ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష..

ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష

జైపూర్,నేటి ధాత్రి:

 

ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో మండల అధికారులు సమన్వయ సమీక్ష నిర్వహించారు.శనివారం నిర్వహించిన ఈ సమీక్షలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.రెండవ సాధారణ ఎన్నికలు 2025 సంవత్సరానికి గాను సర్పంచ్ వార్డు సభ్యుల పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా పంచాయతీ కార్యదర్శులను,జిపిఓ సిబ్బందిని ముందస్తు ప్రణాళిక ప్రకారం సిద్ధం చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గుర్రం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. పల్లెల్లో స్థానిక ఎన్నికల పోరంటే ఆశామాషిగా ఉండదని అధికారులకు సూచించారు.ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా విధులు నిర్వహించాలన్నారు.నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,ప్రజలకు నామినేషన్ కేంద్రాల గురించి విస్తృత ప్రచారం చేయించాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు ఉండేటట్లు చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజ రెడ్డి,సీఐ నవీన్ కుమార్, ఎస్సై శ్రీధర్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,డిప్యూటీ తహసిల్దార్ సంతోష్,వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై…

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం నిర్వహించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహ్మత్ నగర్ డివిజన్ లోని వివిధ బూత్ లలో ప్రచారం నిర్వహించారు.ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, *కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని,తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే కెసిఆర్ పాలన రావాలని అందుకు ఈ ఎన్నిక గెలుపుతో ఆరంభం కావాలని ఈ గెలుపుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బూత్ ఇంచార్జులు ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు…

ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం

గ్రామాల అభివృద్ధి గాలికి ఒదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా ఎన్నికల డ్రామా నిర్వహించిందని, వారిది బీసీలపై కపట ప్రేమ నటిస్తుందని వారు అన్నారు. కేవల రాజకీయ లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా నటించి తిరిగి వారి నాయకులతోనే హై కోర్ట్ లో కేసులు వేపియ్యడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ కి అన్ని పార్టీలు సహకరించాయని ఆనాడు తెలిపి, ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఒంటరి పోరాటం చేస్తుందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకంచలేదని, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని వారు తెలిపారు. కేవలం వారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందొ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న ట్రయల్ వేసినట్టు ఉందని, వారి ప్రభుత్వం మీద,వారి అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకొని ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం అని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్,జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, సూదగోని మహేష్ గౌడ్, కలిగేటి ఎల్లయ్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బూత్ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగి లచయ్య, మాడిశెట్టి శ్రీసాయి, కోడూరి ప్రణయ్,కట్ట అనీల్ కుమార్, కొలిపాక రాజేష్, పురేళ్ల సన్నీ, కొలిపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి

కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి

మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు.
మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు.
బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి.
రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం.
పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు.
భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది.
మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి.
కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని.
కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు.
ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్…

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయనున్నట్లు దాసరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ కు మండల సమస్యలపై మంచి పట్టు ఉండటం వలన మౌలిక సదుపాయాల అభివృద్ధి కై కృషి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ సీట్ కోసం రసవత్తరంగా పోటీ ఉండనున్నట్లు తెలిపారు.రాజకీయాల్లోకి చదువు కున్న యువతి, యువకులు రావాలని, అప్పుడే అన్ని గ్రామాలలో అభివృద్ధి మెరుగవుతుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.

“ప్రజలకు హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌పై బీజేపీ నేత విమర్శ”…

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ప్రధానమంత్రి మోడీ గారిని మరియు భారతీయ జనతా పార్టీ నీ విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట( నేటిధాత్రి):

