డిజిటల్ పద్ధతిలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు

డిజిటల్ పద్ధతిలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు

నర్సంపేట నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

283 బూత్‌లకు ఇద్దరి చొప్పున ఇన్‌చార్జిల నియామకం

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు.అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో డిజిటల్ ఆన్‌లైన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో చేపట్టనున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 283 బూత్‌లకు గాను ప్రతి బూత్‌కు ఇద్దరి చొప్పున ఇన్‌చార్జిలను నియమించి త్వరలో వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.సభ్యత్వ నమోదు కార్యక్రమ పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నియమించినట్లు తెలిపారు. నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అన్ని మండలాల్లో మండల స్థాయి కోఆర్డినేషన్, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పాల్గొని విజయవంతం చేయాలని పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. నమోదు అనంతరం అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయనుందని, నూతన కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు, యువతకు పెద్దపీట వేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు “సీక్రెట్ ఫ్రెండ్‌షిప్” అంటూ నడిచిన గుసగుసలకు…

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు “సీక్రెట్ ఫ్రెండ్‌షిప్” అంటూ నడిచిన గుసగుసలకు…
ఒక్క కేసు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
అవును…

బండి భగీరథ్ పోక్సో కేసు ఇప్పుడు కేవలం లీగల్ కాంట్రవర్సీ కాదు…
తెలంగాణ రాజకీయాల “పవర్ మ్యాప్”నే మార్చేసిన టర్నింగ్ పాయింట్‌గా మారింది.

ఇప్పటివరకు “కాంగ్రెస్‌ను ఆపాలంటే… భవిష్యత్తులో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఎక్కడో ఒక సైలెంట్ అండర్‌స్టాండింగ్ కుదురిందన్న ప్రచారం సారింగి.

ఎందుకంటే…
కేసీఆర్, కేటీఆర్‌ బీజేపీపై దాడి చేసినా…
ఫోకస్ ఎక్కువగా రాష్ట్ర నేతలపైనే ఉండేది.
ఢిల్లీ లీడర్‌షిప్‌పై పూర్తి స్థాయి వార్ మాత్రం కనిపించేది కాదు.
అక్కడే రాజకీయ కారిడార్లలో ఒక థియరీ వైరల్ అయింది.
“బయటకు ఫైట్… లోపల సెటిల్‌మెంట్…” అని.

కానీ…
బండి భగీరథ్ కేసు తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది.
ఈసారి బీఆర్ఎస్ కేవలం స్పందించలేదు…
పూర్తి స్థాయి పొలిటికల్ అటాక్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.
కేటీఆర్ నేరుగా బండి సంజయ్ మంత్రి పదవినే టార్గెట్ చేయడం…
గులాబీ కేడర్ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ నిరసనలకు దిగడం…
బీజేపీకి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది.
“ఇక్కడ పొత్తుల పాలిటిక్స్ కాదు… పవర్ వార్ మొదలైంది” అని.
ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్గెస్ట్ షిఫ్ట్‌గా మారింది.
ఎందుకంటే…
ఇప్పటివరకు బీజేపీ బీఆర్ఎస్‌పై చూపించిన మెత్తటి వైఖరి…
ఇక కనిపించకపోవచ్చనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ విక్టరీ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న కమలం…
ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
అందుకే ఇప్పుడు బీజేపీ లెక్క ఒక్కటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
“కాంగ్రెస్‌ను ఓడించాలంటే ముందు బీఆర్ఎస్‌ను వీక్ చేయాలి.”
ఎందుకంటే…
గ్రామ స్థాయిలో ఇంకా బలమైన కేడర్…
ఎమోషనల్ కనెక్ట్…
స్థిరమైన ఓటు బ్యాంక్…
ఇవన్నీ ఇప్పటికీ గులాబీ పార్టీ దగ్గరే ఉన్నాయి.
అందుకే ఇప్పుడు అసలు టార్గెట్ కాంగ్రెస్ కాదు…
బీఆర్ఎస్ అవుతుందనే చర్చ బలపడుతోంది.
మరోవైపు కాంగ్రెస్ కూడా సైలెంట్‌గా తన గేమ్ ఆడుతోంది.
బీఆర్ఎస్ నుంచి కేడర్‌ను…
స్థానిక నాయకత్వాన్ని…
గ్రౌండ్ ఓటును తనవైపు తిప్పుకునే ఆపరేషన్ వేగవంతం చేసింది.
అంటే ఇప్పుడు గులాబీ పార్టీపై డబుల్ అటాక్ స్టార్ట్ అయినట్టే.
ఒకవైపు కాంగ్రెస్ “పొలిటికల్ షిఫ్ట్” ప్లాన్ చేస్తుంటే…
మరోవైపు బీజేపీ “లీగల్ అండ్ స్ట్రాటజిక్ ప్రెషర్” పెంచే దిశగా అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది.
దీంతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య సైలెంట్ అవగాహన ఉందనే ప్రచారం…
ఇప్పుడు పూర్తిగా కూలిపోయింది.
అంటే ఇకపై తెలంగాణలో…
“ఫ్రెండ్లీ ఫైట్” కాదు…
ప్యూర్ పొలిటికల్ బ్యాటిల్ చూడబోతున్నామన్న మాట.
దీంతో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు దాదాపు ఖాయమైపోయింది.
కాంగ్రెస్… బీజేపీ… బీఆర్ఎస్…
మూడు పార్టీలు కూడా ఇప్పుడు “సర్వైవల్ మోడ్”లోకి వెళ్తున్నాయి.
కానీ అసలు ప్రశ్న ఒక్కటే.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎవరు క్యాష్ చేసుకుంటారు..?
బీజేపీ-బీఆర్ఎస్ ఒకరినొకరు దెబ్బతీసుకుంటే లాభం కాంగ్రెస్‌కేనా..?
లేక… ఈ హై వోల్టేజ్ వార్‌లో కొత్త రాజకీయ సమీకరణాలు పుడతాయా..?
ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.

