మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి.

మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్: మహరాష్ట్రలోని సేవాగ్రామ్ గాందీ
ఆశ్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ నా యకత్వంలో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహ రించేందుకు నేర్చుకోవాల్సిన అంశాలపై ఐదు రోజుల వర్క్షాపులో రాజకీయ భాగస్వామి కావడానికి మహిళలకు ఉన్న అడ్డంకులు తొల గించుకునేలా బూత్అయిలో వెళ్లి మహిళలు ఒక సముహమును ఏర్పరుచుకొని నాయకులుగా ఎదగాలని రాజకీయాన్ని ప్రబావితం చేసే శక్తిగా మారి మరోవైపు రాజకీయ పార్టీలో మహిళా శక్తిగా అవ తరలించాలని ముఖ్య అతిథులు అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పండితులచే అనేక సెషన్సు నిర్వహించడం జరిగింది. భారతదేశం నుంచి ఈ పరిశ్రమలో నలబైమంది మహిళలు ప్రత్యేక ఆహ్వానం, అనేక ప్రక్రియల ద్వారా ఎంపిక చేయబడిన వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి అస్మా, విజయలక్ష్మి పాల్గొన్నారు.

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం.

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం

*జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ *

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.

 

జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

జూన్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 02 FIRలు,04 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

 

SP Mahesh B. Gite IPS

 

విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,
ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.

మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

 

SP Mahesh B. Gite IPS

 

విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనేజిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ  తెలిపారు.

అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి :

shine junior college

చిన్నారుల ఎదుగుదల, మహిళల ఆరోగ్యానికి అంగన్వాడి కేంద్రాలు భరోసగా నిలుస్తాయని, పిల్లలు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి సెంటర్ ను కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఏసిడిపిఓ విజయలక్ష్మి అన్నారు.
మండలంలోని మడిపల్లి గ్రామంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ర్యాలీ తీసి అంగన్వాడీ ముద్దు ప్రవైట్ స్కూల్ వద్దు అని నినాదాలతో గ్రామాల్లోని వీధుల్లో తిరుగు తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాలు నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడీ సెంటర్ పిల్లలు మానసిక శారీరకంగా అభివృద్ధి జరగటానికి అట పాటలతో విద్య బోధిస్తారన్నారు.గ్రామంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గౌసియా, గ్రామపంచాయతీ కార్యదర్శి శోభారాణి,అంగన్వాడీ టీచర్లు బి. అరుణమ్మ,ఎ.ఉదయశ్రీ,బి. సుజాత,ఆశ కార్యకర్త ఎం. ఉపేంద్ర, ఆయాలు సమ్మక్క,సరిత, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగురాలుకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ.

దివ్యాంగురాలుకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ…

భూపాలపల్లి నేటిధాత్రి:

shine junior college

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు విలీన విద్య, బాలిక విద్య కార్యక్రమము భవిత కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కృష్ణ కాలనీలో ప్రధానోపాధ్యాయులు రమ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ సామాజ సమీకరణ సమన్వయకర్త సమ్మిళితవిద్య సమన్వయకర్త సామల రమేష్ భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానో ఉపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న హాజరై, కార్యక్రమం ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దివ్యంగులకు విద్యాశాఖ అంధిస్తున్న సేవలను భవిత సెంటర్ గురించి బాలిక విద్యా గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా దివ్యాంగురాలైన అమ్మాయికి మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. దివ్యాంగులైన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పుస్తకాలు యూనిఫామ్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. చైల్డ్ లైన్ వారి ద్వారా బాలికల గురించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల స్వప్న టీచర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ అమ్మ రజిత, కంకల రాజయ్య , మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాది మార్గాలు.

