గ్రామక్య సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శ్రీ గణేష్, శాలిని మిశ్రా, ఝాన్సీ, స్వశక్తి గ్రామక్య సంఘాల సభ్యులు మరియు ఐకెపి,సిసి రమణాదేవి ఆధ్వర్యంలో గురువారం రోజున సర్పంచి తౌటం లక్ష్మి ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ ని మరియు వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ మాట్లాడుతూ మహిళ సంఘాలు పొదుపు ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నారు, అనంతరం ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆర్థికంగా బలోపేతం కావాలిని మహిళా సాధికారత సాధించాలని వారికోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందని అన్నారు, అనంతరం సీసీ రమణా దేవి మాట్లాడుతూ చిట్యాల గ్రామైక్య సంఘాల మహిళలు సమావేశాలు పెట్టుకోవడానికి భవన నిర్మాణం కోసం స్థలం కావాలని కోరగా సర్పంచి ఉప సర్పంచ్ సానుకూలంగా స్పందించి గ్రామంలో సర్వే చేయించి స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ఎపిఎం రాజేందర్,శ్రీగణేష్ వివో, ఝాన్సీ వివో,శాలిని మిశ్రా వివో స్వశక్తి వివో ల అధ్యక్షులు సుమలత, ఉమ,కల్పన, అనూష కార్యదర్శులు సంధ్య, అనూష,శారద, వివో లీడర్లు సుజాత, మౌనిక, వివో ఏ లు షాహ్నాజ్ ,లత, రామ్ చందర్ మరియు సంఘాల లీడర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్,ఉప సర్పంచ్ లను శాలువాతో సత్కరించిన నాగుర్ల
నడికూడ,నేటిధాత్రి:
మండలంలో నూతనంగా ఎన్నికైన ఆరెకుల ముద్దు బిడ్డలు నడికూడ గ్రామ సర్పంచ్ కుడ్ల మలహల్ రావు,వరికోల్ గ్రామ ఉప సర్పంచ్ మూర్తాల భుజంగరావు లకు హనుమకొండ లోని భవాని నగర్ లో ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్ల ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేయడం జరిగింది.అనంతరం నూతన సర్పంచ్ మలహల్ రావు, ఉపసర్పంచ్ భుజంగారావు లను శాలువాతో సత్కరించి నాగూర్ల వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకటి నాగేష్, జిల్లా ఉపాధ్యక్షులు వరికెల కిషన్ రావు నడికూడ ఆరెకుల యువ నాయకులు మోకిడి రాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సర్పంచ్ సాగర్ఆధ్వర్యంలో వారంతపుసంతఏర్పాటు…
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మండేపల్లి సర్పంచ్ గాదగోనీ సాగర్ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో వారసంతపు సొంత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ మండపల్లి వారసంతపు సంత ఏర్పాటు చేయడం జరుగుతుందని. కనుక ఈ వారంతపు సంతలు నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే దొరుకుతాయని ఇందులో కూరగాయలు కానీ నిత్యవసర వస్తువులు కానీ ఇతర ఏ వస్తువులైన అన్ని సదుపాయాలు ఉంటాయని ప్రజలు పట్టణాలకు వెళ్లి తీసుకువచ్చేఅవకాశలు లేకపోగా సమయం వృధాగా అందుబాటులో ఉండకపోవడంతోసమయం కలిసొస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో వారసంతపు సంత ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి వారం మూడు గంటలకు ప్రారంభమై సాయంకాలం ముగుస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరికీ అందుబాటులో విధంగా సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా రాబోయే రోజులలో పశువుల అంగడి కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలు గాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గాని అందరు సహకరించి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ చుట్టుపక్కల గ్రామాల వారికి అందుబాటులో ఉండే విధంగా అందరు సహకరించాలని గ్రామంలో మైకు ద్వారా ప్రచారం నిర్వహించారుఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
పొట్టి పల్లి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం
◆-: “మాజీ సీడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ”….