45 రోజుల్లో రైతు భరోసా అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

45 రోజుల్లో రైతు భరోసా అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

#50 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో రైతు భరోసా చెల్లింపులు లేవు

#కేసీఆర్ హయాంలో రైతులకు గౌరవం, భరోసా ఉండేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

#బీఆర్ఎస్ నాయకుడు భూక్య జంపన్న

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

ఎన్నికల సమయంలో రైతులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. 45 రోజుల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, నేటికీ 50 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు అందలేదని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రెండు ఎకరాల వరకే రైతు భరోసా చెల్లించి, మిగతా రైతులను నిరాశలోకి నెట్టిందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించకపోవడం రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జంపన్న ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు, వ్యవసాయం గుర్తుకు వస్తాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని గుర్తు చేశారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ముందుగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతు కుటుంబాలకు భరోసా కల్పించారని అన్నారు.
ఈరోజు గ్రామాల్లో రైతులు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ, అప్పటి పరిస్థితులు బాగుండేవని చర్చించుకుంటున్నారని జంపన్న పేర్కొన్నారు. రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అని రైతులు ఇప్పటికీ భావిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, వెంటనే రైతు భరోసా నిధులను రైతులందరికీ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలని, లేకపోతే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.A

రేవంత్ రెడ్డి నువ్వు రైతువా నకిలీ రైతువా…

రేవంత్ రెడ్డి నువ్వు రైతువా నకిలీ రైతువా

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులు పండించిన ధాన్యం అమ్ముకోలేకపోవడంలో వైఫల్యానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది.

రైతులకు ప్రధానంగా కావాల్సిన గన్ని బ్యాగ్స్ సప్లై చేయడంలో మొదలుకోని దానికి కావలసినటువంటివి ఏర్పాటు చేసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.అసలు ప్రభుత్వానికి రైతులన్న, రైతు సమస్యలన్న ఆలోచన లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.

ముఖ్యమంత్రి కి తిరగడానికి సమయం ఉంది కానీ,రైతులు పండించిన పంట కొనుగోలు పై ఆలోచన చేయడానికి సమయం లేదా..?

రేవంత్ రెడ్డి నువ్వు రైతు బిడ్డవి అని ఫోజులు కొడతావ్ కదా… అసలు నువ్వు రైతువా.. నకిలీ రైతువా…?
రైతులు మా తరుపున కొట్లాడాలి, మాకు న్యాయం చేకూరేలా కార్యాచరణ చేపట్టాలి అని మమ్మల్ని కోరుతున్నారు.
మక్కలు పండించిన రైతుల బాధ వర్ణనాతీతం.నా నియోజకవర్గం భూపాలపల్లిలో రైతులే గన్ని బ్యాగులు తెచ్చుకోవాలి, రైతులే 51.5 కిలోలు కాంట వేయాలి, వాహనాల్లో లోడింగ్ చేసుకోవాలి, అన్లోడింగ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నేడు దళారీ వ్యవస్థ పై మళ్ళీ రైతన్న ఆధారపడే వ్యవస్థ మొదలయింది.
ఒక్క భూపాలపల్లినే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని సెంటర్లన్ని కాంగ్రెస్ నాయకుల కన్నుసన్నల్లో, వారి డైరెక్షన్లో నడుస్తున్నాయి.
కాబట్టి ఇప్పటికైన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పంటలను ప్రభుత్వం కొన్నది అని పేపర్లలో పోజులు కొట్టడం కాదు, గాల్లో తిరుగుతూ చేతులు దులుపుకోవడం కాదు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది ఇప్పటివరకు కనీసం రాష్ట్రంలో రైతులు ధాన్యం ఎన్ని ఎకరాలలో వేశారు, ఎంత దిగువడి వచ్చింది, దానికి కావాల్సిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గోదాంల ఏర్పాటు వంటి వాటిపై ఒక్కసారి అయిన సమీక్షా చేశారా…?
మేము వస్తే రైతురాజ్యం వస్తది అని ప్రజలను నమ్మించి మోసం చేసినవ్.
ప్రజలు నేడు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన వ్యక్తి ఎవరూ అంటే రేవంత్ రెడ్డి… రైతు బాంధవుడు, రైతు రాజ్య స్థాపకుడు ఎవరూ అంటే అది కేసిఆర్ అని.
అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ రోజు మీకు అధికారం ఇచ్చిన పాపానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కేసీఆర్ చోరువతో రైతులు రెండు నుండి మూడు లక్షల ఎకరాలలో ఫామాయిల్ పంట వేయడం జరిగింది.
యూరియా యాప్ పెట్టిర్రు, ఆ యాప్ పనిచేయడం లేదు కాబట్టి వెంటనే యూరియా యాప్ ఓపెన్ చేసి ఆయిల్ఫామ్ పంట రైతులకు యూరియా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచినట్టు ప్రకటించి ఒకపక్క డిజిల్ ధరలు మరొక పక్క రైతుల ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా పెంచడం జరిగింది.
ఇప్పటికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై అదనపు భారం పడకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా రైతుల విషయంలో ఆలోచన చేయమని భారత రాష్ట్ర సమితి పార్టీ రైతుల తరుపున ప్రభుత్వాన్ని కోరారు.

