ఆల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ.

ఆల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవం

రామడుగు, నేటిధాత్రి:

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈపండుగకు చాలా విశిష్టత ఉన్నదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ బోనాల జాతర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీనవదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి అవలంబిస్తున్న ఈఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభ పరిణామం అని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో సైతం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తమ ప్రేమ ఆప్యాయతలను చూపిస్తున్నారని, మతాలకు అతీతంగా బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటి తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతని నరేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓతల్లి మైసమ్మ పోచమ్మ తెచ్చామమ్మ బోనం అమ్మ బోనమే మాదైవం నృత్యాలు అందరినీ ఆకర్షింపచేశాయి. సుమారు నూటయాభై మంది విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు.

సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు

గంగాధర మండలం ఇస్లాంపూర్ లో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట, ఉప్పరమల్యాలలో పోచమ్మ బోనాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

గంగాధర నేటిధాత్రి:

 

 

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
గంగాధర మండలం ఇస్లాంపూర్ లో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు.అనంతరం ఉప్పరమల్యాల లో నిర్వహించిన పోచమ్మ బోనాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.నెత్తిన బోనమెత్తి గ్రామస్తులతో కలిసి పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు.
పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,ముద్దం జమున నగేష్ ,వంగ శ్రీధర్ గౌడ్, దోమకొండ మహేష్,కర్ర బాపు రెడ్డి, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దీకొండ మధు, పెంచాల చందు, ముచ్చె శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version