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి పేద ప్రజల అభివృద్ధి తోనే సాధ్యమవుతుందని ఆలోచించి ప్రజలకు భారమైన జీఎస్టీ పన్నును నాలుగు స్లాబులుగా ఉన్నదాన్ని తగ్గి రెండు స్లాబుల కిందికి తీసుకువచ్చి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టే విధంగా ఆటోమొబైల్ పరిశ్రమలు ఫార్మా కంపెనీల లాభాలను తగ్గించి జిఎస్టిని తగ్గించడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి జిఎస్టి తగ్గిస్తే దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం చాలా హాస్యస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. లేనిపోని మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక జనాల్లోకి పోయే ముఖం లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారిని విమర్శించడం తగదని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామన్న హామీ ఇప్పటివరకు దరిదాపుల్లో కనపడడం లేదని గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు హామీని నెరవేర్చిన దిశగా వెళ్లలేదని ఆసరా పింఛన్లు డబల్ చేసి ఇస్తామని మోసం చేసి ఓట్లు ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అప్పుడు వాళ్ళ పార్టీకి మరియు నాయకులకు కళ్ళు తెరుచుకుంటాయని అప్పటివరకు భ్రమలో కొనసాగాలని మహేందర్ రెడ్డి అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి…

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

వీణవంక,(కరీంనగర్ జిల్లా ):

నేటి ధాత్రి:

 

 

వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం మహాధర్నా కార్యక్రమం చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి బీడీ, చేనేత, గీత కార్మికులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పెన్షన్లు పెంచుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి 22 నెలలు గడుస్తున్న వృద్ధులు వితంతుల వికలాంగుల గీతా చేనేత బీడీ కార్మికుల డయాలసిస్ క్యాన్సర్ హెచ్ఐవి పేషెంట్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా దాటవేయడం సబాబు కాదని వారు ఇచ్చిన మాటను తక్షణమే నిలబెట్టుకోవాలని లేనియెడల రాబోయే పంచాయతీ ఎంపిటిసి ,జెడ్పిటిసి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని పంచాయతీ సెక్రటరీ రామగిరి హరీష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో
శ్రీ సాయి వికలాంగుల సేవా కేంద్రం అధ్యక్షులు పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్
వడ్డేపల్లి రమేష్,
అంబాల మధున్నయ్య , గట్టు సాయి తేజ ,ఎండి షాహిద్ గుంట్టి శంకరయ్య, కాంతాళ రాజిరెడ్డి ,మాడ సుధాకర్ రెడ్డి ,కట్ట సదానందం, గాండ్ల శేఖర్ అయ్యా గట్టు సమ్మయ్య, ఏలువాక దశరథం, అంబాల నాగయ్య అంబాల సదయ్య, వడ్డేపల్లి తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి భవన్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్నిక…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T140233.017.wav?_=1

 

పద్మశాలి భవన్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్నిక,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

విశ్రాంతి ఉద్యోగుల సంగం సమావేశం పద్మశాలి భవన్ నందు తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉధ్యోగుల సంఘం జహీరాబాద్ మండల శాఖ ఎన్నికలు ఎకగ్రీవంగా జరిగినవి.అధ్యక్షులుగడ్డం జనార్దన్, ప్రధాన కార్యదర్శి పటేల్ రాజేందర్ రావు, కోశాధికారి శ్రీ బెండి చంద్రశేఖర్, అసోసియేట్ ప్రసిడెంట్ శ్రీ కౌలస్ ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎం. డి. ఆజీం, విజయ లక్ష్మీ, జాయింట్ సేక్రటరి నర్సిములు, అర్గనైజింగ్ సేక్రటరి కౌలస్ రాజేశేఖర్, పబ్లిసిటీ సేక్రటరి మహబూబ్ గౌరి, కార్య వర్గ సభ్యులుగా జి. చంద్రశేఖర్, యాకుబ్ అలి, సైఫోద్దిన్ గౌరీ, ఎ. బాగారెడ్డి, జి. రాందాస్, వి. నర్సిములు జిల్లా కౌన్సిల్ రమేష్ బాబు, పి. దుర్గయ్య, మల్లేష్ం ఎంపిక కాబడినారు. ఎన్నికల అధికారిగా విజయ రావు అబ్జర్వర్ జగదీశ్వర్ రావడం జరిగింది.

 

 

ముఖ్య అతిధిగా రాష్ట్ర జనరల్ సేక్రటరి సి. చంద్రశేఖర్ మాట్లాడుతు త్వరలో మనకు రావల్సిన డి. ఎ, పిఅర్సి, హేల్త్ కార్దులు ఇప్పించడానికి ప్రభుత్వానికి ప్రాతి నిధ్యం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమలో విశ్రాంత ఉధ్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి..

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-08T131535.150.wav?_=2

 

సింగరేణి కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి..

సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో 35% వాటాను వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి డిమాండ్ చేశారు. పట్టణం లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు పూర్తయినప్పటికీ లాభాల వాటా ప్రకటించక పోవడం దుర్మార్గం అన్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎన్నికల కోడ్ అమలు అయితే కార్మికుల లాభాల వాటా చెల్లించడం మరింత ఆలస్యం అవుతుందని వెంటనే గుర్తింపు సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 35% వాటా చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల సాధన కోసం ఈనెల 11,12 తేదిలలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంటు లలో వినూత్న రీతిలో కార్మికు ల అభిప్రాయాల సేకరణ కోసం ఓటింగ్ నిర్వహించడం జరుగు తుందని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటింగ్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కమిటీ నాయకులు రామగిరి రామస్వామి, వైస్ ప్రెసిడెంట్ రమేష్, సంజీవ్, సురేష్, మల్లేష్, తాజుద్దీన్, శ్రీధర్, కుమారస్వామి, ఆదర్శ్ లు పాల్గొన్నారు.

 రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

 రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

ఎల్‌డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా ఇషిబా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి.

టోక్యో: జపాన్ ప్రధానమంత్రి పదవికి షిగేరు ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేయనున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో చీలకను నిరోధించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఇషిబా ధ్రువీకరించినట్టు జపాన్ ప్రభుత్వరంగ టీవీ ఎన్‌హెచ్‌కే తెలిపింది.

జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఇషిబా సారథ్యంలోని ఎల్‌డీపీ ఎగువ సభ, దిగువ సభ రెండింటిలోనూ మెజారిటీని కోల్పోయిన క్రమంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఎగువ సభలో 248 సీట్ల మెజారిటీని సాధించడంలో ఎన్‌డీపీ విఫలమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో ఓటమికి బాధ్యత వహించాలంటూ పార్టీలోనే అసంతృప్తులు పెరిగాయి. ఎల్‌డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన రాజీనామా నిర్ణయానికి వచ్చారు.

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక…

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజున సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడుగా రాయిల్ల జనార్థన్,ముఖ్య సలహాదారుడుగా గంగాధరి సురేష్, నూతన అధ్యక్షుడుగా శ్రీగద్దె సుమన్ ,ఉపాధ్యక్షులుగా కొయల్ కర్ వినోద్,తొగిటి రవితేజ, ప్రధాన కార్యదర్శి మోర శశికాంత్,కోశాధికారిగా గట్టు నవీన్ కుమార్ , సంయుక్త కార్యదర్శిలుగా దువ్వాక కృష్ణ చైతన్య,శ్రీ గద్దె శ్రావణ్ కుమార్,కార్యవర్గ సభ్యులు పారిపెల్లి శివ ప్రసాద్,కటుకం శివ కుమార్,గట్ల తరుణ్,కొరల్ కర్ ప్రవన్,కుంబలకర్ వెంకటేష్,కట్టెకొల అకిలేష్ లను ఏకగ్రీవంగా శ్రీ భవానీ సేవా సమితి సభ్యులు అందరు ఎన్నుకున్నారు.

వికలాంగుల పింఛన్ల కొరత, తక్షణమే పరిష్కారం కావాలి.

వికలాంగుల పింఛన్ల మాటమర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున వికలాంగుల నాయకుడు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ… గత నాలుగు సంవత్సరాలుగా వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా సైట్ బంద్ చేసి వారి జీవితాలతో చెరగట మాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తాగిన.బుద్ధి చెప్పాలన్నారు. కొత్త పింఛన్లు రాక వికలాంగులకు సరియైన తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన జిల్లా అధికారులు తక్షణమే వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు కొత్త పిక్చర్లు ఇవ్వడానికి సైట్ ఓపెన్ చేసి పింఛన్లు మంజూరు చేసివారిని ఆదుకోవాలని కోరారు.

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు..

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు

రైతు శ్రేయస్సును మరిచిన.. కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్.

