నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు..

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-16.wav?_=1

 

నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

 

బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు.

ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC)లో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి గండిగొట్టి బీజేపీ, శివసేన మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut) సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ అందరికీ గొప్ప విజయమని అన్నారు. బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారామె. ఇదే సమయంలో గతంలో ముంబైలోని తన ఆఫీసు కూల్చివేత ఘటనను గుర్తు చేసుకుంటూ ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై విమర్శలు గుప్పించారు.
‘గతంలో నన్ను వేధించిన వారిని, నా ఇంటిని కూల్చేసిన వారిని, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోవాలని బెదిరించిన వారిని ఇప్పుడు రాష్ట్రమే వదిలేసింది. మహిళా విద్వేషులు, బంధుప్రీతి మాఫియాకు ప్రజలు సరైన చోటు చూపించారు’ అని కంగనా రనౌత్ విమర్శించారు. బాంద్రాలోని కంగనా రనౌత్ కార్యాలయంపై కొంత భాగాన్ని 2020లో బీఎంసీ అధికారులు నిబంధనల పేరుతో కూల్చేశారు. దీనిపై ముంబై కోర్టును కంగన ఆశ్రయించడంతో బీఎంసీ చర్యను కోర్టు తప్పుపట్టింది. కూల్చివేతలను ఆపాలని, ఆమెకు జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఆదేశించింది.

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌కు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థిని విప్లవ..

జాతీయస్థాయి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీలకు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విధ్యార్థిని విప్లవ కు మర్రి రాజశేఖరరెడ్డి ప్రశంసలు

మల్కాజిగిరి నేటిధాత్రి

 

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో మూడవ సంవత్సరం చదువుతూ జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) లో చురుకుగా పాల్గొంటున్న కోడూరి విప్లవ జాతీయ స్థాయిలో జరగబోయే ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికవడం తమ కళాశాలకు గర్వకారణమని కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ సెక్రెటరీ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో నాలుగు దశల్లో క్విజ్, ఎస్సే రైటింగ్, ప్రజెంటేషన్, ఇంటర్వూ లాంటి పోటీల్లో పాల్గొన్న ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో తమ కళాశాలకు చెందిన కోడూరి విప్లవ జాతీయస్థాయికి ఎంపికవటం పట్ల మర్రి రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాలలో వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నామని, హ సస్టైనబిలిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో విప్లవ తన ఆలోచనలు పంచుకోనుండడం ఒక గొప్ప అవకాశమని తెలియజేస్తూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీరు విప్లవ మరియు ప్రోత్సహించిన తమ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ లను అభినందించారు.

ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఢిల్లీలోని భారత మండపంలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీల్లో సస్టైనబులిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద మాట్లాడబోతున్న విప్లవ రాణించాలని ఆకాంక్షించారు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీనివాసరావు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ విప్లవను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి…

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి.

#గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే.

#బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

పల్లెల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి గ్రామపంచాయతీలో గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని తప్పనిసరిగా పెట్టాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూపర్డెంట్ ఆలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే 14వ, 15వ ఆర్థిక సంఘం ద్వారానే గ్రామపంచాయతీలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అందుకనే నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో ప్రతి గ్రామ పంచాయతీ లో మీమే ఫోటోను పెడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, జిల్లా నాయకుడు బచ్చు వెంకటేశ్వరరావు, నాయకులు మురికి మనోహర్, ఓదెల అశోక్, ఊటుకూరి చిరంజీవి, శివ, కొండ్లె రమేష్ నవీన్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తన్న బిజెపి నేతలు…

