అంతిమయాత్రలో పాల్గొన్న బానోతు సారంగపాణి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T155215.082.wav?_=1

 

అంతిమయాత్రలో పాల్గొన్న బానోతు సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలోని రుద్రగూడెం గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు నాన బోయిన బిక్షపతి సోదరుడు రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్దివ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట ఫ్యాక్స్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్, నాయకులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, మురాల ప్రతాపరెడ్డి, నూటెంకి సారయ్య, నానబోయిన రాజారాం, మంద రాజిరెడ్డి, నునావత్ మంగ్య, కన్నెబోయిన దిలీప్, అనిశెట్టి వినోద్, తోట మొగిలి, రఘు సాల లింగయ్య, తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ప్రజలకు సేవ చేసే నాయకుడు గండ్ర హరీష్ రెడ్డి..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T105709.290.wav?_=2

 

ప్రజలకు సేవ చేసే నాయకుడు గండ్ర హరీష్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేసిన గొప్ప నాయకుడు గండ్ర హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులలో మరిన్ని ఉన్నంతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు…

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పట్టణంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి గారి కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం.

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన ఆముదాల భాగ్యలక్ష్మి – లక్ష్మీనారాయణ దంపతుల కూతురు ప్రహర్ష కు ఎంబిబిఎస్ సీటు వచ్చినందున గాను బిఆర్ఎస్ గ్రామపార్టీ అధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్షింగం మాట్లాడుతూ మంచిగా చదివి గొప్ప డాక్టర్ అయి పేదలకు వైద్య సేవలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గడ్డం కొమురయ్య,బండారి శ్రీలత – రమేష్,న్యాయవాది,పార్టి క్లస్టర్ ఇన్చార్జి మోటురీ రవి,రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్,మాజీ వార్డు సభ్యులు కొక్కు రాంరాజు,మాజీ ఎస్ఎంసి ఛైర్మన్ కొమ్మ రవి,మాజీ గ్రామ పార్టి అధ్యక్షుడు దుడేల ప్రకాశ్,మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మాటురీ రవీంద్రచారి,యూత్ మండల సహయ కార్యదర్శి బుస శ్రీశైలం,సీనియర్ నాయకులు పర్స కోటిలింగం,మర్ద నవీన్,సామల సతీష్,యశోద నరసింగం,బండారి మధుకర్,కునమల్ల కిరణ్ తదితులున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!

◆:- మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపిద్దాం!

◆:- రహ్మత్ నగర్ డివిజన్ శ్రీ రామ్ నాగర్ లో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ 190,191 బూత్ లలో గడప గడప తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ నాయకులు ముర్తుజా చంద్రన పటేల్ బాబర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి

కటకం జనార్ధన్ పట్టణ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ హాస్పిటల్ సూపరిటెండెంట్ ని సమస్యలను పరిష్కరించాలని వారు సూపర్డెంట్ ను కోరారు కానీ వారం రోజులు గడుస్తున్నా హాస్పిటల్ యొక్క సమస్యలు పెరుగుతున్నాయి తప్ప వాటి పరిష్కారం కావడం లేదు కావున జిల్లా కలెకర్ట్ సమక్షంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్రాసిన వినతిపత్రం ను భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కి అందించడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు..

కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు
ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ గూటికి సీనియర్ నాయకులు
స్థానిక ఎన్నికల వేళ అయినవోలులో కాంగ్రెస్ పార్టీకి షాక్

నేటి ధాత్రి అయినవోలు:-

 

స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అయినవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శుక్రవారం ఐనవోలు గ్రామం నుంచి కాంగ్రెస్ నుండి భారీగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సీనియర్ నాయకులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో చింత అశోక్ (మాజీ వార్డు మెంబెర్ ఎం. ఆర్.పి.ఎస్ మాజీ మండల అధ్యక్షులు)మోలుగురి బాబు (మాజీ సొసైటీ డైరెక్టర్)
బరిగల ఈసాక్ (మాజీ వార్డు మెంబెర్)కొత్తూరి జాన్సన్ (మాజీ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి)
చింత రఘు (మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు)సీనియర్ నాయకులు కొత్తూరి కర్రె కొమురయ్య, మోలుగురి లచ్చయ్య,చింత రాములు మంద రాజు మొదలగు వారు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అయినవోలు మండలంలో ఉన్న కీలక నేతకు అనుచర వర్గాలుగా ఉన్నవారే ఎక్కువగా ఉండడం విశేషం..
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తంపుల మోహన్ మండల ఇంచార్జ్ పోలేపల్లి రాంమూర్తి
మాజీ సర్పంచులు ఉస్మాన్ ఆలీ, పల్లకొండ సురేష్ సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్
గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుప్పెలి రాజు తదితరులు పాల్గొన్నారు