◆-: సర్పంచులు గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలోని పొట్టి పల్లి గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలో బి అర్ ఎస్ పార్టీ బలపరిచిన నాయకులు శ్యామల మొగులయ్య సర్పంచ్ గా విజయం సాధించగా సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకులు మాజీ సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… రెండవ విడత స్థానిక ఎన్నికల్లో నూతనంగా విజయం సాధించిన సర్పంచులు గ్రామములో వీధిలైట్లు, శానిటేషన్, గ్రామస్తులకు త్రాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. గెలిచిన బి అర్ ఎస్ సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సర్పంచులు బాధ్యతగా పనిచేస్తూ గ్రామస్తుల మన్నలను పొందాలి అన్నారు. సేవాగుణంతో పని చేసే వారికి ప్రజల గుర్తింపు ఉంటుంది అని గుర్తు చేశారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులేనని, గ్రామ పాలనలో వారందరి సేవ వెలకట్టలేనిదని, మీతో పాటు నేను గ్రామాల ప్రగతి లక్ష్యంగా నిరంతరం పని చేస్తాము అన్నారు. ఓటమి పాలైన బి అర్ ఎస్ నాయకులు ఎవ్వరూ అధైర్యపడవద్దని వారందరూ సమయాభావంతో ఉండి గ్రామాల్లో మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ సిద్దన్న పాటిల్, సర్పంచ్ శ్యామల మొగులయ్య, ఉప సర్పంచ్ జనార్దన్, మాణిక్ పస్తాపూర్ రాములు శేరి బసవరాజ్ శివకుమార్ పాండు విష్ణు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
సంకేపల్లి నూతన ప్రజాప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే యాదయ్య
నేటిధాత్రి, శంకర్ పల్లి:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంకేపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ గా దేశ్పాండే శ్రీనివాస్, ఉప సర్పంచ్ గా ఉప్పరి రవీందర్ సగర, వార్డ్ మెంబర్లు గా తాళ్లపల్లి రుక్కమ్మ, కవ్వగూడెం మల్లేశం యాదవ్, ఉప్పరి లావణ్య శ్రీనివాస్ సగర, తోకల గోవర్థన్ యాదవ్, తోకల సబిత పరమేశ్వర్ యాదవ్ లు భారీ మెజారిటీతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రజాప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడం కోసం కృషి చేస్తానని, గ్రామాభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వీణవంక మండలం మల్లన్నపల్లి గ్రామ సర్పంచ్ గా కలకొండ సరోజన మధుకర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. హుజురాబాద్ డివిజన్ లోనే ఏకైక ఏకగ్రీవ గ్రామ సర్పంచ్ గా మల్లన్నపల్లి నిలిచింది సర్పంచ్ తో పాటు ఐదు వార్డులు ఏకగ్రీవం కావడం తో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా గ్రామ పంచాయతి ఏర్పడగా రెండో సర్పంచ్ గా సరోజన ఏక గ్రీవం కావడం విశేషం. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ..ప్రజల సహకారం తో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఊరి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రామ ప్రజల సహకారం తో గ్రామ అభివృద్ధి కి తొడ్పాతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
`ఇప్పటికే ఏకగ్రీవాలా పేరుతో కాంగ్రెస్ జెండా రెపరెపలు.
`అధికార పక్షం వైపే చూస్తున్న పల్లెలు.
`అధికారికంగా పార్టీ గుర్తులు లేకపోయినా కాంగ్రెస్ నాయకులు ముందంజలో వున్నారు.
`బీఆర్‌ఎస్ నుంచి పంచాయతీ లలో స్పందన కరువు.
`అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టలేని స్థితిలో బిఆర్‌ఎస్.
`తూతు మంత్రంగా పేర్లు ప్రకటిస్తున్నారు.
`అభ్యర్థులు ఎంపిక తలనొప్పి వద్దనుకున్నారు?
`ఆయా గ్రామాలకే వదిలేశారు.
`అందుకే పేర్లు వెల్లడిరచడానికి బిఆర్‌ఎస్ సిద్దపడడం లేదు.
`గెలిచినా వాళ్ళు బిఆర్‌ఎస్ లో ఉంటారన్నా నమ్మకం లేదు.
`ఇంకా మూడేళ్లు సమయం ఉంది.
`అధికార పార్టీ నాయకుల మాటే చెల్లుతుంది.
`బీఆర్‌ఎస్ పార్టీ ఆశలు నెరవేరా లేదు.
