ఎస్సీ నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం…

ఎస్సీ నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం

ఏప్రిల్ 2 తారీకు వరకు గడువు పొడిగింపు

జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, హైదరాబాద్ ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ నిరుద్యోగ యువత కోసం అమలు చేస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్ (2025-26) పథకాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 2 వరకు గడువు పొడిగించినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా ఒక ప్రక టనలో తెలిపారు. బ్యాంకు లింకేజీ ఉన్న పథకాలు రెండు ద్విచక్ర వాహనాలు, ఈవీ మూడు చక్రాల వాహనాలు, వ్యవసాయంలో అగ్రి డ్రోన్ సర్వీసులు, అగ్రి మిషనరీ కామన్ హైరింగ్ సెంటర్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, పశు సంవర్ధక పథ కాల్లో పాడి పశువులు పొందడానికి దరఖాస్తు చేసు కోవాలన్నారు. ఉద్యానవన పథకాలు మల్బరీ సాగు, కిసాన్ నర్సరీ, కూరగాయలు, ఆయిల్పామ్ సాగు చేసుకోవచ్చన్నారు. బ్యాంకు లింకేజీలేని పథకాలు బోర్వెల్స్, సబ్మెర్సిబుల్ పంపుసెట్లు, సబ్మెర్సిబుల్ పంపుసెట్లు పైపులైన్, సర్వీసు కలెక్షన్ ఛార్జీలు, ఓఆర్పి లైన్(రూ.1.50 లక్షల వరకు) పొందవచ్చ న్నారు. అర్హులైన వారు గడువులోపు ఎస్సీ కార్పొరే షన్ అధికారిక పోర్టల్ OBMMS online portal ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగించాలి….

ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగించాలి

ములుగు టౌన్ నేటి ధాత్రి

ములుగు జిల్లాలో షెడ్యూల్డ్ క్యాస్ట్ తరగతుల వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకార రుణాలకు (ఎస్సీ కార్పొరేషన్) దరఖాస్తు గడవు చాలా పరిమితి రోజులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కావున వెంటనే దరఖాస్తు మరో నెల రోజుల పాటు గడువు పొడిగించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాల కు చాలా తక్కువ రోజులు పరిమితి విధించి దరఖాస్తు గడువు నిర్ణయించడం జరిగింది . ఈ క్రమంలోనే పండుగలు సెలవులు రావడం వల్ల అనేకమంది అర్హులు ఆయా కులం సర్టిఫికెట్స్ మరియు ఇతర సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడం వల్ల చాలామంది దరఖాస్తుకు సమయానికి చేసుకోలేకపోవడం వల్ల అనేకమంది అనర్హులుగా మిగిలిపోతున్నారని అన్నారు అలాగే కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న ఇవి వెహికల్స్ కి లైసెన్స్ ముఖ్యంగా మహిళలకు టూవీలర్ కి లైసెన్స్ కూడా ఉండాలనే నిబంధనను తొలగించాలని అన్నారు ట్రాఫిక్ RTO వాళ్లే లైసెన్స్ అడగరు కదా మరి ఏ ఉద్దేశంతో కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న ఇవి వెహికల్స్ కి లైసెన్స్ ఉంటేనే అర్హులని అడగడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారుల ఆలోచించాలి లైసెన్స్ కావాలని నిబంధనను తొలగించాలి ఇంకా ఇతర అగ్రికల్చర్ లోన్స్ కు సంబంధించి సబ్సిడీ ఎక్కువ కల్పించాలని కోరడం జరిగింది అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి లోన్ మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అనేవి మంజూరు చేయడంలో గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది

నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం ఖాసింపుర్ గ్రామంలో జరిగిన జి.రాజు కుమార్తె, కుమారుల నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు విజేందర్ రెడ్డి,ఎన్. మల్లేశం,యస్. గోపాల్, చెంగల్ జైపాల్, బి.రాజు,జే.ప్రసాద్,గోపాల్,తుకారాం,మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు.

