అతి త్వరలోనే శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T132848.714.wav?_=1

 

అతి త్వరలోనే శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం

శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పద్మశాలి కులబంధు వులకు హిందూ బంధువులకు సిరిసిల్ల మార్కండేయ వీధిలో అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కై శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యచరణను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ రోజు ప్రెస్ క్లబ్లో శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో, హిందు బంధువులతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతి నగర్ ‘నుండి భూపతినగర్’ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించింది. దేవాలయ పునర్నిర్మాణం హిందూ సంఘటనా శక్తికి, ఆత్మ గౌరవానికి, సమరసతకు చిహ్నంగా శ్రీ లలితా పరమేశ్వరీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మా ణములో సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావించి అందుకు నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభించి తెలియజేపింది వారి అభిప్రాయాలను సేకరించింది.ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అతి త్వరలోనే దేవాలయ నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభం. చేస్తున్నామని అది కూడా వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
ఇటీవల అయోధ్య లో భవ్యమైన దిన్యమైన అయోధ్య రామమందిర నిర్మాణముకై జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరం దేవుడి ముందర సమానమే అనే భావనతో ప్రయత్నం చేసి సిరిసిల్ల లో దివ్యమైన భవ్యమైన
శ్రీ మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఇది మనందరి సంఘటితశక్తికి, స్వాభిమానా ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా తను మన ధనాన్ని భగవంతునికి దేవాలయానికి సమర్పించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి తెలిపింద త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం తేదీని మీకు మీడియా ద్వారా తెలియపరుస్తాం.దేవాలయానికి “ఇచ్చే ఒక ఇటుక కానీ, ఒక రూపాయి కానీ సమర్పణ చేస్తే తర తరాలకు పుణ్యం లభిస్తుంది . కావున ప్రతి ఒక్కరూ సమర్పణకి తను మన ధన ని సమర్పించి భాగస్వాములై భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ మాదాస శ్రీనివాస్. నాగుల శ్రీనివాస్,కోడం రవి,గుంటుక పురుషోత్తం, చిమ్మని ప్రకాష్, గాజుల సదానందం, గుడ్ల విష్ణు, జిందం రవి, ఎనగంటి నరేష్,తదితరులు పాల్గొన్నారు.

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు…

 

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలో గల పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు రెండో రోజు ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతి ఒక్కరూ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి డప్పుచప్పుల్ల మధ్య ఇంటింటి నుంచి తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ ,జలాలతో అభిషేకాలు చేశారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని ఆ దేవున్ని ప్రార్థించారు. అంతకు ముందు పట్టణంలోని పలు వీధులలో పూజారులచే పలు విన్యాసాలు నిర్వహించారు.కొత్త వస్త్రాలను ధరించిన గౌడులు పట్టణంలోని వారి ప్రతి ఇంటి నుంచి బిందెలతో జలాలు మంగళహారతులతో తరలివచ్చి పూజలను నిర్వహించారు.పట్టణంలోని గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పూజ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు.ఆలయ కమిటీ భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లను చేసింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్ ,మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్ గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళ పెళ్ళి చంద్రమౌళి గౌడ్, కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, పంజాల రాజు గౌడ్, గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, పుల్లూరి స్వామి గౌడ్ వల్లాల శ్రీహరి గౌడ్, వీరయ్య గౌడ్, వేముల రవి గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తుల్జా భవాని ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T130019.858.wav?_=2

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని తుల్జా భవాని ఆలయం వరకు భక్తుల పాదయాత్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుండి భక్తులు లోక కళ్యాణర్ధం పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని తుల్జా భవాని ఆలయ వ్యవస్థాపకులు జాదవ్ మహేందర్ మహారాజు ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా తుల్జాపూర్ అమ్మవారి చెంతకు సుమారు 220 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది దీపావళి పర్వదిన అనంతరం పాదయాత్ర చేపడుతున్నట్లు గోపాల్ పేర్కొన్నారు.తుల్జా భవాని దేవస్థానానికి పాదయాత్రగా వెళ్లిన గ్రామస్తులు నర్సాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ తుల్జా భవాని ఆలయం మహారాష్ట్రలోని ధరాశివ్‌లో ఉంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు శక్తి స్వరూపిణి అయిన భవాని దేవికి అంకితం చేయబడింది. ఈ దేవిని అనేకమంది భక్తులు, ముఖ్యంగా మరాఠాలు, రాజపుత్రులు, దేశస్థ బ్రాహ్మణులు, మరియు అగ్రిలు వంశ దేవతగా పూజిస్తానన్నారు,