వనపర్తి అభివృద్ధి నిరంజన్ రెడ్డిదే: శ్రీధర్

వనపర్తి అభివృద్ధి చేసేంది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ఇప్పిటి వరకు రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయంచ లేదు ఎమ్మెల్యే

మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీదర్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి పట్టణంలో స్వామి వివేకానంద చౌరస్తా నుండి రాజావారి బంగ్లా పాలిటెక్నిక్ కళాశాల కొత్త బస్టాండ్ రోడ్డు కొత్తకోట రోడ్డు కొల్లాపూర్ రోడ్డు ఇంత వరకు రోడ్లు విస్తరణ పనులు వనపర్తి ఎమ్మెల్యే పూర్తి చేయంచాలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ బీ ఆర్ ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీదర్ 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్ ఒక ప్రకటన లో తెలిపారు వనపర్తి లో రోడ్ల విస్తరణ పనులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 90 శాతం వనపర్తి ప్రజల కోరిక మేరకు బాధితుల సహకారము తీసుకొని రోడ్డు కటిoగ్ సెంటర్ డివైడర్ అధునాతన లైటింగ్ సెంటరు లో చెట్లు ఏర్పాటు నల్ల చెరువుదగ్గర జమ్మి చెట్టు తాళ్ల చేరుపు సుందరి కరణపాత మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో షాపుల నిర్మాణం .
నియోజకవర్గంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఆలోచతో అవసరమైన నిధులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారము తో ప్రజల అవసరాల అభివృద్ధి పనులు పూర్తి చేశారని వారు పేర్కొన్నారు
మంత్రి జుపల్లి ,ఎం.ఎల్.ఏ ప్రారంభించిన డిజిటల్ గ్రంథాలయం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కట్టిచ్చి విషయం వనపర్తి ప్రజలకు తెలుసునని వాకిటి.శ్రీధర్ తిరుమల్ అన్నారు
పత్రికలలో ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారాని వారు విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల విషయములో అరకొర చేస్తూ న్నారని వారు అన్నారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణలు చేసి ఇస్తున్నారని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడము లేదనిహామీలు గాలికి వదిలేసారని వారు ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి
నిరంజన్ రెడ్డి సాధించిన పథకాలకు ప్రారంభోత్సవాలు చేయడం మాని కొత్త పథకాలు తెచ్చి ప్రజలకు చూపాలని వారు డిమాండ్ చేశారు.

కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం పాడి కౌసిక్ రెడ్డి కేంద్ర మంతి..

కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం పాడి కౌసిక్ రెడ్డి కేంద్ర మంతి బండి సంజయ్ కుమార్ ను నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోవాలా

డా జాడి రామరాజు నేత

ఏటూరునాగారం, నేటిధాత్రి

శుక్రవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ కెసిఆర్ కేటీఆర్ మెప్పు కోసం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌసిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోవాలా లేక మరోసారి మాట్లాడకుండా బాడితే పూజ చెయ్యాలో పాడి కౌశిక్ రెడ్డి కి మద్దతుగా మాట్లాడుతున్నా అగ్గిపెట్టె హరీష్ రావు చెప్పుతే బాగుంటదని అన్నారు అదేవిదంగా బి ఆర్ ఎస్ నాయకుడు ఎమ్మెల్యే కావడానికి బిడ్డను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి గెలిసిన నాటి నుండి నేటి వరకు గొడవ పెట్టుకొని పార్టీ కానీ రోజు కానీ ఉన్నదా అన్నారు ఏదైనా సమావేశం పెట్టిన పాడి కౌశిక్ రెడ్డి గొడవలు సృటించి కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం ఎవ్వరితో పడితే వారితో గొడవలు పెడితే అందరు ఊరుకోరు అనేది బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాడి కౌసిక్ రెడ్డి లాంటి చిల్లర రాజకీయ నాయకులకు చెప్పవలసిన భాద్యత కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావే భాద్యత అవించాలని అన్నారు అదేవిదంగా కెసిఆర్ కేటీఆర్ అధికారం లో ఉన్నప్పుడు నేరెళ్ల సంఘటన కానీ సిరిసిల్ల పెద్దపల్లి అడ్వా్కేట్ దంపతులను హత్యలు చేసిన చరిత్ర బి ఆర్ ఎస్ ప్రభుత్వం కదా అన్నారు అధికారం లో ఉండగా భూ కబ్జాలు ప్రతి పక్ష పార్టీ లు లేకుండా అక్రమ కేసులు పెట్టిన తెరాస నాయకులు నేడు పాడి కౌసిక్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల ను ఇతర పార్టీ నాయకుల పై మాట్లాడించి ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని కెసిఆర్ కేటీఆర్ లాంటి నాయకులు చూస్తున్నారని అన్నారు అదేవిదంగా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులు ప్రజల సమస్యలను పక్కకు నెట్టి క్రిస్టియన్ ముస్లిం ఓట్ల కోసం బీజేపీ పార్టీ నాయకులపై చిల్లర మాటలు మాట్లాడుతూనే హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరామ చంద్రుని పైకూడా రాజకీయాలు చేసుకుంటూ హిందువులను కించపరుస్తున్నారని అన్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేధావులు హిందూ బందువులారా ఒక్కసారి అలోచించి అర్ధం చేసుకొని క్రిస్టియన్ ముస్లిం ఓట్ల కోసం హిందూ దేవుళ్లను కించపరస్తూన్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ కాంగ్రెస్ ను భూష్టాపీతం చేద్దాం మన ఆస్తిత్వాన్ని మనం కాపాడు కోవలసిన భాద్యత హిందూ బంధువుల అందరిపై ఉన్నదాని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత అన్నారు

కారు పార్టీ వైపు రాజగోపాల్ రెడ్డి?

కారు పార్టీ వైపు రాజగోపాల్ రెడ్డి?

రాజకీయాల్లో ఎప్పుడు ఏ వింత జరుగుతుందో చెప్పలేం అనడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలే నిదర్శనం. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టి తన తండ్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసుకోవడం సహజం, కానీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయి ఉండి, తమ ప్రత్యర్థి కేసీఆర్ పట్ల ఇంత సానుభూతి చూపడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.

​”తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది?” అంటూ రాజగోపాల్ రెడ్డి పై మండిపడ్డారు. నిన్నటి దాకా కేసీఆర్ పాలనను, ఆయన కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వ్యక్తి, ఇప్పుడు కేసీఆర్ ఒక ఉద్యమకారుడని, ఆయన్ని విమర్శిస్తే తనకు బాధేస్తోందని అనడం చూస్తుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు. సొంత తమ్ముడి కంటే ఎదురింటి బాబాయ్‌కే ఎక్కువ ప్రేమ ఉన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉందని, ఇది రాజకీయం కంటే ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ‘ఓవర్ యాక్షన్’ లా కనిపిస్తోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

​మరోవైపు, రాజగోపాల్ రెడ్డి ఈ సాకుతో కవితను టార్గెట్ చేస్తూనే, కేసీఆర్ దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. కవితకు డిపాజిట్లు రావని ఎద్దేవా చేస్తూనే, కేసీఆర్‌ను వెనకేసుకొస్తుండటం వెనుక భవిష్యత్తులో ఆయన “కారు” ఎక్కే ప్లాన్ ఏమైనా ఉందేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కెసిఆర్ పాలనలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలే..

కెసిఆర్ పాలనలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలే

ఒక విజన్ తో పాలించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్

ప్రజా సంక్షేమాన్ని మరిచి పాలన సాగిస్తున్న అధికార పార్టీ

కేసముద్రం/ నేటి ధాత్రి

శనివారం పత్రిక మిత్రుల సమావేశంలో బి ఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ నియోజకవర్గపు ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలుమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత ప్రజా సంక్షేమ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఈ రాష్ట్ర రైతన్నకి కాలేశ్వరం అనే బృహత్తర ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా దాని నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని గొలుసు కట్టు చెరువులకు నీళ్లు అందించి భూగర్భ జలాలను పెంచారని రైతుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైతుబంధు నిరంతరం 24 గంటలు విద్యుత్ సరఫరా పండిన పంటలను ప్రభుత్వం పరంగా కొనుగోలు చేసి రైతుకు కష్టం లేకుండా చేసినారని దీనిని చూసి ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బి ఆర్ఎస్ పార్టీ నేతలకు నానా ఇబ్బంది పెట్టుకుంటూ లేనిపోని కమిషన్లు వేసి కేసులు పెట్టిన కోర్టుల చుట్టూ తిప్పుతూ చేసిన అభివృద్ధి పద్ధతిగా లేదని తిరస్కరించి ప్రజల్లో దుష్ప్రచారం నిర్వహిస్తుందని, ప్రభుత్వం వేసిన అర్జీలను హైకోర్టు గత పాలకుల తప్పులేదని తేల్చి చెప్పిందని. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంప పెట్టని కాలేశ్వరాన్ని ఏదో ఒక పిల్ల క్రాకులు వస్తే ఇది కూలిపోయిందని పనికిరాదని ప్రచారం నిర్వహిస్తూ ఎన్ని రోజులు ప్రజాసంక్షేమాన్ని మరిచి పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబెట్టారు. ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు రిటైర్డ్ ఎంప్లాయిస్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు వారి ఆత్మహత్యలకు చావులకు దారి చూపెట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి అన్ని వర్గాల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు ప్రజాపాలనాన్ని కొనసాగిస్తున్నారని ఎండగట్టారు. అన్ని వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించకుండా తప్పుడు ప్రచారాలు నిర్వహించుకుంటూ గత పాలకులను నిందించడమే ఏకైక ఎజెండా గా పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారని ఇప్పటినుంచి రైతులకు గాని ఉద్యోగస్తులకు గాని ఎలాంటి ఆపద వచ్చిన బి ఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతుందని గంటపదంగా చెబుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చాలని నెరవేర్చకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని మండల పార్టీ కచ్చరిస్తుందని తెలిపారు. మొక్కజొన్న రైతులకు వారి మొక్కజొన్నలను కొని ఆదుకోవాలని మండల పార్టీ కోరుతున్నదని రైతులకు నిరంతరం విద్యుత్తు నీరు అందించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపాలని మండల పార్టీ కోరుతున్నదని ఆర్టీసీ కార్మికుల కోరికలను వెంటనే అమలు చేయాలని మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఒక్క ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుందని అన్నారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించి వారికి ఆదుకోవాలని అన్నారు. నిరుద్యోగ యువతను ఉద్యోగాలు ఇచ్చివారి జీవితాలకు వెలుగు నింపాలని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు ఎలాంటి అపోహల గురి కాకుండా ధైర్యంగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలను కోరినారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, టౌన్ పార్టీ అధ్యక్షులు గుగులోత్ వీరు నాయక్ , ఊకంటి యాకూబ్ రెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాటోత్ సుజాత హరినాయక్ రావుల వినయ్ రెడ్డి, ఆగే రాము ,దూదేపాక కృష్ణ ,మేకల శారద సురేష్ ,పైరాల శరత్ , పురం రాజమణి రమేష్ , సర్పంచులు ఈసం లక్ష్మీనారాయణ, ఎదరబోయిన సూరయ్య బాలాజీ,జ్యోతి శ్రీనివాస్ , మాజీ సర్పంచులు హరి రామ్ ముఖ్య నాయకులు పందుల సంజీవ తోట శీను బానోత్ వెంకన్న మాజీ ఎంపిటిసిలు కొమ్ము రాహులు, దుబ్బాక వెంకన్న , చందు, యనమల్ల ప్రభాకర్ ,రాయుడు కూన భద్రాద్రి, లింగాల పిచ్చయ్య, బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ నయా ప్లాన్ 27న బ్లూప్రింట్ విడుద‌ల…

కేసీఆర్ నయా ప్లాన్
27న బ్లూప్రింట్ విడుద‌ల

కాంగ్రెస్ పాలనకు రెండున్నరేళ్లు పూర్తయ్యాయి… కానీ అసలు రాజకీయ కథ ఇప్పుడు స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఫాంహౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఒక్కసారిగా బయటకు రావడం… అదే సమయంలో జీవన్ రెడ్డి చేరిక… ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ మెసేజ్‌గా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. జగిత్యాల సభతో వచ్చిన మైలేజీతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ప్రభుత్వానికి సమయం ఇచ్చామని.. ఇక ఊరుకునేది లేదని గులాబీ కేడర్‌ను ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై దృష్టి సారిస్తూ ఈనెల 27న మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ముఖ్య సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు.
అదే రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడం, రజతోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్నీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ భవిష్యత్ బ్లూప్రింట్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. సంస్థాగత నిర్మాణం నుంచి సభ్యత్వాల పునరుద్ధరణ వరకు… జిల్లా, మండల స్థాయిలో కొత్త లీడర్‌షిప్ యాక్టివేషన్ వరకు… ప్రతి అంశంపై డీప్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తారని టాక్. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి? అనే విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా, మండల స్థాయిలోనూ పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, నాయకత్వాన్ని చురుకుగా మార్చడం వంటి అంశాలు ఎజెండాలో ఉండనున్నట్టు తెలుస్తున్నది.

కొత్త సభ్యులను ఆకర్షించడం, యువతను పార్టీలోకి తీసుకురావడం, గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరణ జరగాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తున్నది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిసింది.ఈ సభల ద్వారా పార్టీ శక్తిని ప్రదర్శించడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ బహిరంగ సభలు పార్టీకి మళ్లీ ఉత్సాహాన్ని నింపే అవకాశమున్నదని నేతలు భావిస్తున్నారు.

కేసీఆర్ తోనే ఢీ!

కేసీఆర్ తోనే ఢీ!

