శాయంపేట మండలకేంద్రంలో మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మెతుకు.తిరుపతిరెడ్డి ఆధ్వ ర్యంలోభూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వరం గల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్ప ర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి,కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖ అధ్య క్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కోశాధి కారులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినే టర్లు, వివిధ సంఘాల అధ్య క్షులు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ఎంపీ టీసీలు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు,మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి వివాహ వార్షికోత్సవ వేడుకలను బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి గండ్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
రత్నాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు ఒద్దుల రత్నాకర్ రెడ్డి తల్లి ఒద్దుల సరోజన మృతిచెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి నివాసానికి చేరుకొని సరోజన పార్టీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కార్యక్రమంలో వారి వెంట గ్రామస్తులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
కోటంచ నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండలం,కొడవటంచ్చ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ 72వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్ని కేక్ కట్ చేసి,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్స్ కి పండ్ల పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు
అదే విదంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల వేంకటేశ్వర్లు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క సంవత్సరం ఉచితంగా డిష్ కనెక్షన్ అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది న్యాయ సమర్థమైంది ధర్మమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమేనని, సబండ వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా,నేడు ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు కొనసాగుతున్న విషయం మన అందరికి తెలుసు.
చాలా మంది నాయకులు వస్తుంటారు కానీ అందరికంటే భిన్నంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ ముఖ్యంగా మన ఇంట్లో ఆడపిల్లలు నీళ్ల కొరకు సుదూర ప్రాంతాలకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు అని ప్రతి ఇంటిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి, కృష్ణా జలాలు ఇవ్వాలనే సంకల్పంతోటి చేపట్టినటువంటి కార్యక్రమమే మిషన్ భగీరథ కార్యక్రమం.
నేడు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది
ఈరోజు మన రాష్ట్రానికి చెందిన వాళ్లే కాదు భారతదేశం నుంచి వచ్చిన అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉపాధి పొందుతూ స్థిరపడ్డారు.
హైదరాబాద్ నగరం ఈరోజు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలతో పోటీపడే స్థాయికి వచ్చింది.
అంతేకాదు ముఖ్యంగా రైతుల గురించి చాలా రాజకీయ పార్టీలు మాటలు చెప్పినయి కానీ ఎవరు కూడా చేయని విధంగా మొట్టమొదటిసారిగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ నాయకుడు విన్నవించకుండానే, ఆయనే ఒక్క రైతుగా అలోచించి ఎకరానికి పదివేల రూపాయల రైతుబంధు ఇచ్చి రైతుల పాలిట రైతు బాంధవుడయ్యాడు. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు రెండు వేల పెన్షన్ ఇచ్చి పెద్దకొడుకు అయ్యాడు. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ రూ. 100016/-ఇచ్చి మేనమామ అయిండు. చరిత్రలో నిలిచిపోయే పరిపాలన చేసి ప్రజల మనస్సు గెలుచుకున్న కేసీఆర్ కి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఆనందంగా జీవించాలని కోరుతూ వారికీ భూపాలపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ప్రజల తరుపున శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మొగుళ్ళపల్లి మండలంలో గండ్ర పరామర్శ… మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గం లోని మొగుళ్లపల్లి మండలం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెంకట్ రావు గారి మామగారు దుగ్యాల చోక్కారావు మరియు వారి బాబాయ్ పిన్నింటి రాజేశ్వర్ రావు మరణించగా మృతుల చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను కలిసిన భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి పరామర్శించిన తదనంతరం పాత ఇస్సిపేట వాస్తవ్యులు జన్నే సదయ్య గారు అనారోగ్యం తో బాధపడుతున్న వారిని పరామర్శించి,వారికి మనోధైర్యం చెప్పారు. వారి వెంట సర్పంచ్ జోరుక సదయ్య చిట్యాల మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొడాలి రమేష్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ 11 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినారు పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను నూతన మండలాలను గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి అలాగే జయశంకర్ సార్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు భూపాలపల్లి జిల్లాను తీసేస్తామని అంటున్నారు ఇప్పటికైనా పట్టణ ప్రజలు ఆలోచించాలి భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయింది భూపాలపల్లి మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు ఎన్నికలు వచ్చిన సమయాన మంత్రులను తీసుకువచ్చి చిలాపాలకాలు వేసి హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావున పట్టణ ప్రజలు ఆలోచించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మేకల సంపత్ బుర్ర రమేష్ రజిత తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు
భూపాలపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 5 6వ వార్డులు కృష్ణా కాలనీలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని కాలనీలో పర్యటించారు