`జనం కాంగ్రెస్ మీద వ్యతిరేకత చూపిస్తున్న సందర్భం కనిపించడం లేదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ పల్లెపోరులో ఏం జరుగుతోంది. పాలక, ప్రతి పక్షాల మధ్య పోరు ఎలా సాగుతున్నది? పై చేయి ఎవరు సాదిస్తున్నారు? అనే ఉత్కంఠ అందరిలోనూ వుంది. కాని క్షేత్ర స్దాయిలో ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేదు. ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత లేదు. ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను నమ్మి ఆ పార్టీ అభ్యర్దులను గెలిపించుకునే పరిస్దితి పెద్దగా కనిపించడం లేదు. ఇది అంతు పట్టని వ్యహారంలా మారింది. నిన్నటి దాక బిఆర్‌ఎస్ చెప్పుకున్నదానికి ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తున్నదానికి సంబధం లేకుండా వుంది. గత ఏడాదిన్న కాలంగా పంచాయితీ ఎన్నికలు పెట్టండి? మా తడాఖా చూపిస్తామంటూ బిఆర్‌ఎస్ రంకెలేసింది? అంతెందుకు ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్‌లో ఓటమి తర్వాత కూడా బిఆర్‌ఎస్ పల్లె మాదే. అక్కడ గెలుపు మాదే. పల్లెల్లో పంచాయితీలు మావే. కాంగ్రెస్‌కు చోటు లేకుండా చేస్తాం. కాంగ్రెస్‌ను తుడిచేస్తాం. పల్లెల్లో కాంగ్రెస్ జెండా కనపడకుండా గెలుస్తాం. అంటూ చెప్పుకున్న గొప్పలకు లెక్కే లేదు. కాని క్షేత్రస్దాయిలో చూస్తే అలాంటి పరిస్దితులు చూస్తే మచ్చుకు కూడా కనిపించడం లేదు. బిఆర్‌ఎస్ చెప్పుకున్నంత సులుగా ఆ పార్టీకి పరిస్ధితులు అనువుగా లేవు. పల్లె పోరులో వరుస విజయ పరంపరలను కొనసాగిస్తున్న కాంగ్రెస్ కూడా ముందంజలో వుంది. ముఖ్యంగా ఏకగ్రీవాలలో కాంగ్రెస్ దూసుకుపోయింది. చాల వరకు కాంగ్రెస్ పార్టీ ఏక గ్రీవాలను సాధించింది. ఇంకా మిగిలిన ఎన్నికల పోరులో సత్తా చూపిస్తామని కాంగ్రెస్ అంటోంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పల్లె పోరులో కూడా దూసుకుపోతోంది. విజయాలు సొంతం చేసుకుంటోంది. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు వుండకపోవచ్చు. కాని పార్టీల అభ్యర్దులుగానే రంగంలో వుంటారు. సహజంగా అందరూ ఇండిపెండెంట్లుగానే పోటీ చేస్తారు. కాని అందరూ ఏదో ఒకపార్టీకి అనుబంధ సభ్యులై వుంటారు. అందుకే ఒక ఊరిలో ఒకే పార్టీకి చెందిన పలువులు వ్యక్తులు పోటీచేస్తారు. అందులో ఏదొ ఒకరిని పార్టీ గుర్తించినట్లు మాత్రమే చెప్పుకుంటారు. అందులో గెలిచిన వారిని కూడా తమ పార్టీయే అని చెప్పుకుంటారు. ఇది సహజం. అలా పోటీ చేసే అభ్యర్ధులలో కూడా కాంగ్రెస్‌కు చెందని వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముందు బిఆర్‌ఎస్ చెప్పిన విధంగా ఆ పార్టీ నుంచి పోటీచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్‌తో పోలిస్తే బిఆర్‌ఎస్ అభ్యర్దులు ఎక్కుగా బరిలో లేరు. వున్నదల్లా ఎక్కువగా కాంగ్రెస్‌కు చెందిన నాయకులే ఎక్కువగా వున్నారు. ఇక్కడే కాంగ్రెస్ విజయాలు దాగి వున్నాయని చెప్పడంలో సందేహంలేదు. అందుకే ఏక గ్రీవాలతో కాంగ్రెస్ ఇప్పటికే గెలుపు ఖాతాలు బాగానే తెరిచింది. గెలిచిన వాళ్లంతా కాంగ్రెస్ అభ్యర్ధులే కావడం గమనార్హం. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం బిఆర్‌ఎస్ అభ్యర్దులు ఏకగ్రీవం అయ్యారు. వారిని చూపించుకొని బిఆర్‌ఎస్ పెద్దగా షో చేస్తోందని చెప్పొచ్చు. కాంగ్రెస్‌కు అలా చూపించుకోవాల్సిన అసవరం లేదు. ఒక దశలో మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసేందుకే సమయం ఇవ్వని కేసిఆర్ ఇప్పుడు ఏకగ్రీవమైన ఓ నలుగురు సర్పంచ్‌లను కూడా కలుసుకునే స్ధితికి చేరింది. ఒక రకంగా ఇది ప్రచారంలో ఓ భాగమని చెప్పుకునే పరిస్దితి వచ్చింది. లేకుంటే గతంలో ఏనాడైనా కేసిఆర్ కనీసం తన నియోజకవర్గ సర్పంచ్‌లను కలిసిన సందర్భం ఒక్కటైనా వుంది. కనీసం ఆయన ఫామ్ హౌజ్ దరిదాపులకు రానిచ్చినట్లు వార్తలేమైనా వున్నాయా? ఇప్పుడు ఏకగ్రీవమైన సర్పంచ్‌తో కలవాల్సిన పరస్దితులు ఎదురౌతున్నాయి. అదే ప్రజాస్వామ్యం. అదే ప్రజాస్వామ్య గొప్పదనం. ఆ ఏకగ్రీవమైన నాలుగు సర్పంచ్‌లు కూడా కేవలం కేసిఆర్ పామ్ హౌజ్‌కు పక్కనే వున్న గ్రామాలు కావడం కూడా విచిత్రం. లేకుంటే ఆ నాలుగు కూడా బిఆర్‌ఎస్ ఖాతాలో పడేవి కాదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎక్కడ పరువు పోతుందో అన్న ఆందోళనతోనే ఆ నాలుగైదు గ్రామాలను ఏకగ్రీవం చేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అదే తెలంగాణ మొత్తం వున్నట్లు చెప్పుకోవడానికి బిఆర్‌ఎస్ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. కాని క్షేత్ర స్దాయిలో ఆ పరిస్దితులు అసలే లేవు. బిఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటున్నట్లు కూడా కనిపించడం లేదు. ఇక ఘట్టం ముందుంది. నిజం చెప్పాలంటే సాదారణ ఎన్నికలకు మరో మూడు సంవత్సరాల గడువుంది. ఈ మూడు సంవత్సరాలు పంచాయితీలకు నాలుగు రూపాయలు విడుదల కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వాలి. అదే బిఆర్‌ఎస్ సర్పంచ్‌లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లలేరు. నిదులు అడగలేరు. సహజంగ వచ్చే నిధులు గ్రామాభివృద్దికి సరిపోవు. ఎమ్మెల్యే నిధుల నుంచి ఎన్నో కొన్ని నిదులు తేవాల్సి వుంటుంది. తాను సర్పంచ్‌గా వున్న సమయంలో చేసిన అభివృద్ది ఇది అని చూపించుకోవడానికి వుంటుంది. లేకుంటే ఐదేళ్లు చేయడానికి ఏమీ వుండదు. ఆ ఊరికి సర్పంచ్ వున్నారా? అంటే వున్నారు. అనే విధంగా గ్రామ పాలన సాగుతుంది. ఆ సర్పంచ్ పాలన మీద వ్యతిరేతక మొదలౌతుంది. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సంక్లిష్ల పరిస్ధితులు ఎదురైనప్పుడు తప్పని పరిస్దితుల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచినా పాలక పక్షం తీర్దం పుచ్చుకోవాల్సి వస్తుంది. ఒక వేళ ఈ మూడు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోవున్నా, సాదారణ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు వద్దన్నా ఈ సర్పంచ్‌లంతా కాంగ్రెస్‌లో చేరుతారు. చాలా మంది గెలిచిన వెంటనే గ్రామాభివృద్ది కోసం కాంగ్రెస్‌లో చేరుతారు. ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గం అభివృద్ది కోసమంటూ పార్టీలు మారుతున్న సమయం. అలాంటిది సర్పంచ్‌లు మారడం అనేది పెద్ద సమస్య కాదు. అసలు విషయమే కాదు. ఇక బిఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌లు మళ్లీ ఆపార్టీ నాయకులు పెద్దగా పోటీకి ఆసక్తి చూపకపోవడానికి మరో బలమైన కారణం వుంది. గత రెండుసార్లు బిఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌లుగా గెలిచిన వారికి లక్షల రూపాయలు బకాయిలున్నాయి. బిఆర్‌ఎస్ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని నమ్మి పెద్దఎత్తున నిదులు వెచ్చించి గ్రామాభివృద్ది కోసం సొంత నిదులు ఖర్చు చేశారు. అభివృద్ధి పనుల కోసం మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి మరీ పనులు