మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T134704.498.wav?_=1

 

మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు

*తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు తెలంగాణ బంద్..

*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం…

*తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేశాము..

*బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది…

*రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది..

*రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు…

*బీసీ బంద్ తో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాడం కోసమే బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాం..

*బీసీ బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి…

_వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్దన్నపేట( నేటిధాత్రి):

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో బిల్ ఆమోదించి గవర్నర్‌కి పంపినా,అది ఇంకా ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్న సందర్భంగా నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నేడు వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించిన “బీసీ బంద్” కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తోలుత స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బీసీలకు మద్దతుగా షాపులను బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం బీసీ నాయకులతో మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులతో మానవహారం చేపట్టి రోడ్డు పై బైఠాయించి మేమెంతో మాకు అంతా అంటూ నినాదాలు బీసీలకు మద్దతు గా నిలిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తున్నారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాము అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్, మహిళ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల, బీసీ సంఘం,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో
పోషణ మాసం సందర్భంగా నర్సంపేట -3 అంగన్వాడి కేంద్రంలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు సిడిపిఓ మధురిమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పౌరులు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ద్వారా ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రతి తల్లి తన బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చడంతోపాటు, సామాజిక చైతన్యం కూడా అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట సెక్టార్ సూపర్ వైజర్ రమ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి,స్థానిక అంగన్వాడీ టీచర్ శిరీష,అనిల్ కుమార్, సారయ్య, రాజేష్, శివ, సరోజన, నవ్య, శివాణి, శ్రావణి, రవళి, సుష్మ, ఫర్జానా, రజిని, వనిత,అంగన్వాడీ టీచర్స్ రమ, పద్మ,వాణి, సరస్వతి ఆయా చంద్రకళ,గర్భిణీ, బాలింత స్త్రీలు, తల్లులు, కిషోరబాలికలు పాల్గొన్నారు.

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి

పరకాల,నేటిధాత్రి

పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి అన్నారు.ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులను పూజిస్తూ జరుపుకుంటారని ఆమె తెలిపారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లని ఇక్కడ జరుపుకునే బతుకమ్మ పండుగ చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు.ఈ సందర్భంగా పరకాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని,ప్రతి ఒక్కరూ ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

చెరువులు, కుంటలు నిండాయి…..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T142146.202.wav?_=2

 

చెరువులు, కుంటలు నిండాయి..
• ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
• ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల మారాయని బతుకమ్మ, దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై రాజేష్ సూచించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు చెరువులు కుంటలు అధికంగా నిండడంతో రాబోయే బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సమయంలో మహిళలు, చిన్నపిల్లలు చెరువుల వద్దకు గుమి గూడి వెళ్ళవద్దన్నారు. చిన్నపిల్లలు చెరువుల వద్ద ఇష్టానుసారంగా తిరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘ పెట్టాలన్నారు. ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకోవడమే కాకుండా.. సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

అంగన్వాడి లో పోషణ మాస ఉత్సవాలు…

అంగన్వాడి లో పోషణ మాస ఉత్సవాలు .

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడల్ పేట, కొత్తపేట గ్రామాలలో పోషణ మాస ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. 11 సంవత్సరాల నుండి కిశోర బాలికలందరు , మహిళలు,సమతుల ఆహారం, వ్యక్తిగత శుభ్రత, పాటిస్తూ బయట వారి మాటలకు, ప్రలోభాలకు, గురి కాకుండా ఉండాలని చెప్పి బరువులు, ఎత్తు లు చూసి, ఐరన్ మాత్రలు ఇచ్చి ప్రతిజ్ఞ చేయించనైనది. అంగన్వాడి టీచర్స్ కూరగాయలతో, పూలతో అలంకరించిన బతుకమ్మలు మట్టితో తయారు చేసిన, బొమ్మల స్టాల్స్ అందరినీ ఆనందపరచాయి. ఈ ప్రోగ్రాంలో ఏఎన్ఎం లహరి, టీచర్స్ వసంత ,మమత ,సాధన ,రమసుజాత, ఉమ, ఆశ వర్కరు సాయి వేద కిశొర బాలికలు హాజరైనారు.