బాలానగర్ /నేటి ధాత్రి

బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T125458.443.wav?_=3

 

వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణ బిజోన్ వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని శ్రీలక్ష్మి గణేష్ మండపం వద్ద వర్తక సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి కొండ కుమార్, కోశాధికారి ఏముల దేవేందర్ రెడ్డి,
సహాయ కార్యదర్శి గోక శ్రీనివాస్, ప్రచార ప్రతినిధి పరికిపండ్ల రాజు, గౌరవ అధ్యక్షులు పాలకుర్తి గంగాజలం,గౌరవ సలహాదారులు ఆడెపు లక్ష్మణ్, వెంగళదాసు సత్యనారాయణ, బత్తుల శ్రీనివాస్,ఆడెపు తిరుపతి, ఉపాధ్యక్షులు గుండా రమేష్ కేతుపల్లి నారాయణరెడ్డి కొక్కుల సతీష్ గడ్డం శ్రీనివాస్, బండి మల్లేష్ లను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆడెపు కృష్ణ మాట్లాడారు. బి జోన్ వర్తక సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని,వర్తక సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-4.wav?_=4

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిదాత్రి;

ఓదెల మండలం లోని మడక గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా రంగు కుమారస్వామి గౌడ్, ఉపాధ్యక్షులుగా గట్టు మహేష్ గౌడ్, సభ్యులు నల్లగోని నరేందర్ గట్టు వీరస్వామి సిరిసేటి కిరణ్ దేశిని రమేష్ మేడగొని చిరంజీవి మొగిలి గాజర్ల శ్రీనివాస్ గట్టు సురేష్ లను గౌడ కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ మజీద్ కమిటీ పై కలెక్టర్ కు పిర్యాదు..

అక్రమ మజీద్ కమిటీ పై కలెక్టర్ కు పిర్యాదు

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరులో ఇటీవల ఎన్నుకున్న జామా మజీద్ కమిటీపై సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ముస్లిం నాయకులు తెలిపారు. పట్టణ కేంద్రంలో వారు మాట్లాడుతూ
గత 40 ఏళ్లుగా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయని,ఆ ప్రకారం 2020లో ఎన్నికలు జరిగి ముహమ్మద్ అబ్దుల్ అలీమ్ అధ్యక్షునిగా ఎన్నికై కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ కాలపరిమితి 2022లో ముగిసిందని. సాంప్రదాయ ప్రకారం 2022లోనే కొత్త ఎన్నికలు జరిగేదని, అధ్యక్షుడు ఎన్నికలు వాయిదా వేస్తూ గత 3 సంవత్సరాలుగా పదవిలో కొనసాగుతున్నారని అన్నారు. ఎన్నికలు జరపమని ప్రశ్నించగా జిల్లా వక్ఫ్ బోర్డు అధికారి ద్వారా నోటీసులు పంపించి బెదిరింపులకు గురిచేస్తున్నారని, దీంతో ఎన్నో శారీరక మానసిక ఇబ్బందులు పడ్డామన్నారు.ఈనెల 11న మాజీ అధ్యక్షుడు అబ్దుల్ అలీమ్ స్థానిక ముస్లింలకు తెలియకుండా, ముగ్గురు వ్యక్తుల సమక్షంలో ఏకగ్రీవ ఎన్నికల పేరుతో కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని శుక్రవారం మసీదులో ప్రశ్నించగా దిక్కున చోట చెప్పుకోమని భయబ్రాంతులకు గురిచేశారని వాపోయారు.మాకు నోటీసుల ద్వారా, మస్జిద్ లో గొడవలు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని
దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో సానుకూలంగా స్పందించి వచ్చే శుక్రవారం మస్జిద్ కి అధికారులను పంపించి ముస్లింల అభిప్రాయం మేరకు ఎన్నికల నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ అంజూమ్, అబ్దుల్ రెహమాన్, ముహమ్మద్ సాబేర్, యాకుబ్ పాషా, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T175746.314.wav?_=5

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి.

తీన్మార్ మల్లన్న బిసి జేఏసీ రవి పటేల్.