వనపర్తి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తన్న బిజెపి నేతలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు శ్రీవెంకటేశ్వర దేవాలయం నుండి మార్నింగ్ వాకింగ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు అమలు అబివృద్ది గురించి పట్టణ బిజెపి అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ బచ్చు రాం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ ప్రజలకు తెలుపుతున్నామని తెలిపేరు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని వారుపేర్కొన్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితరేషన్ ప్రధాన మంత్రి ఆవాస్ యువజన ద్వారా నాలుగు కోట్లపైగా ఇళ్ల నిర్మాణం గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జెల్ యోజన ద్వారా నల్ల కనెక్షన్లు సురక్ష బీమా ద్వారా బీమా ముద్ర రుణ సదుపాయం అదేవిధంగా ప్రధానమంత్రి స్వనిది ద్వారా వీధి వ్యాపారులకు పూచికత్తు లేని రుణాలు రైతులకు ఫసల్ బీమా యోజన బీమా క్లైముల పరిష్కారం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు మద్దతు ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి దానికి వార్షిక ఐదు లక్షల ఉచిత వైద్యం పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా 300 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌభాగ్య యోజా న ద్వారా విద్యుద్దీకరణ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ చేశారని వారు ప్రజలకు వివరించారు వార్డు ల పర్యటనలో బిజెపి రాష్ట్ర నేత అయ్యగారి ప్రభాకర్ రెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు డి నారాయణ బచ్చురాం కూన శ్రీకాంత్ పట్టణ బిజెపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని బచ్చు రాం తెలిపారు

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత్‌ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రముఖ నగరాల్లో పర్యటిస్తారు. గోట్ ఇండియా టూర్‌ 2025లో భాగంగా ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు. మెస్సీతో పాటు లూయిస్ సూరెజ్, అర్జెంటినా మిడ్ ఫీల్డర్ రోడ్రిగో డే పాల్‌లు కూడా భారత్‌లో పర్యటించనున్నారు. మెస్సీ మూడు రోజుల భారత్ టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి.

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి

భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో వై సునీల్ రావు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎలక్షన్లు బిజెపి బలపరిచిన అభ్యర్థులు గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి గ్రామం పంచాయతీలలో ఒక చీపురు కట్ట కొనాలన్న కేంద్ర నిధులను తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ తన పార్లమెంటు అభివృద్ధి కొరకై వేల కోట్ల నిధులు ఇస్తున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సొంతంగా ఫండింగ్ పెడతానని ప్రజలకు తెలియజేయుతున్నారు మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పైసలు ఇచ్చే ప్రభుత్వం లో పనిచేస్తున్న కార్యకర్తలను మీ సర్పంచి అభ్యర్థుల గెలిపించుకోండి ఇలాంటి ఒక రూపాయి ఇవ్వని అభ్యర్థులకు ఓటు వేసి గ్రామాలు అభివృద్ధికి కుంటుపడుతుందని మేము కోరడం జరుగుతుంది కావున మా అభ్యర్థులు గెలిపించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్థానిక పార్లమెంటు సభ్యుడు ప్రత్యేకమైన నిధులతో చెరువతో మీ గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు,జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహారాజు, గొడుగు వినోద్, మాడుగురి సమ్మిరెడ్డి, లింగారెడ్డి ,ముత్యాల రవీందర్, కొండల్ రెడ్డి, ఎల్లా గౌడ్, దాట్ల వీరస్వామి, పార్లపల్లి స్వామి, దసారపు అశోక్, మోటం శ్రీనివాస్, కంకల సంతోష్, మడికొండ వెంకటేష్,చేతి వెంకటేశ్వర్లు, పత్తి శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, తోడేటి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T121732.421.wav?_=2

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రైతుల కోసం చేసిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు. అన్నదాతలు వైసీపీ హయాంలో చాలా నష్టపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రెండు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
రైతులకు ఇప్పటికే రూ.14,000 ఇచ్చామని చెప్పుకొచ్చారు. త్వరలో మూడో విడతగా రూ.6,000 విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సంవత్సరానికి రూ.20,000 అన్నదాతలకు సహాయం చేశామని తెలిపారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫీల్డ్‌లోకి వచ్చి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రైతాంగం ఎన్డీఏ నాయకత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడాన్ని కూడా పూర్తిగా రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శలు చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. ఇదంతా చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమవుతోందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్‌లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లో మమేకమై వారి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.

అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ప్రతీకే బీజేపీ గెలుపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T131242.531.wav?_=3

 

 

అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ప్రతీకే బీజేపీ గెలుపు

పాలకుర్తి తిరుపతి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి

పరకాల,నేటిధాత్రి

 

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించడం దేశ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వంపై ఉంచిన అపార నమ్మకానికి నిదర్శనం అని పాలకుర్తి తిరుపతి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని
నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం,నితీష్ కుమార్ నాయకత్వంలోని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మరొ విశ్వాస ముద్ర వేశారని పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాలు,విద్యారంగం పురోగతి,అన్ని వర్గాల సంక్షేమం,ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణ వీటి కారణంగానే బీహార్ ప్రజలు ఎన్డీయేను తిరిగి ఎన్నుకున్నారని అన్నారు.

ఎగసిన యువ కెరటం.. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ సూపర్ షో..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T144724.810.wav?_=4

 

ఎగసిన యువ కెరటం.. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ సూపర్ షో..

 

బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (రామ్ విలాస్‌) అసాధార‌ణ‌ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

ఊహించినట్టుగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ హేమాహేమీల మధ్య ఓ యువ కెరటం కూడా బలంగా తన ఉనికిని చాటుకుంది. తాజా ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (రామ్ విలాస్‌) అసాధార‌ణ‌ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాలనూ ఈ పార్టీ గెలుచుకుంది. బీహార్ రాజకీయాల్లో ఒక గొప్ప నాయకుడైన రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని ఆయన తనయుడు చిరాగ్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నారు. ప్ర‌ధాని మోదీ, సీఎం నితీశ్‌తో సమానంగా 43 ఏళ్ల చిరాగ్ కూడా బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అయితే చిరాగ్ రాజకీయ ప్రస్థానం అనుకున్నంత సులభంగా సాగలేదు 2020 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 130 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ కేవ‌లం ఒక్క సీటు మాత్ర‌మే గెలిచింది. ఓట్ల షేర్ అంశంలో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చినప్పటికీ సీట్లు మాత్రం సాధించలేకపోయింది. అయితే ఆ ఎన్నిక‌ల్లో అనేక సీట్ల‌లో జేడీయూ ఓట్ల‌ను దెబ్బ‌తీసింది. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ త‌ర‌హాలో చిరాగ్ పాశ్వాన్‌కు చ‌ర్మిషా లేదంటూ రాజ‌కీయ నేత‌లు, ప్రజలు అభిప్రాయ‌ప‌డ్డారు. అయినప్పటికీ చిరాగ్ వెనకడుగు వేయకుండా కష్టపడ్డారు. ప్రజలతో మమేకయ్యారు (Bihar election performance).

2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో లోక్‌ జ‌న‌శ‌క్తి పార్టీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది  . పోటీ చేసిన 5 స్థానాల్లోనూ గెలిచింది. అంత విజయం సాధించినప్పటికీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ 20 స్థానాలకు మించి ఎల్‌జేపీకి ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో చిరాగ్.. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీతో చర్చలు ప్రారంభించారు. చివరకు ఎన్డీయే పక్షాలు దిగి వచ్చి చిరాగ్ పార్టీకి 29 స్థానాలు కేటాయించాయి. ఎన్డీయే ప్రభుత్వంలో చిరాగ్ పాశ్వాన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T155852.211.wav?_=5

 

 

కేంద్ర ప్రభుత్వ ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత గ్యాస్ – పేదలకు మోడీ వరం
మహాదేవపూర్ నవంబర్ 10 నేటి ధాత్రి *

