స్కానింగ్ సంబంధిత పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలి

స్కానింగ్ సంబంధిత పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో సాంకేతిక వైద్య నిపుణులు, సిబ్బంది,స్కానింగ్ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా అడ్వైజరీ కమిటీ చైర్ పర్సన్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత అన్నారు.శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షలు,పిసిపి ఏంటి యాక్టివ్ పై ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.అరుణశ్రీ,జిల్లా పౌర సంబంధాల అధికారి యం.కృష్ణమూర్తి లతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో పి సి పి ఎన్ డి టి యాక్ట్ ప్రకారం 53 స్కాన్ కేంద్రాలు పని చేస్తున్నాయని, ఇందులో 4 ప్రభుత్వ పరంగా, 49 ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు స్త్రీ వైద్య నిపుణులు, రేడియాలిస్టులు,సూపర్ స్పెషలిస్టులు ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి స్కానింగ్ కేంద్రంలో స్కానింగ్ పరికరము నిర్వహిస్తున్న వైద్యుల వివరములు నమోదు అయి ఉండాలని,అదే విధంగా ప్రతి కేంద్రంలో లింగ నిర్ధారణ పైన తీసుకుంటున్న చర్యల వివరాలపై ఫ్లెక్సీ,పోస్టర్ల ద్వారా అవగాహన కలిగించాలని తెలిపారు.లింగ నిర్ధారణ చేయబడదు,చెప్పబడదు, అడిగిన వారికి,చెప్పిన వారికి యాక్ట్ ప్రకారంగా చర్యలు చేపట్టబడును అని వివరాలను ప్రదర్శించాలని, స్కానింగ్ కేంద్రంలో గర్భవతులకు కుర్చీలు, త్రాగునీటి సౌకర్యము కల్పించాలని,వైద్యుల వివరాలు,రుసుముల వివరాలు గోడ పై అతికించాలని తెలిపారు.గర్భవతుల స్కానింగ్ పూర్తి వివరాలను ఫార్మ్ ఆఫ్ లో నమోదు చేయాలని,స్కానింగ్ చేసుకుంటున్న గర్భవతి సంతకం తీసుకోవాలని,ప్రైవేట్ ఆసుపత్రులు,స్కానింగ్ కేంద్రాలు గర్భవతులకు,తల్లులకు,ఇంటి వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.కమిటీ సభ్యులు అడిగిన ప్రకారంగా మండలాల వారిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని,గోడ ప్రతులు,కరపత్రాలు,స్థానిక ఛానళ్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.బర్త్ రూట్ ఆసుపత్రికి సంబంధించిన స్కానింగ్ మెషిన్ ను అప్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు.పిసిపి ఏంటి పోర్టల్ లో వచ్చిన వివరాలను తెలియజేసి తగు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో గర్భవతులకు చేసే స్కానింగ్ మాత్రమే కాకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యులు చేస్తున్న వారి స్కానింగ్ వివరములు కూడా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హీల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఎన్.జి.ఓ. డా. చుంచు రాజ్ కిరణ్,గైనకాలజిస్ట్ డా. నలుమాసు శ్రీదేవి,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,గైనకాలజిస్ట్లు పెడియాట్రిషన్లు,ఫిజీషియన్లు, డిపిఓ ప్రశాంతి,సిహెచ్ఓలు వెంకటేశ్వర్లు,దిశా సమన్వయకర్త రమేష్,సుమన్,సీనియర్ అసిస్టెంట్ హారిక,డిపిహెచ్ఎన్ పద్మ, వసుమతి మార్తా,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేటలో కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు

కోడ్ ఉల్లంఘిస్తే..
చర్యలు తప్పవు.
డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ.

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ను ఉల్లంఘిస్తే..చర్యలు తప్పవని డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ అన్నారు. నిజాంపేట లో ఎఫ్ఎస్టి బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా 50 వేలకు మించి డబ్బులను రవాణా చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అబాండాల మధ్య నిజాలు చెప్పిన సర్పంచ్ అభ్యర్థి

ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తిని అభివృద్ధి చేయాలని మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తూ మీ ముందుకు వచ్చి శిరస్సు వంచి నమస్కరిస్తున్న. నేను పుట్టింది పెరిగింది తంగళ్ళపల్లి గ్రామం చిన్నతనంలో పాఠశాలలో చదువుతూ మీలో మీ అందరితో ఉంటూఅనంతరం కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించాను. మొదట్లో బీద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని నా కుటుంబ వారసత్వంగా వచ్చిన కులవృత్తితో జీవనం సాగించాను అనంతరం నాలుగు రూపాయలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాలు పెట్టాను ఆ దేవుడి దయతో నాకు అనుకూలంగా తోటి స్నేహితులతో నేను చేస్తున్న వ్యాపారంలో కొన్ని లాభాలు అర్ధించాను అలా విర్రవీయకుండా కన్నతల్లిని ఉన్న ఊరికి సేవ చేయాలని ఉద్దేశంతో గ్రామంలో సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో గ్రామంలో వార్డు మెంబర్ గా గెలిచి రెండు పర్యాయాలు గ్రామ ఉపసర్పంచ్గా మీ అందరి ఆదర అభిమానం ఆశీస్సుల సహకారంతో గెలుపొంది గ్రామ ప్రజలకు నా వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని. నా అనేవారు నాతో ఉండి లేనిపోని అబండాలు వేస్తూ గెలుస్తానని ఎన్నో అడ్డంకులు వేస్తున్నారుఅలాగే ప్రతి గుడి బడి ప్రతి పేదల సామాన్యుల కష్టం వచ్చిన నష్టం వచ్చిన శుభకార్యాలలో కష్టకాలంలో పాల్పంచుకోవడం తో పాటు ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడం ప్రతి యూత్ సంఘానికి. నా వంతుగా తోడ్పాటు అందించడంతోపాటు గ్రామ ప్రజలకు ఏ ఆపద వచ్చిన సేవకుడిగా ముందుండి ప్రజాసేవ చేయడం చేశానని ముఖ్య విషయం ఏమిటంటే నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్న సందర్భంగా కొందరు వ్యక్తులు నాపై ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత వ్యాపారాలపై.లేనిపోని అబాండాలువేస్తూ అసత్య ఆరోపణ చేస్తున్నారని. వీరంతా నేను చేసే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం జరిగిందని ప్రతి ఒక్కరికి తిరిగి వారి డబ్బులు అన్నా పైసా తో సహా.మిత్తితో ఇవ్వడం జరిగిందని ఎవరిని ముంచిన పాపాన పోలేదని ఇట్టి విషయం గ్రామంలోని పెద్దలందరికీ. ప్రజలందరికీ.తెలుసునని సరైన సందర్భంలో ఎవరు అనేది పేర్లతో సహా మీకు వివరిస్తానని.తెలియజేస్తూ అలాగే నేను మీ అందరి ఆశీర్వాదంతో సర్పంచ్ గా బరిలో ఉన్నానని గెలిచిన ఓడిన మీ అందరికీ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానని నా గెలుపునకు కొంతమంది ప్రజాక్షేత్రంలో.పోరాడలేని l వారు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని. అలాగే సిరిసిల్ల పట్టణంలో కుల సంఘాల గ్రూపులలో మన గ్రామానికి చెందిన వాట్సప్ గ్రూపులలో అనవసరమైనకథను సృష్టించి రాస్తున్నారని వారిపై త్వరలో చట్టపరమైన చర్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయ విచారణ జరిపే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని నా గురించి ఆరోపణ చేస్తూ నా మీద లేనిపోని విషయాలు చెప్తున్నారు అని ప్రజలునిజా నిజాలు తెలుసుకొనివారికథ కూడా బయట పెడతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి ప్రచార కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం…

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం.

చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్
గుర్రం తిరుపతి.

చిట్యాల, నేటిదాత్రి :

 

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సూచన మేరకు
చిట్యాల మండలంలోని చల్లగరిగా ప్రభుత్వ పాఠశాలలో డీసీపీయూ,చైల్డ్ హెల్ప్ లైన్, డి హెచ్ ఈ డబ్ల్యూ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగాల సమన్వయంతో అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగిందని తిరుపతి తెలిపారు.అలాగే బాల్యవివాహాల నిషేధ చట్టం 2006 గూర్చి ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని, బాల్యవివాహాలు ఎవరైనా జరిపినట్లైతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలుపుతూ ప్రభుత్వం కల్పించిన టోల్ ఫ్రీ నెంబర్లు 1098,181,1930 పైన అవగాహన కల్పించడం జరిగింది.నేటి బాలలే రేపటి పౌరులుగా నవ సమాజ నిర్మాణానికి నాంది కావాలని బాల్యంలో చదువుకోవాల్సిన విద్యార్థులు పనులకు గాని పెళ్లిళ్లకు గాని ఆసక్తి చూపకూడదని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డి సి పి యు సోషల్ కుమార్, డి హెచ్ ఈ డబ్ల్యూ మమత,తెలంగాణ సాంస్కృతిక సారథి ఎర్రన్న బృందం మరియు సహాయఎన్జీవో,ప్రభులత, కోమల,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఝాన్సీ, శ్రీనివాస్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.