 

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన క‌విత.. నిన్న మొన్న‌టి కేటీఆర్, హ‌రీష్‌రావుపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ తండ్రి, బీఆర్ ఎస్ పార్టీ అదినేత కేసీఆర్‌ను మాత్రం ప‌క్క‌న పెట్టారు. ఆయ‌న జోలికి పెద్ద‌గా వెళ్ల‌లేదు. వెళ్లినా.. ప‌రోక్షంగా మాత్ర‌మే స్పందించారు. కానీ.. పార్టీ ఆవిర్భావానికి స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో క‌విత త‌న పంథాను పూర్తిగా మార్చుకున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్‌ను ఏమీ అన‌కుండా.. తాను ఎన్ని రాజ‌కీయాలు చేసినా.. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని భావించారో లేక‌.. కేసీఆర్ వంటిబ‌ల‌మైన నాయ‌కుడితో త‌ల‌ప‌డితే త‌ప్ప‌.. త‌న ప్ర‌త్యేక‌ రాజ‌కీయాలు దారిలో ప‌డ‌వ‌ని అనుకున్నారో కానీ.. ఏకంగా ఇప్పుడు కేసీఆర్ సెంట్రిక్‌గానే విమ‌ర్శ‌లు గుప్పించారు.

జ‌గిత్యాల‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ను కార్నార్ చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను క‌విత త‌ప్పుబ‌ట్టారు. బీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు ఓడించార‌ని అన‌డంపై విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జ‌లను త‌ప్పుబ‌డుతున్న కేసీఆర్‌.. వాస్త‌వాల‌ను ఇప్ప‌టికీ తెలుసుకోవ‌డం లేదేన్నారు. అధికారంలో ఉండ‌గా.. ప్ర‌జ‌ల మ‌ద్య‌కు ఎప్పుడైనా వ‌చ్చారా? అని ఆమె నిల‌దీశారు. అంతేకాదు.. ప్ర‌జల స‌మ‌స్య‌ల‌పై ఏనాడైనా స‌మీక్ష‌లు చేశారా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నార‌ని ఎద్దేవా చేయ‌డం ద్వారా.. కేసీఆర్‌కు చుర‌క‌లు అంటించారు.

అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు ఛాన్స్‌లేద‌ని.. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌ర‌ని చెప్ప‌డం ద్వారా నేరుగా కేసీఆర్ అస్తిత్వాన్ని దెబ్బ‌తీసేలా క‌విత ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. వాస్త‌వానికి తెలంగాణ ఉద్య‌మాన్ని.. మ‌హిళ‌ల‌ను.. కేసీఆర్ ప్ర‌స్తావించారు. ఈ విష‌యాల‌నే క‌విత టార్గెట్ చేసుకోవ‌డం ద్వారా.. త‌న తండ్రితోనూ తాను త‌ల‌ప‌డ‌గ‌ల‌న‌ని.. స్ప‌ష్టం చేశారు. మొత్తంగా.. మంగ‌ళ‌వారం నాటి మీడియా స‌మావేశంలో ఇత‌ర అంశాలు ఎలా ఉన్నా.. కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డం ద్వారా.. త‌న రాజ‌కీయ అడుగులు ఎలాగైనా ప‌డ‌తాయ‌న్న సందేశాన్ని క‌విత స్ప‌ష్టం చేశారు.

కేటీఆర్ సైలెంట్ మోడ్? మౌనం మర్మమేంటి?

కేటీఆర్ సైలెంట్ మోడ్?
మౌనం మర్మమేంటి?

జగిత్యాల సభ విజయవంతం చేయాలని జన సమీకరణ విషయంలో గట్టిగా ప్రయత్నించిన కేటీఆర్ చివరికి సభకు హాజరు కాలేదు. సభ తర్వాత పరిమామాలపై స్పందించడం లేదు. అందుకే కేటీఆర్ మౌనం హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ ఏడాదిన్నర తర్వాత నిర్వహించిన సభలో కేటీఆర్ మెరవకపోవడం, కనీసం ఆ సభ విజయవంతంపై సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిన్నటి వరకు ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన ఆయన, గత కొద్దిరోజులుగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడం వెనుక ఏదో జరుగుతోంది అనే చర్చ సాగుతోంది.

బీఆర్‌ఎస్ భవిష్యత్తు , పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకరు దూకుడుగా వెళ్లాలని భావిస్తుంటే, మరొకరు వేచి చూసే ధోరణి అవలంబించాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు అగ్రనేతల మధ్య వ్యూహాత్మక భేదాలు తలెత్తడం వల్లే, ఒకరు యాక్టివ్‌గా ఉన్నప్పుడు మరొకరు మ్యూట్‌లోకి వెళ్తున్నారనే చర్చ రాజకీయ గల్లీల్లో జోరందుకుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ ముగ్గురూ కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటున్న తరుణంలో, ఇలాంటి మౌన వ్రతాలు ఇ్బందికరంగా మారాయి.

కేసీఆర్ గతంలో పాటించిన మౌన ముని వ్యూహాన్ని ఇప్పుడు కేటీఆర్ అమలు చేస్తున్నారా.. లేక నిజంగానే పార్టీలో నాయకత్వ బాధ్యతలు లేదా ప్రాధాన్యత విషయంలో ఏమైనా అలకలు ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది.

మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించిన బిఆర్ఎస్ నేతలు

మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించిన బిఆర్ఎస్ నేతలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎక్కడలేని విధంగా అద్భుతంగా కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాహుబలి మోటర్లు పెట్టి నీళ్లను పైకి లిఫ్ట్ చేసి కాలేశ్వరం నుండి మల్లన్న సాగర్ హైదరాబాదు ప్రజల తాగునీరు కోసం రైతులకు వ్యవసాయానికి నీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ రైతుల కోసం ఆలోచించే వ్యక్తిగా దేశంలోని నిలిచిపోయారు రైతులకు రైతుబంధు రైతు చనిపోతే రైతు కుటుంబానికి రైతు భీమా కింద ఐదు లక్షల రూపాయల ఇచ్చిన ఘనత కెసిఆర్ ది కానీ ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు సకాలంలో రైతులకు రైతు భరోసా నిధులను ఇవ్వడం లేదు మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగి క్రాకులు ఇచ్చినాయి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం చేసి కేసీఆర్ పేరు లేకుండా చేయాలని ఆలోచించారు కావున ఇకనైనా రేవంత్ రెడ్డి కెసిఆర్ కు క్షమాపణ చెప్పి కాలేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయించి రైతులకు వ్యవసాయానికి నీరు అందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రైతుల కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సందర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి,తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, పుట్ట మధుకర్ బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎంపీ మాలోతు కవిత, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి నాయకులు కార్యకర్తలు తదితరులు.

రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు…

రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గత 5 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి మారలేదని, సర్పంచ్లు మారుతున్నా రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి 26 నెలలు పాలించినా పరిస్థితి మారలేదని, జహీరాబాద్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, పనికి వెళ్లే కూలీలు రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బడంపేట్ సర్పంచ్లు కూడా రోడ్ల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రింగ్ రోడ్లు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇదే పరిస్థితి అని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఓట్లు మాత్రమే కావాలని పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఒకసారి వచ్చి ప్రజల ఇబ్బందులను చూడాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కోహిర్ మండలంలో రోడ్లు బాగుచేయాలని లేదా కొత్త రోడ్లు వేయాలని కోరుతున్నారు.

బీసీ జేఏసీ మరియు రజక సంఘం నాయకులతో క్యాండిల్ ర్యాలీ…

బీసీ జేఏసీ మరియు రజక సంఘం నాయకులతో క్యాండిల్ ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లో వివిధ కుల సంఘాలు నాయకులతో, బీసీ జేఏసీ మరియు రజక సంఘం నాయకులతో క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.మొన్న నాగర్ కర్నూల్ లో జరిగిన దాడిని నిరసిస్తూ టీఆర్పీ పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి పిలుపుమేరకు జ్యోతి పండాల్ జహీరాబాద్ నియోజకవర్గం లో వివిధ కుల సంఘాల నాయకుల, రజక సంఘం నాయకుల, రజక సంఘం పెద్దల, వివిధ పార్టీల బీసీ నాయకుల, బీసీ జేఏసీ నాయకుల సమన్వయంతో భారీగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్పీ
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీల నాయకులు, రజక సంఘం నాయకులు, వివిధ పార్టీ నాయకులు, బిసి జేఏసీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మరియు తదితరులు భారీగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారని జ్యోతి పండాల్ అన్నారు.ఈ క్యాండిల్ ర్యాలీని జహీరాబాద్ నియోజకవర్గంలో వివిధ పార్టీ నాయకులు రజక సంఘం నాయకులు అన్ని వర్గాల బీసీ నాయకులు నుంచి మద్దతు లభించడం చాలా చాలా సంతోషంగా ఉందని జ్యోతి పండాల్ అన్నారు మరియు ఈ క్యాండిల్ ర్యాలీ లో పాల్గొన్న అన్ని వర్గాల నాయకులందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు..

ఝరాసంగం రోడ్డు ధ్వంసం: ప్రయాణికుల ఆందోళన..

ఝరాసంగం రోడ్డు ధ్వంసం: ప్రయాణికుల ఆందోళన

*జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రం వరకు వానంపల్లి నుండి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి, కంకర తేలడంతో ప్రయాణికులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రజలు ఈ రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోంది. ప్రజలు కొత్తగా రోడ్డు వేసి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు

గత 5 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి మారలేదని, సర్పంచ్లు మారుతున్నా రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి 26 నెలలు పాలించినా పరిస్థితి మారలేదని, జహీరాబాద్ ఎంపీ మరియు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, పనికి వెళ్లే కూలీలు రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బడంపేట్ సర్పంచ్లు కూడా రోడ్ల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రింగ్ రోడ్లు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇదే పరిస్థితి అని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఓట్లు మాత్రమే కావాలని పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఒకసారి వచ్చి ప్రజల ఇబ్బందులను చూడాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.కోహిర్ మండలంలో రోడ్లు బాగుచేయాలని లేదా కొత్త రోడ్లు వేయాలని కోరుతున్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ జెండా ఎగురుతుంది

