నర్సంపేటలో మహిళలు హామీలు నెరవేర్చాలని నిరసన

ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహిళల నిరసన

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం
మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు.కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసం కరుణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తా అన్న హామీలను నెరవేర్చలేకాపోవడంతో పాటు వంద రోజులలోనే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని మోసం చేసిందని ఎద్దేవా చేశారు.పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు కళ్యాణ లక్ష్మి పథకం కింద కెసిఆర్ ప్రభుత్వం ఇస్తున్న రూ. 1 లక్ష 16 తో పాటుతో పాటు తులం బంగారం ఇస్తామని ఇప్పటివరకు ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదన్నారు.ఎన్నికలకు ముందు ప్రతి మహిళకు ప్రతినెల 2500 అకౌంట్ లో వేస్తామని హామీ ఇచ్చి మాటతప్పారని అలాగే వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇస్తామన్నా రూ. 4 వేల పెన్షన్ ఇవ్వలేదని వివరించారు.చదువుకుంటున్న విద్యార్థినిలకు స్కూటీలు అలాగే విద్యా భరోసా కార్డు కింద విద్యార్థినిలకు ఐదు లక్షలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసం కరుణ, మహిళా కమిటీ బాధ్యులు నాయిని సునీత, చింతం విజయరాణి, బొచ్చు సరళ వడ్లుకొండ స్వరూపా ఆధ్వర్యంలో పాల్గొన్న మహిళ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

దిడిగి గ్రామంలో ఘనంగా గృహజ్యోతి కార్యక్రమం

ఘనంగా గృహజ్యోతి కార్యక్రమం దిడిగి గ్రామంలో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని దిడిగి గ్రామంలో
సర్పంచ్ జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ గృహజ్యోతి వంటి పథకాలు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప మాట్లాడుతూ దిడిగి గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామ మహిళలు స్వావలంబన సాధించే దిశగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కేకే మహేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం….

కేకే మహేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి రాష్ట్రంలో మొదటి విడత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉండి చాలాచోట్ల తమ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారని.దీనికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిదర్శమనితెలియజేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర మహిళలకు ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తూ ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్రంలో మహిళలకు అభివృద్ధిలో పాలుపంచుకునే విధంగా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గర్వంగా చెప్పుకోవడం జరుగుతుందని తెలియజేస్తూగత పాలకులు రాష్ట్రాన్ని సంవత్సరాలు పరిపాలించి అప్పులపాలుచేశారని అట్టి అప్పు చేసిన రుణాలను తీర్చుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకువెళ్తున్నారని ఇకముందైన ఇతర పార్టీలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్రంలో ప్రజలందరూ మా పార్టీ చేస్తున్న అభివృద్ధివైపే.ఉన్నారని మా రెండేళ్ల పరిపాలనలో అభివృద్ధిని చూడలేక అనేక అబండాలువేస్తున్నారని మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని అందరూ ప్రజలు గ్రహిస్తున్నారని ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు రాష్ట్రాన్ని దివాలా పరిస్థితిలో ఉంచారో ప్రజలు గమనించే స్థితిలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని దేనికైనా నోరు ఉంది కదా అని అభివృద్ధి పదంపై నడిపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుపై లేనిపోని అపనిందలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తగిన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని ఇకముందైనఅభివృద్ధిని చూసిగర్వించాలి తప్ప ఎగతాళి చేయకూడదని రాష్ట్రంలో ప్రజలు ముందు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. ఇట్టి సమావేశ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్.జిల్లా అధికార ప్రతినిధి లింగాల భూపతి. పెద్దూరీ.తిరుపతి. మోర లక్ష్మీరాజం. సత్తు శ్రీనివాస్ రెడ్డి. భాస్కర్ గౌడ్. బండి పరశురాం గౌడ్ ఎగుర్ల ప్రశాంత్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు, కార్యకర్తలు తదితరులు ఇట్టి సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు

మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల రాంలింగా రెడ్డి ఆధ్వర్యంలో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో స్వయం సహాయక సంఘం మహిళలకు ‘పుట్టింటి సారై’ మాదిరిగా ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం

ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం – జహీరాబాద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,

మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి…

మహిళల అభివృద్ధి – సమాజ అభివృద్ధి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

లక్షేట్టిపేట,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ పథకంలో భాగంగా మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్,మండలాల తహసిల్దార్లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తుందని,ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు.మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం,డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మందమర్రి మండలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పాటు మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని,మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలోని 1 వేయి 618 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 43 లక్షల 61 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి..