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాది మార్గాలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాధి మార్గాలు ఏర్పరుస్తాయని నర్సంపేట టౌన్ ఎస్సై అరుణ్ కుమార్ అన్నారు.శనివారం ఎఫ్ఎంఎం,వరంగల్ సాంఘిక సేవా సంస్థ వారి సహకారంతో నర్సంపేట ప్రతిభా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ, టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం సంస్థ సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యంగా గృహింస, బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణా నిర్మూలించడానికి వారికి ఉపాధి మార్గాలు అనేవి చాలా ముఖ్యమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.మరో అతిథి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రమేష్ కోరే మాట్లాడుతూ సమాజంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రగతి ఎంత ముఖ్యమో వ్యక్తిగత భద్రత అంతే ముఖ్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి బ్యాంకుల ద్వారా అమలుపరుస్తున్న స్కీములను సద్వినియోగం చేసుకొని ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్, సహాయ సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ,ఎర్ర శ్రీకాంత్ ,ఫైనాన్స్ మేనేజర్ అజయ్ కుమార్,సంస్థ యూత్ అంబాసిడర్స్ దోమ మధుమతి, భౌగోచి దేవిక బొడ్డు అమర్నాథ్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సేవా సంస్థ కార్యదర్శి బెజ్జంకి ప్రభాకర్, ట్రేైనర్లు శ్వేతా, సంధ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల తో పోటీ పడుతున్న మహిళలు.

గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల తో పోటీ పడుతున్న మహిళలు.

ఇంటికె పరిమితం కాదు పనుల్లో మేము సైతం.

పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళల్లో చైతన్యం.

పలిమెల నుండి పెట్రోల్ బంక్ వరకు ఆ మహిళ ప్రయాణం.

పెట్రోల్ బంకులో మహిళ పనిచేయడం గర్వంగా భావిస్తున్న మహిళలు

మహాదేవపూర్ నేటి ధాత్రి:

మారుతున్న కాలంలో మహిళలు అంచలు అంచలుగా ఎదగడం ఆయా ప్రాంతాల్లో గౌరవాన్ని తీసుకురావడం జరుగుతుంది. మహిళలు పట్టణ కేంద్రాల్లోనే సాధారణ ఉద్యోగం నుండి మొదలుకొని, అంతరిక్షం వరకు ప్రయాణించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మార్పు మరింత లోతులో దూసుకు వెళ్ళింది, మహిళలు ఇంటికే పరిమితం కాదు, మేము కూడా పురుషులతో సమానత్వంగా ప్రతి శాఖలో పోటీపడే సత్తా ఉందని చూపెట్టడం జరుగుతుంది. తాజాగా మహాదేవపూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ లో మహిళ పెట్రోల్ పోస్తూ విధులు నిర్వహించడం, గ్రామీణ ప్రాంతంలో కాస్త ఆశ్చర్యం కలిగించిన, మహిళలతో పాటు పురుషుల్లో హర్షించేలా చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కేవలం వ్యవసాయ పనుల్లో మాత్రమే విమగ్నమై ఉండడం జరుగుతుంది. మిగతా గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇంటి పనులకే పరిమితం కావడం, ఎంతో కొంత విద్యను అభ్యసించి చివరికి ఓ ఇంటి దీపంగా వెళ్లి తమ జీవితం ఆ ఇంటికి పరిమితం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ కాలం మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా పురుషులతో సమానత్వంగా వ్యవసాయ పనుల నుండి మొదలుకొని ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని వ్యాపార సముదాయాల్లో మహిళలు పనులు నిర్వహించడం గ్రామీణ ప్రాంతాల మహిళలకు గర్వాన్ని తీసుకువచ్చేలా చేయడం జరుగుతుంది.

ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండా గ్రామంలో శనివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు హనుమంత్ నాయక్,రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, పులియ నాయక్, సేవ్య నాయక్, శక్రు నాయక్, కమలమ్మ, శాంతి, సరోజా, శోభా,ఆశ వర్కర్లు,గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు.

ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య.

“నేటిధాత్రి”,బాలానగర్. (హైదరాబాద్):

 

 

 

 

