రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు…

రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా భూసార పరీక్షా పత్రాల- వితరణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జె.భాగ్యలక్ష్మి పాల్గొని రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను, ఫలితాలను వివరించి, భూసార పరీక్షా పత్రాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ ఎన్. ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారిని త్రివేదిక, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వ్యవసాయ విస్తరణ అధికారులు అనంతరాజ్, సంపత్, రమేష్, గోవర్ధన్, గుండి గోపాలరావుపేట క్లస్టర్ పరిధిలోని రైతులు, తదితరులు పాల్గొన్నారు.

పొన్నం ప్రభాకర్ దళిత మంత్రికి క్షమాపణ చెప్పాలి

దళిత మంత్రి అడ్లూరు లక్ష్మన్ కుమార్ ని దూషించిన పొన్నం ప్రభాకర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి -బెజ్జంకి అనిల్ మాదిగ

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ ని అసభ్యపదజాలంతో దుషించిన పొన్నం ప్రభాకర్ ఇరవైనాలుగు గంటల్లోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశంలో ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని వివేక్ తో పొన్నం ప్రభాకర్ దున్నపోతుగానికి టైం తెలియదు ఏమి తెలియదు అని అహంకారంగ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ వైఖరి నిరసిస్తూ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షేమాపణ చెప్పాలి లేదా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతాం పొన్నం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈనెల 8న జిల్లావ్యాప్తంగా పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం, ఈనెల 9నాడు పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడి చేస్తాం అన్నారు.

 

ఈఇరవై నాలుగు గంటలు పోన్నం ప్రభాకర్ కి ఇస్తున్నాం. ఒక దళిత మంత్రిని అవమాన పరుస్తూ వివేక్ తో మాట్లాడినప్పుడు ఒక దళిత మంత్రిగా ఉండి కనీసం స్పందించలేదంటే దళిత పదం నీబతుకు తెరువు కోసమే తప్ప దళిత జాతి భవిష్యత్తు కోసం మీరు ఏమి ఉపయోగపడరు అన్నది స్పష్టంగా మాకు అర్థమవుతుంది తక్షణమే పొన్నం ప్రభాకర్ మాటలను ఒక మంత్రిగా మీరు స్పందించాల్సిన బాధ్యత మీమీద కూడా ఉంది అని మేము వివేక్ కూడా గుర్తు చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బోయిని కొమురయ్య మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, దండు అంజయ్య మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, రేపాక బాబు మాదిగ, అలువాల సంపత్ మాదిగ, కనకం నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి గడ్డం వివేక్ మృత కుటుంబాలను పరామర్శించారు….

పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి పుల్లూరి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు. అమ్మ గార్డెన్ ఏరియాలో నివాసముండే ఐఎన్టీయూసీ నాయకులు చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం మంత్రి వివేక్ పరామర్శించారు. సంజీవరెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే నవీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోపతి భానేష్,బత్తుల వేణు, కుర్మ సురేందర్, పల్లె దినేష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

“ములుగు‌లో రాష్ట్రంలో మొదటి క్రష్ కేంద్రం ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T151830.684.wav?_=1

 

ములుగు జిల్లా లోని జగ్గన్నపేట గ్రామంలో క్రష్ కేంద్రం ఏర్పాటు

#క్రష్ కేంద్రం లో పిల్లల సంరక్షణ.

#పల్నా పథకం ద్వారా జిల్లాలో 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు.

#రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లా లోని జగ్గన్నపేట గ్రామం లో క్రష్ కేంద్రం ఏర్పాటు.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి :

 

 

 

