కైలాస గుట్ట మీది సమస్యల గురించి మున్సిపల్ అధికారికి వినతి పత్రం.
కల్వకుర్తి/ నేటి దాత్రి:
కల్వకుర్తి పట్టణంలోని కైలాసం గుట్టపైన ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు సంభవించడం వలన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలను మునిసిపల్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా కరెంటు వైర్లు, కరెంట్ స్తంభాలు దెబ్బతినడం కరెంటు సప్లై రావడం లేదు.రానున్న పది రోజులలో బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు, దీపావళి కార్తీక మాసం పండుగలు ప్రారంభమవుతున్నాయి కావున భక్తుల ప్రయోజనాల సౌకర్యాల కొరకు కరెంటు వైర్లు, బల్బులను ఏర్పాటు చేయాలని కోరుచున్నాము.ప్రతి పండుగకు మున్సిపల్ వారికి చెప్పడం వారు వచ్చి తాత్కాలిక వైరింగ్ చేయడం మళ్లీ కొద్ది రోజుల తర్వాత యధావిధిగా పాడైపోతున్నాయి. అలా కాకుండా పర్మినెంట్ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయగలరు స్తంభాలకు లైట్లు, వైరింగ్ చేయించగలరని కోరుతూ కల్వకుర్తి మున్సిపల్ గారికి వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో దయాకర్,పురం మహేశ్వర్ రెడ్డి,
కుడుముల శేఖర్ రెడ్డి,గార్లపాటి, ప్రదీప్ కుమార్,బృంగి వివేకానంద,
ఉప్పరిపల్లి ప్రవీణ్ రెడ్డి,వాగులదాస్ నరేశ్ గౌడ్,కాగుల శ్రీశైలం యాదవ్,
దేవర్ల ఆంజనేయులు,చెందు ముదిరాజ్, రఘు యాదవ్,దేవర్ల వెంకటనారాయణ,రానదీర్ తదితరులు పాల్గొన్నారు.