స్కానింగ్ సంబంధిత పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలి

స్కానింగ్ సంబంధిత పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో సాంకేతిక వైద్య నిపుణులు, సిబ్బంది,స్కానింగ్ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా అడ్వైజరీ కమిటీ చైర్ పర్సన్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత అన్నారు.శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షలు,పిసిపి ఏంటి యాక్టివ్ పై ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.అరుణశ్రీ,జిల్లా పౌర సంబంధాల అధికారి యం.కృష్ణమూర్తి లతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో పి సి పి ఎన్ డి టి యాక్ట్ ప్రకారం 53 స్కాన్ కేంద్రాలు పని చేస్తున్నాయని, ఇందులో 4 ప్రభుత్వ పరంగా, 49 ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు స్త్రీ వైద్య నిపుణులు, రేడియాలిస్టులు,సూపర్ స్పెషలిస్టులు ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి స్కానింగ్ కేంద్రంలో స్కానింగ్ పరికరము నిర్వహిస్తున్న వైద్యుల వివరములు నమోదు అయి ఉండాలని,అదే విధంగా ప్రతి కేంద్రంలో లింగ నిర్ధారణ పైన తీసుకుంటున్న చర్యల వివరాలపై ఫ్లెక్సీ,పోస్టర్ల ద్వారా అవగాహన కలిగించాలని తెలిపారు.లింగ నిర్ధారణ చేయబడదు,చెప్పబడదు, అడిగిన వారికి,చెప్పిన వారికి యాక్ట్ ప్రకారంగా చర్యలు చేపట్టబడును అని వివరాలను ప్రదర్శించాలని, స్కానింగ్ కేంద్రంలో గర్భవతులకు కుర్చీలు, త్రాగునీటి సౌకర్యము కల్పించాలని,వైద్యుల వివరాలు,రుసుముల వివరాలు గోడ పై అతికించాలని తెలిపారు.గర్భవతుల స్కానింగ్ పూర్తి వివరాలను ఫార్మ్ ఆఫ్ లో నమోదు చేయాలని,స్కానింగ్ చేసుకుంటున్న గర్భవతి సంతకం తీసుకోవాలని,ప్రైవేట్ ఆసుపత్రులు,స్కానింగ్ కేంద్రాలు గర్భవతులకు,తల్లులకు,ఇంటి వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.కమిటీ సభ్యులు అడిగిన ప్రకారంగా మండలాల వారిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని,గోడ ప్రతులు,కరపత్రాలు,స్థానిక ఛానళ్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.బర్త్ రూట్ ఆసుపత్రికి సంబంధించిన స్కానింగ్ మెషిన్ ను అప్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు.పిసిపి ఏంటి పోర్టల్ లో వచ్చిన వివరాలను తెలియజేసి తగు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో గర్భవతులకు చేసే స్కానింగ్ మాత్రమే కాకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యులు చేస్తున్న వారి స్కానింగ్ వివరములు కూడా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హీల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఎన్.జి.ఓ. డా. చుంచు రాజ్ కిరణ్,గైనకాలజిస్ట్ డా. నలుమాసు శ్రీదేవి,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,గైనకాలజిస్ట్లు పెడియాట్రిషన్లు,ఫిజీషియన్లు, డిపిఓ ప్రశాంతి,సిహెచ్ఓలు వెంకటేశ్వర్లు,దిశా సమన్వయకర్త రమేష్,సుమన్,సీనియర్ అసిస్టెంట్ హారిక,డిపిహెచ్ఎన్ పద్మ, వసుమతి మార్తా,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి టెస్ట్ లు..

రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి టెస్ట్ లు

గర్భిణి స్త్రీలకు హెచ్ఐవి నిర్ధారణ,తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి

పరకాల ఓఆర్డబ్ల్యు వీణ

పరకాల,నేటిధాత్రి

పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నుండి నిర్మూలన దిశగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఓఆర్డబ్ల్యు వీణ ఆధ్వర్యంలో పట్టణంలో హెచ్ఐవి టెస్టులు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాపీ మేస్త్రి మరియు లేబర్స్ దగ్గర హెచ్ఐవి టెస్టులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1064 సమగ్ర కౌన్సిలింగ్ మరియు పరీక్ష కేంద్రాలు ఐసిటిసి మరియు 871 ఎఫ్ఐసిటిసి ల ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా 11మొబైల్ ఐసిటిసి వాహనాల ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం అధికంగా ఉన్న ప్రాంతాలలో ఉచితంగా హెచ్ఐవి పరీక్షల నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది సంపూర్ణ సురక్ష కేంద్రాల ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా ద్వారా హెచ్ఐవి మరియు ఎస్టిఐ లకు సంబంధించిన ఉచిత సేవలు ఒకే చోట అందించడం మరియు హెచ్ఐవి ఎట్ రిస్క్ నెగిటివ్ క్లైంట్లను సమయాలుసారంగా ఫాలోఅప్ చేస్తూ రెండు సంవత్సరాల వరకు వారిని నెగటివ్గా కొనసాగించడం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా గుర్తించబడిన ప్రైవేటు ఆసుపత్రులలో గర్భిణి స్త్రీలకు హెచ్ఐవి నిర్ధారణ మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు.

 గర్భిణులకు జున్ను మంచిదేనా..

 గర్భిణులకు జున్ను మంచిదేనా..

 

జున్ను అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది.

ఇంటర్నెట్ డెస్క్: జున్ను అనేది మనం బాగా ప్రాధాన్యం ఇచ్చే ఓ పాల పదార్థం. ఇది పాలు గడ్డకట్టడం ద్వారా తయారయ్యే ఒక పాల ఉత్పత్తి. ఇది ఎముకల బలం కోసం కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. జున్ను రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఆవు లేదా గేదె దూడను కన్న కొద్ది రోజుల తర్వాత ఇచ్చే పాలను ఉపయోగించి జున్ను తయారు చేస్తారు. దీనికి ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటుంది. అయితే ఈ జున్నును గర్భిణులు తీసుకోవడంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. నిజానికి, జున్ను పోషకాల నిధి అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్…

రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

పసిపిల్లలలో రోగ నిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్ టీకాలు ఉపయోగపడతాయని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ అన్నారు. నిజాంపేట మండలం నగరం తండా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పసి పిల్లలకు టీకాలు, వ్యాక్సినేషన్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బిపి షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం నిర్మల, అంగన్వాడి టీచర్ స్వప్న ఆశ వర్కర్లు ఉన్నారు.

హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం….

హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం

మొబైల్ ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం

శాయంపేట నేటిధాత్రి:

 

ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గ్రామ స్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి హెచ్ ఐవి ఎయిడ్స్, టిబి, సిఫిలిస్, హెచ్ బీ ఎస్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ట వివక్ష చూపవద్దని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపవద్దని, వ్యాధిగ్ర స్తులకు అందించే చికిత్స గురించి తెలియజేశారు. హెచ్ఐవి వస్తే ఏఆర్ టి ద్వారా మందులు వాడి నిజజీవితాన్ని గడపవచ్చు. ప్రతి గర్భవతి దగ్గర ఉన్న ఐసీటీసీ సెంటర్ కు వెళ్లి హెచ్ఐవి పరీక్ష చేయించు కోవాలి.ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినందన్ రెడ్డి, ఏఎన్ ఎం సునీత, కుమార స్వామి, సిఎల్ డబ్ల్యూ స్వప్న, వీరన్న, మైలారం వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు….

ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం లోని కాల్వపల్లి అంగన్వాడీ కేంద్రంలో తిరుమల, విజయ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశానికి జయప్రద సూపర్వైజర్ హాజరై అంగన్వాడీ కేంద్రాలలో జరుగు కార్యక్రమాలు పూర్వ ప్రాథమిక విద్య, సంపూర్ణ భోజనం, పిల్లల బరువు, ఎత్తులు, లోప పోషణ, బాల్యవివాహాలు, దత్తత, కిశోర బాలికల చదువు, వృత్తి విద్య కోర్సులపై అవగాహన కల్పించనైనది. ఇందులో భాగంగా ఒక గర్భవతికి శ్రీమంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ సృజన మహిళలు, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి ,ఫర్జానా హాజరైనారు

తంగళ్ళపల్లిలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార అవగాహన

పోషక ఆహారాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

Vaibhavalaxmi Shopping Mall

తంగళ్ళపల్లి మండలంలో. పోషణ మాసం కార్యక్రమం పురస్కరించుకొని. సరైన పోషణ ఆహారంతో. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా. తీర్చిదిద్దాలని నినాదంతో.C.D.P.O. ఉమారాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు 0….6. పిల్ల తల్లులకు. పోషణ ఆహారంపై. అవగాహన చేస్తూ. ఉమారాణి మాట్లాడుతూ ఆరోగ్యం మనది కొనుక్కునేది కాదు అని. సంపాదించుకునేదని. ఆరోగ్యం అనేది అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారమని. పోషకరమైన ఆహారాలు తీసుకున్నప్పుడు. ఆరోగ్యం బాగుంటుందని. అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చే. ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని. అలాగే ఫ్రీ స్కూల్ లోకి అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను పంపించాలని. ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను. అందిస్తారని. వీటిని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో.C.D.P.O. ఉమారాణి. సూపర్వైజర్ అంజలి. అంగన్వాడీ టీచర్స్.B. సత్యవతి. P. శోభ.R. లతా. G. పుష్పలత.N. పద్మ.S. శారదా. గర్భిణీలు స్త్రీలు బాలింతలు.పిల్లలు తదితరులు పాల్గొన్నారు

పిల్లలకు పౌష్టికాహారం అందివ్వాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T130809.774.wav?_=1

 

పిల్లలకు పౌష్టికాహారం అందివ్వాలి

అంగన్వాడి సూపర్వైజర్ పి అరుణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీలో పోసిన మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ స్వప్న సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన అంగన్వాడి సూపర్వైజర్ పి అరుణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్ల తల్లులు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందివ్వాలి ఆకుకూరలు పప్పు అంగన్వాడి నుండి వచ్చే ఫుడ్డును పిల్లలకు అందివ్వాలి భోజనానికి ముందు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఈగలు రాకుండా ఇంటి ఆవరణ చుట్టుపక్కల శుభ్రంగా చేసుకోవాలి లా చేయడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

ఘనంగా పోషణ మాస కార్యక్రమం…

ఘనంగా పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం గుర్రంపేట అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ దేవిక కల్పన విజయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలకు ఆకుకూరలు పప్పు కూరలు తినిపించాలి అంగన్వాడి నుండి వచ్చే కోడిగుడ్లు బాలమృతం వాటిని పిల్లలకు తరచుగా తినిపియ్యాలి అని సూచించారు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత పిల్లలకు గంట తర్వాత తల్లిపాలు పట్టించాలి దాని ద్వారా చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని వారు అన్నారు

ఘన పోషణ మాస కార్యక్రమం

ఘన పోషణ మాస కార్యక్రమం

సూపర్వైజర్ అరుణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం పెద్దాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు స్త్రీలు బాలింతలు చిన్న పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంగన్వాడి కేంద్రం నుండి వచ్చిన ఫుడ్డును పిల్లలకు తినిపించాలి దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు అనంతరం అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ విజయలక్ష్మి. వనిత బీ లక్ష్మి రమాదేవి అంగన్వాడి ఆయా రమ ఆశ వర్కర్స్ సుకన్య కోమల గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం….