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో కేంద్రంలోనీ
బీజేపీ మండల అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు
వారు మాట్లాడుతూ భారత ప్రధాని గౌ నరేంద్ర మోడీ గారు ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ అందించడం వాళ్ళ పేద మధ్య తరగతి మహిళలు పొగరాహిత వంటకు అలవాటు పడుతారు,ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి పర్యావరణం శుభ్రంగా ఉంటుంది ఈ పథకం గ్రామీణ మహిళల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చే పథకామని పేర్కొన్నారు, పథకానికి అర్హులైన మహాదేవపూర్ మండలం లోని అన్ని గ్రామాల ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ పథకం కోసం స్థానిక గ్యాస్ ఏజెన్సీ లో మీ యొక్క ఆధార్ కార్డ్,రేషన్ కార్డు,బ్యాంకు పాస్ బుక్, పాస్ సైజు ఫొటోస్, ఓటర్ ఐడి, ఫోన్ నెంబర్,లు గ్యాస్ ఏజెన్సీ లో మీ సర్టిఫికెట్స్ ఇచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు తెలపడం జరిగింది

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్…

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్

 

ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని మాధవ్ తెలిపారు.

 ఏపీకి కేంద్రం నుంచి లక్షన్నర కోట్ల సాయం అందిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ (AP BJP Chief Madhav) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షా 80వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రూ.11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా 15 బిలియన్ డాలర్ల్ ఒక లక్షా 25వేల కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజన్ గ్రోత్‌కు ఒక చిహ్నమని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్‌గా మార్చేలా అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు మాధవ్.
ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు కంటగింపుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగా కోరు రాజకీయాలు చేస్తూ.. వారి వైఫల్యాలను వారే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్ గవర్నమెంట్ ఉంది కాబట్టే.. ఆ పార్టీ తరపున వారు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని ఏపీ బీజేపీ చీఫ్ తెలిపారు.

కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందన్నారు. ఎనర్జీ సోర్స్ కింద సోలార్, విండ్, హై ఎనర్జీలను వాడేందుకు గ్రీన్ ఎనర్జీ తయారవుతుందన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్‌లో యువత ప్రతిభకు చైనా తర్వాత ఏపీకే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఆంక్షలు ఉండటంతో భారత దేశంలోనే వీరంతా ఉండబోతున్నారని అన్నారు. ఐదేళ్లల్లో ఐదు లక్షల ఉద్యోగాలు యువతకు వస్తాయని ప్రకటించారు. నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వైజాగ్ – చెన్నై కారిడార్, బెంగుళూరు – చెన్నై కారిడార్, రాయలసీమ వైపు మరో కారిడార్‌లు రాబోతున్నాయని మాధవ్ అన్నారు. డిపెన్స్ క్రస్టల్స్, అతిపెద్ద రిఫైనరీ, జాతీయ రహదారుల కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు పెరగడం ద్వారా అభివృద్ధి మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రానికి వెహికల్ తయారు చేసే కంపెనీలు, జిందాల్ సంస్థలు, పవర్ హౌస్‌లు ఏపీకి రాబోతున్నాయని.. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాజధాని అమరావతిలో గత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయిందని… అమరావతితో వారంతా ఆటలాడుకుని నాశనం చేశారని మండిపడ్డారు. మోడీ సారథ్యంలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు కేటాయించారన్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారుల అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఐదు వేల కోట్లు కేటాయించిందని అన్నారు. కుడి, ఎడమ కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తారని వెల్లడించారు. ఏపీని అన్ని విభాగాల్లో అబివృద్ధి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయన్నారు. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో.. ప్రతిఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశ ఆర్థికాభివృద్ధికి దేశ ప్రజలంతా సహకారం అందించాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కోరారు.