చేపట్టారు. ఆ పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఆ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. ప్రజా ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బకాయిలు చెల్లించలేదు. దాంతో వారి రాజకీయం ఏనాడో తలకిందులైంది. వారిని కదిలిస్తే బోరున ఏడ్వడం తప్ప మరేమీ వుండదు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలంటే కలలో కూడా భయపడే పరిస్దితి వచ్చింది. ఎన్నికంటేనే భయపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలంటే ఆమడ దూరం పారిపోతున్నారు. పార్టీలకో దండం, పదవికో దండం అని అంటున్నారు. గతంలో మేం చేసిన పనులకు బకాయిలు వస్తే అదే మాకు చాలు అంటున్నారు. ఒక్కసారి సర్పంచ్ అయిన పాపానికి చేసిన అప్పులకు ఆస్ధులు అమ్ముకున్నాం. ఇక చాలు ఈ రాజకీయాలు. ఇక చాలు సర్పంచ్ పదవులు అని చెబుతున్నారు. అందుకే బిఆర్‌ఎస్ నాయకులు సర్పంచ్ ఎన్నికలు అంటేనే దండం పెడుతున్నారు. మమ్మల్ని పార్టీ ఉద్దరించింది చాలు అంటూ ఆ పార్టీ నాయకుల ముఖం మీదే మాజీ సర్పంచ్‌లు చెబుతున్నారు. అంటేనే బిఆర్‌ఎస్ పరిస్దితి అంచానా వేయొచ్చు. ఆ పార్టీ దుస్దితిని అర్దం చేసుకోవచ్చు. ఇది కూడా కాంగ్రెస్‌కు వరమైపోయింది. పల్లెలన్నీకాంగ్రెస్ ఖాతాలో పడేందుకు దారి చూపింది. కాగల కార్యం గందర్వులే తీర్చినట్లైంది. పోటీలో వుంటారనకున్న బిఆర్‌ఎస్ నాయకులు పక్కకు తప్పుకోవడంతో కాంగ్రెస్ గెలుపుకు అడ్డు లేకుండాపోయింది. పల్లెల్లో కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది.
గణపురం రేగొండ సర్పంచ్ లు గ్రామాలల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కొత్తగా ఏకగ్రీవమైన సర్పంచ్ లకు సూచించారు. గురువారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను గణపురం మండలం బుద్దారం ఏకగ్రీవ సర్పంచ్ విడిదినేని శ్రీలత – అశోక్, పన్నెండు మంది ఏకగ్రీవ వార్డు సభ్యులు మరియు రేగొండ మండలం కొత్తపల్లి(బీ) గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ బూతం రజిత – రమేష్ లు మర్యాదపూర్వకంగా పూల బొకేలు అందించి కలిశారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ లకు శాలువాలు కప్పి, స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజల ఐక్యతతో, అభివృద్ధి లక్ష్యంతో ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకోవడం సంతోషమన్నారు. ఈ నిర్ణయం గ్రామ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగు నీరు, విద్యా, ఆరోగ్య రంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో అవసరమైన చోట (ఎమ్మెల్యే) పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
స్థానిక ఎన్నికల బరిలో అభ్యర్థులు: జీరో బ్యాలెన్స్ ఖాతాల కోసం బ్యాంకుల ముందు బారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడానికి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులను ఆశ్రయిస్తున్నారు. జహీరాబాద్ కోహిర్ మొగుడంపల్లి న్యాల్కల్ ఝరాసంగం డీసీబీ, ఎస్బీఐ, కెనరా ఎస్బిఐ యూనియన్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలు అభ్యర్థులు, వారి అనుచరులతో రద్దీగా మారాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో ఈ సందడి నెలకొంది. ఎన్నికల నియమాల ప్రకారం, అభ్యర్థులు తమ ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాలు తెరవాలి, వాటిలో జీరో బ్యాలెన్స్ ఉండాలి.
