దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్
గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు