గంజాయి గ్యాంగ్ అరాచకం.. తరచూ గొడవలు, దాడులు…

గంజాయి గ్యాంగ్ అరాచకం.. తరచూ గొడవలు, దాడులు

 

సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.మండల కేంద్రంలో గంజాయి గ్యాంగ్‌లు పేట్రేగిపోతున్నాయి. మత్తుకు అలవాటుపడిన యువత.. ఆ వ్యసానాన్ని తీర్చుకునేందుకు విక్రయాలకు దిగుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి ఇతర ప్రాంతాలకెళ్లి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. దానిని ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఆ మత్తులో అరాచకాలు చేస్తున్నారు. గొడవలకు దిగుతున్నారు. విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. దీంతో మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు.. ఎప్పుడు, ఎవరిపై దాడులు చేస్తారోనని భయాందోళనలు చెందుతున్నారు. గంజాయిని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి ముఠాలు పుట్టుకొచ్చాయి. యువతను మత్తుకు బానిసగా మార్చేశాయి. పల్లెలు, పట్టణాల నుంచి ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం నగరాలకు వెళ్లిన యువకులు అక్కడ ఏర్పడిన స్నేహాల కారణంగా గంజాయికి అలవాటు పడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి కొందరు యువకులు పల్లెలు, పట్టణాలకు దందా విస్తరించినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో అడ్డుఅదుపులేకుండా ఈ దందాను కొందరుసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు సైతం తరలించి అక్రమార్జనకు తెరలేపినట్లు విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక విక్రేతలపై ఉక్కుపాదం మోపింది.

మాఫియా నేత కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

మాఫియా నేత కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

 

నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు.

 నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు. నేరస్తులను పెంచి పోషించడంతోపాటు గంజాయి మాఫియా నడుపుతూ.. కామాక్షమ్మ తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందని ఈ సందర్భంగా స్థానికులు మండిపడ్డారు. తమ పిల్లలకు గంజాయి అలవాటు చేసి.. వారి జీవితాలతో చెలగాటం ఆడిందని వారు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై ఆమె అనుచరులు తీవ్రంగా దాడి చేయడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచలయ్య హత్య కేసులో కామాక్షమ్మతోపాటు ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
స్థానిక ఆర్డీటీ కాలనీలో కూల్చివేసిన ఇళ్లలో కామాక్షమ్మ తన తల్లి సోదరులతో నివాసం ఉంటుంది. ఈ కాలనీలోని నివాసాలను కేంద్రంగా చేసుకుని ఆమె పలు అరాచకాలకు పాల్పడిందని స్థానికులు వివరించారు. సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితులంతా కామాక్షమ్మతోపాటు ఆమె అనుచరులేనని స్థానికులు వివరిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా కామాక్షమ్మతోపాటు ఆమె అనుచరులు ఇక్కడే ఉంటూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వీరంతా.. యువతకు గంజాయి అలవాటు చేసి తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కామాక్షమ్మ, ఆమె మరిదితోపాటు పలువురు అనుచరులపై వివిధ నేరాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారని స్థానికులు వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఆమె చేస్తున్న అరాచకాలు భరిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో స్థానికులు, సీపీఏం నేతల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దాంతో కామాక్షమ్మతోపాటు అమె బంధువులు, అనుచరుల నివాసాలను స్థానికులు కూలగొట్టారు

గంజాయి కేసులో ముగ్గురి యువకుల పట్టివేత…

గంజాయి కేసులో ముగ్గురి యువకుల పట్టివేత

మహాదేవపూర్ అక్టోబర్ 01 (నేటిధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రం లో
గంజాయి కేసులో ముగ్గురు యువకులను మహదేవపూర్ పోలీసులు పట్టుకున్నారు. మండలం లోని మహదేవపూర్, ఎడపల్లి , బ్రాహ్మణపల్లి కు చెందిన ముగ్గురి యువకులను శుక్రవారం రోజున పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు ఎడపల్లి గ్రామ శివారు సమీపంలో అనుమానాస్పదంగా బైక్ పై దెబ్బ రాజకుమార్, శీలం పూర్ణచందర్, కూనరపు రంజిత్ కుమార్ లు ముగ్గురు యువకులు కనిపించగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకొవడం జరిగిందని వారిని విచారించగా గంజాయి తాగుతున్నామని తెలుపడం జరిగిందని అన్నారు. జల్సాలకు అలవాటు పడి గంజాయి తాగడం ద్వారా స్నేహితులుగా మారినట్లు తెలిపారు. వారు గంజాయిని తాగుటకు మరియు గంజాయి తాగడం అలవాటు ఉన్న వ్యక్తులకు అమ్మడానికి ఉపయోగిస్తున్నటు తెలిపినారు. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయిని, స్పెండర్ బైక్ ను స్వాధీనము చేసుకోవడం జరిగింది.
నిందితులన చాక చక్యంగ పట్టుకున్న మహాదేవపూర్ పోలీస్ కానిస్టేబుల్ కిరణ్, విజయ్, అనంత్ మరియు ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ రాజు ని సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు. అనంతరం మాట్లాడుతూ యువత గంజాయి మరియు ఇతర చెడు వ్యాసనాలకు వెళ్తే కఠిన చర్యలు తిసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఎస్ఐ పవన్ కుమార్, శశాంక్ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం.

 

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం..

మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయితీ వద్ద మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హాజరై సిబ్బంది తో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఎ)ను అమలు చేస్తోందని అన్నారు. ఈ అవగాహన ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పోత్కపల్లి లో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా , సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సామూహిక ప్రతిజ్ఞను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా సాగుచేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి, షీట్స్ ఓపెన్ చేసి పీడియాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి మన ఐక్య నిబద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా ఉపయోగపడుతుంది అన్నారు.ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version