వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలువనున్న సీఎం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రానున్నారు.ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ రాక ఖరారు అయ్యింది.ఐతే వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఈ నెల 4 అనారోగంతో మరణించిన విషయం తెలిసిందే.కాగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఫోన్ ద్వారా అదే రోజు పరామర్శించారు.ఈ నేపథ్యంలో 15 న కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమం హన్మకొండలో ఏర్పాటు చేయనున్నారు.ఐతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని స్వయంగా పరామర్శించేందుకు గాను ఈ నెల 15 న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికార ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉమాకాంత్ పాటిల్‌ను పరామర్శించిన వై. నరోత్తం

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కొద్దీ రోజుల క్రితం ప్రమాద వశాత్తు కాలుకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న మాజీ సీడీసీ చెర్మన్ ఉమాకాంత్ పాటిల్ ను ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం, పరామర్శించిన వారిలో యం.శ్రీనివాస్, యూ. మాణేన్న,టి.రాములు,టి.విఠల్,యం.శివన్న,యం.సంగ్రామ్,బి.అశోక్,కె.శ్రీశైలం,తదితరులు ఉన్నారు

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T133024.156.wav?_=1

 

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ కొత్తగూడ అపోలో హాస్పిటల్లో కాలు ఫ్రాక్చర్ అయి చికిత్స పొందుతున్న మాజీ సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ వారితో పాటు ఖిజార్ ఖాన్ మతిన్ అంజద్ ఫారుక్ మన్నాన్ తదితరులు ఉన్నారు,

బిజెపి నాయకుని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు…

బిజెపి నాయకుని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు

నిజాంపేట: నేటి ధాత్రి

గత 15 రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిజెపి నాయకుడు కలకుచ్చిగారి రాజీరెడ్డిని బిజెపి రాష్ట్ర నాయకులు రామచంద్రరావు పరామర్శించారు. మనోధైర్యాన్ని కలిగి ఉండాలని ఎల్లవేళలా తోడుంటానని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, మల్లికార్జున గౌడ్,, తూప్రాన్ లక్ష్మణ్, మంద విజయ, వినయ్, కరుణశ్రీ, సుజాత, అనురాధ, ఉష, గణేష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, సాయి సూర్య కాలనీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, రాజేందర్ సాయి సూర్య తదితరులు ఉన్నారు.

రామకృష్ణ గౌడ్ ను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు….

రామకృష్ణ గౌడ్ ను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం మండల అధ్యక్షులు నేరెళ్ల రామకృష్ణ దంపతులు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి కిందపడి గాయాలు కాగా వారిని ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ, సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ కన్వినర్ అరకొండ రాజయ్యలు పరామర్శించి వారికి మనోదైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబాల రమేష్, మాజీ సర్పంచ్ నేరెళ్ల చేరాలు తదితరులు పాల్గొన్నారు..

రాజ్ కుమార్ మెరుగైన వైద్యం అందించాలని టీజీఐడిసి మాజీ చైర్మన్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T132826.542.wav?_=2

 

రాజ్ కుమార్ మెరుగైన వైద్యం అందించాలని టీజీఐడిసి మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

కోహిర్ మండల్ మనియాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాజ్ కుమార్ అనారోగ్యంతో సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా ఈరోజు వారికి పరామర్శించిన మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులతో మాట్లాడి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది.

పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T151324.521.wav?_=3

పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జాహిరాబాద్ పట్టణం పస్తాపూర్ గ్రామం కొత్త గురునాథ్ రెడ్డి గారిని ఈ రోజు వారీ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం,ఈ కార్యక్రమంలో సి.యం విష్ణువర్ధన్ రెడ్డి,శికారి గోపాల్, యం.జైపాల్, తదితరులు ఉన్నారు

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వితరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T144213.303-1.wav?_=4

 

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వితరణ.

#గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఇటీవల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి సర్వర్ అనారోగ్యంతో మృతి చెందగా. మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో బుధవారం మృతిని స్వగృహానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట నాయకులు కొండి అశోక్, పరికి పవన్, మురికి రవి, భాష బోయిన సమ్మయ్య, కొత్త పెళ్లి రమణ చారి, గాజు బిక్షపతి, కనుకo సాల్మన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్షద్ పటేల్‌ను పరామర్శించిన జ్యోతి పండాల్..

ఆర్షద్ పటేల్ గారిని పరామర్శించిన బీజేపీసీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం మాడ్గ్గి గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఆర్షద్ పటేల్ కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యం తో కోలుకున్న సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్ ఈ రోజు పట్టణంలోని రాంనగర్, బృందావన్ కాలనిలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థిని తెలుసుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాయికోటి నర్సిములు ఉన్నారు.

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన..

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
ఈసందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోజుల సంఖ్యతో పాటు, ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రి లో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. జ్వరం ప్రబలిన ప్రాంతాలల్లో వైద్య క్యాంపు లు నిర్వహిస్తూ వ్యాధుల ను అరికట్టాలని తెలిపారు. ప్రబలిన వ్యాధులపై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
ముఖ్యంగా వివిధ గ్రామాలలోని పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణ మొత్తం పరిశీలించారు. పాఠశాలలో బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణలోనే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని వారు తెలుపగా వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారి కి ఫోన్ చేసి అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇల్లు ను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డా. ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎం.పి.ఓ నాగరాజు
ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు,
పంచాయతీ సెక్రెటరీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

అందోల్ లో మీనాక్షి నటరాజన్ పర్యటన…

అందోల్ లో మీనాక్షి నటరాజన్ పర్యటన ను విజయవంతం చేయాలి

◆:- ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి . సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.

