* పాతాళ శ్వేత వారాహి అమ్మవారిని దర్శించుకున్న…

* పాతాళ శ్వేత వారాహి అమ్మవారిని దర్శించుకున్న

-కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము
మొగుళ్లపల్లి నేటి దాత్రి

ముక్కోటి హిందూ దేవుళ్ళ అనుగ్రహం మొగుళ్లపల్లి మండల ప్రజలపై ఉండాలని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ఆ దేవుళ్లను వేడుకున్నారు. నడిగోటి రాము నేతృత్వంలో మొగుళ్లపల్లి గ్రామంలోని యువకులు ఆ ఏడుకొండలవాడి దర్శనంలో భాగంగా మంగాపురం తిరుపతిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, రామచంద్రపురం రాయల చెరువు ఓడ్డున పాతాళ అడుగులోని అష్టదశ శక్తి పీఠాలలో 5వ పీఠం అయినటువంటి పాతాళ శ్వేత వారాహి అమ్మవారి దేవాలయాన్ని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నడిగోటి రాము మాట్లాడారు. ఆ ముక్కోటి దేవుళ్ళ అనుగ్రహం మొగుళ్లపల్లి మండల ప్రజలపై ఉండాలని, కాంగ్రెస్ ప్రజాపాలనలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు చేరి, తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆశీస్సులతో..మొగుళ్లపల్లి మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఆ దేవుళ్ళ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, పిల్లాపాపలతో, కుటుంబంతో కలిసి మెలిసి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళపల్లి రిపోర్టర్ వడ్లకొండ పవన్ గౌడ్, పుట్ట అజయ్, బత్తిని రాజు గౌడ్, సూర్నేని మణికర్, బూర ప్రకాష్ తదితరులున్నారు.a

అధిక ఫీజుల దోపిడీకి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

అధిక ఫీజుల దోపిడీకి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

#శనిగరపు రాజేంద్రప్రసాద్
స్వేరోస్ జిల్లా మాజీ అధ్యక్షులు

#ప్రైవేట్ స్కూల్లో దోపిడీపై కొత్త బిల్లు ప్రవేశపెట్టాలి.

#ప్రైవేట్ స్కూలు అధిక ఫీజుల పై నియంత్రణ చేపట్టాలి.

#ప్రైవేట్ స్కూళ్లను కేటగిరి లుగా విభజించి ఆధారంగానే ఫీజులను ఏర్పాటు చేయాలి.

#స్కూల్ బుక్స్ యూనిఫా

మ్ లు కొనాలనే రూల్ బంద్ చేయాలి.

హన్మకొండ, నేటిధాత్రి:

ప్రైవేట్ స్కూల్లో, కాలేజీల్లో చదువుకునే పేద మధ్య తరగతి విద్యార్థులకు అధిక ఫీజుల నుంచి మరియు ఆయా స్కూల్లోనే పుస్తకాలు కొనాలనే ప్రైవేట్ స్కూల్ల కార్పొరేట్ దందా నుంచి విముక్తి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న క్యాబినెట్ సమావేశాల్లో తీర్మానం చేసి విద్యా హక్కు చట్టం ప్రకారం 25% పేద విద్యార్థులకు ఫ్రీగా చదువుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేద పాఠశాల భూమి పూజ వివిధ పనులకు శంకుస్థాపన

యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేద పాఠశాల భూమి పూజ వివిధ పనులకు శంకుస్థాపన

నేటి దాత్రి యాదగిరిగుట్ట:

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింa పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొని భూమిపూజ చేశారు.

🛕 వేద పాఠశాలతో పాటు టెంపుల్ సిటీ పరిధిలో రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేశారు.

 

🛕 ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

🛕 యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

🛕 రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక శాలలతో పాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

🛕 వేద పాఠశాలకు భూమిపూజతో పాటు రూ. 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణం, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ. 9.87 కోట్లతో భారీ కల్యాణ మండపం, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ. 1.41 కోట్లతో రక్షణ పైకప్పు (కానోపీ) నిర్మాణం, రథశాల వైపు వాయవ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

వేతనాల పెంపులో పారదర్శకత లేదు: బీఆర్టీయూ…

వేతనాల పెంపులో పారదర్శకత లేదు: బీఆర్టీయూ

నర్సంపేట, నేటిధాత్రి:

