ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శప్రాయం…

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శప్రాయం
ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

నేటి ధాత్రి, పఠాన్ చెరువు :

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి
ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతినిపురస్కరించుకొని.. పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామాలలో శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. భవిష్యత్ తరాలకు శివాజీ ఆదర్శాలను అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలు, పట్టణాల పరిధిలో సొంత నిధులతో విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, రాజి రెడ్డి, శివాజీ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు.

హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి మున్సిపాలిటీలో హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించిన 396వ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవoగురువారం ఘనంగా జరిపారుఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పిoచారు.శివాజీ మహారాజ్ దేశభక్తి, మాట్లాడుతూ, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు, స్వరాజ్య స్థాపనకు పునాది వేసిన గొప్ప యోధుడు శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. చిన్న వయసులోనే స్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
మహిళలకు అత్యున్నత గౌరవం ఇచ్చిన పరిపాలకుడిగా, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడిగా, ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానుభావుడిగా శివాజీ మహారాజ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. గెరిల్లా యుద్ధ తంత్రానికి ఆద్యుడిగా, భారత నౌకాదళ పితామహుడిగా ఆయన సేవలను గుర్తుచేశారు.సనాతన ధర్మ పరిరక్షణ కోసం కోటలను నిర్మించి శక్తి సాధనకు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన సందర్భాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భవానీ అమ్మవారి ఆశీర్వాదంతో ధర్మ స్థాపనకు కట్టుబడి పనిచేసిన మహానాయకుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు.యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయంతిని విజయవంతం చేశారు. ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. వారి ఆశయాలు, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాల ద్వారా మహనీయుల జయంతులను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

వనపర్తిలో మహాత్మా గాంధీకి వర్తకులు, ఆర్యవైశ్యులు నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వర్తకులు ఆర్యవైశ్యులు

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వర్తకులు దోమ శివ బొడ్డు శంకర్ సంబు రవి వై వెంకటేష్ హెచ్ఎంటి రవి ప్రసాద్ ఆర్యవైశ్యులు ఏపూరి శ్రీనివాసులు కొట్ర రామకృష్ణ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ కందికొండ సాయిరాం మారం గోవిందు గుప్త ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్ బచ్చు సౌజన్య వాసవి క్లబ్ అధ్యక్షులు ఆకుతోట రాఘవేంద్ర రాజ్ మెడికల్ షాపు శంకర్ కూన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

నివాళులు అర్పించిన నాగుర్ల..

నివాళులు అర్పించిన నాగుర్ల

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని నర్సక్కపల్లి గ్రామానికి చెందిన నాగూర్ల బాపూరావు ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు నర్సక్కపల్లి గ్రామానికి చేరుకుని, స్వర్గీయ నాగూర్ల బాపూరావు పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాగూర్ల బాపూరావు మృతి కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు.వారి కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,బీఆర్‌ఎస్ నాయకులు,రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ ఓదెల శ్రీలత భాస్కర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-27T114750.519.wav?_=1

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ ఓదెల శ్రీలత భాస్కర్

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన టాంపు కట్టయ్య అనారోగ్యం కారణంగా మరణించడంతో వారి పార్థివదేహానికి స్థానిక సర్పంచ్ ఓదెల శ్రీలత భాస్కర్ పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారితోపాటు ఉప సర్పంచ్ ముక్కెర రాజు,మాజీ ఎంపీటీసీ సతీష్,రఫీ, శరత్,బిఆర్ఎస్ పార్టీ గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పండుగ సాయన్న వర్ధంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-10T125120.736.wav?_=2

 

పండుగ సాయన్న వర్ధంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ముదిరాజ్ సంఘం తాలూకా భవనంలో బుధవారం నాడు ప్రజా వీరుడు పండుగ సాయన్న వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, నాయకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపాల్ సార్, టౌన్ అధ్యక్షులు రమేష్, ప్రవీణ్, హరీష్, శంకర్, లింగమయ్య, మహేష్, విజయ్, అర్జున్, శ్రీనివాస్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయన్నకు అంజలి ఘటించారు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి….

