సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి
మందమర్రి నేటి ధాత్రి
భారత అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్… జస్టిస్ గవాయి పై జరిగిన దాడి.. యావత్ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లు అని సామాజిక ఉద్యమ నాయకుడు గుడికందుల రమేశ్ అన్నారు. బుధవారం మందమర్రిలో మాట్లాడుతూ…..సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దాడికి యత్నించిన వ్యక్తి వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ రాకేష్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై తనను అడ్డుకున్నారు.భారత దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఘటనను పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఖండించాలని కోరుతూ, మన దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ
నీచమైన ఘటనను ఖండించడానికి మాటలు సరి పోవని అన్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజని ఇలాంటి పిరికిపంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైన భారత ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్ కు ప్రజాస్వామ్యవాదుల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.