అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి…

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్

పరకాల,నేటిధాత్రి

 

30న తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గత8సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులపై పోరాటం చేస్తున్నామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టినటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు,కమిటీ వేస్తానని చెప్పి సంవత్సరాలు కావస్తున్న కూడా కమిటీ వేయడం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీని ముట్టడికి సిద్ధమాయ్యమన్నారు.తెలంగాణలోని ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా కచ్చితంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్ర కొమురయ్యని గెలిపించండి…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్ర కొమురయ్యని గెలిపించండి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బుర్ర కొమురయ్యని
భారీ మెజార్టీతో గెలిపించాలని వారు అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో వార్డులో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపియగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జహీరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రఫీ నామినేషన్

జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రఫీ నామినేషన్ దాఖలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డు నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా, జహీరాబాద్ ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రెటరీ, మహమ్మద్ రఫీ తన నామినేషనన్ను దాఖలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, గతంలోనూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేశానని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనను 14వ వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డు మరియు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని, 14వ వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తనను పతంగి గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు,యువకులు,కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. పాల్గొన్న వారందరికీ మొహమ్మద్ రఫీ ధన్యవాదాలు తెలిపారు.

ఘనంగా ‘సి.ఎం కప్’ క్రీడాజ్యోతి ర్యాలీ..

ఘనంగా ‘సి.ఎం కప్’ క్రీడాజ్యోతి ర్యాలీ..

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

క్రీడాజ్యోతి అనేది క్రీడా కార్యక్రమానికి ఒక ఉత్సాహభరితమైన ప్రారంభాన్ని ఇచ్చే సంప్రదాయం, దీనిలో జ్యోతిని వెలిగించి, దానిని ర్యాలీ రూపంలో తీసుకెళ్తారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించి, వారి ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన శిక్షణ అందించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక కార్యక్రమం, దీని ద్వారా క్రీడలను ప్రోత్సహించి, అథ్లెట్ల సంఖ్యను పెంచి, పతకాలు సాధించేలా ప్రోత్సహించాలని తెలంగాణ క్రీడల విధానం సూచిస్తుంది, దీనిలో భాగంగానే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (SATG) ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ గారు క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం క్రీడాజ్యోతి ర్యాలీ బయ్యారం, గూడూరు నుండి కొత్తగూడ మండలంలో
ఎం ఈ వో ఆఫీస్ చేరుకుంది. తదుపరి డి.వై.ఎస్.ఓ డాక్టర్ జ్యోతి గారు క్రీడాజ్యోతిని ఎంపీడీవో దీపికకు అందజేశారు. అనంతరం క్రీడాజ్యోతిని తీసుకుని ర్యాలీగా కొత్తగూడ మెయిన్ రోడ్డు వరకు చేరుకొని కొత్తగూడ ఎం పి డి వో కార్యాలయం వైపుగా క్రీడాజ్యోతి కొనసాగింది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాలు జ్యోతి ర్యాలీగా వెళుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజ్ కుమార్, ఎంఈఓ గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆశ్రమ స్కూల్ హెచ్ఎం ఆదిలక్ష్మీ, పిడీ వి. మాధవి, భూర్క నారాయణ, తదితరులు పాల్గొన్నారు

అత్నూర్ సర్పంచ్ అభ్యర్థి మొహమ్మద్ కలిముద్దీన్ నామినేషన్ దాఖలు..

అత్నూర్ సర్పంచ్ అభ్యర్థి మొహమ్మద్ కలిముద్దీన్ నామినేషన్ దాఖలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల
అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మొహమ్మద్ కలిముద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. మొహమ్మద్ యునుస్ గ్రామ పెద్దలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు.సహాయ సహాకారాలతో అత్నూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ లక్ష్యమని నాయకులు తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మొహమ్మద్ కలిముద్దీన్ వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఝరాసంగం సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్ ఆర్, వినోద నామినేషన్ దాఖలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T114748.307-1.wav?_=1

 

