◆-: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, మొగుడంపల్లి మండల్, గుడ్పల్లి గ్రామంలో ఊరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మైనారిటీ కూడా సర్పంచ్ గా పోటీ చేసిన చరిత్ర లేదు కానీ టీఆర్పీ పార్టీ మొగుడంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ లతీఫ్ గారు చరిత్రకి బిన్నంగా ధైరంగా ముందుకు వచ్చి సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది.అలాగే లతీఫ్ గారు గుడ్పల్లి గ్రామ సమస్యల పైన మంచి అవగాహన కలిగిన వ్యక్తి మరియు తనని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామం అభివృధి కోసం ఎంతవరకైనా మరియు ఏ లీడర్ తోనైనా పోరాడి గ్రామ అభివృద్ధి చేస్తాను అని చెప్పడం జరిగింది. లతీఫ్ నామినేషన్ వేసి బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థుల్లో దడ పుట్టించారు, అందుకే బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ వాళ్లు ఎన్ని ప్రలోభాలకు గిరి చేసిన కూడా, ప్రలోభాలను గడ్డి పోస లాగా పక్కన పెట్టి ముందుకు సాగడం చూస్తుంటే ధైర్యం లో తీన్మార్ మల్లన్న గారికి ఏ మాత్రం తీసిపోరు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.ఈ నెల 14-12-2025 రోజున బ్యాగ్ గుర్తుకే ఓటు వేసి లతీఫ్ గారిని గెలిపించాలని వారు ప్రజలను కోరడం జరిగింది.తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో ఉన్న నాయకులు గాని మరియు కార్యకర్తలు గాని ధైర్యానికి ప్రతిరూపమని లతీఫ్ మరొకసారి నిరూపించారు.సర్పంచ్ అభ్యర్థి లతీఫ్ గారికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్, సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి వరప్రసాద్, మొగుడంపల్లి మండల్ అధ్యక్షుడు శీను, మొగుడంపల్లి మండల నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య–ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారి సహకారంతో, గ్రామస్తులందరినీ కలుపుకొని సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
గ్రామాభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలతో పని చేస్తూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, ప్రభుత్వం పెద్దల సహకారంతో మరిన్ని పథకాలు, నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతానని, సేవ చేసే అవకాశం మరోసారి ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
రాంనగర్ కాంగ్రెస్ పార్టీలో రగడ అభ్యర్థి ఎంపికపై వివాదం తీవ్రం
కొత్త వ్యక్తికి ప్రాధాన్యం ఎందుకు? కేడర్‌లో ఉత్కంఠ… ప్రజల్లో అనుమానాలు…
నేటిధాత్రి ఐనవోలు :-
అయినవోలు మండలం రాంనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. గ్రామంలో కష్టపడి పనిచేసిన నాయకులు పక్కనపడిపోగా, కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలని ఉన్నత నాయకత్వం ఆలోచిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్థానిక కేడర్, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పార్టీలోకి కొత్త – మాట నిలకడపై ప్రశ్నలు
అభ్యర్థిగా పరిగణనలో ఉన్న వ్యక్తి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి కావడం ప్రధాన అభ్యంతరంగా మారింది.పార్టీ కోసం కష్టపడిన నాయకులను విస్మరించి, కొత్తగా వచ్చినవారికి అవకాశం ఇస్తారా?” అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక, మాట నిలకడ లేకపోవడం, గతంలో పలుమార్లు పార్టీల మార్పు చేయడం వంటి ఆరోపణలు కోలాహలం సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యం వల్ల గ్రామ ప్రజల్లో కూడా ఆ అభ్యర్థిపై నమ్మకం లోపిస్తున్నట్లు సమాచారం.అంతేగాకుండా గతంలో కొన్ని సి(ఏ)విల్ వివాద విమర్శలు ఉన్నాయి.ఈ అంశం అభ్యర్థి నమ్మకార్హతపై మరో పెద్ద ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేక ఎంపికా??? పార్టీకి సంవత్సరాలుగా కష్టపడిన నాయకులకే టికెట్ ఇవ్వాలి అనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యే బలంగా చెబుతున్నా, కూడా ప్రజాభిప్రాయం ప్రకారం,స్థానిక నాయకులు కొత్తగా వచ్చిన వ్యక్తి పట్ల విశ్వాసం ఎక్కువ గా చూపడం వాస్తవానికి అభ్యర్థి పట్ల ప్రజల్లో విశ్వాసం తక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశం ఉందని నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యేకు తప్పు సమాచారం చేరిందా అనే అనుమానం
అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కొంతమంది నాయకులు తమకనుకూలంగా సమాచారం అందజేస్తున్నారన్న భావన పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. గ్రామ వాస్తవ పరిస్థితులు, ప్రజాభిప్రాయం, కేడర్ కృషి ఈ విశ్లేషణలేవీ స్థానిక ఎమ్మెల్యే నాగరాజు కు వాస్తవ విరుద్ధంగా వెళ్తున్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతర్గత రగడ – ప్రత్యర్థి పార్టీకి లాభమా?
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఈ అంతర్గత తగాదాల వల్ల బిఆర్ఎస్ కు ప్రత్యక్షంగా లాభం కలగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కేడర్లో విభజన, అసంతృప్తి, అంతర్గత రగడ పై కేడర్ అభిప్రాయం ఏమిటంటే..
గ్రామంలో కట్టుబడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.అభ్యర్థి నమ్మకార్హత, క్రమశిక్షణ, గత అనుభవం వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి లేకపోతే రాబోయే ఎన్నికల్లో రాంనగర్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలవచ్చని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
`ఇప్పటికే ఏకగ్రీవాలా పేరుతో కాంగ్రెస్ జెండా రెపరెపలు.
`అధికార పక్షం వైపే చూస్తున్న పల్లెలు.
`అధికారికంగా పార్టీ గుర్తులు లేకపోయినా కాంగ్రెస్ నాయకులు ముందంజలో వున్నారు.
`బీఆర్‌ఎస్ నుంచి పంచాయతీ లలో స్పందన కరువు.
`అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టలేని స్థితిలో బిఆర్‌ఎస్.
`తూతు మంత్రంగా పేర్లు ప్రకటిస్తున్నారు.
`అభ్యర్థులు ఎంపిక తలనొప్పి వద్దనుకున్నారు?
`ఆయా గ్రామాలకే వదిలేశారు.
`అందుకే పేర్లు వెల్లడిరచడానికి బిఆర్‌ఎస్ సిద్దపడడం లేదు.
`గెలిచినా వాళ్ళు బిఆర్‌ఎస్ లో ఉంటారన్నా నమ్మకం లేదు.
`ఇంకా మూడేళ్లు సమయం ఉంది.
`అధికార పార్టీ నాయకుల మాటే చెల్లుతుంది.
`బీఆర్‌ఎస్ పార్టీ ఆశలు నెరవేరా లేదు.