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు

జైపూర్,నేటి ధాత్రి:

ప్రభుత్వం మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీలేని రుణాల పథకం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు అన్నారు.మంగళవారం జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో చెన్నూర్ నియోజకవర్గంలోని మండలాల తహసిల్దార్ లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ వ్యాపార రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,మహిళ సంఘం ప్రతినిధి మాలతి, మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది…

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, మండలాల తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి నినాదంతో వ్యాపార రంగంలో మహిళలను ప్రోత్సహిస్తూ వ్యాపారాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, ఆరోగ్యంగా బలంగా ఉండాలని, ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని ఉద్దేశంతో మహిళ ఆర్థిక ప్రగతిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం, డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 2 వేల 671 స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల 31 లక్షల 12 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T170418.367.wav?_=1

 

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క

భూపాలపల్లి నేటిధాత్రి

 

మహిళలను వ్యాపార రంగంలో రాణించేలా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో మహిళలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులకు యజమానులను చేయడం, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ లాంటి ఎన్నో కార్యక్రమాలను వారిని ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని అన్నారు. ఇందిరాగాంధీ చేసిన అభివృద్ధి బాటలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశ ప్రగతి, పేదల అభ్యున్నతి కోసం ప్రాణాలర్పించిన మ‌హ‌నీయురాలు ఇందిరాగాంధీ అని ఆయన కొనియాడారు. ఆమె ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని తెలిసినా దేశ సమగ్రత, సమైక్యత కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఇందిర‌మ్మ పాల‌నే ఆద‌ర్శంగా పేద‌ల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కొల్లూరులో ఇందిరమ్మ చీరల పంపిని :

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T163439.985.wav?_=2

 

 

కొల్లూరులో ఇందిరమ్మ చీరల పంపిని :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టినా కార్యక్రమములో బాగంగా కొల్లూరులో ఇందిరమ్మ చీరాల పంపిని కార్యక్రమాన్ని చెపట్టారు ఇట్టి కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ అధికారులు,పెద్దల అధ్వర్యం లో జరిపించారు…ఇట్టి కార్యక్రమములో గ్రామ పెద్దలు నందు పాటిల్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, యాప్ఏ అధికారి చింతలగట్టు సుబాకర్, మహిళా సంగాల సిఏ మరియమ్మ, విఓ నాయకురాలు శివానంద,బుజ్జమ్మ,నాయకులు ఎం విష్ణు,బీరప్ప,ఈశ్వర్, సంగమేష్,శేఖర్,బాబీ పాటిల్,జీవన్ మరియు గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామల లో ఇందిరమ్మ చీరల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T150309.915.wav?_=3

 

గ్రామల లో ఇందిరమ్మ చీరల పంపిణీ

కొత్తగూడ, నేటిధాత్రి:

 

కొత్తగూడ మండలం ముస్మి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ దేవేందర్ గ్రామ లోని ఆడపడుచులకు సోమవారం రోజున చీరల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి మంది మహిళలక కోటి చీరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ” మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఆడపడుచులకు చీరల పంపిణీలో సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల గ్రూపుల మహిళలకు చీరాల పంపిణీనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..

ఇందిరమ్మ మహిళాశక్తి చీరల పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T143446.839.wav?_=4

 

ఇందిరమ్మ మహిళాశక్తి చీరల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలం, నర్సాపూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఇందిరమ్మ మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకుల సురేష్ గోపాల్ జైపాల్ రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు చీరలను అందజేశారు.

మండల కేంద్రంలో ఆడపడుచులకు చీరల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T131312.775.wav?_=5

 

మండల కేంద్రంలో ఆడపడుచులకు చీరల పంపిణీ

మహాదేవపూర్  నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ఆడపడుచులకు సోమవారం రోజున చీరల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి మంది మహిళలకు కోటి చీరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ” మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఆడపడుచులకు చీరల పంపిణీలో భాగంగా మండల కేంద్రంలోని ఇంద్ర క్రాంతి పథం కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల గ్రూపుల మహిళలకు చీరాల పంపిణీనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ కోట రాజబాబు, పిఎసిఎస్ చైర్మన్ తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్, ఐకెపి ఎపిఎం రాజన్న, మాజీ ఎంపిటిసి సుధాకర్, మాజీ ఎంపీపీ రాణి బాయ్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ బంధం స్వామి మరియు పలువురు అధికారులు, గ్రూప్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