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత, పారదర్శకత లేదని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు విమర్శించారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని ఆరోపించారు.ఆయన మాట్లాడుతూ, వేతన పెంపు కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దేశానికి ఆదర్శంగా శాస్త్రీయ పద్ధతిలో పెంపు చేస్తామని సీఎం ప్రకటించినా ఆచరణలో చిత్తశుద్ధి లోపించిందన్నారు. కనీస వేతనాల పెంపులో కరువు భత్యం గురించి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.అన్ స్కిల్డ్ వర్కర్లకు రూ.16,000, సెమీస్కిల్డ్‌కు రూ.17,000, స్కిల్డ్‌కు రూ.18,500, హై స్కిల్డ్‌కు రూ.20,000 పెంచినట్లు సీఎం ప్రకటించారని, అయితే అన్ స్కిల్డ్ తప్ప మిగతా వారికి బేసిక్, కరువు భత్యం కలుపుకొని ఇప్పుడు వస్తున్న జీతానికి, పెంచిన దానికి పెద్ద తేడా లేదని తెలిపారు. కాంట్రాక్టు లేబర్ జీవో 11 ప్రకారం ఇప్పటికే రూ.13,098 నుంచి రూ.23,683 వరకు వేతనాలు అందుతున్నాయని, జీవో 4లో స్కిల్డ్ కార్మికునికి రూ.19,572 ఉండగా సీఎం ప్రకటించింది రూ.18,500 మాత్రమేనని, గతంతో పోలిస్తే రూ.1,072 తగ్గిందని వివరించారు.బీఆర్‌ఎస్ హయాంలో కనీస వేతనాల సలహా మండలి బోర్డు అన్ స్కిల్డ్ కార్మికుడికి రూ.18,009, కరువు భత్యం పాయింట్‌కు రూ.12 సిఫార్సు చేసిందని, 2021 జూన్ 25న 5 జీవోలను జారీ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయలేదని గుర్తుచేశారు.డాక్టర్ అట్రాయి ఫార్ములా ప్రకారం శాస్త్రీయంగా లెక్కగడితే కనీస వేతనం నెలకు రూ.32,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా, కార్మిక సంఘాలు రూ.26,000 డిమాండ్ చేస్తున్నా సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ, ఆశ, ఎన్ఆర్ఈజీఎస్, ఎన్ఆర్‌హెచ్ఎం, సర్వశిక్షా అభియాన్ కింద 3 లక్షలకు పైగా స్కీమ్ వర్కర్లు ఉన్నారని, వీరు ఏ కేటగిరీ కిందికి వస్తారో స్పష్టత లేదని, వేతన సవరణను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.

సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించలేకపోయిన ప్రభుత్వం

సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించలేకపోయిన ప్రభుత్వం
రైతాంగం పై తీవ్ర ప్రభావం చూపుతుంది
కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్

: మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించలేకపోయిన ప్రభుత్వం రైతాంగం పై తీవ్ర ప్రభావం చూపుతోందని కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ అన్నారు
ఎన్నికల సమయంలో రైతులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 45 రోజుల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, 50 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు అందలేదని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రెండు ఎకరాల వరకే రైతు భరోసా చెల్లించి, మిగతా రైతులను నిరాశలోకి నెట్టిందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించకపోవడం రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జంపన్న ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు, వ్యవసాయం గుర్తుకు వస్తాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని గుర్తు చేశారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ముందుగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతు కుటుంబాలకు భరోసా కల్పించారని అన్నారు.
ఈరోజు గ్రామాల్లో రైతులు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ, అప్పటి పరిస్థితులు బాగుండేవని చర్చించుకుంటున్నారని శనిగరపు శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అని రైతులు ఇప్పటికీ భావిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, వెంటనే రైతు భరోసా నిధులను రైతులందరికీ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలని, లేకపోతే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

బిఎల్ఎ ఓటర్ లిస్ట్ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించిన కాంగ్రెస్ నాయకులు..

బిఎల్ఎ ఓటర్ లిస్ట్ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించిన కాంగ్రెస్ నాయకులు

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి దాత్రి:

 

జహీరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం జహీరాబాద్ నియోజకవర్గంలోని సంబంధిత పోలింగ్ స్టేషన్లు మరియు ప్రాంతాలకు సంబంధించిన బూత్ లెవల్ ఏజెంట్ల ( బిఎల్ఎ ) జాబితాను వారి పరిశీలనార్థం మరియు అవసరమైన రికార్డు నిమిత్తం ( ఆర్డిఓ ) రెవిన్యూ డీవిజన్ ఎన్నికల అధికారికి వారి కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో బడుగుబాలహీన వర్గాల ప్రజల ఓట్లు తొలగించాలని కేంద్ర సర్కార్ బీజేపీ ప్రభుత్వం తెర లేపింది.( ఎస్ఐఆర్ ) ఓటర్ జాబిత ప్రక్రియను కట్టుదిట్టంగా మరియు పారదర్శకంగా నిర్వహించి,అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ జాబితాలో నమోదు కావాలని, నకిలీ మరియు అనర్హత ఓట్లను తొలగించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ జాబితా కీలకమని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,మాజీ వైస్ చైర్మన్ ఖాజా,టీపీసీసీ కో- ఆర్డినటర్ గౌస్, కౌన్స్లర్ మహేష్, సర్పంచ్ రాజు,ఏ.యం.సి డైరెక్టర్ శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హుగ్గేల్లి రాములు,నాయిమ్ మొయిజ్,గౌస్,ఆయుబ్,అడ్వొకేటే వాజహత్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కార్యకర్తలు పాల్గొన్నారు.

