ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (viral stunt).
కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధర్
భూపాలపల్లి నేటిధాత్రి
గోరక్షణ కార్యకర్త ప్రశాంత్ సింగ్ (సోను) పై జరిగిన గన్ ఫైరింగ్ ఘటనకు సంబంధించి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ “గోరక్షణ ధర్మం కేవలం వ్యక్తిగత కర్తవ్యం మాత్రమే కాక, మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన బాధ్యత. గోమాతను కాపాడటం ద్వారా మనం సమాజానికి, సంప్రదాయాలకు, పౌరహక్కులకు రక్షణ కల్పిస్తున్నాము. ఇలాంటి పవిత్రమైన సేవలో నిమగ్నంగా ఉన్న కార్యకర్తలపై దాడులు జరగడం అత్యంత బాధాకరమని, తీవ్రంగా ఖండించదగినదని చెప్పాలి. ప్రశాంత్ సింగ్ (సోను) వంటి గోరక్షకులు సమాజంలో ధర్మం, సత్యం, జాగృతి కల్పించే కార్యక్రమాలలో అంగీకారపూర్వకంగా పాల్గొంటున్నారు. వారిపై జరిగిన దాడి కేవలం వ్యక్తిపైన కాక, గోరక్షణ ధర్మంపై ప్రత్యక్ష దాడిగా భావించవలసినది. ఇది సమాజంలో భయభ్రాంతిని సృష్టించే మాత్రమే కాక, గోరక్షకుల సేవను నిర్లక్ష్యం చేయడం అని మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి, దోషులను కఠిన చర్యలతో శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా, గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం అత్యవసరము. గోరక్షకుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, పోలీస్ సురక్షా చర్యలు, సమగ్ర నియంత్రణలు తీసుకోవడం తప్పనిసరి. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ గోరక్షకుల పక్కన నిలుస్తుంది. గోమాత రక్షణకు అంకితభావం కలిగిన ప్రతి కార్యకర్తకు మేము మద్దతుగా ఉంటాము. గోమాతకు ఉన్న భక్తి, గౌరవం ఎవరూ దెబ్బతీయలేరు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాక, మన దేశ సంస్కృతి, మన ధర్మానికి సంబంధించిన అంశమని గట్టి విశ్లేషణతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటిపి లు, యూపీఐ పిన్‌లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని అన్నారు.
హెచ్చరిక: అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగిందని తెలిపారు.
సైబర్ మోసగాళ్ల విధానం:
నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించడం.
వాట్సాప్, ఎస్ ఎం ఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.
యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం.
గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చూపించడం జరుగుతుందని గుర్తు చేశారు.
జిల్లా ప్రజలకు సూచనలు:
ధృవీకరించిన వెబ్‌సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
టెలిగ్రామ్ లేదా ఇతర లింక్‌ల ద్వారా ఏపీకె ఫైల్స్ డౌన్‌లోడ్ చేయ వద్దని తెలిపారు.
ఎవరికీ బ్యాంక్ వివరాలు, ఓటిపి లు యూపీఐ పిన్‌లు పంచుకోవద్దని తెలిపారు.
ముందుగానే చెల్లింపులు చేయకుండా, “ క్యాష్ ఆన్ డెలివరీ” సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు..
ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండని సూచించారు. మోసపోకుండా జాగ్రత్త అవగాహనే రక్షణ.”
