వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలుగా న్యాయవాది కిరణ్ విజయం….

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలుగా న్యాయవాది కిరణ్ విజయం

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికల పోటీలో కిరణ్ కుమార్ విజయం సాధించారని ప్రధాన కార్యదర్శి గా వెంకటరమణ గెలుపు పొందారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ఓట్లు 177 దాదాపు 85 శాతం పోలింగ్ జేరిందని చెప్పారు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏం రాహుల్ రాజు పర్యవేక్షకులుగా వ్యవహరించారని చెప్పారు వనపర్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించినందుకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈసందర్భంగా వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా విజయం సాధించి న o దు కు సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ సన్మానం చేసి అభినందించారు

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఆత్కూరి శ్రీకాంత్…

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఆత్కూరి శ్రీకాంత్

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి…మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యుడిగా ఆత్కూరి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బందు క్రాంతి, బందు సుజాత స్వాతి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఓటు హక్కును తొలగించారు…

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఓటు హక్కును తొలగించారు

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు సీనియర్ ల పేర్లను తొలగింఛారు

వనపర్తి నేటిదాత్రి

వనపర్తి లోని ఆర్యవైశ్య మహాసభ లో.ఓటు హక్కు ఉంటే వాళ్ల ఎదుగుద ల చూసి వారి పేర్లు తొలగిం చారని ఆర్యవైశ్య దహన కమిటీ మాజీ చైర్మన్ పాలాది కొత్త శ్రీనివాస్ లు ఆవేదన వ్యక్తంచేశారు ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు గా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం చెయంచామని చెప్పారు డబ్బులు ఉన్నవారికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల లో ఓటు హక్కు కల్పించారని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు తప్పుడు లిస్టు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు వనపర్తి లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత తన ఇష్టం ఉన్న వారికి ఓటు హక్కు కల్పించినారని పాలాది ఆందోళన వ్యక్తం చేశారు వారు వనపర్తి ఆర్యవైశ్య సంఘానికి సేవ చేసిన వారు కాదని అన్నారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఓటు హక్కును తొలగించి నందుకు కోర్టును ఆశ్రయిస్తామని పాలాది శ్రీనివాస్ లు చెప్పారు

19వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం…

19వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం

ప్రజలకు అందుబాటులో ఉంటా-అభ్యర్థి ఏకు బాబు (బొబ్బిలి)

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని మున్సిపాలిటీ 19వ వార్డ్ టిఆర్ఎస్ అభ్యర్థి ఏకు బొబ్బిలి(బాబు) ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈ ప్రచారంలో ఇన్చార్జిలు బొట్ల శ్రీను,దోమల శ్రీనివాస్ వార్డు అధ్యక్షులు ఏకు కార్తీక్ లు మాట్లాడుతూ 27 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థ ఎలక్షన్ లో ప్రచార నిర్వహించే నైతిక హక్కు లేదని అంకెల గారడి తో ప్రజలను మోసం చేస్తున్నారని మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జలాలుద్దీన్,సాదిక్,బండి శ్రావణి,బొచ్చు రాజు,ఏకు ప్రవీణ్,ఏకు శివతేజ,కొమ్ముల మహేష్,ఒంటేరు రాకేష్,ఏకు వంశీ మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో ఏక్స్ ఆఫీ షియో…

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో ఏక్స్ ఆఫీ షియో హోదా లో ఒకే మున్సిపాలిటీ ని ఎంపిక చేసుకోవాలి
వనపర్తి నేటిధాత్రి .

 

 

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులు ఎక్స్ అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకొని ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణీ కుముది సూచించారు సెక్షన్ 5, 20 ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీలు తాము ఎన్నికైన 30 రోజుల్లోపు ఏదో ఒక మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించేందుకు ఆప్షన్ ఇచ్చుకొని ఉండాలని, అలా కాకుండా ఇంతవరకు ఆప్షన్ ఇవ్వని పక్షంలో నిబంధన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు అయిన 30 రోజుల్లో ఆప్షన్ ను సంబంధిత మున్సిపల్ కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ జారి చేసి ప్రజాప్రతినిధుల నుండి ఆప్షన్ తీసుకోవాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ లు జారీ చేసి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈవీ డియో
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్యడిఆర్డీఒ పి.డి. ఉమాదేవి, సి.పి. ఒ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు

మహేశ్వరంలో వాహనాల తనిఖీలు..

మహేశ్వరంలో వాహనాల తనిఖీలు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న ఎన్నికల దృశ్య మున్సిపాలిటీ పరిధిలోని నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారి మహేశ్వరం వద్ద సంబంధిత ఎన్నికల అధికారి, నెక్కొండ పిఆర్ ఏఈ రాజ్ కుమార్ స్థానిక హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ కాజం అలీ తో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకుగాను వస్తువులు,డబ్బు,మద్యం లాంటివి ఏమైనా సరఫరా చేస్తున్నారా అని వాహనాలల్లో క్షుణ్ణంగా పరిశీలించారు.

ఫర్టిలైజర్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగూర్ల ఎన్నిక…

ఫర్టిలైజర్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగూర్ల ఎన్నిక

 

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ తరఫున ఫర్టిలైజర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాగూర్ల వెంకటేశ్వర్లుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో ఫర్టిలైజర్ షాప్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి బాధ్యతాయుతమైన పదవికి నాగూర్ల వెంకటేశ్వర్లు ఎన్నిక కావడం రైతు సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలను గుర్తించి, పరిష్కార దిశగా ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫర్టిలైజర్ రంగంలో ఉన్న అనుభవం,సేవాభావం, నాయకత్వ లక్షణాలతో నాగూర్ల వెంకటేశ్వర్లు ఈ పదవికి పూర్తిగా న్యాయం చేస్తారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ విశ్వాసం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా మరోసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షుడు వరికేల కిషన్ రావు తెలిపారు.

33వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున అలేఖ్య నామినేషన్

33వ వార్డు నుండి బీఆర్ఎస్ తరపున అలేఖ్య తిరుమల్ నామినేషన్
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు నుండి మున్సిపల్ బీ ఆర్ ఎస్ కౌన్సిలర్ గా పోటీ చేయుటకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్ సతీమణి అలేఖ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో నీల స్వామి కడెం శేఖర్ రెన్ బాబు రవి వార్డ్ ప్రముఖులు పాల్గొన్నారు

15వ వార్డు నుండి బండారు సుజాత నామినేషన్

15 వ వార్డు నుండి బండారు సుజాత నామినేషన్
వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండార్ కృష్ణ సతీమణి బండారు సుజాత నామినేషన్ వేశారు

రమణన్న బస్తీబాటలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ

రమణన్న బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ఆకుదారివాడ, ఫకీర్ గడ్డలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మున్సిపాలిటీ విషయానికి వస్తే మనం అక్కడ కేవలం మాటలకే పరిమితం కాలేదు.
మున్సిపాలిటీని తీసుకురావడం మాత్రమే కాదు 30వార్డులో అన్ని రోడ్లు, సైడ్రైన్ లు, సెంట్రల్ లైటింగ్ వంటి మెరుగైన వసతులు, ప్రతి ఇంటికి మంచినీటి వసతి తో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది.
కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి మేడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

రాష్ట్రం వచ్చిన తరువాత కేసీఆర్ మాటలతో కాదు పది సంవత్సరాల పాటు పాలించి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లారు.
సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, విద్యుత్, రహదారులు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి ఇలా ప్రతి రంగంలో తెలంగాణను ముందుకు నడిపించిన ఘనత కేసీఆర్ దే.
“కేసీఆర్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే, నేను 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, అందుకే నాకు ఓటు వేయండి” అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
టిడిపి పార్టీ నుండి వచ్చి అడ్డదారులో పదవులు చేపట్టిన రేవంత్ రెడ్డి కి అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే తెలియని పరిస్థితి కనిపిస్తోంది.
నిన్నటివరకు టీడీపీ పార్టీలో ఉండి, అక్కడి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయనకు తెలంగాణ ఉద్యమ చరిత్రపై అవగాహన ఉందా లేదా అనేది గుర్తేరగాలే.
తెలంగాణ ఉద్యమ సమయంలో రమణారెడ్డి కాంగ్రెస్‌లో ఉండగానే తెలంగాణ వస్తుందని, ప్రజల మధ్య తిరుగుతూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాటం చేశారు. కానీ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఇది దురదృష్టకరం.
తెలంగాణ ప్రజలు ఎవరు రాష్ట్రం కోసం నిజంగా త్యాగాలు చేశారో, ఎవరు అధికారానికి కోసం మాటలు మార్చుకుంటున్నారో బాగా తెలుసు. ప్రజలను మోసగించే రాజకీయాలను ఇకనైనా ఆపాలి.
రేవంత్ రెడ్డి కి రాష్ట్ర ప్రజలపైన ప్రేమ లేదు ఆయన కుర్చీ మీద అపారమైన ప్రేమ ఉంది.
అందుకే అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం, అబ్బద్దాల పునాదులపై నిలిచిన కాంగ్రెస్ పార్టీని పునాదులు కదిలించాలి అంటే మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి మీ అందరి కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా..