చిట్యాల, నేటిధాత్రి :

 


 

 

సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో
తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ రవి పటేల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూచిట్యాల మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన పంచిని మహేష్ యాదవ్ పైన ఆగస్టు 15 రోజున అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్ భార్య పిల్లలు వారి మామ ఇతరులపై దాడి చేశారని బిసి పొలిటికల్ జేఏసీ నీ కలవడం జరిగింది, మహేష్ పై భౌతిక దాడులు సమంజసం కాదని ఒక బీసీ యాదవ బిడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కొట్టడం బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం
గుడికి సంబంధించింది గానీ ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలి గాని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు
మహేష్ యాదవ్ కాల్వపల్లి గ్రామానికి సర్పంచిగా పోటీ చేస్తాడని అక్కస్సుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అగ్రవర్ణాలు అని మా దృష్టికి రావడంతో మహేష్ ను తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ నుండి సర్పంచి అభ్యర్థిగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబెట్టడానికి మేము కార్యచరణ తీసుకొని కాల్వపల్లి లో మహేష్ యాదవ్ ను గెలిపించుకుంటామని
రవి పటేల్ అన్నారు ఈ కార్యక్రమంలో
రోడ్డ శ్రీను ప్రణీత్ వెంకటేష్ అఖిల్ సమిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-5.wav?_=6

ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్

ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం కొర్రీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

చిన్న పంచాయతీల పరిస్థితి దారుణం..

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇటు కేంద్రం, అటు ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు ఆగిపోయాయి. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు, డ్రైనేజీల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు వంటి వాటి కోసం ఇబ్బందిగా మారింది. వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు, తాగునీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని సెక్రటరీలు వాపోతున్నారు. ఆదాయ వనరులు లేని చిన్న పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. అసలే వర్షా కాలం.. గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతాయని, పారిశుధ్య చర్యలు ఎలా చేపట్టాలో తెలియడం లేదని సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీలు నిధుల లేమితో సతమతమ వుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో పల్లెల్లో అభివద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు రావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులుని లిచిపోయాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసినా… రూల్స్ ఒప్పుకోవని చెప్పిన్న ట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశం కారణంగా

◆:- మంత్రి సీతక్క విన్నవించినా ససేమిరా

◆:- కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.3,600 కోట్లు

◆:- ఎస్ఎఫ్సీ నుంచి మరో రూ.1,500 కోట్లు

◆:- రూ.70 కోట్లకుపైగా స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీల సొంత నిధులతో గ్రామాల్లో పనులు

◆:- బీసీ రిజర్వేషన్ల ఆలస్యంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం

స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో నిధులివ్వాలని మంత్రి అడగగా, నిబంధనల ప్రకారం గ్రామాల్లో పాలక వర్గాలు కొలువుతీరితేనే నిధులు చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 15 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ ఫండ్ (ఎస్ఎఫ్సీ) రూ.1,500 కోట్లపైనే రావాల్సి ఉండగా.. ఆ నిధులు కూడా పల్లెలకు అందలేదు. దీంతో పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు తమ సొంత నిధులతో పల్లెల్లో అభివద్ధి పనులు చేప డుతున్నారు.

రూ. 3,600 .. కోట్లు పెండింగ్

రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి 18 నెలలు దాటింది. 2024 ఫిబ్రవరిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. అప్పటి నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180 కోట్లు రావాల్సి ఉండగా.. 18 నెలలకు మొత్తం రూ.3,600కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయి పాలక వర్గాలు ఏర్పాటు చేస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఢిల్లీ వెళ్లి నిధులు విడుదల చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పం చాయతీల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నాహాలు చేస్తోందని, 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం కసర త్తు చేస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని కోరినా.. కేంద్రం నిరాకరించింది.

రూ. 70 కోట్లకు పైగా సొంత నిధులు..

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సీ నిధులు సైతం 18 నెలలుగా విడుదల కావడం లేదు. మొత్తం రూ.1,560 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. నిధులు రాకపోవడంతో పల్లెల్లో వివిధ పనులకు
తామే సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత నిధులు రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని వాపోయారు. కొన్ని నిధులు స్థానిక రాబడి (పన్నులు, ఫీజులు) నుంచి సమకూరుతున్నా.. అభివృద్ధి పనులకు సరి పోవడం లేదని పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేని పరి స్థితి నెలకొందని చెప్పారు. పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర నిధులు కీలక మని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను గ్రామాల్లో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు. ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. నిధులు ఆగిపోవడంతో ఈ చె లింపులు నిలిచిపోయాయి. తాము సొంతంగా ఖర్చు చేసిన వాటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version