45 రోజుల్లో రైతు భరోసా అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

45 రోజుల్లో రైతు భరోసా అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

#50 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో రైతు భరోసా చెల్లింపులు లేవు

#కేసీఆర్ హయాంలో రైతులకు గౌరవం, భరోసా ఉండేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

#బీఆర్ఎస్ నాయకుడు భూక్య జంపన్న

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

ఎన్నికల సమయంలో రైతులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. 45 రోజుల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, నేటికీ 50 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు అందలేదని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రెండు ఎకరాల వరకే రైతు భరోసా చెల్లించి, మిగతా రైతులను నిరాశలోకి నెట్టిందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించకపోవడం రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జంపన్న ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు, వ్యవసాయం గుర్తుకు వస్తాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని గుర్తు చేశారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ముందుగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతు కుటుంబాలకు భరోసా కల్పించారని అన్నారు.
ఈరోజు గ్రామాల్లో రైతులు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ, అప్పటి పరిస్థితులు బాగుండేవని చర్చించుకుంటున్నారని జంపన్న పేర్కొన్నారు. రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అని రైతులు ఇప్పటికీ భావిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, వెంటనే రైతు భరోసా నిధులను రైతులందరికీ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలని, లేకపోతే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.A

యాదగిరిగుట్టలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన…

యాదగిరిగుట్టలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9:37 గంటలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా టెంపుల్ సిటీలో నిర్మించనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా మరో నాలుగు అభివృద్ధి పనులకు కూడా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఈ సందర్భంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాలు ఒకే వేదికపై జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

రేవంత్ రెడ్డి నువ్వు రైతువా నకిలీ రైతువా…

రేవంత్ రెడ్డి నువ్వు రైతువా నకిలీ రైతువా

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులు పండించిన ధాన్యం అమ్ముకోలేకపోవడంలో వైఫల్యానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది.

రైతులకు ప్రధానంగా కావాల్సిన గన్ని బ్యాగ్స్ సప్లై చేయడంలో మొదలుకోని దానికి కావలసినటువంటివి ఏర్పాటు చేసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.అసలు ప్రభుత్వానికి రైతులన్న, రైతు సమస్యలన్న ఆలోచన లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.

ముఖ్యమంత్రి కి తిరగడానికి సమయం ఉంది కానీ,రైతులు పండించిన పంట కొనుగోలు పై ఆలోచన చేయడానికి సమయం లేదా..?

రేవంత్ రెడ్డి నువ్వు రైతు బిడ్డవి అని ఫోజులు కొడతావ్ కదా… అసలు నువ్వు రైతువా.. నకిలీ రైతువా…?
రైతులు మా తరుపున కొట్లాడాలి, మాకు న్యాయం చేకూరేలా కార్యాచరణ చేపట్టాలి అని మమ్మల్ని కోరుతున్నారు.
మక్కలు పండించిన రైతుల బాధ వర్ణనాతీతం.నా నియోజకవర్గం భూపాలపల్లిలో రైతులే గన్ని బ్యాగులు తెచ్చుకోవాలి, రైతులే 51.5 కిలోలు కాంట వేయాలి, వాహనాల్లో లోడింగ్ చేసుకోవాలి, అన్లోడింగ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నేడు దళారీ వ్యవస్థ పై మళ్ళీ రైతన్న ఆధారపడే వ్యవస్థ మొదలయింది.
ఒక్క భూపాలపల్లినే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని సెంటర్లన్ని కాంగ్రెస్ నాయకుల కన్నుసన్నల్లో, వారి డైరెక్షన్లో నడుస్తున్నాయి.
కాబట్టి ఇప్పటికైన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పంటలను ప్రభుత్వం కొన్నది అని పేపర్లలో పోజులు కొట్టడం కాదు, గాల్లో తిరుగుతూ చేతులు దులుపుకోవడం కాదు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది ఇప్పటివరకు కనీసం రాష్ట్రంలో రైతులు ధాన్యం ఎన్ని ఎకరాలలో వేశారు, ఎంత దిగువడి వచ్చింది, దానికి కావాల్సిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గోదాంల ఏర్పాటు వంటి వాటిపై ఒక్కసారి అయిన సమీక్షా చేశారా…?
మేము వస్తే రైతురాజ్యం వస్తది అని ప్రజలను నమ్మించి మోసం చేసినవ్.
ప్రజలు నేడు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన వ్యక్తి ఎవరూ అంటే రేవంత్ రెడ్డి… రైతు బాంధవుడు, రైతు రాజ్య స్థాపకుడు ఎవరూ అంటే అది కేసిఆర్ అని.
అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ రోజు మీకు అధికారం ఇచ్చిన పాపానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కేసీఆర్ చోరువతో రైతులు రెండు నుండి మూడు లక్షల ఎకరాలలో ఫామాయిల్ పంట వేయడం జరిగింది.
యూరియా యాప్ పెట్టిర్రు, ఆ యాప్ పనిచేయడం లేదు కాబట్టి వెంటనే యూరియా యాప్ ఓపెన్ చేసి ఆయిల్ఫామ్ పంట రైతులకు యూరియా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచినట్టు ప్రకటించి ఒకపక్క డిజిల్ ధరలు మరొక పక్క రైతుల ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా పెంచడం జరిగింది.
ఇప్పటికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై అదనపు భారం పడకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా రైతుల విషయంలో ఆలోచన చేయమని భారత రాష్ట్ర సమితి పార్టీ రైతుల తరుపున ప్రభుత్వాన్ని కోరారు.

కాంగ్రెస్ వార్ మోడ్ ఆన్..! బీజేపీ-బీఆర్ఎస్ టెన్షన్..

కాంగ్రెస్ వార్ మోడ్ ఆన్..!
బీజేపీ-బీఆర్ఎస్ టెన్షన్..!

 

తెలంగాణలో కాంగ్రెస్ ఒక్కసారిగా ఎందుకు దూకుడు పెంచింది..? బీజేపీని టార్గెట్ చేస్తూనే… బీఆర్ఎస్‌పై కూడా ఒకేసారి యుద్ధం ప్రకటించడానికి కారణం ఏంటి..? ఇది సాధారణ రాజకీయ వ్యూహమా..? లేక వచ్చే ఎన్నికల ఫలితాలను ఇప్పటినుంచే డిజైన్ చేసే పవర్ గేమ్ ఆరంభమా..? అంటే అవును అనే సమాధానం వస్తోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు కేవలం పాలనపైనే ఫోకస్ చేయడం లేదు. వచ్చే పదేళ్లు కూడా తెలంగాణలో తమ ఆధిపత్యం కొనసాగాలంటే… ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా బలహీనపరచాల్సిందేనని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇకపై కేవలం నాయకుల విమర్శలు కాదు… యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, కిసాన్ సెల్ వంటి అనుబంధ సంఘాలను నేరుగా ప్రజల్లోకి దింపే ప్లాన్ అమల్లోకి వస్తోంది. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇక నుంచి “గ్రౌండ్ లెవల్ నేరేటివ్ వార్” మరింత తీవ్రంగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ అసలు లక్ష్యం ఒక్కో పార్టీని విడిగా ఎదుర్కోవడం కాదు… బీజేపీ, బీఆర్ఎస్ రెండింటినీ ఒకే ఫ్రేమ్‌లో నిలబెట్టడం. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని… బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదని… పైగా రెండు పార్టీల మధ్య లోపాయికారీ అండర్‌స్టాండింగ్ ఉందనే భావనను ప్రజల్లో బలంగా నాటాలని ప్రయత్నిస్తోంది. ఇది రాజకీయంగా చాలా కీలకమైన ఎత్తుగడ. ఎందుకంటే ప్రజలకు “ఈ రెండు పార్టీలూ ఒకటే” అనే ఫీలింగ్ కలిగితే… కాంగ్రెస్‌ను మాత్రమే ప్రత్యామ్నాయంగా చూపించే అవకాశం పెరుగుతుంది.

అందుకే ఇప్పుడు సోషల్ మీడియా నుంచి గ్రామ స్థాయి సమావేశాల వరకు… బీజేపీ మత రాజకీయాలు, బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు అనే రెండు నెగెటివ్ ఇమేజ్‌లను ఒకేసారి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలైంది. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అసలు పోరు కేవలం ఓట్ల కోసమే కాదు… ప్రజల మైండ్‌సెట్‌ను ఎవరు కంట్రోల్ చేస్తారన్నదానిపైన కూడా ఉండబోతోంది.

గత పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాయి. త్రిముఖ పోరులో ఓటు చీలితే ప్రమాదం తప్పదని పార్టీ అర్థం చేసుకుంది. అందుకే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, కీలక నేతల బలహీనతలు, నెరవేరని హామీలన్నింటినీ బయటకు తీస్తూ… రెండు పార్టీలను ఒకేసారి డిఫెన్స్‌లోకి నెట్టే వ్యూహంతో ముందుకు సాగుతోంది. అంటే తెలంగాణ రాజకీయాలు ఇకపై కేవలం అభివృద్ధి చర్చలతో కాకుండా… భారీ ఇమేజ్ వార్, నేరేటివ్ వార్, రాజకీయ మైండ్ గేమ్స్ చుట్టూ తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ

జీవో 679 జారీ చేసిన ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేసిన ఉద్యమకారులు – కాంగ్రెస్ నేతలు

నర్సంపేట, నేటిధాత్రి:

తెలంగాణ ఉద్యమకారుల సేవలను అధికారికంగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్ 679 జారీ చేయడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమ నేత, కాంగ్రెస్ జిల్లా నాయకులు దండెం రతన్ కుమార్, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాట ఆకాంక్షలను, అమరవీరుల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వారు కొనియాడారు. కేసీఆర్ పాలనలో ఉద్యమకారులకు సముచిత స్థానం, గుర్తింపు లేకుండా అన్యాయం జరిగిందని ఆరోపించారు.ఉద్యమకారుల గుర్తింపునకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిలను సభ్యులుగా నియమించడం కాంగ్రెస్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. జీవో 679 జారీతో ఉద్యమకారుల ఆత్మగౌరవం నిలబడుతుందని, కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అని వారు పేర్కొన్నారు.

300 కోట్లతో తాలిపేరు అభివృద్ధి చేయాలి

300 కోట్లతో తాలిపేరు ప్రాజెక్టు అభివృద్ధి చేయాలి

సీనియర్ జర్నలిస్ట్ వందే నరసింహ

నేటి ధాత్రి చర్ల 

 

చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ ను పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలి సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఈ ప్రాంతంలో పర్యటించి 300 కోట్లతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి పూసుగుప్ప ఉప్పరగూడెం కొయ్యూరు లక్ష్మీ కాలనీ సుబ్బంపేట పెద్ద ముసలేరు చిన్న ముసలేరు తిప్పాపురం గ్రామపంచాయతీ లోని పంట పొలాలకు పూర్తిస్థాయిలో గ్రావిటీ కెనాల్ ద్వారా గాని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గాని పూర్తిస్థాయిలో పంట పొలాలకు సాగు నీటిని అందించాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు ఈ ప్రాంతంలోని దళిత గిరిజన యువతకు తాళిపేరు ప్రాజెక్టులో ఉపాధి అవకాశం కల్పించాలి చర్ల మండలంలోని ప్రతి చెరువును పూర్తిస్థాయిలో మిషనరీ సహాయంతో పూడికను తీసి రైతుల పంట పొలాలకు ట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందించాలి ప్రతి చెరువులలో తాలిపేరు ప్రాజెక్టు లో చేపల పెంపకం చేపట్టి దళిత గిరిజన మత్య సహకార సొసైటీలు ఏర్పరచి ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశం కల్పించాలి ప్రభుత్వం
ప్రాజెక్ట్ అంతర్భాగం 1400 ఎకరాలలో పూర్తిస్థాయిలో పూడికను తొలగించి రైతులకు ఉచితంగా మట్టిని అందించాలి విరివిగా కొబ్బరి చెట్లు నాటి పర్యాటకంగా అభివృద్ధి చేయాలి హరిత హోటల్స్ కట్టి పర్యాటకం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి 300 కోట్లతో తాళిపేరు ప్రాజెక్టు పరిధిలో పూర్తిస్థాయిలో అన్ని రకాలుగా సదుపాయాలు అన్ని కల్పించి ఈ ప్రాంత గిరిజన దళిత రైతుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని చర్ల మండల ప్రజలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు

వనపర్తిలో గ్రంథాలయ నూతన అంతస్తు ప్రారంభం

సీ ఎం రేవంత్ రెడ్డి వనపర్తి లో చదువుకున్నారు మంత్రి జుపల్లి ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటీదాత్రి .

 

గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫస్ట్ ఫ్లోర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి , తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రంథాలయ నూతన మొదటి అంతస్తును ప్రారంభించిన అనంతరం సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించార శాలువాలు, బొకేలకు ఖర్చు చేసే సంస్కృతికి స్వస్తి చెప్పి, ఆ డబ్బుతో పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచించారు దినపత్రిక లు పేపర్లు చదవాలని కోరారు . ప్రతి నియోజకవర్గంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో విలువైన పుస్తకాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతామని చెప్పారు
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తికి “చదువుల పర్తి”గా ప్రత్యేక గుర్తింపు ఉందని .
వనపర్తిలో అన్ని రకాల ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయని, నవోదయ విద్యాలయాన్ని కూడా తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని చెప్పారు.సీఎం
రేవంత్ రెడ్డి వనపర్తిలోనే చదువుకున్నారని, విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నారని అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచి చెరో కోటి రూపాయల నిధులు కేటాయించాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. లైబ్రరీ వద్ద హైమాస్ట్ లైట్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖాళీ సమయంలో పుస్తకాలు దినపత్రిక లు చదివే అలవాటు పెంపొందించుకోవాలని, గ్రంథాలయంలో అవసరమైన సౌకర్యాల కల్పనకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి

జిల్లా గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రీయాజ్ జిల్లా చైర్మన్ గోవర్ధన్ సాగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

ప్రొఫెసర్ నవీన్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.1.10 లక్షల ప్రోత్సాహకం అందుకున్న ప్రొఫెసర్ మల్లం నవీన్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్), ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-విద్యా వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారంతో పాటు కళాశాల అభివృద్ధికి రూ.లక్ష, రూ.10 వేల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ నవీన్ మాట్లాడుతూ ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం కాకుండా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. సంకల్పం, క్రమశిక్షణ, సమిష్టి కృషి ఉంటే ప్రభుత్వ కళాశాల కూడా రాష్ట్రంలోనే ఆదర్శ విద్యాసంస్థగా నిలుస్తుందని నిరూపించామన్నారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, కళాశాలను విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక వనరులు, పరిశోధనలో ఉత్తమంగా తీర్చిదిద్దుతానని ప్రిన్సిపల్ తెలిపారు.డిజిటల్ లెర్నింగ్, పోటీ పరీక్షల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రతి తరగతి గది స్ఫూర్తి కేంద్రంగా, ప్రతి విద్యార్థి నాయకుడిగా ఎదగాలన్నదే తన కల అని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి, ఉన్నత విద్యాశాఖ అధికారులకు,
అధ్యాపకులకు, సిబ్బందికి, తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రొఫెసర్ మల్లం నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.

హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా…

హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా…?

బీసీలకు 42శాతం రిజర్వేషన్ మాటల్లో మాత్రమేనా…?

బీసీ హక్కుల కోసం గొంతెత్తినందుకే నాపై రాజ్యాంగ విరుద్ధ సస్పెన్షన్ — పెరుమాండ్ల చరణ్ గౌడ్

