పేదింటి బిడ్డలకు రేషన్ కార్డు వరప్రదాయిని
మరిపెడ మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్.
డోర్నకల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపిన ఎమ్మెల్యే.
మరిపెడ నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మండల కేంద్రంలో ని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభ లో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని, మండలలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 1790 మంది అర్హులైన లబ్దిదారులకు ఆహార భద్రత పథకం కింద కొత్త రేషన్ కార్డులు అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల పట్ల తీవ్ర అన్యాయం చేశాయి. గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వ లేదు. పేదలు ఎన్నిసార్లు ప్రయత్నించినా,వారి సమస్యలను పెదవిపైకి తీసుకురాలేకపోయారు. కాని ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ పాలనలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యల పరిష్కారానికి నడుంబిగించింది అన్నారు. ఆహార భద్రతతో పాటు, రేషన్ కార్డు ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని,ఇది న్యాయమైన హక్కుగా పరిగణించాలని అన్నారు. ప్రజా పాలనలో ఇచ్చిన హామీల ప్రకారం రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, కాస్మోటిక్ చార్జీలు,నాణ్యమైన విద్య అందివ్వడం జరుగుతుందన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరింది అన్నారు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతి వార్డు ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు, రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు రాని లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని,ఇది నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు,పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు,ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్,తాసిల్దార్ కృష్ణవేణి,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,ఆర్ఐ శరత్ చంద్ర గౌడ్,అగ్రికల్చర్ ఆఫీసర్ వీరా సింగ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి యువ నాయకులు అభినవరెడ్డి, రామ్ లాల్,అంబరీష,నల్లు శ్రీకాంత్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిలమల్లు, మరిపెడ పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, రవి నాయక్,శ్రీపాల్ రెడ్డి,కాలం శ్రీనివాస్ రెడ్డి,అఫ్జల్, మండల రేషన్ డీలర్ల యూనియన్ అధ్యక్షులు,యూనియన్ సభ్యులు,లబ్ధిదారులు,వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్దిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లబ్దిదారులు తమకు రేషన్ కార్డు అందించిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.