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలు, గుడ్డు,తాజా ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు తగిన పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలని అప్పుడే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలు, మహిళలతో ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, ఆయమ్మ,గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు మహిళలు పాల్గొన్నారు.

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం…

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం

కేసముద్రం/ నేటిదాత్రి

 

కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు తెలిపారు..
గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, “మీ పేరేంటి… నాకోసం ఎదురు చూస్తున్నారా?” అంటూ వారిని పలకరించారు. తరువాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణలోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిశోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీలువివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిశోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని అధికారుల నుండి సమాచారం అందుకున్న ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ బావుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పోషణ మాసంలో భాగంగా సీమంతాలు చేసి ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ సుఖ ప్రసవాలతో పాటు ఆరోగ్య వంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు.
అంతకు ముందు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఎలాంటి వ్యాధులకు సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశాలకు ఆశా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు విచ్చేసిన ప్రభరి అధికారి పౌసమి బసుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సిపిఓ బాబురావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఉప వైద్యాధికారి డా శ్రీదేవి, డా ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

సమాచార హక్కు చట్టంపై అంగన్వాడిలో అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో
పోషణ మాసం సందర్భంగా నర్సంపేట -3 అంగన్వాడి కేంద్రంలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు సిడిపిఓ మధురిమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పౌరులు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ద్వారా ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రతి తల్లి తన బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చడంతోపాటు, సామాజిక చైతన్యం కూడా అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట సెక్టార్ సూపర్ వైజర్ రమ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి,స్థానిక అంగన్వాడీ టీచర్ శిరీష,అనిల్ కుమార్, సారయ్య, రాజేష్, శివ, సరోజన, నవ్య, శివాణి, శ్రావణి, రవళి, సుష్మ, ఫర్జానా, రజిని, వనిత,అంగన్వాడీ టీచర్స్ రమ, పద్మ,వాణి, సరస్వతి ఆయా చంద్రకళ,గర్భిణీ, బాలింత స్త్రీలు, తల్లులు, కిషోరబాలికలు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం…

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పకీరు గడ్డ అంగన్వాడీ టీచర్ ప్రమీల ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ పోషణ మాస కార్యక్రమం అనేది ఈరోజు అంగన్వాడి సెంటర్లో నిర్వహించడం జరిగింది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి అంగన్వాడి నుండి ఇచ్చే బొడ్డును పిల్లలకు అరువుగా అందివ్వాలి. దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంగన్వాడి నుండి వచ్చే పోషణ మాస వస్తువులను ప్రతి ఒక్కటి తీసుకుంటే తల్లి తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని తెలిపారు అలాగే
అంగన్వాడి కేంద్రమును ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అందరూ అవసరమైన సేవలు వినియోగించుకోవాలి డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు పిల్లలకు
గంటలోపు మూర్రిపాలు పట్టించాలి ఏడవ నెల నుంచి అనుబంధ ఆహారము, తల్లిపాలతో పాటుగా ఇవ్వాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో శోభారాణి ఘటన గర్భిణీలు పిల్ల తల్లులు పాల్గొన్నారు

పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం…

పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల అంగన్వాడి కేంద్రంలో లో పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ..గర్భిణీ, బాలింతలు,పిల్లలు,కిషోర బాలికలతో పాటుగా ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.తాజా పండ్లు,కూరగాయలు,పాలు తీసుకోవాలని,రక్త హీనత బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని కోరారు.అలాగే పిల్లలకు బయటి జంక్ ఫుడ్ కొనివ్వకూడదని,వాటి వల్ల తరచూ అనారోగ్య బారిన పడి ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. పిల్లలు వయసుకు తగిన ఎదుగుదల ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం గర్భిణీ మహిళతో పోషణ మాసం ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి,అంగన్వాడి టీచర్స్ వరలక్ష్మీ,సునీత,శ్రీవాణి,ఆయా పిల్లలు,గర్భిణీలు,బాలింతలు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోధనెల్లి గ్రామంలో వైద్య శిబిరం…