ఝరాసంగం సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్ ఆర్, వినోద నామినేషన్ దాఖలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల గ్రామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బాలరాజ్ ఆర్, వినోద నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు.మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ సహాయ సహాకారాలతో ఝరాసంగం గ్రామాన్ని అభివృద్ధి చేయడం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ లక్ష్యమని నాయకులు తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని బాలరాజ్ ఆర్, వినోద వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో సిఐటియుసి కార్మిక ర్యాలీ ప్రారంభం

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిఐటియుసికరపత్రిక ఆవిష్కరణ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిఐటియుసి ఆధ్వర్యంలో కరపత్ర o ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ. కార్మికుల హక్కుల సారధి పోరాటాల వారధి సిఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగవ మహాసభలు నవంబర్ 30వ. తేదీన ఆదివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్ డి ఓ ఆఫీస్ నుండి పెద్ద ఎత్తున బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలకు సిఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ అక్క సిఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండలం నుండి కార్మికులు బీడీ కార్మికులు ఆశా వర్కర్లు అమాలి సంఘం నాయకులు వస్త్ర వ్యాపార కార్మికులు కార్మికులందరూ తంగళ్ళపల్లి గ్రామం నుండి ఆర్ డి ఓ ఆఫీస్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి నాలుగవ మహాసభలు సిఐటియుసి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచు ఏఐటీయూసీ తరఫున మండల కేంద్రంలోని కరపత్రం విడుదల చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో అన్ని రకాల సంబంధిత కార్మికులు పాల్గొన్నారు

సిఐటియు జిల్లా 4వ. మహాసభల విజయవంతo చేయండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T134551.948.wav?_=2

 

సిఐటియు జిల్లా 4వ. మహాసభల విజయవంతo చేయండి

నవంబర్ 29, 30 తేదీలలో సిరిసిల్లలో జరిగే సిఐటియు జిల్లా 4వ,మహాసభల కరపత్రం ఆవిష్కరణ.

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు పక్షాన హ మాలి కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్,మాట్లాడుతూ జిల్లాలో కార్మిక వర్గం, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పక్షాన నిలబడి అనేక సంవత్సరాలుగా కార్మికుల హక్కుల సాధనకై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్న ఏకైక సంఘం సిఐటియు, అటువంటి సిఐటియు 4వ, మహాసభలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు నవంబర్ 29,30 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. కార్మిక వర్గ ఐక్యతను చాటే విధంగా వేలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ-ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పడి చేయడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు సిఐటియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్తు పోరాట కార్యచరణ రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు జిల్లాలోని పవర్లూమ్ కార్మికులు, బీడీ కార్మికులు, హ మాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ మరియు మునిసిపల్ కార్మికులు, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు, హాస్పిటల్ మరియు విద్యుత్ సంస్థలో చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు,, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ వంతు సిఐటియు మహాసభలకు హార్దిక సహాయ సహకారాలు అందించి పోరాటాల వారిది సిఐటియుకు వెన్నుదండగా నిలవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది..ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి,గురిజాల శ్రీధర్, మరియు బూరుగుపల్లి,గ్రామ హ మాలి సంఘం అధ్యక్షులు, సూర్గు నాంపల్లి, కము టం సురేష్, కోరేపు రాజు, కల్లే పల్లి రవి, బరిగే రమేష్, నేరెళ్ళ బాలైయ్య, పెరుమల్ల తిరుపతి, సుదుల గోపాల్, తది తరులు పాల్గొన్నారు.

19న జరిగే సిపిఐ ప్రచార జాతా విజయవంతం చేయాలి…

19న జరిగే సిపిఐ ప్రచార జాతా విజయవంతం చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

సిపిఐ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా ఈనెల 19న జిల్లాలో నిర్వహించే సిపిఐ కళాజాతాను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు నవంబర్ 15న ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాత ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ ప్రచార జాతా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ లు హాజరవుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదిలాబాద్ మంచిర్యాల, గోదావరిఖని, హుస్నాబాద్ హనుమకొండ మీదుగా ఈనెల 19న సాయంత్రం 4:30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి కళాజాత బృందం చేరుకుంటుందని, అదే రోజు 5:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనంతరం రాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే బస చేసి ఉదయం 10 :30 గంటలకు గణపురం నుండి ములుగు జిల్లాకు కళాజాత చేరుకుంటుందని రాజకుమార్ తెలిపారు. కావున జిల్లాలో ఉన్న సిపిఐ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, కూలీలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సిపిఐ కళాజాతాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భారీ బైక్ ర్యాలీ :