గుంపల్లి మునీశ్వర్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రైతు భవన్ లో ఏఐటీయూసీ హమాలి యూనియన్ అవగాహన సదస్సు కార్మిక యూనియన్ అధ్యక్షులు లంకదాసర అశోక్ అధ్యక్షతనలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంపల్లి మునీశ్వర్ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన కార్మికుల పరిస్థితి మరింత అద్వానంగా ఉన్నదని ఏఐటియుసి పోరాటాలతో 50 కిలోల బస్తాలు వచ్చాయని హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వం నుండి తగిన ఆదరణ లేకపోవడం దారుణమని అన్నారు.బరువులు మోసేటప్పుడు లారీల నుండి దించేటప్పుడు ఎత్తేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని కాళ్లు చేతులు విరిగిన ప్రాణాలు పోయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఠా జట్టు హమాలీల సంక్షేమ బోర్డును పునర్దించాలని మన మార్కెట్లో దడ్వాయిలు,కాంట్రవెస్తూ అటు రైతులకు హమాలి కార్మికులకు చేదోడు వాదోడుగా
ఉంటున్నారు.మార్కెట్లో ప్రధానంగా మార్కెట్ యార్డ్ లో పనిచేసే వారందరూ రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు ఎండి చాలీచాలని ఆదాయంతో బతుకుతున్నారని అన్నారు. మార్కెట్లో పనిచేసే హమాలీ దడువాయి,గంపకూలి కార్మికులకు పని భద్రత కల్పించాలని,రైతు ప్రజా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మికులకు ప్రమాద బీమా నష్టపరిహారం మూడు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని మార్కెట్లో పనిచేస్తున్న వారందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని మరియు కార్మికులందరికీ 3000 యూనిఫామ్ ను ప్రతి సంవత్సరం ఇవ్వాలని,మార్కెట్ యార్డ్ కార్మికుల లైసెన్స్ రెన్యువల్ చేసి 58 నుంచి 60 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మార్కెట్ యార్డుల పాలకవర్గంలో కార్మికుల నుంచి ఇద్దరికీ డైరెక్ట్ గా అవకాశం కల్పించాలని యార్డులో క్యాంటీన్ మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్,ఏ ఐ టి యు సి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్,కార్మిక నాయకులు కోడే పాక ఐలయ్య,కోకిల శంకర్, కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరే రవి,ధార్వా యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్,గంపకూలి లచ్చమ్మ తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు.
ఓదెల మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాహనదారులు వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపినారు.ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోసిన కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి ధాన్యము రాశి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ప్రయాణికుల రాకపోకల కోసం ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బంది చేయడం తగదని రైతులు ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని సహకరించాలని ప్రమాదాలు జరగకుండా బాధ్యతయుతంగా నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ముఖ్యంగా డబల్ రోడ్లపై ఒకవైపు ధాన్యం ఆరబెట్టుట కోసం పోస్తున్నారని దానితో ప్రమాదాలు జరిగి కేసుల పాలు కావడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి సాధించారని రైతులు అవగాహన పెంచుకొని ధాన్యం రోడ్లపై ఆరబెట్ట రాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మాయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారని, ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు ఎవరైనా అతనికి సహకరించినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరించారు. మైనర్ బాలికలను వేధిస్తే పోక్సో చట్టం ప్రకారం 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు
హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం
జిల్లాకు రెగ్యులర్ ఆహార భద్రత అధికారిని నియమించాలి
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్
జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అనుమతులు నుండి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న హోటల్ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వలన ప్రజలు భోజన వస్తు కోసమని హోటల్లోకి వెళ్తుంటారు కానీ కొన్ని హోటల్స్ ధనార్జిని ధ్యేయంగా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నాయి దీనివలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వలన ఇదంతా జరుగుతుందని జిల్లాకి ఆహార భద్రత అధికారి రెగ్యులర్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా కనీస మౌలిక వసతులు కల్పించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నటువంటి హోటళ్లపైన తమరు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి ఆ హోటల్లో పై చర్యలు తీసుకోవాలని వెంటనే ఆహార భద్రత రెగ్యులర్ రధికారిని నియమించి హోటల్లు ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత కో కన్వీనర్ బుర్ర స్వాతి లతోపాటు తదితరులు పాల్గొన్నారు