`జనం కాంగ్రెస్ మీద వ్యతిరేకత చూపిస్తున్న సందర్భం కనిపించడం లేదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ పల్లెపోరులో ఏం జరుగుతోంది. పాలక, ప్రతి పక్షాల మధ్య పోరు ఎలా సాగుతున్నది? పై చేయి ఎవరు సాదిస్తున్నారు? అనే ఉత్కంఠ అందరిలోనూ వుంది. కాని క్షేత్ర స్దాయిలో ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేదు. ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత లేదు. ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను నమ్మి ఆ పార్టీ అభ్యర్దులను గెలిపించుకునే పరిస్దితి పెద్దగా కనిపించడం లేదు. ఇది అంతు పట్టని వ్యహారంలా మారింది. నిన్నటి దాక బిఆర్‌ఎస్ చెప్పుకున్నదానికి ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తున్నదానికి సంబధం లేకుండా వుంది. గత ఏడాదిన్న కాలంగా పంచాయితీ ఎన్నికలు పెట్టండి? మా తడాఖా చూపిస్తామంటూ బిఆర్‌ఎస్ రంకెలేసింది? అంతెందుకు ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్‌లో ఓటమి తర్వాత కూడా బిఆర్‌ఎస్ పల్లె మాదే. అక్కడ గెలుపు మాదే. పల్లెల్లో పంచాయితీలు మావే. కాంగ్రెస్‌కు చోటు లేకుండా చేస్తాం. కాంగ్రెస్‌ను తుడిచేస్తాం. పల్లెల్లో కాంగ్రెస్ జెండా కనపడకుండా గెలుస్తాం. అంటూ చెప్పుకున్న గొప్పలకు లెక్కే లేదు. కాని క్షేత్రస్దాయిలో చూస్తే అలాంటి పరిస్దితులు చూస్తే మచ్చుకు కూడా కనిపించడం లేదు. బిఆర్‌ఎస్ చెప్పుకున్నంత సులుగా ఆ పార్టీకి పరిస్ధితులు అనువుగా లేవు. పల్లె పోరులో వరుస విజయ పరంపరలను కొనసాగిస్తున్న కాంగ్రెస్ కూడా ముందంజలో వుంది. ముఖ్యంగా ఏకగ్రీవాలలో కాంగ్రెస్ దూసుకుపోయింది. చాల వరకు కాంగ్రెస్ పార్టీ ఏక గ్రీవాలను సాధించింది. ఇంకా మిగిలిన ఎన్నికల పోరులో సత్తా చూపిస్తామని కాంగ్రెస్ అంటోంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పల్లె పోరులో కూడా దూసుకుపోతోంది. విజయాలు సొంతం చేసుకుంటోంది. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు వుండకపోవచ్చు. కాని పార్టీల అభ్యర్దులుగానే రంగంలో వుంటారు. సహజంగా అందరూ ఇండిపెండెంట్లుగానే పోటీ చేస్తారు. కాని అందరూ ఏదో ఒకపార్టీకి అనుబంధ సభ్యులై వుంటారు. అందుకే ఒక ఊరిలో ఒకే పార్టీకి చెందిన పలువులు వ్యక్తులు పోటీచేస్తారు. అందులో ఏదొ ఒకరిని పార్టీ గుర్తించినట్లు మాత్రమే చెప్పుకుంటారు. అందులో గెలిచిన వారిని కూడా తమ పార్టీయే అని చెప్పుకుంటారు. ఇది సహజం. అలా పోటీ చేసే అభ్యర్ధులలో కూడా కాంగ్రెస్‌కు చెందని వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముందు బిఆర్‌ఎస్ చెప్పిన విధంగా ఆ పార్టీ నుంచి పోటీచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్‌తో పోలిస్తే బిఆర్‌ఎస్ అభ్యర్దులు ఎక్కుగా బరిలో లేరు. వున్నదల్లా ఎక్కువగా కాంగ్రెస్‌కు చెందిన నాయకులే ఎక్కువగా వున్నారు. ఇక్కడే కాంగ్రెస్ విజయాలు దాగి వున్నాయని చెప్పడంలో సందేహంలేదు. అందుకే ఏక గ్రీవాలతో కాంగ్రెస్ ఇప్పటికే గెలుపు ఖాతాలు బాగానే తెరిచింది. గెలిచిన వాళ్లంతా కాంగ్రెస్ అభ్యర్ధులే కావడం గమనార్హం. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం బిఆర్‌ఎస్ అభ్యర్దులు ఏకగ్రీవం అయ్యారు. వారిని చూపించుకొని బిఆర్‌ఎస్ పెద్దగా షో చేస్తోందని చెప్పొచ్చు. కాంగ్రెస్‌కు అలా చూపించుకోవాల్సిన అసవరం లేదు. ఒక దశలో మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసేందుకే సమయం ఇవ్వని కేసిఆర్ ఇప్పుడు ఏకగ్రీవమైన ఓ నలుగురు సర్పంచ్‌లను కూడా కలుసుకునే స్ధితికి చేరింది. ఒక రకంగా ఇది ప్రచారంలో ఓ భాగమని చెప్పుకునే పరిస్దితి వచ్చింది. లేకుంటే గతంలో ఏనాడైనా కేసిఆర్ కనీసం తన నియోజకవర్గ సర్పంచ్‌లను కలిసిన సందర్భం ఒక్కటైనా వుంది. కనీసం ఆయన ఫామ్ హౌజ్ దరిదాపులకు రానిచ్చినట్లు వార్తలేమైనా వున్నాయా? ఇప్పుడు ఏకగ్రీవమైన సర్పంచ్‌తో కలవాల్సిన పరస్దితులు ఎదురౌతున్నాయి. అదే ప్రజాస్వామ్యం. అదే ప్రజాస్వామ్య గొప్పదనం. ఆ ఏకగ్రీవమైన నాలుగు సర్పంచ్‌లు కూడా కేవలం కేసిఆర్ పామ్ హౌజ్‌కు పక్కనే వున్న గ్రామాలు కావడం కూడా విచిత్రం. లేకుంటే ఆ నాలుగు కూడా బిఆర్‌ఎస్ ఖాతాలో పడేవి కాదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎక్కడ పరువు పోతుందో అన్న ఆందోళనతోనే ఆ నాలుగైదు గ్రామాలను ఏకగ్రీవం చేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అదే తెలంగాణ మొత్తం వున్నట్లు చెప్పుకోవడానికి బిఆర్‌ఎస్ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. కాని క్షేత్ర స్దాయిలో ఆ పరిస్దితులు అసలే లేవు. బిఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటున్నట్లు కూడా కనిపించడం లేదు. ఇక ఘట్టం ముందుంది. నిజం చెప్పాలంటే సాదారణ ఎన్నికలకు మరో మూడు సంవత్సరాల గడువుంది. ఈ మూడు సంవత్సరాలు పంచాయితీలకు నాలుగు రూపాయలు విడుదల కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వాలి. అదే బిఆర్‌ఎస్ సర్పంచ్‌లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లలేరు. నిదులు అడగలేరు. సహజంగ వచ్చే నిధులు గ్రామాభివృద్దికి సరిపోవు. ఎమ్మెల్యే నిధుల నుంచి ఎన్నో కొన్ని నిదులు తేవాల్సి వుంటుంది. తాను సర్పంచ్‌గా వున్న సమయంలో చేసిన అభివృద్ది ఇది అని చూపించుకోవడానికి వుంటుంది. లేకుంటే ఐదేళ్లు చేయడానికి ఏమీ వుండదు. ఆ ఊరికి సర్పంచ్ వున్నారా? అంటే వున్నారు. అనే విధంగా గ్రామ పాలన సాగుతుంది. ఆ సర్పంచ్ పాలన మీద వ్యతిరేతక మొదలౌతుంది. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సంక్లిష్ల పరిస్ధితులు ఎదురైనప్పుడు తప్పని పరిస్దితుల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచినా పాలక పక్షం తీర్దం పుచ్చుకోవాల్సి వస్తుంది. ఒక వేళ ఈ మూడు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోవున్నా, సాదారణ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు వద్దన్నా ఈ సర్పంచ్‌లంతా కాంగ్రెస్‌లో చేరుతారు. చాలా మంది గెలిచిన వెంటనే గ్రామాభివృద్ది కోసం కాంగ్రెస్‌లో చేరుతారు. ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గం అభివృద్ది కోసమంటూ పార్టీలు మారుతున్న సమయం. అలాంటిది సర్పంచ్‌లు మారడం అనేది పెద్ద సమస్య కాదు. అసలు విషయమే కాదు. ఇక బిఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌లు మళ్లీ ఆపార్టీ నాయకులు పెద్దగా పోటీకి ఆసక్తి చూపకపోవడానికి మరో బలమైన కారణం వుంది. గత రెండుసార్లు బిఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌లుగా గెలిచిన వారికి లక్షల రూపాయలు బకాయిలున్నాయి. బిఆర్‌ఎస్ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని నమ్మి పెద్దఎత్తున నిదులు వెచ్చించి గ్రామాభివృద్ది కోసం సొంత నిదులు ఖర్చు చేశారు. అభివృద్ధి పనుల కోసం మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి మరీ పనులు చేపట్టారు. ఆ పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఆ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. ప్రజా ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బకాయిలు చెల్లించలేదు. దాంతో వారి రాజకీయం ఏనాడో తలకిందులైంది. వారిని కదిలిస్తే బోరున ఏడ్వడం తప్ప మరేమీ వుండదు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలంటే కలలో కూడా భయపడే పరిస్దితి వచ్చింది. ఎన్నికంటేనే భయపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలంటే ఆమడ దూరం పారిపోతున్నారు. పార్టీలకో దండం, పదవికో దండం అని అంటున్నారు. గతంలో మేం చేసిన పనులకు బకాయిలు వస్తే అదే మాకు చాలు అంటున్నారు. ఒక్కసారి సర్పంచ్ అయిన పాపానికి చేసిన అప్పులకు ఆస్ధులు అమ్ముకున్నాం. ఇక చాలు ఈ రాజకీయాలు. ఇక చాలు సర్పంచ్ పదవులు అని చెబుతున్నారు. అందుకే బిఆర్‌ఎస్ నాయకులు సర్పంచ్ ఎన్నికలు అంటేనే దండం పెడుతున్నారు. మమ్మల్ని పార్టీ ఉద్దరించింది చాలు అంటూ ఆ పార్టీ నాయకుల ముఖం మీదే మాజీ సర్పంచ్‌లు చెబుతున్నారు. అంటేనే బిఆర్‌ఎస్ పరిస్దితి అంచానా వేయొచ్చు. ఆ పార్టీ దుస్దితిని అర్దం చేసుకోవచ్చు. ఇది కూడా కాంగ్రెస్‌కు వరమైపోయింది. పల్లెలన్నీకాంగ్రెస్ ఖాతాలో పడేందుకు దారి చూపింది. కాగల కార్యం గందర్వులే తీర్చినట్లైంది. పోటీలో వుంటారనకున్న బిఆర్‌ఎస్ నాయకులు పక్కకు తప్పుకోవడంతో కాంగ్రెస్ గెలుపుకు అడ్డు లేకుండాపోయింది. పల్లెల్లో కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొత్త రామప్ప మృతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
◆:- మాజీ మంత్రివర్యులు,జహీరాబాద్ ఇంచార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు నివాళి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గుంతమర్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొత్త రామప్ప మృతి చెందిన వార్త తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ. చంద్రశేఖర్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రామప్ప సేవలను ఆయన స్మరించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ గారు, నాయకులు మోహన్ రెడ్డి గారు, సంగారెడ్డి గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గ్రామ పంచాయతీల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు… తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు అధికారికంగా నియామకం చేసినట్లు కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య తెలిపారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల వారి పేర్లు మరియు గ్రామపంచాయతీ పేర్లు జాబితా .. ! కుంజ బిక్షపతి కోనాపురం గ్రామపంచాయతీ ఆలూరి కిరణ్ సాధిరెడ్డిపల్లి,వాసం నరసమ్మ ఎంచగూడ, వంక రామయ్య మొండ్రాయి గూడెం,గట్టి కొమ్మక్క గుండం,గట్టి రాములు ఓటాయి, మాలోత్ మంజుల రేనియా తండా,గొంది సోనీ జంగవానిగూడెం,దనసరి ముత్తయ్య ఎదుల్లపల్లి, వజ్జ శైలజ దుర్గారం, బానోతు దేవేందర్ ముష్మి, తేజావత్ పార్వతి రామన్నగూడెం,ఇర్ప రనిత గోవిందాపురం ఈక శ్రీనివాస్ పెగడపల్లి నునావత్ వీరన్న పోగుళ్లపల్లి, వజ్జ అక్షయ్ వర్మ వేలుబెల్లి,నూనావత్ స్వామి చెరువు ముందు తండా, ఈసం పుష్పలత,బత్తులపల్లి వట్టం శ్రీనుబాబు, గోపాలపురం, తాటి వసంత, తాటి వారి వేంపల్లి, సుంచ సిరివెన్నెలకార్లయి, తొలేం అనంతరావుగుంజేడు, మల్లెల భాగ్యమ్మ కొత్తగూడ త
స్థానిక ఎన్నికల్లో మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోసే కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ కావాలా లేక ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడే బీజేపీ కావాలా *
డా జాడి రామరాజు నేత
ఏటూరునాగారం, నేటిధాత్రి
సోమవారం రోజున కన్నాయిగూడెం మండలని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోస్తూ జేజేలు కొడుతూ రాక్షస నందం పొందుతున్న బి ఆర్ ఎస్ కాంగ్రెస్ నాయకులు కావాలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా బీజేపీ పార్టీ కావాలో కన్నాయిగూడెం మండల ప్రజలు ఆలోచించాలని అన్నారు అదేవిదంగా గత పదిసంత్సరాలు అధికారం లో బ్యాంకు లను దోపిడీ చేసి లబ్ది దారుల దగ్గర లక్షకు 40వేలు తీసుకున్నా నాయకులు కావాలా లేక బిల్డింగ్ లు పూర్తి చెయ్యకుండానే డబ్బులు డ్రా చేసుకున్నా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కావాలో ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు అదేవిదంగా 2019లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులను కన్నాయిగూడెం మండలానికి తీసుకొచ్చి స్థానిక నాయకున్ని ఓడించి రాక్షస నందం పొందుతూ మండల పరిషత్ నిధులను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే తెలుసుకోవాలని అన్నారు ఇప్పటికైనా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాక్షస నందం పొందుతున్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ లకు స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు
అధికారులు, క్రషర్ దొంగలు కలిసి కాలేశ్వరం ముంచారు?
క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఎన్ని క్రషర్ల కంకర ను తిరస్కరించింది?
-అసలు దొంగలు కంకరగాళ్ళు, అధికారులు!
-వ్యాపారం చేసుకుంటాం గుట్టలు కావాలని అడిగారు?
-ఇసుక తయారీ కోసం కలెక్టర్లు కొందరికి గుట్టలు కేటాయించారు?
-ఆ గుట్టలనుంచి మోసగాళ్లు కంకర తయారుచేశారు?
-వరంగల్ గుట్టల రాళ్లతో కంకర తయారీ సాధ్యం కాదు!
-కంకరకు నాణ్యమైన కొండలు అసలే కావు!
-ఆ రాళ్లు ఏఇంటి నిర్మాణానికి కూడా పనికి రావు.
-కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా అధికారులు అంగీకరించారు?
-అధికారులతో కుమ్మక్కై ప్రాజెక్టులకు పనికి రాని కంకర ఎంతమంది సరఫరా చేశారు?
-అధికారుల మీద నమ్మకంతో ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థలు విశ్వసించ్చాయి!
-కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయేదాకా వచ్చాయి!
-రాతి ఇసుక తయారీ గుట్టల నుంచి కంకర తయారు చేసి దొంగల్లా సరఫరా చేశారు!
-ఇప్పుడు సుద్దపూసల్లా మాకేం సంబంధం అంటున్నారు!
-జిల్లా కలెక్టర్లు గుట్టలు కేటాయించింది కంకర కోసం కాదు!
-అందరి కళ్ళు గప్పి కంకర సరఫరా చేశారు.
-రాజేంద్రనగర్ క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఆదేశాలు ఎవరు తుంగలో తొక్కారు!
-నాసి రకం కంకర వాడేలా అధికారుల మీద ఒత్తిడి తెచ్చిన నాయకులెవరు?
-రాజేంద్రనగర్ క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఎన్ని క్రషర్ల కంకర తిరస్కరించింది?
-కులం పేరు అడ్డుపెట్టుకొని కంకర సరఫరా చేసింది ఎవరు?
-ఇసుక తయారీకి గుట్టలు తీసుకొని నాసిరకం కంకర సరఫరా చేసిన ఘరానా గాళ్ళు ఎవరు?
-ఆ వ్యక్తులకు సహకరించిన నాయకులెవరు?
-అధికారులను ఒత్తిడి చేసింది ఎవరు?
పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలు కొన్ని సార్లు పెద్ద సమస్యలు సృష్టిస్తాయి. నష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. తెలంగాణలో గత ప్రభుత్వం నిర్మాణం చేసిన బారీ ప్రాజెక్టు కాళేశ్వరంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది. సహజంగా పెద్ద, చిన్న ప్రాజెక్టులేవైనా సరే నిర్మాణం సంస్థలను ప్రభుత్వాలు నమ్ముతాయి. రాజకీయాలు ఎలా వున్నా ఆ సంస్థల నిర్మాణాలను ప్రభుత్వాలు నమ్ముతాయి. ఆ నిర్మాణ సమయంలో నిర్మాణ సంస్దలు పూర్తిగా అధికారుల మీద ఆదారపడుతుంటారు. నిర్మాణ సంస్దలకు సంబందించిన క్వాలిటీ చెకింగ్ ఉద్యోగులున్నప్పటికీ ప్రభుత్వ అదికారుల నిర్ణయమే ఫైనల్ అవుతుంటుంది. అదే కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలకు తావిచ్చింది. కొంత మంది ఉద్యోగుల మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటికే మోసం వచ్చింది. నీతి, నిజాయితీగా వుండాల్సిన అధికారులు అవినీతికి ఆశపడ్డారు. కొంత మంది మోసగాళ్లకు కింది స్దాయి పనులు అప్పగించారు. అయితే నిర్మాణాల విషయంలో సహజంగా కంకర అనేది చాలా ముఖ్యమైనది. కాని ఆ కంకర విషయంలోనే అదికారులు నిర్లక్ష్యం చేశారు. కొత్త కొత్త టెక్నాలజీని అడ్డం పెట్టుకొని నాసిరకం కంకరను అధికారులు ఓకే చేశారు. అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల కాంట్రాక్టు కంపనీలు ఆ కంకర నాణ్యమైదే అనుకొని నిర్మాణాలకు ఉపయోగించారు. ఆ నిర్మాణ సంస్ధలు కంకర సరఫరా చేసిన వారికి తక్కువ ధర చెల్లించలేదు. నాణ్యమైన కంకరకు చెల్లించాల్సినంత సొమ్ము చెల్లించారు. కాని కంకర సరఫరా చేసిన వాళ్లు మాత్రం నాసి రకం కంకర సరఫరా చేశారు. ఇది అధికారులకు తెలుసు. కంకర సరఫరా చేసిన వారికి తెలుసు. అటు అధికారులు, ఇటు కంకర సరఫరా చేసిన మోసగాళ్లు కలిసి నమ్మిన నిర్మాణ కంపనీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ప్రభుత్వాన్ని విశ్వాసాన్ని నిండా కాళేశ్వరం నీళ్లలో ముంచేశారు. అయితే ఆ కంకర ఎవరు సరఫరా చేశారు? ఎందుకు సరఫరాచేశారు? ఆ మోసగాళ్లకు ఎవరు అనుమతులిచ్చారు? ఎందుకిచ్చారు? వారికి అనుమతులు ఇవ్వడం వెనుక ఎవరున్నారు? ఎంత పెద్ద నాయకులు ఒత్తిడి చేశారు? ఖచ్చితంగా మోసగాళ్ల కంకరే సరఫరా చేసేలా ఎవరు చర్యలు తీసుకున్నారు? నాసిరకం కంకర సరఫరా చేసిన వారి వెనుకు వున్న బిఆర్‌ఎస్ నాయకులు ఎవరు? అసలు ఆ నాసిరకం కంకర క్రషర్లు ఎవరివి? ఆ క్రషర్ల యజమానులు ఎవరు? బి ఆర్‌ఎస్ నాయకులకు వున్న ఆ నాసిరకం కంకర క్రషర్లు ఎన్ని? ఆనాటి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఎంత? ఎంత మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు నాసిరకం కంకర క్రషర్లు వున్నాయి? అనేది తేల్చితే అసలు గుట్టంతా రట్టవుతుంది. ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన విషయాలు అనేకం వున్నాయి. వరంగల్ జిల్లాలో కంకర సరఫరా చేసేంత నాణ్యమైన గుట్టలు, కొండలు లేవు. అవన్నీ ఎర్రరాయి కొండలు. ఆ రాయి నుంచి తయారు చేసే కంకర నాణ్యమైనది అసలే కాదు. అది పూర్తిగా నాసిరకం కంకర? ఆ గుట్టలు కొండలు, పెద్ద పెద్ద బండరాళ్లతో కూడినవి కాదు. కేవలం చిన్న చిన్న గుండ్లతో కూడిన ఎరుపు రంగు రాళ్లు. కనీస నల్ల రాళ్లు కూడా కాదు. అలాంటి ఎరుపు రాళ్లతో కంకర తయారు చేయడం వల్ల వాటిలో ఎలాంటి నాణ్యత వుండదు. కాని ఆ కొండలను తవ్వి, అక్కడే క్రషర్లు ఏర్పాటు చేసి కొంత మంది మోసగాళ్ల కంకర తయారు చేశారు. దీని వెనుక పెద్ద బాగోతమే వుంది. కొంత మంది రాజకీయ పార్టీలకు చెందిన వాళ్లు, వ్యాపారం కోసం గుట్టలను కేటాయించమని అప్పటి కలెక్టర్లుకు దరఖాస్తులు చేసుకున్నారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అనేక రకాలైన ప్రాజెక్టుల మూలంగా ఇసుక కొరత ఏర్పడే ప్రమాదం ఎదురౌతుందని ప్రభుత్వం గ్రహించింది. అందుకోసం మట్టితో కూడుకున్న కొన్ని కొండలను, గుట్టలనుంచి ఇసుక తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఆ గుట్టల నుంచి ఇసుక తయారు చేసే వారికి వాటిని అప్పగించేందుకు అనుమతులు జారీ చేసింది. ఆ అవకాశాన్ని అదునుగా చేసుకొని కొంత మంది అక్రమార్కులు ఆ కొండలను లీజుకు తీసుకున్నారు. ఇసుక తయారు చేస్తామని ప్రభుత్వాన్ని నమ్మించారు. తమకు ఆ గుట్టలను అప్పగించాలని కలెక్టర్లకు దరఖాస్తులు చేసుకున్నారు. అలా అనుమతులు పొందిన గుట్టల నుంచి ఇసుక తయారు చేయాల్సిన వాళ్లు కంకర తయారు చేశారు. చిన్న చిన్న రాళ్లు, రప్పలను కంకరగా మార్చారు. ఆ కంకరను కాళేశ్వరం ప్రాజెక్టుకు సరఫరా చేసే ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఈ కంకరను రాజేంద్రనగర్‌లో వున్న క్వాలిటీ కంట్రోల్ బోర్డుకు పంపించారు. అక్కడ ఆ కంకరను టెస్టింగ్ చేసిన అదికారులు ఎట్టిపరిస్దితుల్లోనూ ఆ కంకర ప్రాజెక్టులకు వినియోగించొద్దని హెచ్చరించింది. ఆ కంకర పూర్తిగా నాసిరకమైందని తేల్చింది. ఆ కంకర వినియోగిచొద్దని సూచించింది. కాని అధికారుల క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఆదేశాలను పెడచెవిన పెట్టింది. వారి నిర్ణయాలను పక్కన పెట్టింది. మోసగాళ్లతో అధికారులు చేతులు కలిపారు. కొంత మంది అధికారులు ఈ కంకరను ఒప్పుకోకపోతే ఆ అక్రమార్కులు పెద్దపెద్ద నాయకులతో బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. దాంతో అదికారులు కూడా నాయకుల ఆదేశాలను పాటించారు. అధికారులు వినకపోతే నాయకులు ఏం చేస్తారో వారికి తెలుసు. దాంతో అధికారులు కూడా కొంత మంంది ఎమ్మెల్యేలు, నాయకుల ఒత్తిళ్లతో ఆ నాసిరకం కంకరను సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విచ్చలవిడిగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన గుట్టల నుంచి నాసిరకం కంకర సరఫరా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ కంకరతో జరిగిన నిర్మాణాలలో లోపాల కారణంగానే కాళేశ్వరంలోని పిల్లర్లు కుంగాయని తెలుస్తోంది. ఆ కంకర సరఫరా చేసిన వారిలో గత ప్రభుత్వ పెద్దల కులానికి చెందిన అక్రమాలర్కులున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆ క్రషర్లను ఏర్పాటు చేశారు. మొత్తం మీద దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు కాళేశ్వరం నిధులు వేల కోట్లు పంచుకున్నారు. నాసిరకం కంకర సరఫరా చేశారు. ఇప్పుడు మాకేం తెలుసు. మేం సుద్దపూసలమన్నట్లు ఆ నాసిరకం కంకర సరఫరా చేసిన అక్రమార్కులు అంటున్నారు. పైగా తాము మాత్రమే ఆ నాసిరకం కంకర సరఫరా చేశామా? ఇంత ఎంతో మంది అలాంఇ కంకరే సరఫరా చేశారని కూడా వాళ్లే చెబుతున్నారు. అంటే ఇదంతా ఒక పథకం ప్రకారమే నాసిరకం కంకర సరఫరా చేసినట్లు అర్ధమౌతోంది. ప్రభుత్వం ఈ దిశగా విచారణ మొదలు పెడితే దోషులను గుర్తించడం చాలా తేలికౌతుందంటున్నారు. గత ప్రభుత్వ పెద్దలకు బంధువులుగా చెప్పుకునే కొంత మంది అక్రమార్కులే అదికారులతో చేతులు కలిపి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని తెలుస్తోంది. అందులో వున్నవి చిన్న చిన్న తలకాయలు కాదు. పెద్ద పెద్ద తలకాయలే వున్నాయి. అసలు ఆ కంకరను ఎందుకు సరఫరా చేశారు? ఎవరు చేయమన్నారు? అధికారులు ఎవరికి లొంగిపోయారు? ఎందుకు లొంగిపోయారు? నిర్మాణ సంస్ధను ఎలా మోసం చేయగలిగారు? క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఆదేశాలను అంత దైర్యంగా ఎలా ఉల్లంగించారు. చిన్న చిన్న పిట్టగోడల నిర్మాణాలకు కూడా వినియోగించుకోలేని నాసిరకం ఎర్ర కంకరను అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించారనేది తేలాల్సిన అవసరం వుంది. నాసిరకం కంకర నుంచి తీగ లాగితే డొంకంతా కదుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ దిశగా విచారణ చేయిస్తే మొత్తం బండారం బైటకు వస్తుందంటున్నారు.
బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు
◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. . ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు మాజి సర్పంచ్ కృష్ణ, మాజి ఎంపీటీసీ బాబు,గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి వార్డ్ మెంబర్ లు ఆడివయ్య,ప్రవీణ్,డైరెక్టర్ సాయిలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తల్లారి రవి కుమార్,ఆనందం,సురేష్, గోపాల్,మల్లేశం,అశోక్, యాదవులు తదితరులు ఉన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
కట్కూరి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
పరకాల,నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకునే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచులను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామాలలో అత్యధికంగాఎగరవేయాలని వారి గెలుపు కొరకై ప్రతి ఒక్కరు పని చేసే విధంగా ముందుండాలని మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అన్నారు.మండలంలోని అలియాబాద్,వెల్లంపల్లి గ్రామాలలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై అయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే రీతిలో కృషి చేస్తున్నారని,పరకాల నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి కోసమే పనిచేసే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అన్ని వర్గాలకు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి చేపడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల సమన్వయ కమిటీ సభ్యులు నలుబోలు కిష్టయ్య, కొత్తపల్లి రవి,బొజ్జం రమేష్, అల్లం రఘు నారాయణ, దుగ్యాల రాజేశ్వరరావు, ఇనుగాల రమేష్,తక్కలపల్లి స్వర్ణలత జీవన్,పల్లెబోయిన శ్రీనివాస్,ఎఎంసి డైరెక్టర్ పెండ్యాల కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యం,విజేందర్ రెడ్డి, మహేందర్,శ్రీనివాస్, విజేందర్,పెండ్యాల రమేష్, అలియాబాద్,వెల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
– ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషించాలి
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పంపించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారము ఘనంగా ప్రారంభించారు. ఈ కరపత్రాల ద్వారా కాంగ్రెస్–బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన దొంగ హామీలు, అమల్లో పెట్టని సంక్షేమ వాగ్దానాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ “ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందించి, ప్రజల నుండి సంతకాలు సేకరించాలని బండి సంజయ్ సూచించారన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిరిసిల్లలో ప్రతి కార్యకర్త చురుకగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడం రవి, శేఖర్, అభి రామారావు విజయ్, ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కౌసల్య, లత, రేఖ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
️ ఇంటింటికీ కరపత్రాల పంపిణీ & సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉదయం 8:00 గంటల నుండిఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
జారీ చేసిన వారు: దుమాల శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ – సిరిసిల్ల
తెలంగాణలోని రైస్ మిల్లర్ల మధ్య సమన్వయం..సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కల సాకారమైంది. అది కూడా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చొరవ వల్ల సాధ్యమైంది. మిల్లర్ల సమావేశం తర్వాత మంత్రి నేటి దాత్రి ఎడిటర్ కట్టా రాఘవేర్రదరావుతో ఈ సమావేశ వివరాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఈ బేటీ వల్ల మిల్లర్లకు ఇచ్చిన ఆదేశాలు, చేసిన సూచనలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎడిటర్ రాఘవేంద్రరావుకు వివరించారు. మంత్రి ఉత్తమ్‌తో సమావేశం మూలంగా మిల్లకు ఇంత కాలంగా లేన ఒక భరోసా కల్పించినట్లైంది. ఎంత కాలంగా వాళ్లు ఎదురుచూస్తున్నట్లు వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఏర్పడిరది.ఉభయ వర్గాల మధ్య వున్న అపోహలు కొన్ని తొలగిపోయాయి. ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి తెలంగాణలోని మిల్లర్ల అసోసియేషన్ నాయకుల మధ్య సమావేశం జరిగింది. అది కూడా ఆహ్లదకరమైన సందర్భంలో చోటు చేసుకున్నది. ఎందుకంటే ఇంత కాలం తెలంగాణలోని రెండు రకాల మిల్లర్లు ప్రభుత్వంతో చర్చల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే అప్పుడప్పుడు బాయిల్డ్ రైస్ మిల్లుల యూనియన్ నాయకులతోనే ప్రభుత్వం సమావేశమౌతూవుండేది. దాంతో రా రైస్ మిల్లర్ల అసోసియేషన్‌లో ఓ వెలితి వుండేది. వారి సమస్యలు చెప్పుకునే వీలు లేకుండా వుండేది. ఎందుకంటే రా రైస్ మిల్లర్ల సమస్యలు వేరు. బాయిల్డ్ రైస్ మిల్లర్ల సమస్యలు వేరు. ప్రభుత్వాలు ఎంత సేపు బాయిల్డ్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులతోనే సంప్రదింపులు జరుపుతుండేవారు. వారు తమకున్న సమస్యలు అటు కమీషన్‌ర్‌కు, ప్రభుత్వ వర్గాలకు తెలియజేస్తూ వుండేవారు. కాని అక్కడ రా రైస్ మిల్లర్ల సమస్యలు ప్రస్తావనకు వచ్చేవి కాదు. తొలిసారి పన్నెండేళ్ల తర్వాత ఆ చొరవ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీసుకున్నారు. దాంతో రెండు రకాల యూనియన్‌సభ్యులు మంత్రితో సమావేశమయ్యారు. వారికున్నసమస్యలు మంత్రికి వివరించారు. వారి సమస్యలు సానుకూలంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విన్నారు. ప్రభుత్వం మిల్లర్లకు పూర్తి సహాకారం అందిస్తోంది. కాని కొంత మంది మిల్లర్లు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చారు. నీతిగా, న్యాయంగా, నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని మంత్రి మిల్లర్లకు సూచించారు. ఒక రకంగా ఆదేశించారు. సమస్యలు తెచ్చుకోవద్దు. సమస్యలు సృష్టించొద్దు. ప్రభుత్వాన్ని మోసం చేయొద్దన్న విషయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిల్లర్లకు సూటిగా స్పష్టంగా చెప్పారు. తప్పులు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని కూడా మంత్రి మిల్లర్లను హెచ్చరించారు. మిల్లర్లకుఎలాంటి సమస్యలున్నా వినడానికి, తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా వుంటుందని కూడా మిల్లర్లకు మంత్రి మాట ఇచ్చారు. అయితే ఇది తొలి సమావేశం కావడంతో పూర్తి స్దాయి చర్చలు జరగలేదు. మిల్లర్లు వారి పూర్తి సమస్యలు చెప్పలేదు. మళ్లీ ఒకసారి సమావేశం ఏర్పాటుకు మంత్రి హమీ ఇచ్చారు. అందుకు అవసరమైన విదివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దాంతో మిల్లర్లలో సంతోషం నిండిరది. రెండు రకాలైన మిల్లర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాకముందు మిల్లులు తక్కువ. అందులోనూ రా రైస్ మిల్లులు చాలా తక్కువ. తెలంగాణలో ఉమ్మడిరాష్ట్రంలో బాయిల్డ్ రైస్‌మిల్లులే ఎక్కువగా వుండేవి. దాంతో ఆది నుంచి వాటి ఆదిపత్యమే కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే తెలంగాణలో పంటలు పుష్కలంగా పండడం మొదలైందో అప్పటి నుంచి తెలంగాణలో వందల్లో వున్న రా రైస్ మిల్లులు వేల సంఖ్యకు చేరాయి. పైగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పేదలందిరికీ రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులు సన్న బియ్యం పండిరచేందుకు పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రతి సీజన్‌లోనూ రైతులు పండిరచే వడ్లకు మద్దతు ధరను చెల్లిస్తూనే గత రెండు సంవత్సరాలుగా ప్రజా ప్రభుత్వం రైతులకు బోనస్ కూడా చెల్లిస్తోంది. దాంతో రైతులంతా సన్న బియ్యం పండిరచేందుకు ముందుకొచ్చారు. రికార్డు స్దాయిలో వడ్లు పండిస్తున్నారు. వాటిని తెలంగాణలోని రా రైస్ మిల్లుల ద్వారా ఆడిరచి పేదలందరికీ ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోంది. ఇలాంటి పరిస్దితులో మిల్లర్లు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి సరిపడా వడ్లు కేటాంపులు వంటి అనేక సమస్యలున్నాయి. వాటిని ప్రభుత్వం ముందు వుంచేందుకు గత ప్రభుత్వంలో ఎంతో ప్రయత్నం చేశారు. కాని ఆ ప్రభుత్వం అప్పుడు వాళ్లను పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం రా రైస్ మిల్లర్ల సమస్యలు తీర్చేందుకు సిద్దంగా వుంది. ముందుగా వారితో ప్రభుత్వం సమావేశం కావడమే రా రైస్ మిల్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా బాయిల్డ్ రైస్ మిల్లర్లు కూడా మంత్రితో సమావేశం జరిగినందుకు వాళ్లుకూడా ఎంతో ఆనందంగా వున్నారు. గతంలో బాయిల్డ్ రైస్ మిల్లర్లు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఏ మంత్రి అవకాశమివ్వలేదు. కేవలం కమీషనర్‌కు తమ గోడును వెల్లబోసుకోవడం తప్ప మంత్రుల దర్శనం జరిగింది లేదు. వారితో సమావేశమైంది లేదు. వారి సమస్యలు నేరుగా మంత్రి దృష్టికి తెచ్చే పరిస్దితి ఎదురైంది లేదు. కాని ప్రజా ప్రభుత్వంలో నేరుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశం జరిగింది. అందుకు బాయిల్డ్ రైస్ మిల్లర్లు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి బాయిల్డ్ రైస్ మిల్లర్లు, రా రైస్ మిల్లర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ప్రధానంగా రెండు మిల్లర్ల మధ్య ఆధిపత్య పోరు కొన్నేళ్లుగా సాగుతోంది. అందులో బాయిల్డ్ మిల్లర్ల యూనియన్‌ది పై చేయిగా వుంటోంది. గత ప్రభుత్వం కూడా వారికే ప్రాదాన్యతిస్తూ వెళ్లింది. కాని రా రైస్ మిల్లర్ల అసోసియేషన్‌ను గత ప్రభుత్వం ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు. బాయిల్డ్ రైస్ మిల్లర్లు చెప్పే సమస్యలు తప్ప తమ సమస్యలు కనీసం కమీషనర్ కూడా చెప్పుకునే అవకాశం లేకుండాపోయింది. బాయిల్డ్ రైస్ మిల్లర్లు చెప్పే సమస్యలు రెండు రకాల మిల్లర్ల సమస్యలుగా ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. కాని ఈ రెండు రకాల మిల్లర్లకువుండే సమస్యలు వేరు వేరన్నది ప్రజా ప్రభుత్వం గుర్తించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశంలో రెండు రకాల మిల్లర్లకు అవకాశం కల్పించారు. దాంతో ఎవరి సమస్యలు వారికి? ఎవరి కష్టాలు వారివి? అనేది తేలిపోయినట్లైంది. ఇకపై ఏక కాలంలో రెండు రకాల మిల్లింగ్ వ్యవస్ధలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అసవరం లేదని గుర్తించినట్లైంది. ఏ వర్గం సాదకబాధకాలు ఆ వర్గానికి చెందిన ప్రతినిధులు మాత్రమే ప్రభుత్వానికి విన్నవించుకునే వెసులుబాటు కల్పించినట్లైంది. అందుకు ప్రతి మిల్లర్ ప్రభుత్వానికి రుణపడి వుంటామంటూ మిల్లర్ల అసోయేషన్ల ప్రతినిధులు నేటిదాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్ర రావుతో చెప్పారు.
కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు వ్యతిరేకంగా అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మొదటి నుండి బీసీలను కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని చెబుతున్నాడు ఇప్పుడు అదే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరగబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ 9 లో చేర్చడం కోసం కృషి చేయాలి దానికి మద్దతుగా అన్ని పార్టీలు కూడా ద్వంద వైఖరి వీడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి బీసీలకు జరుగుతున్న అన్యాయం విద్య ఉద్యోగ వ్యాపార అన్ని రంగాలలో దామాషా ప్రకారం దక్కవలసిన వాటి కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేము మా కార్యాచరణ మా చిత్తశుద్ధి తో పనిచేస్తున్నాను ప్రజలు అందరు కూడా గమనించి ఈ రెడ్డి వెలమల పార్టీలను బొంద పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్ గండు కరుణాకర్ తీన్మార్ జై అశోక్ శ్రీకాంత్ కిరణ్ పాల్గొన్నారు
-‘‘బీఆర్ఎస్’’ కన్నా మెరుగే అని విశ్వసించినట్లున్నారు
-జూబ్లీ ఎన్నికల ముందున్న ఆలోచనలన్నీ పటా పంచెలు
REVANTH REDDY VICTORY IN JUBLIEE HILLS BY-ELECTION
-ఇక ‘‘సీఎం రేవంత్ రెడ్డి’’కి తిరుగులేదు
-పార్టీలోనూ ఎదురులేకుండా చూసుకున్నారు
-వరుస విజయాలతో దూసుకుపోతున్నారు
-సాధారణ ఎన్నికలు ఒంటి చేత్తో గెలిపించారు
-ఉప ఎన్నికలన్నీ గెలుస్తూ వస్తున్నారు
-పార్లమెంటు ఎన్నికలలోనూ మెరుగైన ఫలితాలు సాధించిపెట్టారు
-ఈ విజయాల పరంపర కొనసాగిస్తే ‘‘రేవంత్ రెడ్డి’’ కి ఎదురుండదు
అంచనాలకు అందని నాయకుడు ‘‘సిఎం. రేవంత్ రెడ్డి’’. రాజకీయంగా స్వయం కృషితో బాటలు వేసుకొని విజయాలు సొంతం చేసుకోవడం ‘‘రేవంత్ రెడ్డి’’ కి కొత్త కాదు. అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీ హిల్స్ CONGRESS కైవసం ఒక చరిత్ర. జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌లో వార్ వన్ సైడ్ చేసి అఖండ మెజారిటీతో అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించారు. దటీజ్ ‘‘రేవంత్ రెడ్డి’’ అని నిరూపించారు. బిఆర్‌ఎస్ ఆశలను పటాపంచెలు చేసి కాంగ్రెస్ కు విజయాన్ని అందించారు. అటు పాలనలో దూసుకుపోతున్నారు. ఇటు పార్టీకి ఎన్నికల వరుస విజయాలు అందిస్తున్న ‘‘రేవంత్ రెడ్డి’’ వ్యూహాలను చేధించడం ఎవరి వల్ల కాదని మరోసారి నిరూపించారు. గెలుపంటే ఇదీ అని రాజకీయాలకే ఒక పాఠం నేర్పి, పార్టీకి మరింత బలాన్ని ‘‘రేవంత్ రెడ్డి (REVANTH REDDY) ’’ పెంచారు. అంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ‘‘రోహిన్ రెడ్డి’’(ROHIN REDDY), నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కాని ప్రతి ఎన్నికను గెలిపించుకోవాల్సిన అవసరం వుంటుంది. అలా ప్రతి ఎన్నికను గెలిపించుకునే నాయకులు చిరిత్ర సృష్టిస్తారు. అందులో సిఎం. రేవంత్ రెడ్డి వుంటారు. ఇది అతిశయోక్తి అసలే కాదు. ఎందుకంటే సిఎం. రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో అందించిన విజయాలు రాష్ట్రంలో అనేకం వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో నమ్మకం కల్గించడంలో రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. తెలంగాణ ఇచ్చినా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో వుంది. అనేక అపజయాలు చవి చూడాల్సి వచ్చింది. అది ఏ ఒక్కరి లోపం కాదు. కాని గెలవలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. అయితే ప్రజల్లో నమ్మకం నింపే నాయకుడు పార్టీలకు కావాలి. పాలకులుగా వుండాలి. ముందు ఏ నాయకుడైనా పార్టీకి ధైర్యం కావాలి. నాయకులకు భరోసా కల్పించే స్దితిలో వుండాలి. ప్రజలకు నమ్మకం కల్గించాలి. పార్టీ మీద ప్రజలకు విశ్వాసం నింపాలి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో వున్నా గెలుపు తీరాలకు చేర్చే పూర్తి భాధ్యతను భుజాన వేసుకునే నాయకుడుగా కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి కల్పించారు. అది సామాన్యమైన విషయం కాదు. అందుకు ఎంతో శ్రమ పడాల్సి వుంటుంది. పార్టీ పెద్దలకు నమ్మకం కల్పించాల్సి వుంటుంది. ఏ రకమైన సవాలునైనా స్వీకరించే స్ధితిలో నాయకుడు