సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయినీయులు,రంగవల్లులు వేసి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను చాటిచెప్పారు.
విద్యార్థులు సంప్రదాయ పండుగ వాతావరణాన్ని సృష్టించగా, పాఠశాల యాజమాన్యం సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందుతుందని విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలిపారు.