క్రష్ కేంద్రాలు పిల్లల సంరక్షణ సేవలను అందించేందుకు, పగటిపూట తమ పిల్లలను చూసుకోలేని తల్లిదండ్రులు ఇట్టి కేంద్రాలను ఉపయోగించుకోవాలని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మండలం జగన్నపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి అంగన్వాడి మరియు డే కేర్ కేంద్రం ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం అంచనా 15 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సరైన క్రష్ కేంద్రాలు లేకపోవడం తో తరచుగా, మహిళలు బయటకు వెళ్లి పని చేయడానికి ఇబ్బందిగా మారిపోయిందని, తమ పిల్లలకు సరైన పిల్లల సంరక్షణ మరియు రక్షణ కల్పించడంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న
ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి, పల్నా పథకం ద్వారా డే-కేర్/క్రష్ కేంద్రాలు ఉపయోగపడుతాయని తెలిపారు. 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన క్రేష్ సౌకర్యాలను అందించబడుతాయని పోషకాహారo, పిల్లల ఆరోగ్యం, పెరుగుదల పర్యవేక్షణ వంటి సేవలు డే-కేర్/క్రెచ్ కేంద్రాలు అందిస్తాయని తెలిపారు.
ములుగు జిల్లా లో ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం వెంకటాపురం (04) ఐ సి డి ఎస్ ప్రోజెక్టుల పరిధిలో పల్నా పథకం ద్వారా 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తల్లి తండ్రులు ఈ కేంద్రాలను ఉపయోగించు కోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో జాయింట్ డైరెక్టర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ వినోద్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా సంక్షేమ అధికారి టి. రవి, తెలంగాణ స్టేట్ లీడర్ మొబైల్ క్రష్ మాణికప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ మొబైల్ క్రష్, రాంప్రసాద్, సీడీపీఓ ములుగు కె.శిరీష, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్స్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో సోలార్ లైట్ ఏర్పాటు…

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో సోలార్ లైట్ ఏర్పాటు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ లోని దుబ్బపల్లి లో కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేక్ సహకారంతో డిసిసి జనరల్ సెక్రెటరీ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోలార్ లైట్ ఏర్పాటు చేశారు.రాత్రి పూట విద్యుత్ అంతరాయం కలిగి గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గ్రహించి సోలార్ లైట్ ఏర్పాటుకు సహకరించిన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపిన..

ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపిన సీతంపేట వాసులు

ముత్తారం :- నేటి ధాత్రి

ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సీతంపేట గ్రామం లోని హనుమాన్ టెంపుల్ వద్ద బోర్ వేయడం జరిగింది గత కొద్ది సంవత్సరముల నుండి హనుమాన్ టెంపుల్ వద్ద సుమారు 100 మంది హనుమాన్ భక్తులు మరియు బ్రహ్మం భక్తులు దీక్ష తీసుకుంటున్నారూ వారికి హనుమాన్ దేవాలయం దగ్గర నీరు లేక స్నానాలకు త్రాగడానికి ఇబ్బంది పడుతున్నారు ఇట్టి విషయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లగా వెంటనే స్పందించి బోర్ వేయించారు హనుమాన్ భక్తులు బ్రహ్మం భక్తులు సీతంపేట గ్రామ ప్రజలు ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబుకి కృతజ్ఞతలు తెలిపారు సహకరించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ కి గ్రామ కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య మాజీ సర్పంచ్ పులిపాక నగేష్ మాజీ సర్పంచులు లింగం రామయ్య గంగుల రాజలింగు ఇరుగురాల రాజమల్లు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు కూరాకుల పర్వతాలు కాంగ్రెస్ నాయకులు ఇండ్ల సది మామిడి సంపత్ గంగుల కుమార్ ఇందారపు నవీన్ లింగం చంద్రయ్య రావుల రాజ్ కుమార్ రావుల కుమారస్వామి గంగుల రాజయ్య బండి శంకర్ మామిడి రామయ్య బియ్యాల కిరణ్ కూరాకుల ఓదెలు జక్కుల ఓదెలు ఇండ్ల ఓదెలు లింగం రాజయ్య లింగం మల్లయ్య నూనేటి ఓదెలు పాల్గొన్నారు

జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

జహీరాబాద్: జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు మాణిక్ రావు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామిని మర్యాదపూర్వకంగా బుధవారం కలిసారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మంత్రి వివేక్ వెంకట స్వామిని అభ్యర్థించారు.

నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు..

నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T111941.908.wav?_=2

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనానికి బ్యాలెన్స్ పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని ఇటీవల మున్నూరు కాపు సంఘ నాయకులు పుల్లెల జగన్ మోహన్, పుల్లెల రాములు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ను కోరగా దానికి స్పందించిన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీని మున్నూరుకాపు సంఘ నాయకులకు అందజేయడం జరిగింది. తక్కువ సమయంలోనే నిధులు మంజూరు చేసిన బండి సంజయ్ కుమార్ కు దీనికి సహకరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్, బిజెపి నాయకులు పుల్లెల రాములకు మున్నూరు కాపు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు బొడ్డు బాలయ్య, డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, కటకం తిరుపతి, కొట్టే భూమయ్య, కొలుపుల మోహన్, పుల్లెల జగన్ మోహన్, పుల్లెల రాము, బొడ్డు భాస్కర్, గుండ వెంకటేశం, కొలుపుల వేణు, దొగ్గలి శ్రీనివాస్, దొగ్గలి నరేష్, పుల్లెల సాయి, పుల్లెల హిమాన్షు, తదితరులు పాల్గొన్నారు.

దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ..

దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ..ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్

భారత రాజకీయ చరిత్రలో ఈ శుక్రవారం (జూలై 25, 2025న) ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో మోదీ ఇప్పుడు దేశంలో అత్యధిక కాలం పాలన కొనసాగించిన రెండో ప్రధానమంత్రిగా నిలిచారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ శుక్రవారం (జూలై 25, 2025) ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆయన వరుసగా 4,078 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ, ఇందిరా గాంధీ (1966-1977) రికార్డును అధిగమించి, దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. ప్రస్తుతం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (1947-1964) మాత్రమే ఎక్కువకాలం పనిచేసిన ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో కొనసాగిన రికార్డును కల్గి ఉన్నారు.

నరేంద్ర మోదీ 2014 మే 26న మొదటిసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి, ఆయన మూడోసారి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2024 జూన్‌లో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన ఆయన, కాంగ్రెస్‌కు చెందని ప్రధానమంత్రిగా అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందిరా గాంధీ 4,077 రోజుల పాటు (1966-1977) వరుసగా ప్రధానమంత్రిగా ఉండగా, మోదీ ఈ రికార్డును జూలై 25న అధిగమించారు.

గతంలో గుజరాత్

మోదీ రాజకీయ జీవితం గుజరాత్‌లో మొదలైంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు. ఇది ఆయన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఒక మంచి అవకాశంగా మారింది.

చారిత్రక విజయాలు

మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2014లో 272 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది. 2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది, ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్‌కు చెందని నాయకుడిగా, సొంతంగా లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు.

నెహ్రూ తర్వాత

ఇందిరా గాంధీ (1971) తర్వాత మెజారిటీతో తిరిగి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి మోదీ. అంతేకాక, జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడు వరుస ఎన్నికల్లో పార్టీ నాయకుడిగా విజయం సాధించిన ఏకైక ప్రధానమంత్రి కూడా మోదీనే. ఈ విజయాలు ఆయన రాజకీయ నైపుణ్యాన్ని, ప్రజలతో ఉన్న బలమైన సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఆర్థిక సంస్కరణల నుంచి సామాజిక సంక్షేమ పథకాల వరకు, ఆయన పరిపాలన దేశ పురోగతికి ఒక స్పష్టమైన దిశను ఇచ్చింది. రాబోయే సంవత్సరాల్లో, ఆయన నాయకత్వం భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

విద్యాశాఖ మంత్రిని నియమించాలి…

విద్యాశాఖ మంత్రిని నియమించాలి…

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి…

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలి…

అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల,వసతి గృహాల భవనాలకు సొంత భవనాల నిర్మించాలి…

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి…

విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలి…

వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-75.wav?_=3

నేటి ధాత్రి -గార్ల :-

రాష్ట్రంలో పాలకులు లిక్కర్ పై చూపెడుతున్న శ్రద్ధను విద్యారంగం వైపు చూపెట్టని పరిస్థితి దాపురించిందని ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్, పీడీఎస్ యు జిల్లా కోశాధికారి మునగాల మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ లో భాగంగా బుధవారం గార్ల మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈవో, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్, బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్, కిరణ్, ఉదయ్, పృధ్విరాజ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..

నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-63.wav?_=4

హన్మకొండ, నేటిధాత్రి:

గ్రేటర్ వరంగల్ నగర పరిధి, మడికొండ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య (సి ఎన్ జీ) గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, కార్పొరేటర్ లు సి.ఎన్.జీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఉనికి కోసమే పుట్ట మధు మంత్రిపై అర్ధరహిత.!

ఉనికి కోసమే పుట్ట మధు మంత్రిపై అర్ధరహిత ఆరోపణలు

చట్టం చేసిన పనిని మంత్రి శ్రీధర్ బాబుపై రుద్దడం సిగ్గుచేటు

మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం మాట్లాడుతూ ఒక ప్రేమ జంట వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎంక్వయిరీ లో భాగంగా వెళ్లిన ఘటనలో బిఆర్ఎస్ నాయకులు పోలీసు ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగగా అట్టి వ్యక్తులను పోలీసు అధికారులు చట్టరీత్యా అరెస్టు చేయగా ఆ వ్యవహారాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు,టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుపై రుద్దడం సిగ్గుచేటని అన్నారు.బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్కరకు రాని కేసులు పెట్టి హింసించిన చరిత్ర కమాన్పూర్ మాజీ జెడ్పిటిసి పుట్ట మధుకర్ ది ఎంతోమందిని క్రూరంగా హింసించి,భయభ్రాంతులకు గురిచేసి,సస్యశ్యామలంగా ఉన్న మంథని నియోజకవర్గంలో ఎన్నో హత్యలతో రక్తసిక్తం చేసిన నీ పాలనను మంథని ప్రజలు ఇంకా మరువలేదన్నారు.

 

నీ అనుచరుడు బిఆర్ఎస్ కార్యకర్త పోలీసులతో ప్రవర్తించిన వీడియోలు మంథని ప్రజలందరూ చూసి చీదర అయినా సిగ్గు లేకుండా కేవలం ఉనికి కోసమే మంత్రిపై,మంత్రి కుటుంబంపై అర్థరహిత ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే మంథని ప్రజలకు నీ మేక వన్నె పులి వ్యవహారాలు తెలిసి నిన్ను వద్దనుకొని అభివృద్ధి కాంక్షించి మళ్లీ దుద్దిళ్ల కుటుంబానికి పట్టం కట్టిన చరిత్ర మంథని ప్రజలని,మంథని నియోజక వర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు,24 గంటల్లో ఏ సమయంలో ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి పరిష్కారం చేసే టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు గురించి మంథని ప్రజలందరికీ తెలుసన్నారు.మరో మారు దుద్దిళ్ల కుటుంబం పై ప్రజల్లో ఉనికి కోసం అర్థరహిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మా నాయకుడు నేర్పిన సంస్కారంతోనే మీలాగా అడ్డగోలుగా మేము మాట్లాడలేకపోతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్,ముత్తారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ,మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ తదితరులు పాల్గొన్నారు

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి శుభాకాంక్షలు.!

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంఘం నేత
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి
పంతకాని శ్రీనివాస్ నేత
మహదేవపూర్ జూన్ 7( నేటి ధాత్రి)

తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హైదరాబాదులోని ఆయన నివాసంలో సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పంత కానీ శ్రీనివాస్ నేత కలిసి
వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక మరియు ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

అనంతరం గడ్డం వివేక్ వెంకటస్వామి మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖకు మంత్రిగా ఉన్నందున వెనుకబడిన ప్రాంతాలైన మహాదేవపూర్, కాటారం, పలిమెల, మహా ముత్తారం, మల్హర్ మండలాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి గారికి విన్నవించగా స్పందించిన మంత్రి తప్పకుండా అధికారులతో మాట్లాడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పంత కానీ శ్రీనివాస్ నేత తెలిపారు

ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రివఎర్రబెల్లి దయాకర్ రావు.