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి 5 6వ వార్డు కృష్ణ కాలనీలో ఇంటింటా తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాలనీలో నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కాలనీలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తున్నా పారిశుధ్య నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాలనీ వాసుల సౌకర్యార్థం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడంతో సింగరేణి పర్యవేక్షణ లేకుండా పోయిందని,ప్రస్తుతం అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు కృష్ణ కాలనీలోని భూములను సింగరేణి నేరుగా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యేక జీవో ద్వారా భూములు ఇప్పించి,ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించి కాలనీ వాసులకు అందించామని, అలాగే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసి కాలనీ వాసుల నీటి కష్టాలను తీర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న, ప్రజలను మాయ మాటలతో మోసం చేసే నాయకులకు బుద్ది చెప్పాలన్న రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
భూపాలపల్లి మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన భూపాలపల్లి పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటే అధికార పార్టీకిచ్చే సరైన సమాధానం కావాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు శక్తితో అధికార పార్టీ వైఫల్యాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…
గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలోని మున్సిపాలిటీ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న జంగేడు–భూపాలపల్లి గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ వారికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ. వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అందరూ ఒకే వేదిక పై కలవడం ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గత స్మృతులను గుర్తుచేసుకునే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఇట్టి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ కార్యక్రమం ద్వారా మరింత క్రమశిక్షణ, స్నేహభావం పెరుగుతాయని అన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు యువతలో ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన భూపాలపల్లి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా 3వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణ సేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలే ప్రధాన అజెండాగా, ప్రతి వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆశలను ప్రభుత్వం నిరాశపరుస్తోందని, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి హక్కులను కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతూ, రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే సంకల్పాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కట్టకం జనార్ధన్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూపాలపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండలం బస్వరాజ్ పల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే కట్ల సాయిలు, కీ.శే బూడిద స్వామి సీతరాంపురం గ్రామ వాస్తవ్యులు కీ.శే మర్రి వెంకటయ్య, కీ.శే బాలాజీ రామాచారి – సంధ్య, కీ.శే ఎలకపల్లి రమేష్ అదే విధంగా బంగ్లాపల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే ధరంసోత్తు సమత, కీ.శే మారపాక భాగ్య ఇటీవల మరణించిన వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి . వారి వెంట బి అర్ స్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య సీతారాంపూర్ సర్పంచ్ తోట రాకేష్ నాయకులు మార్త శ్రీనివాస్ మంద అశోక్ రెడ్డి చింతరెడ్డి పాపిరెడ్డి పరశురాంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ సీతారాంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు వైనాల వెంకటేష్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
రేగొండ మండలం, రూపీరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు ముడతనపెల్లి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ వీడి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వారికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు పంచగిరి సుధాకర్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, మేడిపల్లి అశోక్,కొండా సురేందర్, పన్నాటి శ్రీనివాస్ కనుకుంట్ల దేవేందర్,రూపిరెడ్డి భగవాన్ రెడ్డి,చంద్రారెడ్డి, మేడిపల్లి ప్రభాకర్,రియాజ్, రావుల రమేష్, సరువు రాజు, వేంకటేష్, రావుల రజినీకాంత్, సదాశివచారి,రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు
* వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర….*. మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లో వివాహది శుభకార్యాలల్లో పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వధించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి .* * గొర్లవీడు వాస్తవ్యులు, వార్డు మెంబర్ వర్మనీ సమ్మయ్య – సరోజన గార్ల కుమారుడి వివాహ వేడుకల్లో. పాల్గొని. * చింతలపల్లి వాస్తవ్యులు వరువాల ఉమా – ఆనంద్ గార్ల పాల్గొనికుమార్తె వివాహ వేడుకల్లో… వారి వెంట మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కారు గుర్తు పై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ యూసుఫ్ గూడ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి నేడు ఇంటింటి ప్రచారం చేస్తే ప్రజలు మాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అన్నారు ముఖ్యమంత్రి మాట చెప్పితే ప్రజలు మాకు మంచి జరుగుతుంది అని నమ్మేవారు… కానీ నేటి ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఓట్లు వేసి దేవుళ్ళనే మోసం చేసిండు మనం ఎంత అంటూ తిట్ల దండకం వల్లిస్తున్నారు. పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క మజ్లిస్ పార్టీ నుండి పార్టీలోకి తీసుకుని నేర చరిత్ర కలిగిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒక్క వర్గం ఓట్ల కోసం ఒక్క చెల్లని వ్యక్తి గతంలో పోటీ చేసిన వ్యక్తికి ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి మేము గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని , జడల్ పేట గ్రామ గ్రామానికి చెందిన భోజ అన్నారెడ్డి – కవిత గార్ల కుమార్తె వివాహ వేడుకల్లో బుధవారం రోజునపాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రె స్ ప్రభుత్వంలో విసుగు చెందారు
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ
శాయంపేట నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
శాయంపేట మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరి యు వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారంబిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.
రైతులకి ఇస్తామని చెప్పిన రైతు బంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు,
మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దుల కు, వితంతువులకి, వికలాం గులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వ లేదు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల కు ఇదిగో మా బాకీ కార్డు,మా కు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని కోరారు.
BR
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకన్న మరియు మాజీ ఎంపిటిసి మేకల శ్రీనివాస్, అట్ల రమేష్ అట్ల తిరుపతి మామిడి శంకర్ గారు మాజీ సర్పంచ్ తోట కుమారస్వామి పసునూటి రాజయ్య సామల విజయ్ చాడ రాజిరెడ్డి కొమురాజు ప్రశాంత్ దీండిగాల నాగార్జున్ కర్రు రవి, ఆకుల శంకర్, కొప్పుల బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు పోతుల విష్ణు,మాస్ అనిల్, బండారి ఆనందం, ఆకుతోటరాజు పసునూటిరాజు, గరిగరమేష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, పత్తిపాక ముఖ్య నాయకులు బి.నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, వైద్యుల తిరుప తిరెడ్డి, సాంబరెడ్డి, చల్లా సమ్మిరెడ్డి, తుడుం వెంకటేష్, గజ్జి రమేశ్, పోతుగంటి సుభాష్, నక్క రాజు మరియు కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి
మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు. మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి. రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం. పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు. భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది. మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి. కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని. కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు
పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం
గాడిన పెడ్తున్న ప్రభుత్వం పై విమర్శలు సిగ్గుచేటు
కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త నాటకా నికి తెరలేపారని కాంగ్రెస్ మం డల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి విమర్శిం చారు. శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బాకీ కార్డులు పంపిణీ చేసిన నేప థ్యంలో సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి పిఎసిఎస్ భవన నిర్మాణం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భూ మి పూజ చేసిన శిలాఫలకం వరకు పాదయాత్ర చేసి అట్టి శిలాఫలకం వద్ద పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించారు .
తదనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయాలని ఉద్దేశంతోటే ఇస్తారన్నారు మిగులు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశా రని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్న క్రమంలో పాలనలో కనీసం రెండేళ్లు పూర్తికాకుండానే తమ ఉనికి కోసం బురద జల్లే ప్రయ త్నం చేస్తున్నారని అన్నారు. 22 నెలల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు రుణ మాఫీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్, సుమారు 60 వేల ఉద్యోగ కల్పన, రేషన్ కార్డుల పంపిణీ హామీలు అమలు అవుతున్నాయని, మేనిఫెస్టోలో లేని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం సైతం అమలు జరుతుందని, ఈ పథకాలు బీఆర్ఎస్ నాయకులకు కూడా అమలయ్యాయని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ బాకీలు:
పదేళ్లు అధికారంలో ఉండి ఇంటికొక ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ లు, కేజీ టు పీజీ విద్య, పోడు భూముల పట్టాలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ముస్లిం లకు రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణరెడ్డి బాకి
శాయంపేట మండలానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎంతో బాకి పడ్డారు. కాంగ్రెస్ కార్య కర్తల కష్టంతో గెలిచి,వారి సతీమణికి పదవితెచ్చుకు న్నారే తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పిఎసిఎస్ భవనానికి శిలాఫలకం వేసి నిధులున్నా కట్టించలేని అసమర్థులు. పిఎసిఎస్ లో మాజీ పాలకవర్గ సభ్యులు అయిన గండ్ర వెంకట రమణా రెడ్డి అనుచరులు 15 లక్షల రూపాయల అవినీతికి పాల్పడి సొసైటీకి బాకీ పడితే అవి రికవరీ చేయించలేని అసమర్ధ నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి . అట్టి రూపాయ లను వెంటనే రికవరీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లా డాలని మేము డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన వారికి 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రొసీ డింగ్స్ తెచ్చి కట్టిస్తా అన్నారు. కట్టించారా!డ్రైనేజీలు లేని రోడ్డు వేసి స్థానికులను ఇబ్బం దులు పెట్టడం వాస్తవం కాదా!సుమారు 200 డబుల్ బెడ్రూ మ్ లకు శిలాఫలకాలు వేశారు కట్టించారా!జిపి భవనాలకు శిలాఫలకాలు వేశారు కట్టించారా.మండల ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే అంబులెన్స్ కావాలని అడిగితే డీజిల్ ఎవరు పొయ్యాలి. ఎవరు నడపాలి.అని అవహేళనగా మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీటికి సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రేగొండ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ చేస్తున్న ఈ మాయ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇప్పటి వరకు ఒక్కో వ్యక్తికి ఎంత బాకీ పడ్డాదో తెలియచేస్తూ రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి బాకీ కార్డు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వద్దకు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని ప్రశ్నించాలని కోరుతూ రేగొండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేసిన బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.