కేసముద్రం/ నేటి దాత్రి

మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం 2011 నుండి నిరంతరం పోరాడుతున్న ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంతియుతంగా డిమాండ్ చేసినందుకు నాపై భారత యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి నుండి ఎటువంటి కారణాలు చూపకుండా, వివరణ కోరకుండా, అంతర్గత విచారణ నిర్వహించకుండా సస్పెన్షన్ విధించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని రాజ్యాంగ విరుద్ధం అని పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, బీసీ యువతకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గౌరవం ఇస్తామని ప్రకటించారని. కానీ నేడు వాస్తవ పరిస్థితుల్లో మాత్రం బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీ యువతకు అవకాశాలు దక్కడం లేదని. పార్టీ కోసం కష్టపడిన అనుబంధ సంఘాల కార్యకర్తలను పక్కన పెట్టి, చివరి నిమిషంలో వచ్చిన వారికి పదవులు ఇవ్వడం బాధాకరం అని అన్నారు.
నేను 2011 నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశానని. ఎన్ఎస్‌యూఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారని. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలపై హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా అని. పార్టీ కోసం లాఠీ దెబ్బలు, కేసులు ఎదుర్కొన్నానని , కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోలేదు అని గుర్తుచేశారు.మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంపై నేను చేసిన నిరసన పూర్తిగా శాంతియుతం, ప్రజాస్వామ్యబద్ధమైనది. బీసీ సమాజానికి న్యాయం చేయాలని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేశారు. కానీ దానికి ప్రతిఫలంగా నాపై సస్పెన్షన్ విధించడం బీసీ సమాజాన్ని అణచివేయడమే అని మండిపడ్డారు. ఈ ఘటన ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదని. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ అని చెప్పే నాయకత్వం వాస్తవానికి బీసీ యువత గొంతును ఎంతవరకు అణచివేస్తుందో చూపించే ఉదాహరణ. బీసీ హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా? పార్టీ కోసం 15 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకు ఇదేనా గౌరవం అనే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలలో, ముఖ్యంగా బీసీ యువతలో తీవ్రంగా వినిపిస్తున్నాయని అన్నారు. అందువల్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకుని, బీసీ సమాజానికి న్యాయం చేయడంతో పాటు తన పై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని వినమ్రంగా విజ్ఞప్తి చేశారు.బీసీలకు న్యాయం జరిగే వరకు, కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడే కార్యకర్తలకు గౌరవం దక్కే వరకు నా పోరాటం కొనసాగుతుంది అని ఎన్ ఎస్ యు ఐ మాజీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల చరణ్ గౌడ్ స్పష్టం చేశారు.

శివాలయం కూల్చివేతపై విచారణ జరపాలి

శివాలయం కూల్చివేతపై విచారణ జరపాలి
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మాధవ రెడ్డి బాధ్యత వహించాలి

నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలి

గుప్తనిధుల కోసమే దురాశతో కూల్చివేత: త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తాం

శివాలయం పునర్నిర్మించకుంటే అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ చేపడుతుంది

బిఆర్ఎస్ రాష్ట్ర నేత,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో నిర్మించిన చారిత్రాత్మక శివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. కూల్చివేతపై వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని శుక్రవారం డిమాండ్ చేశారు.పురావస్తు శాఖ పరిధిలోని కాకతీయుల నాటి వారసత్వ సంపదను స్కూల్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేయడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి హస్తం ఉందని పెద్ది ఆరోపించారు. మట్టి కోట మధ్యలో ఉన్న శివాలయం 100 శాతం పురావస్తు శాఖ ఆస్తి అని, కాకతీయ కట్టడాలను తాకే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.స్కూల్ నిర్మాణం ముసుగులో అర్ధరాత్రి శివాలయాన్ని వెయ్యి ముక్కలు చేసి, రెండు గజాల లోతు తవ్వారని, గుప్తనిధుల కోసమే ఈ దురాశ అని విమర్శించారు. నర్సంపేటలో ఎమ్మెల్యే మాధవ రెడ్డే కాంట్రాక్టర్ అని, ‘శ్రీమాత కన్‌స్ట్రక్షన్’ పేరుతో బినామీ టెండర్లు వేసి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.శివాలయ విధ్వంసంపై ఇప్పటివరకు కాంట్రాక్టర్, అధికారులపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. దోచుకున్న సంపద మొత్తం రికవరీ చేసి, శివాలయాన్ని పునర్నిర్మించాలని, బాధ్యులైన ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తున్నామని, ఢిల్లీలోని పర్యాటకశాఖ, సీఎస్, పురావస్తుశాఖ, దేవాదాయ శాఖ, డీజీపీ, గవర్నర్‌కు బీఆర్ఎస్ తరఫున ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పునర్నిర్మించకుంటే, రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో పార్టీనే శివాలయాన్ని పునర్నిర్మిస్తుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు.ఈకార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తక్కల్లపెల్లి రవీందర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, జిల్లా నాయకులు నల్లా మనోహర్ రెడ్డి, నాడెం శాంతి కుమార్,బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యువరాజు, మండల శ్రీనివాస్,నాగిశెట్టి ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి, ప్రచార కార్యదర్శి, పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండనీయం

కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండనీయం

దొమ్మటి బాబురావు కాంగ్రెస్ నాయకులు

పరకాల,నేటిధాత్రి

 

 

 

రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు దొమ్మటి బాబురావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కేటిఆర్ కు లేదన్నారు.ప్రజల సమస్యలపై సమాధానాలు చెప్పాల్సిన ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైంది కాదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.రైతు రుణమాఫీ,ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం కట్టుబాటుతో పనిచేస్తోందన్నారు.ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించకుండా రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని,కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు అసహనానికి గురవుతున్నాయని వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవంతో రాజకీయాలు జరగాలని,అనవసర ఆరోపణలు మానుకోవాలని ఆయన సూచించారు.