దత్తగిరిని సందర్శించిన జిల్లా ఎస్పీ …

దత్తగిరిని సందర్శించిన జిల్లా ఎస్పీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall


ఝరాసంగం : ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు

నిలయమైన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బుధవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా మృత్యుంజయ లక్ష జప యజ్ఞానికి హాజరయ్యారు. వారికి ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలకు అభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని మంగళ హారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం

సోతుకు ప్రవీణ్ కుమార్
సిపిఐ పట్టణ కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడి నీ నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్లకాడ్ల తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలని ,

జస్టిస్ గవాయ్ పై ఆర్ ఎస్ ఎస్ ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని ఇది ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ అన్నారు.ఈ దాడిని కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ దాడులు కేవలం జస్టిస్ గవాయ్ పైన మాత్రమే కాదు భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపైన దాడి గా చూడాలని అన్నారు.జస్టిస్ గవాయ్ ఎల్లప్పుడూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తీర్పులు ఇచ్చారనీ, అది గిట్టని మతోన్మాద శక్తులు లాయర్ రాకేష్ కిషోర్ రూపంలో దాడులు చేపిస్తున్నారని తెలిపారు. బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద అరాచకాలను ఆపాలని లాయర్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్ధన్, పొనగంటి లావణ్య, పల్లెల రజిత, పెద్దమామల సంధ్య, ఇటికల శ్రీలత, పోతుగంటి స్వప్న, వాసం రజిత, సుభద్ర రాజమణి తదితరులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీలో చేరికలు …

 

భారతీయ జనతా పార్టీలో చేరికలు
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి

మహాదేవపూర్ అక్టోబర్ 8 నేటి ధాత్రి *

 

Vaibhavalaxmi Shopping Mall

 

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కంకణాల రాజిరెడ్డి మెరుగు లక్ష్మణ్ సారంగపని బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్బంగా చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్స్ దృష్ట్యా బీజేపీ పార్టీలో చేరికలు అవ్వడం శుభపరిణామం అని, భారత ప్రధాని గౌ ‘శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలు, వారి పరిపాలన ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు అవుతున్న కానీ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని, రాబోయే రోజులలో తెలంగాణనలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో మహాదేవపూర్ అన్నీ స్థానాలలో పోటీ చేసి, గెలిచి తిరుతామణి,కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక భారీ మూల్యం చెల్లించుకుంటుందని వారు చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్,కార్యదర్శి సంతోష్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్, చాగర్ల రవీందర్,దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్, రాము, బల్ల శ్రావణ్ కార్యకర్తలు పాల్గొన్నారు,

 

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..  హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ.. ప్రజలను ప్లాన్డ్‌గా మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలేనని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.

*దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక..

*దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక..

*వైసీపీ ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప్ర‌శంస‌..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
https://youtu.be/foreloAmve0?si=EykeHX2ZzSIIlHhM