తొర్రూరు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రివఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు వేడుకలు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

మాజీ మంత్రివర్యులు
గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదిన సందర్భంగా నేడు తోరూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తొర్రూర్ మండల మరియు పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది ముందుగా బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి దయన్నకు బిఆర్ఎస్ శ్రేణులు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం దయన్న అభిమానులు శ్రేయోభిలాషులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం లో అందరూ పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తొర్రూరు మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య,పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్,తొర్రూర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీరామ్ సుధీర్,పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, తొర్రూర్ మండల మరియు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శిలు నలమాస ప్రమోద్ ,కుర్ర శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, పెద్ద వంగర,మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య,కాలు నాయక్, కర్నే నాగరాజు, జై సింగ్, మాజీ కౌన్సిలర్ గుగులోత్ శంకర్ , పేర్ల జంపా,రాయిశెట్టి వెంకన్న ,మయూరి వెంకన్న ,లేగల వెంకటరెడ్డి, పినాకపాణి, కడెం యాకయ్య, మంగళపల్లి ఆశయ,స్వామి నాయక్, భూసాని ఉప్పలయ్య, దొనికెనా కుమారస్వామి, బాలు నాయక్, మెకానిక్ రాజు, గుగులోతు రమేష్, నిమ్మల శేఖర్, ముద్దం వీరారెడ్డి, మహిళా నాయకులు కల్లూరి కళావతి ,సుచరిత ,ముత్యాల సోమేశ్వరి,శీలం లింగన్న గౌడ్, గడిల సాయిలు, కొండ వెంకన్న బుర్రి మురళి, గుంటుక కుమార్, దానం రమేష్, పీఎం కృష్ణ, గుంటుక వెంకటేష్ ,దీకొండ శీను, పెద్ద బోయిన రామ్మూర్తి, మాలిక్, అనుదీప్ ,మారోజు నరేష్,,గోసంగి భాస్కర్, పల్లె యాకన్న గోన శ్రీను ,ఆవుల ఉపేందర్ ,రాగి జగదీశ్వర చారి పుట్ట మురళీకృష్ణ బొమ్మెర వినోద్ గడ్డం సృష్టి, బిఆర్ఎస్ తొర్రూర్ సోషల్ మీడియా అధ్యక్షులు యర్రం రాజు తదితరులు పాల్గొన్నారు

మంత్రిని కలిసిన కోట ధనరాజ్.

మంత్రిని కలిసిన కోట ధనరాజ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ .గారిని మినిస్టర్ కోటర్స్ లో
మర్యాదపూర్వకంగా కలిసిన ఝరాసంగం మండల కొల్లూరు గ్రామానికి చెందిన డా.కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త.మంత్రి మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో విద్యా వ్యాపార సంస్థలు రాణించాలన్నారు డా.ధన్ రాజ్ గౌడ్ చేస్తున్న సేవల్ని మంత్రి వారిని అభినందించి తమ సేవలను ఇలాగే కొనసాగించాలన్నారు.

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు

వనపర్తి లో వార్డుల పర్యటనలో బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్

వనపర్తి నేటిదాత్రి :

మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదే శాల మేరకు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలను ఉత్తజ పరుస్తూ వనపర్తి లో పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ బీ ఆర్ ఎస్ పార్టీ నేతల తో కలిసి 5 20 వార్డులలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈమేరకు బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజల కు అండ గా ఉంటుందని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.
వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణతో,చెరువుల పునరుద్ధరణ,పార్కుల అభివృద్ధి ,విద్యా మెడికల్ ఇంజనీరింగ్ చిట్యాల రోడ్డు లో నూతన మార్కెట్ యార్డు ఇంకా వనపర్తి పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి మున్సిపల్ ఎన్నికలలో బి.ఆర్.ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వార్డుల పర్యటన లోజిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆసరా పింఛన్లు,మహిళలకు 2500,గ్యాస్ సబ్సిడీ, మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వారు అన్నారు వార్డుల పర్యటన లో
జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతిమాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, ఉంగ్లం. తిరుమల్,రమేష్ నాయక్,స్టార్.రహీమ్ గులాం ఖాదర్ ఖాన్ సూర్యవంశంగిరి జోహెబ్ హుస్సేన్ఇమ్రాన్,వార్డ్ అధ్యక్షులు రవి కుమార్,చంద్రయ్య జహంగీర్
ఎర్ర.శ్రీనివాసులుసునీల్ వాల్మీకి,బొడ్డుపల్లిసతీష్ నందిమల్ల.రమేష్,ప్యాత.తిరుపతయ్య,ప్రేమ్ కుమార్ఎ.కె పాషా,బెంగాలీ.రఘు మునికుమార్, గోకం.శివ,రామస్వామి,రామ్ చంద్రయ్య,మహిళా అధ్యక్షురాలు నాగమ్మ,నల్లవత్తులవెంకట్ ఉందేకోటి.కృష్ణ,తోట.శ్రీను,జావేద్,జానకి రామ్,ఆంజనేయులు,బోయ.లక్ష్మీ,షాహిన్,షాహిద్, దేవమ్మ పార్టీ నేతలు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ.