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

కళ్లకు గంతలు కట్టి అమ్మవారి ప్రతిరూపం…

కళ్లకు గంతలు కట్టి అమ్మవారి ప్రతిరూపం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : మన దేశంలో దసరా పండుగను ధనిక-బీద తేడా లేకుండా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన ప్రఖ్యాత శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అమ్మవారి పై ఉన్న భక్తితో కళ్లకు గంతలు కట్టి, కేవలం ఒక గంట పది నిమిషాల వ్యవధిలో మట్టితో మూడు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. తన మదిలో తలచుకున్న అమ్మవారి రూపాన్ని ప్రతిష్టాత్మకంగా మలిచినట్లు తెలిపారు. “ప్రతి కళాకారుడి మదిలో రకరకాల కళారూపాలు దాగి ఉంటాయి. మనిషి ఏ విషయం పై ఎక్కువగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయన్నారు. విశ్వాసం, నమ్మకం ఉంటే ఏ పని సాధ్యమే. భగవంతుని కరుణ ఉంటే విజయవంతం అవుతాం” అని శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అన్నారు.

తుల్జా భవానీ మాత దర్శించుకున్న యువకులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T123507.930.wav?_=3

 

తుల్జా భవానీ మాత దర్శించుకున్న యువకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహారాష్ట్రంలోని తుల్జాపూర్లో తుల్జా భవానీ మాత శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. బుధవారము జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలానికి చెందిన వైద్య నాగేష్ సాయి కృష్ణ తుల్జా భవాని మాత శక్తి పీఠాన్ని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయం భూగా వెలసిన అమ్మవారి దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో…

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో
పొత్కపల్లి యువత ..

సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న యువత..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం లోని పొత్కపల్లి గ్రామానికి యువత గత దశాబ్దకాలంగా దుర్గాభవాని కమిటీగా ఏర్పాటై భవాని మాత సేవలో తరిస్తూ మన సనాతన ధర్మాన్ని ,భక్తి మార్గాన్ని భావి తరాలకి అందిస్తుంది.యువత అంటే మనకు ఉండే ఆలోచనలకి ఆమడదూరంలో ఉంటూ సనాతన ధర్మానికి, భక్తిగా చిరునామాగా నిలుస్తూ పొత్కపల్లి యువత భవాని సేవలో దశ్జబ్దకాలంగా త్రికరణశుద్ధిగా ముందుకు సాగుతుంది.ఓదెల మండలంలోని ఎంతో ప్రాచుర్యం పొందిన పొత్కపల్లి శ్రీ రాజ వేణుగోపాలస్వామి మరియు భవాని సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత దశాబ్ద కాలంగా భవాని మాత ఉత్సవాలు స్థానిక యువత ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తు హిందూ ధర్మ పరిరక్షణకు మేము సైతం చెడుపై పోరాటానికి సిద్ధం అంటూ భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు పొట్కపల్లి గ్రామంలో నీ యువత కులాల కతీతంగా భవాని మాత కమిటీగా ఏర్పడి,భవాని మాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తు ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నారు.ఆనాడు మరాఠా రాజ్య స్థాపకుడైన చత్రపతి శివాజీ మహారాజ్ భవాని మాత ఉత్సవాలను ప్రారంభిస్తే దానిని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లడానికి పొత్కపల్లి యువత సంకల్పించారు. సమాజ హితమే తమ అభిమతంగా దశాబ్దకాలంగా భవాని మాత ఉత్సవాలని అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క భవాని మాలలు ధరించి భక్తిని ,బాధ్యతలని సమపాళ్లలో నిర్వర్తిస్తూ యువతకి ఒక మార్గాన్ని జీవనవిధానాన్ని చూపిస్తున్నారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజాన్ని మంచి దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క భక్తి భావంతో పాటు సామజిక స్ఫూర్తిని రగిలిస్తున్నారు భవాని కమిటి గ్రామ కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల లో అయిన హెల్మెట్ ధరించాలని, స్థానిక వ్యాపారులని ప్రోత్సహించాలని,స్వదేశీ ఉత్పత్తులు కొనడం దేశభక్తికి శోభా అని,విద్యతోనే వెలుగు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని గుర్తు చేస్తూ అందరిలో చైతన్యం తీసుకువస్తున్నారు. మాదకద్రవ్యాలు,మద్యం, జూదం జీవితం చెడగొట్టే మార్గాలు కావున వాటికీ దూరంగా ఉండి భవిష్యత్తుని వెలిగించండి అని యువతకి హితబోధ చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవం ఒక ఆనందం మాత్రమే కాదు మన గ్రామాన్ని ఒకటిగా నిలబెట్టే శక్తి అని చెబుతు రాక్షస సంహారానికి ప్రతీక అయిన నవరాత్రులని ఘనంగా నిర్వహిస్టు నవ సంకల్పంతో ముందుకు సాగుతూ యువత అంటే ఇలానే ఉండాలి అనే స్ఫూర్తిని ప్రతివో ఒక్కరిలో కలిగిస్తూ పోత్కపల్లి యువత ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి
సామజిక కార్యకర్త

కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట…

కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట

చీఫ్ ఇంజనీర్ ప్రకాష్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లో బాగంగా చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో కెటిపిపి దుర్గాదేవి ఉత్సవ కమిటీ వారు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ కెటిపిపి విద్యుత్ కేంద్రం లో దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు అన్ని కుటుంబాలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆడుతూ పాడుతూ విధులు నిర్వహించేలా క్షేమంగా ఉండేలా చూడాలని ఆ దుర్గాదేవి ని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్స్, దుర్గాదేవి ఉత్సవ

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T142630.089.wav?_=4

భక్తుడు భగవంతునికి దాసునిగా మారాలి – విభిషణ్ ప్రభుజీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్) : భగవంతునికి నిత్య దాసునిగా మారి నిజస్థితిని తెలుసుకోవాలని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభిషణ్ ప్రభుజీ ఉద్బోధించారు. కృష్ణ భక్తి భావన మినహా సమస్త కలాపములను త్యజించువారే భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రులవుతారని పేర్కొన్నారు. జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు వీధిలో 173 వ నగర సంకీర్తన వైభవంగా జరిగింది. అనంతరం హనుమాన్ మందిర్ లో జరిగిన సత్సంగ ప్రవచన కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రవచించారు. భగవంతుని దివ్యమైన ప్రేమ యుక్తమైన సేవయే జీవులకు నిజమైన కర్మ అని వివరించారు. కృష్ణ పరమైన కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నీ జనన, మరణ చక్రబంధంలో బంధించబడుతాయని తెలిపారు.

ప్రతి కర్మను శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే ఆచరించాలని హితవు పలికారు. ఈ సందర్బంగా భగవద్గీత సాంఖ్య యోగంలోని 48 వ శ్లోకాన్ని ఉటంకిస్తూ పలు ఉపమానాలను వివరించారు. భక్తులు అడిగిన పలు ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేశారు. అంతకుముందు శ్రీకృష్ణ కీర్తనలు ఆలపిస్తూ బసవేశ్వర వీధి లో శోభాయాత్ర నిర్వహించారు. కీర్తనలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తులు తన్మయ్యత్వంలో మునిగిపోయారు.భువన సంగీత మోహనంగా సాగిన ఈ సంకీర్తన లో బెజుగం లక్ష్మణ్, స్వస్తిక్ రెస్టారెంట్ మహేందర్ గోడకే ప్రసాద వితరణ చేశారు.