ప్రభుత్వం నుండి నేరుగా మహిళలకు అందే పథకం ఏదైనా ఉందని అడిగితే అది కేవలం ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమేనని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవమైన పథకం అని ఇందులో ఎలాంటి బేషజాలు ఉండకూడదని ఆమె అన్నారు. బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయని, మహాలక్ష్మి పథకం లేనపుడు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. రోజు బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు మహాలక్ష్మి పథకం ముందు వెనుక ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఉచితం అని అందరూ బస్సుల్లో చేయడం లేదని ఇతర వాహనాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారని ఆమె తెలిపారు. అంతే గానీ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పెట్టిన పథకాలను అగౌరవపరచకుండా , మన హక్కుగా భావించి అవసరాల నిమిత్తం మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. కేవలం మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు పథకం మాత్రమే రద్దు చేయాలనీ కొంతమంది కోరుకోవడం తగదని ఆమె అన్నారు. మహిళల కోసం పెట్టిన పథకాలను కొంతమంది సాటి మహిళలలే విమర్శించడం ఒక బాధ్యత గల పౌరురాలిగా తీవ్రంగా ఖండిస్తున్నాని ఆమె తెలిపారు. అనేక వ్యయ ప్రయాసలకోర్చి మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.

మహిళలు విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి.

మహిళలు,విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి.

మహిళలు పని చేసే ప్రదేశాల వద్దకి వెళ్లి అవగాహన కల్పిస్తున్న జిల్లా షీ టీమ్ బృందం.

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ గారు

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది. మే నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,06 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ తెలిపారు.

భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసినమహిళలకు సత్కారం.

భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసినమహిళలకు సత్కారం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసిన మహిళలకు సిరిసిల్ల గీతా ప్రచార సేవ సమితి ఘన సత్కారం గీతాశ్రమంలో ఉదయం 11 గంటలకు కోడo నారాయణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్య నిర్వహణలో జరిగిన సమావేశంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమం మైసూర్ లో నిర్వహించిన 700 శ్లోకాల కంఠస్థం చేసిన నార్ల సంతోషి, కటకం లక్ష్మి, కటకం విజయ ,జి సంగీత, జి ప్రశస్తి, మహిళలకు బంగారు పతకం శాలువాతో సత్కారం పొందిన సిరిసిల్ల జిల్లా వాసులలో ముగ్గురు సిరిసిల్ల లోకల్ వారైతే ,ఆవునూరు వారు ఇద్దరూ ఒకే ఇంటి కుటుంబానికి చెందిన వారై తల్లి, కూతురు ఈ అవార్డులు పొందడం విశేషం. మహిళలకు.డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ విశేషంగా భగవద్గీత అంటే అర్థం పరమార్థం తెలిసిన ఈ ఐదుగురిని సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ఘనంగా గీత ఆశ్రమంలో ఉదయం సన్మానించింది వీరికి శాలువా గ్రంథాలతో ఘనంగా నారాయణ నందగిరి స్వాముల చేతుల మీదుగా సన్మానించింది. భవిష్యత్తులో భావితరానికి భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయించాల్సిందిగా గీత ప్రచార సేవా సమితి కోరింది. ఈ కార్యక్రమంలో గీత గజ్జెల్లి రామచంద్రం, మెరుగు మల్లేశం, కమలాకర్, మోర దామోదర్, కొక్కుల రాజేశం, గడ్డం కౌసల్య, అనసూయ, పత్తిపాక హరికిషన్ మొదలైన వారు సుమారు వందమంది దాకా పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలంలోని అజిలాపురం, కుందారం తండా, లాలు తాండ, గ్రామాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీ చేయడం జరిగింది.ఈ పంపిణీ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధగొని రమేష్ గౌడ్ , ఆశ వర్కర్ కలమ్మ, సిద్ధగోని పరమేష్, బుడ్డ రాములు, ఆర్కే గౌడ్, కుమార్, ఎండి ఖాజాబీ, కాలే నరసింహ, ఎండి జాఫర్, నిరంజన్, లింగం, కేశముని పరమేష్, కొప్పుల యాదయ్య , మహేష్, రామచంద్రి, దాములా నాయక్, రమేష్ నాయక్ , వెంకటేష్ నాయక్ గ్రామ పెద్దలు మహిళలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

స్త్రీ పురుషుల సమానత్వం కొసం ఉద్యమించాలి.