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక పోషిస్తుందని తిరుపతి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి ప్ర‌శంసించారు. తిరుప‌తి ఐఐటీ శాశ్వ‌త క్యాంప‌స్ అభివృద్ధి ప‌నుల్లో భాగంగా రూ.2313 కోట్ల అంచనాలతో ఫేజ్‌-బీ ప‌నుల‌కు శ‌నివారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ విధానంలో భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఈ ప్రాంతానికి గర్వకారణమ‌న్నారు. అలాగే చారిత్రక రోజన్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు యువ‌త ఉజ్వ‌ల భ‌విష్య‌త్ నిర్మాణ‌మ‌న్నారు. ఇందుకోసం సుస్థిరమైన మౌలిక సదుపాయాలను క‌ల్పిస్తూ, విద్యార్థుల ఆవిష్కరణలకు, పరిశోధనలకు కొత్త దారులు తీసుకువస్తున్న ప్రాజెక్టుగా ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఐఐటీ ప‌రిశోధ‌న ఫ‌లితాలు అందుతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన డీఆర్‌డీఏ, టాటా, జేఎస్‌డ‌బ్ల్యూ లాంటి సంస్థ‌ల‌తో తిరుప‌తి ఐఐటీ స‌మ‌న్వ‌యంతో ముందుకెళుతూ పరిశ్రమలకు బలం చేకూర్చి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు.
అదే సమయంలో ఈ ప్రాంతంలోని మామిడి, టమాటా రైతులకు ఉపయోగ‌ప‌డేలా ఆహార ప్రాసెసింగ్ రంగంపై కూడా ఐఐటీ తిరుపతి దృష్టి సారించిందన్నారు. వ్య‌వ‌సాయ రంగానికి కూడా త‌న ప‌రిశోధన ఫ‌లాల్ని అందిస్తోంద‌ని ఆయ‌న కొనియాడారు. దీని ద్వారా రైతులకు సాంకేతికత, ఆవిష్కరణలు, వృద్ధి అందుబాటులోకి వస్తాయన్నారురెండో దశలో సుమారు 2,500 మంది విద్యార్థులకు సేవలందించనున్న ఈ సంస్థ యువతకు, ప్రాంత అభివృద్ధికి గొప్ప తోడ్పాటు అందిస్తోంద‌న్నారు.
ఈ ప్రాజెక్టును ఆమోదించి తిరుపతికి కేటాయించినందుకు గాను ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి నిజమైన దూరదృష్టి గల నాయకుడైన ఆయన ఎప్పుడైనా తిరుపతి అభివృద్ధి కోసం కోరినప్పుడు అపారమైన సహకారం అందిస్తున్నారని ఆయ‌న కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామ‌ని ఎంపీ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు.
ప్ర‌ధాని చొర‌వ‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డంతో విద్యార్థులు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. దేశాన్ని ముందుకు న‌డ‌పడంలో ఐఐటీ నుంచి వ‌చ్చే యువ‌త కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆయ‌న కొనియాడారు. మ‌రీ ముఖ్యంగా త‌న సొంత మండలంలో ఉన్న ఐఐటీకి అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పించిన ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాల‌న్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ఐఐటీ మొదటి ఫెజ్ నిర్మాణానికి ఎంతో తోడ్పాటు అందించార‌న్నారు. దేశం ప్ర‌గ‌తి ప‌థంలో ముందుకెళ్ల‌డానికి ప్ర‌త్యేక భూమిక తిరుప‌తి ఐఐటీ పోషిస్తోంద‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మంలో తాను పాల్గొన‌డం సంతోషంగా, గ‌ర్వంగా వుంద‌న్నారు.

ఓదెల లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం…

ఓదెల లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటి ధాత్రి:

ఓదెల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి సూచన మేరకు ఓదెల మండల కేంద్రం లో జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు రమేష్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గిపు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు తో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలుజరుగుతుందని అన్నారు.జీఎస్టీ తగ్గిపుతో దసరా పండగ ఘనంగా చేసుకునే అవకాశం ప్రతి పేదకుటుంబానికి దక్కిందని అలాగే అనేక ఔషధాల ధరలు తగ్గింపుతో జబ్బుతో బాధపడుతున్న ప్రజలకు మేలుజరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రేణుకాదేవి పుల్లూరి పృద్విరాజ్ కుమారస్వామి చారి సత్యనారాయణ పద్మ రాచర్ల అశోక్ రామినేని రాజేంద్రప్రసాద్ సారంగం తదితరులు పాల్గొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన…

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

 

 

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 22న అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), త్రిపుర (Tripura)లో పర్యటించనున్నారు. ఇటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మాతా త్రిపుర సుందరి టెంపుల్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇటానగర్‌లో రూ.3,700 కోట్ల విలువైన రెండు ప్రధాన హైడ్రోపవర్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పీఎంఓ తెలియజేసింది. అనంతరం త్రిపురలో ప్రధాని పర్యటించి మాతాబరిలో మాతా త్రిపుర సుందరి టెంపుల్ కాంప్లెక్‌‌ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఆలయంలో పూజలు చేస్తారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. తవాంగ్‌లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సాంస్కృతిక ఉత్సవాలు, ఎగ్జిబిషన్లకు ఇది వేదిక కానుంది. 1,500 మంది డెలిగేట్లుకు ఆతిథ్యం ఇచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించనున్నారు. ఇది పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం కానుంది. రూ.1,290 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా మోదీ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. వీటిలో కనెక్టివిటీ, హెల్త్, ఫైర్ సేఫ్టీ, వర్కింగ్ ఉమన్స్ హాస్టళ్లు వంటివి ఉంటాయి.