ఘనంగా మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు…

ఘనంగా మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నేటి ధాత్రి కథలాపూర్

 

 

కథలాపూర్ మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజున అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం రెండవ రోజున అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు
ఈరోజు అమ్మవారి సమక్షంలో అమ్మవారికి మంచి ఈరోజు అమ్మవారి సమక్షంలో అమ్మవారికి మంచి అమృత అభిషేకాలు నిర్వహించారు పంచ అమృత అభిషేకాలు నిర్వహించారు
అనంతరం అమ్మవారి అష్టోత్తర సహిత కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భవాని దీక్షపరులు గ్రామ మహిళలు యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు
అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు

ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సంబరాలు…

ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సంబరాలు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం 23 వ వర్డ్ లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి,గౌరీ దేవిని పూజించి సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ నృత్యాలతో అలరించారు.9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒక చోట కలసి పకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుందని అన్నారు.తెలంగాణ ప్రజలందరి జీవితాలు వెలుగులు నింపుతూ మరింత సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని గౌరీ దేవిని ప్రార్థించారు.

ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు…

ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

నస్పూర్ మండలం షిర్కే కాలనీలో ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.తంగడి పూలకు తోడుగా రకరకాల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి గౌరీ దేవిని పూజించి,నూతన వస్త్రాలు ధరించి అందరూ ఒకచోట కలసి ఆడుతూ పాడుతూ బతుకమ్మను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి,మన ఆస్తిత్వానికి నిలువుటద్దమని అన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ భూమి నీరు మానవ సంబంధాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే గొప్ప పండుగ అని తెలిపారు.మహాలయ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల జాతర తెలంగాణ సంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెపుతుందని అన్నారు.అలాగే మహిళలు, ఆడపడుచులు ఐక్యంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ వారి మధ్య అనుబంధాలను,ఐక్యతను, పెంపొందిస్తుందని,గౌరీ దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు పూజించారు.

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T140342.321.wav?_=3

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటి ధాత్రి

 

ఓదెల మండలం లోని ఓదెల, పోత్కపల్లి, మడక , కనగర్తి, గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్య పల్లి, కొలనూర్, గోపరపల్లి, హరిపురం, లంబాడి తండా, నాంసానిపల్లి, అబ్బిడిపల్లి, జీలకుంట, శానగొండ, రూపు నారాయణపేట, ఇందుర్తి, గుంపుల, గూడెం, బాయమ్మపల్లి, భీమరపల్లి, ఉప్పరపల్లి గ్రామాలతో పాటు ఇతర గ్రామాలలో తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదనీ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ అని మహిళలు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నేటి నుండి 9 రోజులు ఆడే బతుకమ్మ పండుగ ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు కోలాటం,ఆట పాటలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే ఆట పాటలతో పాడారు.

ప్రారంభమైన బతుకమ్మ..

ప్రారంభమైన బతుకమ్మ

అంబరాన్ని అంటిన సంబరాలు

నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

ఆదివారం (పితృ అమావాస్య )బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో వేద బ్రాహ్మణులకు తమ పితృదేవతల జ్ఞాపకార్థం బియ్యం తదితర వాస్తు సామాగ్రిని అప్పజెప్పి బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందిన పలు వర్గాల ప్రజలు, ఇదిలా ఉండగా మహిళలు తంగేడు పువ్వు, గునుగు పువ్వు, తిరోక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం గ్రామ లలో నీ చెరువుగట్టులు, దేవాలయ ప్రాంగణాలలో, బతుకమ్మ ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మెజారిటీ గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుడి, పదవులు ఆశిస్తున్న చోట నేతలు వారి శక్తి కొద్ది కొందరు డి జే లు, మరికొందరు కోలాటాలకు కోలలు , సమకూరు ఇస్తే, ఇంకొందరు మహిళలకు ఏక దుస్తులు అందించారు. దీంతో గ్రామాలలోని మహిళలు, చిన్నలు, పెద్దలు, అందరూ బతుకమ్మ సంబరాలను సంబరాన్ని అంటే మాదిరిగా నిర్వహించారు.

