గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం వర్ధన్నపేట మండలం ఇళ్లంద, కొత్తపల్లి, రాయపర్తి మండలం దుబ్బతండ, రాగన్నగూడెం, పర్వతగిరి మండలం ఏబీ తండా, పర్వతగిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సిబ్బంది డ్యూటీల అమలు, పోలింగ్ సాగుతున్న విధానం, భద్రతా చర్యలు వంటి అంశాలను వివరంగా పరిశీలించారు. సమర్థవంతమైన పోలింగ్ నిర్వహణకు సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఏ విధమైన నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని, ప్రతి ఓటరికి సౌకర్యవంతమైన, అంతరాయంలేని వాతావరణం కల్పించడం సిబ్బందిపై ఉన్న ప్రధాన బాధ్యతని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల ఖచ్చితమైన అమలు అత్యంత ఔచిత్యం కలదని కలెక్టర్ స్పష్టం చేశారు.కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాం రెడ్డి, ఆర్డీఓ సుమా,నోడల్ అధికారులు,ఎంపిడీవోలు, తహశీల్దార్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా.. విద్యావంతురాలిగా గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్తా..
గుడ్లు రూప శ్రీనివాస్.
నిజాంపేట: నేటి ధాత్రి
సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామానికి ఎంతో సేవ చేస్తానని గుడ్ల రూప శ్రీనివాస్ అన్నారు. నిజాంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల అభివృద్ధికి దోహదపడాలనే సంకల్పంతో విద్యావంతురాలైన ఆమెను గ్రామ సర్పంచ్ గా గెలిపించాలన్నారు. గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతినిధులను గ్రామస్తులకు తెలిసే విధంగా గ్రామ సభలో వాటిని ప్రతి గ్రామస్తులతో చర్చించడం జరుగుతుందన్నారు. ముందుగా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులు మొదటి ఐదు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు ఐదువేల ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. మల్కచెరువు కట్టను బలిష్టం చేసే వాకింగ్ ట్రాక్ సెల్ పాయింట్ స్టేట్ లైట్ ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామంలో ప్రతి సంవత్సరం టోర్నమెంట్ ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తానన్నారు. సర్పంచ్ గా తమను గెలిపిస్తే గ్రామానికి మరింత సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు.
• నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలి •సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెక్రటరీ మంగలి ఆంజయ్య
చేవెళ్ల, నేటిధాత్రి :
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దని సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెసెక్రటరీ మంగలి ఆంజయ్య అన్నారు. ఈ సందర్బంగా మండలంలో సర్పంచి, వార్డు నెంబర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులు డబ్బులతో ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ముందుగా ఎన్నికల్లో ఓటర్లకు మద్యం, విందు కార్యక్రమాలకు ఖర్చు చేసే డబ్బులు గెలిచిన తరువాత ప్రభుత్వం గ్రామపంచాయతీకి విడుదల చేసే నిధుల నుండి ఖర్చును పూడ్చుకునే అవకాశం సాధ్యం కాదనీ సమాచార హక్కు వికాస సమితి ముందుగా హెచ్చరిక తెలియజేస్తుందని అన్నారు. గ్రామానికి వచ్చిన నిధులను పనులు నిమిత్తం మాత్రమే పారదర్శకంగా ఖర్చు చెయ్యాలని సమాచార హక్కు చట్టం ప్రకారంగా పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240 ప్రకారంగా ప్రతీ విషయం ప్రజలందరూ తెలుసుకునే హక్కు ఉందని ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240 ను ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో సూచిక బోర్డు పై ప్రజలందరికీ తెలిచేలా ఏర్పాటు చెయ్యాలని అన్నారు . నిధులను పక్కదారి పట్టించిన దుర్వినియోగం చేసినా, సొంతానికి వాడుకున్న, తప్పుడు లెక్కలు చూపిన ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి, నిధులను రికవరీ చేసి, పదవి నుండి తొలగించె అవకాశం ఉందని, కాబట్టి ఎన్నికల్లో అధిక ఖర్చులు పెట్టి అప్పుల పాలు కావద్దని సూచించారు. ఓటర్లు డబ్బు, మద్యం, ప్రలోబాలకు లొంగి ఓటు వేయొద్దని, నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలని ఓటర్లకు సూచించారు.
కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవు. డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ.
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ను ఉల్లంఘిస్తే..చర్యలు తప్పవని డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ అన్నారు. నిజాంపేట లో ఎఫ్ఎస్టి బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా 50 వేలకు మించి డబ్బులను రవాణా చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు కొత్త అకౌంట్ తీసుకోవాలి
నిజాంపేట్ ,నేటి ధాత్రి
గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలని నిజాంపేట్ ఎంపీడివో రాజిరెడ్డి తెలిపారు అలాగే ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లలో కొత్త అకౌంట్ ప్రారంభించి అందులో నుండి మాత్రమే ఎన్నికల ఖర్చులు జరపాలని సూచించారు.
మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల(నేటి ధాత్రి ):
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టి-పోల్ వెబ్ సైట్ , యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని సూచించారు.
ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .
నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు.
జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు.
ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.
ఇంచార్ట్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల కార్మికులకు ఆదర్శవంతమైనవి
బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య
శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల మంది కార్మికులకు ఆదర్శవంతం, చారిత్రాత్మకమైన చట్టాలు అని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడించారు.బుధవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాజకీయ ప్రేరేపిత సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.భారత ప్రభుత్వం 49 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా సవరించడం కార్మిక హక్కుల, సంస్థల సంరక్షణ,పరిశ్రమల ప్రగతి,దేశ అభివృద్ధి, నిర్మాణాత్మకమైన పారదర్శకత కలిగిన ఆదర్శవంతమైన చారిత్రాత్మకమైన చట్టాలను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ స్వాగతిస్తున్నామని తెలిపారు.వలస పాలన కాలంలోని పాత చట్టాలను మార్పు చేసిన చట్టాలను పూర్తిగా ఆధునిక,పారదర్శక, ఏకీకృత,కార్మిక-కేంద్ర వ్యవస్థను తీసుకువస్తున్నాయని తెలిపారు.14 జాతీయ కార్మిక సంస్థల వేదిక కన్సెంట్ ఈ సంస్కరణలను వికసిత భారత్ 2047 లక్ష్యానికి దారితీసే చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తోందని వివరించారు.అసంఘటిత, వలస,గిగ్, ప్లాట్‌ఫారమ్,అనధికా రంగాల దాదాపు 40 కోట్ల మంది కార్మికులు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని చెప్పారు.ఇఎస్ఐసి తరహా ఆరోగ్య సేవలు,పింఛన్-లింక్డ్ ప్రయోజనాలు,ప్రసూతి రక్షణ, వికలాంగుల సహాయం, సంక్షేమ పథకాల పోర్టబిలిటీ వంటి సేవలు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి.ప్రతి కార్మికుడికి ఫార్మల్ అపాయింట్ లెటర్ తప్పనిసరి కావడం,అలాగే జాతీయ కనీస వేతనం కంటే తక్కువ వేతనం దేశంలో ఎక్కడ అమలు చేయకూడదనే నిబంధన వల్ల అనౌపచారిక ఒప్పందాలు,అన్యాయ కత్తిరింపులు,సేవా రికార్డు లేమి వంటి దోపిడీలు తగ్గిపోతాయని తెలిపారు.డిజిటల్ వేతన వ్యవస్థలు పారదర్శకత బాధ్యతను పెంచుతాయని చెప్పారు.కార్మిక భద్రత, వ్యవసాయక ఆరోగ్యం,భద్రత కమిటీలు,సాంకేతికత ఆధారిత తనిఖీలు,మహిళల కార్మికుల భద్రత వంటి అంశాలపై కోడ్లు తీసుకొచ్చిన మెరుగుదలలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవని పేర్కొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,యాజమాన్య సంస్థలు,కార్మిక సంఘాలు, నిపుణులతో జరిగిన విస్తృత సంప్రదింపుల ఫలితమని అన్నారు.కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కార్మిక సంఘాలు కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి,ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, బోయిన మల్లేష్,జిల్లా తిరుపతి,రాజా రామ్ కిరణ్, శ్రీధర్,రామకృష్ణ,బాపు, మొగిలి,తిరుపతి,శేఖర్, సురేష్,మహేందర్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సివిల్ సప్లై అధికారులు