మెట్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంలో మెట్ పల్లి గాయత్రి బ్యాంకు వారి ఆధ్వర్యంలో గాయత్రి బ్యాంకు మెట్పల్లి ఖాతాదారులు అయిన పొట్ట రాజేష్ గ్రామం మెట్పల్లి కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది . గాయత్రి బ్యాంకు ప్రతి ఖాతాదారులకు గాయత్రి నిర్భయ సేవింగ్ ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్నది . కావున అతనికి సంబంధించిన ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు నామిని అయినా అమ్మ పొట్ట లలిత కు ఎమ్మార్వో యన్ నీతా గారిచే బ్యాంకు ఇన్సూరెన్స్ చెక్కును ఇవ్వడం జరిగింది . ఎమ్మార్వో యన్ నీతా మాట్లాడుతూ గాయత్రి బ్యాంకు నిర్భయ సేవింగ్ ఇన్సూరెన్స్ ఉండడం ప్రతీ ఖాతాదారులకు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు ఇది వర్తింపచేయడం చాలా మంచి పాలసీ కావున ఇటువంటి గాయత్రి బ్యాంకు సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన బ్యాంకు మేనేజర్ అధికారులను ఎమ్మార్వో యన్ నీతా అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ కేశ శివకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మధు, రేవంత్. తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి, మునిసిపల్, పోలీసు అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ స్టేడియంలో గతేడాది జరిగిన దసరా ఉత్సవాల్లో కొంతమంది అల్లరి మూకలు గొడవ చేశారని, ఈసారి అలాంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకి సూచించారు. ఉత్సవాలు ప్రజాస్వామ్య పండుగలా అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిఎస్పి సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి మధు అప్పం కిషన్ ముంజల రవీందర్ తదితరులు పాల్గొన్నారు
చెరువులు, కుంటలు నిండాయి.. • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. • ఎస్సై రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల మారాయని బతుకమ్మ, దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై రాజేష్ సూచించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు చెరువులు కుంటలు అధికంగా నిండడంతో రాబోయే బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సమయంలో మహిళలు, చిన్నపిల్లలు చెరువుల వద్దకు గుమి గూడి వెళ్ళవద్దన్నారు. చిన్నపిల్లలు చెరువుల వద్ద ఇష్టానుసారంగా తిరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘ పెట్టాలన్నారు. ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకోవడమే కాకుండా.. సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
యాక్సిడెంట్ డెత్ ఎక్స్గ్రేగే షియా రూ.5 లక్షల నుంచి రూ10 లక్షలకు
సహజ మరణానికి రూ 1.30 లక్షల నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం
ఐఎన్ టి యు సి శాయం పేట మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్
శాయంపేట నేటిధాత్రి:
నిర్మాణ రంగ కార్మికుల ఎక్స్ గ్రేషియా పెంపు వలన రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు ఉపయోగ ఉంటుందని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తెలిపారు.మండల అధ్యక్షుడు మాట్లాడుతూ యాక్సిడెంటల్ చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ ఆరు లక్షల నుంచి రూ పది లక్షలకు, సహజ మరణానికి రూ లక్ష ముప్పై వేల నుంచి రూ రెండు లక్షలకు ప్రభుత్వం పెంచింది అన్నారు. దీనివలన భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నరు అన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణ యించిందని అన్నారు.