స్త్రీ పురుషుల సమానత్వం కొసం ఉద్యమించాలి

మహిళ హక్కుల సామాజిక కార్యకర్త అశాలత

నిజాంపేట్ నేటి ధాత్రి:

 

భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రంగాలలో స్త్రీ పురుషల సమానత్వం కోసం ఉద్యమించాలని మహిళ రైతుల హక్కుల వేదిక రాష్ట్ర నాయకురాలు ,సామాజిక కార్యకర్త అశాలత పిలుపునిచ్చారు. గత రెండు రోజులు గా మెదక్ జల్లా నిజాంపేట్ మండల కేంద్రం లో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో భారత రాజ్యాంగం హక్కులు చట్టాలు నాయకత్వ లక్షణాల పై శిక్షణ తరగతులు జరిగాయి.శుక్రవారంనాడు జరిగిన శిక్షణ శిబిరంలో అశాలత సామాజిక, ఆర్ధిక,రాజకీయ పరిస్థితులు జెండర్ సమ దృక్పథం పై ప్రసంగిస్తూ ఆర్ధిక,శారీరక దోపిడిని ప్రశ్నిస్తూ మహిళ పై హింసలేని సమాజ నిర్మాణం కొసం పని చెయాలన్నారు.నేటికి 65 శాతం దళిత మహిళలు భూమి లేని కూలీలుగా సామాజిక భద్రత కరువైనదనదన్నారు.
ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపంలో మానవ హక్కులు అమలవుతున్న అంటరానితనం ,వివక్ష ,దాడులు దళితులకు నిత్యకృత్యంగా మారాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని అయుధంగా మలుచుకొని దాడులకు పాల్పడే వారిని జైలు లకు పంపించాలన్నారు.భూ సేకరణ చట్టం – 2013 పై కాళ్ళకల్ నిర్వాసితుల సంఘం నేత మైలారం నర్సింహ్మ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ల నుండే భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొని కూలీలుగా ప్రభుత్వం మారుస్తున్నారన్నారు. చట్టం ప్రకారం న్యాయమైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భూములను సేకరించాలన్నారు.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి భారత రాజ్యాంగం-డిబిఎఫ్ లక్ష్యం పై మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అమలు చెసుకొవడమడమే డిబిఎఫ్ లక్ష్యమన్నారు.భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ కు సంఘటితం కావాలన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హమి పధకం అమలు పై డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి మాట్లాడుతూ భూమి లేని,నైపుణ్యం లేని కూలీలకు సంవత్సరానికి వంద రోజుల పని దినాలు కల్పించాలన్నారు.పని వద్ద కనీస వసతులు నీరు,నీడ,వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు.భూ బారతి చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్ మాట్లాడుతూ భూ బారతి చట్టం పై అవగహన పెంపొందించుకొవాలన్నారు. భూసంస్కరణల అమలు కొసం పొరాడాలన్నారు.దళిత ఉద్యమం మిడియా పాత్ర పై సీనియర్ జర్నలిస్టు ఆస శ్రీ రాముల మాట్లాడుతూ అంబేద్కర్ మూక్ నాయక్,మహాత్మ జ్యోతి రావు పూలే సత్యశోధక్ పత్రికలను నడిపి జాతి ని చైతన్యం చెశారన్నారు.ఈ శిక్షణ తరగతులో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్,రాయిన్ పల్లి నర్సింహ్మ,చుంచు రాజేందర్,భీమ్ శేఖర్,వేణు,కల్వకుంట్ల చంద్రం కర్ణాకర్,నరెష్,రవిందర్,వాణి శారద,పల్లవి తిరుపతి,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి.

ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి కొట్టించడమే నా మహిళల అభివృద్ధి