పంచమ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన బిఆర్ఎస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T125655.471.wav?_=3

 

పంచమ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మ్యాథరి ఆనంద్ తల్లి మ్యాథరి మానెమ్మ గారు ఇటీవలే మరణించడం జరిగింది.. శుక్రవారం రాజనెల్లి గ్రామంలో జరిగిన వారి పంచమ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన నామ రవి కిరణ్ నివాళులర్పించాను..ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నాను…. “

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రేగా కాంతారావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-23T141620.131.wav?_=4

 

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రేగా కాంతారావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలెబోయిన జయబాబు సతీమణి స్వప్న (ఎఫ్ బి ఓ) అనారోగ్యంతో మరణించారు.విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్ళి,స్వప్న పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం పోలెబోయిన జయబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిమైన ప్రకటించారు.వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,కొమరం రాంబాబు,పోగు వెంకటేశ్వర్లు,గుడ్ల రంజిత్ కుమార్,పాయం నరసింహారావు,సుతారి నాగేష్,ప్రభాకర్,నరేష్ తదితరులు పాల్గోన్నారు.

వివిధ వార్డ్ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ ఎమ్మెల్యే…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T133728.466.wav?_=5

 

వివిధ వార్డ్ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ ఎమ్మెల్యే

◆:- శాసనసభ్యులు మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా రహ్మత్ నగర్ డివిజన్ (శ్రీ రామ్ నాగర్ ) లోని వివిధ వార్డ్ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు మాణిక్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రతీ ఒక్క పేద వారితో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడమైనది.

గతిశీలి..ప్రగతి శీలి.

జనం గుండెల్లో సారే బడి గుడి.

`జనసర్వస్వమంతా కేసీఆర్‌ మది.

`తెలంగాణ కోసం పడరాని పాట్లు పడిన నాయకుడు.

`తెలంగాణ కోసం అందరి మెట్లు ఎక్కి దిగిన నాయకుడు.

`తెలంగాణ విషయంలో బేషజాలకు పోలేదు.

`అభివృద్ధిలో ఎక్కడా రాజీపడలేదు.

`తెలంగాణ కన్నీరు తూడ్చడం కోసం పదేళ్లు కంటి నిద్ర పోలేదు.

`తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కడుపు సరిగ్గా తిన్నది లేదు.

`రాజకీయ విలువలకు ప్రాణం పెట్టిన నాయకుడు కేసీఆర్‌.

`అవకాశ వాద రాజకీయాలకు తావివ్వని నాయకుడు కేసీఆర్‌.

`గెలుపోటముల గురించి ఏనాడు మధనపడలేదు.

`ప్రజలు ఓడిపోవద్దని తాపత్రయ పడిన నాయకుడు కేసీఆర్‌.

`నా ప్రజలు మళ్ళీ మోసపోవద్దని భావించిన నాయకుడు.

`నా ప్రజలు కలలో కూడా గోస పడొద్దని కోరుకున్న నాయకుడు.

`ప్రజలు కష్టాలు పడుతుంటే చూడలేక తల్లడిల్లిపోతున్నాడు.

`పదేళ్లలో తెలంగాణను నందనవనం చేసిన నాయకుడు.

`మోడువారిపోతున్న తెలంగాణకు జీవం పోసే నాయకుడు కేసీఆర్‌.

`అందుకే మళ్ళీ జనమంతా కేసిఆర్‌ జపం చేస్తున్నారు.

`కేసీఆర్‌ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు

`ఎక్కడ విన్నా కేసీఆర్‌ పాటలతో నృత్యాలు చేస్తున్నారు.

`కేసీఆర్‌ పై తమ అభిమానాన్ని ప్రపంచానికి చాటేలా తెలియజేస్తున్నారు.