డిడ్గి గ్రామంలో: చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T124005.394.wav?_=6

 

డిడ్గి గ్రామంలో: చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండల డిడ్గి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. నరసింహ రెడ్డి,మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ప్రతి మహిళకు ఉచితంగా చీరలు అందిస్తామని, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఇటీ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ అక్బర్ హుస్సేన్,గ్రామ పంచాయతీ కార్యదర్శి రమ్య, సిఏ లక్ష్మమ్మ, వివో లీడర్స్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ ఐఎంసి డైరెక్టర్ మల్లారెడ్డి, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, సామెల్, సాంసంన్ సురేష్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

ఇంటింటికి ఇందిర‌మ్మ చీర‌…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-20T134724.211.wav?_=7

 

ఇంటింటికి ఇందిర‌మ్మ చీర‌

#ఎస్‌హెచ్‌జీ వెలుప‌ల ఉన్న మ‌హిళ‌ల‌కు సభ్యత్వం ఇచ్చి చీరలను వెంటనే ఇవ్వాలి.

#మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాల ప్రాముఖ్య‌త‌ను, ఇందిరా మ‌హిళా శ‌క్తి విజ‌యాల‌ను చాటేలా నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల స్థాయిలో ప్రారంభ కార్య‌క్ర‌మాలు

#గ్రామాల్లో ఇంటింటికి వెల్లి చీర‌లు పంచాలి

#ప్ర‌త్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపిణి వివ‌రాల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు న‌మోదు చేయాలి.

అధికారుల‌కు దిశానిర్దేశం చేసిన‌ మంత్రి సీత‌క్క‌

ములుగు జిల్లా,నేటిధాత్రి:

 

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెర్ప్ ఉన్న‌తాధికారుల‌తో గురువారం నాడు టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన మంత్రి సీత‌క్క అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు.
మహిళల గౌరవం, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగాలని ఆమె పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు చీర అందేలా పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని సీతక్క సూచించారు.ఇంకా స్వయం సహాయక బృందాల్లో లేని మహిళలకు అవగాహన కల్పించి, వెంటనే వారికి సభ్యత్వం ఇచ్చి ఇందిర‌మ్మ చీరలను అక్కడికక్కడే అందించాల‌ని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. నూత‌న ల‌బ్దిదారుల‌ను గుర్తించేందుకు పౌర స‌ర‌ఫ‌రాల శాఖ స‌హ‌కారాన్ని తీసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుత‌, కొత్త లబ్ధిదారుల వివరాలను ప్ర‌త్యేకంగా రూపొందించిన సెర్ప్ ప్రొఫైల్ యాప్ ద్వారా నమోదు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారి చేశారు.
పంపిణీ కార్యక్రమం దశలవారీగా నిర్వహిస్తున్న‌ట్లు మంత్రి సీత‌క్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుండి డిసెంబర్ 9 వరకు మొదటి దశలో, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి 9 వరకు రెండో దశగా పంపిణీ చేయాలని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన‌ట్లుగా, ప్రతి నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో స్థాయి ప్రత్యేక అధికారిని నియమించి, నియోజకవర్గం నుంచి మండల, గ్రామ స్థాయిల వరకు పంపిణీని పర్యవేక్షించేలాగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీతక్క సూచించారు.
ఇందిర‌మ్మ చీర‌ల పంపిణి కార్య‌క్రమాన్ని పుర‌స్క‌రించుకుని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాల ప్రాముఖ్య‌త‌ను, ఇందిరా మ‌హిళా శ‌క్తి విజ‌యాల‌ను చాటే విధంగా నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల స్థాయిలో ప్రారంభ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో కార్యక్రమం జరగాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు మరియు ప్రజాప్రతినిధులందరికీ మండల స్థాయి కార్యక్రమాలకు ఆహ్వానం పలకాలని ఆమె అధికారులను కోరారు. గ్రామ స్థాయిలో ప్ర‌భుత్వ‌ సిబ్బందితో పాటు గ్రామ మ‌హిళ స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యులు..ల‌బ్దిదారుల నివాసాల‌కు వెల్లి ఇందిర‌మ్మ చీర‌ల‌ను బొట్టుపెట్టి అంద‌చేయాల‌ని సూచించారు. మ‌హిళ‌ల ఐక్య‌త‌ను చాటే విధంగా ఇంటింటికి ఇందిర‌మ్మ చీర‌లు చేర్చుతామ‌న్నారు.
లబ్ధిదారుల వివరాలను సేర్ఫ్ ప్రొఫైల్ యాప్ ద్వారా నమోదు చేయడం తప్పనిసరి అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా ఆధార్ డేటా, ఫోటోల సేకరణ జరగాల్సి ఉన్నందున అధికారులు పూర్తి సన్నద్ధతతో వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మహిళల జీవితాల్లో ఆనందాన్ని నింపే పండుగలా మారాలని, ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రచారం పెంచాలని సీతక్క ఆదేశించారు.

గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష…

గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అలాగే ఎంపీడబ్ల్యూ వర్కర్లను వార్డుల వారిగా విభజించి చెత్త సేకరించాలని తెలిపారు.ప్రతిరోజు అన్ని గ్రామ పంచాయతీలలో విధిగా పనులను నిర్వహించాలని,ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూడాలని,సేగ్రిగేషన్ షెడ్ లలో వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేపించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఇంటి పన్ను వాసులలో ఇప్పటివరకు 29% మాత్రమే చేశారని,నవంబర్ 25వ తేదీలోపు 100% ఇంటి పన్ను వసూలు చేయాలని లేనియెడల తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ బాపూరావు,పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్,ఆర్.శ్రావణి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ…

కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ

వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం

హైదారాబాద్/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం అని గుర్తు చేశారు.ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు సచివాలయం నుండి సీఎం తో కలిసి వీ.సీలో భాగస్వాములవగా, వరంగల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని,నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగాలని, మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో చీరల పంపిణీ చేపట్టాలని సూచించారు. పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని,
గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వాటికి మహిళలను యజమానులను చేశామని, స్కూల్ యూనిఫారంలు కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని, ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రామిరెడ్డి , మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు, డిపిఎం, ఏపీఎం లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

బంపరాఫర్: మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు…

బంపరాఫర్: మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు

అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు..

ఇంటర్నెట్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు ఆర్జేడీ పార్టీ నేత, కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. తన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘మాయ్-బహిన్ మాన్ యోజనా’పేరిట ఈ పథకం తీసుకొస్తామని చెప్పారు.

ఈ యోజన కింద, ప్రతి మహిళకు మకర సంక్రాంతి (జనవరి 14) నాడు రూ. 30,000 నగదు సహాయం అందజేయబడుతుందని తేజస్వి పేర్కొన్నారు. ‘మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మకర సంక్రాంతి నాడు ఈ యోజనను అమలు చేస్తాం. ఇది బీహార్‌లోని ప్రతి తల్లి, సోదరి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సహాయపడుతుంది,’ అని చెప్పుకొచ్చారు.

 

తెలంగాణా ప్రజల గుండె ల్లో కేసీఆర్

తెలంగాణా ప్రజల గుండె ల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రె స్ ప్రభుత్వంలో విసుగు చెందారు

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ

శాయంపేట నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

శాయంపేట మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరి యు వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారంబిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.

రైతులకి ఇస్తామని చెప్పిన రైతు బంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు,

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దుల కు, వితంతువులకి, వికలాం గులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వ లేదు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల కు ఇదిగో మా బాకీ కార్డు,మా కు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని కోరారు.

BR

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకన్న మరియు మాజీ ఎంపిటిసి మేకల శ్రీనివాస్, అట్ల రమేష్ అట్ల తిరుపతి మామిడి శంకర్ గారు మాజీ సర్పంచ్ తోట కుమారస్వామి పసునూటి రాజయ్య సామల విజయ్ చాడ రాజిరెడ్డి కొమురాజు ప్రశాంత్ దీండిగాల నాగార్జున్ కర్రు రవి, ఆకుల శంకర్, కొప్పుల బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు పోతుల విష్ణు,మాస్ అనిల్, బండారి ఆనందం, ఆకుతోటరాజు పసునూటిరాజు, గరిగరమేష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, పత్తిపాక ముఖ్య నాయకులు బి.నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, వైద్యుల తిరుప తిరెడ్డి, సాంబరెడ్డి, చల్లా సమ్మిరెడ్డి, తుడుం వెంకటేష్, గజ్జి రమేశ్, పోతుగంటి సుభాష్, నక్క రాజు మరియు కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version