దళితులకు అభయ హస్తం పథకం అమలు చేయాలి…

దళితులకు అభయ హస్తం పథకం అమలు చేయాలి

ఈనెల 18న దళిత మహాసభ విజయవంతం చేయండి

ఎం హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ తిక్కరాజు మాదిగ పిలుపు

భూపాలపల్లి నేటిధాత్రి

ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షల రూపాయలు పథకం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న హన్మకొండలోని హరిత కాకతీయ లో జరుగు దళిత మహాసభను విజయవంతం చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ తిక్క రాజు మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో దళిత మహాసభకు సంబంధించినటువంటి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిక్క రాజు మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేవెళ్లలో జరిగిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 12 లక్షల రూపాయలు పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దళితులకు ఇచ్చిన హామీ ఏమైనాట్లని ప్రశ్నించారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో దళితులకు దళిత బంధ పేరుతో 10 లక్షల రూపాయలు అందించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఈ పథకం అమలు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారన్నారు ఎస్సీ కార్పొరేషన్ ను మూడు విభాగాలుగా విభజించి తక్షణమే కార్పొరేషన్ చైర్మన్ ల నియమించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో జరిగే దళిత మహాసభ దళితులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టేవాడ సమ్మయ్య, తిక్క మల్లయ్య, రడపాక సారయ్య, మొలుగూరి సారయ్య, కార్తీక్, నర్సింహులు, విజయ్, రాజారాం, లక్ష్మీ, లావణ్య లు పాల్గొన్నారు.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని గోరి ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజీ మున్సిపల్ వైస్ చేర్మెన్ మహ్మద్ లుక్మాన్ గారి కుమారుని వివాహా వలిమా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వలిమా వేడుకల్లో,వై.తరుణ్,పాత్రి కేయులు అక్తర్ హుస్సేన్, మహ్మద్ ఇక్బాల్ అహ్మద్, చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారి తండ్రి నర్సింలు మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం మ్యాచ్నుర్ గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు, కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజి జడ్పీటీసీ పందారినాథ్,మాజీ సర్పంచ్ స్వామి దాస్,మాజ్8 ఎంపీపీ విజయ్ కుమార్,తదితరులు ఉన్నారు,

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ పట్టణం లోని భారత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కోహిర్ పట్టణం మహ్మద్ అబ్దుల్ ముజమ్మిల్ వివాహా వలిమా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వలిమా వేడుకల్లో మాజీ ఎంపీపీ షౌకత్ అలీ,మాజీ వైస్ ఎంపీపీ షాకిర్ అలీ,మాజీ కో.అప్షన్ జలీల్,మాజీ సర్పంచ్ నర్సింలు,సత్తార్ సాబ్,చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T155056.995.wav?_=1

 

 

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణం శేట్కర్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం పోట్ పల్లి గ్రామం బి.బస్వరాజ్ సోదరుని కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియ తెలియజేశారు,ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ సిద్దన్న పాటిల్, సంగ్రామ్ పాటిల్,మాణిక్యప్ప, చెంగల్ జైపాల్,రాములు,బి.నాగి శెట్టి,బి.దిలీప్,మేఘనాథ్,మితున్ రాథోడ్,తదితరులు పాల్గొన్నారు,

సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం…..

సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం…..!

◆:- ఆర్థిక ఇబ్బందుల్లో లబ్ధిదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో, నైపుణ్యం కలిగిన అర్హులైన దళితులకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులముల సేవ, సహకార అభివృద్ధి సంఘం. ( ఎస్. స్సి. కార్పొరేషన్ ). ద్వారా, బ్యాంకు అధికారుల సహకారంతో, సబ్సిడీ ద్వారా, మహీంద్రా ఆల్ఫా డీలక్స్, బీ, యస్, 6, డీజిల్ ప్యాసింజర్, సెన్సార్లు కలిగిన, ఆటోలను, లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సబ్సిడీ ద్వారా ఆటోలను తీసుకున్న కొన్ని నెలలకే, ఈ ఆటోలు చెడిపోవడంతో. ఇట్టి విషయమై ఎన్నో సార్లు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీని, ప్రభూత్వ అధికారులు స్పందించలేదన్నారు. ఈ వాహనంలో ఏ చిన్న లోపం తలెత్తిన, వీటిని బాగు చేయుటకు, ఇతర వాహనం సహకారంతో, హైదరాబాద్ వెళ్లవలసిందే నని, ఈ విధంగా గత మూడు సంవత్సరాల నుండి, ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్లి, తమ ఆటోను బాగు చేసుకొని వచ్చినప్పటికీని, మళ్లీ మళ్లీ చెడిపోవడంతో, లబ్ధిదారులు అప్పులపాలై, బ్యాంకులో ఆటో కొరకు తీసుకున్న అప్పును తీర్చలేక, బ్యాంకు అధికారుల, మరియు, మధ్యవర్థుల మాటలకు, మానసికంగా, బాధపడుతున్నామన్నారు. ఈ ఆటోలను, ప్రభూత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు మాత్రమే విక్రయించి, ఇతరులకు విక్రయించకుండా, గత మూడు సంవత్సరాలుగా, ఈ ఆటో విక్రయాలు నిలిపివేయడానికి గల కారణం ఏమిటో, సంబంధిత అధికారులు, పత్రిక ముఖంగా తెలియజేయాలని, ఈ ఆటోలను మాత్రమే, ప్రభుత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడానికిగల కారణం ఏమిటో, ఇతర కంపెనీల ఆటోలను ఇవ్వలేమని, సంబంధిత అధికారులు తమకు చెప్పడంతో, గథ్యాంతరం లేక,ఈ ఆటో ను తీసుకున్నామన్నారు. ఈ ఆటోలు తీసుకొని నష్టపోయిన లబ్ధిదారులను, ప్రభూత్వమే ఆదుకోవాలని, లబ్ధిదారులు కోరుచున్నారు,