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
అనారోగ్యంతో మృతి చెందిన లింగమోరి గూడెం మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి

ఐనవోలు నేటిధాత్రి:

ఐనవోలు మండలంలోని లింగమొరిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మాజీ ఉప సర్పంచ్ బుర్ర శ్రీహరి గౌడ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శ్రీహరి గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, శ్రీహరి గతంలో బి. ఆర్. ఎస్ పార్టీ కి ఎనలేని సేవ చేశారని భవిష్యత్లో మృతుని కుటుంబానికి అండగా నిలబడతామని మాజీ మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ పార్టీ ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు జిల్లా నాయకులు మరుపట్ల దేవదాసు ఎస్. కె. జిందా ఎం.డి గ్రామ బి. ఆర్. ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్ ఆమె ఏమన్నారో తెలిస్తే.

మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్ ఆమె ఏమన్నారో తెలిస్తే..

 

రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.హైదరాబాద్: రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(MLA Sabitha Reddy) ధ్వజమెత్తారు. ఒక కాలనీని ఎంత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామో రాష్ట్రాన్ని సైతం అదే తరహాలో అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో తలాతోకాలేని పాలన కొనసాగుతున్నదని ఆమె ఎద్దేవా చేశారు.ఆదివా రం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ నాదర్‌గుల్‌ 31వ డివిజన్‌లోని గ్రీన్‌రిచ్‌కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కాలనీవాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయమే ప్రధానంగా మారిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, అధికారులను వేధించడం మంచి పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాల ని, ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నిధులు తీసుకువచ్చి పనులు చేయిస్తానని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిల్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ సూర్ణగంటి అర్జున్‌, మాజీ కార్పొరేటర్లు పెద్దబావి శోభాఆనంద్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, లిక్కి మమతాకృష్ణారెడ్డి, బోయపల్లి దీపికాశేఖర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసరాజు, కర్రె బల్వంత్‌, నరేశ్‌, సాయి పాల్గొన్నారు.

 సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్.

 సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్…

 

ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కాస్తా ఘాటుగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి తెలుసుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరి నువ్వు సిద్ధమా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడితే.. ఎలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీరు, మీ క్యాబినెట్ సహాచరులు ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై మంగళవారం క్లారిటీ వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. నోటిఫికేషన్ ఈ రోజు వస్తుందన్నారు. సోమవారం నామినేషన్లు వేస్తారన్నారు. మంగళవారం నూతన అధ్యక్ష పదవిపై ప్రకటన వస్తుందని చెప్పారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్న సునీల్ బన్సల్, శోభా కర్లందాజ్లే సోమవారం రాష్ట్రానికి రానున్నారని వివరించారు. వారి సమక్షంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.అయితే సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని గుర్తు చేశారు. తాము తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తామని.. అంతేకానీ సీఎం రేవంత్ రెడ్డి కోసం.. కాంగ్రెస్ పార్టీ కోసం తాము పని చేయబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెట్రో డీపీఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారన్నారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్.

తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్

నేటి ధాత్రి, పఠాన్ చేరు

 

 

 

 

తెలంగాణ సచివాలయంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ శనివారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గారితో చర్చించారు. మంత్రి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారాని ఆయన తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version