నిర్ణీత గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి,చెల్కగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామపంచాయతీ, నెల్కివెంకటాపూర్,వందూర్ గూడ,చింతపల్లి,తానిమడుగు గ్రామాలకు నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ,ద్వారక, కొండాపూర్,ధర్మారావుపేట గ్రామాలకు ద్వారక గ్రామపంచాయతీ, మ్యాదరిపేట,మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామపంచాయతీ,దండేపల్లి, కర్ణపేట,నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని తెలిపారు. నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం మండలంలోని ద్వారక గ్రామంలో కొనసాగుతున్న షెడ్యూల్డ్ తెగల బాలుర సంక్షేమ వసతిగృహం నిర్మాణ పనులను సందర్శించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయాలని,కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు,గోనె సంచులు, తేమ యంత్రాలు,తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.దొడ్డు రకం,సన్న రకం ధాన్యాలను వేరువేరుగా కొనుగోలు చేయాలని,సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు సమయంలో రైతుల వివరాలు, ధాన్యం వివరాలను సేకరించి ట్యాబ్ లలో నమోదు చేయాలని, సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి,సూరారం గ్రామాలకు గుల్లకోట గ్రామపంచాయతీ, పోతపల్లి,అంకతిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలకు పోతపల్లి గ్రామపంచాయతీ,చందారం, హనుమంతుపల్లి,రంగపేట గ్రామాలకు చందారం గ్రామపంచాయతీలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని,ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం ఇటిక్యాల గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన పోస్ట్ మార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు,సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం: రెండున్నర సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అంటూ.. ఎదురుచూస్తున్న ఆశావాహులకు ఊరట కలిగించే విధంగా ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎట్టకేలకు గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఆదివారం జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా ఎన్నికల అధికారులకు నివేదికలను పంపారు. వార్డుల వారీగా ఝరాసంగం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మంజుల, ఎంపీఓ ఎన్, స్వాతి, అధికారుల బృందం “డ్రా” పద్దతిన అధికార, విపక్ష పార్టీల శ్రేణుల సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు మహిళలకు 50 శాతంలోపు రిజర్వేషన్ కల్పిస్తూ ఖరారు చేశారు.
ఝరాసంగం మండలంలో 33 జీపీల్లో 13 జీపీలు మహిళలకు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోనే 33 గ్రామ పంచాయతీలతో అతిపెద్ద మండలం ఝరాసంగం 33 గ్రామపంచాయతీల్లో 13 జీపీలను మహిళలకు కేటాయించగా.. మిగిలిన 17 జీపీ లను పురుషులకు కేటాయించారు. మండలంలో 288 వార్డుల గాను 126 మహిళలు, 162 జనరల్ రిజర్వుగా ఖరారు చేశారు. ఎస్సీ మహిళలకు 35, ఎస్సీ జనరల్ 48 . బిసి మహిళలకు 20, బీసీ జనరల్ 34. జనరల్ మహిళలకు 64, జనరల్ 73, ఎస్టీ మహిళ 7, ఎస్టీ జనరల్ 7 చొప్పున వార్డుల వారిగా రిజర్వేషన్ కల్పిస్తూ “డ్రా” పద్ధతిన ఖరారు చేశారు.
ఝరాసంగం ఎస్సీ మహిళకు రిజర్వ్..
మండల కేంద్రమైన ఝరాసంగం గ్రామ పంచాయతీని ఎస్సీ మహిళకు ఖరారైంది. 33, గ్రామ పంచాయతీల్లో.. జనరల్ మహిళలకు 9, బీసీ మహిళలకు 3, జనరల్ రిజర్వ్ 8, ఎస్సీ మహిళ 2, ఎస్సీ జనరల్ 5, బీసీ జనరల్ 2 మేర ఆయా గ్రామపంచాయతీ సర్పంచులగా పోటీ చేసేందుకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆశావాహులకు..” ఈ సారీ నిరాసే”..!
