మాఫియా నేత కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు
నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు.
నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు. నేరస్తులను పెంచి పోషించడంతోపాటు గంజాయి మాఫియా నడుపుతూ.. కామాక్షమ్మ తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందని ఈ సందర్భంగా స్థానికులు మండిపడ్డారు. తమ పిల్లలకు గంజాయి అలవాటు చేసి.. వారి జీవితాలతో చెలగాటం ఆడిందని వారు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై ఆమె అనుచరులు తీవ్రంగా దాడి చేయడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచలయ్య హత్య కేసులో కామాక్షమ్మతోపాటు ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
స్థానిక ఆర్డీటీ కాలనీలో కూల్చివేసిన ఇళ్లలో కామాక్షమ్మ తన తల్లి సోదరులతో నివాసం ఉంటుంది. ఈ కాలనీలోని నివాసాలను కేంద్రంగా చేసుకుని ఆమె పలు అరాచకాలకు పాల్పడిందని స్థానికులు వివరించారు. సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితులంతా కామాక్షమ్మతోపాటు ఆమె అనుచరులేనని స్థానికులు వివరిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా కామాక్షమ్మతోపాటు ఆమె అనుచరులు ఇక్కడే ఉంటూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వీరంతా.. యువతకు గంజాయి అలవాటు చేసి తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కామాక్షమ్మ, ఆమె మరిదితోపాటు పలువురు అనుచరులపై వివిధ నేరాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారని స్థానికులు వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఆమె చేస్తున్న అరాచకాలు భరిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో స్థానికులు, సీపీఏం నేతల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దాంతో కామాక్షమ్మతోపాటు అమె బంధువులు, అనుచరుల నివాసాలను స్థానికులు కూలగొట్టారు
తిరుపతి జిల్లా మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐ కె.అల్లీభాషా టీమ్ స్థానిక ఎఫ్వీఓ జాన్ శామ్యూల్ తో కలసి బుధవారం రేణిగుంట మండలం మామండూరు నుంచి కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున కాకిరేవులపెంట వద్ద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని మామండూరు స్థానికులుగా గుర్తించారు. వారిని విచారించి, పరిసరాల్లో వేటుకగా ఆ ప్రాంతంలో దాచి ఉన్న 20ఎర్రచందనం దుంగలు కనుగొన్నారు. అరెస్టయిన వారితో పాటు ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ వీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె శ్రీనివాస్ వీరిని విచారించారు. తరువాత ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. కూతుర్ని అమ్మేసిన తండ్రి..
ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. 20 లక్షల రూపాయల డబ్బుకోసం కన్న కూతుర్ని అమ్మేశాడు. 43 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశాడు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
కన్న బిడ్డను ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు. మైనర్ కూతుర్ని 20 లక్షల రూపాయలకు అమ్మేశాడు. కూతురికంటే 30 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. చివరకు పాపం పండి ఆ కన్నతండ్రి, పెళ్లికొడుకు జైలు పాలయ్యారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం మండలం గణపవరానికి చెందిన ఓ వ్యక్తి డబ్బు కోసం గడ్డి తిన్నాడు. ఏ తండ్రీ చేయకూడని పని చేశాడు.
