మండపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఆహ్వానం

మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి……

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి…

మేడారం జాతర జరిగే మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర కాబట్టి పిల్లల సెలవులకై నిరీక్షణ

ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక కూడా

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

మేడారం జాతరకు సెలవులు మూడు రోజులు ప్రకటించాలని కోరుతూ టిపిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు నేతృత్వంలో అర్పణపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారనీ, ఈ జాతరలో గత సంవత్సరాల గణాంకాల ప్రకారం లక్షలాది మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, గిరిజన సంప్రదాయాలకు ప్రధాన ప్రతీక అని, తెలంగాణ సంస్కృతికి మూల స్తంభం అని వివరించారు.
ఈ జాతర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటారని అన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు సమ్మక్క, సారక్క తల్లులు ఇద్దరు కొలువుదీరిన మరుసటి రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ వస్తున్నాయని, దీనివల్ల ఆరోజే అందరూ
మేడారం జాతరకు వస్తూ ఉండడం వలన లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కారణంగా ట్రాఫిక్ సమస్యలు, కష్టతర ప్రయాణం , వసతి సౌకర్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, దర్శన సమయంలో కిక్కిరిసిన జనాభా వల్ల పిల్లలకు దర్శన భాగ్యం కూడా కలగట్లేదు అని అన్నారు. ఇది కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర అనీ, పిల్లలకు సెలవులు ఇవ్వందే వాళ్ళు జాతరకు వెళ్ళరని, వారి సెలవులకై వేచి చూసి, సెలవులు ఇచ్చాక మాత్రమే జాతరకు తరలి వెళ్తారని అన్నారు. మూడు రోజులు సెలవులు ఉంటే పబ్లిక్ ఇంత పోటెత్తరని, జాతరను కూడా ఎంజాయ్ చేస్తారని, ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం అని అన్నారు.
ఈ నెల 28న సారక్క తల్లి,29న సమ్మక్క తల్లి గద్దెల పైకి కొలువుదీరుతారని ,30న భక్తుల మొక్కులందుకొని తిరిగి 31న వన ప్రవేశం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు
కావున ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గౌరవించి మేడారం జాతర సందర్భంలో తల్లులు కొలువుదీరే ఈ మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవులు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజు, నరసింహస్వామి, భూక్య శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి డిపోలో బస్సులు చాలక ప్రయాణికుల తిప్పలు,….

వనపర్తి డిపోలో బస్సులు చాలక ప్రయాణికుల తిప్పలు

ఎమ్మెల్యే ఆర్ టి సి ఆర్ ఎం స్పందించాలి

వనపర్తి నేటిదాత్రి .

 

సోమవారం పండగ సందర్భంగా వేలాది ప్రయాణికులకు బస్సు ల సౌకర్యం కల్పించలేని స్థితిలో వనపర్తి బస్ డిపో ఉన్నందున ప్రయాణికులు కష్టాలు గంటలుగా వేచి ఉండడం చూసి బస్ లో ప్రయాణం చేసే ప్రయాణికులు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ దృష్టి కి తెచ్చామని ప్రయాణికులు చెప్పారు వెంటనే డాక్టర్ సతీష్ యాదవ్ వనపర్తి డి.ఎం మాట్లాడి ప్రయాణికుల అవస్థలు తిప్పలను తెలుపగ ఆర్ టి సి బస్సులు లేవు ,ఉన్న కొద్దీ బస్సులు హైదరాబాద్ వెళ్లాలయని, అవి వచ్చిన తర్వాత పంపిస్తామని డి ఎం చెప్పారని సతీష్ యాదవ్ విలేకరుల కు తెలిపారు బస్ ప్రయాణికుల తరుపున గట్టిగా డి ఎం ను కోరడంతో రెండు బస్సులు పంపిస్తామని చెప్పారని అన్నారు వనపర్తి జిల్లాకు రాష్ట్రంలో రెండవ డిపోగా పేరు ఉన్న వనపర్తి డిపోకు బస్సులో కొరత ఉండడం ఎవరి పాపమని, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే లు ప్రయాణికుల ఆర్ టి సే డిపోలను పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని డాక్టర్ సతీష్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి కరెంటు ఎలక్ట్రికల్ బస్సులలో వనపర్తి జిల్లాకు ఎన్ని వచ్చాయో ప్రజలకు ఎమ్మెల్యే లు అధికారులు తెలుపాలని కోరారు జిల్లా కలెక్టర్ ,వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ఆర్.యం డి ఎం స్పందించి కరెంటు ఎలక్ట్రానిక్ బస్.లు తెప్పిం చసాలని వనపర్తి ప్రయాణికుల తరుపున సతీష్ యాదవ్ కోరారు