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అంటూ.. రెండున్నర సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న.. పలువురు ఆశావాహులకు ఈ సారి సైతం నిరాసే మిగిలింది. మండలంలోని అధికార, విపక్ష, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువతలు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిని కనబరిచారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని ఆశించిన పలువురు చివరకు నిరాశకే లోనయ్యారు.మండల కేంద్రమైన ఝరాసంగం, కొన్ని తదితర గ్రామాల్లో అధికార, విపక్ష పార్టీ శ్రేణులతో పాటు యువత సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఆసక్తిని కనపరిచారు. ఎట్టకేలకు రిజర్వేషన్లు వారికి ప్రతికూలంగా రావడంతో నిరాశకు గురయ్యారు.
గ్రామ పంచాయతీ మహిళా వార్డు రిజర్వేషన్లు లాటరీ ద్వారా పాల్గొన్నాన పార్టీ నాయకులు
ఝరాసంగం మండల పరిధిలోని గ్రామ పంచాయతీ వార్డు మహిళా సభ్యుల రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేసేందుకు ఝరాసంగం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ మంజుల తెలిపారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు లాటరీ ద్వారా పాల్గొన్నాన పార్టీ నాయకులు, ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు విశ్వనాతం సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు చంద్రన్న పాల్గొన్నారు,
గుబ్బడి సంఘమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలోని గుబ్బడి సంఘమేశ్వర స్వామి వారిని ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం స్వామి వారిని దర్శించుకున్న వారిలో మాజీ జడ్పీటీసీ పండరీనాథ్, మాజీ సర్పంచ్ శంకర్,బండమీది రాములు, బండమీది శ్రీనివాస్,వై.తరుణ్, బసంత్ పాటిల్, మాణిక్ పాటిల్, చెంగల్ జైపాల్,యాదగిరి,శివ కుమార్,సిద్దేశ్వర్ స్వామి,పవన్ రాథోడ్,మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు,
న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్వి న్యాల్కల్ మండల్ మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో మల్గి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అని అన్నారు అలాగే ఇప్పుడు న్యాల్కల్ మండల్ జడ్పిటిసి స్థానం బీసీ జనరల్ కేటాయించడంతో అధిష్టానం నాకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు,
రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్
జడ్పీటీసీ అభ్యర్థి ఖర్చు లిమిట్ రూ.2.50 లక్షలు, ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు
సర్పంచ్‌కు జనాభాను బట్టి రూ.2.50 లక్షలు, రూ.1.50 లక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్అయింది. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండినోళ్లు అర్హులు.
పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులు.
మతసంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు. సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి..
శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా (గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చెంతంటే?
అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎస్‌ఈసీ నిర్ధారించింది. జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.
అలాగే 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి.
ఖర్చుల నివేదికను సమర్పించాలి. అంతేకాకుండా, అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏదీ లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
డిపాజిట్ తప్పనిసరి..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి బ్యాంకు డిపాజిట్ చేయాలి. జడ్పీటీసీ పదవికి పోటీచేసే అభ్యర్థి (జనరల్) రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు రూ. 2,500 డిపాజిట్చేయాలి. ఎంపీటీసీగా చేసేవారు రూ.2,500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.1,250, సర్పంచ్అభ్యర్థి రూ.2 వేలు (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.వెయ్యి, వార్డు సభ్యుడికి రూ.500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250. పోటీచేసే అభ్యర్థులు పంచాయతీల పన్ను బకాయిలు, కరెంట్ బిల్లులు కూడా క్లియర్ చేసి ఆ రసీదులు తీసుకోవాలి. అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం బంద్..
ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనున్నది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడకూడదు. సమావేశాలు, ర్యాలీలు, ఇతర ప్రదేశాల్లో మీటింగ్ కు అనుమతి తప్పనిసరి. అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలపాలి. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపై ఆంక్షలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం.. దొంగ ఓట్లను ప్రోత్సహించడం నేరం. అలాగే అభ్యర్థి డిపాజిట్ తిరిగి పొందాలంటే తనకు పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు సాధించాలి. లేదంటే డిపాజిట్ రాదు.
లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్..
రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీల జాబితా, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ఎలాంటి కేటాయింపులు లేని ‘లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్’ జాబితాను తెలంగాణ గెజిట్‌లో ఎస్‌ఈసీ ప్రచురిస్తుంది. తమ వద్ద రిజస్టర్ అయ్యి ఎలాంటి గుర్తు కేటాయించని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు ‘ఫ్రీ’ గుర్తులను కేటాయించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
న్యాల్ కల్ మండలం వడ్డి గ్రామం లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ మండలం మాజీ అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నుండి పార్టీ మార్పు చేసిన నాయకులపై ఫైర్ అయ్యారు కితకో పార్టీ మార్పు చేస్తున్న నాయకులకు ప్రజలు యూవకులు గమనిస్తున్నారు అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికీ చిత్తూ చిత్తూ గా ఒడిస్తాం అని వారు ఫైర్ అయ్యారు రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు పోటి చేపిస్తాం జడ్పీటీసీ కీ కూడ గెలుపే లక్ష్యంగా అందరు పని చెయ్యాలని ఎవరు ఆ ధైర్యం పడొద్దు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మండలం ప్రధాన కార్యదర్శి రాహుల్ పలింకార్ నర్సప్ప సచిన్ లక్ష్మన్ షేర్ అలీ సంజుకుమార్ రాజు తదితరులు ఉన్నారు,
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి
సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ కానాలకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నది కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా ప్రజల కొరకు పనిచేసిన దాకాలు లేవు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అయిన తర్వాత హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కేయడం పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారింది చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్న పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు ఇసుక మాఫియా. ప్రకృతి సంపద దోచుకోవడం. రోజురోజుకు పెరిగిపోతాయి ప్రశ్నించే గొంతుక లేకపోవడం వలన అవినీతి రాజ్యమేలుతుంది ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి.నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి. కోడం రమణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర సిపిఎం నాయకులు,సందు పట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్:సెప్టెంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామపంచాయతీలు మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు. మండలలోని ఎంపీటీసీలు సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డిఓలు గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు.. సంబంధిత అధికారులతో కలెక్టర్లు సమావేశమయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీసు, పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని, అంత మొత్తం లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు.
తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా రెండు, మూడు విడతల్లో పోలింగ్నిర్వహించాలని కోరారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా.. సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం మూడు విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు గోప్యంగా ఉంచారు. బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీచేసిన అనంతరమే రిజర్వేషన్లు ప్రక్రియకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ, బుధ, లేక గురువారం విడుదల చేయనుంది.
మరోసారి ప్రభుత్వంతో సంప్రదించి ఎన్ని విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొనున్నారు.అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది, అక్టోబర్ రెండో వారంలో ఫస్ట్ విడత నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది, నవంబర్ 10 కల్లా సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆదివారం (పితృ అమావాస్య )బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో వేద బ్రాహ్మణులకు తమ పితృదేవతల జ్ఞాపకార్థం బియ్యం తదితర వాస్తు సామాగ్రిని అప్పజెప్పి బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందిన పలు వర్గాల ప్రజలు, ఇదిలా ఉండగా మహిళలు తంగేడు పువ్వు, గునుగు పువ్వు, తిరోక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం గ్రామ లలో నీ చెరువుగట్టులు, దేవాలయ ప్రాంగణాలలో, బతుకమ్మ ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మెజారిటీ గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుడి, పదవులు ఆశిస్తున్న చోట నేతలు వారి శక్తి కొద్ది కొందరు డి జే లు, మరికొందరు కోలాటాలకు కోలలు , సమకూరు ఇస్తే, ఇంకొందరు మహిళలకు ఏక దుస్తులు అందించారు. దీంతో గ్రామాలలోని మహిళలు, చిన్నలు, పెద్దలు, అందరూ బతుకమ్మ సంబరాలను సంబరాన్ని అంటే మాదిరిగా నిర్వహించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.