వుండాలి. అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తివంతుడై వుండాలి. అవన్నీ సిఎం. రేవంత్ రెడ్డిలో వున్నాయి. అందుకే కాంగ్రెస్‌లో చేరిన అనతి కాలంలోనే ఆయన పార్టీకి పిసిసి. అధ్యక్షుడు కాగలిగారు. పార్టీని గాడిలో పెట్టగలిగారు. ఆనాడు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతి కుటుంబ పెద్దకు ఇంటి సమస్యలుంటాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడు కుటుంబమైనా, రాజకీయ పార్టీ అయినా దారిలో పడుతుంది. అందుకు ఆ పెద్దకు ఎంతో ఓపిక కావాలి. ఒక కుటుంబంలోనే నలుగురు నాలుగు రకాలై ఆలోచనలతో వుంటారు. రాజకీయ పార్టీలో కొన్న లక్షల మంది వుంటారు. అందర్నీ సంతృప్తి పర్చుకుంటూ ముందుకు సాగినప్పుడే పార్టీ నిలబడుతుంది. అని బలంగా నమ్మిన నాయకుడు సిఎం. రేవంత్ రెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్ రెడ్డి ఎవరి అంచనాలకు అందని నాయకుడు. ఆయన వేసే అడుగులు ఎంత బలంగా వుంటాయో…ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు అంతు చిక్క కుండా వుంటాయి. అందుకే తాజాగా గెలిచిన జూబ్లీ బైపోల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ గెలుపొందారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు పరిస్దితి ఎలా వుందో అందిరికీ తెలుసు. కాకపోతే అవన్నీ బిఆర్‌ఎస్ ఊహలు మాత్రమే. ప్రభుత్వం మీద ఎంతో ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లు సోషల్‌మీడియా ద్వారా విసృతంగా ప్రచారం చేశారు. నిండు కుండ తొనకదు అన్నట్లు రేవంత్ రెడ్డి ఎప్పుడూ స్పందించలేదు. బిఆర్‌ఎస్ పార్టీ ఎంత ప్రచారం చేసుకుంటుందో చేసుకోని అని చూశారు. బిఆర్‌ఎస్ అసత్య ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని సిఎం. రేవంత్ రెడ్డికి తెలుసు. బిఆర్‌ఎస్ చేస్తున్న అబద్దపు ప్రచారంలో అర్ధం లేదు. నిజం అంతకన్నా లేదని ప్రజలకు తెలుసు. సిఎం.రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన గుంభనంగా వున్నారు. కాని బిఆర్‌ఎస్ ఎగిరెగిరి పడిరది. ఆఖరుకు ఏమైంది. సిఎం. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. వార్ వన్‌సైడ్ చేశారు. అదీ నాయకుడి గొప్పదనం. బిఆర్‌ఎస్ అనేది ఉద్యమ కాలంలో ఒక రకమైన సెంటిమెంటు, అధికారంలో వున్నప్పుడు అబద్దాలు విసృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు జనాలకు బిఆర్‌ఎస్ అంటే ఏమిటో పూర్తిగా తెలిసిపోయింది. ఆ పార్టీ అంతా పైన పటారం, లోన లొటారం అనేది తెలిసింది. అందుకే జూబ్లీలో ప్రజలు మరోసారి బిఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టారు. అందుకు సిఎం. రేవంత్ రెడ్డి పాలనే నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్‌ఎస్ కన్నా ఎంతో బాగుంది. రేవంత్ రెడ్డి పాలన ఎంతో మెరుగ్గా వుంది. అందుకే బిఆర్‌ఎస్‌కు వీలుకాని ఏ ఉప ఎన్నికలో వీలుకాని మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌ను గెల్చుకున్నది. సిఎం. రేవంత్ రెడ్డి స్వయం ప్రకాశవంతమైన నాయకుడు. స్వయంకృషితో ఎదిగిన నాయకుడు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాలలోకి వచ్చిన నాయకుడు. పేద ప్రజలు కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. ఆశలు తెలుసు. వారి ఆలోచనలు కూడా రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ప్రజలు కూడా మా నాయకుడు. పేదల నాయకుడు అని గుండెల్లో పెట్టుకున్నారు. సమయం వచ్చింది. జూబ్లీ ఉప పోరులో సిఎం. రేవంత్ రెడ్డిపై వున్న మమకారం మరోసారి చూపించారు. రేవంత్ రెడ్డి అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర. జూబ్లీ ఉప ఎన్నికను వార్ వన్ సైడ్ చేసి కాంగ్రెస్ అభ్యర్ది నవీన్ యాదవ్ అఖండ మెజార్టీతో గెవడంలో సిఎం. రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర రాజకీయ పండితులే అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే అభ్యర్ధి ఎంపిక నాడే గెలుపును కాంగ్రెస్ వైపు తిప్పిన నాయకుడు సిఎం. రేవంత్ రెడ్డి. అంత దూరదృష్టితో ఎన్నికలను ఎదుర్కొవడం ఒక్క రేవంత్ రెడ్డికే సాద్యమైంది. ఆరు నెలలుగా బిఆర్‌ఎస్ పెంచుకున్న ఆశలను వారం రోజుల్లో పటాపంచెలు చేసి, కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన నాయకుడు రేవంత్ రెడ్డి. అటు పాలనలో సిఎం. రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇటు ఎదురయ్యే ఎన్నికలను గెలిపించుకుంటూ పార్టీకి వరుస విజయాలు అందిస్తున్నారు. రేవంత్ రెడ్డి రచించే వ్యూహాలు చేదించడం బిఆర్‌ఎస్ వల్ల కాదని మరోసారి నిరూపించారు. తన రాజకీయం ముందు బిఆర్‌ఎస్ రాజకీయాన్ని తుత్తునీయం చేశారు. గెలుపుంటే ఇదీ అని మరోసారి బిఆర్‌ఎస్ గుండెలు అదిరేలా కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన రాజకీయాలకే పాఠం నేర్పిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్ర స్ధాయిలోనే కాదు, జాతీయ స్దాయిలో కూడా సిఎం. రేవంత్‌రెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా తెలంగాణ వైపు చూసేలా చేశాయి. రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్ రెడ్డి పట్టుదల ముందు బిఆర్‌ఎస్ వరుస ఓటములను మూటగట్టుకుంటోంది. జూబ్లీహిల్స్ ప్రజుల సిఎం. రేవంత్ రెడ్డి పాలనకు డిస్టింక్షన్ మార్కులేశారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలన కన్నా సిఎం. రేవంత్‌రెడ్డి పాలన ఎంతో బెటర్ అని నిరూపించారు. సాదారణ ఎన్నికలను ఒంటి చేత్తో సిఎం. రేవంత్ రెడ్డి గెలిపించారు. తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు కాంగ్రెస్‌కు సాదించిపెట్టారు. 8 మంది పార్లమెంటు సీట్లను గెలిపించారు. బిఆర్‌ఎస్‌కు రాష్ట్ర రాజకీయాల్లో చోటు లేకుండా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సున్నా చుట్టేలా చేశారు. తర్వాత వచ్చిన వరుస ఉప ఎన్నికలు గెలిపిస్తూ వస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిపించారు. ఇలా కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తున్నారు. పార్టీకి కొండంత బలాన్ని అందిస్తున్నారు. వరుస గెలుపులను పార్టీకి అందిస్తూ పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి ఉత్తమైన పాలన అందిస్తున్నారు. ఏ ానాయకుడైనా తన పాలన చరిత్రలో నిలిచిపోవాలనే కోరుకుంటారు. అలాగే తనదైన పాలన సాగించేందుకు, తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నందు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం పైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులుమంత్రులు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సానుభూతిపరులను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనకు పట్టం కట్టి వారికి మరింత బలం చేకూర్చాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే సర్కార్ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ వడ్డించనున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారని అని ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామ మజీ కాంగ్రెస్ పార్టీ ఉప్పు సర్పంచ్ గోపాల్ అన్నారు. త్వరలోనే సీఎంతో చర్చించి పథకాన్ని అమలు చేస్తామన్నారని. నర్సాపూర్ గ్రామ మజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజవర్గానికి రేపు ఎన్నిక జరుగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలనుు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలింపు ప్రక్రియ మొదలైంది. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు.