సర్పంచులు గ్రామాల్లో ప్రజల సమస్యలు తీర్చాలి…

సర్పంచులు గ్రామాల్లో ప్రజల సమస్యలు తీర్చాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

 

రాజపేట శివారులో వైటీసీ భవనంలో సర్పంచులకు శిక్షణ కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేశారు ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి పాల్గొన్నారు కలెక్టర్ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు ఈసందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో బాధ్యతాయుతంగా మెలిగి ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పనిచేయాలని సర్పంచ్ లకు సూచించారు. సర్పంచులు బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణ శిబిరాన్ని సర్పంచులు అవగాహన చేసుకోవాలని కోరారు పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న అంశాలను సర్పంచులు శిక్షణ శిబిరంలో తెలుసుకోవాలని . సర్పంచులకు 5 సంవత్సరాల పదవి ఉంటుందని 5 సంవత్సరాలు బాధ్యత గా పనిచేయాలని కోరారు గ్రామాల అభివృద్ధి ప్రజల కొరకు సర్పంచులకు సహకరిస్తానని కలెక్టర్ ఆదర్శ్ సురబి సర్పంచ్ లకు హామీ ఇచ్చారు. గతంలో పని చేసిన సర్పంచ్ లతో నూతన సర్పంచ్ లు సూచనలు సలహాలు స్వకరించాలని కోరా రు సర్పంచులకు కలెక్టర్ శిక్షణ సామాగ్రిని పంపిణీ చేశారుఈ సమావేశంలో డీపీ ఓ తరుణ్, డిఎల్పిఓ రఘునాథ్, ఎంపీడీవోలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఆసుపత్రిలో రోడ్డు ప్రమాద బాధితుణ్ణి పరామర్శించిన…

ఆసుపత్రిలో రోడ్డు ప్రమాద బాధితుణ్ణి పరామర్శించిన

◆-: ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామానికి చెందిన కాశినాథ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసు కోవడం,ఈ కార్యక్రమంలో యస్. గోపాల్,చెంగల్ జైపాల్, బి.విఠల్,నిఖిల్,తదితరులు ఉన్నారు

అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన…

అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7 మరియు 26వ వార్డులలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు, మహిళా సంఘాలకు కోటి రూపాయలు బ్యాంకు లింకేజీ, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు అలాగే పురపాలక పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులు నివాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు వచ్చేస్తున్నాయని ప్రజల రక్షణకు 3 కోట్ల రూపాయల వ్యయంతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి మహిళలు పట్ల అపారమైన గౌరవం ఉందని తాము అధికారం చేపట్టిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన తెలిపారు. సంక్రాంతి సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరెలు ఇస్తామన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్తు అర్హత ఆధారంగానే ఇస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టిసి బస్సులు, పెంట్రోల్ బంకులు ఇస్తున్నామని తెలిపారు. నిధులు, నీళ్లు, నియమాలు కోసం ఏర్పడిన తెలంగాణలో గత 10 సంవత్సరాలు వెనుకబాటుకు గురైందని, ఉద్యోగాలు రాలేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం చేయకట్టగానే గ్రూప్ 1,2 3 వన్ ఉద్యోగాలతో శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం మీకు అన్నివేళల్లో అండగా ఉంటుందన్నారు. అన్ని కులాల వారికి మున్సిపల్ పరిధిలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి సమ్మక్క సారక్క దీవెనలు మెండుగా ఉండాలని కోరారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు, పేరు మార్పిడి సొంతింటికలను సాకారం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పిడి రాజేశ్వరి, ఎంపీడిఓ తరుణ్ ప్రసాద్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు…

బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు

బీబీ చారి మరణంపట్ల కన్నీటిపర్యంతం అయిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన బేతోజు భరత్ కుమార్ చారి (బీబీ చారి) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. యువకులతో సమానంగా పోటీ పడుతూ,అందరికీ సలహాలు సూచనలు అందిస్తూ,స్నేహపూర్వక స్వభావంతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు.
ఈ సందర్భంగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.బీబీ చారి పార్టీ కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నూతన సర్పంచ్ కు ఘన సన్మానం..

నూతన సర్పంచ్ కు ఘన సన్మానం

మైలారం మున్నూరు కాపు కిసాన్ సంక్షేమ సంఘం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మైలా రం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నూనె దివ్య తిరుపతినీ మున్నూరుకాపు కిసాన్ సంక్షేమ సంఘం అధ్య క్షుడు పంచగిరినర్సయ్య మరి యు ఉపాధ్యక్షులు నూనె శ్రీనివాస్ మున్నూరు కాపు సభ్యులు వీరికి అభినందనలు తెలిపి వారిని శాలువాతో సన్మానించారు.అనంతరం గ్రామ ప్రజలు మీపై నమ్మకంతో మిమ్మల్ని సర్పంచ్ ఎన్నుకు న్నారు రాజకీయాల కతీతంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పనకు కృషిచేయాలని అదేవిధంగా గ్రామ అభివృ ద్ధికోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు…

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు.

#కెనాల్ సరిహద్దు వదిలి నిర్మాణాలు చేసుకోవాలి.

#అక్రమ నిర్మాణాలు చేసేవారికి నోటీసులు జారీ.

#డిబిఎం 38 కెనాల్ భూమిపై భారీ వాహనాలు వెళ్ళకూడదు.

#రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసిన ఏ ఈ పవిత్ర.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

డిబిఎం 38 కెనాల్ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏ ఈ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న కెనాల్ భూమిని ఎలాంటి సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు అందడంతో నిర్మాణం చేపడుతున్న స్థలాలతోపాటు గతంలో నిర్మాణం చేపట్టిన వారికి శాఖ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కెనాల్ హద్దులు దాటి భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్మాణాలు చేపడుతున్న వారు తక్షణమే నిర్మాణాలు ఆపివేయాలని సంబంధితలను ఆదేశించారు.

#భారీ వాహనాలతో ధ్వంసం అవుతున్న సిసి రోడ్.

మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి నుండి కస్తూరిబా గురుకుల పాఠశాలకు డిబిఎం 38 కెనాల్ పై నుండి రహదారి కోసం సిసి రోడ్ నిర్మాణం చేయగా. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే సీతా రామాంజనేయ స్వామి ఆలయం ప్రక్కన రెడ్ మిక్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చే దుమ్ము దూళితో విద్యార్థులు, భక్తులు, చుట్టు ప్రక్కన ఉన్న ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు కర్మాగారానికి వాహనాలు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో సంబంధిత శాఖ అధికారుల అనుమతి లేకుండానే కెనాల్ పై భారీ వాహనాలు నడపడంతో గురుకుల పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందు పడుతున్నారని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తక్షణమే కెనాల్ దారి వెంబడి వాహనాలు నడపరాదని జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు ఏఈ పవిత్ర తెలిపారు. ఆమె వెంట రెవిన్యూ ఏఆర్ఐ చామంతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

నిజాంపేట ప్రజావాణిలో ఒక దరఖాస్తు..

