్నారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్‌ గర్జన మొదలు పెట్టారు. బిఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయేలా పొంగులేటి రాజకీయం చేశారు. ప్రజలను చైతన్యం చేశారు. తానున్నానని భరోసా కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఖమ్మంలో కారును తిరగన్వికుండా చేస్తానని శపథం చేసి నెరవేర్చారు. ఇదీ మంత్రి పొంగులేటి రాజకీయ యుద్దం. ఇలాంటి యుద్దం పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తప్ప మరొకరెవరైనా చేశారా? టిక్కెట్ల కోసం ఆరాపటపడ్డారు. టిక్కెట్ల కోసం ఎదురుచూశారు. వాళ్ల గెలుపుకోసమే శ్రమించారు. కాని ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేసే ప్రయత్నం చేశారా? తమ కన్నా పార్టీ గెలుపు ముఖ్యమని ముందుకుసాగారా? ఎన్నికల సమయమంతా చెమటోడ్చి వాళ్లు గెలిచేందుకే సమయం సరిపోలేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి తమ నియోజకవర్గాలలో కనీస ప్రచారానికి వెళ్లకుండానే గెలిచిన నాయకులు. ఇతర నియోజక వర్గాలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం అహర్నిషలు కృషి చేశారు. ఇదీ పొంగులేటి నాయకత్వ పటిమ. పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంటే పాన్‌ నమిలినంత సులువు కాదు. అయినా అధిష్టానానికి అన్నీ తెలుసు. ఎవరు ఏమిటో వారికి పూర్తిగా తెలుసు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంకితభావం ఎంత గొప్పదో తెలుసు. పార్టీ కోసం ఆయన కష్టపడిన తీరు తెలుసు. పార్టీకి అండగా వుంటూ ఆయన ఏం కోల్పోయారో కూడా తెలుసు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎన్ని త్యాగాలు చేస్తే పార్టీ గెలిచిందో కూడా డిల్లీ పెద్దలందరికీ తెలుసు. ఇప్పుడు మంత్రి పొంగులేటి మీద లేనిపోని విమర్శలు చేస్తే డిల్లీ పెద్దలు నమ్మరు. లేనిపోని రాద్దాంతాలు చేసి పార్టీకి నష్టం చేకూర్చుతున్న వాళ్లు ఎవరో డిల్లీ అధిష్టానానికి అన్నీ తెలుసు. ఇచ్చిన పదవులకు న్యాయం చేయలేక, పని చేయలేని వాళ్లే లేనిపోని పితూరీలు మోస్తుంటారు. ఇతర నాయకులు ఎదుగుతుంటే చూడలేరు. అందుకే మంత్రి పొంగులేటి మీద లేనిపోని పుకార్లు పుట్టించి, అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారు. కాని ప్రజలు నమ్మడం లేదు. పార్టీ క్యాడర్‌ నమ్మడానికి సిద్దంగా లేదు. అవకాశ వాదుల మాటలు ఎవరూ నమ్మరు. చెరపకురా చెడేవు అని సామెతను నిజం చేసుకున్న వాళ్లు కూడా మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారు. వాళ్లు అక్కడే వుంటారు. ఎదుగుతున్న వారిని చూస్తూ ఏడుస్తూనే వుంటారు. మంత్రి పొంగులేటి ప్రభను తగ్గించలేరు. ఆ వెలుగులు తక్కువ చేయలేరు.

‘‘పిఏ’’లు పైర’’వీరులు’’..’’పిఆర్వో’’లు ‘‘వసూల్‌ రాజాలు’’???

ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు

‘‘పిఏ పిఆర్‌ఓ’’ లు ‘‘మూటల కోసమే’’ పనిచేస్తున్నారు!

`మంత్రులు, ఎమ్మెల్యేలను బద్నామ్‌ చేస్తున్రు!

`ప్రజల నుంచి పిఏ, పిఆర్వోల మీద సామాన్యుల నిరసనలు.

`పార్టీ నాయకులకు కూడా విలువివ్వరు.

`కార్యకర్తలను పురుగుల్లా చూస్తారు!

`మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పుకోలేక నాయకులు మధనపడుతున్నారు.

`ఎమ్మెల్యేలను నాయకులను కూడా కలువనివ్వరు!

`మంత్రుల దరి చేరనివ్వరు!

`ఎమ్మెల్యే బిజీ, బిజీ అని చెప్పి తిప్పించుకుంటున్నారు.

`ఎలాంటి సమాచారం తెలియనీయకుండా జాగ్రత్త పడుతుంటారు.

`సామాన్యులకు అప్పాయింట్‌ ఇవ్వరు!

`జనాలకు మంత్రులు, ఎమ్మెల్యేలను దూరం చేస్తున్నారు.

??జర్నలిస్టుల ఫోన్లుకు కూడా స్పందించరు.??

`మంత్రులు, ఎమ్మెల్యేల అధికారిక పర్యటనలపై వివరాలివ్వరు.

`కనీసం వార్త రాసి మీడియాకు పంపడం కూడా చేతకాదు!

`మంత్రుల సక్సెస్‌ స్టోరీలకు సమాచారం ఇవ్వరు.

`వార్తలను చూసి పారిశ్రామిక వేత్తలకు ఫోన్లు?

`రియల్‌ వ్యాపారులకు బెదిరింపులు?

`ఎమ్మెల్యేల పేరు చెప్పి దందాలు, పైరవీలు!

`అధికారులను సైతం హడలెత్తించి పనులు చేసుకుంటున్నారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న సామెతను నిజం చేస్తున్నారు కొంత మంది ప్రజా ప్రతినిదుల పిఏలు, పిఆర్వోలు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంత మంది పిర్వోలు, పిఏలు అత్యుత్సాహానికి పోయి, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలకు దూరం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పలకుబడిని పలుచన చేస్తున్నారు. వారి పేర్లు చెడగొడుతున్నారు. వారికి వున్న ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు. ప్రజల్లో వారికి వున్న ఆదరణను దూరం చేస్తున్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకే తలవంపులు తెస్తున్నారు. రాజకీయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శల పాలయ్యేలా చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రాలంచేలా వ్యవహరిస్తున్నారు. పిఏలు, పిఆర్వోలు చేసే మకిలి పనులకు ప్రజా ప్రతనిధులు సమాధానం చెప్పుకునే పరిసి ్దతి తీసుకొస్తున్నారు. మేమే ఎమ్మెల్యేలకు బాస్‌లమన్నంత దర్పం ప్రదర్శిస్తున్నవాళ్లున్నారు. మూడు ముడుపులు, ఆరు పైరవీలు అన్నట్లు అడ్డగోలు సంపాదనకు ఎగబడుతున్నారు. ప్రజా ప్రతినిధుల పరువు గంగపాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజలే పాలకులు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిదులైన నాయకులు ప్రజా సేవకులు. ప్రజల కోసం ఆరాటపడే మనస్తత్వం వున్న వారు మాత్రమే సహజంగా నాయకులౌతారు. ప్రజలకు దూరంగా వుండాలనుకునే వారు నాయకులు కాలేరు. నాయకులు కావాలని చాలా మందికి వుంటుంది. కాని ప్రజా సేవ చేయగలిగే వారు మాత్రమే నాయకులుగా మారుతారు. ప్రజా జీవితంలో వుంటారు. ప్రజలు తమను ఎన్నుకంటే మరింత మేలైనా, మెరుగైన సేవ చేయడానికి ప్రజా ప్రతినిధులౌతారు. ప్రజల కోసం జీవితాలు త్యాగం చేసిన వారు మన దేశంలో చాలా మంది వున్నారు. ప్రజల ప్రాణంగా బతికిన వారు అనేక మంది వున్నారు. ప్రజల కోసం జీవితాంతం తపన పడిన వారు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. ఏ నాయకుడైనా సరే ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచిపోవాలనే కోరుకుంటారు. తన తర్వాత తరాలు తనను గుర్తు చేసుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి సేవలు చేస్తుంటారు. ఒక్కసారి నాయకుడైన తర్వాత ఎవరూ ప్రజలకు దూరంగా బతకాలని కోరుకోరు. గెలిచినా, ఓడినా ప్రజల్లోనే వుంటారు. ఒకప్పుడు నాయకులు ఎదరులేకుండా, తిరుగులేకుండా వరుస విజయాలు చూస్తుండేవారు. ఇప్పుడు ఒక్కసారి గెలిచిన నాయకుడు మళ్లీ గెలుస్తామా? లేదా? అన్న మీమాంసలోనే రాజకీయం చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నా, ప్రభుత్వాలను మార్చినా, కొంత మంది నాయకులు ఎప్పుడూ గెలుస్తూనే వుంటారు. అది వాళ్ల నాయకత్వ పటిమకు, ప్రజా సేవకు నిదర్శనం. కాని కొన్ని సార్లు నాయకులు ఎందుకు ఓడిపోయారో కూడా అర్దం కాని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఐదేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే వుంటారు. ప్రజా సేవలో వుంటారు. అభివృద్ది పనులు అనేకం చేస్తూనే వుంటారు. తమ నియోజకవర్గ అభివృద్ది కోసం పాటు పడుతూనే వుంటారు. కాని మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలౌతుంటారు? కారణం ఆ నాయకులు కాదు. నాయకులు నమ్మిన మనుషులు. నాయకుల వద్ద పనిచేసే అనుచరులు. ముఖ్యంగా పిఏలు, పిర్వోలు. ఈ విషయం పదవులు పోయిన తర్వాత గాని సదరు నాయకులకు తెలియకుండాపోతోంది. పిఏలు, పిర్వొల మూలంగా ఇటీవల కాలంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్లు నమ్మిన వాళ్లు బాగా పనిచేస్తున్నారని అనుకుంటారు. అలా వాళ్లు చెప్పిన మాటలు వింటూ నాయకులు వినడమే రాజకీయానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తున్నాయి. గతంలో గొప్పగా పనిచేసిన నాయకులు కూడా పిఏలు, పిర్వోల మూలంగా రాజకీయ మనుగడలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లున్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో కూడా వాళ్లే కనిపిస్తున్నారు. నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా పిఆర్వోలు, పిఏలు మాత్రం మళ్లీ, మళ్లీ ప్రత్యక్షమౌతుంటారు. అదే పనిని వాళ్లు చేస్తుంటారు. దశాబ్ధాల తరబడి అదే పిఏలు, అదే పిర్వోలుగా పనిచేస్తున్న వాళ్లు అనేకమంది వున్నారు. అలా పాతుకుపోయి ప్రభుత్వాలను భ్రష్టుపట్టించిన వాళ్లే , మళ్లీ మళ్లీ ప్రత్యక్షమౌతుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు, ఇప్పటి వరుకు కొనసాగుతున్న వాళ్లు అనేక మంది వున్నారు. కాని పాపం వీళ్లను నమ్ముకున్న నాయకులు మాత్రం ఓటమి పాలై రాజకీయాలకు దూరమైన వారు కూడా వున్నారు. అలా వుంటుంది. పిఏల పనితీరు. ఎమ్మెల్యే, మంత్రులు అంటే ప్రజల మనుషులు. ప్రజా ప్రతినిధులు. ప్రజల కోసం వున్న సేవకులు. ఒక్కసారి ప్రజా ప్రతినిధి అయిన తర్వాత వారిని ప్రజలకు కలవకుండా చేస్తున్నదే ఈ పీఆర్వో, పిఏలు. వారికి లేనిపోనివి చెప్పి, నాయకులకు, ప్రజలకు దూరం చేస్తుంటారు. ఎన్నికల సమయంలో అందరూ కలిసిపనిచేస్తారు. కొందరు నాయకులు ఎక్కువ పనిచేయొచ్చు. కొంత మంది నాయకులు తక్కువ పనిచేయొచ్చు. కాని వారందరూ అదే పార్టీకి చేందిన నాయకులు. కాని ఒక నాయకుడు ప్రజా ప్రతినిధి అయిన తర్వాత వారికి దగ్గర కావడానికి అనేక మంది రకరకాల వార్తలు మోసుకొని వస్తారు. నిజానికి అందరూ కలిసి పని చేస్తేనే నాయకులు గెలుస్తుంటారు. కార్యకర్తల్లో కూడా కొన్ని విభేదాలుంటాయి. ఆదిపత్యాలుంటాయి. నాయకులుగా ఎదగాలన్న తపన వుంటుంది. ఎమ్మెల్యే, మంత్రి ఆశీస్సులతో మరింత ఉన్నత స్దానానికి చేరుకోవాలని వుంటుంది. ఈ ద్వితీయ శ్రేణి నాయకుల ఆశలే పిఏలకు, పిఆర్వోలకు వరంగా మారుతుంది. ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పే ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే చెవిలో వేసి, తనకు అత్యంత సమ్మకస్తుడు అని పేరు పొందేందుకు పిఏలు, పిర్వోలు ప్రయత్నిస్తుంటారు. అలా నాయకుడు గుడ్డిగా నమ్మే స్ధితికి వచ్చిన తర్వాత ఇక పిర్వోలు, పిఏలు తమ ప్రతాపం చూపిస్తుంటారు. ప్రజలకు ప్రజా ప్రతినిధులను దూరం చేస్తుంటారు. ఎమ్మెల్యేల ఫోన్లుకూడా తన చేతుల్లో పెట్టుకొని, ఎవరి ఫోన్‌ ఎత్తాలో, ఎవరి ఫోన్‌ ఎత్తకూడదో కూడా పిఏలు, పిర్వోలే నిర్ణయించే స్ధాయికి చేరుకుంటారు. కేవలం తమకు పనికి వచ్చే వారి ఫోన్లు మాత్రమే లిప్ట్‌ చేస్తుంటారు. లేకుంటే ఎమ్మెల్యే బిజీగా వున్నారంటూ దాట వేస్తుంటారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా, అదే సమాదానం చెబుతుంటారు. నాయకులు ఫోన్‌ చేసిన విషయం, ఎమ్మెల్యేలు, మంత్రులకు చేరవేయరు. ఎందుకంటే ఆ స్దాయిలో వుండే ప్రజా ప్రతినిధులకు ఊరిపి సలపనంత పని వుంటుంది. పని ఒత్తిడి కూడా గతం కాన్న ఎక్కువౌతుంది. దీనిని ఆసరా చేసుకొని పిఏలు, పిర్వోలు చెలరేగిపోతుంటారు. ఎమ్మెల్యేల దర్శనం చేసుకోవాలంటే, పిఏలు, పిర్వోలను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్తితి వస్తుంది. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్దితే ఇలా వుంటే సామాన్య ప్రజల పరిస్దితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు నాయకుడి వద్దకు ప్రజలు నేరుగా వెళ్లిపోయే పరిస్దితి వుండేది. నాయకులు కూడా ప్రజల వద్దకు చేరుకొని ప్రజాసమస్యలు తెలుసుకునే వెసులుబాటు వుండేది. ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. ఎమ్మెల్యేల చుట్టూ అధికారులు, వ్యక్తిగత సిబ్బంది, పిఏలు, పిర్వోలు అంటూ చక్రబందనాలుంటాయి. వీళ్లందరినీ దాటుకొని వేళ్తేగాని ప్రజలకు నాయకులు అందుబాటులోకి రాని పరిస్ధితి నెలకొన్నది. ఈ విషయం సదరు ఎమ్మెల్యేలకు తెలియదు. మంత్రులకు కూడా తెలియదు. ఒకప్పుడు జర్నలిస్టులు నేరుగా ఎమ్మెల్యే, మంత్రులను కలిసే అవకాశాలుండేవి. అప్పుడు అది కూడా లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల అప్పాయింటు మెంటుకోసం పిఏ, పిర్వోలను అడగాల్సిన పరిస్ధితి ఎదురౌతోంది. ఇంతకీ ఈ పిఏలు, పిర్వోలు ఏం చేస్తున్నారంటే దందాలు చేస్తున్నారు. వసూళ్ల పర్వం మొదలు పెట్టారు. పైరవీ కారుల అవతారం ఎత్తుతున్నారు. వసూల్‌ రాజాలుగా మారుతున్నారు. రోజుకు ఎంత సంపాదిస్తున్నామన్నదానిపై దృష్టిపెడుతున్నారు. ఇదీ బైట వినిపిసున్న మాట. ప్రతి పనికి రేటు నిర్ణయిస్తూ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు అనేకమంది పిఏలు, పిర్వోల మీద వున్నాయి. పిఆర్వోలు మంత్రులకు సంబంధించిన షెడ్యూల్‌ను మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అభివృద్ది, ప్రగతిని ఎప్పటికప్పుడూ వివరిస్తూ, వార్తలు పంపిస్తూ వుండాలి. సంబంధిత నియోజకవర్గాలలో వార్తా పత్రికల్లో వచ్చిన ప్రజా సమస్యలు ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. కాని ఆ పని చాల మంది పిర్వోలు చేయడం లేదు. జర్నలిస్టులకు కనీస సమాచారం అందించేందుకు కూడా ఇష్టపడడంలేదు. ఓ నాలుగుసార్లు ఫోన్‌ చేస్తే జర్నలిస్టుల నంబర్లు కూడా బ్లాక్‌ చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజల్లో లేనిపోని అపోహలు ఎదురయ్యేలా చేస్తున్నారు. ఇక పత్రికల్లో వచ్చే వార్తలలో తమకు ఆదాయ వనరులు సమకూరుతాయనుకున్నప్పుడు సదరు వ్యక్తులకు ఫోన్లు చేయడం, ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్ల పాల్పడడం చేస్తుంటారు. అవతలి వ్యక్తులు నిజంగానే ఎమ్మెల్యే చేయించారేమో అనే భయంతో ముళ్లెలు మట్ట చెప్పడం కూడా జరుగుతుంది. ఇక వ్యవస్దలో అనేక రకాల పనులు వుంటాయి. వాటి కోసం కొంత మంది పైరవీలు చేసుకుంటారు. అలాంటి పనులతో పిఏలు పంట పండిరచుకుంటున్నారు. పైరవీలు, పనులు చక్కదిద్ది నాలుగు రాళ్లు సంపాదించుకోవడంలో పిఏలు, పిర్వోలు బీజీబిజీగా వున్నారంటూ ఆనేక ఆరోపణలున్నాయి. ఇలాంటి పిర్వోలను, పిఏలను గుర్తించి ఎమ్మెల్యేలు, మంత్రులు తేరుకోకపోతే మాత్రం రాజకీయంగా నష్టం చవి చూడాల్సింది వాళ్లే.. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, మంత్రులు తేరుకొని నాయకులు, ప్రజలను కలిసి, ఎదురులేని, తిరుగులేని రాజకీయాలు చేస్తూ, మళ్లీ మళ్లీ గెలుస్తూ, ప్రజా సేవ చేయాలంటే స్వార్ధపరులైన పిఏలను, పిర్వోలను పక్కన పెట్టకపోతే తీరని నష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్లవుతారు.