ఇదిలాఉండగా మండలంలోని హుగ్గెల్లి గ్రామంలోనూ 138 వ పల్లె సంకీర్తన అట్టహాసంగా జరిగింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గ్రామం ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T140342.321.wav?_=5

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటి ధాత్రి

 

ఓదెల మండలం లోని ఓదెల, పోత్కపల్లి, మడక , కనగర్తి, గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్య పల్లి, కొలనూర్, గోపరపల్లి, హరిపురం, లంబాడి తండా, నాంసానిపల్లి, అబ్బిడిపల్లి, జీలకుంట, శానగొండ, రూపు నారాయణపేట, ఇందుర్తి, గుంపుల, గూడెం, బాయమ్మపల్లి, భీమరపల్లి, ఉప్పరపల్లి గ్రామాలతో పాటు ఇతర గ్రామాలలో తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదనీ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ అని మహిళలు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నేటి నుండి 9 రోజులు ఆడే బతుకమ్మ పండుగ ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు కోలాటం,ఆట పాటలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే ఆట పాటలతో పాడారు.

రేవన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T135042.836.wav?_=6

 

రేవన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో శ్రీ రేవన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు శ్రీ చండికాంబ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం. మరియు దుర్గా హోమం నిర్వహించినారు ఆలయ అర్చకులు శ్రీ రేవన సిద్దయ్య స్వామి బసవరాజ్ స్వామి లింగం గౌడ్ దంపతులు పూజలు నిర్వహించినారు.

 రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..

 రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..

 

 

ఆ గుడిలో ఏకంగా 230 తలైవా ప్రతిమలు ఉన్నాయి. వాటిని 15 వరసల్లో ఏర్పాటు చేశాడు. పది వరుసల్లో రజినీకి సంబంధించిన టాప్ ఫొటోలు ఉన్నాయి.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తలైవాకు ప్రపంచం నలుమూలలా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్‌కు రజినీ అంటే పిచ్చి అభిమానం. ఆయన కోసం ఏదైనా చేసేస్తారు. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ ఫ్యాన్ తన అభిమాన హీరో రజినీకాంత్ కోసం కొన్నేళ్ల క్రితం గుడి కట్టాడు. రజినీ విగ్రహానికి ప్రతీరోజూ పూజలు చేస్తున్నాడు. ఇప్పుడు నవరాత్రి సందర్భంగా ఏకంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని మధురైకి చెందిన కార్తీక్ అనే వ్యక్తికి రజినీకాంత్ అంటే చిన్నప్పటినుంచి పిచ్చి అభిమానం. అతడు పెరిగేకొద్దీ అభిమానం పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే అతడు ఓ వినూత్న పనికి తెరతీశాడు. కొన్ని నెలల క్రితం తలైవా కోసం ఓ చిన్న గుడిని నిర్మించాడు. అందులో రజినీ విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తూ ఉన్నాడు. అయితే, ఈసారి మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశాడు. నవరాత్రి సందర్భంగా రజినీ గుడిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు.

ఘనంగా ఊరంతా బొడ్డెమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T145718.954.wav?_=7

 

ఘనంగా ఊరంతా బొడ్డెమ్మ సంబరాలు…!

మొదలాయే… ప్రకృతిని ఆరాధించే పండగ…

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ బస్టాండ్ సెంటర్ తోట బజార్ లో తొమ్మిది రోజులపాటు నిర్వహించే బొడ్డెమ్మ పండగ వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బొడ్డెమ్మ మరియు బతుకమ్మ పండగ రానే వచ్చింది.