ఈనెల 19న సిపిఐ పార్టీ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ప్రచార జాతా లో భాగంగా మంజూరు నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని కళాజాత అతిధులను మంజూరు నగర్ లో భారీ ఆహ్వానం పలికి పైకి ర్యాలీ ద్వారా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మోటపలుకుల రమేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా నాయకులు క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసెఫ్ ఎండి. అస్లాం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఛలో ఇందిరా పార్క్ ధర్నా విజయవంతం చేయాలి…

ఛలో ఇందిరా పార్క్ ధర్నా విజయవంతం చేయాలి

బీసీ జేఏసీ జిల్లా చేర్మెన్ పైడిపెల్లి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీసీ జేఏసీ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ భూపాలపల్లి జిల్లా కమిటి ఛైర్మెన్ పైడిపెల్లి రమేష్ హాజరై అనంతరం
మాట్లాడుతు జస్టిస్ ఈశ్వరయ్య, ఐఏఎస్ చిరంజీవులు, డా. విశారాధన్ మహారాజ్ నాయకత్వం లో జరుగుతున్న బీసీ రిజర్వేషన్ 42% బిల్లు ను 9షెడ్యూల్డ్ లో చేర్చాలని డిమాండ్ తో ఇందిరా పార్క్ లో అక్టోబర్ 24న ధర్నా విజయవంతం చేయాలి జిల్లాలో ఉన్న బీసీ సంఘాల నాయకులకు,వివిధ కుల సంఘాల నాయకులు ఎస్టీ, యస్సి సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేసారు
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మెన్ గట్ల రాజన్న, కన్వీనర్లు జోగు బుచ్చన్న, కో కన్వీనర్లు బర్ల గట్టయ్య,క్యాతరాజు సాంబమూర్తి, అమృత అశోక్, కో ఆర్డినేటర్ శేఖర్ నాని కమిటి సభ్యులు తాటికంటి రవి కుమార్, కొండపర్తి ఇస్తారీ, యాదండ్ల గటయ్య, యూత్ నాయకులు పూర్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం..

బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం:-

42% రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలి వరంగల్ ఉమ్మడి జిల్లా న్యాయవాదుల డిమాండ్:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, అక్టోబర్ 18:-

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన “బీసీ హక్కుల సాధన బంద్” కు వరంగల్–హనుమకొండ జిల్లా న్యాయవాదుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.బంద్ సందర్భంగా, వరంగల్ హనుమకొండ జిల్లా న్యాయవాదులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కోర్టు ఎదుట ధర్నా నిర్వహించి మరియు ర్యాలీ చేపట్టి కాళోజీ సెంటరు నుండి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నినాదాలిచ్చి తమ మద్దతును తెలియజేశారు.

ఈ సందర్భంగా జరిగిన బంద్ సభలో, జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ మాట్లాడుతూ —
“బీసీలు రాష్ట్ర జనాభాలో అతి పెద్ద వర్గం అయినప్పటికీ, సమాన అవకాశాలు ఇంకా లభించడం లేదు అన్నారు.అందుకే బీసీ రిజర్వేషన్ శాతం 42% కు పెంచి, ఆ బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్చడం అత్యవసరం” అని అన్నారు.అలాగే “బీసీలకు న్యాయం చేయడం అంటే సామాజిక న్యాయం సాధించడం.విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సరైన వాటా దక్కే వరకు ఈ ఉద్యమం ఆగదు అన్నారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం ప్రతీ ఒక్కరూ ఐక్యంగా నిలవాలి” అని పిలుపు నిస్తూ బీసీ రిజర్వేషన్ల సాధనలో న్యాయవాద సంఘాలు ముందు వరుసలో నిలిచి పోరాడుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్, కార్యవర్గ సభ్యులు మర్రి రాజు, హనుమకొండ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కోశాధికారి సాంబశివరావు, సీనియర్ న్యాయవాదులు మాజీ అధ్యక్షులు ఎలుకుర్తి ఆనంద్ మోహన్, గుడిమల్ల రవి కుమార్ , చిల్లా రాజేంద్ర ప్రసాద్ , జి. విద్యాసాగర్ రెడ్డి మరియు గంధం శివ, నారగోని నర్సింగరావు,సాయిని నరేందర్,నల్ల మహాత్మ, గుర్రాల వినోద్ , వి వి రత్నం, జగన్ మోహన్ రెడ్డి , యాకస్వామి , రాచకొండ ప్రవీణ్ , రామచందర్ , శ్రీనివాస్ గౌడ్,తదితర పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు,బీసీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుంటే మరో తెలంగాణ ఉద్యమమే…

బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుంటే మరో తెలంగాణ ఉద్యమమే…
– పూలే…అంబేద్కర్‌ను అర్థం చేసుకుంటేనే రాజ్యాధికారం సాధ్యం
– బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుండా కుట్రలు జరుగుతున్నయ్‌
– రిజర్వేషన్‌ ఎవరు ఇస్తరో ఎవరుతీసుకుంటరో అలోచించాలే
– కాంగ్రెస్‌…బీజేపీ పార్టీల మద్దతు తెలుపడం సంతోషకరమే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్దితో బీసీ రిజర్వేషన్‌లు తీసుకువచ్చి బీసీల చేతుల్లో పెట్టాలని లేకుంటే మరో తెలంగాణ ఉద్యమంలా మారుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు మంథనిలో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిరావుపూలేకు నివాళులు అర్పించి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు, అనంతరం వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బంద్‌లో పాల్గొన్న వారితో కలిసి సహపంక్తి బోజనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మేమెంతో మాకంత అని మహాత్మాజ్యోతీరావు పూలే సంకల్పించారని, పూలేను అర్థం చేసుకున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారన్నారు. అయితే పూలే, అంబేద్కర్‌ను అర్థం చేసుకోకపోవడం మూలంగానే అనేక అనర్థాలు జరుగుతున్నాయని, వారిని అర్థం చేసుకున్న నాడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్‌ కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు అన్ని రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు రోడ్డు మీదకు వచ్చి బంద్‌ మద్దతు తెలుపడం సంతోషకరమన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతామని ప్రతి ఒక్కరు ఉద్యమంలో ముందుకు వచ్చారని, అదే తరహాలో ఈనాడు బంద్‌కు సహకారిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అసలు బీసీ రిజర్వేషన్‌లు ఇచ్చే వారు ఎవరు తీసుకునే వారు ఎవరనే అయోమయం నెలకొనెలా అధికార పార్టీలు పాల్గొంటున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్‌లు కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అని ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మద్దతుపై బీసీ సమాజం సూక్ష్మంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకరిపై ఒకరు నెపం మోపి బీసీలు ఒక్కటి కాలేరనే ఆలోచనతో బీసీవర్గాల్లో చిచ్చు పెట్టి రిజర్వేషన్‌లు ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. అందరూ బాపనోళ్లు అయితే రొయ్యల మొలతాడు ఏడ పోయినట్లు అన్న చందంగా అన్ని పార్టీల నాయకులు బీసీ బంద్‌లో పాల్గొంటే అసలు రిజర్వేషన్‌లు ఎవరు అమలు చేయాలనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంఘాల ఏర్పడిన జేఏసీ ఎవరో ఒకరిపై గురి పెట్టకపోతే అయోమయపరిస్థితులకు దారి తీస్తుందని ఆయన వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామో అదే రీతిలో బీసీ రిజర్వేషన్‌లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్‌ గాంధీ రోడ్లపై కాకుండా పార్లమెంట్‌లో గళమెత్తాలని, అలాగే ప్రధాని మోడీ బీసీల గురించి ఆలోచన చేయాలన్నారు. వీళ్లిద్దరు కలిసి మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్‌లు సునాయమవుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల పిలుపుమేరకు నియోజకవర్గంలో బంద్‌కు సహకరించిన వ్యాపార సంస్థలు, అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు, ప్రజలు, మేధావులకు ఆయన ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.

