కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ
ఒక్కొక్క దరఖాస్తుకు 3 లక్షల రూపాయలు
శాయంపేట నేటిధాత్రి:
2025- 27 లైసెన్స్ కాలానికి మద్యం దుకాణాల నిర్వహ ణకు నోటిఫికేషన్ జారీ చేసింది గతంలో మాదిరిగా 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫి కేషన్ వెల్లడించారు రెండు సంవత్సరాల కాలపరిమితికి లాటరీ ద్వారా మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానించడం జరుగుతుంది ఈ ఏడాది 1 డిసెంబర్ 2025 నుండి 30 నవంబర్2027 రెండేళ్ల వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. జతపరచవలసిన పత్రాలు దరఖాస్తు ఫారం, మూడు లక్షల రూపాయల డీడీ లేదా చాలాన్, మూడు కలర్ పాస్ ఫోటో సైజు, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ( గౌడ్, ఎస్ టి, ఎస్ సి) దరఖాస్తుల సమ ర్పణ జిల్లా ఎక్సైజ్ అధికారి కార్యాలయం తారా గార్డెన్ దగ్గర సుబేదారి హనుమకొండ. చివరి తేదీ 18 అక్టోబర్ 2025 సాయంత్రం ఐదుగంటల లోపు సమర్పించవలెను.