రెవ.రే.భూమన్ సుందర్ రాజ్ మృతి పట్ల సంతాపం…

రెవ.రే.భూమన్ సుందర్ రాజ్ మృతి పట్ల సంతాపం

◆:- ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణానికి చెందిన రెవ.రే.భూమన్ సుందర్ రాజ్ 17-10-2025 రోజు అమెరికా దేశంలో స్వర్గస్తులైనరు వారి అంత్యక్రియలు అక్కడే జరుగును జహీరాబాద్ పట్టణంలోని వారి నివాసంలో వారి బంధుమిత్రులు,ఆప్తుల తో కలసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించి,నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతు వారి మృతి బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు,ఈ కార్యక్రమంలో ఇండిపండెంట్ పాస్టర్ రమేష్ బాబు,మోహన్, రవీందర్ పాల్,ప్రకాష్, రత్నం,ధన్ రాజ్, సురేష్,పాల్,సునీల్, పాస్టర్స్ బృందం, తదితరులు పాల్గొన్నారు,

మంజూరు అయి నెలలు గడుస్తున్న పట్టించుకోని ఆర్.అండ్.బి అధికారులు…

మంజూరు అయి నెలలు గడుస్తున్న పట్టించుకోని ఆర్.అండ్.బి అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్ నుండి చించోలి వయా మొగుడంపల్లి మండల మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అంతర్ రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు గత రెండు నెలల క్రితం హోతి బి గ్రామం గోవింద్ పూర్ గ్రామం మద్యన కల్వర్టు పూర్తిగా ద్వంసం అయిపోయింది, దింతో వాహనదారులకు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీళ్లు ఎక్కడిక్కడనే ఆగిపోవడం జరిగింది కల్వర్టు పాడైపోయినందున నీరంత రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఆర్.అండ్.బి డీఈఈ కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నది నీళ్లు రోడ్డుపైకి వచ్చి నిలబడటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి వాహనదారులు క్రింద పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి.అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు.

దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మిస్తే బాగుటుంది,

ఆర్.అండ్.బి అధికారుల నిర్లక్ష్యం…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

ఆర్.అండ్.బి డీఈఈ కి అక్కడి నుండే సమస్యను వివరించగా కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదు అని నరోత్తం అన్నారు.పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నది నీళ్లు రోడ్డుపైకి వచ్చి నిలబడటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి

వాహనదారులు క్రింద పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మించాలని డిమాండ్ ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం అన్నారు.,

ఉమాకాంత్ పాటిల్‌ను పరామర్శించిన వై. నరోత్తం

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కొద్దీ రోజుల క్రితం ప్రమాద వశాత్తు కాలుకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న మాజీ సీడీసీ చెర్మన్ ఉమాకాంత్ పాటిల్ ను ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం, పరామర్శించిన వారిలో యం.శ్రీనివాస్, యూ. మాణేన్న,టి.రాములు,టి.విఠల్,యం.శివన్న,యం.సంగ్రామ్,బి.అశోక్,కె.శ్రీశైలం,తదితరులు ఉన్నారు

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T133401.870.wav?_=2

 

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు

★చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి సంస్థ స్కీములకు ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది, అయితే జహీరాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కార్పొరేషన్ లోన్లు అధికారులు మంజూరు చేశారు. ఈ పథకాలు సాధారణంగా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం.ఒకేసారి ఆర్థిక సహాయం అందిన తర్వాత మళ్లీ తిరిగి ఐదు సంవత్సరాల వరకు ఆ కుటుంబానికి వర్తించదు కానీ అధికారులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు లోను మంజూరు చేయడంపై సార్వత్రిక ఉత్కంఠ నెలకొంది దీనిపై అధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఒకే కుటుంబానికి చెందినవారు మూడు వేర్వేరు కార్పొరేషన్ల నుండి రుణాలు పొందడం అనేది సాధారణంగా నిబంధనలకు విరుద్ధం, దీనికి సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తెలుసుకోవడానికి మీరు సంబంధిత కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఈ నియమాలు ఎప్పటికప్పుడు మారవచ్చు.