రేవంత్ మాస్టర్ ప్లాన్…

రేవంత్ మాస్టర్ ప్లాన్?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త పదం… “CBI స్ట్రాటజీ”..!
కాళేశ్వరం నుంచి కరెంట్ కొనుగోళ్ల వరకూ… ఒక్కో ఫైల్ తెరుచుకుంటుంటే… రాజకీయంగా హీట్ పెరుగుతోంది..!
ఇది నిజంగా అవినీతి వేటా..? లేక 2028 ఎన్నికల ట్లాడటం లేదు..!
ఒకేసారి BRSను డిఫెన్స్‌లోకి నెట్టేస్తూ… BJPని కూడా కార్నర్ చేసే పొకోసం వేసిన మాస్టర్ ప్లానా..?

రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం కేసుల గురించి మాలిటికల్ చెస్ ఆడుతున్నారన్న చర్చ నడుస్తోంది..!
“సీబీఐకి అప్పగించాం” అని చెప్పి…
విచారణ జరిగితే BRS ఇరుక్కుపోతుంది…
జరగకపోతే “BJP-BRS సీక్రెట్ ఫ్రెండ్‌షిప్” అంటూ ప్రజల్లోకి వెళ్లొచ్చన్న లెక్కలు కనిపిస్తున్నాయ్..!
కాళేశ్వరం కేసులో నెలలు గడిచినా సీబీఐ స్పందించలేదు..!
అయినా… ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల కేసును కూడా అదే సీబీఐకి అప్పగించాలని నిర్ణయం..!
ఇది సాధారణ నిర్ణయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు..!
“రిస్పాన్స్ వచ్చినా లాభమే… రాకపోయినా లాభమే” అనేలా…
రేవంత్ టీమ్ ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకుందని టాక్..!
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..!
జస్టిస్ లోకూర్ రిపోర్ట్…
కాళేశ్వరం కమిషన్ ఫైండింగ్స్…
ఈ రెండింటినీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ వెపన్స్‌లా వాడబోతుందా..?
“అవినీతి జరిగింది” అని చెప్పడమే కాదు…
“ఇదిగో సాక్ష్యం” అంటూ ప్రజల ముందుంచే ప్లాన్‌లో ఉందా..?
తెలంగాణలో ఇప్పుడు అసలు ఫైట్… కాంగ్రెస్ వర్సెస్ BRS మాత్రమే కాదు..!
“BRS + BJP ఒకటే” అనే నారేటివ్‌ను బలంగా నాటేందుకు రేవంత్ కొత్త గేమ్ స్టార్ట్ చేశారన్న చర్చ జోరందుకుంది..!
సీబీఐ విచారణ మొదలైతే తెలంగాణ రాజకీయాల్లో భూకంపమేనా..?

హేమాహేమీల ఖాళీ భర్తీ ‘నేషనల్’ స్టార్ గా రేవంత్ రెడ్డి!

హేమాహేమీల ఖాళీ భర్తీ
‘నేషనల్’ స్టార్ గా రేవంత్ రెడ్డి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దక్షిణాది గళంగానే కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వ్యూహకర్త గా అవతరిస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలంగాణలో అప‌ర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్‌ను ఓడించి సీఎం కావడంతో రేవంత్‌ రెడ్డికి ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఎక్స్ పోజర్ పెరిగింది. త‌న మాట తీరు..స్పాంటేనియ‌స్ అటాకింగ్‌తో డైన‌మిక్ లీడ‌ర్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్..కాంగ్రెస్‌ నేషనల్‌ స్టార్ క్యాంపెయినర్స్‌ లిస్ట్‌లో మొద‌టి వ‌రుసలో చేరిపోయారు. ఎన్నిక ఏదైనా..కాంగ్రెస్ పార్టీకి దాని అలయన్స్ పార్టీలకు మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు రేవంత్‌. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. లేటెస్ట్‌గా కేరళలో రేవంత్ చేసిన క్యాంపెయిన్..కమ్యూనిస్ట్ పార్టీలు..ప్రధాని మోదీ టార్గెట్‌గా ఆయన చేసిన విమ‌ర్శలు పెద్ద చర్చకు దారితీశాయి. త‌న ప్రసంగాల‌తో మ‌ల‌యాళీల మ‌నసు దోచుకునే ప్రయత్నం చేశారు రేవంత్.

ఏదో ఒకరోజు కచ్చితంగా తెలంగాణ‌కు సీఎం అవుతానంటూ బ‌హిరంగంగా స‌వాల్ చేసి..టార్గెట్ రీచ్ అయిన రేవంత్‌..ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉంటూనే మ‌రో టార్గెట్‌పై ఫోక‌స్ పెట్టారట. ఇప్పటికే తెలంగాణ‌కు మ‌రోసారి సీఎంగా ఉంటాన‌ని బ‌హిరంగంగా చెబుతూనే..నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో ఎమ‌ర్జ్ అయ్యే స్కెచ్ వేస్తున్నారట. అందుకు తగ్గట్లుగా టైమ్‌..టైమింగ్ కలిసి వస్తోందని..జాతీయ రాజకీయాల్లో లోటు కూడా ఉందని భావిస్తున్నారట. మ‌మ‌తా బెన‌ర్జీ, స్టాలిన్‌, పిన‌ర‌యి విజ‌య‌న్‌, అశోక్ గెహ్లాట్‌, వ‌సుంద‌రా రాజే, మాయ‌వ‌తి, ములాయమ్‌ సింగ్ యాద‌వ్‌, లాలూప్రసాద్ యాద‌వ్‌, నితీష్ కుమార్‌, శివ‌రాజ్‌సింగ్ చౌహాన్..ఇలా చాలామంది హేమాహేమీలు ఇప్పుడు సీఎం పదవిలో లేరు. పైగా కాంగ్రెస్‌, దాని అనుబంధ పార్టీల్లో ఆ స్థాయి గుర్తింపు ఉన్న నేతలు కూడా కరువయ్యారు. ఇదే సరైన అవ‌కాశమని లెక్కలు వేసుకుంటున్న రేవంత్..నేషనల్‌ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యే స్కెచ్ వేస్తున్నారట.