వికలాంగుల కు,చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి.

వికలాంగుల కు,చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి.

◆:- పెన్షన్ దారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

◆:- పెన్షన్ దారులతో ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించిన ఎం ఆర్ పి ఎస్ , వీ హెచ్ పి ఎస్ నాయకులు.

వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ రాయికోటి నర్సిములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం సెప్టెంబర్ 15 కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6000/- మరియు చేయుత పెన్షన్ దారులకు 4000/- వెంటనే పెన్షన్ పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ రాయికోటి నర్సిములు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నర్సిములు మాట్లాడడం జరిగింది.వికలాంగులకు మరియు వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,చేనేత కార్మికులకు,బీడీ,గీత కార్మికులకు మరియు కండరాల క్షీణత 15000/- పెన్షన్ పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు 4000 /-నుండి 6000,/-మరియు చేయూత పెన్షన్ దారులకు 2000/- నుండి 4000 /-ఇస్తానని ఎన్నికలో హామీ ఇచ్చి ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం లోకి వచ్చి 21 నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు వారికి పెన్షన్ పెంచలేదని విమర్శించారు.పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగ తహసీల్దార్ కార్యాలయం వికలాంగుల హక్కుల పోరాట సమితి ( వి హెచ్ పి ఎస్ ) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎం ఆర్ పి ఎస్ ) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పెన్షన్ దారులతో మహాధర్న నిర్వహించడం జరిగింది. తదనంతరం డిప్యుటీ తహసీల్దార్ కర్ణాకర్ రావు కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని తమరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కుప్పా నగర్ నర్సిములు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు శోభరాణి సావిత్రి, బిస్మిల్లా, ఖాదర్ అల్లి గినియర్ పల్లి నబీ,నాగమ్మ, గుండమ్మ నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.

రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్..

రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్

◆:- బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ అంతట కూడా నిమజ్జనం రేపు ఉండడం జరుగుతుంది. అలాగే మన జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా నిమజ్జనం రేపు ఉండడంతో, కాంగ్రెస్ నాయకులు రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జ్యోతి పండాల్ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆఫీసులో నిద్రపోకుండా ఏర్పాట్లని దగ్గరుండి సమకూర్చాలని పర్యవేక్షించాలని జ్యోతి పండాల్ సూచించడం జరిగింది.

అలాగే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ని, మహిళా కానిస్టేబుల్స్ ని, మహిళా ఆఫీసర్స్ ని కూడా డిప్లాయ్ చేయాలని పోలీస్ శాఖ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.

ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం వచ్చిన అమ్మాయిలని పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తున్నందుకు, 7 రోజుల వ్యవధిలో 930 మందిని మఫ్టీలో షీ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ 930 మందిలో మైనర్లు, 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు మరియు 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవాళ్ళు వేధించడం జరుగుతుందని షీ టీమ్స్ ఇన్చార్జ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవారు కూడా అమ్మాయిలని ఏడిపిస్తున్నారంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకీ పెరుగుతిన్నారని మహిళలు గమనించాలి మరియు జాగ్రత్త వహించాలి.

జ్యోతి పండాల్ తప్పు లేకుండా ఎవరిపైన నిరాధారంగా ఆధారాలు లేకుండా విమర్శించదు అన్న విషయం, జహీరాబాద్ లో ఉన్న నాయకులు గాని కాంగ్రెస్ నాయకులు గానీ తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడుతుంటే ఇక్కడున్న లీడర్లకి ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం అవడం లేదు. నిన్న అమ్మాయిల భద్రత కోసం మాట్లాడినందుకు లీడర్లకు జీర్ణం అవడం లేదు కానీ ఖైరతాబాద్ లో జరుగుతున్న ఈవిటీజింగ్ కేసులను చూస్తే మీకు అర్థమవుతుందని జ్యోతి పండాల్ అన్నారు.