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు…

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు

★చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి సంస్థ స్కీములకు ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది, అయితే జహీరాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కార్పొరేషన్ లోన్లు అధికారులు మంజూరు చేశారు. ఈ పథకాలు సాధారణంగా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం.ఒకేసారి ఆర్థిక సహాయం అందిన తర్వాత మళ్లీ తిరిగి ఐదు సంవత్సరాల వరకు ఆ కుటుంబానికి వర్తించదు కానీ అధికారులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు లోను మంజూరు చేయడంపై సార్వత్రిక ఉత్కంఠ నెలకొంది దీనిపై అధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఒకే కుటుంబానికి చెందినవారు మూడు వేర్వేరు కార్పొరేషన్ల నుండి రుణాలు పొందడం అనేది సాధారణంగా నిబంధనలకు విరుద్ధం, దీనికి సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తెలుసుకోవడానికి మీరు సంబంధిత కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఈ నియమాలు ఎప్పటికప్పుడు మారవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

◆:- పి.రాములు నేత

*జహీరాబాద్ నేటి ధాత్రి:

జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు కార్మిక నాయకులు వ్యవసాయ కార్మిక నాయకులు స్వచ్ఛందంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని దిగ్విజయం చేయగలరు సమావేశంలోని ముఖ్యంశాలు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారత దేశానికి సంబంధించిన వర్తకులు కార్మికులు మన రాష్ట్రానికి వలస వచ్చి మన యొక్క వర్తకులను మన కార్మికులను మరియు వ్యవసాయ కార్మికులను వ్యాపార రంగంలో శ్రామిక రంగంలో కృంగదీస్తున్నారు దీని మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని వర్తకులు కార్మికులు వ్యవసాయదారులు అనేక రకాలుగా నష్టపోతున్నారు ఈ విషయాల పైన ప్రత్యేకమైన చర్చా ఉంటుంది అదేవిధంగా ఇంకా కొంతమంది ఉత్తరభారతీయులు రాష్ట్రం లోపల అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఉదాహరణకు నకిలీ వస్తువుల విక్రయం కల్తీ తినుబండ రాళ్ల తయారీ చేస్తూ మోసపూరితమైన స్కీమ్ లతో వ్యాపారం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అనేక రకాలుగా అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా వారికి నకిలీ వ్యక్తులు విక్రయించి వారి ధనాన్ని కూడా దోచుకెళుతున్నారు అనేక సందర్భాలలో రకరకాల మోసపూరిత వ్యాపారాలు నిర్వహించి తెలంగాణ సామాన్య ప్రజానీకానికి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు ఇట్టి విషయాల మీద ప్రత్యేకమైన చర్చ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం అనేక రకాల ప్రజా సంఘాలు వారికి తోచిన విధంగా తమకు తామే వాళ్లకు ప్రజా సంఘాన్ని నామకరణం చేసుకొని ముందుకెళుతున్న సంగతి తెలిసినదే అయినప్పటికిని ఏది ఏమైనా ప్రతి సంఘం యొక్క లక్ష్యం తెలంగాణ ప్రజల రక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కాబట్టి ఎవరు ఏ రకంగా ముందుకు వెళ్లిన అందరం కూడా మాసానికి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏకమై ముందుకు కదలాలని కార్యచరణలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది ఇటి సమావేశానికి అందరూ కూడా సమయపాలన పాటించి స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము కార్యక్రమంలో జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బెడబుడగజంగం నాయకులు మాదినం శివ ప్రసాద్ ,పి.దేషరథ్ ,వడ్డెర సంఘం నాయకులు పల్లెపు శేఖర్ ,డివిజన్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ధనరాజ్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యార్థి నాయకులు కార్తీక్ రామ్ చరణ్ బాలకృష్ణ రవి కిషోర్ విష్ణు గార్లు పాల్గొన్నారు,

పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T151324.521.wav?_=3

పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జాహిరాబాద్ పట్టణం పస్తాపూర్ గ్రామం కొత్త గురునాథ్ రెడ్డి గారిని ఈ రోజు వారీ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం,ఈ కార్యక్రమంలో సి.యం విష్ణువర్ధన్ రెడ్డి,శికారి గోపాల్, యం.జైపాల్, తదితరులు ఉన్నారు

గణనాథులను దర్శించిన వై. నరోత్తం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T122535.212-1.wav?_=4