భూపాలపల్లి బాల్యవివాహాల అవగాహన కార్యక్రమం

బాల్యవివాహాల నిర్మూలనకై అవగాహన

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి సూచనల మేరకు భూపాలపల్లి మండలం ఆజాంనగర్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్ రాజేశ్వరి అధ్యక్షతన బాల్యవివాహాల పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజేశ్వరి మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, బాల్యంలో చదువుకోవాల్సిన పిల్లలకి పెళ్లిళ్లు చేస్తే బాల్యవివాహాల నిషేధ చట్ట ప్రకారం వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలపడం జరిగింది అలాగే నేటి బాలలే రేపటి పౌరులుగా, నవ సమాజ నిర్మాణానికి నాంది కావాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి, జెండర్ స్పెషలిస్ట్ అనూష, సఖి కౌన్సిలర్ మాధవి, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ప్రసాద్ అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు అని రాజేశ్వరి తెలిపారు

బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల పిఈటీ అసభ్యకర ప్రవర్తన..

బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల పిఈటీ అసభ్యకర ప్రవర్తన

మోహన్ నాయక్ కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూల్ ముందు నిరసన.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బిట్స్ స్కూల్ లోనే విద్యార్థి నీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మెసేజ్లు పంపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ ముందు నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా టౌన్ అధ్యక్ష కార్యదర్శులు నందకిషోర్ వికాస్ మాట్లాడుతూ. జిల్లా బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తక్షణమే వారిని విధుల్లో నుంచి తొలగించాలని దాంతోపాటు విద్యార్థినిలను మెసేజ్లు పెట్టి ఇబ్బందికి గురి చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ గా డిమాండ్ చేస్తున్నాము.తాము చదువు చెప్పే విద్యార్థినీల పట్ల విద్యార్థులను టార్గెట్ చేసుకొని వారిని సోషల్ మీడియాలో ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టి ఇబ్బంది గురి చేసిన వారిని తక్షణమే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోవాలని వారు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటన మరొకసారి జరగకుండా చూడాలని కోరారు..

పత్రిక కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నాం…

పత్రిక కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నాం

బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

ఎర్రం సతీష్ కుమార్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

నమస్తే తెలంగాణ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడి సరికాదని,బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ,దాడి
యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టిడబ్ల్యూ జెఎఫ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగోస్థంభంగా ఉన్న మీడియాపై బెదిరింపులకు దిగటం మంచిపద్దతి కాదని,సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్ఛ పత్రికలకు ఉంటుందని, పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే, వాటికి ఖండనలు ఇవ్వటం, వివరణలు ఇవ్వటం చేయాలి కానీ బెదిరింపులకు పాల్పడటం, భౌతిక దాడులకు దిగటానికి ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. భావప్రకటనా స్వేఛ్ఛ పై దాడి సరికాదని, తక్షణమే పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు, దాడికి ఉసిగొల్పిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మీడియాపై దాడులు హేమమైన చర్య…

మీడియాపై దాడులు హేమమైన చర్య

ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్యాలయంపై కొంతమంది దుండగులు బుధవారం దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి వారు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి అని అన్నారు. అన్యాయాలను నిష్పక్షపాతంగా సమాజానికి అందించే నాలుగవ స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలు దారుణం అని విమర్శించారు.ప్రశ్నించే గొంతులను అణిచివేతకు గురిచేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రభుత్వం,పోలీసు అధికారులు పత్రికా కార్యాలయంపై దాడికి కారకులను చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ లు చిట్ల రమేష్, ఉమేష్,రాజు పటేల్,రమేష్ రెడ్డి,రాజు,నరేష్ స్వెన్, రాయలింగు,వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్,పడాల సంతోష్,పార్వతి సురేష్, పార్వతి రాజేష్,సిద్దార్థ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు సిజిఐ గావాయ్ పైన దాడికి నిరసన…

సుప్రీం కోర్టు సిజిఐ గావాయ్ పైన దాడికి నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గత వారం రోజుల క్రితం ఈ దేశ ఉన్నత సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సుప్రీం కోర్టు జే ల్ యు డి ఈ సిజిఐ గావాయ్ పైన జరిగిన దాడికి నిరసనగా కోహిర్ మండలం ఎన్ ఆర్ పి ఎస్ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కోహిర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఇలాంటి చర్యకు పాల్పడిన న్యాయవాదిని శిక్షించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

కాపాడుకుందాం భారత రాజ్యాంగం

గౌరవిద్దాం ఈ దేశ ఉన్నతమైన న్యాయస్థానాన్ని

చట్టం ఎవరికి చుట్టం కాదు! అందరూ సమానులే!