భూపాలపల్లి నేటిధాత్రి
గాంధీనగర్, బుద్ధారం, ఘన్‌పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్ డీఎం, సీఎస్‌సీ రాములు, యూడీఆర్‌ఐ అధికారులతో కలిసి. పరిశీలించారు ఈ సందర్భంగా పౌర సరఫరాల అధికారి ఇన్‌చార్జీలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎఫ్‌ఏక్యూ (FAQ) ప్రమాణాల మేరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే సంబంధిత బియ్యపు మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని, కేంద్రాలలో తూకం, బిల్లింగ్, రవాణా ప్రక్రియలను పర్యవేక్షిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పూర్తిస్థాయిలో బాధ్యతతో పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం తెచ్చే రైతుల పట్ల సమన్వయం పాటించి కొనుగోలు చేయాలని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వి ఎఫ్ జి సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసిన సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనసులు పొందాలని ఆయన అన్నారు. రైతులు దళారులు వద్ద మోసపోకుండా ప్రభుత్వ ఆమోదిత పొందిన కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించరలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ దామోదర్, ఏవో బన్నరజిత, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పోలు దాసరి శ్రీనివాస్, డైరెక్టర్లు మార్తా మార్కండేయ, మంద రాజిరెడ్డి, లింగారెడ్డి, మాజీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్, సభ్యులు నాన బోయిన రాజారామ్, వెంగల్ దాస్ రమేష్, గుండాల శ్రీశైలం, గోనె ల నరహరి, తిరుపతి రెడ్డి, ఇస్తారు శేఖర్ గౌడ్, వైనాల అశోక్, పురుషోత్తం సురేష్, ఏఈఓ శ్రీకాంత్, సిబ్బంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం: రెండున్నర సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అంటూ.. ఎదురుచూస్తున్న ఆశావాహులకు ఊరట కలిగించే విధంగా ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎట్టకేలకు గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఆదివారం జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా ఎన్నికల అధికారులకు నివేదికలను పంపారు. వార్డుల వారీగా ఝరాసంగం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మంజుల, ఎంపీఓ ఎన్, స్వాతి, అధికారుల బృందం “డ్రా” పద్దతిన అధికార, విపక్ష పార్టీల శ్రేణుల సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు మహిళలకు 50 శాతంలోపు రిజర్వేషన్ కల్పిస్తూ ఖరారు చేశారు.
ఝరాసంగం మండలంలో 33 జీపీల్లో 13 జీపీలు మహిళలకు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోనే 33 గ్రామ పంచాయతీలతో అతిపెద్ద మండలం ఝరాసంగం 33 గ్రామపంచాయతీల్లో 13 జీపీలను మహిళలకు కేటాయించగా.. మిగిలిన 17 జీపీ లను పురుషులకు కేటాయించారు. మండలంలో 288 వార్డుల గాను 126 మహిళలు, 162 జనరల్ రిజర్వుగా ఖరారు చేశారు. ఎస్సీ మహిళలకు 35, ఎస్సీ జనరల్ 48 . బిసి మహిళలకు 20, బీసీ జనరల్ 34. జనరల్ మహిళలకు 64, జనరల్ 73, ఎస్టీ మహిళ 7, ఎస్టీ జనరల్ 7 చొప్పున వార్డుల వారిగా రిజర్వేషన్ కల్పిస్తూ “డ్రా” పద్ధతిన ఖరారు చేశారు.
ఝరాసంగం ఎస్సీ మహిళకు రిజర్వ్..
మండల కేంద్రమైన ఝరాసంగం గ్రామ పంచాయతీని ఎస్సీ మహిళకు ఖరారైంది. 33, గ్రామ పంచాయతీల్లో.. జనరల్ మహిళలకు 9, బీసీ మహిళలకు 3, జనరల్ రిజర్వ్ 8, ఎస్సీ మహిళ 2, ఎస్సీ జనరల్ 5, బీసీ జనరల్ 2 మేర ఆయా గ్రామపంచాయతీ సర్పంచులగా పోటీ చేసేందుకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆశావాహులకు..” ఈ సారీ నిరాసే”..!