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో ఉన్న బుర్రకాయల గూడెం ఐకెపి సెంటర్ వద్ద జరిగిన గొడవల్లో మాజీ ఎంపీటీసీ సాగర్ తన అనుచరులు ముగ్గురు మహిళలపై దాడి చేసిన విషయం అందరికీ తెలిసినదే. దాడిలో గాయపడిన ఆకుల రేణుక వాళ్ళ ఇంటికి వెళ్లి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి,మండల అధ్యక్షులు కుర్రి స్వామినాదన్ పరామర్శించడం జరిగింది.
ఈ గొడవకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని అధికార పార్టీ అండదండలతోని చట్టం అంటే భయం లేకుండా తనపై కేసు ఉన్నదనే విషయం తెలిసి కూడా మహిళలపై విచక్షణ రైతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార పార్టీ ధాన్యం కల్లాలను మహిళలకు కేటాయించి కొట్టించడమేన మహిళళ అభివృద్ధి అంటే ఇట్టి విషయాన్ని అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగింది మాకు పార్టీలు కాదు ప్రజలే ముఖ్యం కనుక అన్యాయం జరిగిన వారి పక్షాన న్యాయం జరిగేంత వరకు ధర్మసమాజ్ పార్టీ తోడుగా ఉంటుంది ఇప్పటికైనా అధికారులు, అధికారంలో ఉన్న నాయకులు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తగు న్యాయం జరగని ఎడల బాధితులతో కలసి ధర్నా రాస్తారోకల తో న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలియజేయడం జరిగింది.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లను పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పంక్షన్ హల్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ద్వారా మైనారిటీలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా మంజూరు అయిన 150 కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ కలిసి మైనారిటీ మహిళకు కుట్టు మిషన్ లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు,పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ గారు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాజా &మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గర్భవతులు పిల్లలు వేసవిలో.!

గర్భవతులు పిల్లలు
వేసవిలో
తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైనుపాక గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను శుక్రవారం రోజున అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన సూపర్వైజర్ జయప్రద ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండాకాలం అయినందున గర్భవతులు బాలింతలు పిల్లలు తీసుకోవలసిన ఆహార ఆరోగ్య వ్యక్తిగత శుభ్రత మంచినీటి ప్రాముఖ్యత గూర్చి వివరించనైనది ముఖ్యంగా ఈ సమయంలో ఫంక్షన్స్ తీర్థయాత్రలు వెళ్లకుండా చల్లటి వాతావరణంలో ఎప్పుడు కూలర్ ఏసివద్ద ఉండకుండా చెట్ల నీడలో ఎక్కువ సమయం గడపాలని మసాలాలతొ కూడిన భోజనము కాకుండా చిరుధాన్యాలతో కూడిన భోజనం తినాలి అని బయట తిను బండారాలు తినకుండా కూల్డ్రింక్స్ కు దూరంగా ఉండాలని చల్లటి మజ్జిగ నిమ్మరసం దోసకాయ వాటర్ మినరల్ లాంటి పానీయాలు తీసుకోవాలని వివరించనైనది అలాగే తల్లులు పిల్లలు ముఖ్యంగా కిశోర బాలికలు మొబైల్ కి దూరంగా ఉండాలని వివరించి గర్భవతులు పిల్లల బరువు ఎత్తు చూసి గర్భవతి బాలింతలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కరుణ సుభద్ర సుజాత ఆయాలు అస్మ సరోజన మహిళలు హాజరైనారు.

వరంగల్ లో సుందరీమణులు ఆహ్వానించిన సీపీ.!

ఖిలా వరంగల్ లో ప్రపంచ సుందరీమణులు

ప్రపంచ సుందరిమణులను సాధరంగా ఆహ్వానించిన వరంగల్ సీపీ

ఖిలా వరంగల్ లో భారీ పోలీస్ బందోబస్తు

వరంగల్ తూర్పు  నేటిధాత్రి :

 

 

మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా హన్మకొండ, వరంగల్ పర్యటనకై బుధవారం సాయంత్రం హరిత కాకతీయ హోటల్ కు చేరుకున్న వివిధ దేశాలకు చెందిన సుందరిమణులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సాధరంగా ఆహ్వానించారు.

 

Thousand Pillar

మొదటగా హనుమకొండ లోని వేయి స్తంభాల దేవాలయంలో సందర్శన చేసిన ప్రపంచ సుందరీమణులు, అనంతరం వరంగల్ తూర్పు పరిధిలోని ఖిలా వరంగల్ కోట వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

Thousand Pillar

వరంగల్ డివిజన్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో, ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, మట్టేవాడ సిఐ తుమ్మ గోపి, వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, ఎస్సై లు, మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు.

శిక్షణ ట్రైనర్ ని సన్మానించిన మహిళలు.