నిజాంపేట ప్రజావాణిలో ఒక దరఖాస్తు

నిజాంపేట: నేటి ధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. నిజాంపేట మండలంలో తాహాసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక దరఖాస్తు మాత్రమే వచ్చింది. తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజీరెడ్డి, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, ఎంపీవో నరసింహారెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల నివృత్తి కోసం ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో పాల్గొనాలన్నారు. ఉదయం 10: 30 నుండి 1 వరకు ఉంటుందన్నారు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాత్రి జహీరాబాద్ పట్టణం గాంధినగర్ కాలనిలో జరిగిన జహీరాబాద్ మండలం హోతి.బి గ్రామం పర్వేజ్ మోహియోద్దీన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో వై.తరుణ్, బక్షు మోహియోద్దీన్, కె.సుభాష్ రెడ్డి,చెంగల్ జైపాల్,మారుతి,బి.దిలీప్, ఇబ్రాహీం,అహ్మద్,తదితరులు పాల్గొన్నారు

గణిత ప్రతిభ పాట పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక.

గణిత ప్రతిభ పాట పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక.

జిల్లా స్థాయిలో మొదటి స్థానం లో గెలుపొందిన షేక్ షిఫా తహసీన్ .
మంగపేట నేటిధాత్రి

 

గణిత ప్రతిభాపాటవా పోటీ పరీక్షల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానం గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపిక మంగపేట మండలంలోని జడ్పీహెచ్ఎస్ మంగపేట హై స్కూల్ కి చెందిన టెన్త్ క్లాస్ తెలుగు మీడియం షేక్ షిఫా తహసీన్ జిల్లా స్థాయిలో జరిగిన తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం వాళ్లు నిర్వహించిన గణిత ప్రతిభ పాట పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని గెలుపొందినందుకు స్థానిక మండల విద్యాశాఖ అధికారిని పొడెం మేనక అభినందించారు మరియు మంగపేట హైస్కూల్ ఉపాధ్యాయులు క్రాంతి నాగేందర్ మధురిమ చంద్రశేఖర్ తదితర ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో కూడా గెలుపొంది పాఠశాలకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎంఈఓ తెలియజేసినారు

మద్యంతాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-31T133630.199.wav?_=1

 

 

మద్యంతాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

భూపాలపల్లి,నేటిధాత్రి:

 

మద్యంతాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 సందర్భంగా నూతన సంవత్సర వేడుకలకు నాంది పలుకుతున్న సందర్భంగా భూపాలపల్లి పట్టణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెచ్చరికలు జారీ చేశారు.
నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి పూట పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా , యువత పట్టణ ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు.

మద్యంతాగి వాహనాలు నడపడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని సూచించారు.మద్యం తాగి వాహనాలు నడపడం వలన ప్రాణాపాయానికి దారితీస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా రాత్రి పూట భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులు ముఖ్య ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించబడతాయన్నారు.మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని
అలాగే అనుమతి లేకుండా డీజేలు, అధిక శబ్ద కాలుష్యం, రోడ్లపై గుంపులు గుంపులుగా తిరగడం, ఆకతాయిల చర్యలు, అల్లర్లు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.ఏలాంటి ఘటనలకు పాల్పడిన ఆ వ్యక్తులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు.యువత స్వీయ నియంత్రణ పాటిస్తూ నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని భూపాలపల్లి పట్టణ సిఐ డి.నరేష్ కుమార్ తెలిపారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు నిలుపుదల చేయగలమని, ఏదైనా అనుమానాస్పద ఘటనలు గమనించినచో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మొతిమాత జాతర మహోత్సవానికి ఆహ్వానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-31T132213.143.wav?_=2

 

 

మొతిమాత జాతర మహోత్సవానికి ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శాసనసభలో బిఆర్ఎస్ శాసనసభపక్ష ఉప నేత (డిప్యూటీ ఫ్లోర్ లీడర్) గా నియమితులైన మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,మాజి పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి & నాయకులు అనంతరం మొగుడంపల్లి మండలం ఉప్పర్ పల్లి తండాలో జనవరి 2,3 వ తేదీలలో జరిగే మొతిమాత జాతర మహోత్సవానికి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు కేసు నాయక్, శంకర్ నాయక్, గోపాల్ బానోత్ బానోత్, నారాయణ జాదవ్, దేవిదాస్ జాదవ్, సంజయ్ పవార్ తదితరులు..