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T153416.939.wav?_=3

 

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ .ఆయన దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ. ఆయన రాసిన.రాజ్యాంగంతో భారతదేశంలో ఎన్నో కుటుంబాలు రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాలు పొందుతూ అలాగే ప్రతి పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్దేశంతో ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాజ్యాంగం రచించి భారతదేశంలోని వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రపంచంలోనే మేధావిగా పేరు తెచ్చుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టలను దేశ దేశాన్ని తీసుకెళ్లి భారత పేరు తను రచించిన రాజ్యాంగం ద్వారా పేరు ప్రత్యేకతలు తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా.నివాళులర్పిస్తూ జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి. అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

పార్థివ దేహానికి పూలమాల అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T154052.585.wav?_=4

 

పార్థివ దేహానికి పూలమాల అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

చెనిగల రాములు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన… కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం & ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్ ఈ రోజు వర్ధన్నపేటమండలం లో, కట్రియా ల గ్రామానికి చెందిన చెనిగల కుమారస్వామి,చెనిగల రాజు గార్ల తండ్రి చెనిగల రాములు వృద్ధాప్యం పై బడి తేదీ 20-11-2025 రాత్రి 9-00 గంటల సమయంలో మరణించినందున నేడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,గుజ్జ రవీందర్ రెడ్డి, కట్రీ యాల టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య గారులు రాములు గారి నివాసం వద్ద,రాములు గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించి కుమారస్వామి,రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి ససంతాపం తెలుపడం జరిగింది.

తంగళ్ళపల్లిలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూల నివాళులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా అమూల్యమైన సేవలు అందించిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నివాళులర్పిస్తూ జయంతి వేడుకలనుఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి దేశంలోని ప్రతి గ్రామంలో పేదలందరికీ గృహ నిర్మాణాలు చేపట్టి ప్రతి ఒక్కరు నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో దేశంలో అందరి ప్రజలకు అనుకూలంగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి. సంస్కరణల విప్లాత్మకమై న.సమసమాజ. స్థాపనను అమలు చేశారని.భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో భారత దేశపు పేరు ప్రఖ్యాతలు నిలబెట్టారని. ఆమె భారత. ఉక్కు ప్రధానిగా దేశంలోని. ప్రజలకు ఇతర నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కొని ఆడారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. తంగళ్ళపల్లిమాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి. మునిగలరాజు. మచ్చ శ్రీనివాస్. సామల గణేష్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్.రా పెళ్లి ఆనందం. మోర లక్ష్మీరాజo. మైనార్టీ నాయకులు

ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T182020.003.wav?_=5

 

ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

*పిజిఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మకు
సీఎం ఘన నివాళులు*

పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బుధవారం పరామర్శించారు. దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పిజిఆర్ గార్డెన్ లో బుధవారం మాతృయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,

ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, ప్రజా ప్రతినిధులు ఇతర ప్రముఖులు హాజరు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తదితరులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు. దొంతి మాధవ రెడ్డి ని పరమార్శించేందుకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్.

నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి రోడ్డు మార్గం లో పీజీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి దొంతి కాంతమ్మ మాతృయజ్ఞం కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు దొంతి కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ట్స్ కళాశాల మైదానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు చేరుకున్నారు.

తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం

వరంగల్ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి బయలుదేరారు. హెలిపాడ్ వద్ద మంత్రులు అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్. నాగరాజు,యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, ఎన్పీడీసీఎల్ వరుణ్ రెడ్డి, తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు

 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మరణించిన నేపద్యంలో బుధవారం హన్మకొండ లోని పిజీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొననుటకు గాను హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.

కామ్రేడ్ గుండా మల్లేష్ సేవలు మరువలేనివి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T143939.013.wav?_=6

 

కామ్రేడ్ గుండా మల్లేష్ సేవలు మరువలేనివి..

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సీపీఐ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మల్లేష్‌ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. సోమవారం గుండా మల్లేష్‌ ఐదవ వర్ధంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సీపీఐ నాయకుల తో కలిసి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. గుండా మల్లేష్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిం చాలంటే ప్రతీ కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పరితపించేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

ఈదుల పల్లి లో ఘనంగా పాస్టర్ డే సెలబ్రేషన్ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T112537.492.wav?_=7

 

ఈదుల పల్లి లో ఘనంగా పాస్టర్ డే సెలబ్రేషన్ వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం ఈదుల పల్లి గ్రామం చర్చి లో గ్రామ సంఘాస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పాస్టర్ డే సెలబ్రేషన్ వేడుకలు ఈ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పాస్టర్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో అందరికీ పాస్టర్స్ డే శుభాకాంక్షలు స్థానిక సంఘ కాపరి వారి కుటుంబ సభ్యులకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సంఘస్తులు చిన్నపిల్లలు పాల్గొన్నారు.

ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి

ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి

జిల్లా ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని అన్నారు ఆయన చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి.నీతి మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షి కి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఅర్భి డిఎస్పీ, ఉమామహేశ్వరావు, కార్యాలయం ఏవో, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ,నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్ ,జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .   

 

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం తెలంగాణలోని  ప్రతి పౌరుడు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ  జయంతి వేడుకలను జిల్లా బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపి శంకర్ నాయక్ రాజేంద్రప్రసాద్, బీసి. సంక్షేమ శాఖాధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు పద్మశాలి సంఘం నాయకులు.సామాజికవేత్త రాజారాం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం…

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల (నేటి ధాత్రి):

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ,పోలీస్ అధికారులు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని, బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు.దేశ స్వాతంత్ర్యోద్యమం,తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి తన జీవితాన్నే అంకితం చేశారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఏ. ఓ పద్మ, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు…

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు

– నివాళులర్పించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, మహేష్, గోనె ఎల్లప్ప, గోలి వెంకటరమణ
తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-27T143317.126.wav?_=8

 

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

అధిక సంఖ్యలో పాల్గొన్న పద్మశాలి కులస్తులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుక లను పద్మశాలి కులస్తులతో పాటు, బీసీ కులస్తులు పాల్గొని నివాళులర్పించారు. అనంత రం గ్రామ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బేసి కులాల హక్కుల సాధనకోసం పోరా డిన మహనీయుడని, తెలంగా ణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను గుర్తించి ఆయన జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతరత్న బిరుదును కూడా ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభు త్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మండల శాఖ అధ్యక్షులు వంగరి సాంబయ్య, పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, పద్మశాలి జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ బాసని బాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు బాసని ప్రకాష్, నాయకులు రంగు మహేందర్, చిందం రవి,బాసని మార్కండేయ, శాంతా రవి, వలపదాసు చంద్రమౌళి,మామి డి మారుతి, బాసని సాయి కృష్ణ, తుమ్మ ప్రభాకర్, బాసని చంద్రమౌళి, శ్రీనివాస్, పరిమ ళ్ళ నోములేష్, చిందం సాయి బాసని అఖిల్, చల్లా శ్రీనివాస్, బత్తుల శ్రీధర్,బీసీ నాయకులు వినుకొండశంకరాచారి, తదిత రులు పాల్గొన్నారు.

తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక చాకలి ఐలమ్మ…

తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక చాకలి ఐలమ్మ

ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధీరత్వానికి తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయం అని వెల్లడించారు. పెత్తందార్ల దురాగతలను ఆనాటి నిరంకుశ రజాకర్లను కు వ్యతిరేకంగా మొక్క పోయిన ధైర్యంగా ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ చిందం రవి మార్కండేయ దుబాసి కృష్ణమూర్తి,,వలి హైదర్ కట్టయ్య,రాజు, చిరంజీవి, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు, చాకలి కులస్తులు అధిక మొత్తంలో పాల్గొన్నారు

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక…

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ, అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెత్తందార్ల దురాగతాలను,ఆనాటి నిరంకుశ రజాకార్లకు,దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు.మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏ ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ లు భీమేష్,ఆర్ఐ లు దామోదర్,శ్రీనివాస్, వామన మూర్తి,సీపీఓ సిబ్బంది,వివిధ వింగ్స్ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

9 లీటర్ల నాటుసారా పట్టివేత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-26T142641.811.wav?_=9

 

9 లీటర్ల నాటుసారా పట్టివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: బైక్పై నాటుసారా తరలిస్తున్న కర్ణాటకలోని కలబుర్గి జిల్లా చించోళి తాలూకా శ్రీనగర్ తండాకు చెందిన పాండును అరెస్టు చేసినట్లు జహీరాబాద్ ఆబ్కారీ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి తొమ్మిది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నాటుసారా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version