శిక్షణ ట్రైనర్ ని సన్మానించిన మహిళలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జి అండ్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు పూర్తయిన మహిళలు, శిక్షణ ఇచ్చిన ట్రైనర్ కవితకి, ఇన్స్టిట్యూట్ చైర్మన్ కొత్త కాపు శిరీష. రెడ్డికి ఆదివారం శిక్షణ పొందిన మహిళలు ఘనంగా సన్మానించి, బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్లోల రాజేశ్వరి, సోని, శ్రావణి మంజుల, కవిత, వాణి, లక్ష్మి, అనసూయ, స్వప్న, గాయత్రి, పున్నమ్మ, శిక్షణ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి.

*మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి..

ఇంటికో పారిశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

*ప్రాథమిక టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

పలమనేరు(నేటి ధాత్రి) మే 08:

స్థానికంగా మనకున్న అవకాశాలను అంది పుచ్చుకుని మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాథమిక టైలరింగ్ శిక్షణను పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం యొక్క ఉద్దేశాన్ని డిఆర్డిఏ పిడి శ్రీదేవి మహిళలకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న. ఈ కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగకరమైందన్నారు. ప్రాథమిక టైలరింగ్ శిక్షణ ద్వారా మహిళలకు కుట్టు మరియు డిజైన్ నైపుణ్యాల అందించడంతో వారికి ఆర్థిక మరియు మహిళా సాధికారత కల్పించడం జరుగుతుందన్నారు.

powerhouses

ఈ శిక్షణ ద్వారా ఆర్థిక స్వావలంబనతో పాటు తక్కువ పెట్టుబడితో జీవనోపాధి అవకాశాలు, గ్రామీణ మరియు పట్టణ పేద మహిళలకు ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో టెక్స్ టైల్ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయని దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణ రెడ్డి, ఎంపీడీఓ ఖాదర్ భాషా, బాలాజీ కోపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ, నాయకులు నాగరాజు రెడ్డి, అర్బీసి కుట్టి, గిరిబాబు, నాగరాజు,మదన్, కిరణ్, బీఅర్సీ కుమార్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు..

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం బృందం అవగాహన కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

 

విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో,పాఠశాలల్లో విద్యార్థినిలకు గ్రామాల్లో,పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,05 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల,కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

District SP.

 

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని , ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని.

ప్రధానంగా మహిళలు,విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లో కానీ,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్100 లేదా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ గారు తెలిపారు.

 

జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ.!

జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ సంయుక్తం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ భాగమైన బాబు జగ్జీవన్ రాం వ్యవసాయ కళాశాల సిరిసిల్ల జాతీయ సేవ పథక విభాగం మరియు సిరిసిల్ల జిల్లా సంక్షేమ సంయుక్తంగా ఏడవ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బాలింతలు గర్భిణీ స్త్రీలు మరియు గృహనులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజ్యం మాట్లాడుతూసమతుల్య ఆహారం పిల్లలకు మరియు స్త్రీలకు చాలా అవసరమని పాలు మరియు గ్రుడ్డు సముతుల్య ఆహారంలో భాగమని వివరిస్తూ మన దేశంలో 34 శాతం పిల్లలు పోషక లోపంతో బాధపడుతున్నారని తెలియజేశారు కళాశాల ఎన్ఎస్ఎస్ నిర్వాహకులు సహాయ ఆచార్యులు డాక్టర్ మాధవి మాట్లాడుతూ వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలు మొదటి 1000 రోజులు అనగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలకు రెండు సంవత్సరాలు నిండే వరకు పోషకాహాలతో నిండిన ఆహారం ముఖ్యమని వివరించారు డాక్టర్ సంపత్ కుమార్ సహాయ ఆచార్యులు మరియు కళాశాల దత్త గ్రామం నిర్వాహకులు మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలని మనం తీసుకునే ఆహారంతో పాటు మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమని కరోనా తర్వాత మన ఆహారం అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు నేటి పిల్లల రేపటి దేశ పౌరులని వివరిస్తూ వారు ఆరోగ్యం దేశ భవిష్యత్తు నిర్వహిస్తుందని అంతేకాకుండా స్త్రీలు ముఖ్యంగా బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవాలని వివరించారు ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమారాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి అంగన్వాడి అధికారులు పాఠశాల విద్యార్థులు గృహనులు బాలింతలు గర్భిణీ స్త్రీలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version