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కార్యక్రమానికి విచ్చేయుచున్న
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ నేటి ధాత్రి తో మాట్లాడుతూ మండల గ్రామపంచాయతీ పరిధిలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారు ఉదయం 8 గంటలకు వచ్చి వారి వారి కల్యాణ లక్ష్మి చెక్కులను తీసుకోగలరని ,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
కోరారు
స్థలం : * గణపురం గ్రామపంచాయతీ కార్యాలయం *

మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి సందేశం అందించాలి

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఎమ్మెల్యే మాధవరెడ్డితో కలిసి నర్సంపేట డివిజన్ చర్చిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రార్థనలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

అన్ని మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపని ప్రజలంతా కలిసికట్టుగా పండుగలను జరుపుకోవడమే నిజమైన అభివృద్ధికి సంకేతమని రాష్ట్ర ఐటీ పరిశ్రమ, వాణిజ్యం,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.క్రిస్టమస్ పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండలం తిమ్మరాయన్ పాడ్ లో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. అలాగే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

 

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు,స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్రిస్మస్ పండుగా
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.ఈ క్రిస్మస్ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు ఆరోగ్యం సమృద్ధి నిండాలని కోరుకుంటూ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నామని తెలిపారు.

ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్..

ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాషి కాలనీ చర్చిలో పాస్టర్ రాజవీర్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తు జన్మదిన వేడుకలకు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను ముందుగా అందరికీ మేరీ హ్యాండ్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

న్యాయవాది అయిత కృష్ణ మోహన్ నివాసంలో శ్రీ మహాలక్ష్మి యాగం..

న్యాయవాది అయిత కృష్ణ మోహన్ నివాసంలో శ్రీ మహాలక్ష్మి యాగం
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో సీనియర్ న్యాయవాది పట్టణ ఆర్యవైశ్య సంగం మాజీ అధ్యక్షులు అయిత కృష్ణమోహన్ నివాసంలో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించారు ఈ మహాలక్ష్మి యాగం గోశాల నిర్వాహకులు రామాచార్యులు నిర్వహిoచారని సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు

అయ్యప్ప మహా పడిపూజ మహా అన్న ప్రసాద కార్యక్రమం..

అయ్యప్ప మహా పడిపూజ మహా అన్న ప్రసాద కార్యక్రమం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతుల

భూపాలపల్లి నేటిధాత్రి

 

గురువారం మధ్యాహ్నం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ – మహా అన్న ప్రసాద కార్యక్రమం అత్యంత కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ గారు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలసి భిక్ష చేశారు.

వనపర్తి పట్టణ అవొప క్యాలండర్ ఆవిష్కరణ..

 

వనపర్తి పట్టణ అవొప క్యాలండర్ ఆవిష్కరణ

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణ అవొప క్యాలెండర్ ఆవిష్కరణ లక్ష్మి శ్రీనివాస కన్వెన్షన్ హాల్ నిర్వహించామని వనపర్తి పట్టణ అవొప అధ్యక్షుడు కలకొండ శ్రీనివాసులు ఓక ప్రకటన లో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల నుంచి.అవొప క్యాలండర్ వనపర్తి పట్టణంలో ఆర్యవైశ్యులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు బచ్చు రాము పూరి బాలరాజు నాగబంది యాదగిరి సంబు వెంకటేశ్వర్లు లగిశెట్టి శ్రీనివాసులు ఎస్ ఎల్ ఎన్ రమేష్ గోకారం కృష్ణమూర్తి రాజు కట్ట సాయి నారాయణ పోలిశెట్టి మురళి సంబు వెంకటరమణ కటకం శ్రీధర్ ఉప్పల భాస్కర్ కొట్ర సునీల్ ఆకుతోట శ్రీధర్ పివి ఎస్ ఎన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version