గతిశీలి..ప్రగతి శీలి.

జనం గుండెల్లో సారే బడి గుడి.

`జనసర్వస్వమంతా కేసీఆర్‌ మది.

`తెలంగాణ కోసం పడరాని పాట్లు పడిన నాయకుడు.

`తెలంగాణ కోసం అందరి మెట్లు ఎక్కి దిగిన నాయకుడు.

`తెలంగాణ విషయంలో బేషజాలకు పోలేదు.

`అభివృద్ధిలో ఎక్కడా రాజీపడలేదు.

`తెలంగాణ కన్నీరు తూడ్చడం కోసం పదేళ్లు కంటి నిద్ర పోలేదు.

`తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కడుపు సరిగ్గా తిన్నది లేదు.

`రాజకీయ విలువలకు ప్రాణం పెట్టిన నాయకుడు కేసీఆర్‌.

`అవకాశ వాద రాజకీయాలకు తావివ్వని నాయకుడు కేసీఆర్‌.

`గెలుపోటముల గురించి ఏనాడు మధనపడలేదు.

`ప్రజలు ఓడిపోవద్దని తాపత్రయ పడిన నాయకుడు కేసీఆర్‌.

`నా ప్రజలు మళ్ళీ మోసపోవద్దని భావించిన నాయకుడు.

`నా ప్రజలు కలలో కూడా గోస పడొద్దని కోరుకున్న నాయకుడు.

`ప్రజలు కష్టాలు పడుతుంటే చూడలేక తల్లడిల్లిపోతున్నాడు.

`పదేళ్లలో తెలంగాణను నందనవనం చేసిన నాయకుడు.

`మోడువారిపోతున్న తెలంగాణకు జీవం పోసే నాయకుడు కేసీఆర్‌.

`అందుకే మళ్ళీ జనమంతా కేసిఆర్‌ జపం చేస్తున్నారు.

`కేసీఆర్‌ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు

`ఎక్కడ విన్నా కేసీఆర్‌ పాటలతో నృత్యాలు చేస్తున్నారు.

`కేసీఆర్‌ పై తమ అభిమానాన్ని ప్రపంచానికి చాటేలా తెలియజేస్తున్నారు.

`ఉరకలెత్తే ఉత్సాహం జై కేసీఆర్‌ అని నినదిస్తున్నారు.

`‘‘జూబ్లీ హిల్స్‌’’ జనమంతా ‘‘కేసిఆర్‌’’ నామస్మరణే చేస్తున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాజకీయాలంటే కేసిఆర్‌కు ఆట విడుపు కాదు. అధికారం కోసం అసలేకాదు. ప్రజల కోసం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజా చైతన్యంకోసం, వారి జీవితాల్లో వెలుగుల కోసం. ఇదీ కేసిఆర్‌ రాజకీయం. అందుకే తెలంగాణ సాదన కోసం ఎవరూ చేయని త్యాగం చేశారు. పోరాటం చేశారు. ఉద్యమాన్ని ఎత్తుకొని తెలంగాణ సాదించారు. జీవితమే పోరాటం చేసుకొని ముందుకు సాగారు. తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా ముందుకెళ్లారు. తెలంగాణ మొత్తం ఏకం చేశారు. తెలంగా మొత్తం కేసిఆర్‌ గొంతుగా మార్చారు. అందుకే ఇప్పుడు ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒకటే మాట. ఒకటేపాట. ఒకటే బొమ్మ. అది కేసిఆర్‌. సారే రావాలంటున్నది తెలంగాణ అంటూ ఉద్యమ కాలంలో ఎలా వినిపించిందో ఇప్పుడూ అదే వినిపిస్తుంది. అంతకన్నా వంద రెట్లు ఎక్కవ వినిపిస్తుంది. పండగైనా, పబ్బమైనా సరే కేసిఆర్‌ పాట లేకుండా జరగడం లేదు. పెండ్లిల్లో కేసిఆర్‌ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. బరాత్‌లల కేసిఆర్‌ పాటలు పెట్టుకుంటున్నారు. ఆఖరుకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో, ఊరేగింపుల్లో కూడా ఎక్కడ విన్నా కేసిఆర్‌ పాటలే. బతుకమ్మ ఆడిన సందర్భాలలో కేసిఆర్‌ పాటలే వింటున్నారు. పల్లెల్లో ఎవరిని కదిలించినా కేసిఆర్‌ జపం చేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. కేసిఆర్‌ను తల్చుకోకుండా రోజు గపడం లేదు. ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో తెలంగాణలోని మహిళలు, పెద్దలు, వృద్దులు, రైతులు అన్ని వర్గాలు కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. పదేళ్ల పాలన గురించి చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కేసిఆర్‌ తెచ్చిన నీళ్లను గురించి చెప్పుకుంటున్నారు. కేసిఆర్‌ నింపిన చెరువులు గురించి చెప్పుకుంటున్నారు. ఇంటింటికీ ఇచ్చిన మిషన్‌ భగీరధ నీళ్ల గురించే చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కాలువలు తెచ్చిన కేసిఆర్‌ గురించే చర్చలు పెడుతున్నారు. పదేళ్లు పంటలు ఎండిపోకుండా చూసుకున్న కేసిఆర్‌ గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటును తల్చుకుంటున్నారు. పదే పదే కరంటు పోతున్నప్పుడల్లా కేసిఆర్‌ వున్నప్పుడు ఒక్కసారి పోకపోతుండే అనుకుంటున్నారు. ఇలా ఏ సందర్భమైనా సరే కేసిఆర్‌ను ప్రతి పల్లె తల్చుకుంటోంది. ప్రతి పట్టణం గుర్తు చేసుకుంటోంది. అందుకే కేసిఆర్‌ కేసిఆరే అంటోంది. ఒకటా రెండా..కేసిర్‌ చేసిన మంచి పనులు జనం గుండెల్లో నిలిచిపోయాయి. వారికి ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు రూ.200 వున్న పించన్‌ తెలంగాణ రాగానే ఒకేసారి రూ.1000కి పెంచారు. తర్వాత మళ్లీ రూ.2000 వేలు చేశాడు. దివ్యాంగులకు ఏకంగా రూ.6500 పించన్‌ ఇచ్చాడు. కుల వృత్తుల దారులకు పించన్లు ఇచ్చాడు. ఇలా 57 సంవత్సరాలు దాటిని సుమారు 46లక్షల మందికి పించన్లు ఇచ్చి, ఆ కుటుంబాలను అదుకున్నారు. ఇక కేసిఆర్‌ రైతులకు చేసిన మేలు ప్రపంచంలో ఏ పాలకులు చేయలేదు. ఏ నాయకులు రైతుల మేలు కోసం ఆలోచించలేదు. రైతు బంధు పేరు మీద పెట్టుబడి సాయం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి ఆలోచన ఒకటి చేయొచ్చని స్వతంత్ర భారతావినిలో ఏ నాయకుడు, పాలకుడు ఆలోచించింది లేదు. రైతుల మేలు కోరి సాయం చేసింది లేదు. రైతులు రుణగ్రస్తులు కాకుండా చూసుకున్నది లేదు. తెలంగాణ రాక ముందు రైతు అనే పేరు చెప్పుకోవడానికి కూడా కన్నీళ్ల పర్యంతమైపోయేవారు. పడావు బడ్డ భూములను చూసి దుక్కిస్తుండేవారు. ఎండిన దుక్కిని చూసి కళ్ళతో తడుపుకోవాలని అనుకునేవారు. ఆశాకం చేసి చూస్తూ, వానమ్మా రావమ్మా అంటూ పాటలు పాడుకుండే వారు. కరువు తప్ప కాలం కాకపోయినా, భూమిని నమ్ముకొని మన్ను తిని బతికారు. కూలీలుగా మారి జీవితాలు గడుపుకున్నారు. ధైర్యం వున్న వాళ్లు ఊరెళ్లిపోయారు. పొట్ట చేత పట్టుకొని అప్పులు చేసుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ రైతులంతా రాజులయ్యారు. కేవలం తెలంగాణ రాగానే రాజులైన రైతులకు అన్నీ సౌకర్యాలను కల్పించి, రారాజులను చేశాడు. రైతులు రారాజుల్లా కాలుమీద కాలేసుకొని బతికేలాచేశాడు. నీళ్లిచ్చాడు. పెట్టుబడి సాయం చేశాడు. సకాలంలో అవసరమైన ఎరువులు అందించాడు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాడు. పండిన పంటను కళ్లాలలోనే కొనుగోలు చేశాడు. మూడురోజుల్లో వడ్లపైకం బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ప్రతి సారి టంగ్‌ టంగ్‌ మని పెట్టుబడి సాయం అందించాడు. పంటలు నష్టపోతే నష్టపరిహారం వెంటనే అందించాడు. ఇలా అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న ప్రపంచంలోనే ఏకైక నాయకుడు కేసిఆర్‌. రాజకీయాల్లో నైతిక విలువలు అంటే అర్దం కేసిఆర్‌ అనే చెప్పాలి. తెలంగాణ కోసం ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్లు తన రాజకీయం కన్నా, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. తెలంగాణ అభివృ ద్దిలోనూ ఎక్కడా రాజీ పడలేదు. తెలంగాణ తెచ్చి, ఎలా బంగారు తెలంగాణ చేయాలో తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ అరవై ఏండ్లు గోసపడగింది చాలు. ఇంక ఎప్పుడూ గోస పడొద్దని అనుకున్న నాయకుడు కేసిఆర్‌. అరవై ఏళ్లలో తెలంగాణ పడిన గోసను, ఆరేళ్లలో తీర్చిన గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. తెలంగాణ తేవడం కోసం కడుపు నిండా తిన్నది లేదు. తెలంగాణ బాగు కోసం కంటి నిండా నిద్రపోయింది లేదు. అందుకే తెలంగాణ ఇప్పుడు ఇలా వెలుగుతోంది. లేకుంటే అదే పాత కాలపు చీకట్లోనే మగ్గుతూ వుండేది. బిఆర్‌ఎస్‌ను వీడిన వాళ్లయినా సరే కేసిఆర్‌ వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించిన సందర్భం లేదు. పార్టీలు మారిని ఎమ్మెల్యేలు కూడా కేసిఆర్‌ గొప్పదనమే గుర్తు చేస్తారు. తన జేబులో పెన్ను వున్నా, ఆఖరుకు అది కూడా ఇతరులకు ఇచ్చే మనస్తత్వం కేసిఆర్‌ది అని కేశవరావు చెప్పిన మాట అందరూ విన్నదే. అంటే రాజకీయంగా విభేదించి వెళ్లిన వారు కూడా కేసిఆర్‌ను పల్లెత్తు మాట అనాలంటే కూడా నోరు రాదు. అదీ కేసిఆర్‌ నాయకత్వం విశిష్టతకు సంకేతం. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఆయన అనుసరించిన తీరు అందరి చేత ప్రశంసలు అందుకుంటూనే వుంటుంది. ఎమ్మెల్యేల మరణంతో వచ్చిన ఏ ఉప ఎన్నికైనా సరే వారి కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం కేసిఆర్‌కు తెలుసు. రాజకీయాల కోసం ఆయన ఇతరులకు సీట్లు కేటాయించింది లేదు. గెలిచినా, ఓడినా నైతికతను ఆయన ఏనాడు వదిలిపెట్టలేదు. అయితే కేసిఆర్‌ వల్ల మేలు పొంది, రాజకీయంగా ఎదిగిన వారిలో కొంత మంది స్వార్ధపరులుంటారు. వారి అవకావాద రాజకీయాలను చూపిస్తుంటారు. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు. అలాంటి వారు మాత్రమే కేసిఆర్‌ను విమర్శిస్తుంటారు. అంతే కాని తెలంగాణలోని ఏ పార్టీ నాయకులైనా, ఏ సమాజమైనా సరే కేసిఆర్‌ వ్యక్తిత్వాన్ని శంకించేందుకు ఇష్టపడరు. అంత గొప్పది కేసిఆర్‌ నాయకత్వం. కొందరు కురుచ గుణం వున్న నాయకులు చేస్తున్న విమర్శల వల్ల వాళ్లే చులకనౌతున్నారు. కేసిఆర్‌ గ్రాఫ్‌ మరింత పెంచుతున్నారు. నిజం చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్ధులే ప్రజల కన్నా ఎక్కువగా కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కేసిఆర్‌ పేరు పదేపదే తల్చుకుంటూ రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత పాలక పెద్దలందరూ నిత్యం కేసిఆర్‌ జపం చేస్తూనే పూట గడుపుకుంటున్నారు. ప్రతి సందర్భంలోనూ పదే పదే పలు సార్లు గుర్తు చేసుకుంటున్నారు. తాము చేసిందేమీ చెప్పలేక, కేసిఆర్‌ను నిందించి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. బొక్కా బోర్లా పడుతున్నారు. తెలంగాణ కథ మళ్లీ మొదలైంది. ఇప్పుడే మొదలైంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలతో మళ్లీ మొదలౌతోంది. జనమే చూసుకుందామని ఇతర పార్టీలకు సవాలు విసురుతున్నారు. కేసిఆర్‌ ఫోటోను పక్కన పెట్టుకొని కొండంత ధైర్యం యువత ప్రదర్శిస్తున్నారు. దటీజ్‌ కేసిఆర్‌ అని యువత నోట జాలు వారుతుంటే కేసిఆర్‌ గర్జన వినిపిస్తోంది.

ఇది కంకరా..సుద్దముక్కా!?.. ఎపిసోడ్‌ -1

‘‘వేల కోట్లు’’ దోచుకున్నారు?

`దుబ్బను కూడా కంకర అని నమ్మిస్తున్న ఘనులు!

`‘‘క్రషర్‌ కంపెనీలన్ని’’ సిండికేట్‌ అయ్యి ప్రజాధనం దోచుకుతిన్నాయి.

`‘‘మహా నిర్మాణాన్ని’’ నవ్వుల పాలు చేశాయి

`పలుగు రాయితో సమానం కూడా కాదు!

`ఇదా కంకర..కండ్లు మూసుకున్నారా!

`కాసులకు కక్కుర్తి పడి కంకర అని తేల్చారా!

`ఈ కంకర ప్రాజెక్టులకు వాడతారా!

`ఎర్ర గుట్టల రాయిని కంకర అంటారా?

`కాసులకు కక్కుర్తి పడి ప్రజా ధనం దోచుకున్నారు?