మోడీ జీఎస్టీ తగ్గింపుకు పాలాభిషేకంతో స్వాగతం…

దేశ ప్రజల సంక్షేమమే బిజెపి లక్ష్యం. జీఎస్టీ స్లాబ్ లను తగ్గించి..దేశ ప్రజలకు ముందే పండుగ వాతావరణాన్ని కల్పించిన మోడీ

-బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి

-మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించేందుకు జీఎస్టీ స్లాబ్ లను భారీగా తగ్గించి దేశ ప్రజలకు ముందే దీపావళి పండుగ వాతావరణాన్ని కల్పించారని బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తూ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో భాజపా శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి& బిజెపి రాష్ట్ర నాయకులు చెవ్వ శేషగిరి ప్రజలను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ప్రపంచంలోనే వికసిత్ భారత్ గా మార్చే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత దేశ అభివృద్ధి, దేశానికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి అగ్రరాజ్యమే వణికిపోతుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. భారతదేశానికి వివిధ దేశాల నుంచి వస్తున్న మద్దత్, ఆదరణను చూసి అమెరికా వంటి దేశాలు కూడా ఈర్ష్య పడుతున్నాయన్నారు. మన దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల పెంచుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయన్నారు. జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపారస్తులకు, ఆరోగ్య పరికరాల కొనుగోలు అమ్మకం దారులకు, మధ్యతరగతి ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమ్మరి లచ్చమ్మ సారయ్య దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు బండారి రవీందర్ జిల్లా నాయకులు పోతుగంటి సాయిలు మండల ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు రాస బిక్షపతి మండల కోశాధికారి వంగరవి మండల కార్యదర్శి పులి భాస్కర్ రెడ్డి చిలక మారి రాజేంద్రప్రసాద్ బూత్ అధ్యక్షులు పొడి శెట్టి రవి సామల తిరుపతిరెడ్డి రేపల శ్రీనివాస్ మధుకర్ ముక్క రవీందర్ తదితరులు పాల్గొన్నారు

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్…

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్?.. లింక్డిన్‌లో ఉద్యోగావకాశాలకు సంబంధించి బైట్‌డ్యాన్స్ పోస్ట్..

గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది.

గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది. ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాలు స్నేహపూర్వకంగా మెలగాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు 

ఇరు దేశాల మధ్య తిరిగి సామరస్యం నెలకొన్న వేళ టిక్‌టాక్ కార్యకలాపాలు తిరిగి భారత్‌లో ప్రారంభం అవుతాయని చాలా మంది భావిస్తున్నారు (TikTok comeback). అందుకు తగినట్టుగానే టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ తాజాగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. గురుగ్రామ్‌లోని ఆఫీస్‌లో రెండు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు తెలిపింది. దీంతో టిక్‌టాక్ సేవలు భారత్‌లో తిరిగి ప్రారంభం కాబోతున్నాయా? అని చాలా మంది చర్చించుకుంటున్నారు (TikTok job openings)

ఇటీవలి కాలంలో మనదేశంలో టిక్‌టాక్ వైబ్‌సైట్‌ను చాలా మంది యాక్సెస్ చేయగలుగుతున్నారు. లాగిన్ కావడం, వీడియోలు చూడడం మాత్రం కుదరడం లేదు. అయితే ఇంతకు ముందు ఇలా టిక్‌టాక్‌ను యాక్సెస్ చేయడం కూడా కుదిరేది కాదు (TikTok ban status). కేంద్ర ప్రభుత్వం మాత్రం టిక్‌టాక్‌పై నిషేధం ఇప్పటికీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. టిక్‌టాక్ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు తెలిపారు. అలాగే భారత ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తున్నామని, టిక్‌టాక్ సేవలను పునరుద్ధరించలేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version