ఇందు లో భాగంగా యాక్సిడెంటల్ డెత్ ఎక్స్‌గ్రేషియాను రూ పది లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని రూ రెండు లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ నిర్ణయించిందని అన్నా రు . వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుం బాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించ నుంది. ఎక్స్‌గ్రేషియా పెంచాల ని గత సర్కార్ హయాంలో ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్‌మ న్లు, టన్నెల్‌వర్కర్స్,బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్ వర్కర్లు, రాళ్లు కొట్టేవా ళ్లు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంపు ఆపరేటర్స్, మున్సిపల్ డ్రైనేజీ వర్కర్స్, మిక్సర్ డ్రైవ ర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్ వర్కర్స్ తదితర యాభై నాలు గు రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో అరవై ఏండ్ల లోపు ఉండి లేబర్‌కార్డు కలిగి న వారందరికీ ఈ బీమా వర్తిం చనుంది అన్నారు. వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి రూ ముప్పై వేలు, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి రూ ముప్పై వేలు, ప్రమాదవశాత్తు గాయ పడి ఇక పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే రూ నాలుగు లక్షలు, పూర్తిగా వికలాంగులైతే రూ ఐదు లక్షలు అనగా భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంట ల్ డెత్, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా పెంపుపై కార్మికులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఎక్స్‌గ్రేషియా ను పెంచడం ఆనందంగా ఉందన్నారు.రిజిస్ట్రేషన్ కు అర్హతలివే తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద సభ్యులుగా పద్దెనిమిది ఏండ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు గల నిర్మాణరంగ కార్మికులు మాత్రమే అర్హులు అన్నారు. వీరు ఏడాదిలో కనీసం తొంబై రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి అన్నారు.రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, వయస్సు నిర్ధారణ కు రుజువుగా స్కూల్ సర్టిఫికే ట్ లేదా డాక్టర్ సర్టిఫికెట్‌ను సమర్పించి మెంబర్ షిప్ సంబంధిత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌కు అందజేసి లేబర్ కార్డును పొందొచ్చు అన్నారు . లేబర్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత రెన్యూవల్ చేసుకో వాలి అన్నారు. ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికులకు ఎక్స్ గ్రేషియా పెంచడం పట్ల ఐఎన్ టి యు సి మం డల అధ్యక్షు డు మారపల్లి రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
సిరిసిల్లలో శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
వినాయక నిమజ్జన స్థలం వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర సౌకర్యాల విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాలు వచ్చే, వెళ్లే దారిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, స్టేజ్, కూర్చునేందుకు కుర్చీలు వేయించాలని, క్రేన్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఆయా శాఖల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్
◆:- బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ అంతట కూడా నిమజ్జనం రేపు ఉండడం జరుగుతుంది. అలాగే మన జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా నిమజ్జనం రేపు ఉండడంతో, కాంగ్రెస్ నాయకులు రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జ్యోతి పండాల్ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆఫీసులో నిద్రపోకుండా ఏర్పాట్లని దగ్గరుండి సమకూర్చాలని పర్యవేక్షించాలని జ్యోతి పండాల్ సూచించడం జరిగింది.
అలాగే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ని, మహిళా కానిస్టేబుల్స్ ని, మహిళా ఆఫీసర్స్ ని కూడా డిప్లాయ్ చేయాలని పోలీస్ శాఖ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం వచ్చిన అమ్మాయిలని పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తున్నందుకు, 7 రోజుల వ్యవధిలో 930 మందిని మఫ్టీలో షీ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ 930 మందిలో మైనర్లు, 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు మరియు 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవాళ్ళు వేధించడం జరుగుతుందని షీ టీమ్స్ ఇన్చార్జ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవారు కూడా అమ్మాయిలని ఏడిపిస్తున్నారంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకీ పెరుగుతిన్నారని మహిళలు గమనించాలి మరియు జాగ్రత్త వహించాలి.
జ్యోతి పండాల్ తప్పు లేకుండా ఎవరిపైన నిరాధారంగా ఆధారాలు లేకుండా విమర్శించదు అన్న విషయం, జహీరాబాద్ లో ఉన్న నాయకులు గాని కాంగ్రెస్ నాయకులు గానీ తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడుతుంటే ఇక్కడున్న లీడర్లకి ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం అవడం లేదు. నిన్న అమ్మాయిల భద్రత కోసం మాట్లాడినందుకు లీడర్లకు జీర్ణం అవడం లేదు కానీ ఖైరతాబాద్ లో జరుగుతున్న ఈవిటీజింగ్ కేసులను చూస్తే మీకు అర్థమవుతుందని జ్యోతి పండాల్ అన్నారు.