`క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు వద్దన్నా వినిపించుకోలేదు!

`క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు కాదన్నా వాడేశారు!

`కాంట్రాక్టర్ల ధన దాహానికి అధికారులు తోడయ్యారు!

`చూసేవారెవరని విచ్చలవిడిగా ఎర్రకంకర వాడేశారు!

`మహా ప్రాజెక్టును సర్వనాశనం చేశారు!

`అది కంకరే కాదు! ప్రాజెక్టులకు సరఫరా చేశారు!!

`మన్ను మశానం తప్ప కంకర అసలే కాదు!

`అవునవును అని తల ఊపే అధికారులు!

`వరంగల్‌ గుట్టల్లో బలమైన బండలే లేవు!

`కంకర తయారు చేయడం సాధ్యమే కాదు!

`గులకరాళ్లను కంకర అని సరఫరా చేస్తున్నారు!

`ఎర్రగుట్టలు తొలిచి కంకర అని నమ్మిస్తున్నారు.

`కాంట్రాక్టర్లు..అధికారులు పంచుకుతింటున్నారు!

`ఇదే కంకర ఓ పెద్ద ప్రాజెక్టులో కూడా వాడారు?

`ఇప్పుడు నేషనల్‌ హైవేల నిర్మాణానికి వాడుతున్నారు!

`ఇంటికి ఏ మాత్రం పనికి రాదు!

`ప్రాజెక్టుల నిండా నింపేశారు!

`ప్రాజెక్టుల నిర్మాణం అబాసుపాలు చేశారు!

`ప్రజాధనం నీళ్ల పాలు చేశారు!

`సగం వాటలు అధికారుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాయి!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో కాంట్రాక్టర్ల బరితెగింపు, అధికారుల కాసుల కక్కుర్తి మూలంగా ప్రజా దనం పెద్దఎత్తున దుబారా అవుతోంది. దుర్వినియోగమౌతోంది. ప్రభుత్వానికి నాణ్యమైన కంకర సరఫరా చేస్తామనిచెప్పి, టెండర్లు దక్కించుకొని పనికి రాని కంకర సరఫరా చేస్తున్నారు. సుద్దకూడా అంతో నయమనేంత నాసిరకమైన కంకర సరఫరా చేశారు. అసలు దానిని కంకర అని ఎలా నిర్ధారించారో..ఎలా కంకర అని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నారో అర్ధం కాదు. కంకర పేరుతో సరఫరా చేస్తున్న దానిని అది కంకరే అని అదికారులు ఎలా నిర్దారిస్తున్నారో..ఎలా అందుకు అనుమతులు జారీ చేస్తున్నారో తెలియకుండాపోతోంది. గత పదేళ్ల కాలంగా ఈ దుబారా వ్యవహరం విపరీతంగా సాగుతోంది. సహజంగా ఏ నిర్మాణానికైనా సరే నాణ్యమైన కంకర కావాలని కోరుకుంటాం. మంచి కంకరలో చిన్న డస్టు కూడా వుండకుండా జాగ్రత్తపడతాం. ఆ కంకర తెచ్చుకున్న తర్వాత ఏ మాత్రం అనుమానం వచ్చినా తిరిగి వాపస్‌ చేయిస్తాం. మరి అలాంటిది తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు అధికారులు దగ్గరుండి పనికి రాని, ఎందుకూ పని చేయని కంకరను ప్రోత్సహిస్తున్నారు. కంకర అంటే ఏళ్ల తరబడి మన్నేలా వుండాలి. చెక్కు చెదరకుండా వుండాలి. గాలి, నీటి కోతను తట్టుకోగలగాలి. దశాబ్ధాల తరబడి బలంగా,దృఘంగా వుండాలి. నిజమైన రాయితో తయారైన కంకర వందల సంవత్సరాలైనా సరే గట్టిగా వుంటుంది. నిర్మాణాలను పటిష్టంగా వుంచుతుంది. ఇంటి నిర్మాణాలకే ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టే నిర్మాణాలకు మరింత బలమైన కంకర అవసరం. ఎండకు, వానకు, వరదలకు తట్టుకొని నిలబడేలా వుండాలి. అది రోడ్డైనా, ప్రాజెక్టులైనా, చెరువులైనా, చెక్‌ డ్యామ్‌లైనా, రిజర్వాయర్లైనా సరే కంకర ఎంత బలంగా వుంటే ఆ నిర్మాణాలు అంత ఎక్కువ కాలం నిర్మాణాలు చెక్కు చెదరకుండా వుంటాయి. కాని తెలంగాణలోని కొంత మంది అవినీతి అదికారుల దుర్భుద్ది మూలంగా, దుర్మార్గులైన కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి ప్రజా ధనం దోచుకుతినేందుకు ఎందుకూ పనికి రాని కంకర విచ్చలవిడిగా వాడుతున్నారు. అందుకే మన కళ్లముందే అనేక నిర్మాణాలు చెదిరిపోతున్నాయి. కూలిపోతున్నాయి. కొట్టుకుపోతున్నాయి. అవి నాసిరకం కంకర నిర్మాణాలని తేలిపోతున్నాయి. వాటి గురించి పట్టించునే నాధుడే కరువయ్యారు. ఎంత సేపు రాజకీయాలు తప్ప, వ్యవస్ధలో నిటారుగా నిలడాల్సిన అధికారులు ఎందుకు వంగిపోతున్నారు. ఎందుకు ఇంత లాలూచీగా వ్యవహరిస్తున్నారు. భయం లేకుండా పోతున్నారు. అనేది కూడా ఇక్కడ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు, రోడ్ల నిర్మాణాలకు ఎందుకూ పనికి రాని ఎక్రకంకరణను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. వరంగల్‌ జిల్లాలో కట్టడాలకు అవసరమైనటు వంటి కంకరను అందించే గట్టలే లేవు. ఆ గుట్టలన్నీ కేవలం ఎర్రమట్టితో నిండి వున్న తూర్పు కనుమలకు చెందినవి. ఆ గుట్టలు పూర్తిగా మట్టితో మాత్రం ఎక్కువ శాతం వుంటాయి. ఆ మట్టిలో ఎర్ర రాయి గుండ్లు మాత్రమే వుంటాయి. అవి చాలా నాసిరకంగా వుంటాయి. అవి నిర్మాణాలకు ఎట్టి పరిస్దితుల్లో ఉపయోగార్హం కాదు. కంకర తయారు చేసే గుట్టల్లో పెద్ద పెద్ద బరువైన బండలుండాలి. కొన్ని ఎకరాల్లో విస్తరించి వుండే బండ నుంచి మాత్రమే కంరర తయారు చేయాలి. కాని గుండ్లతో కూడిన గుట్టలను కాంట్రాక్టర్లు ఎంచుకోవడం? వాటికి అధికారులు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతోంది. అలా కొండలు తవ్వేస్తున్నారు. అటు మట్టి, ఇటు ఎర్ర గుండ్లతో తయారు చేసిన కంకరను సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నేటిధాత్రి పై చిత్రంలో చూపిస్తున్న ఎర్ర రంగు రాయిని కూడా కంకర అని ఎవరైనా అంటారో మీరే చెప్పండి? అది నిర్మాణాలకు వాడుకునే వాళ్లు ఎవరైనా వుంటారా? ఇక్కడ విచిత్రమేమిటంటే మాకు పెద్ద కొండ వుంది. అందులో లక్షల టన్నుల కంకర తయారయ్యే గుట్టలున్నాయని ఎవరూ అధికారులకు అర్జీలు పెట్టుకోలేదు. మేము కంకర వ్యాపారం చేయాలనుకుంటున్నాం. మీరు ఏవైనా గుట్టలను మాకు అప్పగిస్తే కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని దరఖాస్తులు పెట్టుకున్నారు. అలా దరఖాస్తులు పెట్టుకున్నవారికి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు కనిపించిన ప్రతి గుట్టను అధికారులు కాంట్రాక్టర్లకు రాసిచ్చారు. కంకర తెమ్మని రాతపూర్వక ఆదేశాలిచ్చారు. ఇది కంకరేనా..ఈ కంకర నిర్మాణాలకు ఎవరైనా వాడుతారా? అంటూ నేటిధాత్రి ప్రశ్నిస్తే మాదేముంది? మేం కాంట్రాక్టు చేద్దామనుకున్నాం! కంకర సరఫరా చేసే క్రషర్లు ఏర్పాటు చేసుకుంటామని చెప్పాం! మాకు అందుబాటులో వున్న కొండలు లీజుకిస్తే, వాటి కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని చెప్పాం!! ఇదీ స్దూలంగా అడ్డదారిలో, అడ్డగోలుగా, ప్రజా దనం దుర్వినియోగం చేసిన కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్న మాట!!! ఇదిలా వుంటే సదరు కాంట్రాక్టర్లు ఓ మహా నిర్మాణానికి పెద్దఎత్తున కంకర సరఫరా చేసే ముందు రాజేంద్ర నగర్‌లో వున్న క్యాలిటీ కంట్రోల్‌ బోర్టుకు కంకర రాయిని పంపించారు. అక్కడున్న నిపుణులు ఇది కంరరే కాదని నిర్ధారించారు. అది కంకరగా పనికి రాదని తేల్చేశారు. ఇది సుద్దకన్నా అద్వాహ్నమైందని చెప్పారు. ఈ ఎర్రరాయికి కరిగిపోయే గుణం వుంటుందని చెప్పారు. ఎట్టి పరిస్దితుల్లోనూ నిర్మాణాలకు ఈ కంకర అసలే వాడొద్దని హెచ్చరించారు. తెలంగాణలో చేపట్టిన ఓ మహా నిర్మాణానికి ఈ రాతి కంకర వాడడం ఎంతో ప్రమాదకరమని కూడా తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ తాము అంగీకరించే పరిస్దితి లేదని చెప్పారు. అయినా అదికారులు అదే కంకరను ఈ మహా నిర్మాణానికి సుమారు 20వేల కోట్ల రూపాయల విలువైన కంకరను సరఫరా చేయించుకున్నారు. సహజంగా కంకరకు మంచి బలమైన నల్లరాతి గ్రానైట్‌ కావాలి. అంతే కాని గులకరాయిలా కూడా పనిచేయని ఎర్రరాయిని విచ్చలవిడిగా వాడేశారు. ఆ మహా నిర్మాణానికే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం సాగిస్తున్న జాతీయ రోడ్లకు కూడా వరంగల్‌ జల్లాలో ఇదే కంకరను విస్తారంగా వినియోగిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహా నిర్మాణం ఇప్పుడు ఆరోపణల పాలు కావడంలో ఎర్ర కంకర పాత్రే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఎంత చెప్పినా అదికారులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు వినలేదని కూడా అంటున్నారు. ఏదైనా జరిగితే మొత్తం నిర్మాణానికే ప్రమాదం ఎదురౌతుందని తెలసి కూడా అటు అదికారులు, ఇటు కాంట్రాక్టర్లు బరితెగించారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలు కోవాలి. ఈ దిశగా దర్యాప్తు సాగించాలి. ఎంత మంది కాంట్రాక్టర్లకు ఎన్ని గుట్టలు అదికారులు అప్పగించారు? ఎన్నికొండలు తొలిచేశారు? ఆ కొండల మూలంగా ఎంత కంకర వచ్చింది? రాజేంద్ర నగర్‌ క్వాలిటీ కంట్రోల్‌బోర్డు వద్దని ఆదేశాలు జారీ చేసినా, ఎవరు పక్కకు పెట్టారు. ఎందుకు తొక్కిపెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ నాసిరకం కంకర సరఫరా చేయడం అంటే నేరం కాదా? కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సమానమైన లాభంతో ఎంబిలు తయారు చేసినట్లు సమాచారం. సగం, సగం వాటాలు అన్నట్లు ఇద్దరూ కలిసి వేల కోట్లు దోచేశారు. ప్రజా ధనం నీళ్లలోపోశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు? అనుమతులిచ్చిన అదికారులెవరు? ఎంత కంకర సరఫరా చేశారు? ఎంత సొమ్ము దుబారా చేశారు? అనే పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కధనాలు త్వరలోనే మీ నేటిధాత్రిలో…

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం..

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం.

సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో *సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు సంతానం ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయుట అనర్హులని జీవో తీసుకువచ్చినప్పటి నుండి ముగ్గురు సంతానం కలిగిన వారు రాజకీయానికి దూరంగా ఉన్నారు,సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు పిల్లలుంటే పోటీకి అర్హులని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముగ్గురు పిల్లల జీవోను రద్దుచేసి ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలున్న ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో…..
ఈ రాష్ట్రంలో ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లలు సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులని జీవోను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కి మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకుశుక్రవారం రోజున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ జీవోను తీసుకొచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రివర్యులకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు రాజేష్ ఖన్నా, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టికే రవీందర్, నల్లబెల్లి విజేందర్ ,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిపురం కుమారస్వామి కొర్రి సాంబశివుడు ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండె పు రెడ్డి రవీందర్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ రావు ,బొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అటు లుకలుకలు..ఇటు చిటపటలు!

`మహాఘట్‌ బంధన్‌లో కుంపట్లు.

`బిహార్‌లో నిగ్గు లేతకపోతున్న సర్ధుబాట్లు!

`ఎన్డీయే కూటమి సీట్ల ప్రకటన దాదాపు ఖరారైంది.

`ఇండియా కూటమిలోనే లుకలుకలు కొనసాగుతున్నాయి. 

`కాంగ్రెస్‌ గతంలో 71 సీట్లు పోటీ చేసింది.

`17 సీట్లు మాత్రమే గెల్చుకున్నది.

`ఈసారి 75 సీట్లు కావాలని కాంగ్రెస్‌ మెలిక పెట్టింది.

`అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తేజస్వీ ప్రకటించారు.

`ఇండియా కూటమిలో కలకలం రేగింది.

`లాలూ కుటుంబం మీద కేసులు తెరమీదకు వచ్చాయి.

`ఆర్జేడీ దారికొచ్చింది..కూటమి బంధం గుర్తుకొచ్చింది.

`కాంగ్రెస్‌కు 60 సీట్లిస్తామంటోంది.

`ఆర్జేడీ 135 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

`మిగతా సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం వుంది.

`తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు.

`రాజకీయం ఎటు మారుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

`ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం పికేకు ఇష్టం లేదు.