బీసీ రిజర్వేషన్ కోసం “బంద్ ఫర్ జస్టిస్” ర్యాలీ…

బీసీ రిజర్వేషన్ల పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతాం*

-బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ లో వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్ల విషయంలో దోబూచులాట లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా హన్మకొండ యూనివర్సిటీలోని ఎస్ డి ఎల్ సిలో గల మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి మహేందర్ గౌడ్ పూలమాల వేశారు. అనంతరం యూనివర్సిటీ క్రాస్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు సకలజనులు బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్నారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అగ్రవర్ణాల పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలులో భాగంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో విఫలమైందన్నారు. సమగ్ర కులగణనను మొదలుకొని..బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించడం..ఆ బిల్లు పెండింగ్ లో ఉండగానే..మరో ఆర్డినెన్స్ తేవడం..ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే..జీవో 9 ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘోరా తప్పిదమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం..5 శాతం ఉన్న రెడ్డిలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలా చేసినప్పుడే బీసీలకు సముచిత న్యాయం దక్కుతుందన్నారు. అదేవిధంగా బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ బీసీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడని, బీసీల పాపం బిజెపికి తగులుతుందని, బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్న బిజెపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ పిలుపులో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని బిజెపి బీసీలంటే బానిసలుగా చూస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు రాణించాలంటే చట్టసభలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని, ఇందుకు బిజెపి రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్రంలో బిజెపిని బొంద పెట్టడం ఖాయమన్నారు. బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 18 శాతానికి కుదించిన బీఆర్ఎస్ పార్టీ బంద్ లో పాల్గొని బీసీ సమాజానికి ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. సకల జనులు కలిసి బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంలో ఆలోచించకుండా..అన్ని పార్టీలు ఏకమై బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం హన్మకొండ యూనివర్సిటీ నుండి ములుగు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ల అమలుకు బీసీ జేఏసీ జహీరాబాద్ లో వ్యాపార సంస్థలు మూత…

బీసీ రిజర్వేషన్ల అమలుకు బీసీ జేఏసీ జహీరాబాద్ లో వ్యాపార సంస్థలు మూత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ము(సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బందు ప్రకటించడం జరిగింది. ఈ బంద్ జహీరాబాద్ పట్టణంలోని భవాని మత మందిర్ చౌరస్తా నుండి బైక్ లపై ర్యాలీగా బయలుదేరి డా.బీ.ఆర్ అంబెడ్కర్ గారికి విగ్రహానికి పూవుల మాల వేసి పాస్తాపూర్ చౌరస్తా వరకు అన్ని షాపులు ముహించడం జరిగింది .ఆ తర్వాత బస్టాండ్ ముందు ధర్నా చేసి స్థానిక ఎమ్మార్వో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెలంగాణలో బీసీలకు రావలసిన నలబై రెండు శాతం రిజర్వేషన్ లు ఇవ్వాలని లేని పక్షంలో ఏ పార్టీ అయినా బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేనిపక్షంలో భవిషతులో తగిన కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు డా. పెద్ద గొల్ల నారాయణ, కొండాపూర్ నర్సిములు, విశ్వనాథ్ యాదవ్, శంకర్ సగర, వేణు కాడిగే, వడ్డే శేఖర్, సాధన కృష్ణ,మాక్కుసూద్,మాదినం శివ కుమార్,ఇమ్రాన్,బీసీ నాయకులు హుగెల్లి రాములు,అడ్వై్కేట్ శంకర్, మహేష్ ముదిరాజ్, బీ.ఆర్ యస్ నాయకులు తట్టు నారాయణ, నర్సిములు కోహిర్, వెంకటేశం, శిఖరి గోపాల్, వెంకట్ సాగర్,అమిత్ కుమార్,దత్తు ముదిరాజ్, బిజెపి పార్టీ నాయకులు నావబాత్ జగనత్, సుదీర్ బండారి, పూల సంతోష్, విశ్వనాధ్ స్వామి,వైద్యనాథ్, విశ్వనాధ్, సురేష్ పూరి, మాలశెట్టి,సతీష్ రాయచూరు గుప్తా, సుభాష్, మోహన్ చాకలి మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మహేందర్ మహారాజ్, పెంటయ్య, వీవిధ కుల సంఘాల నాయకులు సంగప్పముదిరాజ్,భీర్ గొండ,మంగలి దత్తత్రి, చాకలి శ్రీనివాస్, శిఖరి శ్రీనివాస్,రవికాంత్, మల్లేష్, గొల్ల శ్రీనివాస్,సందీప్ దాదా,మడపతి స్వామి తో పాటు అన్ని కుల సంఘాలు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135254.537.wav?_=3