మైనర్ కూతుర్ని 20 లక్షల రూపాయలకు అమ్మేశాడు. కూతురిని ఆమెకంటే 30 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. భర్తతో ఉండలేకపోయిన మైనర్ బాలిక పుట్టింటికి వచ్చింది. అప్పటినుంచి కాపురానికి వెళ్లటం లేదు. తండ్రి ఎంత చెప్పి చూసినా ఆమె వినలేదు. దీంతో ఓ నీచమైన పనికి పూనుకున్నాడు. కూతురికి మద్యం అలవాటు చేశాడు. మైనర్ బాలిక పెళ్లి గురించి పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు బాలిక తండ్రి, భర్తపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తోపనపల్లి మరియు బొల్లికొండ ఆయా చుట్టుపక్కల గ్రామాల్లో ఇటీవల వరుస చోరీలు జరగడంతో అప్రమత్తమైన నెక్కొండ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తి బానోతు అజయ్ కుమార్, వయస్సు 25, డ్రైవర్, బొల్లికొండ గ్రామానికి చెందిన అతని నుంచి 28 తులాల వెండి మరియు 1 తులం బంగారం స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇతనిపై అనేక కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని మహబూబాబాద్ జైలు రిమాండ్ కు తరలించామని నెక్కొండ ఎస్ఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఏపీ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మధుసూదన్ రెడ్డి
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.ఈ క్రమంలోనే మడ్డిని మాచవరం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.డ్రగ్స్ (Drugs)ని అరికట్టడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి డ్రగ్స్ ముఠాని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగానే డ్రగ్స్ ముఠాల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఆయనని మాచవరం పోలీసులు బెంగళూరులో ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. మడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏపీకి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఆయనని ఏపీకి తీసుకువచ్చిన తర్వాత విచారించే అవకాశాలు ఉన్నాయి. మడ్డిని విచారిస్తే పలు కీలక విషయాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అని పోలీసులు తెలిపారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తూ బెంగళూరులో మడ్డిగా చలామణి అవుతున్నారు మధుసూదన్ రెడ్డి. బెంగళూరులో డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మడ్డి. సెప్టెంబరులో బెంగళూరు నుంచి డ్రగ్స్‌తో విశాఖపట్నం వెళ్తూ విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రీవాత్సవ్, హవి పట్టుబడ్డారు . శ్రీవాత్సవ్, హవిల అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లారు మడ్డి. ఆయన కదలికలపై నిఘా ఉంచి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
గ్యాంగ్ రేప్ నిందితులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు అరెస్ట్
గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారుజామున పారిపోతున్న వాళ్లపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. విమానాశ్రయం సమీపంలో ఆదివారం మహిళా కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు ఈ ముగ్గురు వ్యక్తులను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఉదయం(మంగళవారం) తెల్లవారుజామున పోలీసులు.. నిందితుల జాడ తెల్సుకొని వారిని పట్టుకునేందుకు వారు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. పోలీసుల జాడ కనిపెట్టిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు.. పారిపోతున్న నిందితుల కాళ్ల మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతరం తవాసి, కార్తీక్, కాళీశ్వరన్ లను అదుపులోకి తీసుకుని, అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ… భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 4: సైబరాబాద్‌లో డ్రగ్స్ పార్టీని (Drugs Party) ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేవారు. హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు కన్జ్యూమర్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
గుత్తా తేజ కృష్ణ ,సాజీర్, వెన్నెల రవి కిరణ్, మన్నే ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అలాగే పకనాటి లోకేష్ రెడ్డి, పృథ్వి విష్ణువర్ధన్, కార్ల పొడి వెస్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున అరెస్ట్ అయ్యారు. మేకల గౌతం, గుంటక సతీష్ రెడ్డిలను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో ఐటీ ఉద్యోగులు, ఆర్కిటెక్టులు, డ్రైవర్లు, డీజే ప్లేయర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. పట్టుబడిన వారి నుంచి 6 లక్షల 51 వేల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్ 31.2 గ్రాములు, 3 గ్రాముల గంజాయితో పాటు మొబైల్ ఫోన్లు, 2 బైకులు, డాంగిల్స్, జీపీఎస్ కార్డు రీడర్ స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రం సతీష్ కుమార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
నమస్తే తెలంగాణ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడి సరికాదని,బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ,దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టిడబ్ల్యూ జెఎఫ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగోస్థంభంగా ఉన్న మీడియాపై బెదిరింపులకు దిగటం మంచిపద్దతి కాదని,సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్ఛ పత్రికలకు ఉంటుందని, పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే, వాటికి ఖండనలు ఇవ్వటం, వివరణలు ఇవ్వటం చేయాలి కానీ బెదిరింపులకు పాల్పడటం, భౌతిక దాడులకు దిగటానికి ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. భావప్రకటనా స్వేఛ్ఛ పై దాడి సరికాదని, తక్షణమే పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు, దాడికి ఉసిగొల్పిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జహీరాబాద్:ఐడీఎస్ఎంటీ కాలనీ ఇళ్ళ స్థలాలు, ఇళ్ల బాధితులు ఇవాళ జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు ఎండీ తంజిం, నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో బాధితులు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి బైటాయించారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. గేటు ముందు నుం చి పక్కకు తప్పుకుని నిరసన తెలపాలని సీఐ సూచించినప్పటికీ వారు అంగీకరించకపోవ డంతో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా చోటు చేసుకు న్న తోపులాటలో మాజీ వైస్ చైర్మన్ తంజిం, ఓ మహిళ సహా స్పృహ తప్పి పడిపోయింది. తమ ఇళ్లు, స్థలాల ప్రైవేటు వ్యక్తులు లాగేసుకున్న వి షయాన్ని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ లోని మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (గవాయ్) దళితడి ఫై దాడి చేసిన ఆర్ఎస్ఎస్ నేత లాయర్ రాకేష్ కిషోర్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేసి చట్ట రీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. అని అంతేకాకుండా మన తెలుగువాడైన దళిత బిడ్డ ఏ.డి.జీ.పి పురణ్ కుమార్ అధికారల ఒత్తిడితో తాను ఎనిమిది పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని ఒక దళిత అధికారిని హింసించి పైన ఉన్నటువంటి అగ్రకుల వర్ణాలు అనగదొక్కడానికి చూస్తున్నాయని అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఒక ఐపీఎస్ అధికారిని అగ్రకుల వర్ణ అధికారులు హింసించడం ద్వారా ఒక దళిత తెలుగు బిడ్డ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం వీరిపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుడే బాబు, సిరిసిల్ల జిల్లా దళితనియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ కుమార్, దళిత నాయకులు రామచందర్, పండుగ శేఖర్, బాలరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా .
చిట్యాల, నేటిధాత్రి :
అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే ఇసుక రవాణా అసలు దొంగలు అని బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడటిసి గొర్రె సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , ఆయన సతీమణి గండ్ర జ్యోతి లపై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ, టేకుమట్ల మండలం బీఆర్ఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అదుపు చేయవలసిన నాయకులే.. అడ్డగోలుగా, అర్ధరాత్రిలుగా, అడ్డు అదుపు లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారన్నారు. మళ్లీ ఏం ఎరగనట్టు కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. దయ్యాలు వేదాలు వల్లినట్లు సొంత పార్టీ దొంగలే ఇసుకను తరలించుకుపోతుంటే ప్రతిపక్షం పైన నోరు కాంగ్రెస్ నాయకులు నోరు జారడం సరికాదన్నారు. గ్రూపు రాజకీయాలతో గుడులు, బడులు పేరులమీదుగా రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణాను తరలిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని దుయ్యబట్టారు. అభివృద్ధి పైన ధ్యాస లేక ప్రతిపక్ష పాత్రులైన గండ్ర దంపతుల పైన బురద జల్లే రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాలని, దీనికి భూపాలపల్లి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి వస్తుందని డిమాండ్ చేశారు. లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చిట్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కాట్రేవుల కుమార్, పార్టీ మండల ప్రధానకార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, మడికొండ రవీందర్రావు, చిలుమల రమణాచారి, బైరం,భద్రయ్య, ఏలేటి రాజు, పర్లపెల్లి భద్రయ్య, కొండ కృష్ణఏరుకొండ రఘు, పీసరి సురేష్, పోశాల రాజు, చిలుమల రాజేష్, బుర్ర నాగరాజ్, శ్రీశైలం, ప్రభాకర్, రమేష్, వల్లబోజుల న దాని రేష్, జంగ లక్ష్మన్ అరవింద్ బోళ్ల చందు, ఏలేటి వెంకన్న, , రమేష్ తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకుల ను అరెస్టు చేయడం సిగ్గు చేటు
వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే రోడ్డె క్కి తమ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలంటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు లు నిన్న ధర్నా చేయడం, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఇసుక అక్రమ రవా ణాను అడ్డుకుంటానని బహిరం గంగా చెబుతూనే తన అనుచరులతో ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నా డంటూ కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారంటే, అక్రమ ఇసుక రవాణా ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవ చ్చు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారంటే వారికి ఏమైనా హామ్యామ్యాలు అందుతున్నాయా విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు కొమ్ముకోస్తున్నా రంటూ విమర్శలు వస్తున్నా యి, కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కారంటే అవినీతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు, ఇకనైనా నియోజకవర్గ ప్రజలు మన ఎమ్మెల్యే అవి నీతి అక్రమాలను అర్థం చేసుకోవాలని, నిన్న టేకుమట్ల మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అంటూ వారికి బేష రత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందివ్వ లేని అసమర్ధ ఎమ్మెల్యే ఇదే అదనుగా అక్రమంగా ఇసుక తరలిస్తూ పైసలు దండుకుం టున్నాడు. దీన్ని నిశితంగా పరిశీలిస్తున్న నియోజకవర్గ ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వంగల నారాయ ణరెడ్డి, రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, మేకల శ్రీనివాస్, మారపెల్లి నందం, మారపెల్లి మోహన్, అరికెళ్ల ప్రసాద్ దైనంపల్లి సుమన్ , కుసుమ శరత్, మేకల వెంకటేశ్వర్లు, వల్పదా సు చంద్రమౌళి,గడిపే విజయ్, కరుణ్ బాబు, సౌల్ల కిష్టయ్య, నర్రరాజు, రంగు మహేందర్, కృష్ణారెడ్డి, కొమ్మల శివ, అజయ్ కుమార్, కుథాటి రమేష్, వినయ్ సోషల్ మీడి యా మండల కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్..