 

 

 

ఈ పండగ వస్తే తెలంగాణ మహిళలకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పొద్దంతా ఎన్ని పనులు చేసి అలసిపోయిన సాయంత్రం సంధ్యా సమయం అయిందంటే వారి ఆనందాలకు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా వాళ్ళ యొక్క సంబరాలు భక్తి పాటలతో జానపద గేయాలతో లయబద్ధంగా ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలవుగా అన్నట్టు ఊరు ఊరంతా వాడవాడలా బొడ్డెమ్మ సంబరాలు మహిళలు ఎంతో జోరుగా హుషారుగా బొడ్డెమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. మహిళలు ఎంతో ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు అమావాస్యకు పితృపక్ష రోజులలో గౌరీ దేవికి అత్యంత పవిత్రమైన రోజులుగా భావించి నిర్వహించే బొడ్డెమ్మ పండుగ వేడుకలను కన్నె పిల్లలు,మహిళలు సాయంత్రం సంధ్యా సమయములో పుట్ట మట్టి తీసుకొని వచ్చి తొమ్మి దొంతరలు లేదా ఐదు లేదా మూడు అమ్మవారి ప్రతిరూపంగా భావించి (గద్దెలుగా) పేర్చి తయారుచేసి ఎర్రమట్టితో అలికి, పసుపు, కుంకుమ పూలతో అలంకరించి గౌరీ దేవి రూపంలో తల్లికి తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఆటపాటల కోలాటాలతో నిర్వహిస్తారు. బొడ్డెమ్మ చరిత్ర కొన్ని కథనాల ప్రకారం బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ కంటే ముందు నుంచి ఉంది అని చరిత్ర చెబుతోంది, క్రీస్తుశకం 8వ శతాబ్దంలో అంతకంటే ముందు నుంచే ఈ పండుగ ఆచరణలో ఉందని భావిస్తున్నారు. రామాయణ ,మహాభారత, భాగవత ఘట్టాలను, శివపార్వతి, సీతారాముల కళ్యాణ ఘట్టాలను జానపదుల పాటల రూపంలో బొడ్డెమ్మ పండుగలో కోలాటాల ఆటపాటలతో జరుపుకున్నారని.ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిలో ప్రకృతిని ప్రకృతి ఇచ్చే పూలతో ప్రకృతిని ఆరాధించడమే ఈ బొడ్డెమ్మ, బతుకమ్మ పండగ అని పురాణాలు చెబుతున్నాయి, ఈ బొడ్డెమ్మ పండగ ఒక భాగం ఇది మహిళలు తమ సాంస్కృతిక సాంప్రదాయాలను గుర్తించుకోవడానికి ఆనందించడానికి ఒక వేదికగా అందిస్తుంది.

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.

గణనాధుని ప్రత్యేక పూజల్లో సమ్మి గౌడ్ చిలువేరు

గణనాధుని ప్రత్యేక పూజల్లో సమ్మి గౌడ్ చిలువేరు

సమ్మి గౌడ్ చేతులమీదుగా లడ్డు లక్కీ డ్రా -విజేతలకు అందజేత

సభ్యులందరికీ సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్ట్ లు అందజేత

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ లో కేసరి మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపానికి యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొని గణనాధుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు కాంగ్రెస్ మండల నాయకులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసరి మిత్ర యూత్ సభ్యులు, విలేజ్ కేసముద్రం గ్రామ ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు ఆ వినాయకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం లడ్డు పాట వేలం వేయగా లడ్డు, కలశం, పంచ కండువాలు చీటీ డ్రా సమ్మి గౌడ్ చేతుల మీదుగా తీసి గణపతి లడ్డు గెలుచుకున్న కొలిపాక గోపి,కలశం గెలుచుకున్న వేల్పుల శ్రీ హర్ష,పంచ,కండువా గెలుచుకున్న నార బోయిన రమేష్ లకు అందజేయడం జరిగింది.అన్నా అంటూ ఆదరిస్తున్న కేసరి యూత్ సభ్యులు అడిగిన వెంటనే స్పందించి వారికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్టులను అందజేశారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ… మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మా అన్న సమన్నకు ఎల్లవేళలా మేము తోడుంటామని, అదేవిధంగా ఆ ఏకదంతుని ఆశీస్సులు సమ్మి గౌడ్ అన్నకు తన ఆశయాలు నెరవేర్చడంలో తోడ్పడాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డొనికల రాజు, కొమ్ము నరేష్,ఎస్కే తాజా,ఎస్ కే యాకూబ్, నాగరాజు,సందీప్, సాయి,దాసరి సందీప్,సిహెచ్ సురేష్, శ్రీనాథ్,ఈశ్వర్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం..

వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం

నర్సంపేట,నేటిధాత్రి:

 

గణపతి నవరాత్రుల ఉత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండలోని తన నివాసంలో గణనాథున్ని ప్రతిష్ఠించుకొన్న కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు.శుక్రవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టగా గణనాథుడికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దంపతులు వీడ్కోలు పలికారు.కాగా ఎమ్మెల్యే దొంతి కుమార్తె అనన్యరెడ్డి హన్మకొండ పద్మాక్షమ్మగుట్ట వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.

భూపాలపల్లి 24వ వార్డులో గణపతి మహా అన్న ప్రసాదం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T150800.078.wav?_=8

24 వార్డులో మహా అన్న ప్రసాదం కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24 అవార్డు కారల్ మార్క్స్ కాలనీలో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మహా అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ,నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ, మనలో ఏకత్వాన్ని భక్తి భావాన్ని ,ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండగ మన సంస్కృతి సంప్రదాయాల కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుని కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పోత్కపల్లిలో గణపతి నవరాత్రి మహా అన్నదానం…

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో గోపికృష్ణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.సంఘం అధ్యక్షుడు డబ్బేట మల్లేశం మాట్లాడుతూ, గణపతి నవరాత్రులు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీక. ఇలాంటి సమయాల్లో అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి, సేవ, సౌహార్దం పెంపొందుతుంది. గ్రామంలో సామాజిక స్ఫూర్తిని పెంచడం గోపికృష్ణ పద్మశాలి సంఘం ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు. మహా అన్నదానంలో గ్రామస్తులు, చిన్నలు పెద్దలు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ వద్ద మహా అన్నదానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T130836.794-1.wav?_=9

ఘనంగా ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

* శివరాజ్ యాదవ్ కుటుంబ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, నియోజకవర్గ పట్టణ పరిధిలో కాంతా రెడ్డి కాలనీ బాలాజీ నగర్ సమీపంలో గల ఓం శ్రీ సాయిఅగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం దగ్గర మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కాంతారెడ్డి కాలనీకి చెందిన శివరాజ్ యాదవ్ వారి కుటుంబ సభ్యులతో నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఈ అన్నదానం కేవలం ఆహారం అందించడం కాదు, ఇది ఒక గొప్ప పుణ్య కార్యమని, అన్నదానం ద్వారా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఒక గొప్ప సంతృప్తి లభిస్తుంది. అన్నదానం చేయడం ద్వారా, మన గత కర్మలను తొలగించవచ్చని అదేవిధంగా అన్నదానం స్వీకరించిన వారి ఆశీర్వాదాలు మన జీవితంలో సాను కూలతను తీసుకు వస్తాయి. అన్నదానం ద్వారా ఇతరులకు ఆహారం అందించడం ద్వారా వారి జీవితాన్ని ఇచ్చే అవకాశం లభిస్తుంది అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు తలారి సందీప్, ఉప్పరి మహేందర్, బి. సంతోష్, తరుణ్, ధనరాజ్, వినయ్ కుమార్, ఉప్పరి దత్తు, సాయి కుమార్, సాయి చరణ్, ప్రణీత్ కుమార్, లడ్డు, తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.

గణపతికి 2000 దీపాల అంకితం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T124309.891-1.wav?_=10

2 వేల దీపాలతో గణపతికి అలంకరణ

భూపాలపల్లి నేటిధాత్రి

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో మహిళలు ఆరవ రోజు గణపతికి అంగరంగ వైభవంగా దీపాలంకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీలోని 200 మంది వరకు మహిళలు పాల్గొని గణపతికి 2000 దీపాలతో అలంకరణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ,నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ, మనలో ఏకత్వాన్ని భక్తి భావాన్ని ,ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండగ మన సంస్కృతి సంప్రదాయాల కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version