 

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు.

42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేయాలి

రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు

దుగ్గొండి,నేటిధాత్రి:*

ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.

మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T134704.498.wav?_=4

 

మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు

*తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు తెలంగాణ బంద్..

*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం…

*తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేశాము..

*బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది…

*రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది..

*రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు…

*బీసీ బంద్ తో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాడం కోసమే బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాం..

*బీసీ బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి…

_వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్దన్నపేట( నేటిధాత్రి):

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో బిల్ ఆమోదించి గవర్నర్‌కి పంపినా,అది ఇంకా ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్న సందర్భంగా నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నేడు వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించిన “బీసీ బంద్” కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తోలుత స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బీసీలకు మద్దతుగా షాపులను బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం బీసీ నాయకులతో మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులతో మానవహారం చేపట్టి రోడ్డు పై బైఠాయించి మేమెంతో మాకు అంతా అంటూ నినాదాలు బీసీలకు మద్దతు గా నిలిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తున్నారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాము అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్, మహిళ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల, బీసీ సంఘం,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..

బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132231.789.wav?_=5

 

బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం
రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌ నిర్వహించింది.ఈ బంద్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సి.పి.ఎం ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా బస్ డిపో ముందు ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T130205.494.wav?_=6

 

సి.పి.ఎం ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా బస్ డిపో ముందు ధర్నా

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

తెలంగాణ రాష్ట్ర బిసి రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపులో భాగంగా సిరిసిల్లలో బంద్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టడం జరిగినది. అనంతరం సిరిసిల్ల పట్టణంలో ప్రదర్శన నిర్వహించడం జరిగినది.ఈరోజు బంద్ ను విజయవంతం చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరియు వాణిజ్య వ్యాపార విద్య సంస్థలకు ధన్యవాదాలు తెలుపడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలో మద్దతు ఏసి కేంద్రంలో అడ్డుకుంటూ ద్వంద వైఖరి అవలంబిస్తుంది.బిజెపి పార్టీ రాష్ట్రపతి వద్ద గవర్నర్ వద్ద బీసీ బిల్లులు ఆమోదింప చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణ , జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ , అన్నదాస్ గణేష్. సిపిఎం పార్టీ నాయకులు మిట్టపల్లి రాజమల్లు , రాపల్లి రమేష్ , నక్క దేవదాస్ , ఉడుత రవి. సిరిమల్ల సత్యం , ఎలివేటి శ్రీనివాస్ , జిందం కమలాకర్ , తన్నీరు లక్ష్మీరాజం , బెజ్జిగం సురేష్.బింగి సంపత్,స్వర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

“బీసీరిజర్వేషన్”..”బిచ్చం కాదు”.. “బీసీల హక్కు”…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T115054.857.wav?_=7

 

“బీసీరిజర్వేషన్”..”బిచ్చం కాదు”.. “బీసీల హక్కు”.

సగర సంగం రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి “కానిగంటి శ్రీనివాస్”.

“నేటిధాత్రి”, హుజూరాబాద్.

 

ఈరోజు రాష్ట్రవ్యాప్త “బీసీ బంద్” లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో హుజరాబాద్ లో “బీసీ బంద్” లో తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కాని గంటి శ్రీనివాస్.

