కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన.

కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన టి యు డబ్ల్యూ జే (ఐజేయు ) జర్నలిస్ట్ యూనియన్ .

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి తీరని లోటని భూపాలపల్లి ఐజేయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు క్యాతం సతీష్ , సామంతుల శ్యామ్ లు అన్నారు.

వెలిశాల గ్రామంలో శుక్రవారం గాజర్ల రవి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే.

 

కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..

పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని అన్నారు.

కార్యక్రమంలో చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య జర్నలిస్టులు పుల్ల రవితేజ కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు నివాళులు అర్పించిన గణేష్ వాకింగ్ టీమ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానము ప్రమాదంలో మృతి చెందిన ప్రజలు గుజరాత్ మాజీ సీఎం మృతి చెందిడము పట్ల వనపర్తి గణేష్ వాకింగ్ గ్రూప్ సబ్యుల అధ్యర్య ములో రాజవారి బంగ్లాలో నివాళులర్పించామని అధ్యక్షులు గోనూర్ వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు రాజాపేట సుదర్శన్ రెడ్డి దొంత అశోక్ వాకింగ్ టీము సబ్యులు నివాళులర్పించారు

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మొహమ్మద్ ముల్తాని
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌ పై జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మాచునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సంఘటన అత్యంత బాధాకరం,సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిన ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే కుప్ప‌కూలిపోవ‌డం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని,ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ
వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డ వారు ఆ భ‌గ‌వంతుడిని దయతో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మనసారా కోరుకుంటున్నానని మరియు చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

మృతుల కుటుంబాలకు ఘన నివాళులు..

మృతుల కుటుంబాలకు ఘన నివాళులు
మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటిదాత్ర

 

 

 

 

శనివారం పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసములో కాశ్మీర్ పహల్ గావ్ లో భారతీయ పౌరులపై ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మతోన్మాదులు పర్యాటకులను కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశంపై సంఘీభావం ప్రకటించడం పట్ల భారతదేశం శాంతి యుత వాతావరణంలో ప్రజలను. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించి మరొక సారి ఇలాంటి దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ పార్టీ ఫిషర్మేర్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రుత్త నారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ అందె మారుతి బాపూజీ,ఇబ్రహీపట్నం యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నల్లూరి సాగర్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జాఫర్, బైండ్ల శ్రీకాంత్, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఇప్పపల్లి గణేష్ గౌడ్,తోగిటి నాగరాజ్, మొగలి రాజేందర్,కోరే రాజ్ కుమార్, చౌదరి తదిరితలు పాల్గొన్నారు.

మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.

మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

వీణవంక, ( కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి :

 

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ మరుమళ్ళ కొమురయ్య గారి తల్లి స్వర్గస్తులైన సమాచారం తెలిసిన వెంటనే వచ్చి భౌతికాయానికి పువ్వుల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి మనోధైర్యం కల్పించి వారికి అండగా ఉంటామని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు లక్ష్మక్క పల్లి మాజీ ఉపసర్పంచ్ మేకల సమ్మి రెడ్డి గారి తండ్రి స్వర్గస్తులైన తెలుసుకున్న వెంటనే వారి కుటుంబాన్ని ఓదార్చారు ఈ కార్యక్రమంలో వారి వెంట బిజెపి నాయకులు మాజీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి,మల్లారెడ్డి ,శ్రీనివాస్ యాదవ్, ఉడుత కుమార్,కొండల్ రెడ్డి, అప్పన కొమురయ్య, ఈదునూర్ కుమార్ ,సమ్మిరెడ్డి,శంకర్, మోటం శ్రీనివాస్, పల్లె రాయమల్లు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం.

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఏ.పి రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణం తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు తీరని లోటు అని బిషప్ ఎం.ఆదామ్ బెన్ని అన్నారు.పాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల నర్సంపేట డివిజన్ పాస్టర్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు పాస్టర్ లాజరు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ మరణంపై యావత్తు క్రైస్తవలోకానికి అనేక అనుమానాలు ఉన్నాయని మరణంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో పాస్టర్స్ రేజి జార్జి,మత్తయి,
బోడ రవికుమార్, చిన్నపెల్లి శ్రీధర్, పాల్,క్రాంతి పాల్, పాల్,శ్రీనివాస్, కుమార్ పాల్,అబ్రాహం,సీమోన్, వెంకన్న,విలియం కేరీ, కొమ్మాలు,రూబెన్,సొలొమోను,
యాదగిరి,ఎఫప్రా,సురేష్,పీటర్,రమేష్ కేరీ,క్రైస్తవ నాయకులు
మంద ప్రకాష్,మారేపల్లి అశోక్,ప్రభాకర్,కొమ్ముల నవీన్,రవి
మాదాసి నవీన్,ఈసాక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version