సింగరేణి గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, సంస్థలో పనిచేసే కార్మికులే సింగరేణికి కొండంత బలమని, కార్మిక సంఘాలు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలను తక్షణమే తీసుకుంటామని సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్ అన్నారు. మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఎంఎన్ఆర్ గార్డెన్ లో సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవాల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి డీజీఎం ఎస్ ఉజ్వల్ థా, సౌత్ జోన్ డీజీఎం కన్నన్ లతో కలిసి ముఖ్య అతిథులుగా సీఎండీ ఎన్ బలరాం నాయక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థను భారతదేశంలో విస్తరింప చేసేందుకు కృషి చేస్తున్నామని, సోలార్ రంగంలో అడుగు పెట్టడం జరిగిందని, ఒడిశా రాజస్థాన్లో ఇప్పటికే విస్తరించగా రానున్న రోజుల్లో కర్ణాటకలో బంగారం, రాగి గనుల తవ్వకం పనుల్లో నిమగ్నం అవుతుందని తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్న సింగరేణి సంస్థ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో కొత్త గనులు రాకుంటే సంస్థ మునగడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడుతుందని, సంస్థ మనుగడను కాపాడుకోవాలంటే బొగ్గు గనుల వేలం పాటలో పాల్గొనాల్సిందేనని అన్నారు. విదేశాల్లోనూ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంస్థ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే గని కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సంస్థలో బొగ్గు ఉత్పత్తి కన్నా సంస్థను కాపాడే కార్మికుల ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రమాదాలు పనిలో అప్రమత్తంగా లేకుండా ఉన్న సమయాలలోనే జరుగుతున్నాయని అన్నారు. ప్రమాద రహిత సంస్థగా సింగరేణినీ తీర్చిదిద్దరమే కాకుండా, ఆరోగ్యకరంగా కూడా మార్చాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడి పై, ఉద్యోగి పై ఉందని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే సింగరేణిలో ప్రమాదాలు చాలావరకు తగ్గాయని, రక్షణపై సింగరేణి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. సింగరేణి సంస్థలోకి మహిళా ఉద్యోగులు రావడం శుభ సూచకమని పేర్కొన్నారు. కార్మికులకు దసరా, దీపావళి పండుగల బోనస్ లు సకాలంలో అందేలా చూస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన భద్రత పక్షోత్సవాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆయా డిపార్ట్మెంట్ లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకన్న, పోట్రూ, గౌతమ్, సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్, శ్రీరాంపూర్ జిఎం ఎం శ్రీనివాస్, సిఎంఓఏఐ లక్ష్మీపతి గౌడ్, గుర్తింపు సంఘం అధ్యక్షులు సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం అధ్యక్షులు జనప్రసాద్, వివిధ ఏరియాల జిఎంలు, అధికారులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సొంత ఇంటి కోసం 200 గజాల స్థలం ఇవ్వాలి కార్మికుడి సంవత్సర జీవితంలో మూడు నెలలు ఇన్కమ్ టాక్స్ కట్టడానికే సరిపోతున్నది అందువలన కనీసం అధికారులలాగా పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ను మాఫీ చేయాలని కోరుతున్నాం. సింగరేణిలో రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక భూగర్భగనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు గత 18 నెలల నుండి జరగకపోవడం వలన రక్షణ విషయంలో వెనుకబడినట్లుగా భావిస్తున్నాం. నూతన బదిలీ విధానం కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మెరుగైన క్యాడర్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతప్రమోషన్ పాలసీని తీసుకురావాలని కోరుతున్నాము ఏరియా ఆసుపత్రులలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రిఫరల్ సిస్టంను మార్చలని మైన్ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్కు గురైన కార్మికుడిని ముందుగా డిస్పెన్సరీకి తీసుకువెళ్లడం తర్వాత ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం తర్వాత రిఫరల్ చేయడంతో చాలా సమయం వృధా అయి విలువైన ప్రాణాలను కోల్పోతున్నందున ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రి నుండే డైరెక్టుగా రిఫరల్ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం 40/ లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేరుల సమస్యను వెంటనే తీర్చాలని కోరుతున్నాం పై సమస్యల పరిష్కారానికి తగు చర్యను వెంటనే తీసుకొని సింగరేణి కార్మిక లోకానికి న్యాయం చేయాలని కోరుతున్నాం వివిధ కారణాల వలన ఉద్యోగాలను కోల్పోయిన డిస్మిస్డ్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అన్ని డివిజన్లో ఉన్న వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ లో ఇవ్వాలి సింగరేణి కార్మికుల ఎన్నికలలో వాగ్దానం చేసి ఇప్పటివరకు వాటిని అమలు చేయలేకపోతున్నారు వెంటనే అమలు చేయాలి చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు
వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య, దేవాదాయ, అగ్నిమాపక, విద్యుత్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి పండుగ వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండపాలకు విద్యుత్తు సరఫరాకు, మైకు ఏర్పాట్లుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలని సూచించారు. లూజు విద్యుత్తు వైర్లు వాడరాదని, ఎంసిబి వేయాలని, వేలాడే విద్యుత్తు తీగల నుండి వైర్లు ఏర్పాటు ద్వారా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. మండపాల వద్ద వ్యర్థాలు వేసేందుకు అనువుగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్తు తీగల క్రింద విగ్రహాలు ఏర్పాటు వల్ల విద్యుత్తు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన ఉత్సవాలు జరగాలని అన్నారు. నిమజ్జన రోజున అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో. పాటు మహాదేవపూర్, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబా ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు అంబులెన్స్ సేవలు వినియోగించడానికి సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం వద్ద విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. అన్ని మండలాలలో నిమజ్జనానికి నీటి వనరులను గుర్తించాలని, నిమజ్జనం చేయడానికి అనుమతి ఉన్న ప్రదేశంలో నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ శోభా యాత్ర సందర్భంగా క్రమ సంఖ్యలో వెళ్ళడానికి అనువుగా నంబర్లు కేటాయించాలన్నారు. మండపాల ఏర్పాటును పోలీస్ రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా రహదారుల పై గుంతలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో గతంలో కూడా సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగాయని, ఈ దఫా అదే స్ఫూర్తితో మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్తు, క్రేన్లు, మంచినీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణ సజావుగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ శ్రీలత, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణం మరియు మండలంలో గణేష్ మండపాల ఏర్పాటు,నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ పోలీస్ పోట్రల్.టిఎస్ పోలీస్.గౌట్.ఇన్ (https://policeportal.tspolice.gov.in/)నందు ధరఖాస్తు చేసుకోవాలని తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్ సీఐ.రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై సతీష్ గౌడ్, తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆన్‌లైన్ నందు అనుమతులు తీసుకోవడం వల్ల మండపాల ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉంటుందని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుందన్నారు.మండపం నిర్వహణ,మండపంనకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుందని తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.పోలీస్ శాఖ ఆన్‌లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దయనంద్, తాసిల్దార్ కృష్ణవేణి, మండలంలోని పలు గ్రామాల్లో నీ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి, మిలాద్ ఉత్సవాల కోసం శాంతి కమిటీ సమావేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని హద్మూర్ స్టేషన్ లో నేడు శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ సుజీత్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు, మిలాద్ ఉత్సవాల నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరుకావాలని శనివారం ఆయన కోరారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి, సెప్టెంబర్ 5న జరిగే మిలాద్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ పండుగలను జరుపుకోవాలని అన్నారు,
గణేష్ నవరాత్రులకు మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు https://policeportal.tspolice .gov.in/index.htmలో పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. “విద్యుత్ కనెక్షన్ కోసం డిడి కట్టాలి. సొంతంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దు. నిపుణులతో మాత్రమే పనిచేయించండి. గాలి,వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోండి” అని పోలీసులు తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం – ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి;
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లోని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం మరియు గుంపుల శ్రీరామభద్ర దేవాలయం, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మరియు కార్యాలయాలు, ఓదెల మోడల్ స్కూలు, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ఓదెల డబల్ బెడ్ రూమ్ కాంప్లెక్స్, ఓదెల మండల గ్రామాలలో గల వివిధ బహిరంగ ప్రదేశాలలో పరిసర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించ రాదు, సేవించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హెచ్చరించారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.