4.098 గ్రాముల ఎండు గంజాయి,కారు,మొబైల్ ఫోన్ స్వాదీనం..
ఓదెల(పెద్దపల్లిజిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుండగా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి గంజాయి, కారు, మొబైల్ ఫోన్ను , స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. హుస్నాబాద్ కు చెందిన కంసాని అరుణ్ అనే 20 ఏళ్ల యువకుడు డ్రైవర్, టైల్స్ వర్క్ పై చేస్తూ డబ్బులు సరిపోక గంజాయి వ్యాపారం వైపు మళ్లాడని ఐ విచారణలో తేలింది. అతడి వద్ద నుంచి 4.098 కిలోల ఎండు గంజాయి, విలువ రూ. 2,04,000/-, ఒక ఎర్టిగా కారు, ఒక మొబైల్ క ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి స్నేహితులు బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాష్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని , త్వరలోనే అదుపులోకి తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోత్కపల్లి శివారులోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ -్య హాల్ ముందు వాహన తనిఖీలు జరుగుతుండగా ఎస్ఐ దీకొండ న్న రమేష్ ఒక కారు అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గుర్తించి ఆపగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు ప్రాంతానికి చెందిన మహేందర్, ఆకాష్ తో పరిచయం పెంచుకున్న అరుణ్, వీరితో కలిసి ఓడిశా రాష్ట్రం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల ప్రాంతాలలో విద్యార్థులు, ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభాలు సంపాదించాడని పోలీసులు తెలిపారు. ఒక కిలో గంజాయిని ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేసి, స్థానికంగా యాభై వేల రూపాయలకు అమ్ముతున్నాడని విచారణలో తెలిసింది. గంజాయి పండించినా, తరలించినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో సీఐ సుల్తానాబాద్ జి. సుబ్బారెడ్డి, ఎస్ఐ దీకొండ రమేష్, ఏఎస్ఐ రత్నాకర్, పీసీలు రాజు యాదవ్, హరీష్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరిని ఏసీపీ అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, డీసీపీ పి. కరుణాకర్ పర్యవేక్షణలో ఈ చర్య చేపట్టినట్లు అధికారులు వివరించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా వారి మెడల్లో చైన్ స్నాచింగ్‌లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెయూసి, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి సూమారు 23లక్షల 50వేల రూపాయల విలువ గల 237గ్రాముల బంగారు పుస్తెల తాళ్ళు, గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, పదివేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Police Commissionerate
ఈ అరెస్టుకు సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్న నిందితుడు డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఓ సిమెంట్ కంపెనీలో క్వాలిటీ టెక్నిషన్‌గా హైదరాబాద్‌లో పనిచేసేవాడు ఇదే క్రమములో మొదటగా ఈ ఏడాది ఇదే సిమెంట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సహోఉద్యోగి ఇంటిలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి దానిని స్థానిక మణిప్పురం గోల్డ్ లోన్ కంపెనీలో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసేడు. ఈ సంఘటలో నిందితుడుని స్థానిక నెరెడ్‌మెట్ పోలీసులు ఈ ఏడాది అరెస్టు చేసిన జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడిలో ఏలాంటి మార్పు రాకపోగా తన జల్సాలకు అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రొడ్డుపై వెళ్తున్న మహిళల మెడలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్న నిందితుడు ముందుగా చైన్ స్నాచింగ్ చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వెళ్ళి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం పది చైన్ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, అలాగే సుబేదారి, కాజీపేట,హసన్‌పర్తి, కమలాపూర్, కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడగా, హన్మకొండ, హసన్‌పర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడు మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడటం జరిగింది. ఈ వరుస చైన్ స్నాచింగ్ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్, హన్మకొండ ఏసిపిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడుని గుర్తించిన పోలీసులు పక్కా సమచారంతో ఈ రోజు ఉదయం పోలీసులు ఉదయం యాదవ్‌నగర్ క్రాస్ రోడ్డు వద్ద వాహన కెయూసి, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీ చేసిన బంగారు గొలుసులను విక్రయించేందుకు అనుమానస్పదంగా చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడుని రోడ్డుపై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న నిందితుడుని పోలీసులు పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహన చోరీలను అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతను నివాసం వుంటున్న అద్దె ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన క్రైమ్స్ డిసిపి గుణశేకర్, క్రైమ్స్ ఏసిపి సదయ్య, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, కెయూసి, సిసిఎస్ ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్, రాఘవేందర్, ఏఏఓ సల్మాన్ పాషా, సిసిఎస్ ఎస్.ఐ లు రాజ్‌కుమార్, శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్ళు అంజయ్య, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్, చంద్రశేకర్, రాములు, నగేష్‌లతో కెయూసి పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు బిజెపి నాయకులు వర్ధన్నపేట (నేటిధాత్రి):
https://youtu.be/mgl8GBmGx0A?si=5kIR7WXajNDM3xSBv
వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.
తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్ ధనుంజయను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది.
ధర్మవరం(అనంతపురం): తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్ ధనుంజయ(Dhananjaya)ను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు శివయ్యను అరెస్టు చేశామని డీఎస్పీ హేమంత్‌కుమార్ తెలిపారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు తెలిపారు.
కేతిరెడ్డి కాలనీ ఎల్-2లో పాళ్యం శివయ్య, ఎల్-3లో అతని పిన్ని కుమారుడు పాళ్యం ధనుంజయ నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహంగా ఉంటూ మద్యం సేవించేవారు. శివయ్య భార్యతో ధనుంజయ చెడుగా ప్రవర్తించేవాడు. దీంతో శివయ్య(Shivayya) మందలించాడు. అయినా అతనిలో మార్పురాలేదు.
దీంతో శివయ్య కక్ష పెంచుకుని పథకం ప్రకారం ఈ నెల 21వతేదీ అర్ధరాత్రి ఎల్‌పీ సర్కిల్‌లో బ్రిడ్జి కింద ధనుంజయను సిమెంట్ ఇటుకతో బాది చంపేశాడు. నిందితుడిని సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ కేతన్న, హెడ్ కానిస్టేబుళ్లు అప్పస్వామి, శివశంకర్, కానిస్టేబుళ్లు రాజప్ప, షాకీర్, బయన్న, సుధీర్‌కుమార్, రాజన్న శనివారం అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు వివరాలను వెల్లడించారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సుష్మా చౌరస్తా వద్ద ఉన్న వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్ రాజేశ్ కుమార్ సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
తుర్కయాంజాల్ రెవెన్యూ పరిధిలో గల 200 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో బాధితుడి వద్ద సబ్ రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేశాడు. ఆయన డిమాండ్ మేరకు బాధితుడు రూ.70వేలు చెల్లించేందుకు అంగీకరించాడు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దనే అర్జున్‌రావు, డాక్యుమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న నాగోల్‌కు చెందిన రమేశ్ గౌడ్ సహాయంతో బాధితుడు, సబ్‌రిజిస్ట్రార్‌కు రూ.70వేలు చెల్లించాడు. రమేశ్‌గౌడ్, సబ్‌రిజిస్ట్రార్‌కు నగదును అందజేస్తున్న క్రమంలో సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు డాక్యుమెంట్ రైటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి అశోక్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మన్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఐదు నెలలుగా బీదర్ లో పని చేసుకుంటున్న లక్ష్మన్, కూలీ డబ్బులు సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.
నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు గాజులపల్లి స్వామి పై దాడి జరిగిన కేసు నమోదు చేసి డిఎస్పి ఇన్విస్టిగేషన్ చేసిన నిందితుని ఇంతవరకు అరెస్టు చేయలేదని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. నిధులను వెంటనే అరెస్టు చేయాలని కమిషన్ చైర్మన్ డి.ఎస్.పి కి కీరవాణి ద్వారా తెలపడం జరిగింది చట్టాన్ని పరిరక్షించుకోవడం మన హక్కుగా ఆయన తెలపడం జరిగింది. నిందితులను అరెస్టు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాల పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు బొమ్మల మైసయ్య, బాధితులు స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ( ఐ జే యు)
కేసముద్రం/ నేటి దాత్రి
సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అక్రమ అరెస్టు, ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ మంగళ వారం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో టి యు డబ్ల్యూ (ఐ జేయూ), వివిధ పార్టీల, సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర నాయకులు బండి సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడి చేయడం, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.