ఆషాడమాసంలో గోరింటాకు పండగ
గోరింటాకు పండగను జరుపుకుంటున్న మహిళలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో
శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆషాడ శుక్ల త్రయోదశి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ ఆషాడ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా భావించి మహిళలు అందరూ కలిసి రామాలయం ఆవరణంలో గోరింటాకు పండగను జరుపుకున్నారు.
గోరింటాకు ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి
పూర్వము పార్వతీదేవి ఒకరోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటుండగా గోరింటాకు చెట్టు పార్వతి దేవిని ఈ విధముగా కోరింది ప్రజలందరూ గోరింటాకు చెట్టును గుర్తించాలి అని కోరింది అందుకు పార్వతీదేవి ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల మహిళలకు సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని పొందవచ్చు అని పార్వతి దేవి చెప్పింది.
అందువల్ల మహిళల ందరూ ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఒక సాంప్రదాయంగా భావించి జరుపుకుంటారు
మహిళలు మాట్లాడుతూ. గోరింటాకు పండగను ప్రతి సంవత్సరం రామాలయంలో వైభవంగా జరుపుకుంటాము.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరానికి చలవ చేస్తాయి ఒత్తిడిని తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యంగా భావిస్తారు వివాహమైన స్త్రీలకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అని భావిస్తాము అందుకొరకు ప్రతి ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటాము.
ప్రతి ఆషాడ మాసంలో మహిళలు గోరింటా కు పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాము.