వాగులు,వంకల అక్రమ కబ్జాలు.!

వాగులు,వంకల అక్రమ కబ్జాలు అవుతున్న అదికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రస్తుతం ఇది వర్షాకాలం వర్షపు నీటి ప్రవాహం ఇప్పుడున్న వాగులు వంకల ద్వారా పోవడం చాలా కష్టంగా మారింది ఆనీరంత ఇండ్లలోకి చేరే అవకాశం ఉంది ఎందుకంటే నీరు ప్రవహించే వాగులు వంకల విస్తిర్ణాన్ని చాలా చోట్ల కబ్జాలకు గురి అయింది ఇది అధికారుల నిర్లక్ష్యమే వర్షపు నీరు ప్రవాహామై పోతున్నప్పుడు వాటిని ఆపడం గాని దారి మళ్లించడం గాని చట్టరిత్య నేరం కానీ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి లంచాలకు మరిగి వర్షపు నీటి ప్రవాహాన్ని కుదించి మరలిస్తున్నారు లంచాలు తీసుకొని NOC లు ఇస్తున్నారు
దీనికి ఉ÷ దోబీ నాలా వాగు ఈ వాగు జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామం నుండి జహీరాబాద్ మండలం మరియు పట్టణ ప్రాంతాల నుండి పోయి చివరకు నారింజలో కలుస్తుంది దీని ప్రవాహం చాలా ఉదృతంగా ఉంటుంది ఈ వాగు పట్టణ శివారులో చాలా చోట్ల కుదించి కబ్జాలకు గురి అయింది డ్రీమ్ వ్యాల్యు కాలనీ దగ్గర కుదించారు వర్షాలు ఉదృతం అయినప్పుడు నీళ్ళన్ని కాలనిలోకి వస్తున్నాయి ఆతర్వాత ముందుకెళ్లే వాగునే దారి మళ్లించారు మరియు ఇంద్రప్రస్త కాలనీ వద్ద నీటి ప్రవాహాన్ని దారి మళ్లించారు ఇంకా ముందుకెళ్తే వాగు విస్తీర్ణాన్నే తగ్గించారు,అధికార పార్టీ నాయకులు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి వారే కబ్జాలకు పూనుకొంటున్నారు అధికారులపై వత్తిడులు తేచ్చి మామూళ్లు ఇచ్చి NOCలు తీసుకుంటున్నట్లు తెల్సింది అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు,ఈ వాగు ప్రవాహం వల్ల గతంలో డ్రీమ్ ల్యాండ్ కాలనీ,ఇంద్రప్రస్థ బై పాస్ ప్రక్కన గల కాలనీలు మొత్తం జలమయం అయ్యాయి, పట్టణ ప్రాంతం మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల భూముల ధరలు బాగా పెరిగినందువల్ల ఇక్కడో బయటి నుండి వచ్చిన రియల్ వ్యాపారులు నీటి ప్రవాహం గల వాగులు వంకలను కుదించి మూసివేస్తూ అధికార పార్టీ అండదండలతో అధికారులను లోబర్చుకొని వ్యాపారులు కోట్లు గడించాలన్న ఆలోచనతో సామాన్య ప్రజలకు నీటిలో మునిగే ప్లాట్లను విక్రయించి మోసగిస్తున్నారు దీనికి అధికారులు వంత పాడుతున్నట్లు అనిపిస్తున్నది అధికారులు గుర్తించుకోవాలి వారికిచ్చే జీతం ప్రజల సొమ్ము నిబంధనలను పాటించి నాళాలను కాపాడి జహీరాబాద్ జలమయం కాకుండా కాపాడాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది లేని ఎడల ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,నాయకులు శివకుమార్ లు ఉన్నారు.

మాజీ మంత్రిని కలిసిన వై.నరోత్తం.

జహీరాబాద్: మాజీ మంత్రిని కలిసిన వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి టి. హరిశ్ రావు ని సోమవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను వారి దృష్టికి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శికారి గోపాల్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, యం. జైపాల్, మల్లేశం, లు ఉన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న.!

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి

మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎస్.వి.కె.గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన గుడుపల్లి గ్రామం కాల్వ ముత్యాల్ రెడ్డి కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వివాహా వేడుకల్లో సుదర్శన్ రెడ్డి,రాజేందర్ రెడ్డి,వినాయక్ రెడ్డి,చెంగల్ జైపాల్,విజయ్, సి.యం.అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి.!

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం జన్మదిన వేడుకలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్)మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు బి.దిలీప్ డబ్లూ హెచ్ ఆర్ పి సి ఆద్వర్యంలో టపాకాయలు కాల్చి జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు శంకర్, శివరాజ్ పాటిల్,నబి సాబ్, యం.జైపాల్,కె.నర్శింలు,చెంగల్ జైపాల్,జి.జగన్,బాల్ రాజ్, ఇమ్రాన్,సి.యం.అశోక్ రెడ్డి, పెంటన్న,అనిల్,తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version