`రసవత్తరంగా మారనున్న బిహార్‌ పోరు.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

 బిహార్‌ రాష్ట్రంలో ఎన్నికల పొత్తులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నిస్తే సరైన సమాదానం ఎవరి వద్దా లేదు. ముఖ్యంగా ఇండియా కూటమిలో పొత్తులు పొడిచినా, సీట్ల సర్ధుబాటులో లుకలుకలు, చిటపటలు కనిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి, జేడీయూల పొత్తులు, సీట్ల పంపకాలు జరిగిపోయాయి. నామినేషన్లు కూడా వేస్తున్నారు. కాని ఇండియా కూటమిలో మాత్రం కుంపట్లు రేగుతున్నాయి. సీట్ల సర్ధుబాట్లు ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. యూపిఏ హాయాంలో ప్రతిపక్షం ఎప్పటిప్పుడు ఎంతో బలంగా వుంటూ వుండేది. కాని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బిజేపి వేసే ఎత్తులకు ప్రతిపక్షాలు చిక్కుల్లో పడుతున్నాయి. సహజంగా ప్రతిపక్షాలు వేసే ఉచ్చులోఅదికార పార్టీ పడుతుంటాయి. ఓడిపోతుంటాయి. కాని ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల కాలంగా ప్రతిసారి ప్రతిపక్షాలు పదే పదే బోల్తాపడుతున్నాయి. అయినా వాటి నుంచి తేరుకోవాలని ప్రతిపక్షాలు అనుకోవడం లేదు. ఐక్యత ప్రదర్శించడం లేదు. కలిసి సాగుదామన్న భరోసా వాటిలో కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇండియా కూటమి ఐక్యతకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇండియూ కూటమి పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ పార్టీల కోసం కూడా పొత్తు ధర్మంలో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రాలలో ఆ పార్టీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయినా ఆ పార్టీలు రాహుల్‌ గాంధీని నమ్మడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు ఇండియా కూటమిలో లుకలుకలు వెగులోకి వస్తునే వున్నాయి. సమస్యలు పొడసూపుతూనే వున్నాయి. ఐక్యతకు బీటలు వారుతూనే వున్నాయి. అయినా ఎంత దిగినా ఫరావాలేదు. బిజేపిని ఓడిరచాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు, రాహుల్‌ గాంధీ చేస్తున్న కష్టం, కూటమి పార్టీలు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లుకలుకలు తెరమీదకు తెస్తూనేవున్నారు. రాహుల్‌ గాంధీ మూలంగానే ఇండియా కూటమికి మరింత బలం ఏర్పడిరది. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతూ వస్తోంది. అయినా ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీకి హాండ్‌ ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది బిహార్‌లోనూ జరుగుతుందా? అన్న అనుమానం ఏర్పడుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటన చేసింది. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కాని బిహార్‌లోని ఇండియా కూటమిలో సీట్ల సర్ధుబాటు పూర్తి కాలేదు. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, ఆర్జేడీ పోటీ చేస్తాయన్నది తేలలేదు. ఇంకా సీట్ల నెంబర్లే తేల్చుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 75 సీట్లకు పోటీ చేసింది. కాని కేవలం 17 సీట్లు మాత్రమే గెలిచింది. ఇప్పుడు కూడా అదే నెంబర్‌ కావాలని కోరుతోంది. కాని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో ఆ మధ్య తేడాలొస్తే పూర్తి స్దానాలలో పోటీ చేసేందుకు తాము సిద్దమంటూ కూడా తేజస్వీ యాదవ్‌ అన్నారు. అయితే ఇక్కడ రాహుల్‌ గాందీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. దేశంలోని రాష్ట్రాలలో వున్న ప్రాంతీయ ప్రతిపక్షాలన బలోపేతం చేయడం తన భుజాల మీద వేసుకుంటున్నాడు. నిజానికి ఆ పని రాహుల్‌ గాందీ చేయకూడదు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కాంగ్రెస్‌ను మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్‌ గాందీ ఎన్ని సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చారు? అదే బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి ఎన్నిసార్లు వెళ్లారనేది లెక్కతీస్తే అసలు విషయం అర్దమౌతుంది. అదే కర్నాకటలో కూడా అంతే. సొంత పార్టీ బలంగా వున్న రాష్ట్రాలలో పార్టీని అదికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బలంగా లేని రాష్ట్రాలలో సొంత పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి. కాని ఆయన ప్రతిపక్షాల ఐక్యత కోసం పాటు పడుతున్నారు. ప్రతిపక్షాలను బలోపేతం చేసే పనిని ఎంచుకున్నారు. ఇది కూడా కాంగ్రెస్‌ పార్టీ తన బలహీనతను తెలియజేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇన్ని సార్లు కాంగ్రెస్‌కు అవమానాలు ఎదురౌతున్నా కాంగ్రెస్‌లో మార్పు కనిపిండచం లేదు. దేశమంతా రాహుల్‌ గాందీ వెంట నడుస్తోంది. ఆయన మాత్రం ప్రతిఫక్షాల వెంట నడుస్తున్నారన్న అభిప్రాయం వక్తమౌతోంది. ఇండియా కూటమిలోనే ఇన్ని లుకలుకలు అని అనుకుంటే కాంగ్రెస్‌ గతంలో ఎప్పుడూ లేనంతగా ఓటమి పాలు కావడం. 2014లో కనీసం 40 సీట్లు గెలవలేకపోవడం. దేశాన్ని అత్యధిక సార్లు పాలించిన, కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడం అనేది ఆ పార్టీకి మైనస్‌గా మారింది. మూడోసారి 2024లో 100 సీట్లు సాదించి ప్రతిపక్ష హోదా సాదించుకున్నది. అయినా ఆ పార్టీని ఇతర ప్రాంతీయ పార్టీలు లెక్క చేయడం లేదు. కనీసం వారి పార్టీల కోసం కాంగ్రెస్‌ను ఆసరా చేసుకొని గెలుద్దామన్న భావన వారిలోనూ లేదు. సమయం వస్తే కాంగ్రెస్‌ను దూరం పెట్టెందుకు సైతం ప్రాంతీయ పార్టీలు ఆలోచించడం లేదు. ఆ మధ్య జరిగిన డిల్లీ, పంజాబ్‌, హార్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఇదే అనుసరించాయి. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయి. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్‌పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే పరిస్దితి మరో రకంగా వుండేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ముందు కలిసి సాగాలని అనుకున్నారు. ఎన్నికల సమయం దాకా కలిసి ప్రచారం చేసుకున్నారు. కాని తీరా ఎన్నికల వేల పొత్తులు కుదరక విడిపోయారు. దాంతో కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి నెట్టేశారు? ఫలితంగా హార్యానాలో కూడా ముచ్చటగా మూడోసారి బిజేపి కూటమి విజయం సాదించింది. మహరాష్ట్రలోనూ అదే జరిగింది. కాంగ్రెస్‌పార్టీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందనేది కూడా ఎంతో ముఖ్యం. తాత్కాలిక పొత్తులు ఎప్పుడూ పుట్టి ముంచేస్తాయని కాంగ్రెస్‌ తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరి పోరు చేస్తే అనేక సీట్లు గెలిచే అవకాశం వుండేది. కాని స్దానిక రాజకీయాలకు తనను తానే బలి చేసుకుంటోంది. పొత్తు ధర్మంతో తనను తాను తగ్గించుకుంటోంది. ఇది కాంగ్రెస్‌కుతీరని అన్యాయమైపోతోంది. ఇప్పుడు బిహార్‌లోనూ అదే జరుగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఇచ్చే సీట్ల మీద ఆదారపడడం అనేది కాంగ్రెస్‌కు ఆశని పాతంగా మారనున్నది. ఓట్‌ చోరీ అనే అంశాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకొచ్చి, ఎన్నికల సంఘం మీద రాహుల్‌ గాందీ యుద్దం చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేయడం కోసం పాదయాత్రలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు జవసత్వాలు కల్పిస్తున్నారు. ఫలితంగా ఆ పార్టీలకు ఊపిరిపోస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలైన ఆర్జేడీ ఈసారి గెలిచేందుకు రాహుల్‌ గాంధీ రూపంలో ఆపార్టీకి ఎంతో బలం వచ్చింది. అయినా సరే కాంగ్రెస్‌ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అంటోంది. ఇదిలా వుంటే బిహార్‌లో రాజకీయపార్టీని పెట్టి, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించారు. కారణం ఆయన పార్టీకి ప్రజల నుంచి స్పందన రావడం లేదని స్పష్టమైంది. ఒక వేళ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా, తాను ఓడిపోయినా తనకు తీరని నష్టమని తెలుసుకున్నారు. పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. కాని తాను ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించలేదు. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ మాద్దతు ఎవరికి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా ఇండియా కూమిటికి సరిగ్గా ఎన్నికల సమయంలో పడుతున్న దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. అయితే బిహార్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ఒక రకంగా సంజీవని అవుతుందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. కాంగ్రెస్‌కు మంచి రోజులు రానున్నాయనే వాటికి సంకేతాలు అని చెప్పక తప్పదు.

తిష్ట వేశారు…కోట్లు తింటున్నారు!?

 

*”మంత్రి,కమిషనర్ గారు” అవినీతి ఉద్యోగులపై “ఓ కన్నెయ్యండి”.

మంత్రి పొంగులేటి రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రక్షళన చేసి అధికారులను ట్రాన్స్‌పార్లు చేశారు

`ఏళ్ల తరబడి అదే కుర్చీలో కూర్చుంటున్నారు.

`ఒకప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖ అంటే మాకొద్దనే వారు!

`ఇప్పుడు ఎమ్మార్వోలు, రెవిన్యూ అధికారులు ఎగబడుతున్నారు!

డిప్యూటేషన్ల మీద సివిల్‌ సప్లయ్‌ కోరుకుంటున్నారు.

`తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన పంటల దిగుబడితో అధికారులు పంట పండిరచుకుంటున్నారు.

`జీతానికి అదనంగా వందల రెట్లు సంపాదించుకుంటున్నారు!

`వందల కోట్లకు అధికారులు చేరుకుంటున్నారు.

సివిల్‌ సప్లై శాఖలో ‘‘డిసిఎస్‌ఓ’’,’’డిఎం’’ల సంపాదనకు లెక్కేలేదు.

`ఐదారేళ్లగ సంపాదనకు అంతే లేదు.

`మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారు.

`బాయిల్డ్‌ మిల్లర్లకు కల్పతరువులౌతున్నారు!

అక్రమంగా వడ్లు కేటాయించి లక్షలు లంచాలుగా తీసుకుంటున్నారు.

‘‘డిసిఎస్‌ఓ’’, ‘‘డిఎం’’లకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు సమకూర్చాల్సిందే!

ప్రతి సంవత్సరం టూర్‌ ప్యాకేజీలు చెల్లించాల్సిందే!

`ఎప్పుడు అడిగితే అప్పుడు అడిగినంత ముట్ట జెప్పాల్సిందే?

`లేకుంటే మిల్లర్‌ చుక్కలు చూడాల్సిందే?

రాజకీయ నాయకులకు కోట్లలో చందాలిచ్చేంత ‘‘డిసిఎస్‌ఓ’’, ‘‘డిఎం’’, ‘‘డిటి’’లు ఎదిగారు!

`నాయకుల ఆశీస్సులతో కుర్చీలలో పాతుకుపోయారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలాగా ట్రాన్స్‌ఫర్లు చేస్తే తప్ప వ్యవస్థ మారదు.

గతంలో రిజిస్ట్రేషన్‌ శాఖలోనూ దశాబ్దాల తరబడి ట్రాన్స్‌ఫర్లు లేవు.

`సబ్‌ రిజిస్ట్రార్‌లు విచ్చలవిడి సంపాదనకు ఎగబడ్డారు.

`సరిగ్గా సివిల్‌ సప్లయ్‌ శాఖలో ఇదే జరుగుతోంది.

`ట్రాన్స్‌ఫర్లు లేక అధికారులు ఆడిరది ఆట, పాడిరది పాట చేసుకుంటున్నారు.

కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ముందు ట్రాన్స్‌ఫర్లు మొదలు పెడితే సివిల్‌ సప్లయ్‌ శాఖ సగం గాడిలో పడినట్లే!

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:  

 ప్రభుత్వ కొలువు పాడి గేదే లాంటిది. ముప్పైపాటు ఒట్టిపోదు అనుకునేవారు. అంటే ఒక్కసారి ఉద్యోగంలో చేరితే జీవితం హాయిగా సాగుతుందనుకునే వారు. కాని ఇప్పుడు ప్రభుత్వ కొలువు అంటే విలాసం. జీతం లకారంలో వుంటుంది. లంచాలు లకారాలు దాటుతున్నాయి. ముఖ్యంగా కొన్ని శాఖల్లో కోట్ల రూపాయలు కూడా వచ్చిపడుతున్నాయి. ప్రభుత్వ కొలువు అంటే సేవ అనే భావం వుండేది. ఉద్యోగంలో చేరకముందు ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పుకునేవారు. అది ఐఏఎస్‌ నుంచి కింది స్దాయి ఉద్యోగుల దాకా ప్రజా సేవ అనే పదమే వినిపించేది. మరి ఇప్పుడు ఉద్యోగం అంటే కల్ప వృక్షం. సేవ సంగతి దేవుడెరుగు? ఎప్పుడు ఎంత సంపాదించాలి? ఎలా సంపాదించాలి? ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకోవాలి. అక్రమ మార్గాలు అన్వేషించి లంచాలు ఎలా తినాలి. ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేయాలి. అనేదే చాలా మంది ఉద్యోగులు అనుసరిస్తున్న విధానం. ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు లంచం తీసుకుంటూ వుండేవారు. బియ్యంలో రాళ్లలాలా వుండేవారు. కాని ఇప్పుడు రాళ్లలో బియ్యంలా ఒకరో ఇద్దరో లంచాలు తీసుకోని వారున్నారు. ఇదీ ఇప్పటి ఉద్యోగుల పరిస్దితి. గతంలో ఒకటో రెండో శాఖల్లో అవినీతి జరుగుతుందని అనుకునే వారు. కాని ఇప్పుడు అన్ని శాఖల్లోనూ అవినీతి దూరింది. ముఖ్యంగా కొన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అలాంటి శాఖలో సివిల్‌ సప్లై శాఖ ఒకటి. ఈ శాఖలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు తలనొప్పి అనుకునేవారు. విపరీతమైన పని వుంటుంది. కాణి కూడా లంచం దొరకదనుకునే వారు. కాని ఇప్పుడు సివిల్‌ సప్లై శాఖలో కొలువు అంటే ఎగిరి గంతేస్తున్నారు. సివిల్‌ సప్లైలో ఉద్యోగం కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు రెవిన్యూ వ్యవస్ధ నుంచి సివిల్‌ సప్లై శాఖకు డిప్యూటేషన్‌ మీద వెళ్లేందుకు ఎగబడుతున్నారు. రెవిన్యూ శాఖలో కింది స్ధాయి నుంచి తహసిల్ధార్‌ వరకు సివిల్‌ సప్లై శాఖకు వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. కావాలని కోరుతున్నారు. ఖర్చుకు కూడా వెనుకాడకుండా ఫైరవీలు చేయించుకుంటున్నారు. ఇదిలా వుంటే ఏడెనమిదేళ్ల క్రితం నుంచి డిప్యూటేషన్‌మీద వెళ్లిన అధికారులు కొందరు అక్కడే తిష్ట వేసుకుపోయారు. గతంలో మన తెలంగాణలో పంటల దిగుబడి తక్కువ. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మూలంగా తెలంగాణ విస్తారమైన వ్యవసాయం సాగుతోంది. రికార్డు స్దాయిలో పంటలు పండుతున్నాయి. అందులో ముఖ్యంగా వరి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ మారిపోయింది. దాంతో రెవిన్యూ వ్యవస్ధకంటే ఎక్కువ ఆదాయం సమకూర్చే శాఖగా సివిల్‌ సప్లై మారిపోయింది. ఇక అక్కడి నుంచి అదికారుల పంట పండిరది. తెలంగాణలో గతంలో వందల సంఖ్యలో వున్న రైస్‌ మిల్లులు వేల సంఖ్యకు చేరుకున్నాయి. రైస్‌ మిల్లులకు వడ్లను సమకూర్చే అదికారం వారి చేతుల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా డిసిఎస్‌వో( డిస్టిక్ట్‌ సివిల్‌ సప్లై ఆఫీసర్‌) డిటి. (డిస్టిక్‌ తహసిల్ధార్‌) , డిఎం. (డిస్టిక్ట్‌ మేనేజర్‌) స్దాయి ఉద్యోగులకు పండగే పండుగగా మారింది. వారికి వద్దన్నా లంచాలు వచ్చిపడే కామదేనువుగా సివిల్‌ సప్లై శాఖ మారింది. మిల్లులకు వడ్లు ఇవ్వడానికి, ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చిన మిల్లర్ల నుంచి బియ్యం సేకరించడానికి రెండు రకాల ఆదాయాలుగా అధికారులకు మారిపోయింది. సహజంగా ఒక ఉద్యోగికి ఒకే రకమైన లంచం వస్తుంది. కాని ఇక్కడ రెండు రకాల లంచాలు వచ్చే ఏకైక శాఖ సివిల్‌ సప్లైశాఖ అని ఉద్యోగులు చెప్పుకుంటారు. డిసిఎస్‌లో, డిటిలు మిల్లులకు వడ్లు కేటాయిస్తుంటారు. డిఎం. మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే బాద్యతలు నిర్వర్తిస్తుంటారు. దాంతో కింది నుంచి పై స్దాయి దాకా ఆదాయమే ఆదాయం అన్నట్లు మారిపోయింది. దాంతో అదే శాఖలో అదే కుర్చీలో ఏళ్ల తరబడి పై స్దాయి ఉద్యోగులు తిష్ట వేశారు. ఒక రకంగా పాతుకుపోయారు. వారికి అందే లంచాల కింద జీతం బియ్యంలో మెరిగలా మారిపోయింది. జీతానికి వంద రెట్లు లంచాలు అందుతున్నాయి. మిల్లర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న వార్తలు అనేకం వున్నాయి. సివిల్‌ సప్లైశాఖలో డిఎస్‌ఓలు, డిఎం సంపాదనలకు లెక్కే లేదని అంటున్నారు. ఎక్కడా లంచం తీసుకున్నట్లు కూడా కనిపించదు. ఐదారేళ్లుగా ఇలా పాతుకుపోయిన అనేక మంది అదికారులు మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారని సమాచారం. అక్రమంగా మిల్లర్లకు వడ్లు కేటాయించి, లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. దాంతో డిఎస్‌ఓలు, డిఎంలకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు ఎంత అడిగితే అంత సమకూర్చాల్సిందే. అధికారులు టూర్‌ వెళ్లే ప్యాకేజీలు చెల్లించాల్సిందే. ఎప్పుడు అడితే అప్పుడు, ఎంతఅడిగితే అంత ముట్ట చెప్పాలిందే? లేకుంటే మిల్లర్లకు చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సివిల్‌ సప్లైశాఖలో అధికారుల సంపాదన ఎంత దూరం వెళ్లిందంటే రాజకీయ నాయకులకు, పార్టీలకు ఫండిరగ్‌ చేసేంత సంపాదిస్తున్నారు. కుర్చీలను కాపాడుకుంటున్నారు. అదే కుర్చీలో కూర్చోవాలంటే అధికారపార్టీ పెద్దలకు కోట్ల రూపాయలు పార్టీ ఖర్చులకు సమకూర్చుతున్నారంటే ఏ స్ధాయిలో అదికారులు సంపాదిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అధికారులకు అవసరం వచ్చినా, నాయకుల అవసరాలను తీర్చాల్సిన పరిస్దితి ఎదురైనా సరే మిల్లర్ల నుంచి దండిగా వసూలుచేయడం అలవాటు చేసుకున్నారు. రెండు రకాలుగా మిల్లర్ల నుంచి సంపాదిస్తున్నారు. దీనంతటికీ ఆ అధికారులు మాతృ శాఖలకు వెళ్లకపోవడం, అదే కుర్చీలలో ఏళ్ల తరబడి పాతుకుపోవడం వల్ల సంపాదిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌శాఖలో కూడా ఇలాంటి వ్యవహరమే సాగేది. ఉమ్మడిరాష్ట్రం నుంచి రేవంత్‌ సర్కారు వచ్చే వరకు సుమారు పదమూళ్లు పాటు రిజిస్ట్రేషన్‌ శాఖలో ట్రాన్స్‌ఫర్లు జరగలేదు. ప్రమోషన్లు వచ్చినా సబ్‌ రిజిస్ట్రార్లు వద్దనుకున్నారు. పదమూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తూవచ్చారు. ఆ ప్రాంతంమీద పూర్తిపట్టు సాధించారు. లంచాలకు బరితెగించారు. రేవంత్‌సర్కారు వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్లందిరికీ ట్రాన్స్‌ఫర్లు చేయించారు. జోన్‌లు దాటించారు. సరిగ్గా ఇప్పుడు సివిల్‌ సప్లైలోనూ అదే పనిచేయాలి. అలా చేస్తే తప్ప అదికారుల విచ్చలవిడి అవినీతి తగ్గదు. ప్రభుత్వాదాయానికి గండిపడదు. సివిల్‌ సప్లై నూతన కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నింటికన్నా ముందు ఉద్యోగులను జోన్‌లు దాటిస్తే శాఖను సగం గాడిలో పెట్టినట్లే అంటున్నారు. గత కమీషనర్‌ ఈ నిర్ణయం తీసుకునేలోపు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ఏ ఏ జిల్లాలలో ఏ అదికారి పాతుకుపోయారు. వారి సంపాదనలు ఎలా వున్నాయి? వారి వివరాలతో కూడిన సమగ్ర సమచారాలు మీ నేటిదాత్రిలో త్వరలో వరుస కథనాలు…