 

హుజురాబాద్ అధ్యక్షులు యంజాల వాసు. చింత చంద్రయ్య. రాచమల్ల రఘు. దొరికిన చంద్రమౌళి. కొల్లూరి మధు. భాస్కర్. అనిశెట్టి శివ. సతీష్. కొల్లూరి అనిల్. అనిశెట్టి పరమేశ్వర్ సదరు బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ హుజురాబాద్ లో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా జోడా యాత్ర..

కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా జోడా యాత్ర

చట్టభద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

ఆదివాసీ 9 తెగల జేఏసీ రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ.

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ..నేటిధాత్రి…

కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో భారీ వర్షాన్ని లెక్కచేయకుండా మండల ఆదివాసీ జేఏసీ యువత ఉత్సాహంగా ఛలో భద్రాచలం ధర్మయుద్ధం బహిరంగ సభ జోడా యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఆదివాసి 9 తెగల రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ ఏడుళ్ళబయ్యారం క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే కరకగూడెం మండల జేఏసీ తరఫున ఘన స్వాగతం పలికారు. కలవలనాగారం గ్రామంలో ఆదివాసీ మహిళలు సంప్రదాయ పద్ధతిలో మంగళహారతులు పట్టి, ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ చుంచ రామకృష్ణ, విద్యార్థి సంఘం బట్టు వెంకటేశ్వర్లు లకు బొట్టు పెట్టి, కంకణం కట్టి, కొమరం భీం కు పూలమాలలు వేసి కొమరం భీం జోహార్లు అర్పించారు. అనంతరం చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ. అక్రమంగా వలస వచ్చి ఎస్టీ రిజర్వేషన్ పొందుతు ఆదివాసుల హక్కులను దోచుకునే చట్టభద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమం ఆగదు ఈయొక్క ఆదివాసీ ల ధర్మ యుద్ధం భద్రాచలంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆదివాసీలు అందరూ స్వచ్చందంగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలనీ తెలియజేశారు అనంతరం ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. భట్టుపల్లి గ్రామంలో కొమరం భీం సెంటర్ వద్ద మండల ఉద్యోగ సంఘం నాయకులు తరఫున రామకృష్ణ గారికి పుష్పగుచ్చం సమర్పించారు. అక్కడ కొమరం భీంకు పూలమాలు వేసి కొమరం భీం జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశయాలను,ప్రజలకు ఉద్యమ సందేశాన్ని అందించారు. కొర్నవల్లి గ్రామంలో యువత ఆధ్వర్యంలో కొమరం భీం గద్దె వద్ద శాలువా కప్పి చైర్మన్ ని సన్మానించారు.
అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, చిరుమల్ల గ్రామంలోని సమ్మక్క సారలమ్మ గద్దె వరకు ర్యాలీగా వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. అక్కడి ప్రజలను, పెద్దలను, యువతను, అందరినీ ఛలో భద్రాచలం ధర్మ యుద్ధ సభ కు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.అలాగే బర్లగూడెం, రఘునాథపాలెం, గ్రామాల్లోని సార్లమ్మ, గాదె రాజు, దేవతలను దర్శించి ర్యాలీని విజయవంతంగా కొనసాగించారు.ఈ జోడయాత్రతో కరకగూడెం మండలం ప్రజల్లో ఉత్సాహం, చైతన్యం నింపబడింది. సెప్టెంబర్ 28న జరగబోయే ఛలో భద్రాచలం ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని అందరూ గట్టిగా సంకల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ)అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, జేఏసీ నాయకులు కలం సంపత్, మాజీ సర్పంచులు పాయం నరసింహారావు, కొమరం విశ్వనాధం, ఉద్యోగ సంఘాల నాయకులు పోలేబోయిన కృష్ణయ్య, మలకం కుమారస్వామి, పోలేబోయిన మోహనరావు, మైపతి తిరుమలరావు, కొమరం అశోక్,పోలేబోయిన జయబాబు, విద్యార్థి సంఘ నాయకులు పోలేబోయిన స్వామిప్రసాద్, ఇర్ప నాగకృష్ణ, కళ్యాణ్, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version