3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగనుంది. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సమస్యత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాగా.. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైన ఉప ఎన్నికలో గెలవాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి మరి.
జాతీయ గేయం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు,(1875 నవంబర్ 7 న వందేమాతరం గేయం, రచించిన బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉరకలేసింది. మార్కెట్ ఆవరణలో, పాఠశాలల్లో, కాలనీల్లో, ప్రజా వేదికలపై వందేమాతరం గీతాలాపన ప్రతిధ్వనించింది. పల్లె నుంచి పట్టణం దాకా “వందేమాతరం” నినాదాలు మారుమ్రోగాయి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తల్లి భారతమాతకు వందనములు అర్పించారు. నెక్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గేయాన్ని ఆలపించారు. తమ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల వేదికపై నిలిచి గీతం పాడిన పూర్వ విద్యార్థులు మాణిక్యం తొ పాటు సీఐ సన్నాయిల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. “వందేమాతరం 150వ వసంతం మనందరికీ గౌరవ దినం” అంటూ వారు గర్వంగా తెలిపారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈడునూరి సాయికృష్ణ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ వందేమాతరం కేవలం గేయం కాదు, ఇది దేశాత్మక గౌరవానికి ప్రతీక. తల్లి భారతమాతకు మన అర్చన.” అని అన్నారు. పిల్లలు జాతీయ పతాకాలతో ఊరంతా దేశభక్తి నినాదాలు చేశారు. సంస్కృతి, భక్తి, ఐక్యత సమన్వయమై నెక్కొండ మొత్తం “వందేమాతరం” స్వరంతో మార్మోగింది.
* మీర్జాగూడలో రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ •ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకుండా ప్రారంభోత్సవాలు * ఎమ్మెల్యే బాటలోని ఆయన అనుచర గణం * నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటున్న పట్టింపులేని ఎమ్మెల్యే •అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాలే యాదయ్య •ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కాలే యాదయ్య •మాజీ ఎమ్మెల్యేగా మారెందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న ప్రజలు
చేవెళ్ల, నేటిధాత్రి:
అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనివున్నట్లు చేవెళ్ల నియోజకవర్గం ఓటర్ల దుస్థితి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కాలే యాదయ్య నియోజకవర్గ ప్రజల్ని నిండా ముంచుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తన ఆస్తులను, పదవిని కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని స్థానిక ప్రజలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికై పార్టీలు మారినట్లు చెబుతున్న ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, నియోజకవర్గ ప్రజలు వరుసగా మూడు సార్లు కాలే యాదయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓరగబెట్టింది ఏమి లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* ఘోర రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ
హైదరాబాదు బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల నియోజకవర్గం మీర్జాగూడ వద్ద ఈనెల 3వ తేదీన సోమవారం ఉదయం 6.15 గంటలకు ఘోర రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగితే తాఫీగా అందరూ వచ్చాక 9 గంటలకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకు స్థానిక ప్రజల నుంచి నిరసనసెగ తగిలింది. ఈ ప్రమాదానికి కారణం గత 10ఎళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులే కారణమంటూ ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానిక ప్రజలు అడ్డంగా నిలదీశారు. 2018 లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా మీరేం చేశారని ఎమ్మెల్యేను స్థానికులు సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే మీరేం చేస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారని స్థానికులు నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఓ సందర్భంలో ఎమ్మెల్యే పై స్థానిక ప్రజలు రాళ్లుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక నోరు మెదపకుండా సైలెంట్ గా అక్కడి నుంచి పారిపోయాడు. గత ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నియోజకవర్గ ప్రజల నుంచి పలు గ్రామాల్లో నిరసన సెగ తగిలింది. అయినగాని ఎమ్మెల్యే కాలే యాదయ్యలో ఎలాంటి మార్పు రాదని వచ్చే ఎన్నికల్లో కాలే యాదయ్య మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
•శవాల మీద ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
ఒకవైపు నియోజకవర్గం ప్రజలంతా ఘోర రోడ్డు ప్రమాదంలో 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయి తీవ్ర ఆవేదనలో శోకసంద్రంలో ఉంటే అదేమీ పట్టనట్లు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తో కలిసి షాబాద్ మండలంలో పలు ప్రారంభోత్సవాలు చేశారు.ఈ ఘోర రోడ్డు ప్రమాదం వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్తు దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రజలందరినీ కలిచివేయటం, అందరు దిగ్బ్రాంతికి గురై శోక సంద్రంలో మునిగిపోయారు. ఓవైపు శవాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అవుతుండగానే మానవత్వం లేని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆయన అనుచరులతో కలిసి మానవత్వాన్ని మంట కలిలిపేలా షాబాద్ మండల పరిధిలో మాచన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్, పునరుద్ధరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, పార్కును ప్రారంభించారు. అనంతరం పార్కులో ప్రారంభమైన క్రీడా పరికరాలపై విన్యాసాలు చేస్తూ ఆనందం పొందారు.
•రంగులు మార్చడంలో మమ్మల్ని మించిన వారే లేరయ్యా.
చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగులు మార్చడంలో మిమ్మల్ని మించిన వారే లేరయ్యా అన్న ధోరణిలో, విశ్వదాభిరామ వినురవేమా అని వేమన పద్యాన్ని నిజం చేశారు.కేవలం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీల జెండాలను మార్చటంలో తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య చరిత్ర సృష్టించారు.వరుసగా మూడుసార్లు కాలే యాదయ్యను నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడుసార్లు పార్టీలను మార్చి తమ ఆస్తులను, పదవులను కాపాడుకునేందుకే,అవకాశవాద రాజకీయాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇది నియోజకవర్గ ప్రజల పాలిట శాపంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కేఎస్ రత్నం కూడా ఊసరవెల్లిలా తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి బిజెపి పార్టీల జెండాలను మార్చి చరిత్ర సృష్టించారు. మరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలే యాదయ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందగా, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేన భీమ్ భరత్ పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలా గెలుపొందిన మూడుసార్లు అధికార పార్టీలో లేకుంటే తన ఆస్తులు, పదవులను కాపాడుకుకోలేననే భయంతోనే రంగులు మార్చడంలో ఒకరిని మించి ఒకరు తయారయ్యారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గత 20 ఏళ్లుగా,నాలుగు పర్యాయాలు చేవెళ్ల నియోజకవర్గం (ఎస్సీ)నుంచి ప్రాతినిధ్య ఊహించిన ఇద్దరు (మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య) ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ ఆదర్శంగా నిలిచారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో వారి ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలపై ప్రేమతో కాదని నియోజకవర్గ ప్రజలు బల్లగుద్ది చెబుతున్నారు.
•ఎమ్మెల్యే కాలే యాదయ్య ఏపార్టీలో ఉన్నారో బహిరంగ ప్రకటన చయాలి
బీఆర్ఎస్ పార్టీ భీ పామ్ పై గెలుపొందిన ఎమ్మెల్యే కాలే యాదయ్య అసలు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా…? లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కోనసాగుతున్నరో నియోజకవర్గ ప్రజలకు బహిరంగ ప్రకటన చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో కోనసాగితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపుల్లో ఎందుకు పాల్గొనటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపార్టీ కండువాలు వేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతుండగా మరి ఆయన ఎందుకు కాంగ్రెస్ కండువా వేసుకోవటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేను ఈసారి ఇంటి బాట పట్టిస్తామని ఓటర్లు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధికై తమ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు భగవంతుడు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించి హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు! 25 లక్షల ఫేక్ ఓట్లంటూ..
రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు (Rahul Gandhi Vote Chori Allegations). కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.
హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల ఓట్లు నకిలీవే’ అంటూ ఢిల్లీలో తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. తన బృందం 5.21 డూప్లికేట్ ఓటన్లు గుర్తించిందని అన్నారు. హర్యానాలోని ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీనేనని స్పష్టం చేశారు (Haryana Assembly Elections Fraud allegations). తన ఆరోపణలపై ఓ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఒక బ్రెజిల్ నటి ఫొటోతో, సీమా, స్వీటీ, సరస్వతి వంటి పలు పేర్లతో ఏకంగా 22 సార్లు నకిలీ ఓట్లు వేశారని అన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచనని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.