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అంటూ.. రెండున్నర సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న.. పలువురు ఆశావాహులకు ఈ సారి సైతం నిరాసే మిగిలింది. మండలంలోని అధికార, విపక్ష, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువతలు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిని కనబరిచారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని ఆశించిన పలువురు చివరకు నిరాశకే లోనయ్యారు.మండల కేంద్రమైన ఝరాసంగం, కొన్ని తదితర గ్రామాల్లో అధికార, విపక్ష పార్టీ శ్రేణులతో పాటు యువత సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఆసక్తిని కనపరిచారు. ఎట్టకేలకు రిజర్వేషన్లు వారికి ప్రతికూలంగా రావడంతో నిరాశకు గురయ్యారు.
గ్రామ పంచాయతీ మహిళా వార్డు రిజర్వేషన్లు లాటరీ ద్వారా పాల్గొన్నాన పార్టీ నాయకులు
ఝరాసంగం మండల పరిధిలోని గ్రామ పంచాయతీ వార్డు మహిళా సభ్యుల రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేసేందుకు ఝరాసంగం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ మంజుల తెలిపారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు లాటరీ ద్వారా పాల్గొన్నాన పార్టీ నాయకులు, ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు విశ్వనాతం సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు చంద్రన్న పాల్గొన్నారు,
#ఎస్‌హెచ్‌జీ వెలుపల ఉన్న మహిళలకు సభ్యత్వం ఇచ్చి చీరలను వెంటనే ఇవ్వాలి.
#మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతను, ఇందిరా మహిళా శక్తి విజయాలను చాటేలా నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమాలు
#గ్రామాల్లో ఇంటింటికి వెల్లి చీరలు పంచాలి
#ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపిణి వివరాలను ఎప్పటి కప్పుడు నమోదు చేయాలి.
అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా,నేటిధాత్రి:
ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెర్ప్ ఉన్నతాధికారులతో గురువారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సీతక్క అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మహిళల గౌరవం, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగాలని ఆమె పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు చీర అందేలా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీతక్క సూచించారు.ఇంకా స్వయం సహాయక బృందాల్లో లేని మహిళలకు అవగాహన కల్పించి, వెంటనే వారికి సభ్యత్వం ఇచ్చి ఇందిరమ్మ చీరలను అక్కడికక్కడే అందించాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. నూతన లబ్దిదారులను గుర్తించేందుకు పౌర సరఫరాల శాఖ సహకారాన్ని తీసుకోవాలన్నారు. ప్రస్తుత, కొత్త లబ్ధిదారుల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన సెర్ప్ ప్రొఫైల్ యాప్ ద్వారా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేశారు. పంపిణీ కార్యక్రమం దశలవారీగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుండి డిసెంబర్ 9 వరకు మొదటి దశలో, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి 9 వరకు రెండో దశగా పంపిణీ చేయాలని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా, ప్రతి నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో స్థాయి ప్రత్యేక అధికారిని నియమించి, నియోజకవర్గం నుంచి మండల, గ్రామ స్థాయిల వరకు పంపిణీని పర్యవేక్షించేలాగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీతక్క సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతను, ఇందిరా మహిళా శక్తి విజయాలను చాటే విధంగా నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో కార్యక్రమం జరగాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు మరియు ప్రజాప్రతినిధులందరికీ మండల స్థాయి కార్యక్రమాలకు ఆహ్వానం పలకాలని ఆమె అధికారులను కోరారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితో పాటు గ్రామ మహిళ స్వయం సహాయక బృందాల సభ్యులు..లబ్దిదారుల నివాసాలకు వెల్లి ఇందిరమ్మ చీరలను బొట్టుపెట్టి అందచేయాలని సూచించారు. మహిళల ఐక్యతను చాటే విధంగా ఇంటింటికి ఇందిరమ్మ చీరలు చేర్చుతామన్నారు. లబ్ధిదారుల వివరాలను సేర్ఫ్ ప్రొఫైల్ యాప్ ద్వారా నమోదు చేయడం తప్పనిసరి అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా ఆధార్ డేటా, ఫోటోల సేకరణ జరగాల్సి ఉన్నందున అధికారులు పూర్తి సన్నద్ధతతో వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మహిళల జీవితాల్లో ఆనందాన్ని నింపే పండుగలా మారాలని, ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రచారం పెంచాలని సీతక్క ఆదేశించారు.
జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అలాగే ఎంపీడబ్ల్యూ వర్కర్లను వార్డుల వారిగా విభజించి చెత్త సేకరించాలని తెలిపారు.ప్రతిరోజు అన్ని గ్రామ పంచాయతీలలో విధిగా పనులను నిర్వహించాలని,ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూడాలని,సేగ్రిగేషన్ షెడ్ లలో వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేపించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఇంటి పన్ను వాసులలో ఇప్పటివరకు 29% మాత్రమే చేశారని,నవంబర్ 25వ తేదీలోపు 100% ఇంటి పన్ను వసూలు చేయాలని లేనియెడల తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ బాపూరావు,పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్,ఆర్.శ్రావణి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం అని గుర్తు చేశారు.ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు సచివాలయం నుండి సీఎం తో కలిసి వీ.సీలో భాగస్వాములవగా, వరంగల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని,నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగాలని, మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో చీరల పంపిణీ చేపట్టాలని సూచించారు. పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వాటికి మహిళలను యజమానులను చేశామని, స్కూల్ యూనిఫారంలు కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని, ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రామిరెడ్డి , మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు, డిపిఎం, ఏపీఎం లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి, సాధాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మహదేవపూర్ తహసీల్దార్ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం మహదేవపూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన పరిశీలన నివేదిక ఉండాలని తిరస్కరణ జరిగితే, సవివరమైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. పౌరులకు ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, భూ సంబంధిత ప్రజా సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, నాయబ్ తహశీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపక్షం దిన పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. ప్రజాపక్షం దిన పత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు హాజరై కేక్ కట్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో,పారదర్శక పాలనను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాపక్షం దిన పత్రిక ఎనలేని కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి పార్వతి సురేష్ కుమార్,మంచిర్యాల ఆర్సీ ఇన్చార్జి కేశేటి వంశీ,నస్పూర్ మండల విలేకరి నారగొని పురుషోత్తం,గంగారపు గౌతమ్,కుమ్మరి సతీష్, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలనిజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి మొత్తం 41 దరఖాస్తులు స్వీకరించామని, వాటిని సంబంధిత శాఖాధికారులకు తక్షణ పరిష్కారానికి ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అధికారులు ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమయానికి చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, పారదర్శకంగా సేవలు అందించాలని అన్ని శాఖల అధికారులను ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైని ఉప కలెక్టర్ నవీన్ రెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తారని, పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్డిసి రమేష్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి
జైపూర్,నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
జైపూర్ మండలంలోని ఇందారం, నర్వ, జైపూర్ గ్రామాలలోని పెట్రోల్ బంకులను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ వనజా రెడ్డి గురువారం తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ బంకులలో యజమాన్యం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలు ఉచిత గాలి, త్రాగునీరు టాయిలెట్స్, ఫైర్ ఫైటింగ్ ఎంక్విమెంట్లను తనిఖీలు చేసిన అనంతరం పెట్రోల్ బంకుకు వచ్చే వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులను నిర్వహించాలని అన్నారు.వినియోగదారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా వారిని కించపరచడం లాంటిది చేస్తే తగు చర్యలు తీసుకుంటామని యజమానులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, జిపిఓ నవీన్, రాజు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తనిఖీలు చేపట్టిన అధికారులు
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ భాగంగా స్వేచ్ఛాయితంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,సిఐ వేణు చందర్,శ్రీధర్ ఇందారం గ్రామంలో గురువారం తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టారు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. సమాచార హక్కు చట్టం కేంద్రంలోని వచ్చి 20 ఏండ్లు అయిన సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆయా శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ఎలా అమలులోకి వచ్చింది చట్టంతో ప్రజలకు ఉపయోగపడే వివరాలను తెలియజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు తదితర సమాచారాన్ని తెలుసు కోవచ్చని స్పష్టం చేశారు. దేశ భద్రత, రహస్య ఇతర ఇబ్బందులు ఎదురయ్యే సమాచారం మినహా అన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి వివరాలు ఉండాలని తెలిపారు. ఎవరైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో వారికి సమాధానం ఇవ్వాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సమాచారం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.