`ఉరకలెత్తే ఉత్సాహం జై కేసీఆర్‌ అని నినదిస్తున్నారు.

`‘‘జూబ్లీ హిల్స్‌’’ జనమంతా ‘‘కేసిఆర్‌’’ నామస్మరణే చేస్తున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాజకీయాలంటే కేసిఆర్‌కు ఆట విడుపు కాదు. అధికారం కోసం అసలేకాదు. ప్రజల కోసం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజా చైతన్యంకోసం, వారి జీవితాల్లో వెలుగుల కోసం. ఇదీ కేసిఆర్‌ రాజకీయం. అందుకే తెలంగాణ సాదన కోసం ఎవరూ చేయని త్యాగం చేశారు. పోరాటం చేశారు. ఉద్యమాన్ని ఎత్తుకొని తెలంగాణ సాదించారు. జీవితమే పోరాటం చేసుకొని ముందుకు సాగారు. తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా ముందుకెళ్లారు. తెలంగాణ మొత్తం ఏకం చేశారు. తెలంగా మొత్తం కేసిఆర్‌ గొంతుగా మార్చారు. అందుకే ఇప్పుడు ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒకటే మాట. ఒకటేపాట. ఒకటే బొమ్మ. అది కేసిఆర్‌. సారే రావాలంటున్నది తెలంగాణ అంటూ ఉద్యమ కాలంలో ఎలా వినిపించిందో ఇప్పుడూ అదే వినిపిస్తుంది. అంతకన్నా వంద రెట్లు ఎక్కవ వినిపిస్తుంది. పండగైనా, పబ్బమైనా సరే కేసిఆర్‌ పాట లేకుండా జరగడం లేదు. పెండ్లిల్లో కేసిఆర్‌ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. బరాత్‌లల కేసిఆర్‌ పాటలు పెట్టుకుంటున్నారు. ఆఖరుకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో, ఊరేగింపుల్లో కూడా ఎక్కడ విన్నా కేసిఆర్‌ పాటలే. బతుకమ్మ ఆడిన సందర్భాలలో కేసిఆర్‌ పాటలే వింటున్నారు. పల్లెల్లో ఎవరిని కదిలించినా కేసిఆర్‌ జపం చేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. కేసిఆర్‌ను తల్చుకోకుండా రోజు గపడం లేదు. ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో తెలంగాణలోని మహిళలు, పెద్దలు, వృద్దులు, రైతులు అన్ని వర్గాలు కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. పదేళ్ల పాలన గురించి చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కేసిఆర్‌ తెచ్చిన నీళ్లను గురించి చెప్పుకుంటున్నారు. కేసిఆర్‌ నింపిన చెరువులు గురించి చెప్పుకుంటున్నారు. ఇంటింటికీ ఇచ్చిన మిషన్‌ భగీరధ నీళ్ల గురించే చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కాలువలు తెచ్చిన కేసిఆర్‌ గురించే చర్చలు పెడుతున్నారు. పదేళ్లు పంటలు ఎండిపోకుండా చూసుకున్న కేసిఆర్‌ గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటును తల్చుకుంటున్నారు. పదే పదే కరంటు పోతున్నప్పుడల్లా కేసిఆర్‌ వున్నప్పుడు ఒక్కసారి పోకపోతుండే అనుకుంటున్నారు. ఇలా ఏ సందర్భమైనా సరే కేసిఆర్‌ను ప్రతి పల్లె తల్చుకుంటోంది. ప్రతి పట్టణం గుర్తు చేసుకుంటోంది. అందుకే కేసిఆర్‌ కేసిఆరే అంటోంది. ఒకటా రెండా..కేసిర్‌ చేసిన మంచి పనులు జనం గుండెల్లో నిలిచిపోయాయి. వారికి ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు రూ.200 వున్న పించన్‌ తెలంగాణ రాగానే ఒకేసారి రూ.1000కి పెంచారు. తర్వాత మళ్లీ రూ.2000 వేలు చేశాడు. దివ్యాంగులకు ఏకంగా రూ.6500 పించన్‌ ఇచ్చాడు. కుల వృత్తుల దారులకు పించన్లు ఇచ్చాడు. ఇలా 57 సంవత్సరాలు దాటిని సుమారు 46లక్షల మందికి పించన్లు ఇచ్చి, ఆ కుటుంబాలను అదుకున్నారు. ఇక కేసిఆర్‌ రైతులకు చేసిన మేలు ప్రపంచంలో ఏ పాలకులు చేయలేదు. ఏ నాయకులు రైతుల మేలు కోసం ఆలోచించలేదు. రైతు బంధు పేరు మీద పెట్టుబడి సాయం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి ఆలోచన ఒకటి చేయొచ్చని స్వతంత్ర భారతావినిలో ఏ నాయకుడు, పాలకుడు ఆలోచించింది లేదు. రైతుల మేలు కోరి సాయం చేసింది లేదు. రైతులు రుణగ్రస్తులు కాకుండా చూసుకున్నది లేదు. తెలంగాణ రాక ముందు రైతు అనే పేరు చెప్పుకోవడానికి కూడా కన్నీళ్ల పర్యంతమైపోయేవారు. పడావు బడ్డ భూములను చూసి దుక్కిస్తుండేవారు. ఎండిన దుక్కిని చూసి కళ్ళతో తడుపుకోవాలని అనుకునేవారు. ఆశాకం చేసి చూస్తూ, వానమ్మా రావమ్మా అంటూ పాటలు పాడుకుండే వారు. కరువు తప్ప కాలం కాకపోయినా, భూమిని నమ్ముకొని మన్ను తిని బతికారు. కూలీలుగా మారి జీవితాలు గడుపుకున్నారు. ధైర్యం వున్న వాళ్లు ఊరెళ్లిపోయారు. పొట్ట చేత పట్టుకొని అప్పులు చేసుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ రైతులంతా రాజులయ్యారు. కేవలం తెలంగాణ రాగానే రాజులైన రైతులకు అన్నీ సౌకర్యాలను కల్పించి, రారాజులను చేశాడు. రైతులు రారాజుల్లా కాలుమీద కాలేసుకొని బతికేలాచేశాడు. నీళ్లిచ్చాడు. పెట్టుబడి సాయం చేశాడు. సకాలంలో అవసరమైన ఎరువులు అందించాడు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాడు. పండిన పంటను కళ్లాలలోనే కొనుగోలు చేశాడు. మూడురోజుల్లో వడ్లపైకం బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ప్రతి సారి టంగ్‌ టంగ్‌ మని పెట్టుబడి సాయం అందించాడు. పంటలు నష్టపోతే నష్టపరిహారం వెంటనే అందించాడు. ఇలా అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న ప్రపంచంలోనే ఏకైక నాయకుడు కేసిఆర్‌. రాజకీయాల్లో నైతిక విలువలు అంటే అర్దం కేసిఆర్‌ అనే చెప్పాలి. తెలంగాణ కోసం ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్లు తన రాజకీయం కన్నా, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. తెలంగాణ అభివృ ద్దిలోనూ ఎక్కడా రాజీ పడలేదు. తెలంగాణ తెచ్చి, ఎలా బంగారు తెలంగాణ చేయాలో తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ అరవై ఏండ్లు గోసపడగింది చాలు. ఇంక ఎప్పుడూ గోస పడొద్దని అనుకున్న నాయకుడు కేసిఆర్‌. అరవై ఏళ్లలో తెలంగాణ పడిన గోసను, ఆరేళ్లలో తీర్చిన గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. తెలంగాణ తేవడం కోసం కడుపు నిండా తిన్నది లేదు. తెలంగాణ బాగు కోసం కంటి నిండా నిద్రపోయింది లేదు. అందుకే తెలంగాణ ఇప్పుడు ఇలా వెలుగుతోంది. లేకుంటే అదే పాత కాలపు చీకట్లోనే మగ్గుతూ వుండేది. బిఆర్‌ఎస్‌ను వీడిన వాళ్లయినా సరే కేసిఆర్‌ వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించిన సందర్భం లేదు. పార్టీలు మారిని ఎమ్మెల్యేలు కూడా కేసిఆర్‌ గొప్పదనమే గుర్తు చేస్తారు. తన జేబులో పెన్ను వున్నా, ఆఖరుకు అది కూడా ఇతరులకు ఇచ్చే మనస్తత్వం కేసిఆర్‌ది అని కేశవరావు చెప్పిన మాట అందరూ విన్నదే. అంటే రాజకీయంగా విభేదించి వెళ్లిన వారు కూడా కేసిఆర్‌ను పల్లెత్తు మాట అనాలంటే కూడా నోరు రాదు. అదీ కేసిఆర్‌ నాయకత్వం విశిష్టతకు సంకేతం. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఆయన అనుసరించిన తీరు అందరి చేత ప్రశంసలు అందుకుంటూనే వుంటుంది. ఎమ్మెల్యేల మరణంతో వచ్చిన ఏ ఉప ఎన్నికైనా సరే వారి కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం కేసిఆర్‌కు తెలుసు. రాజకీయాల కోసం ఆయన ఇతరులకు సీట్లు కేటాయించింది లేదు. గెలిచినా, ఓడినా నైతికతను ఆయన ఏనాడు వదిలిపెట్టలేదు. అయితే కేసిఆర్‌ వల్ల మేలు పొంది, రాజకీయంగా ఎదిగిన వారిలో కొంత మంది స్వార్ధపరులుంటారు. వారి అవకావాద రాజకీయాలను చూపిస్తుంటారు. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు. అలాంటి వారు మాత్రమే కేసిఆర్‌ను విమర్శిస్తుంటారు. అంతే కాని తెలంగాణలోని ఏ పార్టీ నాయకులైనా, ఏ సమాజమైనా సరే కేసిఆర్‌ వ్యక్తిత్వాన్ని శంకించేందుకు ఇష్టపడరు. అంత గొప్పది కేసిఆర్‌ నాయకత్వం. కొందరు కురుచ గుణం వున్న నాయకులు చేస్తున్న విమర్శల వల్ల వాళ్లే చులకనౌతున్నారు. కేసిఆర్‌ గ్రాఫ్‌ మరింత పెంచుతున్నారు. నిజం చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్ధులే ప్రజల కన్నా ఎక్కువగా కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కేసిఆర్‌ పేరు పదేపదే తల్చుకుంటూ రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత పాలక పెద్దలందరూ నిత్యం కేసిఆర్‌ జపం చేస్తూనే పూట గడుపుకుంటున్నారు. ప్రతి సందర్భంలోనూ పదే పదే పలు సార్లు గుర్తు చేసుకుంటున్నారు. తాము చేసిందేమీ చెప్పలేక, కేసిఆర్‌ను నిందించి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. బొక్కా బోర్లా పడుతున్నారు. తెలంగాణ కథ మళ్లీ మొదలైంది. ఇప్పుడే మొదలైంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలతో మళ్లీ మొదలౌతోంది. జనమే చూసుకుందామని ఇతర పార్టీలకు సవాలు విసురుతున్నారు. కేసిఆర్‌ ఫోటోను పక్కన పెట్టుకొని కొండంత ధైర్యం యువత ప్రదర్శిస్తున్నారు. దటీజ్‌ కేసిఆర్‌ అని యువత నోట జాలు వారుతుంటే కేసిఆర్‌ గర్జన వినిపిస్తోంది.

తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బీసీ బంద్‌కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు..

తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బీసీ బంద్‌కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు ,నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు బీసీ రిజర్వేషన్ల అమలుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పట్టణంలో మోటార్ సైకిళ్ళ పై తిరుగుతూ బంద్ కు సహకరించాల్సిందిగా దుకాణ దారులను వ్యాపారస్తులను కోరడంతో తమ తమ దుకాణాలను మూసి వేసి బంద్ కు మద్దతు తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి మెమోరాండం సమర్పించారు

ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ వర్గాలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తానే కోర్టులో కేసులు వేయించి స్టే తెచ్చుకున్న తీరు ప్రజలను మోసం చేసే దానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తీరుపై

బీసీ జేఏసీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద నిరసన తెలిపారు .ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిములు ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,జహీరాబాద్ మండల బిసి సెల్ అధ్యక్షులు అమీత్ కుమార్ బిసి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ లు నాయకులు షికారి గోపాల్,బరూర్ దత్తాత్రి , శంకర్ సాగర్, రాజు శంకర్ బిసి జేఏసీ నాయకులు పెద్దగొల్ల నారాయణ కొండా పురం నర్సిములు విశ్వనాధ్ బిసి మైనారిటీ నాయకులు ఇమ్రాన్ బిసి సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ…

బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బిసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కు దుగ్గొండి బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు పలికారు. మండలంలోని గిర్నిబావి గ్రామంలో గల నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నా నిర్వహించి రాస్తారోకో,ర్యాలీ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ
మండల అధ్యక్షులు సుకినే రాజేశ్వరరావు, నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు తెలిపామన్నారు.బీసీ రిజర్వేషన్ కులగనన ప్రకారంగా దక్కాల్సిన వాటాన్ని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా విద్యా వైద్య ఆర్థిక రాజకీయ ప్రైవేట్ సెక్టార్ లో ప్రాథమిక హక్కుగా భావించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బిజెపి పార్టీ చేస్తున్న నాటకాలను బీసీ కులాలు గమనిస్తున్నాయని అన్నారు. వెంటనే పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసేటట్లుగా రెండు పార్టీలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహాలు సృష్టిస్తూ ఇతర హామీలు నెరవేర్చకుండా బీసీ రిజర్వేషన్లు తెరపైకి తీసుకొచ్చి ఆడ లేక మధ్యలో ఓడినట్లుగా బీసీ బందులో పాల్గొనడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.పార్లమెంటులో చట్టాలు చేసే బిజెపి పార్టీ కూడా బీసీలపై వారి యొక్క విధానాన్ని ప్రకటించకుండా బీసీ బందుకు మద్దతు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల బంద్ కు ముందు నుండి మద్దతు తెలుపుతుంది.కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు వారి పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి ఒత్తిడి పెంచి రిజర్వేషన్లు రాజకీయపరమైన విధానాలు రూపొందించాలన్నారు. చట్టసభల్లో బీసీ జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ అమలుపరిచి బిజెపి,కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సత్తా చాటుకోవాలన్నారు లేనియెడల బీసీ ప్రజల యొక్క అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జిలు మాజీ ఎంపీపీ కోమల భద్రయ్య. టిఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నియోజకవర్గం కన్వీనర్, ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, ఊరటి రవి, శంకేశి కమలాకర్, పెండ్యాల రాజు,గుండెగారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్,బండి జగన్,పిండి కుమారస్వామి, భూంపల్లి రజనీకర్ రెడ్డి. కొల్లూరు మోహన్ రావు, గుండెకారి రవికుమార్, ల్యాండే రమేష్,యూత్ నాయకులు మడతలపాటి కుమార్,మాజీ సర్పంచ్ మోడం విద్యాసాగర్ గౌడ్, కుర్ర మధు, ఓడేడి తిరుపతిరెడ్డి,మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ బందులో పాల్గొన్నారు.

42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి….

42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి.

బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులు మెరుగు సురేష్ గౌడ్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పెద్ద కోమటిపల్లి లో బిసి సంఘాల బందుకి కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ పెద్దకోమటిపల్లి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని వ్యాపార సంస్థలను, విద్యాసంస్థలను బందు చేయించడం జరిగింది , అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద రమేష్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి నిమ్మతి రాజేందర్ మంద దశరథం గడ్డం శ్రీనివాస్ మంద లక్ష్మయ్య ఆదిమూల సత్యనారాయణ మంద నవీన్ మెరుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనిటి మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్ రావు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ, మునీర్, మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ మరియు తదితరులులతో కలిసి శ్రీరామ్ నగర్ బస్తీలోని మైనారిటీ సోదరులను విజ్ఞప్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,నాయకులు కృష్ణ ,బాబు ,నర్సింలు ,యువ నాయకులు మిథున్ రాజ్,ఫిర్దోస్ ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు..

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మహేష్ యాదవ్ నుండి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

 

అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున 30000 ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ .. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 మంది అనారోగ్యంతో మృతి చెందారు అదేవిధంగా బైకు ప్రమాదంలో ఓ వ్యక్తి కింద పడి గాయాలవడం తో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మహేష్ యాదవ్ చనిపోయిన బుడ్డమ్మ , రాజు, పున్నమ్మ ,నరసింహ లకు అదేవిధంగా బైకు యాక్సిడెంట్లో ప్రమాద వశాత్తు కిందపడ్డ యాదయ్య లకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు .ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను పరామర్శించి మొత్తం 6 కుటుంబాలకు 30000 ఆర్థిక సాయం చేస్తూ ఎవరు అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఇబ్బంది వచ్చిన నాకు తెలియజేయాలని మీ కుటుంబాలకు అండగావుంటా అని భరోసా ఇచ్చారు. నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, చంటి, బిక్షపతి, నవీన్, సాదిక్, రాజేష్, లక్ష్మణ్,మధు,మహేష్, రాకేష్, వినోద్ రమేష్,శ్రీకాంత్, శ్రీధర్, వంశీ,శేఖర్ గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ…