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తనతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
మల్లిఖార్జున ఖర్గేకు ఇటీవల పేస్ మేకర్ అమర్చిన వైద్యులు.ఖర్గేతో సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు,

‘‘గుట్కా’’ కింగ్‌ ‘‘హీరోలాల్‌’’ ఎవరు!?

`గుట్కా కంపులో గప్పుమంటున్న తెలంగాణ!

`సందు సందులో గుప్పుమంటున్న గుట్కా కంపు!

 

గుట్కా తిను..క్యాన్సర్‌ కొను!

`సందుసందున అమ్మకాలే!

`పట్టించుకుంటున్న నాధుడే లేడాయే!

`అరకొర దాడులు…అరెస్టులు!

`ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గుట్కా వ్యాపారులు!

`నిషేదిత గుట్కా, పొగాకు తయారీలు ఎలా వస్తున్నాయి?

`ఇంత విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నా కళ్లెందుకు మూసుకుంటున్నారు.

`పల్లెల్లో పదుల సంఖ్యలో క్యాన్సర్‌ బారిన పడుతున్నారు!

`రోజు రోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ రోగులు?

`నిషేదిత గుట్కాలు యదేచ్చగా రాష్ట్రానికి ఎలా చేరుతున్నాయి!?

`జిల్లాలు, మండలాల వారిగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం?

నిత్యం కోట్ల రూపాయలలో గుట్కా, అంబర్‌ ఖైనీల అమ్మకాలు.

`అక్కడక్కడా పట్టుకుంటున్న వార్తలు.

`తెలంగాణ అంతటా విచ్చలవిడిగా అమ్మకాలు!

`గుట్కా తినొద్దని ప్రభుత్వ ప్రకటనలు.

`వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారాలు.

`మరో వైపు గుట్కా కంపనీలకు అనుమతులు!

దేశమంతటా నిషేధం.. తెలంగాణ విచ్చలవిడిగా అమ్మకం

కాన్సర్‌ మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ఒకప్పుడు ఎవరికైనా కాన్సర్‌ వచ్చిందంటే అదే పెద్ద వార్తగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు క్యాన్సర్‌ ఒక సాదాసీతా రోగమైపోయింది. కాని చికిత్సలేక ప్రాణాలను బలిగొంటోంది. అయినా ప్రభుత్వాలు మేలుకున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలు కాన్సర్‌ బారిన పడకుండా వుండాలంటూ వేల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు తయారు చేస్తున్నారు. విసృతంగా ప్రచారం చేస్తున్నారు. మీడియాలో, టెలివిజన్‌లలో, సినిమా ధియేటర్లలో నిత్యం కాన్సర్‌పై అవగాహన ప్రకటనలు విసృతంగా ప్రచారం చేస్తున్నారు. కాని కాన్సర్‌ కారకాలను అరికట్టడంలో ఎందుకు విఫలమౌతున్నారు? కాన్సర్‌ కారకాలను తయరు చేస్తున్న కంపనీలకు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు. మన దేశంలో క్యాన్సర్‌కు ప్రదాన కారకాలలో పొగాకు ఉత్పత్తుల పాత్ర పెద్దది. పొగాకు పంటలను పండుతూనే వుంటాయి. అటు గుట్కాల తయారీ జరుగుతూనే వుంటుంది. కాని మన దేశంలో గుట్కా నిషేదం. ఎలా జనం వద్దకు వస్తోంది. మన దేశంలో గుట్కా వ్యాపారం కొన్ని వేల కోట్లలో సాగుతోంది. నిత్యం దేశ వ్యాప్తంగా వందల కోట్లలో వ్యాపారం సాగుతోంది. ముఖ్యంగా మన తెలంగాణలో గుట్కా పూర్తిగా నిషేదం. కాని గుట్కా దొరకని ప్రాంతం లేదు. ప్రదేశం లేదు. పల్లె నుంచి పట్నం దాక ప్రతి చోట గుట్కా దొరుకుతూనే వుంది. జనం ప్రాణాలను హరిస్తూనేవుంది. అయినా ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఒక్క తెలంగాణలోనే రోజుకు సుమారు రూ.5 కోట్ల రూపాయల గుట్కా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా విచ్చలవిడిగా సాగుతోంది. పటిష్టమైన చెక్‌ పోస్టు వ్యవస్ధలున్నప్పటికీ గుట్కా వ్యాపారులు యదేఛ్చగా ఎలా సరుకును రవాణా చేస్తున్నారన్నది తేలాల్సి వుంది. బియ్యం అక్రమరవాణ, కలప అక్రమ రవాణ, ఆఖరుకు లిక్కర్‌ అక్రమ రవాణాలు కూడా అరికడుతున్నారు. కాని గుట్కా రవాణా మాత్రం ఎక్కడా ఆగినట్లు వార్తలు లేవు. పట్టుకున్నట్లు కూడా దాఖలాలు లేవు. కాని జిల్లాలకు చేరిన తర్వాత అక్కడక్కడ టాస్స్‌ ఫోర్స్‌ దాడులు నిర్వహించడం పట్టుకోవడం జరుగుతోంది. అయినా అది కూడా అంతంతమాత్రంగానే జరుగుతుండడంతో గుట్కాల అమ్మకాలు ఆగింది లేదు. ప్రభుత్వం నిశేదించిన గుట్కా, పాన్‌ మసాల, అంబర్‌ లాంటివి అధిక ధరలకు విక్రయిస్తూ అలా కూడా సొమ్ము చేసుకుంటున్నారు. జనం జేబులకు చిల్లు పెట్టడమే కాదు, ప్రాణాలకు కూడా చిల్లులు పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు, ఇతర నగరాల్లో పాతుకుపోయిన కొంత మంది మార్వాడీ వ్యాపారులే ఈ వ్యాపారాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది పేర్లుకూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొద్ది సంవత్సరాలుగా కర్నాకట, రాజస్ధాన్‌, గుజరాత్‌లలో కంపనీలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రహస్యంగా గుట్కాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు కూడా సమాచారం. వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు కూడా వున్నాయి. దీని వెనక హీరాలాల్‌ అనే వ్యక్తి వున్నట్లు కూడా తెలుస్తోంది. అతని నుంచి నగరంలోని అనేక మందికి సరఫరా సాగిస్తున్నట్లు సమచారం. ఇటీవల వరంగల్‌ నగర కేంద్రంలో సుమారు రూ.10లక్షల విలువైన గుట్కా పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో కూడా పెద్దఎత్తున కోట్లాది రూపాయల విక్రయాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. సుమారు రూ.76లక్షల రూపాయల విలువైన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను పోలీసులు ఆ మధ్య స్వాదీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేశారు. గుట్కాల మూలంగా ఎంత అనర్ధం జరుగుతుంతో అందరికీ తెలుసు. అయినా దాని వ్యాపారం మాత్రం ఎక్కడా ఆగడం లేదు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా గుట్కాలను నమిలేస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో యువత ఎక్కువగా గుట్కాలకు బానిసలౌతున్నారు. క్షణం పాటు గుట్కా నమలకుండా వుండలేని స్ధితిలోకి వెళ్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో కూడా నోట్లో గుట్కా వేసుకొనే పడుకుంటున్నవాళ్లున్నారు. ఆ గుట్కాల మూలంగా గొంతు క్యాన్సర్ల బారిన కొన్ని లక్షల మంది పడుతున్నారు. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా గుట్కా గప్పు కొడుతూనే వుంది. గుట్కా తినడం వల్ల వచ్చే అనర్ధాల గురించి ప్రచారం చేస్తున్నారు. కాని వాటిని అమ్మకాలను ఎందుకు ఆపలేకపోతున్నారు. ప్రతి కిరాణాషాపులోనూ యదేచ్చగా అమ్మకాలు సాగిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లపై ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నారో గుట్కాల విషయంలోనూ అదికారులు అదే వైఖరి అనుసరిస్తున్నారు. ప్లాస్టిక్‌ను కాస్త ఎక్కువ కంట్రోల్‌ చేస్తున్నారే గాని, గుట్కాల అమ్మకాలను అరికట్టలేపోతున్నారు. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు హడావుడి చేయడం తప్ప, పెద్దగా దాడులు చేస్తున్నది లేదు. అక్రమ గుట్కాల తరలింపు ఆగడం లేదు. వాటి అమ్మకాలను ఆపుతోంది లేదు. రోడ్ల మీద ఎక్కడ చూసినా గుట్కా రాయుళ్లు చించి పడేసిన ప్యాకెట్లు అడుగడునా దర్శనమిస్తూనేవుంటాయి. పాన్‌ షాపుల నుంచి చెత్త సేకరించే మున్సిపల్‌ వాహనాలలో కూడా ఆ ప్యాకెట్లు కనిపిస్తూనే వుంటాయి. అయినా అదికారులకు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదు. ఓ వైపు ప్రభుత్వాలు ఎంతో శ్రద్దతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే అదికార యంత్రాంగాలు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. నిజంగా తెలంగాణలోని అధికారులు తల్చుకుంటే ఒక్క గుట్కా పాకెట్‌ అయినా తెలంగాణలోకి రాగలుగుతుందా? అమ్మగలుగురా? బస్సులలో, రైళ్లలో, రద్దీ ప్రదేశాలలో గుట్కా నమిలే వాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు కూడా వున్నారు. అయినా చర్యలు తీసుకునేవారు లేరు. ఇటు మత్తు పదార్ధాలు, అటు గుట్కా లాంటి విష పదార్దాల వల్ల యువత ఎంతో నష్టపోతోంది. తెలంగాణలో ఈ గుట్కా వ్యాపారం ప్రముఖంగా సాగిస్తున్నవారిలో ముందు వరుసలో వున్న వాళ్లంత మార్కాడీలు కావడం వల్లనే అదికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి అనేక వార్తలు కూడా వస్తున్నాయి. అయినా పోలీసులు మాత్రం కదులుతున్నట్లు లేదు. రోడ్డు మీదకు వచ్చిన వాళ్లు ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పితేనే ప్రాణాలకు ప్రమాదమని వారిని శిక్షిస్తున్నారు. కాని కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న గుట్కా దొంగ వ్యాపారులను ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే వాటి వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఏమీ లేదు. ప్రజలకు మేలు జరగదు. కేవలం వ్యాపారుల జేబులు నిండుతున్నాయి. వారి ఆస్ధులు కోట్లకు పెరుగుతున్నాయి. జిఎస్టీ లేని వ్యాపారం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారం ఇంత యదేచ్చగా సాగుతుంటే ఆపేదెవరు? అరికట్టేదెవరు? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నవారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి, పల్లెల దాకా నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేసుకొని, జనాన్ని క్యాన్సర్‌ బారిన పడేలా చేస్తున్నవారిని ఎవరు పట్టుకోవాలి? ఓ వైపు మత్తు పదార్ధాలు జాడ దొరుకుతూనే వుంది. అది కూడా పెద్దఎత్తున వ్యాపారంసాగుతూనే వుంది. అయితే అది అందరికీ అందుబాటులో వుండకపోవచ్చు. కాని గుట్కా అనేది ప్రతి సామాన్యుడికి అందుతోంది. మత్తుకు అలవాటు పడిన యువత దాన్ని నమిలి మింగేస్తుంది. ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. ప్రభుత్వం సీరియస్‌గానే వుంది. కాని అధికార గణమే అలసత్వమే కనిపిస్తోందని అంటున్నారు. గుట్కా వ్యాపారుల చైన్‌ నెట్‌ వర్క్‌పై త్వరలోనే మరిన్ని సమగ్రమైన కథనాలు మీ నేటిధాత్రిలో…వరుసగా…గుట్కాను తెలంగాణ నుంచి తరిమేసేదాకా నేటిధాత్రి అక్షర పోరాటం చేస్తుంది. గుట్కా రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

‘వేలకోట్ల’’ చిట్‌ ‘‘కుంభకోణం’’?

`చిట్‌ కంపెనీలు ..చీకటి దందాలు!?

`ఒక్కసారి చిట్‌ వేస్తే.. ఇక మిగిలేది చీకటే!

1000 cr chit fund scam in warangal

`నమ్మి చిట్టి కడితే చీటి చిరిగినట్లే!?

`లాక్కోలేక, పీక్కో లేక కష్టాలు కొని తెచ్చుకోవడమే!

`గాలికి పోయే కంపను గోచిలో పెట్టుకోవడమే!

1000 cr chit fund scam in warangal

`జీవితాలు ఆగమే…బతకంతా నరకమే!

`నమ్మించినంత సులువుగా మోసం చేస్తారు?

`జనాన్ని నట్టెట ముంచేస్తారు!

`తేరగా చేతులెత్తేస్తారు!

`బోర్డు తిప్పేసి కంపనీ లాస్‌ అని మూసేస్తారు!

`అట్లుంటది చిట్‌ కంపనీల మోసం!

ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే వేలాది కోట్ల కుంభకోణం!

12 నెలలుగా వరంగల్‌ నగరంలో ‘‘చిట్స్‌ రిజిస్ట్రార్‌’’ లేడు.

`దివాళా కంపెనీల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు!

`దివాళా తీసిందని చట్టాన్ని నమ్మిస్తారు!

`కోర్టులను కూడా నమ్మించి జనాన్ని మోసం చేస్తారు!

`కంపనీ బకాయి పడ్డ వారికి రూపాయి ఇవ్వరు!

`కంపనీకి రావాల్సి వుంటే వేధించుకు తింటారు!

`ప్రజలకు ఎవరూ మద్దతుగా రారు!

