మృతుడి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీపీ.

మృతుడి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీపీ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మైలారo గ్రామంలో భూపాల పల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాలమేరకు శాయంపేట మండలం మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్ సోదరుడు కీ!!|శే అరికిళ్ల ప్రవీ ణ్(ఆర్మీ)నిన్న మరణించగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి ప్రవీణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థిస్తూ వారి కుటుం బానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు.ఈ కార్యక్రమంలో రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, దాసి శ్రావణ్ కుమార్, సౌల్ల కిష్ట య్య, నర్ర రాజు, అర్జల సాంబ రెడ్డి, కొమ్ముల శివ,కుతాటి రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామంలో శుక్రవారం రోజున ప్రభుత్వ పాఠశాల ప్రారంభ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల శ్రీనివాస్ పదివేలు విలువ గల నోట్ బుక్స్ అందజేశారు. అట్టి నోట్ బుక్స్ పంపిణీ చేసిన రామడుగు మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ ముఖ్యఅతిథిగా హాజరై నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మాగ్రామ ప్రభుత్వ పాఠశాలకు గత సంవత్సరం నోట్ పుస్తకాలతో పాటు వంట పాత్రలు అందజేశారు. మాపాఠశాలకు ఇంత సేవ చేస్తున్నందుకు మాగ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గుంట ఓంప్రకాష్, గుత్తూరి శ్రీనివాస్, పొన్నాల అజయ్, రవీందర్, లక్ష్మయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version