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలను ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో బాకీ కార్డులను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడి ఏరియాలో ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికి పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపుతో మునిసిపాలిటీలోని గద్దె రాగడిలో బాకీ కార్డులను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇంటింటికి పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అలుగుల సత్తయ్య, కుర్మ గురువయ్య దేవి సాయి కృష్ణ, కుర్మ దినేష్, బండారు రవీందర్, శివ, అలుగుల అరవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం…

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో, నాయకులు ఎన్నికల వ్యూహాలు, అట్టడుగు స్థాయిలో సంస్థను బలోపేతం చేయడం మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పార్టీ కేడర్‌ను సమీకరించడం గురించి చర్చించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి హజ్ కమిటీ మెంబర్ యూసఫ్ ,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.

హరీష్ రావు, కేటీఆర్ లను కలిసిన ఎమ్మెల్యే

హరీష్ రావు, కేటీఆర్ లను కలిసిన ఎమ్మెల్యే జహీరాబాద్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ అసెంబ్లీ సభ్యుడు మాణిక్ రావు నేతృత్వంలో, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, ముఖ్యంగా కోహిర్ మండల్ నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రతినిధి బృందం జహీరాబాద్ నగరం నుండి బయలుదేరి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను సందర్శించి, మాజీ రాష్ట్ర మంత్రి మరియు సిద్దిపేట అసెంబ్లీ సభ్యుడు హరీష్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ. రామారావును వారి హైదరాబాద్ నివాసాలలో కలిశారు.

ఈ సందర్భంగా, హరీష్ రావు మరియు కేటీ. రామారావు జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంతో, ముఖ్యంగా సమీపంలో జరుగుతున్న సంస్థలతో వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు.స్థానిక ఎంపీటీసీలు, జెడ్పీపీసీలు, సార్-ఎ-ఇంచాస్ కౌన్సిల్‌లు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థుల విజయానికి వ్యూహాలను రూపొందించడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా, రైల్వే అడ్వైజరీ బోర్డు మాజీ సభ్యుడు అల్హాజీ షేక్ ఫరీద్, మాజీ సయ్యద్ మొహియుద్దీన్,
నాదన్‌ అధ్యక్షుడు బీఆర్‌ఎస్‌ పార్టీ జహీరాబాద్‌ నర్సింలు యాదవ్‌, అధ్యక్షుడు బీఆర్‌ అరైన్‌, కోహిర్ మండలం ముహమ్మద్‌ కలీముద్దీన్‌, మాజీ ప్రతినిధి సర్‌, మీర్‌ మహమ్మద్‌ ఫిర్‌దౌస్‌, ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్‌, బీర్‌నౌ మహమ్మద్‌ వాజిద్‌ జబీహ్‌, మాజీ సభ్యుడు వారిద్‌, కోహిర్ గ్రామ పంచాయతీ సయ్యద్‌ అజ్మత్‌ హత్‌, అధ్యక్షుడు బీఆర్‌ఎస్‌, కోహిర్ మహ్మద్‌ అర్బాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజన్నల కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T142325.297.wav?_=6

 

రాజన్నల కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ,శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో రాజన్నల కుల సంఘం మేకల మండి వద్ద వర్షంలో సైతం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా,స్పీకర్ గా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని,రానున్న రోజుల్లో మళ్ళీ భూపాలపల్లి ఎమ్మెల్యేగా సిరికొండ మధుసూదనా చారిని గెలిపించుకుంటామని రాజన్నల కులస్తులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి పల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి,మొగిలి శీను,రాయగట్టయ్య,కొమురయ్య,రాజయ్య,మల్లయ్య,అంజయ్య,జన్నే సుమన్,ఎడ్ల విద్వత్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version