`పోలీసులు కూడా ప్రజల పిర్యాదులు పట్టించుకోరు!

`నాయకులు, పోలీసులు కంపనీలకు అండగా నిలుస్తారు!

`బోర్డులు తిప్పేసిన కంపెనీలకే వంతలు పాడుతుంటారు!

జనాలకు ‘‘చిట్‌ చట్టాల’’ మీద అవగాహన వుండదు!
బోర్డు తిప్పేసిన కంపెనీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియదు!
ఆ సొమ్మును ‘‘చిట్‌ రిజిస్ట్రార్‌’’కు మాత్రమే చెల్లించాలన్న అవగాహన ఎవరికి ఉండదు!

`పదే పదే కంపెనీల మోసాలకు బలౌతుంటారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చట్ట బద్దమైన సంస్థలు అంటారు. చట్టాలను చచ్చుబండలు చేస్తారు. ప్రజలు ఎవరో ఒకరిని నమ్మి, చిట్టీలు వేసి మోసపోవద్దు? అని నీతులు చెబుతారు. అన్ని రకాల అనుమతులతో కూడిన చిట్‌ కంపనీ ఊదరగొడతారు. ప్రచారం చేసుకుంటారు. సెలబ్రిటీలతో ప్రకటనలు చేయిస్తారు. హంగూ ఆర్భాటాలతో కూడిన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. జనం సొమ్ముతో కార్యాలయాలను నిర్వహిస్తుంటారు. మా చిట్స్‌ కంపనీలో చిట్టీల కట్టమంటారు? ప్రజలను మోసం చేస్తుంటారు. జనాన్ని నిండా ముంచేస్తుంటారు. వారి బతుకులతో ఆడుకుంటుంటారు. నమ్మినందుకు జనానికి నరకం చూపిస్తారు. వేసిన చిట్టీల గడుపు పూర్తయినా చిట్టీ మొత్తం డబ్బులు ఇవ్వరు. నట్టేట ముంచుతుంటారు. అయినా పాలకులు పట్టించుకోరు. వ్యవస్ధలు పట్టించుకోవు. జనం గోడు వినిపించుకోరు. బాధితులకు అండగా ఎవరూ ముందుకు రారు. ప్రభుత్వాధికారులు పట్టించుకోరు. అందరూ పట్టీపట్టనట్లే వ్యవహరిస్తుంటారు. చిట్స్‌ పేరుతో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కంపనీలు బోర్డులు తిప్పేసినా దిక్కు దివానం వుండదు. జనం సొమ్ముతో ఉడాయిస్తుంటారు. కంపనీ దివాళా తీసిందని కాకమ్మ కధలు చెబుతారు. జనం నోట్లో మట్టికొడతారు. నాలుగు రోజులు జైలు జీవితం అనుభవిస్తారు. బైటకు వచ్చి మళ్లీ కొత్త బాగోతం మొదలు పెడతారు. పాత బోర్డు స్ధానంలో కొత్త బోర్టు పెట్టేస్తారు. కంపెనీకి కొత్త పేరు పెట్టేస్తారు. మళ్లీ అద్దాల కార్యాలయం ఓపెన్‌ చేస్తారు. అమాయక జనాన్ని మళ్లీ ఆకర్షిస్తారు. బోనం బొట్లు పెట్టేస్తుంటారు. కంపనీలకు దేవుళ్ల పేరు పెడుతుంటారు. నమ్మకానికి ప్రతి రూపం అంటారు. నమ్మకమే మా పెట్టుబడి అని నమ్మిస్తారు. జనం సొమ్ముకు భరోసా అంటారు. మమ్మల్ని నమ్మడం అంటేనే గొప్ప వరం అన్నంతగా ప్రచారం సాగిస్తారు. సెలబ్రిటీలను తెచ్చి ప్రచారానికి వినియోగిస్తుంటారు. మీ భవిష్యత్తు మాది అంటారు. జనం సొమ్ము ఊడ్చుకొని ఉత్తచిప్ప కూడా చేతికి రాకుండా చేస్తారు. జనం రూపాయికి రక్షణ అంటారు. జనం బలహీనతను హాయిగా సొమ్ము చేసుకుంటారు. ఆస్ధులు పెంచుకుంటారు. చిట్‌ వేసేదాక బెల్లం మీద ఈగలు వాలినట్టు, జనం చుట్టూ తిరుగుతారు. వడ్డీ వల విసురుతారు. వెంట పడీ పడీ చిట్టీ కట్టేదాకా వదిలిపెట్టరు. అప్పులోల్లు ఇంటికి తిరిగినట్లే తిరుగుతారు. ఒక్క సారి చిట్టీ కట్టిన తర్వాత ఆ తిరగడం మనకు నేర్పిస్తారు. కాళ్లు అరిగేలా తిరిగినా కనికరం చూపరు. జనం సొమ్ముతో జనాన్నే బెదిరిస్తుంటారు. చుక్కలు చూపిస్తుంటారు. నెల కిస్తీ కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా సరే, పెనాల్టీలు వేస్తారు. చిట్టీ గడువు పూర్తయి, నెలలు గడిచినా సరే సొమ్ము తిరిగి ఇవ్వరు. ఆఖరుకు కంపనీ దివాళా పేరుతో బోర్డు తిప్పేస్తారు. ఇలా ఒక్క వరంగల్‌ జిల్లాలోనే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. వెలిసిన కంపనీలకు, మూత పడిన కంపనీలకు లెక్కేలేదు. కొత్తవి పుట్టుకొస్తూనే వుంటాయి. పాతవి మూత పడుతూనే వుంటాయి. కాని వ్యక్తులు వాళ్లే వుంటారు. జనం సొమ్మును దశాబ్ధాల తరబడి దోచుకుంటూనే వున్నారు. త్వరలో వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు జనానికి కుచ్చుటోపీ పెట్టిన చిట్‌ కంపనీల దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా మీ నేటిదాత్రిలో…త్వరలో..

 

వరంగల్‌లో చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఎక్కడ?

ఏడాది గడుస్తున్నా ఎందుకు ఖాళీగా వుంది?

`సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు?

`వరంగల్‌ అంటే ఎందుకు సుముఖంగా లేరు?

`వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు?

`వచ్చేందుకు సిద్దంగా వున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?

`రెవిన్యూ వ్యవస్ధలో ఏం జరుగుతోంది?

వరంగల్‌లో చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేక ఏడాది గడుస్తోంది. అయినా ఆ కుర్చీ ఖాళీగానే వుంది. కనీసం ఇన్‌ చార్జి కూడా ఎవరూ లేరు. చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేయడానికి సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పని చేయడానికి సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు భయపడుతున్నారు. అనుకున్నంత సంపాదన రాదని వద్దనుకుంటున్నారా? చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తే ఎలాంటి ఫలితం వుండదనుకుంటున్నారా? లేక ప్రజా ప్రతినిధులకు భయపడి రానంటున్నారా? వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏం జరుగుతోంది. ఆ మధ్య ఓ వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా ఓ అధికారిని వచ్చారు. నేను ఇక్కడ పని చేయాలని వెళ్లిపోయారు. కారణాలు ఏమైనా కావొచ్చు? అధికారులు తమకు నచ్చిన చోటనే పనిచేస్తారా? వారికి అనుకూలమైన పోస్టింగ్‌ వుంటే తప్ప పనిచేయరా? కేవలం రిజిస్ట్రేషన్‌ శాఖలో మాత్రమే పనిచేస్తారా? లంచాలకు అలవాటు పడిన వారు చిట్స్‌ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి ఇష్టపడడం లేదా? వచ్చిన వారిని ప్రజా ప్రతినిధులు పని చేయనీయడం లేదా? వరంగల్‌ అంటేనే అధికారులు ఎందుకు భయపడుతున్నారు? జీతం తప్ప అదనంగా దమ్మిడి రాకున్నా, సమస్యలు ఎదురౌతానకుంటున్నారా? ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో పనిచేసి, ఉద్యోగానికే ఎసరు తెచ్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా? అయితే ఇలాంటి చోట కూడా పనిచేసేందుకు కొందరు అదికారులు సిద్దంగా వున్నారు. కాని వారికి మాత్రం పోస్టింగ్‌ ఇవ్వడం లేదు. ఎందుకంటే వచ్చే అధికారులు తమ చెప్పు చేతుల్లో వుండాలని ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నారు. అవినీతికి అలవాటు పడిని అధికారులు చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఒక వేళ పనిచేద్దామని వచ్చే వారిని ప్రజా ప్రతినిధులు రానివ్వడం లేదు? కారణమేమిటంటే తమ మాట వినని అదికారులు వస్తే ఆ ప్రజా ప్రతినిధుల మాట చెల్లుబాటు కాదు. వారి ఆదేశాలు ఆచరణలోకి రావు. దాంతో ఏడాది కాలంగా చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేకుండానే కార్యాలయం పనిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వరంగల్‌ అంటేనే చిట్‌ ఫండ్‌ కార్యాలయాల గోల్‌ మాల్‌కు అడ్డా? ఏ చిట్‌ ఫండ్‌ చూసినా అదే తీరు. అదే వ్యవహారం. అలా ప్రజలను నిండా ముంచిన కంపనీలే ఎక్కువ. ప్రజలను వీదిన పడేసిన కార్యాలయాలే వున్నాయి. వేల కోట్లు రూపాయల కుంభాకోణాలకు నిలయంగా మారాయి. అలాంటి వరంగల్‌లో బాధితుల గోడు వినేందుకు, చిట్స్‌ కంపనీ ఆగడాల నుంచి రక్షించేందుకు చిట్స్‌ రిజిస్ట్రార్‌ వుండాలి. ప్రజల గోడు ఎవరు వినాలి? ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? నిజాయితీగా పనిచేసే అధికారులు వున్నారు. కాని వారికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రజా ప్రతినిధులంటే జిల్లా రిజిస్ట్రార్లే భయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎలాగూ ప్రజలకు సహకరించరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సరే, వాళ్లంతా చిట్స్‌ కంపనీలకే వత్తాసు పలుకుతారన్నది భహిరంగ రహస్యమే. అందుకే వరంగల్‌కు ఎవరినీ రానివ్వడం లేదు. బాధితుల సమస్యలు తీరడం లేదు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెంటనే స్పందించి, వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌ పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు. చిట్‌ రిజిస్ట్రార్‌గా పని చేయమని చెప్పేవారిని వదిలేయండి. కాని వస్తామని అంటున్నవారిని ఎందుకు రానివ్వడం లేదో చెప్పండి? ఏది ఏమైనా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయండి.

రిజర్వేషన్‌ బిచ్చం కాదు..హక్కు..!

`బీసీలంతా ఏకమైతేనే బలపడతారు!

`బీసీలు బలపడితేనే బరిగీసి నిలవగలరు!

bc reservation

`బీసీలు బరి గీసినప్పుడే ముందుకు రాగలరు

`బీసీలు ముందు కొచ్చినప్పుడే ఓసిలను వెనక్కు నెట్టగలరు

`ఓసిలను వెనక్కి నెట్టితేనే రాజ్యాధికారం సాధించగలరు.

`బీసీలు డెబ్బై ఏళ్లు వెనకే వున్నారు.

`బీసీలు ఇప్పటికైనా మేలుకోండి.

`జనరల్‌ అంటే ఓసిలు కాదు!

`అన్ని వర్గాల ప్రజలు..

`పోటీ చేసేందుకు అర్షులు.

`ఈ సత్యం దాచి మోసం చేస్తూ వస్తున్నారు.

`బలమైన బీసీ సమాజం సీట్లు అడుక్కోవడమా!

`బలం లేని ఓసిలు సీట్లు పంచుకోవడమా!

`బీసీల నెత్తిమీద కూర్చొని ఓసిలు పెత్తనం చేయడమా!

`బీసీలకు ఏం కావాలన్నా ఓసిలను అడుక్కోవాలా!

`ఓసిలంతా కలిసి సీట్లు పంచుకుంటారా?

`ఆ ఓసిలకు ఓట్లు వేసి, బీసీలు గెలిపించుకోవడమా?

`రాజ్యమేలమని ఓసిలకు పగ్గాలిచ్చి, బీసీలు పాలేర్లు కావడమా!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

