శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోవెలిసినటువంటి స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమన్.శ్రీనమిలికొండ రమణాచారి స్వామి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యక్షులుగా బండి చైతన్య. అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయగా పాలకవర్గంచే రమణ చారి ప్రమాణ స్వీకారం చేయించి దేవాలయానికి సంబంధించి నూతన కమిటీ గురించి ఇదివరకు చేసిన కమిటీ గురించి ప్రజలకు వివరిస్తూ కొన్ని సలహాలు సూచనలు చేశారు గ్రామంలో పార్టీలకతీతంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అలాగే పాలకవర్గ సభ్యులుగా చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యమని అలాంటి సేవ చేయడం మన అదృష్టంగా భావించి స్వామి వారి సేవలో నిమగ్నం కావాలని తెలియజేస్తూ ఇకముందు కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి కతీతంగా మన నరసింహ స్వామిని అభివృద్ధి చేస్తూ ప్రతిరోజు ఆ స్వామి వారి సేవలో ఉండే విధంగా కార్యక్రమాలు చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని దేవాలయంలో పనిచేసే అర్చకులకు విశ్రాంతి నిమిత్తం వసతి గృహాలు ఏర్పాటు చేయాలని దేవాలయ పరిసరాలలో చుట్టుపక్కల సిసి రోడ్డు నిర్మాణంతోపాటు గిరి ప్రదర్శన చేసే విధంగా సౌకర్యాలు కల్పించాలని. ఆలయ అభివృద్ధి కొరకు ఏ పార్టీ వారైనా ఎవరైనా వారి వారి నాయకుల ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధిలో ముందు ఉంచాలని తెలియజేస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో జనాలు విచ్చేస్తున్నారని భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న కాటీజీలు నిర్మించాలనిఈ సందర్భంగా తెలియజేస్తూ మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి కమిటీ అధ్యక్షులుగానియమించబడిన బండి బండి చైతన్య తన ఎల్.ఎల్.బి చదువుకొని వృత్తిరీత్యా వ్యాపారo చేస్తూ ఉన్నాడని ఇలాంటి వ్యక్తి మన ఆలయ అభివృద్ధి కొరకు అధ్యక్షులుగా నియమించబడగా వారి భాగ్య స్వామిరాలు కూడా ఎంతోకొద్దో గొప్పగా చదువుకొని విజ్ఞాన వంతురాలిగా తన భర్త దేవస్థానం అధ్యక్షుడిగా నియమవగా ఆలయ అభివృద్ధిలో భాగంగా తను కూడా ఆయన వెంట ఉండి అభివృద్ధి చేయాలని తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని భగవంతునికి సేవ చేయడం మన పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నో జన్మలు పుణ్యము చేసిన ఇలాంటి అరుదైన గౌరవం దక్కదని అందుకు అనుగుణంగా బండి చైతన్యకు ఈ అవకాశం దక్కడం తమ చేసుకున్న అదృష్టంగా భావించాలని అలాగే గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా శ్రీ మాన్ శ్రీ నమిలికొండ రమణ చారి స్వామి వారి చేతుల మీదుగా ఆలయ కమిటీ రమణ చారి ప్రమాణస్వీకారం చేయించారుఆలయ కమిటీ అధ్యక్షులుగా బండి చైతన్య. ప్రధాన కార్యదర్శిగారాపల్లి ఆనందం.ఉపాధ్యక్షుడిలుగా ఎగుమామిడి వెంకటరమణారెడ్డి. కోడంరమేష్.బత్తినిమల్లేశం. సామల గణేష్. కోశాధికారిగా సుద్దాల కర్ణాకర్. ఆసాని లక్ష్మారెడ్డి. సంయుక్త కార్యదర్శిగా. మచ్చ విజయ్ జగత్. సంస్కృతిక కార్యదర్శిగా.పడిగలరాజు. జూకంటి శివశంకర్ ప్రచార కార్యదర్శులుగా. చేన్నమనేని ప్రశాంత్. ఎడమల శ్రీధర్ రెడ్డి. కార్యవర్గ సభ్యులుగా. ఎడమల బాల్రెడ్డి. రంగు అంజయ్య. ఆంజనేయులు. జిందం సంతోష్. దొందడి రమేష్. పరికిపండ్ల రమేష్. విశ్వనాధుల రమేష్. సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్. మాజీ పాలకవర్గ బృందం. ఆలయ కమిటీ సభ్యులు. గ్రామ ప్రజలు రాజకీయ పార్టీల కత్తితంగా పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తద్వారా భక్తులకు ప్రజలకు పాలకవర్గానికి మధ్యాహ్నం భోజన సదుపాయాలు కల్పించిన ఆలయ కమిటీ భాగ్యస్వామ్యం. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఈరోజు ప్రమాణస్వీక కార్యక్రమంలో స్వామివారిని ప్రార్థించడం వేడుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు
