ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(DM&HO) డాక్టర్ మధుసూదన్ గారు ఆకస్మిక తనిఖీ చేసినారు. ఆస్పత్రి హాజరు పట్టికను పరిశీలించినారు. ఆసుపత్రి ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలియజేసినారు. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకోబడును అని తెలియజేసినారు. అదేవిధంగా ఆస్పత్రిలో లేబర్ రూమ్ ,ఆయుష్ రూమ్, యోగ రూమ్ ములను పరిశీలించినారు .
తర్వాత మొగుళ్లపల్లి ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ పరిశీలించినారు. వాక్సినేషన్ టిబి నోటిఫికేషన్ , సీజన్ వ్యాధుల గూర్చి మరియు ఎన్ సి డి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాణి గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