బిసిలంతా ఏకమైతేనే బలపడాతారన్న సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించాలి. బిసిల్లారా..ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా బిసిలంతా మేలుకోవాల్సిన తరుణం వచ్చేసింది. బేషజాలు పక్కన పెట్టి బిసిలంతా ఏకమైతే తప్ప రాజ్యాదికారం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా బిసిల అంశం తెరమీదకు వచ్చిది. గత రెండు సంవత్సరాలుగా నానుతోంది. బిసి సంఘాలు అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ బిసి జపం చేస్తున్నాయి. అయినా బిసిలు కదలకపోతే చేసేదేమీ వుండదు. ఇంకా వెయ్యేల్లయినా బిసిలకు రాజ్యాధికారం దక్కడు. స్వాతంత్య్రానికి పూర్వం రాజరిక వ్యవస్ధ వున్నప్పుడే సర్వాయి పాపన్న లాంటి రాజు ఉద్భవించాడు. తన సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలించాడు. ఇతర రాజులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ మాత్రం పౌరుషం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎందుకు కరువౌతోంది. రాజ్యాంగం జనరల్‌ కేటరిగి పేరుతో బిసిలకు కూడా అవకాశం కల్పించింది. అయినా బిసిలు ముందుకు రావడం లేదు. ప్రజా ప్రతినిధులయ్యేందుకు ధైర్యం చేయడం లేదు. డెబ్బై స్వతంత్య్రంలో ఒక్క బిసి నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు. బిసిలే ఎక్కువగా వున్న క్యాబినేట్‌ఏర్పాటు కాలేదు. నిజాం నుంచి విముక్తి జరిగిన తెలంగాణలో బిసి సిఎం. కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు అవకాశం దక్కలేదు. ఇప్పుడూ దక్కలేదు. కొట్లాడితే తప్ప బిసిలకు రాజ్యాధికారం రాదు. అధికారం వశం చేసుకుంటే తప్ప పాలకులు కాలేరు. అందుకే రాజకీయ హక్కుల సాదన దిశగా ప్రతి బిసి అడుగులేయాలి. నేనేందుకు నాయకుడిని కావొద్దని ప్రశ్న వేసుకోవాలి. మాకు అదికారం ఎందుకు రాదని ముందుకు రావాలి. అంతే తప్ప బిసిల రిజర్వేషన్‌ ఎవరో వేసే బిక్షలాగా ఎదురుచూడొద్దు. రిజర్వేషన్‌ అనేది బిసిల హక్కు. జనాభాలోనే 85శాతం వున్న బిసిలకు కనీసం 42శాతం రిజర్వేషన్‌ ఇవ్వకపోతే పోరాటం చేసైనా సాధించుకోవాలి. అందుకు రాజ్యాధికార సాదన దిశగా కదలాల్సిన అవసరం వుంది. బిసిలలో వున్న ప్రధానమైన లోపాన్ని అధిగమించాలి. బిసిలలో వున్న కులాల మధ్య ఆధిపత్యం తగ్గాలి. బిసిలంటే బిసిలే..అంతే కాని మేం ఎక్కువ. మీరు తక్కువ అనే భావన పోవాలి. అన్నా, తమ్ముడు, మామ, అక్క అని పిలుచుకుంటే సరిపోదు. ఇటీవల బిసిలంటే నాలుగు కులాలేనా? అనే ప్రశ్న మొదలైంది. ఇలాంటి చీలికను తీసుకొచ్చి బిసిలను విచ్చిన్నంచేయాలిన చూస్తుంటారు. వారి ఉచ్చులో పడొద్దు. పైకి కపట నాటకమాడే రాజకీయ పార్టీలు ఉచ్చును ఎప్పుడూ సిద్దం చేసి వుంచుకుంటారు. బిసిల వేలుతోనే, బిసిల కన్ను పొడుస్తారు. ఇది గమనించుకొని ముందుకు సాగాలి. బలమైన అడుగులు వేయాలి. అందువల్ల బిసిల రాజ్యాధికారం కోసం ఏకమైతే తప్ప రాజకీయ పార్టీలు ఏం చేయలేవు. ఓసిలకు ఇప్పటిదాకా చేసిన ఊడిగం చాలు. బిసిలంటే పిల్లులు కాదు. పులి పిల్లలని నిరూపించాలి. కట్టె పుల్లలం కాదు, కట్టెల మోపులమని రుచి చూపించాలి. ఎందుకంటే బిసిలంతా చీపురు పుల్లల్లా వున్నంత కాలం ఏమీ చేయలేరు. అందరూ కలిసి కట్టెల మోపులా మారి, బిసిల ఐక్యత చాటాల్సిన అవసరం వుంది. బిసిలలో వున్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. ప్రజా ప్రతినిధులై సామాజిక న్యాయం సాదించాలి. క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు బిసిలే నాయకులు కావాలి. రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బిసిలు లేకుంటే పార్టీ మనగడ అసాద్యమని తేలుసుకోవాలి. బిసిలకు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. పార్టీల కన్నా, బిసిల ఐక్యత ముఖ్యం. రాజ్యాధికారం సాదించే వరకు కలిసి సాగుదామని శపథం చేయండి మేధావుల ఆలోచనలు అమలు చేయండి. చెప్పుడు మాటలు వింటూ మళ్లీ మోసం పోకుండా జాగ్రత్తపడండి. బలమైన బిసి నాయకులను తయారు చేయండి. అన్ని కులల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసి కట్టు ప్రయాణం సాగించండి బిసిల రాజ్యాధికారం సాదిద్దాం.బిసిల్లారా..ఏకం కండి! ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు. రాజకీయ పార్టీలో ఒక భయం వచ్చేసింది. బిసిలను కాదనుకుంటే పార్టీలే వుండవన్న భయం పట్టుకున్నది. బిసిల పట్టు బిగుస్తోంది. బిసిల గొంతు బలపడుతోంది. బిసిలలో వున్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. అప్పుడే రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుడుతుంది. బిసిలు ప్రజా ప్రతినిధులై సామాజిక న్యాయం సాదించాలి. అందుకు క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు బిసిలే నాయకులు కావాలి. రానున్న స్ధానిక సంస్దల ఎన్నికల్లో అన్ని జనరల్‌ స్ధానాలలో బిసిలు పోటీ చేయాలి. ఇప్పటి వరకు జనరల్‌ స్ధానమంటే ఓసిలకు రిజర్వేషన్‌ అనే అపోహ వుంది. అగ్రకులాలు అలా ప్రచారం చేసుకున్నాయి. బిసిలను రాజకీయానికి దూరం చేశాయి. జనరల్‌ స్దానాల్లో ఓసిలు పాగా వేసి, బిసిలకు స్ధానం లేకుండా చేశారు. ఓసిలు నాయకులౌతూ బిసిలను కార్యకర్తలుగా మార్చుకొని అందలమెక్కారు. ఇంత కాలానికి తెలంగాణ ఉద్యమం లాంటి చైతన్యం వచ్చింది. అది ఉప్పెనలా మారాలి. చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అసరం లేదు. రాజకీయంగా కూడా సీట్లు కేటాయించొచ్చు. అందుకు ఏ చట్టం అడ్డుపడదు. జనరల్‌ స్దానాలన్నీ బిసిలకు ఇవ్వొచ్చు. కనీసం దామాషా ప్రకారం పంపకాలు చేయొచ్చు. రాజ్యాంగ పరంగా ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించినా, జనరల్‌ స్దానాలలో బిసిలకు టిక్కెట్లు ఇవ్వొచ్చు. ఆ వెసులుబాటు వుంది. అయినా రాజకీయ పార్టీలు నాటకాలాడొచ్చు. ఈ ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా స్దానిక సంస్దల ఎన్నికల్లో బిసిలు ప్రజా ప్రతినిదులైదే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిసిలను ఎవరూ ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి కావాలి. అంటే ఇప్పటి నుంచే అడుగులు పడాలి. బిసిల ఐక్యతలో మరింత చైతన్యం రావాలి. రాగద్వేషాలు వీడాలి. అంతే కాకుండా రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బిసిలు లేకుంటే పార్టీ మనగడ అసాద్యమని తేలుసుకోవాలి. అంతగా బలమైన ఒత్తిడి బిసి సంఘాల నుంచి, బిసి నాయకుల నుంచి రావాలి. అవసరమైతే బిసిల నాయకులు ఆయా పార్టీల నుంచి బైటకు రావాలి. రాజకీయ పార్టీలలో వున్న బిసి నాయకులంతా బైటకువస్తే రాజకీయ పార్టీలలో వనుకు పుట్టాలి. ఇప్పుడు స్దానిక సంస్దల ఎన్నికల్లోనే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిసిలకు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. బిసిలుముందుగా చేయాల్సిన పని పార్టీల కన్నా, బిసిల ఐక్యత ముఖ్యమనే ఆలోచన చేయాలి. అందుకు కట్టుబడి వుండాలి. తన సీటు తనకు వస్తే చాలు అనుకునే స్వార్ధపరులను బిసి సంఘాలు కూడా వెలివేయాలి. బిసిలు వారిని తిరస్కరించాలి. అప్పుడు గాని బిసిలలో మరింత ఐక్యత సాద్యం కాదు. బిసిల వేలుతోనే బిసిల కన్ను పొడుస్తారు. అందుకు జాగ్రత్తగా వుండాలి. అవకాశవాద బిసి నాయకులను దూరం పెట్టాలి. ఆయా పార్టీలపై ఒత్తిడి తెచ్చే నాయకులను మాత్రమే తెలంగాణ సమాజం నమ్మాలి. వారిని స్వాగతించాలి. వారిచేత తెలంగాణలో బిసిల రాజ్యాధికారం సాదించే వరకు కలిసి సాగుదామని శపథం చేయించాలి. ప్రజలు, ప్రజా సంఘాలు, బిసిలంతా ప్రమాణం చేయాలి. అంతే కాకుండా మేధావుల ఆలోచనలు అమలు చేసుకుంటూ ముందుకు సాగాలి. రాజకీయాలలో వెన్నుపోట్లు ఎక్కువ. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు వినేవారు చాల మంది వుంటారు. అలాంటి వారి మాటలు వింటూ మళ్లీ మోసం పోకుండా జాగ్రత్తపడాలి..బలమైన బిసి నాయకులను తయారు చేసుకోవాలి. అన్ని కులల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసి కట్టు ప్రయాణం సాగించాలి. బిసిల రాజ్యాధికారం సాదించాలి. బిసిలంతా కలిసి బరిగీసి నిలబడాలి.అప్పుడే ముందుకు రాగలరు. బిసిలంగా ముందుకు వస్తేతప్ప ఓసిలు వెనుకడుగు వేయరు. వారిని వెనక్కి నెట్టే పరిస్ధితి రాదు. డెబ్బై ఏళ్లు బిసిలు వెనకే వున్నారు. ఓసిలకు రాజకీయ ఊడిగం చేశారు. ఇప్పటికైనాసరే బిసిలు ముందుకు రావాలి. ముందడుగు వేయాలి. జనరల్‌ అంటే ఓసిలు కాదు. జనరల్‌ అంటే అందరూ..ఈ విషయం తెలిసినా, బిసిలు ముందుకు రాలేదు. అణగారిన వర్గాలు అని చెప్పడం తప్ప వారిని పైకి తీసుకొచ్చే ఆలోచనలు ఇప్పటి వరకు ఏ రాజకీయపార్టీ పూర్తి స్ధాయిలో చేయలేదు. ఎంత సేపు మోచేతికి బెల్లం పెట్టి నాకించడం తప్ప ఏమీ చేయలేదు. పేరు వేల కోట్లు, వందల కోట్లు అంటూ సబ్‌ ప్లాన్‌లు పెట్టినా ఎవరికి మేలు జరిగిందో చెప్పింది లేదు. ఇటు నిధులు కేటాయించడం..అటు మళ్లించడం..సబ్‌ ప్లాన్‌లపేరుతో రాజకీయాలకు బిసిలను దూరం చేయడం బాగా అలవాటు చేసుకున్నారు. ఇప్పటికైనా బిసిలు అసలు రహస్యం తెలుసుకోవాలి. కావాల్సింది సబ్‌ ప్లాన్‌లు కాదు. రాజకీయాలు. పదవులు. అదికారం. అప్పుడు తప్ప బిసిలకున్యాయం జరగదు. సామాజిక న్యాయానికి అర్దం వుండదు

తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహం!

`తెలంగాణ యాసకు పాటలమ్మ పరవశం.

`తెలంగాణ కావ్యాలకు సంగీతమే సాగరం!

`తెలంగాణ మట్టి పరిమళాలతో రాగమాడుతున్న తాండవం.

`తెలంగాణ ఉద్యమంతో పల్లె పాటకు పెరిగిన ఆదరణ.

`ఆది నుంచి తెలంగాణ పాటలో వున్న మట్టి వాసన.

`తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం.

`ప్రపంచం నలుమూలలా పాకుతున్న పాటల విన్యాసం.

`మిస్‌ వరల్డ్‌ నోటి నుంచి జాలు వారిన ముత్యాల వాన.

`రాను బొంబయ్‌కి రాను అంటూ ఊగిపోతున్న ప్రపంచం.

`అర్థం తెలియకపోయినా అల్లుకుపోతున్న పాట.

`వందల మిలియన్లతో అగ్రగామిగా నిలుస్తున్న మన తెలంగాణ పాట.

`ఒకప్పుడు తెలంగాణ పాటకు అవమానం.

`ఇప్పుడు తెలంగాణ పాటకు వైభోగం.

`తెలంగాణ పాట రాష్ట్రానికే సౌభాగ్యం.

`మనసు పరవశానికి పట్టాభిషేకం.

`ఆనందాన్ని పంచుతున్న ఆరోగ్యం.

`వెలుగులోకి వస్తున్న సంగీత సరస్వతులకు జేజేలు కొడుతున్న ప్రపంచం.

`ఎన్ని సార్లు విన్నా తరగనంత సంతోషాన్ని నింపుతున్న మధురగానం.

`అది తెలంగాణ యాసలో వున్న మధురామృతం.

`ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ విన్నా సినిమా పాటలు.

`ఇప్పుడు ప్రపంచమంతా మారు మ్రోగిపోతున్న తెలంగాణ పాటలు.

`తెలంగాణ యాస కమ్మదనం తొక్కుతున్న పాటల పరవళ్లు.

`తెలంగాణ కవిగాయకులు అంటే పాటల ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణపాట అనగానే మది పులకిస్తుంది. మనసు పరవశిస్తుంది. తెలంగాణ పాట అంటేనే రక్తం ఉరకలేస్తుంది. ఊపును నింపుతుంది. ప్రశ్నను రేకెత్తిస్తుంది. వ్యవస్ధను నిలదీస్తుంది. సమాజాన్ని దారిలో పెడుతుంది. ఆలోచనను సృష్టిస్తుంది. నిజాన్ని వెలికి తీస్తుంది. నిప్పులా కాలుతుంది. సూటిగా బాణంగా గుచ్చుకుంటుంది. తూటాలా పేలుతుంది. మస్కిష్కంలోకి దూసుకుపోతోంది. ఆలోచింపచేస్తుంది. చైతన్యం నింపుతుంది. ఉద్యమానికి ఊపిరిలూదుతుంది. పోరాటానికి దారి చూపిస్తుంది. ప్రకృతిని ఆరాదిస్తుంది. ప్రకృతి గొప్పదనం చెప్పుతుంది. గాలి, నీరు, నిప్పు, నింగి,నేలను కలుపుకొని సాగుతుంది. ఉప్పెనలా దూసుకొస్తుంది. సునామీ సృష్టిస్తుంది. గడ్డిపరకలు గడ్డపారలౌతాయి. ఎండిన ఆకులు కూడా అలజడులు సృష్టిస్తాయి. వాగులు పరుగులందుకుంటాయి. వంకలు దుంకుతుంటాయి. కొండ, కోనలు కూడా ప్రతిధ్వనిస్తుంటాయి. ఇదీ తెలంగాణ పాటంటే…ఇదే తెలంగాణ గానమంటే..ఆ గానంలో ఆత్రం వుంటుంది. ఆకలి వుంటుంది. తిరుగుబాటు వుంటుంది. కమ్మదనం వుంటుంది. అందుకే తెలంగాణ పాటకు దాసోహం అనని వారుండదు. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అంటే శివుడు కూడా కన్నీరు కార్చాల్సిందే. ఆ కన్నీటితో శివలింగం కూడా తడిసి ముద్ద కావాల్సిందే. ఆ కన్నీటితోనే అభిషేకం జరిపిన పాట తెలంగాణ పాట. అవును ఇది అతిశయోక్తి కాదు. ఆర్తి. తెలంగాణస్పూర్తి. తెలంగాణ పదానికి దేవుళ్లే కదిలిన దార్తి…తెలంగాణ ఉద్యమ కాలంలో మిట్టపల్లి సురేందర్‌ రాసిన రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ పాట రాస్తే, ఆ రాగానికి తెలంగాణ మొత్తం కన్నీటిపర్యంతమైంది. తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల కడుపుకోత కండ్ల ముందు కదలాడిరది. ఏకంగా శివుణ్ణే ప్రశ్నిస్తుంటే తెలంగాణ సమాజమంతా నివ్వెరపోయింది. తెలంగాణ ఇస్తారా? లేదా? అని డిల్లీని నిలదీసింది. కొట్లాడి సాదించుకుందామనే ధైర్యాన్ని ఆ పాట తెలంగాణ యువతలో నింపింది. అదీ తెలంగాణ పాట గొప్పదనం. తెలంగాణ పాట ఇప్పుడు పుట్టింది కాదు. ఇక్కడితో ఆగేది కాదు. తెలంగాణలో బతుకమ్మ పుట్టినప్పుడే పాట పుట్టింది. తర్వాత నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ పాట గళమెత్తింది. తెలంగాణ ఉద్యమం కోసం రెండు దఫాలుగా యాభై ఏళ్లపాటు ప్రతిసారి పాటల రెక్కలు కత్తిరించినా, కొత్త రెక్కలు తొడుక్కొని ఊరకలెత్తింది. ఈ భూమి మనదిరా.. వాడ మనది రా..అంటే చైతన్యం నింపింది. ఎంతో మంది కవి గాయకులు తెలంగాణను పాటల సీమగా మలిచారు. ఇప్పుడు స్వర్గసీమను ఏలుతున్నారు. ప్రజల నాలుకలమీద జీవిస్తూనే వున్నారు. అలా ఎంతో మంది కవులు,గాయకులు తెలంగాణ గడ్డ మీద పుట్టారు. అయితే తెలంగాణ పాటను తమ స్వార్ధం కోసం వాడుకున్న ఆంద్రులున్నారు. వారి రాజకీయం కోసం అణిచి వేసిన వాళ్లున్నారు. సినిమా వాళ్లు తెలంగాణ పాటతో కోటీశ్వరులయ్యారు. కాని తెలంగాణ కవులకు చిల్లిగవ్వలు ఇవ్వకుండా మోసం చేశారు. తెలంగాణ పాటను రాజకీయ నాయకులు అణిచివేశారు. అయినా ఆకలిని కూడా ఎదరించి నిలబడిరది తెలంగాణ పాట. ఆకలికి అమ్ముడుపోనిది తెలంగాణ పాట. ఎవరో వేసే మెతుకుల కోసం ఆరాటపడనిదే తెలంగాణ పాట. తనను తాను సృష్టించుకొని పల్లకిలో ఊరేగిందే తెలంగాణ పాట. ఆ పాటల పరంపరంలో ఉద్యమానికి ఊపిరులూదిన పాటలు అనేకం వున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద అంటూ గద్దర్‌ పాడిన పాటలు, జయయజహే తెలంగాణ అంటూ అందెశ్రీ రాసి పాడిన పాటలున్నాయి. నేలమ్మ నేలమ్మా అంటూ జయరాజ్‌ రాసిన పాటలున్నాయి. అయ్యోనివా నువ్వు అవ్వోనివా అంటూ తెలంగాణను మేలుకొలిపిన పాటలున్నాయి. నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ అని వినిపించిన గానాలున్నాయి. ఇదవన్నీ తెలంగాణకు ముందు…కాని ఇప్పుడు తెలంగాణ తర్వాత కూడా తెలంగాణ పాట తన ప్రస్ధానం ఆపుకోలేదు. ఆగిపోలేదు. మరింత దూకుడు పెంచింది. అందుకే తెలంగాణ పాట గురించి చెప్పాలంటే తెలంగాణ రాకకు ముందు, తెలంగాణ తర్వాత అని చెప్పాలి. అప్పటి పాటలు ఆణిముత్యాలు. ఇప్పటి పాటలు ప్రపంచాన్ని ఏలుతున్న వజ్రాలు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పాటల పూదోట. అది ఎరుపెక్కినా పాట ద్వనిస్తుంది. పచ్చగా మారినా పరవశించి పాడుతుంది. ఉద్యమాల బాటకు దారులు వేసిన పాట. పోరాటాలను కడుపులో నింపుకొని దూకిన పాట. తెలంగాణ పాట అంటేనే పోరాటాల చరిత్ర. అణివేతను నిలదీసిన తిరుగుబాటు. అస్ధిత్వ ఆరాటాన్ని, ఆత్మ గౌరవ నినాదాన్ని నింపుకొని సాగుతుంది. పాట హృద్యంగా వుండాలన్నా, రక్తం మరగాలన్నా తెలంగాణ పాటేకావాలి. ఇది తెలంగాణ పాట గొప్పదనం. నిండు గుణం. ఒకప్పుడు తెలంగాన పాటంటే పౌరుషం..పోరాటం మాత్రమే అనుకునే వారు. కాని దాని వెనుకున్న ఆకలి ఆరాటాలు పట్టించుకునేవారు కాదు. తెలంగాణ పాటలో తిరుగుబాటు బావుటానే చూసేవారు. కాని అది గుండెల్లో మండుతున్న అగ్నికి ప్రతిరూపం అని పాలకులు భావించకపోయేవారు. సముద్రంలో ఎగసిపడుతున్న అలలు అని తెలుసుకోలేకపోయారు. వాటిని అణిచి వేశారు. పాటను కాలరాయాలనుకున్నారు. ఆనాడే తెలంగాణ పాటకు స్వేచ్చనిస్తే ప్రపంచాన్నే శాసించేది. ప్రపంచానికే చైతన్యాన్ని నింపేది. తెలంగాణలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆ పాటలు సజీవమే..కాని తెలంగాణలో ఇప్పుడు కొత్త తరంపాటలొస్తున్నాయి. రసరంజనిలో ఓలలాడిస్తున్నాయి. ప్రతి తెలంగాణ గుండెలో ఆనందాన్ని నింపుతున్నాయి. మనసును పరవశింపజేస్తున్నాయి. ముసలీ ముతక కూడా కాలు కదిపేలా చేస్తున్నాయి. పసి పిల్లలు తొట్టెలో కూడా కూడా ఊగిపోయేలా చేస్తున్నాయి. తెలంగాణలో కన్నీటి పాటల నుంచి పన్నీటి పాటలు ఉధ్భవిస్తున్నాయి. పాటల జడివానలో ప్రపంచాన్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహమంటోంది. తెలంగాణ యాస ప్రపంచపు అంచులను తాకుతుంటే పాటలమ్మ పరవశించిపోతోంది. తెలంగాణ కావ్వాలకు సంగీత సాగరమే నాట్యం చేస్తోంది. తెలంగాణ మట్టి పరమిళలాతో రాగమే తాండవమాడుతోంది. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే తెలంగాణకు చెందిన ఓ కుర్ర కళాకారుడు రాము రాథోడ్‌ గాయకుడై, కవిjైు, నర్తించి నిర్మించిన రాను..నే..రాను బొంబైకి రాను అనే పాట సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మైకెల్‌ జాక్సన్‌ పాట కూడా 500 మిలియన్లు దాటిన సందర్భం లేదు. దేశంలోని ఏ గాయకుడు పాడిన పాట కూడా అంత దూరం వెళ్లలేదు. ఎంత పెద్ద పాటైనా సరే పది కోట్లు దాటడడమే ఒకప్పుడు రికార్డు. కాని ప్రపంచంలోని తెలుగు వాళ్లే కాదు, బాష తెలియని వాళ్లు కూడా ఆ బాణీలకు, మాటలకు ఫిదా అయిపోయారు. 50 కోట్ల మంది వీక్షించారు. తన్మయత్వానికి లోనయ్యారు. అంటే మాటలు కాదు. మామూలు విషయం అసలే కాదు. తెలంగాణ యాసలో ఈ మధ్య వస్తున్న అనేక పాటలు కూడా అదే దారిలో పరుగులు తీస్తున్నాయి. ఓ పిలగ వెంకటేష అంటూ సాగుతున్న పాట, దారి పొంట వత్తుండు..దవ్వ దవ్వ వత్తుండు..దారిదుద్దునా, పోనిద్దునా? అంటూ సాగే పాట కూడా ప్రపంచాన్ని జయించాలని పరుగులు పెడుతోంది. ఇలా రోజు రోజుకూ కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ యాసను దిగంతాలకు చేర్చుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ యాసను చీదరించుకున్న వాళ్లు, ఈసడిరచుకున్న వాళ్లు సైతం ఆ మాధుర్యానికి గులాములౌతున్నారు. తామెందుకు చేయలేమని ఆంద్రాకు చెందిన వాళ్లు కూడా తెలంగాణ యాసలో పాటలు రాస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ బాషను అదేం బాష.. అనేవారు. తెలంగాణ నుడి కారాలను వెక్కిరించేవారు. తెలంగాణ నుంచి వచ్చే సాహిత్యాన్ని చిన్న చూపు చూసేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటకు ఆదరణ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం జరుగుతోంది. మిస్‌ వరల్డ్‌ నోటి నుంచి జాలువారిని ముత్యాల వాన రాను..నే రాను బొంబైకి రాను..! అర్ధం తెలియకపోయినా తెలంగాణ పాట అల్లుకుపోతోంది. అందరి నాలుకల మీద నాట్యం చేస్తోంది. తెలంగాణ పాట ఇప్పుడు వైబోగం చవి చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర సౌభాగ్యాన్ని గుర్తు చేస్తోంది. ప్రతి మనిషిలో వున్న పరవశానికే పదనిసలు నేర్పుతోంది. ప్రపంచమంతా పట్టాభిషేకం చేస్తుంటే తెలంగాణ యాస మధురగానంలో ఓలలాడుతోంది. పాటల పరవళ్లు తొక్కుతులంటే తెలంగాణ కళాకారులు సంగీత ప్రపంచంలో రారాజులౌతున్నారు. తమ రాజ్యాలనేలుతున్నారు. ఆల్‌ ది బెస్ట్‌. మైడియర్‌ న్యూ జనరేషన్‌.