మున్సిపాలిటీపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ హాజరైనారు అనంతరం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 30 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల లిస్టును ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల్లో రెబల్స్ లేకుండా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది కావున భూపాలపల్లి మున్సిపాలిటీపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను చేశారు అలాగే జిల్లాకు మెడికల్ కాలేజీ కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో 30 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ బద్దెనపల్లి ఇందిరమ్మ .కాలనీలొకాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లిశ్యామ్.గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగ్ మేము చేయలేదు అని చెప్పిన కేసీఆర్ కు తన కూతురు కల్వకుంట్ల కవిత గారే స్వయంగా ముఖ్య సాక్షిగా నా ఫోను నా భర్త ఫోన్ టాప్ చేసింది మా నాన్న మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పడం. గత ప్రభుత్వంలో ఇలాంటి అధికారులు ఎన్నో అక్రమాలు చేసిన వారిని వదల వద్దని. గతంలో ప్రభుత్వ పరిపాలన చేస్తూ టాపింగ్ చేస్తూ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని. గత ప్రభుత్వం అనేది అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని అవినీతి అక్రమాలు ప్రజలకు. తెలవాలని. ఇలా తెలంగాణ పేరు చెప్పి ఎన్ని అక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువు దోపిడీ చేశారని దీనిపై సిట్ అధికారులు గత ప్రభుత్వంలొ జరిగినటువంటి అక్రమాలను ప్రజలకు తెలియజేసేలా సీట్ విచారణ చేస్తున్నారని. ఇలాంటి అవినీతి వెలికి తీయాలని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అన్ని విషయాలు బయటకు రావాలని మన సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మన ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన ప్రభుత్వంలో పెద్దల ఇతర మంత్రుల సహాయంతో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి నిరసిస్తూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పరిపాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఓర్వలేక అనేక అబండాలు వేస్తూ. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా. ఇలా. ఇలా చేస్తే వ్యతిరేకత రాదు అనే ఉద్దేశంతో చేస్తున్నారని. ప్రజాక్షేత్రంలో తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని. ఎలాంటి తప్పు చేయని మీకు భయం ఎందుకని సిట్ విచారణ చేస్తే తప్పేము ఉంటుందని దానికి సహకరించాలి తప్ప ఇలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఇకనైనా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వాటి సభ్యులు. వడ్డేపల్లి రామా. ముందాటి శారద. భరత్. కాంగ్రెస్ నాయకులు. శ్రీరామ్. నరేష్. లక్ష్మిపతి. రంగయ్య. సుదర్శన్. రాజు. శ్రీనివాస్. రమేష్. కిషన్. గురునాథ్. రవి. రామచంద్రం. రాజు. కిరణ్. శ్రీనివాస్. లక్ష్మణ్. మహిళ నాయకులు. యమునా. భాగ్యలక్ష్మి. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు

ఆ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టాయన్న…

ఆ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టాయన్న మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

◆-: కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ ఎమ్మెల్యే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు శోచనీయమని వ్యాఖ్య

◆-: బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ వ్యాఖ్యలపై ఆలోచన చేయాలని సూచన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ మజ్లిస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని తీవ్ర విమర్శలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం పేరుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముస్లింల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని బయటపెట్టాయని అన్నారు.మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ఆయనను ఆరెస్సెస్ భావజాలం ఆవహించి ఉంటుందని చురక అంటించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లో ఉంటూ కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా చేశారని గుర్తు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన గూడెం మధుసూదన్ రెడ్డి..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన గూడెం మధుసూదన్ రెడ్డి..

మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలి..

క్షేత్రస్థాయిలో పనిచేయండి.. ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి..

సిట్ విచారణ అనంతరం ప్రత్యేక భేటీ..

నేటి ధాత్రి, పఠాన్ చేరు:

 

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం సిట్ విచారణ అనంతరం హైదరాబాదులోని నంది నగర్ లో గల కెసిఆర్ నివాసంలో కలిశారు. మున్సిపల్ ఎన్నికలలో స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ జండా ఎగరవేసి క్లీన్ స్వీప్ సాధించాలని సీఎం కేసీఆర్ సూచించారని గూడెం మధుసూదన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్ద కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో పని చేసి బిఆర్ఎస్ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించుకొని వస్తామని గూడెం మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం..

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

నందినగర్‌లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆన్ కెమెరా విచారణ జరుగుతోంది. అయితే, సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశానని.. ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని.. అలాగే ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశామని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు మాజీ ముఖ్యమంతి. ఇప్పుడు ఇదే గదిలో విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.కాగా.. నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను ఐదుగురు సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. భవనంలోని రెండో ఫ్లోర్‌లో విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో నందినగర్‌ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి, స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేసీఆర్‌‌ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్ట్‌లు చేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version