ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సంబరాలు
నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం 23 వ వర్డ్ లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి,గౌరీ దేవిని పూజించి సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ నృత్యాలతో అలరించారు.9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒక చోట కలసి పకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుందని అన్నారు.తెలంగాణ ప్రజలందరి జీవితాలు వెలుగులు నింపుతూ మరింత సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని గౌరీ దేవిని ప్రార్థించారు.