ఆంద్రా మేతావులు..తెలంగాణ వ్యతిరేకులు!?

`ఇప్పటికీ తెలంగాణ మీద విషం కక్కుతూనే వుంటారు!

`తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తారు!

`కేసీఆర్‌ అసెంబ్లీకి హజరు కాకపోవడం కూడా వాళ్లకు ఇబ్బందే!

`అవకాశం దొరికింది కదా అని విమర్శలే!

`ఎన్టీ రామారావు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా హజరుకాలేదు.

`నన్నపనేని రాజకుమారి ఏదో ఒక మాట అన్నదని రానని వెళ్లిపోయారు.

`మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా! అని రాలేదు.

`ఆంధ్రా మేధావులకు అది గుర్తు చేయరు!

`ఆనాడు ఎన్టీఆర్‌ చేసింది కూడా తప్పే అనే ధైర్యం వారికి వుండదు.

`వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర పేరుతో అసెంబ్లీకి హజరుకాలేదు.

`తర్వాత చంద్రబాబు బస్సు యాత్ర, పాదయాత్రల పేరుతో హజరుకాలేదు.

`ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించరు!

`వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా హజరుకాలేదు.

`ఎమ్మెల్సీగా వుండి పాదయాత్ర చేసిన లోకేష్‌ మండలికి హజరుకాలేదు.

`అప్పుడు ఏ ఒక్క ఆంద్రా మేధావి నోరుతెరవలేదు!

`తెలంగాణ మీద మాత్రం నోరుతెరుస్తారు.

`సుద్దపూసల సుద్దులన్నీ చెబుతుంటారు!

`కాళేశ్వరం కడితే ప్రజాధనం వృధా అంటారు.

`పోలవరం పూర్తి కావాలని కోరుకుంటారు.

`తెలంగాణ అభివృద్ధిని చూసి ఏడిచి చస్తుంటారు?

హైదరాబాద్‌, నేటిధాత్రి:
మేధావి మౌనం దేశానికి ప్రమాదకరమని మాజీ ప్రదాని పివి. నర్సింహారావు అన్నారు. కాని మేధావులు అంటే ఎవరు? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మేధావులు వేరు. అప్పటి మేదావులు వేరు. ఇప్పటి మేధావులు వేరు. అప్పటి మేధావులు సమాజం గురించి మాత్రమే ఆలోచించేవారు. రాజకీయాల జోలికి వెళ్లేవారు కాదు. కాని నేడు మేధావులు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తమకు అనుకూలమైన రాజకీయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. పైగా మేధావి అంటే అన్ని రంగాల, రకాల విషయాల మీద అవగాహన వుండాలని ఏమీ లేదు. సమాజంలో అనేక రంగాలున్నాయి. ఆయా రంగాలలో వుండే మేదావులు వేరు. ఒక రంగంలో మేదావి మరో రంగం గురించి మాట్లాడే వారు కాదు. కాని ఇప్పుడు మేధావి అంటే చాలు అన్ని రంగాల గురించి మాట్లాడుతున్నారు. అంతా నాకే తెలుసు అన్నట్లు మాట్లాడేస్తున్నారు. గతంలో మేదావులు అనేక రకాల పుస్తకాలు అధ్యయనం చేసేవారు. ఆయా రంగాలపై ఇతరుల మీద ఆదారపడాల్సినంత అవసరం లేని మేధస్సును వారి కలిగి వుండేవారు. ఇప్పుడు అంతా గూగుల్‌ మేధావులు. వారికి అవసరమైన విషయాలను అప్పటిప్పుడు గూగుల్‌లో చూసి తెలుసుకొని గొప్పలకు పోతున్నారు. మేదావులుగా చెలామణి అవుతున్నారు. వారికి తెలిసింది గోరంత. కాని చెప్పేది కొండంత. అందులో అంతా డొల్ల. పైగా తమకు మించిన విశ్లేషకులు లేరన్నట్లు మాట్లాడుతూ వున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖంగా టెలివిజన్‌ తెరలమీద, యూట్యూబ్‌లలో మాట్లాడే మేదావులు ఎక్కువయ్యారు. అలాంటి వారిలో మాజీ ఐపిఎస్‌ అధికారి జేడి లక్ష్మినారాయణ ఒకరు. నిజానికి ఆయన ఒక మేదావిగానే చెలామణి అయితే ఆయనను ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. కాని ఆయన రాజకీయ అవతారమెత్తిన మేదావి వర్గం. ఆయన తెలంగాణ, ఆంధ్రా రాజకీయాల మీద బాగానే మాట్లాడుతున్నారు. ఇంత వరకు సంతోషమే. కాని తెలంగాణ రాజకీయాలపై మాత్రం అప్పుడప్పుడూ విషం కక్కుతూనే వుంటారు. కేసిఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హజరు కాకపోవడం ఆయన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కాని వాటిలో కూడా ఆయన దూరి మాట్లాడిప్పుడు అన్ని విషయాలను ప్రస్తావించాలి. అంతకు ముందు రోజుల్లో అసెంబ్లీకి హజరు కాని వాళ్లు ఎంత మంది వున్నారు. వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ఇది తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్టీఆర్‌ ప్రభుత్వం పోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎన్టీఆర్‌ను రాజకీయంగా అప్పటి ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ నన్నపననేని రాజకుమారి ఏదో అన్నారు. దానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది. వెంటనే మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను అంటూ వెళ్లిపోయారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీ ముఖం చూడలేదు. మరి ఆనాడు ఆయన చేసింది మాత్రం ఏపి మేదావులకు ఒప్పుగానే కనిపించిందా? ఆ విషయాన్ని ఏపి మేధావులు ఎందుకు ప్రశ్నించరు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. ఉమ్మడిరాష్ట్రంలో ఆయన ఒకసారి బస్సుయాత్రచేశారు. రెండోసారి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి హజరు కాలేదు. ఆ సమయంలో చంద్రబాబు జీతం తీసుకున్నారు. ఆ విషయం మాత్రం ఏపి మేధావులు గర్తు చేయరు. 2004కు ముందు దివంగత వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాలేదు. నేరుగా ఎన్నికలకు వెళ్లారు. పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ మేదావులకు ఆయన కనిపించలేదు. 2014 తర్వాత ఏపిలో ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేశారు. పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రిగానే మళ్లీ ఏపి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి హజరు కావడం లేదు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్సీగా వున్న ప్రస్తుత మంత్రి లోకేష్‌ కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. మండలి సమావేశాలకు హజరు కాలేదు. ఆ విషయం కూడా ప్రస్తావించేందుకు ఏపి మేధావులకు నోరు రాదు. కాని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్‌ మాత్రం అసెంబ్లీకి హజరు కాకపోవడాన్ని మాత్రం తప్పు పడుతుంటారు. ఇక మరో మేధావి జయ ప్రకాశ్‌ నారాయణ్‌. ఆయన ఓ మాజీ ఐఎఎస్‌ అదికారి. కూకట్‌ పల్లి మాజీ ఎమ్మెల్యే. లోక్‌సత్తా అనే పార్టీకి అదినేత. ఆయన మేధావి తనం మరీ విచిత్రం. నీతి వంతమైన రాజకీయాల గురించి మాత్రం గొప్పలు అనేకం చెబుతాడు. కాని ఆయన లేని లోక్‌సత్తాను ఇతరుల చేతుల్లో పెట్టలేదు. ఏకంగా పార్టీనే రద్దు చేశారు. అంటే అప్పటి వరకు పార్టీకి సేవలందించి వారి రాజకీయ జీవితాలు ఆగం చేశారు. లోక్‌సత్తాకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయి? ఆ విరాళాలు ఏదైనా స్వచ్చంధ సంస్ధకు అందించారా? ఏం చేశారు? ఆ సొమ్ములన్నీ ఏమయ్యాయి? అని మాత్రం ఆయనను అడగకూడదు. దేశ ఆర్దిక పరిస్దితులు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నట్లు మాట్లాడుతుంటారు. ఏపికి మేలు చేసే వ్యాఖ్యలను చేస్తుంటారు. ఏపి మీద మమకారం. తెలంగాణ మీద పైకి కనిపించని కోపం ప్రదర్శిస్తుంటారు. ఎంతో తెలివిగా ఆయన ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఓ వైపు లోపల తెలంగాణ వ్యతిరేక రాజకీయం చేసేవారు. పైకి మాత్రం తెలంగాణ వస్తే మిన్ను విరిగి మీద పడుతుందా? అనేవారు. కలిసి వుంటేనే కలదు సుఖం అని నీతులు చెప్పేవారు. తెలంగాణ రావడం అలాంటి మేధావులకు సుతారం ఇష్టం లేని పని. అందుకే తెలంగాణ వచ్చిన పదేళ్ల కాలంలో జరిగిన ప్రగతిని చూసి ఆయన మెచ్చుకున్న దాఖలాలు తక్కువ. తెలంగాణ విషయంలో కాళేశ్వరం మాత్రం తెల్ల ఏనుగు అంటారు. లక్ష కోట్లు వృధా చేశారని అనేక సార్లు చెబతూ వచ్చారు. కాని ఇప్పుడు ఏపి బనకచర్ల ఎత్తిపోతల పథకం వల్ల ఏపికి ఆర్ధిక బారమని మాత్రం నోరు తెరవరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు. కాని పోలవరం మీద మమకారం కురిపిస్తున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. అందులో జరిగిన అవినీతిని ప్రశ్నించరు. అందరూ ఐఎఎస్‌లు కావాలనుకోవడం మూర్ఖత్వం అంటారు. ఆయన మాత్రం ఐఏఎస్‌ అయ్యారు. తెలంగాణలో వుంటారు. తెలంగాణ మీద పడి ఏడుస్తుంటారు. తెలంగాణ సమాజం మీద విషం చిమ్ముతూనే వుంటారు. తెలంగాణ తెర్లు అయితే బాగుండు అనుకుంటే అభివృద్ది చెందడాన్ని వాళ్లు జీర్ణించుకోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్దితి ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఆర్దిక సి ్దతి ఏమిటి అనేది జేపికి తెలుసు. అయినా దాని గురించి చెప్పరు. తెలంగాణ ఎలా సస్యశ్యామలమైంది? ఎందుకు అయ్యింది? ఎవరి వల్ల అయ్యింది? అందుకు కేసిఆర్‌ చేసిన కృషి గురించి చెప్పడానికి నోరు రాదు. ఎందుకంటే తెలంగాణ విఫల రాష్ట్రమౌతుందని ఆశపడ్డారు. కాని తెలంగాణ దేశంలనే శీఘ్రంగా ప్రగతి దారిలో పరుగెత్తుతోంది. కాళేశ్వరమంటే కేవలం మూడు బ్యారేజీలు మాత్రమే అనే అపోహలో వున్న కొందరు ఏపి మేధావులు తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version