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా

ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరామర్శ

నిరాశ చెందొద్దు..ఓడిపోయిన.. విజేతలు మీరే..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

దుగ్గొండి నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా
బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు భారత్ రాష్ట్ర సమితి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం నింపేందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శ యాత్ర చేపట్టారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి,తిమ్మంపేట, మహమ్మదాపురం,మర్రిపల్లి ,వెంకటాపురం గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిపాలవగా
ఆయా గ్రామాల అభ్యర్థులను పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఓటమి చెందిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* ప్రజాసేవయే లక్ష్యం ఇదే పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారని పిలుపునిచ్చారు.

అధికార దుర్వినియోగం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, అధికారులు చాలా చోట్ల బిఆర్ఎస్ విజయాలను తారుమారు చేశారని మండిపడ్డారు.కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తామని, న్యాయపరంగా, చట్టబద్ధంగా పోరాడి గెలుస్తామని స్పష్టం చేశారు.పోలీసుల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసినా కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరంలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఒకటి ముపాయలైన నిరాశ చెందకుండా ఉండాలని అయినా ఓటమి చెందిన మీరే విజేతలు అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధైర్యం చెప్పారు.
ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,,మాజీ మార్కెట్ ఛైర్మెన్ పొన్నం మొగిలి,మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, సర్పంచ్ శంకేసు కమలాకర్,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్ లు.ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు ,మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నన్ను గెలిపించండి ఊరికి సేవ చేస్తా..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T140406.358.wav?_=1

 

నన్ను గెలిపించండి ఊరికి సేవ చేస్తా

నడికూడ,నేటిధాత్రి:

 

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నడికూడ మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వంగ మల్లికార్జున్ కి మద్దతుగా మరియు వార్డ్ మెంబెర్స్ మోత్కూరి లక్ష్మీ రమేష్,వంగ శరణ్య మల్లికార్జున్,కోట తిరుపతి, ఎరుకల రాజారెడ్డి,మందోటి విజయేందర్,చేకిలె జమున రవీందర్ లకు మద్దతుగా గ్రామంలో ఇంటింటికి విస్తృత ప్రచారంలో బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు,56వ డివిజన్ అధ్యక్షులు మహేందర్ పటేల్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ
గ్రామపంచాయతీల అభివృద్ధి కేవలం కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమని అందుకే బిజెపి బలపరిచిన అభ్యర్థి వంగ మల్లికార్జున్ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెంతల జగన్, ఎరుకల శ్రీనివాస్,ఆకుల రాజు,మందుటి మహేందర్, కోట మల్లయ్య,కోట రవి, శంకర్ లింగం,బిక్షపతి,అంజి, ఆకుల నవీన్,ఎల్లస్వామి, గొనె రాకేష్,గొనె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T152743.505.wav?_=2

 

బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొత్త గట్టుసింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమి టీ ఎన్నుకున్నారు. ఈ సంద ర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన గ్రామ శాఖ నూతన అధ్యక్షుడు ఆలేటి శ్రీనివాస్ వారితో పాటు మండల అధ్య క్షుడు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి, సదా శివ రెడ్డి, ఆలేటి రాకేష్, కొత్తగట్టు సాయి, పెంబర్తి వినయ్, అఖిల్, సునీల్ తదితరులు కలిశారు.

ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-01T122024.059.wav?_=3

 

ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో శుక్రవారం సిఎంఓఎఐ జనరల్ బాడి మీటింగ్,జనరల్ మేనేజర్ అధ్యక్షతన జరిపించారు.ఈ సమావేశంలో లో జనరల్ సెక్రటరీ సంతోష్ ఇదివరకు జరిగిన కార్యక్రమాలను జరగబోయే కార్యక్రమాలను గురించి వివరించారు.తదుపరి జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) &(ఓ&ఎం) మదన్మోహన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,జాయింట్ సెక్రటరీ పదవులకు నామినేషన్ కోరడమైనది.దీనికి అధికారుల సంఘం సభ్యులందరూ సిఎంఓఎఐ ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా డి.పంతులా ని ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.వైస్ ప్రెసిడెంట్ గా జనగామ శ్రీనివాస్ ని,జాయింట్ సెక్రటరీ గా శ్యామల ని ఎన్నుకోవడం జరిగింది.అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ ధారావత్ పంతులా మాట్లాడుతూ.. అధికారుల సంఘం సభ్యులకి ఎస్టిపిపి యాజమాన్యానికి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో అందరి సహాయ,సహకారాలతో సెంట్రల్ కమిటి సభ్యులతో,యాజమాన్యాన్ని సమన్వయ పరుస్తూ పెండింగ్ లో ఉన్న పనులను, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సాధించుకోవడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ఎస్టీపీపీ ఈడి సిహెచ్.చిరంజీవి,జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) & (ఓ&ఎం)మదన్మోహన్,ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డిజిఎం (సివిల్) ఆజాజుల్లా ఖాన్,డీజీఎం(పర్సనల్),డి కిరణ్ బాబు,కార్యవర్గ సభ్యులు డి.పంతులా,సంతోష్ కుమార్,జనగామ శ్రీనివాస్,అప్పారావు,రమేష్,శ్యామల,మోబిన్ పాల్గొన్నారు.

అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T134337.657.wav?_=4

 

అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం
బస్వరాజుపల్లి గ్రామం లో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది అందులో యూత్ అధ్యక్షుడు ఎన్నికైన మిట్టపెల్లి అరవింద్,ఉప అధ్యక్షుడి కుక్కముడి చిన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, కార్యదర్శి మట్టెవాడ హరీష్, కోశాధికారి కుక్కమూడి నవీన్, సలహాదారులు, సభ్యులు పాల్గొన్నడం జరిగింది. అరవిందు మాట్లాడుతూ ఈ అధ్యక్ష పదవిని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యూత్ ని ముందుకు తీసుకుపోయే విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తానని అరవింద్ అన్నారు

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు…

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు

కరీంనగర్, నేటిధాత్రి:

డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. డిసిసి పిఆర్ఓలు దొంతి గోపి, న్యాత శ్రీనివాస్ కు దరఖాస్తు అందజేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. అదేవిధంగా రాజేందర్ రావ్ గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ చాంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ గా, నెడ్ క్యాప్ గా డైరెక్టర్ పనిచేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా రాజేందర్రావు పోటీ చేశారనీ, ఎన్నికల్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు సాధించారని తెలిపారు. అతికొద్ది సమయంలోనే భారీ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు రాజేందర్ రావు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనీ, నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అనీ, వారి తనయుడు జగపతిరావు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూనే, కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా రాజేంద్ర రావు తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా నిజాయితీగా సౌమ్యుడిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. రాజేందర్రావు డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడు అనీ, సమర్థుడని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈవిషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుడిగా రాజేందర్ రావును నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, ఆకుల నరసన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, ఉప్పరి రవి, శ్రావణ్ నాయక్, జువ్వాడి మారుతి రావు, బాషవేణి మల్లేశం పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట అక్టోబర్ 8 నేటిధాత్రి (మెదక్)

Vaibhavalaxmi Shopping Mall

అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ.
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్వి న్యాల్కల్ మండల్ మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో మల్గి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అని అన్నారు అలాగే ఇప్పుడు న్యాల్కల్ మండల్ జడ్పిటిసి స్థానం బీసీ జనరల్ కేటాయించడంతో అధిష్టానం నాకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు,

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్…

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.

నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version