గ‌తంలో నేష‌న‌ల్ పాలిటిక్స్ లో తెలుగు రాష్ట్రాల నుంచి కొంద‌రు నేత‌లు చ‌క్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో దేశ ప్రధానిగా పీవీ న‌ర్సింహారావుకు ఛాన్స్ ద‌క్కింది. ఆ త‌ర్వాత జాతీయ రాజ‌కీయాల‌ను శాసించిన వారిలో ఎన్టీఆర్‌, చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీయే సర్కార్‌ను నిలబెట్టడంలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో ఉన్న లోటును ఆక్యుపై చేయాలని భావిస్తున్నార‌ట‌. సేమ్‌టైమ్‌ ఏఐసీసీకి కూడా ఈ తరం లీడర్ల అవసరం ఉంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సౌత్‌కు చెందిన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఉన్నారు. ఆయ‌నకు వయోభారంతో..ఆరోగ్యం పెద్దగా స‌హ‌క‌రించ‌డం లేదు.

ఇక క‌ర్ణాట‌క సీఎం సిద్దరామ‌య్య, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ మ‌ధ్య వివాదంతో ఇంటిపోరుకే సరిపోతున్నారు. ఇదే అదునుగా సీఎం రేవంత్ రెడ్డి చాలా వేగంగా పావులు క‌దుపుతున్నార‌ట‌. అందుకే జాతీయ స్థాయి అంశాలపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతూ నేషనల్ ఎక్స్‌పోజర్ వచ్చేలా వ్యూహాలకు పదును పెడుతున్నారట రేవంత్. డీలిమిటేష‌న్ అంశంలో..రేవంత్‌ తెచ్చిన ప్రతిపాదన ఎంత పెద్ద చర్చకు..రచ్చకు దారితీసిందో చెప్పక్కర్లేదు. కానీ రేవంత్‌ సెంట్రిక్‌గానే డీమిలిటేషన్‌ ఫైట్‌ నడిచిందనడంలో మాత్రం డౌటే లేదు.

ఓర్వలేక బి ఆర్ఎస్ నేతల విమర్శలు ..

ఓర్వలేక బి ఆర్ఎస్ నేతల విమర్శలు ..

! కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

రైతుల ప్రజా ప్రయోజనాలు పెద్ద పీట వేసే ప్రజా ప్రభుత్వం అని రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము విలేకరుల సమావేశంలో తెలిపారు వారు మాట్లాడుతూ వరంగల్ రైతు సభలో టిఆర్ఎస్ నాయకులు సారంగ మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణమాఫీఎలా చేశారో అన్నదాతలకు ఇక గుర్తుంది టిఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం నిధులు బడ్జెట్తో ఉందని అయినప్పటికీ లక్ష వరకు రుణమాఫీ ఒకేసారి చేయలేకపోయారని తెలిపారు రైతులకు రుణమాఫీ కాకపోగా 20.0630 కోట్ల వడ్డీ భారం రైతుల మీద పడింది అయినప్పటికీ రైతులు నమ్మి టిఆర్ఎస్ కు రెండోసారి అధికారం అప్పగిస్తే 2018 2023 వరకు అధికారంలో ఉంది రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు 2018లో లక్ష వరకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని దశలవారీగా అమలు చేయడం ద్వారా రూ.8.515 కోట్ల వడ్డీ భారం పడడంతో పాటు రూ.8.379 కోట్లు పూర్తిగా ఎగగోట్టారని విమర్శించారు అంతేకాకుండా రూ .1.419 కోట్ల ఖాతాలు సరిగ్గా లేనందున వెనక్కి వెళ్లిపోయాయని రైతులను మోసం చేశారు అధికారంలోఉన్న పదేళ్లపాటు రైతుల నిర్లక్ష్యం చేసి నా ప్రభుత్వం ఇప్పుడు రైతులపై ప్రేమ నటించడం కపటత్వానికి నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం రుణమాఫీ చేయాలని కృత నిశ్చయంతో రూ.20.166.89 కోట్ల పంట రుణమాఫీ చేశారని తెలిపారు రుణమాఫీతో 25.35.964 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు ప్రస్తుత బి ఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరి ఏ పని చేయడం లేదని ద్వారా రైతులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు తమ ప్రభుత్వం అభినందాల్సింది పోయి విమర్శించడం బి ఆర్ఎస్ నేతల కుటిల బుద్ధికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము దుయ్యబట్టారు ఇష్ట రాజ్యాంగ మాట్లాడితే బి ఆర్ఎస్ నేతలను ప్రజలే మరో మారు తరిమికొడతారని హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version