◆:- మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర లో స్వచ్ఛందంగా కార్యకర్తలు వేలాది గా పాల్గొనాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T115254.204.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి వెల్లడించారు . ఎ ఐ సి సి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆగస్టు 1 న సాయంత్రం 5 గంటలకు అందోల్ నియోజక వర్గంలో చేపట్టిన పాదయాత్ర తో పాటు ఆగష్టు 2న జరిగే శ్రమదానం , పార్టీ కార్యకర్తల తో సమావేశం ను విజయవంతం చేయటానికి జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అన్ని విభాగాల శ్రేణులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి.పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డి. మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉజ్వల్ రెడ్డి కోరారు.

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన…

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే

మొగులపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో :27/07/2025 న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా మొగుళ్ళపల్లి మండలం, ఇస్సిపేట గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్ కీ.శే కొడారి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం మొగుళ్ళపల్లి లక్ష్మి సాయి గార్డెన్స్ నందు మండల ముఖ్య నాయకులతో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు మరియు కార్యకర్తల సమీకరణ పై సమీక్షా నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన..

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

మాజీ మంత్రిని పరామర్శించిన మరిపెడ విలేకరులు.

మాజీ మంత్రిని పరామర్శించిన మరిపెడ విలేకరులు

మరిపెడ నేటిధాత్రి:

మోకాలి నొప్పితో కొద్ది రోజులుగా బాధపడుతు ఆపరేషన్ చేపించుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను హైదరాబాద్ సోమాజిగూడలో వారి స్వగృహంలో డోర్నకల్ నియోజకవర్గ,మరిపెడ మండల విలేకరులు కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టాలని కోరారు.ఈ పరామర్శ కార్యక్రమంలో విలేకరులు గండి విష్ణు, అనంత రాములు,మూడవత్ రవి, కారంపూరి వెంకటేశ్వర్లు,సతీష్, కపిల్ గౌడ్ ,శ్రీశైలం,ఉప్పలయ,రవి నాయక్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి జహీరాబాద్ వస్తుంటే నీమ్ఙ్ రైతులను.

ముఖ్యమంత్రి జహీరాబాద్ వస్తుంటే నీమ్ఙ్ రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమిటి..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జహీరాబాద్ కు రావడం మంచిదే కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన పేరుతో రైతులను వారి గ్రామాలకు వెళ్లి రాత్రి వేళలో వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం,మాజీ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి చేసింది చెప్పాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం కాదు ప్లై ఓవర్ బ్రిడ్జ్,బసవేశ్వర విగ్రహం,నీమ్జ్ రోడ్డు ఇవన్నీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమి చేశారో చెప్పాలని నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పకుండా తిరిగి ప్రతి విమర్శలు చేయడం సిగ్గు చేటు,గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేసిన నిధులను రద్దు చేయడం జహీరాబాద్ అభివృద్ధికి నిరోధం కాదా? రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి..

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఈ నెల 23న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేశ్కుమార్ షెట్కార్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డితో కలిసి మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, నిమ్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయ భవనం, సభా స్థలం తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ, వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, టాయిలెట్స్ వంటి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు.

ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు

◆ ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు ఇలా ఉంది:-

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఉదయం 11:00 నుండి 11:05 గంటల వరకు: హెలిప్యాడ్‌ ద్వారా జహీరాబాద్ లోని పస్తాపుర్ కి చేరుకుంటారు.
ఉదయం 11:15 నుండి 11:30 గంటల వరకు: హుగ్గెల్లిలో విశ్వగురు బసవేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
ఉదయం 11:40 నుండి 11:50 గంటల వరకు:మాచ్నూర్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయ ఆవిష్కరణ.
ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు: జహీరాబాద్‌లోని పాస్తాపూర్‌లో ప్రజా సభా స్థలానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 12:05 నుండి 12:20 గంటల వరకు: వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాల ఆవిష్కరణ.
మధ్యాహ్నం 01:35 నుండి 01:40 గంటల వరకు: ప్రజా సభా స్థలం నుండి హెలిప్యాడ్‌కు స్థలానికి చెరుకుంటారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, మరియు స్వచ్ఛంద సేవకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికి, ఈ సందర్శనను జహీరాబాద్‌కు ఒక చిరస్థాయిగా నిలిచే సందర్భంగా మార్చడానికి మనమంతా కలిసి కృషి చేద్దాం!

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఎస్పీ పరతోష్ పంకజ్ మంగళవారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటనకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు.

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు.

◆ ఈ నెల 23న జహీరాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిమ్స్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం ప్రారంభం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లో ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పట్టణంలోని అలోల్ పాస్ చౌరస్తా వద్ద హెలిప్మాద్, బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లు పనులు చకచకా కొనసాగుతున్నాయి.

సీఎం ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, ఝరాసంగం మండలంలోని కేంద్రీయ విద్యా లయం వద్ద ఏర్పాట్లను సంగారెడ్డి ఎస్సీ పరితోష్పంకజ్ పరిశీలించి పలు సూచనలు. చేశారు. 05వ జాతీయ రహదారి నుంచి బరీ పూర్ వరకు 5లోమీటర్ల మేర నిర్మించిన నిమ్స్ రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. జహీరాబాద్ నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు రోడ్లకు మరమ్మతులు చేసి వంతెనలకు రంగులు వేశారు.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలో 23 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సీఎం పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలన్నారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ, బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, హెలిప్యాడ్, హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version