గణనాథులను దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

గణేష్ నవరాత్రి ఉత్సవాల మొగుడంపల్లి మండల కేంద్రంలో* గణనాథుని దర్శనం, పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనిలో స్త్రీ శక్తి గణేష్ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేసిన వినాయకుడుని దర్శనం,పట్టణంలో ఆర్యనగర్ వీధిలో శివాజీ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడుని,సుభాష్ గంజ్ లో శ్రీ సేనా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణనాథుడుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్, చెంగల్ జైపాల్,వెంకట్, మంజుళ,బి.జి.సందీప్,వంశి క్రిష్ణ,సురేష్, శికారి శ్రీనివాస్, సాయి కిరణ్,మహేష్,రమేష్, సుశీల్,నవీన్,బి.దిలీప్,ఆకాశ్,మల్లికార్జున్,ప్రశాంత్,విశాల్,తదితరులు పాల్గొన్నారు,

అధికారుల నిర్లక్ష్యంతో జలమయం అయిన రోడ్లు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122912.268.wav?_=5

అధికారుల నిర్లక్ష్యం/ జలమయం అయిన నివాస ప్రాంతాలు రోడ్లు — ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

◆:- విచ్చల విడిగా వ్యర్థాలను వదులుతున్న అల్లనా

◆:- దుర్గంధం వాసన వదిలిన అల్లనా

◆:- చెరువులను తలపిస్తున్న వెంచర్లు,రోడ్లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాహిరాబాద్ నియోజకవరగంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం తిరిగి పరిశీలించడం జరిగింది ,బారి వర్షాలకు రోడ్లు,వెంచర్ లు అన్ని జలమయం అయ్యాయి వాగులు వంకలు బోర్లి పోతున్నాయి ప్రతిసారి వర్షాలు కురుస్తున్న సమయంలో ఇదే అదనుగా భావించి అల్లనా పశువదశాల వ్యర్థాలను నాళాలో ప్రవహిస్తున్న నీటిలో వదులుతున్నాడు దింతో చుట్టూ ప్రక్కల దుర్గంధంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలున్నాయి అల్లనా వ్యర్టాలను వదులుతున్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది

Negligence Leads to Flooded Roads

ఈ వ్యర్థాలు మొత్తం నారింజలో కలిసి నారింజ నీరు మొత్తం కలుషితమవుతున్నది ఈ విషయమై గత జూన్ మాసంలో పొల్యూస్యన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన నాటి నుండి నేటి వరకు చర్యలు తీసుకున్నది లేదు,అధికారులు అల్లనా యాజమాన్యంతో కుమ్ముక్కై ఏ చర్యలు తీసుకోవడం లేదు,మరియు నాళాలు కాలువలు మళ్లించి,చిన్నవిగా చేసి అధికార పార్టీ నాయకులు వ్యాపారులు అక్రమంగా వెంచర్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ అక్రమ వెంచర్ ల లో మొత్తం నీరు నిలబడి చేరువులను తలపిస్తున్నాయి గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారు స్పందిస్తే ఇలా జరిగేదికాదు ప్లాట్లు కొనే వారు క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి దీనికి కారణం ఇరిగేషన్ అధికారుల అసమర్థతే, మరియు

Negligence Leads to Flooded Roads

ఈ బారి వర్షాలకు రోడ్లపై బారి లోతుగా నీరు నిలబడి అల్గోల్,మరియు రాయిపల్లి డి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి,నారింజ పూర్తిగా నిండుకొని గేట్లు చేడిపోయి సరిగ్గా తెరుచుకోనందున నీరు వెనక భాగాన నిలబడి పంటపొలాల్లో నీరు నిలబడి పంట నష్టం జరుగుతున్నది గేట్లపై నుండి నిరంత వృధాగా కర్ణాటకకు తరలిపోతున్నది అధికారులు,ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే నీటిని కపడుకోనేవారం,ఇప్పటి కైనా అధికారులు,ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,చల్లా శ్రీనివాస్ రెడ్డి,సి.యం. విష్ణువర్ధన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు,

జహీరాబాద్‌లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గౌరవం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T121121.910-1.wav?_=6

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్సి కార్పోరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాహిరాబాద్ పట్టణంలోని ఎన్.కన్వెన్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన వికలాంగుల,వృద్ధుల, వితంతువుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్,మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్,సామెల్, శివప్ప,బి.దిలీప్,తదితరులు ఉన్నారు

జహీరాబాద్‌లో ఉప్పిట్ హోటల్ ప్రారంభం…

ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహిరాబాద్ పట్టణం దత్తగిరి కాలనిలో జరిగిన ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్,విష్ణువర్ధన్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,సంగారెడ్డి,బి.విఠల్,నరేష్,మనోజ్,దిలీప్,తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version