నల్లజెండాలతో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T144137.950.wav?_=1

 

*నల్లజెండాలతో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన **
*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడిని ఖండిస్తున్నాం

*ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ

*మహాదేవపూర్ అక్టోబర్ 17 నేటి ధాత్రి **

 

మహదేవపూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టుపై ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయి పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని దాడి వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని తక్షణమే అరెస్టు చేసి చట్టబద్ధంగా శిక్షించాలని అదే కాకుండా ప్రధానంగా దళితులపై దాడులను ఖండిస్తున్నామని ఇలాంటి దాడులు సమాజంలో తప్పుడు సంకేతాలకు దారితీస్తాయని ఇప్పటికైనా అధికారులు దళితులపై దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ అన్నారు ఈ కార్యక్రమంలో వి ఎస్ పి ఎస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కోయ్యల భాస్కర్ . టౌన్ ప్రెసిడెంట్ చింతకుంట్ల సదానందం .టౌన్ ఉపాధ్యక్షులు కొలుగురి శ్రీకాంత్ .టౌన్ ప్రధాన కార్యదర్శి లింగాల సుశాంత్. బ్రాహ్మణపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాల్వ రాజ సమ్మయ్య .పలుగుల గ్రామ శాఖ అధ్యక్షులు లేతకరి శంకర్ .ఉపాధ్యక్షులు మంద సురేష్ .ఎమ్మార్పీఎస్ నాయకులు చింతకుంట రాము .బెల్లంపల్లి జాషువా. సీనియర్ నాయకులు వేమునూరు జక్కయ్య తదితరులు పాల్గొన్నారు

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

#మరొకరి పరిస్థితి విషమం.

#సొంత అన్న వదినపై దాడికి పాల్పడిన మరిది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదివేల అప్పు కోసం అన్న వదినలపై మరిది దాడికి పాల్పడి వదిన ప్రాణాలు కోల్పోగా అన్న ప్రాణాలతో కొట్టు మి ట్టాడుతున్న సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మేరగుర్తి మల్లయ్య-సమ్మక్క దంపతులకు రమేష్, సురేష్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కొడుకు రమేష్ కు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు తర్వాత 8 సంవత్సరాల క్రితం రమేష్ భార్య చనిపోగా. మరల గీసుకొండ మండలం మచ్చ పురం గ్రామానికి చెందిన స్వరూప (35) తో గ్రామంలోనే సహజీవనం చేస్తున్నాడు. స్వరూప భర్త చనిపోయాడని ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి గత పది ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం కొండాపురం గ్రామానికి వలస వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో రమేష్ తల్లిదండ్రులు, తమ్ముడు సురేష్ ఆ గ్రామంలోని ఉంటూ బ్రెడ్డు అమ్ముకుంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల కిందట అన్న రమేష్ కు సురేష్ 10 వేలు అప్పుగా ఇచ్చాడు.

అప్పు తీర్చమని అడిగితే ఇవ్వడం లేదంటూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ సైతం ఇటీవల నిర్వహించినట్లు తెలుస్తుంది. తన బంధువులు చనిపోవడంతో రమేష్ అతని భార్య చావుకు వెళ్లి బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. స్నానం చేసే క్రమంలో వేడి నీళ్లు ఎందుకు పెట్టలేదని తల్లితో రమేష్ గొడవ పెట్టుకోగా ఈ క్రమంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన అన్నను తన డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఈ నేపథ్యంలో కత్తితో అన్నపై దాడి చేయగా గాయాలు కాగా పక్కనే ఉన్న స్వరూప ఆపడానికి ప్రయత్నించగా సురేష్ ఆమె పైన కూడా దాడి చేసి పొత్తికడుపు చాతి భాగంలో కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. హుటాహుటిన స్థానికుల సహాయంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి గాయాల పాలన ఇద్దరిని తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన రమేష్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు స్వరూప కొడుకు శివ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.

శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి…

శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి

బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి జిల్లా శ్రీనివాసపురం దగ్గర తూము నిర్మాణం చేపట్టడము వల్ల అక్కడ మున్సిపల్ అనుమతులు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తూము నిర్మాణం చేపట్టడం వల్ల నివాసంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్ విలేకరుల సమావేశంలో తెలిపారు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని మున్నూర్ రవీందర్ చెప్పారు

రాజా సింగ్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాల ఆవేదన…

మెట్ పల్లి అక్టోబర్ 10 నేటి ధాత్రి

 

దసరా పండుగ సందర్భంగా గోషా మహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్త ముస్లిం ల పట్ల అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. ఆయన వాక్యాలు యావత్ ముస్లిం ప్రజలకు బాద కలిగించే విధంగా ఉన్నాయి. అంతే కాకుండా మత విద్వేషాలను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయి. ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
కావున మాయందు దయతలచి మహమ్మద్ ప్రవక్త ముస్లిం ల పట్ల అనుచిత వాక్యాలు చేసిన గోషా మహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ పై తగు చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని తమరిని సవినయంగా ప్రార్థిస్తున్నాము.
మెటుపల్లి పట్టణ ముస్లిం ప్రజలు.

చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి – కఠిన చర్యలు కోరిన గుడికందుల రమేశ్

సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

మందమర్రి నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

భారత అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్… జస్టిస్ గవాయి పై జరిగిన దాడి.. యావత్ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లు అని సామాజిక ఉద్యమ నాయకుడు గుడికందుల రమేశ్ అన్నారు. బుధవారం మందమర్రిలో మాట్లాడుతూ…..సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దాడికి యత్నించిన వ్యక్తి వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ రాకేష్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై తనను అడ్డుకున్నారు.భారత దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఘటనను పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఖండించాలని కోరుతూ, మన దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ
నీచమైన ఘటనను ఖండించడానికి మాటలు సరి పోవని అన్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజని ఇలాంటి పిరికిపంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైన భారత ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్ కు ప్రజాస్వామ్యవాదుల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.

ఝరాసంగంలో ప్రైవేట్ క్లినిక్ సీజ్….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T121902.579.wav?_=2

 

ఝరాసంగంలో ప్రైవేట్ క్లినిక్ సీజ్….!

◆:- నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

◆:- జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే
ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, గ్రామాలలో చికిత్స అంది స్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటా మని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల హెచ్చరిం చారు. ఝరాసంగం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ల్యాబ్, దస్త్రాలు, పరిసరాలను పరిశీలించారు. సమయపాలన, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఝరాసంగం లోని ఓ ప్రైవేట్ క్లినిక్ ను ఆక స్మికంగా తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా రోగు
లకు చికిత్సలు అందించడం పట్ల ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసి క్లినిక్ ను సీజ్ చేశారు. గ్రామాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీలు, నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ

హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ

సినీ నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని..

 సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు.. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.

అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.

 అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్

 

అమిత్‌షాపై మహువా మొయిత్రా వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాయపూర్: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

స్థానికుడు ఒకరు చేసిన ఫిర్యాదుపై మనా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196, సెక్షన్ 197 కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనికి ముందు పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. మహువా అసహ్యకరమైన, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఇదే టీఎంసీ వైఖరా అని ప్రశ్నించింది. అయితే మహువా వ్యాఖ్యలపై టీఎంసీ అధికారికంగా స్పందించలేదు.నదియా జిల్లాలో గత గరువారంనాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహువా మొయిత్రా పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రత విషయంలో తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షాపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మన సరిహద్దులను కాపాడటానికి ఎవరూ లేకపోతే, వేరే దేశం నుంచి ప్రతి రోజూ ప్రజలు ప్రవేశిస్తుంటే, చొరబాటుదారులు మన తల్లులు, సోదరీమణులపై కన్నేయడంతోపాటు మన భూములను లాక్కుంటున్నారని మన దేశ పౌరులు ఫిర్యాదు చేస్తుంటే.. మొదట మీరు అమిత్‌షా తల నరికి బల్లపై పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు.