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోధనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటిదాత్రి చర్ల

చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బోధనెల్లి గ్రామంలో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ
గ్రామంలోని ఇంటింటికి రాపిడ్ ఫీవర్ సర్వే చేస్తూ డ్రై డే కార్యక్రమాలు చేయించడం జరిగింది
జ్వరాలు వస్తే ఆశ్రద్ధ చెయ్యకుండా పి హెచ్ సి రావలెను మరియు అన్ని పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి అని గ్రామంలోని ప్రజలకు తెలియజేశారు
అలాగే వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
నీళ్లు నిల్వలేకుండా చూసుకోవలని
దోమ తెరలను వినియోగించుకోవాలని
ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని అన్నారు
గర్భిణి స్త్రీలను పరీక్షించి అవసరమైన పరీక్షలు చేశారు
ముగ్గురికి జ్వరం ఉన్నది వారికి ఆర్డిటీ మలేరియా పరీక్షలు చెయ్యడం జరిగింది వారికి మలేరియా లేదని వారికి మాములు జ్వరంగా నిర్దారించి మందులు ఇవ్వడం జరిగింది
మరియు 32 మందికి సాధారణ వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
హెచ్ ఈ ఓ బాబురావు
ఎం ఎల్ హెచ్ పి సంధ్య
ఏఎన్ఎమ్ కవిత
హెల్త్ అసిస్టెంట్ వరప్రసాద్
ఆశా కార్యకర్తలు
తదితరులు పాల్గోన్నారు

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T152052.705-1.wav?_=2

 

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలి

బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా కొనసాగిందని ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం ప్రవేశపెట్టిందని ఆ పథకం వల్ల గర్భిణీ స్త్రీలకు రెండు విడతల్లో అంగన్వాడి కేంద్రాల ద్వారా సుమారు 5000 రూపాయలు వారికి అందించే అవకాశం ఉంటుందని నవీన్ రావు అన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల 12 సంవత్సరాల పాటు నిరుపేద కుటుంబాల మహిళలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తల్లి పాల వారోత్సవాలు….

తల్లి పాల వారోత్సవాలు

చిట్యాల, నేటిధాత్రి ;

చిట్యాల మండలంలోని జూకల్ వన్ సెంటర్ల లొ తల్లిపాల వారోత్సవాలొ భాగంగా గర్భవతి, బాలింతల, బరువు ,ఎత్తు చూసి వ్యక్తిగత శుభ్రత లొ భాగంగా ఆరు పద్ధతుల ద్వారా పిల్లలు, తల్లుల చేతులు కడిపించడం జరిగింది గర్భవతి దశనుండి తీసుకోవలసిన ఆహారం ఆరోగ్య ,ప్రభుత్వ హాస్పటల్ డెలివరీ గూర్చి వివరించనైనది . మంగళవారం రోజున ప్రోగ్రాం ఇంటింటా తిరిగి కుటుంబ సభ్యులందరికీ మిగతా టీచర్స్ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అరుణ , కరుణ,మమత ,రజిత ,సరిత ,విజయలక్ష్మి, టీచర్స్ పాల్గొనడంజరిగింది.

ఘనంగా తల్లిపాల వారోత్సవ దినోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T165836.799.wav?_=3

ఘనంగా తల్లిపాల వారోత్సవ దినోత్సవం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడి టీచర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ ఈనెల ఫస్ట్ తారీకు నుండి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి కేవలం ఆరు నెలల వరకే తల్లిపాలు ఇవ్వాలని బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని పోషక ఆహారం తీసుకున్నట్లయితే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు కమల పిల్లలకు కూడా సమానంగా తల్లి పాలు ఇవ్వవచ్చని ఆరు నెలల వరకు కూడా తల్లికి పాలు సరిపోను ఉంటాయని అన్నారు కార్యక్రమంలో ఏఎన్ఎం సాయి సుధా గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version