నర్సంపేటలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T143118.908.wav?_=4

రామరాజ్యం తలపించేలా వైఎస్ఆర్ పాలన

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి
వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా
నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పెండెం రామానంద్ గారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు,అవసరాలను తెలుసుకున్న నేత అని పేర్కొన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని తెలిపారు. పేద ప్రజలు,విద్యార్థుల కోసం ఆరోగ్య శ్రీ పథకం,ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి చిరస్మరణీయుడయ్యారని కొనియాడారు.వైఎస్ఆర్ పాలన సంక్షేమమే ప్రధాన ఎజెండా గా కార్యకర్తలే సైనికులుగా కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా పని చేసిన గొప్ప నాయకుడు అని రామానంద్ గుర్తుకు చేశారు. దివంగత డాక్టర్ వైయస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే నేటికీ కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ,మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ర్మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవి,నర్సంపేట మండలం అధ్యక్షులు కత్తి కిరణ్, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, పంబి వంశీకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ డక్క శ్రీను,నర్సంపేట పట్టణ కార్యదర్శి చిప్ప నాగ,నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, గజ్జి రాజు, లక్కాసు రమేష్, నాగేల్లి సారంగం, పొన్నం నరసింహారెడ్డి, కొప్పు అశోక్, బాణాల శ్రీను, మెరుగు కిరణ్, మహిళ నాయకురాలు హసీనా, గాజుల రమేష్, గండు గిరి, బిట్ల మనోహర్, పాతార బోయిన చంద్ర మొగిలి, మేడం కుమార్, ఎండి సర్వర్, దేశీ సాయి పటేల్, కాంగ్రెస్,మహిళా,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భవ దినోత్సవం 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T154710.034.wav?_=5

 

ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భవ దినోత్సవం 
సెప్టెంబర్ 9 లోపే వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి
వికలాంగులకు 6000 వితంతువులు ఒంటరి మహిళలకు 4000
మహాదేవపూర్ఆగష్టు28 నేటి ధాత్రి

 

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ
మహాదేవపూర్ మండల కేంద్రంలో ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘమైన వి హెచ్ పి ఎస్ ఆవిర్భవించి 18 సంవత్సరాలు పురస్కరించుకొని వి ఎచ్ పి యస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య జెండా అప్పుడే ఆవిష్కరణ చేశారు. వీరగంటి సమయం మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కోసం వారికి సమాజంలో జరుగుతున్న అసమానతల కోసం ఎమ్మార్పీఎస్ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు గుర్తింపు తీసుకురావడం అంటే ఎంతో గొప్ప విశేషమని దీనికి కారణమైన .మందకృష్ణ మాదిగ వికలాంగుల కోసం నిరంతరం పోరాటం చేయడం ద్వారానే వారికి సమాజంలో విలువైన జీవనం తగ్గిందన్నారు మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాటే మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ చొరవతోనే ఎన్నో విజయాలు సాధించిమని వికలాంగుల సమాజం మాన్యశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగా కే రుణపడి ఉంటుందని ఈ గౌరవం దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య టౌన్ ప్రెసిడెంట్ ముస్తాక్ మండల ప్రధాన కార్యదర్శి కన్నబోయిన కొమురక్క కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీఏసీఏస్ చైర్మన్ వామన్ రావు బిజెపి మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు చింతకుంట సదానందం తదితరులు పాల్గొన్నారు

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161118.191-1.wav?_=6

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు
బిజెపి నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

https://youtu.be/mgl8GBmGx0A?si=5kIR7WXajNDM3xSBv

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం.

 

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం..

మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయితీ వద్ద మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హాజరై సిబ్బంది తో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఎ)ను అమలు చేస్తోందని అన్నారు. ఈ అవగాహన ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పోత్కపల్లి లో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా , సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సామూహిక ప్రతిజ్ఞను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా సాగుచేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి, షీట్స్ ఓపెన్ చేసి పీడియాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి మన ఐక్య నిబద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా ఉపయోగపడుతుంది అన్నారు.ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ఉచిత బస్సు ప్రయాణమే కాదు ఆ బస్సుకు ఓనర్ లను చేసిన ఘనత కాంగ్రెస్ ది .

పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-37.wav?_=7

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పిఎసిఎస్ గ్రౌండ్ లో భూపాలపల్లి నియోజకవర్గ ఇందిర మహిళా శక్తి సంబరాలు సెర్ప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షుతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సితక్క మాట్లాడుతూ తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ దేశంలోని ఆదర్శంగా నిలిచిందని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్టిసి బస్సులు ఇస్తూ పెట్రోల్ బంకులు ఇస్తూ సోలార్ వంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా మహిళలను చైతన్యం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు మహిళలకు జీవిత బీమా కల్పిస్తూ మహిళా సంఘంలో ఉంటూ ఆ సభ్యురాలు మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం అందిస్తున్నామని అలాగే 15 సంవత్సరాల అమ్మాయిలను కూడా మహిళా సంఘాలలో చేర్పిస్తున్నామని అన్నారు అలాగే ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తూ ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు యూనిఫామ్లను కుట్టిచ్చి ఇచ్చే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామని దీని ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి సాది స్తున్నారని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల కోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకె కాక రైతులకు కూడా 2 లక్షల రుణాలు మాఫీ చేసి వారికి పెట్టుబడి సహాయం అందిస్తూ దేశంలోనే రైతు సంక్షేమం కోరిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణిస్తున్నారని మహిళల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని, అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో చిట్యాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా వెంటనే సీతక్క సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది , భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న తెగిపోయిన రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని అడగగా వెంటనే హాని ఇవ్వడం జరిగిందని అన్నారు, అనంతరం మహిళలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకే చెక్కులు, జీవిత బీమా చెక్కులు, టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాలకు ఆర్టీసీ బస్సులను మహిళా సమైక్య లకు మంత్రి సితక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ విజయలక్ష్మి, సర్ప్ డైరెక్టర్ రజిని మరియు డి ఆర్ డి ఎ పి డి బాలకృష్ణ జిల్లా సెర్ప్ అధికారులు, ఎంపీడీవో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, మధు వంశీ కృష్ణ 6 మండలాల సెర్ప్ అధికారులు ఆరు మండలాల నుంచి వచ్చిన మహిళా సమైక్య సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు మండల జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ…

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ 21 వార్డు మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు శనివారం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి అయిన సందర్భంగా పట్టణంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృదే ధ్యేయంగా మంత్రి వివేక్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఫ్లై ఓవర్ వంతెనపై త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,వంతెనకు ఇరువైపుల రోడ్డు విస్తరణకు కోటి యాబై లక్షల రూపాయల నిధులను మంత్రి వివేక్ మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల సత్యనారాయణ,తదితర నాయకులు పాల్గొన్నారు.

ఆషాడమాసంలో గోరింటాకు పండగ

ఆషాడమాసంలో గోరింటాకు పండగ

గోరింటాకు పండగను జరుపుకుంటున్న మహిళలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో
శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆషాడ శుక్ల త్రయోదశి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ ఆషాడ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా భావించి మహిళలు అందరూ కలిసి రామాలయం ఆవరణంలో గోరింటాకు పండగను జరుపుకున్నారు.
గోరింటాకు ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి

 

 

పూర్వము పార్వతీదేవి ఒకరోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటుండగా గోరింటాకు చెట్టు పార్వతి దేవిని ఈ విధముగా కోరింది ప్రజలందరూ గోరింటాకు చెట్టును గుర్తించాలి అని కోరింది అందుకు పార్వతీదేవి ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల మహిళలకు సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని పొందవచ్చు అని పార్వతి దేవి చెప్పింది.
అందువల్ల మహిళల ందరూ ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఒక సాంప్రదాయంగా భావించి జరుపుకుంటారు
మహిళలు మాట్లాడుతూ. గోరింటాకు పండగను ప్రతి సంవత్సరం రామాలయంలో వైభవంగా జరుపుకుంటాము.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరానికి చలవ చేస్తాయి ఒత్తిడిని తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యంగా భావిస్తారు వివాహమైన స్త్రీలకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అని భావిస్తాము అందుకొరకు ప్రతి ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటాము.
ప్రతి ఆషాడ మాసంలో మహిళలు గోరింటా కు పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version