 

నా పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-34-4.wav?_=3

నా పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన పంచిక మహేష్ యాదవ్ ఒక యాదవ కుటుంబానికి చెందిన బిసిబిడ్డనని కావాల్సి కొని కల్వపల్లి గ్రామంలో ఉన్నటువంటి పులి అంజిరెడ్డి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బీసీ బిడ్డ ఈ గ్రామంలో ఎదగడం ఏమిటని అక్కసు తోనే గత మూడు సంవత్సరాలుగా నా పైన నా కుటుంబం పైన నన్ను మానసికంగా వేధిస్తూ ఇక్కడ అవకాశం దొరికిన కావల్సుకొని నాపైన దాడులకు ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగానే గత రెండు సంవత్సరాల క్రితం నా కు సంబంధించిన భూమిలో నాకు సమాచారం లేకుండా ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయడం రోడ్డు వేయడం ఇదేమిటని ప్రశ్నిస్తే నాపైన తన అనుచరులతో దాడి చేయించడం నాకు సమాచారం తెలియకుండా నా భూమి ముందు కావాలనే కక్షపూరితంగా గుడి నిర్మాణం పేరుతో నా భూమి ముందు రోడ్డు కబ్జా చేసి నన్ను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి పులి అంజిరెడ్డి నాకు ఎటువంటి సమాచారం తెలియకుండా నా భూమి ముందు గుడి ఎందుకు కడుతున్నారో మాట్లాదానికి వెళ్తే నా కుటుంబం మరియు పిల్లల పైన మహిళలను చూడకుండా పులి అంజిరెడ్డి తన అనుచరులతో నాపై పిడు గుద్దులు గుద్దుతూదాడి చేసి చంపుతామని భయభ్రాంతులకు గురిచే స్తూ ఉండగా నేను నా కుటుంబం భయంతో పారిపోయి రావడం జరిగింది నా కారు అద్దాలు పగలగొట్టి నన్ను భయ బ్రాంతులకు గురి చేసినటువంటి పులి అంజిరెడ్డి పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుచున్నాను. అని అన్నారు అలాగే ఈ దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు అతని వెంట బిజెపి కార్యకర్తలు ఉన్నారు

జహీరాబాద్‌లో BRS నాయకుల ఆగడాలకు చట్టపరమైన చర్యలు కోరారు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T131641.925.wav?_=4

 

చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని వీధి రౌడీ లా ప్రవర్తించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ లో సెట్విన్ కార్యాలయంలో ప్రభుత్వపరమైన కార్యక్రమం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తమకు విలువనివ్వడం లేదని కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న ఫ్లెక్సీ ని చింపి వేసినారు వాస్తవానికి వారికి ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వారి పరువుకు భంగం కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రశాంత వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని కావాలని రాజకీయ పార్టీ గొడవలను సృష్టించాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముసుగులో ఉన్న గుండాలు వీరు చేసిన ఆగడాల వీడియో క్లిప్పులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగినది వెంటనే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గేల్లి రాములు యాదవ్ జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజామియా జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మొహమ్మద్ జాంగిర్ రాజశేఖర్ మోతి రామ్ రాథోడ్ పి.రాములు నేత మహమ్మద్ యూనుస్ జహీరాబాద్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ మోయుజోద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇనాయత్ అల్లి మహమ్మద్ అక్బర్ మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ గౌస్ కాశీనాథ్ సురేష్ స్వామి నసురుల్లా ఖాన్ మొహమ్మద్ జమీల్ కురేషి మహమ్మద్ ఖదీర్ ఖురేషిఇస్మాయిల్ నైస్ టైలర్ సీనియర్ నాయకులు పద్మారావు మొహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ మొహమ్మద్ మసీదున్ పేర్ల నాగేష్ గార్లు వినతి పత్రం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు.

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు…

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు

సిఐ రంజిత్ రావు, ఎస్సై పరమేష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఐ రంజిత్ రావు ఎస్సై పరమేష్ ప్రతిజ్ఞ చేయించారు. మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక మానసిక సామాజిక దుష్పప్రహాలను వివరించారు అలవాటు పడితే వ్యక్తి ఆరోగ్యం భవిష్యత్తు కుటుంబం సమాజం నాశనం అవుతుందని హెచ్చరించారు కూడలి వద్ద ప్రజలతోని డ్రక్స్ రహిత జీవనశైలి పాటించడం చుట్టుపక్కల వారు మాదక ద్రవ్యాలకు బారిన పడకుండా చూడడం వాటి విక్రయం కొనుగోలు అక్రమ రవాణా వంటి కార్యక్రమాలపై అధికా రులకు సమాచారం అందిం చడం డ్రగ్స్ లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా మత్తుపదార్థా లకు బానిసలుగా మారితే చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బం ది, యువతీ యువకులు ప్రజ లు అధిక మొత్తంలో పాల్గొ న్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version